sudha murthy
-
‘మా అల్లుడు వెరీగుడ్’: సుధా మూర్తి
తన అల్లుడు ఎంతో మంచివాడని, ఆయన్ని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉందని అంటున్నారు ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి. లండన్ విద్యాభవన్‌లో జరిగిన దీవాళి గళా కార్యక్రమంలో ఆమె భారతీయ విలువలు, సంస్కృతి మీద మాట్లాడుతూ..మనిషికి మంచి చదువే కాదు.. సంప్రదాయ మూలాలు కూడా ముఖ్యమేనని అంటున్నారు సుధా మూర్తి. శనివారం లండన్‌లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్లో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూతురు అక్షతా మూర్తి, ఆమె భర్త..బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌లు హాజరయ్యారు.మంచి విద్య మీకు పైకి ఎగరడానికి(ఎదగడానికి) రెక్కలను ఇస్తుంది, కానీ గొప్ప సంస్కృతి మిమ్మల్ని మీ మూలాల్లో నిలబెట్టేలా చేస్తుంది. ఉషా సునాక్(రిషి తల్లి) ఆయన్ని(రిషి) అద్భుతంగా పెంచారు. ఆ పెంపక పునాదుల్లో.. బలమైన భారతీయ సంస్కృతి ఉంది. సునాక్ బ్రిటిష్ జాతి గర్వించదగ్గ వ్యక్తి. అదే సమయంలో.. ఆయన భారతీయ వారసత్వంలో విలువలు కూడా కనిపిస్తాయి అంటూ అల్లుడిని ఆకాశానికెత్తారామె.ఈ సందర్భంగా.. భారతీయ కళను, సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు భారతీయ విద్యాభవన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. భారతీయ సంప్రదాయాల్ని నేర్చుకునేందుకు మీ పిల్లలను ఇక్కడికి(విద్యాభవన్)కు పంపండి. మనం ఒక వయసుకి వచ్చాక.. మన మూలాలను తాకాల్సి ఉంటుంది అంటూ ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్లు సైతం హాజరయ్యారు. విద్యాభవన్ నిర్వాహకులకు రిషి, అక్షతలు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్,అంతకు ముందు.. భవన్ యూకే చైర్మన్ సుభాను సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎన్ నందకుమారలు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే.. భారత కళలను ఎలా ప్రదర్శిస్తున్న తీరును, ఆ సెంటర్ సాధించిన విజయాల్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. రామాయణం, కలిపూజ వంటి అంశాలను ప్రస్తావించారు. పలువురు కళాకారులు భారతీయ నృత్య కళలు ప్రదర్శించారు. -
పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య సుధామూర్తి నెట్‌ఫ్లిక్స్ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో స్టార్ గెస్ట్లుగా పాల్గొన్నారు. అందులో తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. నారాయణ మూర్తి తన 25వ వివాహ వార్షికోత్సవం రోజున సుధామూర్తికి శుభాకాంక్షలు తెలపడం మరిచిపోయానన్నారు.‘ఒకరోజు నేను ఆఫీస్‌కు బయలుదేరుతుండగా సుధ ఉదయం నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఏదైనా ప్రత్యేకత ఉందా? అని అడిగింది. ఏమీలేదు అని జవాబిచ్చాను. ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వస్తుండగా మళ్లీ ఈరోజు ప్రత్యేకతేంటో ఆలోచించారా? అని అడిగింది. ఏమీలేదని అదే సమాధానం చెప్పాను. నేను ఆ తర్వాతిరోజు ముంబయిలో ఒక సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి విమానం ఎక్కుతుండగా నా కూతురు అక్షత(బ్రిటన్ మాజీ ప్రధాని రిషీసునాక్ భార్య) నుంచి కాల్ వచ్చింది. ఏం చేస్తున్నారు? అని అడిగింది. ఫ్లైట్ ఎక్కుతున్నాను అని సమాధానం ఇచ్చాను. వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. వేరే విమానం ఎక్కి బెంగళూరు వెళ్లండని చెప్పింది. అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పండని తెలిపింది. మీరు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశానికి హాజరు అవ్వాల్సి ఉంది. వీలైతే మీరు ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకోండి. కానీ అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిందేనని పట్టుపట్టింది’ అని నారాయణమూర్తి చెప్పారు.ఇదీ చదవండి: మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?సుధామూర్తి నవ్వుతూ ‘అది మా 25వ వివాహ వార్షికోత్సవం. కొంత ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. నా భర్త ఆ విషయాన్ని మరిచిపోయేసరికి ఐదు-పది నిమిషాల పాటు కొంత బాధ అనిపించింది. కానీ ఆయన పనితీరు నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి ఇలాంటి విషయాలు అంతగా పట్టించుకోను. కానీ, ఈ విషయంలో నా కూతురు చాలా కలత చెందింది’ అని చెప్పారు. -
The Great Indian Kapil Show: చూతము రారండీ
వయసుతో సంబంధం లేకుండా మహిళల్లో పెద్దరికం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్నవాళ్ళయినా, పెద్దవాళ్ళయినా పెద్దరికం అన్నది మహిళలకు ఒక సొగసు. మళ్లీ మగవాళ్లు అలాక్కాదు. వాళ్లకెంత వయసు వచ్చినా కూడా మాటల్లో, చేతల్లో చిన్నవాళ్లే... మహిళలతో పోలిస్తే’!సుధామూర్తి వయసు 74. మూర్తి గారి వయసు 78. ఆమె ఆగస్టు 19 న పుడితే, ఆయన ఆగస్టు 20 న జన్మించారు. తేదీలను బట్టి చూసినా సుధ ఆయన కన్నా ఒకరోజు ‘పెద్దరికం ’ ఉన్నవారు. (తమాషాకు లెండి). సరే, సంగతి ఏమిటంటే... ఈ దంపతులిద్దరూ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఆహ్వానం వస్తే వెళ్లారు. సాధారణంగా కపిల్ బాలీవుడ్ సెలబ్రిటీలను తన టాక్ షో కు పిలుస్తుంటారు. అందుకు భిన్నంగా ఈసారి ఈ బిజినెస్ దిగ్గజ దంపతుల్ని ఒప్పించి రప్పించారు. వారితో టాక్ షో సరదాగా నడిచింది. భర్త గురించి భార్యను, భార్య గురించి భర్తను కొన్ని ప్రశ్నలు అడిగారు యాక్టర్ కమ్ కమెడియన్ కపిల్ శర్మ. వాటిల్లో ఒక ప్రశ్న : ‘మొదటిసారి సుధాజీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెలా అనిపించింది?’ అని అడిగారు కపిల్. దానికి మూర్తి గారు చాలా గంభీరంగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు. ‘ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే.. ఒక స్వచ్ఛమైన గాలి పరిమళం నా శ్వాసలోనికి వెళ్లినట్లుగా...’ అన్నారు. ఆ మాటకు వెంటనే సుధామూర్తి... ‘అప్పుడు ఆయన వయసులో ఉన్నారు కదా’ అన్నారు జోకింగ్‌గా. దెబ్బకు ఆడియెన్స్ భళ్లుమన్నారు. నిజానికి సుధామూర్తి ఉద్దేశ్యం ఆడియెన్స్‌ని నవ్వించడం కాదు, భర్తలోని కవితాత్మక భావోద్వేగాన్ని కాస్త నెమ్మది పరచటం. పైగా అంతమంది ఎదుట భర్త తనను అంతగా ‘అడ్మైర్’ చెయ్యటంతో ఆమెలోని పెద్దరికం మధ్యలోనే కల్పించుకుని ఆయన్ని ఆపవలసి వచ్చినట్లుంది. ఆపకపోతే... ఇంకా ఏం చెబుతారో అని. అసలే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈ నెల 9న నెట్‌ఫ్లెక్స్‌లో స్ట్రీమ్ ఆయ్యే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎపిసోడ్లో మూర్తి గారి ఈ అమాయకత్వాన్ని, సుధామూర్తి పెద్దరికాన్ని కనులారా వీక్షించవచ్చు. (డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది)ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు -
కలతలు లేని కాపురానికి సుధామూర్తి చెప్పిన సూపర్ టిప్స్
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ విద్యావేత్త, దాత, రచయితగా పేరు తెచ్చుకున్న సుధామూర్తి తనదైన సూచనలు, సలహాలతో తన అభిమానులకు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇటీవల వైవాహిక జీవితంలో భార్యాభార్తల సఖ్యతకు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి తెలిపారు.సుధామూర్తి చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. ఆమె మాటతీరు, కట్టూ బొట్టూ, ప్రసంగాలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఆమె నవ దంపతులకు కూడా చాలా కీలకమైన సలహాలు ఇచ్చారు.కలహాలు లేని కాపురం ఎక్కడా ఉండదుభార్యభర్తలమధ్య తేడాలు, అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. వస్తాయి. కానీ వాటిని చిలికి చిలికి గాలి వానలా మారకుండా ఇరువురూ జాగ్రత్త పడాలి. అసలు కలహాలు,కలతలు లేని కాపురాలు ఎక్కడ ఉంటాయి. తగాదాలు పడని వాళ్లు భార్యభర్తలే కాదు అంటూ సుధామూర్తి తెలిపారు. కానీ ఒకరు గట్టిగా మాట్లాడినపుడు, ఆగ్రహంగా ఉన్నపుడు ఇంకొకరు తగ్గాలి. ఇద్దరూ అరుచుకుంటూ ఉంటే సమస్య పరిష్కారం కాదు. శాంతి, సహనం అనేది ఇద్దరి మధ్య ఉండాలి. ఒకర్నొకరు గౌరవించుకోవాలిఒకళ్లు చెప్పింది మరొకరు వినాలి. ఒకరి విజ్ఞానాన్ని మరొకరు పంచుకోవాలి. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.థ్యాంక్స్ చెప్పుకోవడం, ప్రశంసించుకోవడం ద్వారా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం, ప్రేమ పెరుగుతుంది. భాగస్వామి చేసే చిన్న పనులను గుర్తించి మెచ్చుకోవాలని సుధా మూర్తి సూచించారు. కొన్ని విషయాల్లో ఎవరు ఒకరు రాజీ పడాలి. మార్పునకు సిద్ధంగా ఉండాలి. రిలేషన్ షిప్ కోసం కొన్ని విషయాల్లో రాజీ పడడం దీర్ఘకాలిక సంతోషాల్ని పంచుతుంది.బాధ్యలు బరువులు పంచుకోవాలిఇంట్లో, జీవితంలో బాధ్యతలను, బరువులను పంచుకోవడం చాలా ముఖ్యం. జీవితం అంటేనే కష్టనష్టాల పయనం. ఎవ్వరమూ పర్ఫెక్ట్ కాదు. లోటుపాట్లను గమనించుకొని అర్థం చేసుకొనిముందుకు సాగాలి. కష్టనష్టాలను, బరువు బాధ్యతలను సమానంగా పంచుకోవడంలోనే అసలైన భార్యభర్తల విలువ తెలుస్తుంది. అబ్బాయిలకో సలహాముఖ్యంగా ఈతరం అబ్బాయిలకు చెప్పేది ఒకటే. వంటగదిలో భార్యకు సహాయం చేయడం అనేది చాలా ముఖ్యం. జీవితభాగస్వామి కష్టాల్ని, బాధ్యతల్ని పంచుకోవడం ద్వారా టీం వర్క్,భాగస్వామ్య అనేభావాలను పెంపొదిస్తుంది. ఆధునిక ప్రేమ అనే అంశంపై ఏర్నాటు చేసిన ఒక కాంక్లేవ్‌లో సుధామూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగానే ఆమె యువ జంటలకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. దంపతులుగా తామూ ఈ విషయాలను పాటించామని, ఇవే తమ సక్సెస్ మంత్రా అని సుధామూర్తి వివరించారు. -
నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్
రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి రక్షా బంధన్ సందర్భంగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పండుగ వెనుక ఉన్న కథను షేర్ చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది. అంతకు మించే రాఖీ పండుగకు సంబంధించిన కథలు ఉన్నాయంటూ పోస్టలు పెట్టారు. ఇంతకీ ఆమె షేర్ చేసుకున్న కథ ఏంటంటే.. రక్షా బంధన్ తనకు ఒక ముఖ్యమైన పండుగా అని చెప్పారు. ఇది ఒక సోదరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ నాకు సహాయం చేయాలని సూచించే రక్షయే ఈ చిన్న దారం అని అన్నారు. అందుకు సంబంధించిన గాథను కూడా చెప్పుకొచ్చారు. "మేవార్ రాజ్యపు కర్ణావతి తన రాజ్యం శత్రు రాజుల దాడికి గురై సంకట స్థితిలో ఉన్నప్పుడూ పొరుగున ఉన్న మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు ఒక చిన్న దారం పంపింది. ఇది తాను ఆపదలో ఉన్నాను, దయచేసి నన్ను మీ సోదరిగా పరిగణించి రక్షించండి అని ఆ దారం రూపంలో హుమాయున్ రాజుకి సందేశం పంపింది. అయితే హుమాయున్ ఆ దారం అర్థం ఏంటో అస్సలు తెలియదు. తన మంత్రుల ద్వారా అసలు విషయం తెలుసుకుని రక్షించేందుకు ఢిల్లీ పయనమయ్యాడు. అయితే సమయానికి హుమాయున్ చేరుకోలేకపోవడంతో కర్ణావతి మరణించింది." అని సుదామూర్తి పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే వినయోగదారులు ఈ వ్యాఖ్యలతో విభేధించడమే గాక మహాభారత కాలంలోనే రక్షాబంధన్ గురించి ఉందంటూ నాటి ఘటనలను వివరించారు. శిశుపాలుడిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుండగా శ్రీకృష్ణుడి వేలుకి గాయమవ్వడం జరుగుతుంది.వెంటనే ద్రౌపది చీర కొంగు చింపి కట్టిందని, అందుకు ప్రత్యుపకారంగా కౌరవులు నిండు సభలో అవమానిస్తున్నప్పుడూ ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడని అన్నారు. అలాగే బలిచక్రవర్తి పాతాళ రాజ్యాన్ని రక్షిస్తుండేవాడు. అతడు తన భక్తితో విష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన్నే రాజ్యనికి కాపలాగా ఉంచాడు. అయితే లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని ఈ శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ కట్టి తన భర్తను దక్కించుకుందని పురాణ వచనం అంటూ సుధామూర్తి పోస్ట్‌కి కౌంటర్ ఇస్తూ పోస్టులు పెట్టారు. కాగా, చిన్నప్పుడు తాను తెలుసుకున్న రాఖీ పండగ కథలను తెలియజేయాలనుకోవడమే తన ఉద్దేశమని సుధామూర్తి వివరణ ఇచ్చారు. (చదవండి: 'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!) -
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇపుడు రాజ్యసభ ఎంపీ!
రాజ్యసభ, ఎంపీ, రచయిత సుధానారాయణమూర్తి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను జోడిస్తూ, మరికొన్ని అవగాహన కల్పించే అంశాలను తన అభిమానులతో కూడా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన చిన్నప్పటి ఫోటో ఒకటి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.‘‘ఈ ఫోటో నాకు సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు హుబ్లీలోని ఒక స్టూడియోలో తీసింది. ఆ సమయంలో, మేము షిగ్గావ్‌లో ఉండేవాళ్లం, కానీ అక్కడ స్టూడియోలు లేనందున, మేము ఈ ఫోటో కోసం హుబ్లీకి వెళ్లాం’’ అంటూ సుధామూర్తి తన బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు.This picture was taken in a studio in Hubli when I was around 1 year old. At the time, we were living in Shiggaon, but since there were no studios there, we travelled to Hubli for this photograph. pic.twitter.com/YjhjJ3Aw5L— Smt. Sudha Murty (@SmtSudhaMurty) July 30, 2024 -
30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనలేదు
-
వ్యాక్సిన్ ఇప్పిద్దాం...మహిళల ప్రాణాలు కాపాడదాం
రాజ్యసభ సభ్యురాలిగా మొదటిసారి సమావేశాల్లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి భారతీయ పేద మహిళల్లో ఇటీవల అత్యధికంగా చోటు చేసుకుంటున్న సర్వైకల్ క్యాన్సర్ మరణాల గురించి మాట్లాడారు. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం వేక్సిన్ ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు. నిజమే. సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇది చైతన్యం కలిగించాల్సిన సమయం. ప్రభుత్వం పూనుకోవాల్సిన సమయం.కొన్ని అధ్యయనాల ప్రకారం మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాప్తి 7% నుంచి 27% మందిలో కనిపిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్‌గా మారనప్పటికీ, చాలా కేసుల్లో క్యాన్సర్ ముప్పు మాత్రం ఉంటుంది. పద్ధెనిమిదేళ్ల తర్వాత పెళ్లయ్యే యువతులతో పోలిస్తే అంతకంటే ముందుగానే వివాహమయ్యేవారిలో ఇది ఆరు శాతం ఎక్కువ. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతి ఏడాది 1,23,907 మంది మహిళల్లో దీన్ని కనుగొంటుండగా... ఏటా 77,348 మంది మరణిస్తున్నట్లు అంచనా. గణాంకాల ప్రకారం సంఖ్యాపరంగా పదిహేనో ఏటి నుంచి 44 ఏళ్ల మహిళల్లో వస్తూ, వారిని మృత్యుముఖానికి నెట్టే క్యాన్సర్లలో ఇది రెండో అతి పెద్దది.ఏమిటీ సర్వైకల్ క్యాన్సర్? మహిళల్లో యోని (వెజైనా) తర్వాత వచ్చే భాగమే సర్విక్స్. ఇది గర్భాశయానికి కింద ఉంటుంది. అంటే ఇది యోనికీ, గర్భాశయానికీ (యుటెరస్)కూ మధ్యన సన్నటి దారిలా ఉండే సర్విక్స్ గర్భాశయానికి ముఖద్వారంలా ఉంటుంది కాబట్టే దీన్ని ‘గర్భాశయ ముఖద్వారం’ అనీ, దీనికి వచ్చే క్యాన్సర్‌ను ‘సర్వైకల్ క్యాన్సర్’ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) అని అంటారు. నిజానికి మిగతా క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం మంచి పరిష్కారం. దీని చికిత్స కూడా చాలా సులభం. ఎంత ముందుగా గుర్తిస్తే దీనికి అంత సమర్థంగా, తేలిగ్గానూ చికిత్స అందించవచ్చు. సాధారణంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో, నగరాల్లో వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఈ క్యాన్సర్ విషయానికి వస్తే ఇది గ్రామీణ ప్రాంతాల స్త్రీలలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చిన్నవయసులోనే అందునా పద్ధెనిమిదేళ్ల వయసు కంటే చాలా తక్కువ వయసులోనే అక్కడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ ఉండటం ఇందుకు ఒక కారణమని కొంతమంది పరిశీలకుల విశ్లేషణ. అయితే ఇంతటి తీవ్రమైన వ్యాప్తిలోనూ అదృష్టం ఏమిటంటే... ఈ క్యాన్సర్ రావడానికి ముందర కనీసం 10 ఏళ్ల ముందుగానే కనుగొనగలిగేలా దీనికి చాలా ఎక్కువ వ్యవధిగల ప్రీ–క్యాన్సరస్ దశ ఉంటుంది. ఈ సమయంలో కనుగొనగలిగితే దాన్ని దాదాపు పూర్తిగా నయం చేయడానికి అవకాశముంటుంది.ప్రధాన రకాలు... సర్వైకల్ క్యాన్సర్లలో రెండు ప్రధాన రకాలుంటాయి. మొదటిది తరచుగా కనిపించే ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే రకం. రెండోది ‘అడెనోకార్సినోమా’ తరహాకు చెందినదైతే, ఆపరేషన్ ద్వారా తొలగించగల దశలో ఉంటే, సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తొలగించవచ్చు. ఇది కాస్త అరుదు. రిస్క్ ఫాక్టర్లు...హెచ్‌పీవీ వైరస్ సోకడం అనేది సర్వైకల్ క్యాన్సర్‌కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్. చాలామందిలో ఈ హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదమముంది. అలాగే పొగ తాగడం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని.చికిత్స ప్రక్రియలు... ఈ క్యాన్సర్ల మొదటి, రెండో దశల్లో శస్త్రచికిత్స అయినా, రేడియోథెరపీ, కీమోథెరపీ... ఈ మూడూ బాగానే పనిచేస్తాయి. అయితే ఈ అన్ని చికిత్సా ప్రక్రియలకు వాటివాటి ప్రయోజనాలూ, దుష్ప్రభావాలూ రెండూ ఉంటాయి. చికిత్సకు ముందు ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకొని చికిత్స ప్రక్రియను డాక్టర్లు నిర్ణయిస్తారు. సర్జరీతో సాధారణ జీవితానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. సర్జరీ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే సాధారణ జీవితం గడిపేలా బాధితులు కోలుకోగలరు. సర్జరీ విజయావకాశాలు 75% నుంచి 90% వరకు ఉంటాయి. పైగా చిన్నవయసులోనే దీని బారిన పడ్డవారికి డాక్టర్లు సాధారణంగా శస్త్రచికిత్సనే సూచిస్తుంటారు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. ఇక సర్జరీతో వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువే. ఇది ఎంతమాత్రమూ ప్రాణాంతకం కాదు. ఇక కొద్దిమందిలో సర్జరీ తర్వాత కాంప్లికేషన్లు వస్తే / సర్జరీ అంటే భయపడేవారికి డాక్టర్లు ‘రాడికల్ రేడియోథెరపీ’ అనే చికిత్స చేస్తారు. హెచ్‌పీవీతో సమర్థమైన నివారణమామూలుగా శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ ను తయారుచేస్తుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్‌ను తెచ్చిపెట్టే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మాత్రం మహిళల దేహం ఎలాంటి యాంటీబాడీస్లనూ తయారు చేయదు. అందువల్ల ఒకసారి హెచ్‌పీవీ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం శరీరంలో ఉండిపోయి సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అదే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను మహిళకు తొమ్మిది నుంచి 26 ఏళ్ల వయసు లోగా ఇప్పిస్తే యాంటీబాడీస్‌ను తయారుచేసి, సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కేవలం బాలికలు, యువతులకే కాకుండా బాలురు, యువకులకూ కూడా ఇచ్చే అత్యాధునిక వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే పురుషులు క్యారియర్లుగా మారి దీన్ని మహిళలకు వ్యాప్తి చేస్తారు కాబట్టి మగవాళ్లకూ ఇచ్చే వ్యాక్సిన్లు రూపొందాయి. ఇవి ఒకటి రెండు రకాలకే గాక... మరిన్ని రకాల సర్వైకల్ క్యాన్సర్లను నివారిస్తాయి. 9 నుంచి 14 ఏళ్ల మగపిల్లల్లో రెండు డోసులూ, పధ్నాలుగేళ్లు దాటిన వారికి 0, 2, 6 నెలల్లో వరసగా ఇవ్వాలి. కారణాలుసర్విక్స్ మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన కారణంగా క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలెక్కువ. సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానం. ఈ వైరస్ లైంగికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్స్‌లో పాల్గొనేవారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ... సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ మంచి పరీక్ష. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, లైంగిక జీవితం ప్రారంభమై మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో మరో వెసులుబాటు ఏమిటంటే ఇది రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దీన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–క్యాన్సరస్ దశ’ దీనికి ఉంది డా‘‘ కావ్య ప్రియ వజ్రాల లీడ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ – రిస్క్ ఆబ్స్టెట్రీషియన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కు వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే అందజేస్తే మహిళాలోకానికి చాలా మేలు చేసినట్లవుతుంది. తమ కుటుంబానికే తొలి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, ఏ నాలుగో దశలోనో, మూడో దశలోనో హాస్పిటల్స్‌కు వస్తూ, చేజేతులా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. అదే తొమ్మిది నుంచి 45 ఏళ్ల వయసులోనే వారికీ వ్యాక్సిన్ ఇప్పిస్తే ఎన్నో మరణాలను నివారించగలం. కోవిడ్ టైమ్‌లో దేశం మొత్తానికి వ్యాక్సిన్ ఇప్పించిన మనకు ఇదేమీ కష్టం కాబోదు. ప్రైవేటు సంస్థల్లో దీన్ని దాదాపు రూ. 1,400 నుంచి రూ. 1,500 లకు అమ్ముతున్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపి, చవగ్గా ఏ ఏడువందల రూపాయలకో ఇప్పించగలిగితే అత్యంత నిరుపేద మహిళల ప్రాణాలనూ మనం కాపాడ గలిగినవాళ్లమవుతాం. – సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలు, సమాజ సేవిక -
'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం..!
ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ దాతృత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే సుధామూర్తి చాలా సింపుల్‌గా ఉంటారు. చెప్పాలంటే సింపుల్ సిటీకి కేరాఫ్ ఆమె అన్నంతగా చాలా సాదాసీదాగా ఉంటారామె. అయితే ఆమె వద్ద ఎన్నో చీరలు ఉండవని, షాపింగ్ చేయరని కథలు కథలుగా విన్నాం. రెండు లేదా మూడో చీరలే ఉంటాయని సుధా కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదేంటి ఇన్ఫోసిస్ కంపెనీ అధినేత భార్య వద్ద అన్నే చీరలా అని అందరూ ఆశ్చర్యపోయారు కూడా. నేటి రోజుల్లో చిన్నగా స్టార్డమ్ వచ్చి, పేరు ప్రఖ్యాతలు వస్తేనే..వారి రేంజ్, లుక్కు మారిపోతుంది. ఏదో గోల్డ్స్పూన్ బేబీ మాదిరి ఫోజులు ఇచ్చేస్తుంటారు. అదొక స్టేటస్ ఆఫ్ సింబల్ అన్నట్లు ఉంటుది వ్యవహారం. కానీ ఆమె ఆహార్యం సాధారణ గృహిణిలా ఉంటుంది. ఇటీవలే అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఆమె రాజ్యసభ ఎంపీగా నామనేట్ అయ్యిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో రాజ్యసభ ఎంపీగా తొలి ప్రసంగంలో చాలా ముఖ్యమైన అంశాలపై మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని మోదీ సైతం ఆమె ప్రసంగానికి ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన వద్ద చీరలు ఎందుకు లేవు? తాను ఎందుకు కొనుగోలు చెయ్యరో తదితర ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తాను 30 ఏళ్లుగా చీర కొనలేదని అన్నారు. కాశీ పర్యటనకు వెళ్లినప్పుడూ మనకు బాగా ఇష్టమైనది వదిలేయాలి అని అంటారు. అందుకోసం తాను బాగా ఇష్టపడే షాపింగ్ ని వదిలేస్తానని గంగామాతకు వాగ్దానం చేశానని అన్నారు. తనకు పొదుపుగా, సింపుల్‌గా ఉండటం తన తల్లిదండ్రులు, తాతల నుంచి వచ్చిందని చెప్పారు. తన తల్లి చనిపోయినప్పుడూ ఆమె వస్తువులు పంచేందుకు కేవలం అరంగంట సమయమే పట్టిందన్నారు. ఎందుకంటే అప్పటికీ ఆమె వద్ద కేవలం నాలుగు చీరలు ఉన్నాయి. ఇలా సింపుల్‌గా బతకడం వాళ్ల పెంపకం నుంచి మొదలయ్యింది కాబట్టి చాలా సులభంగా సాదాసీదాగా జీవిస్తున్నానని అన్నారు. రెండు దశాబ్దాలుగా తన సోదరీమణులు, సన్నిహితులు, తాను పనిచేసే ఎన్జీవోలు తనకు బహుమతిగా చీరలు ఇస్తుంటారని, వాటినే తాను ధరిస్తానని చెప్పారు. అలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ద్వారా జీవితాలు మారిపోయిన మహిళల బృందం చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చీరలు ఇచ్చారని అవే తన వద్ద ఉన్నాయని సుధామూర్తి అన్నారు. అంతేగాదు తన సోదరీమణులు ప్రతి ఏడాది బహుమతిగా ఇస్తున్న చీరల సేకరణ పెరుగుతున్నందున నిర్వహించడం కష్టంగా ఉందని వారికే నేరుగా చెప్పేశానని అన్నారు. అంతేగాదు సుధామార్తి చీరలు ధరించిన పర్యావరణ హితార్థం కనీసం ఐరన్ కూడా చేయించరు. అలాగే నేలను తుడిచేలా చీరను ధరించను కాబట్టి చాలా జాగ్రత్తగా, మన్నికగా బట్టలను వాడతాను కాబట్టి పెద్దమొత్తంలో చీరలు కావాల్సిన అవసరం పడలేదన్నారు. అపార సంపద ఉన్నప్పటికీ..అత్యంత సాదాసీదాగా జీవిస్తారు సుధా. ఆమె నుంచి సాధారణ జీవితంలోని గొప్పతనం, పొదుపుగా ఉండటం రెండూ నేర్చుకోవచ్చు. మనిషి వద్ద ఉండే అపారమైన మేధస్సు, జ్ఞానానికి మించిన గొప్ప వస్తువులు ఏమీ అవసరం లేదని సుమధామూర్తి ఆచరించి చూపిస్తున్నారు. అపారమైన సంపద ఉండి కూడా ఓ సాధారణ వ్యక్తిలా ఉండే ఆమె ఆహార్యం ఎందరికో స్ఫూర్తి. ఇక ఆమె అనేక పుస్తకాలు రచించారు, ముఖ్యంగా పిల్లలపై ఎక్కువగా రాశారు.(చదవండి: ఆ యోగాసనంలో కాబోయే తల్లి దీపికా పదుకొణె..ఆ టైంలో మంచిదేనా..!) -
సుధామూర్తి తొలి స్పీచ్..ప్రధాని ప్రశంసలు
న్యూఢిల్లీ: పుస్తక రచయిత్రి, దాత, ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఎంపీగా రాజ్యసభలో తొలిసారి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యం అంశంపై ఆమె ప్రసంగించారు. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. బుధవారం(జులై 3) ఎగువసభకు వచ్చిన ఆయన సుధామూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవలే సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె సభలో మాట్లాడారు. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ ఇస్తారని తెలిపారు. ఆ వ్యాక్సిన్‌ను తీసుకుంటే క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చన్నారు. చికిత్స కంటే నివారణే మేలని చెప్పారు. ఈసందర్భంగా తన తండ్రి చెప్పిన మాటలను సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది తీరని లోటు అన్నారు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని, ఆ అనుభవంతో సర్వైకల్ వ్యాక్సిన్‌ను బాలికలకు అందించడం సులభమన్నారు. దీంతోపాటు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు. దేశానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటే ఆదాయం పెరుగుతుందని సూచించారు. సుధామూర్తి చేసిన ఈ ప్రసంగంపై ప్రధాని స్పందించారు. మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలని అన్నారు. గత పదేళ్లకాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టిసారించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసిందని, గర్భిణీలకు వ్యాక్సినేషన్ తీసుకువచ్చామని వెల్లడించారు. -
‘ఆడామగా సమానమే, కానీ పురుషుల్లో..’ సుధామూర్తి కీలక వ్యాఖ్యలు
ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి లింగ సమానత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితం అనే బండికి చక్రల్లాంటివారు. జీవన యానం సాఫీగా సాగాలంటే ఇద్దరూ ఉండాలి.. తన దృష్టిలో స్త్రీపురుషులిద్దరూ సమానమే కానీ, వేర్వేరు మార్గాల్లో అన్నారు.లింగ సమానత్వం అంటే ఏమిటో వివరిస్తూ ఒక వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. స్త్రీ, పురుషులు సైకిల్‌కి రెండు చక్రాల్లాంటివారు. వీరిలో ఎవరూ లేకపోయినా బండి ముందుకు సాగదు.. అని ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి మూర్తి పేర్కొన్నారు.In my view, men and women are equal but in different ways. They complement each other like two wheels of a bicycle; you can't move forward without the other. pic.twitter.com/MMShEOtg9Q— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 27, 2024మహిళలు పురుషులు ఇద్దరూ ఒకరికొకరు భిన్నం. ఇద్దరిలోనూ ప్లస్, మైనస్‌లు ఉంటాయి. అయితే పురుషులతో పోలిస్తే మహిళలకు చాలా భాష తెలుసు. మేనేజ్మెంట్లో వారు చాలా అద్భుతం. పుట్టుకతోనే వారు మంచి మేనేజర్లు. ప్రేమ, జాలి కరుణ ఎక్కువ. అమ్మ, నాన్న, తోబుట్టువులు, అత్తమామలు, వదినలు, పిల్లలు ఇలా సన్నిహిత బంధువులు అందరికీ చక్కటి ప్రేమను పంచుతారు. మరోవైపు పురుషులు మహిళలంత భావోద్వేగులు కాదు. కొంచెం భిన్నం. పురుషుల్లో మంచి ఐక్యూ ఉండివచ్చు కానీ,మంచి ఈక్యూ (ఎమోషనల్ కోషెంట్) ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. -
నన్ను ప్రశంసించడానికి కాల్ చేస్తే.. రాంగ్ కాల్ అని పొరబడ్డా : సుధామూర్తి
‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, రచయిత, రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత డా. ఏపీజే అబ్దుల్ కలాం నుంచి తనకు పోన్ వస్తే రాంగ్ కాల్ అంటూ ఆపరేటర్‌కి చెప్పిన సంగతిని ప్రస్తావించారు. నిజానికి తన భర్త నారాయణ మూర్తికి ఉద్దేశించిన కాల్ ఏమో అనుకుని పొరపాటు పడ్డానని చెప్పారు. ఆ తరువాత విషయం తెలిసి చాలా సంతోషించానని ఆమె పేర్కొన్నారు.Once I received a call from Mr. Abdul Kalam, who told me that he reads my columns and enjoys them. pic.twitter.com/SWEQ6zfeu4— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 25, 2024 విషయం ఏమిటంటే..ఎక్స్ వేదికగా సుధామూర్తి దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్ కలామ్ నుంచి తనకు ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో వివరించారు. ‘ఐటీ డివైడ్' పేరుతో సుధామూర్తి ఒక కాలమ్ నడిపేవారు. దీన్ని అబ్దుల్ కలాం క్రమం తప్పకుండా చదివేవారట. అంతేకాదు ఈ రచనను బాగా ఆస్వాదించేవారు కూడా. ఇదే విషయాన్ని స్వయంగా ఆమెకు చెప్పేందుకు అబ్దుల్ కలాం ఫోన్ చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ఫోన్ కాల్ వస్తే ‘రాంగ్ కాల్’ అని (ఆపరేటర్‌కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణమూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే అలా చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ‘‘లేదు లేదు.. ఆయన (అబ్దుల్ కలాం) ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు’ అని ఆపరేటర్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. తాను కాలమ్‌ని చదివి ప్రశంసించడానికి కలాం ఫోన్ చేశారని తెలిసి చాలా సంతోషించాననీ, చాలా బావుందంటూ మెచ్చుకున్నారని సుధా మూర్తి ప్రస్తావించారు. ఈ సందర్బంగా కలాం నుంచి పౌరపురస్కారం అందుకుంటున్న ఫోటోని కూడా ఆమె పోస్ట్ చేశారు. కాగా రచయితగా పరోపకారిగా సుధామూర్తి అందరికీ సుపరిచితమే. బాల సాహిత్యంపై పలు పుస్తకాలు రాశారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఆమె సాహిత్యానికి పలు అవార్డులు కూడా దక్కాయి. 73 ఏళ్ళ వయసులో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇంకా అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మశ్రీ (2006), పద్మ భూషణ్ (2023) కూడా ఆమెను వరించాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. -
రాజ్యసభ ఎంపీగా 'సుధామూర్తి' ప్రమాణ స్వీకారం
ఇంజనీర్ నుంచి పరోపకారిగా మారి ఎంతోమందికి సహాయం చేస్తున్న'సుధామూర్తి' ఈ రోజు (గురువారం) తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తి పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించింది. కన్నడ, ఇంగ్లీష్ సాహిత్యానికి ఆమె చేసిన కృషికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారంలభించింది. అంతే కాకుండా ఈమెను 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ అవార్డులు వరించాయి. గత శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. TELCOతో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్ అయిన సుధామూర్తి.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా మారిన ఇన్ఫోసిస్ ప్రారంభానికి ప్రధాన కారకురాలు కూడా. #WATCH | Author and philanthropist Sudha Murty, nominated to the Rajya Sabha by President Droupadi Murmu, takes oath as a member of the Upper House of Parliament, in the presence of House Chairman Jagdeep Dhankhar Infosys founder Narayan Murty and Union Minister Piyush Goyal… pic.twitter.com/vN8wqXCleB — ANI (@ANI) March 14, 2024 -
సూధామూర్తి ఆస్తి విలువ ఎంతో తెలుసా..
ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఎంపీగా నియమితులైన సుధామూర్తికి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో 0.83% వాటాకు సమానమైన 3.45 కోట్ల షేర్లు ఉన్నాయి. ప్రస్తుత షేరు ధర రూ.1,616.95 ప్రకారం, సుధామూర్తి షేర్ల విలువ రూ.5,600 కోట్ల వరకు ఉండొచ్చు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్‌లో 1.66 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారుగా రూ.2,691 కోట్లు. 2006లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న సుధామూర్తికి.. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ పురస్కారమూ లభించింది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ భార్య అక్షతామూర్తి ఈమె కుమార్తె. ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం ‘సుధామూర్తిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. సామాజిక కార్యకలాపాలు, దాతృత్వం, విద్య.. ఇలా పలు విభాగాల్లో ఆమె అందించిన సేవలు అమోఘం. రాజ్యసభ సభ్యురాలిగా దేశ భవిష్యత్తును మార్చడంలో నారీశక్తికి నిదర్శనంగా ఆమె తన వంతు పాత్ర పోషిస్తారని కోరుకుంటున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్లో తెలిపారు. -
International Womens Day 2024: రాజ్యసభకు సుధామూర్తి
సాక్షి, న్యూఢిల్లీ/బనశంకరి: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమెను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రాజ్యసభకు నామినేట్ చేయడం తనకు డబుల్ సర్ప్రైజ్ అని సుధామూర్తి పేర్కొన్నారు. తాను ఏనాడూ పదవులు ఆశించలేదని చెప్పారు. రాష్ట్రపతి తనను పెద్దల సభకు నామినేట్ చేయడానికి గల కారణం తెలియదని అన్నారు. ఉన్నత చట్టసభకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇది తనకు కొత్త బాధ్యత అని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యురాలిగా తన వంతు సేవలు అందిస్తానని వివరించారు. ప్రధాని మోదీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న సుధామూర్తి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుధామూర్తిని రాష్ట్రపతిద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రంగాల్లో ఎన్నెన్నో సేవలు అందించిన సుధామూర్తి చట్టసభలోకి అడుగు పెడుతుండడం నారీశక్తికి నిదర్శనమని మోదీ ఉద్ఘాటించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. టెల్కోలో తొలి మహిళా ఇంజనీర్ డాక్టర్ సుధామూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావిలో జని్మంచారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ ఆర్‌హెచ్ కులకరి్ణ, విమలా కులకరి్ణ. సుధామూర్తి హుబ్లీలోని బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కంప్యూటర్స్‌లో ఎంఈ చేశారు. టాటా ఇంజినీరింగ్ లోకోమోటివ్ కంపెనీ(టెల్కో)లో ఉద్యోగంలో చేరారు. దేశంలోనే అతి పెద్దవాహన తయారీ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్‌గా గుర్తింపు పొందారు. 1970 ఫిబ్రవరి 10న నారాయణమూర్తితో వివాహం జరిగింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీకి సుధామూర్తి సహ వ్యవస్థాపకురాలు. సంస్థ ప్రారంభించే సమయంలో రూ.10వేలు తన భర్తకు ఇచ్చి ప్రోత్సహించారు. సేవా కార్యక్రమాలు.. పురస్కారాలు 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను సుధామూర్తి ప్రారంభించారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో పలు పుస్తకాలు రాశారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వరద బాధితుల కోసం 2,300 ఇళ్లు నిర్మించారు. పాఠశాలల్లో 70 వేల గ్రంథాల యాలు నిర్మించారు. భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ,, 2023లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి చింతామణి అత్తిమబ్బే అవార్డు స్వీకరించారు. సాహిత్యంలో ఆమె చేసిన సేవకుగానూ ఆర్కే నారాయణ సాహిత్య పురస్కారం, శ్రీరా జా–లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. భర్త నారాయణమూర్తి (2014)తో సమానంగా 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ద్వారా తాను అందుకున్న మొత్తాన్ని టోరంటో విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. నాన్ఫిక్షన్ విభాగంలో క్రాస్‌వర్డ్ బుక్ అ వార్డు, ఐఐటీ–కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు అక్షతామూర్తి, రోహన్‌మూర్తి సంతానం. అక్షతామూర్తి భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి. వీరిది ప్రేమ వివాహం. రాజ్య సుధ – ప్రత్యేక కథనం ఫ్యామిలీలో.. -
Infosys Sudha Murty: రాజ్య సుధ
సాటి మనుషుల కోసం పని చేయడం సామాజిక సేవ ద్వారా పరిస్థితులను మెరుగుపరచడం యువతకు స్ఫూర్తిగా నిలవడం.. రచయితగా ఎదగడం ఇన్ఫోసిస్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం సుధామూర్తిని నేడు రాజ్యసభకు చేర్చాయి. ఉమెన్స్ డే రోజు ఆమెను రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి జీవన విశేషాలు. ► తొలి పాఠాలు సుధామూర్తి బాల్యం హుబ్లీలో గడిచింది. తండ్రి కులకర్ణి డాక్టర్. ఆయన రోజూ టీ సేవించేవాడు. ఒకరోజు పాలు రాలేదు. తండ్రి టీ తాగక వేరే ఏ పనీ మొదలుపెట్టలేక కూచుని ఉన్నాడు. ‘ఏంటి నాన్నా?’ అని అడిగింది సుధామూర్తి. ‘ఉదయాన్నే టీకి నేను అలవాటు పడ్డానమ్మా. ఇవాళ టీ తాగక తలనొప్పి వచ్చింది. నువ్వు మాత్రం దేనికీ అతిగా అలవాటు పడకు.. కాఫీ, టీలకైనా సరే’ అన్నాడు. సుధామూర్తి ఆ పాఠాన్ని గుర్తు పెట్టుకుంది. ఇవాళ ఆమెకు డెబ్బై నాలుగు ఏళ్లు. నేటికీ ఉదయాన్నే లేచి టీగానీ కాఫీ గాని తాగి ఎరగదు. సుధామూర్తి హుబ్లీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే షిగావ్‌లో పుట్టింది. అక్కడ ఆమె అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. తాతయ్య స్కూల్ టీచర్. ఆయన తనకంటే వయసులో ఎంత చిన్నవారినైనా ‘మీరు’ అని బహువచనం వాడేవారు. ‘నీ కంటే చిన్న కదా తాతయ్య’ అని సుధామూర్తి అంటే ‘లోపలి ఆత్మ పెద్దదే కదమ్మా’ అనేవారు. ఎదుటివారిని గౌరవించడం అలా నేర్చుకుందామె. తాతయ్య ఆమెకు మూడు జీవన పాఠాలు నేర్పారు. 1.సింపుల్‌గా జీవించు 2.జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండు 3. పుస్తకాలు చదువు. ఇవి సుధామూర్తి నేటికీ పాటిస్తూనే ఉంది. అమ్మమ్మ ‘ఆకలితో ఉన్నవారిని గమనించు’ అని చెప్పింది. వాళ్ల ఇంటికి రోజూ ఒక భిక్షకుడు వస్తే ఇంట్లో మంచి బియ్యం నిండుకుని ముతకబియ్యం ఉన్నా అమ్మమ్మ మంచి బియ్యమే భిక్షకుడికి వేసేది. ‘ముతక బియ్యం మనం తినొచ్చులే’ అనేది. ఇదీ సుధామూర్తికి తొలి పాఠమే. ఇక అమ్మ విమల నేర్పిన పాఠం– ‘ఎంతో అవసరమైతే తప్ప డబ్బు ఖర్చు పెట్టకు’ అని. అంతే కాదు నీకు బాల్యంలో మంచి అలవాట్లు ఉంటే అవే కాపాడతాయి అని కూడా ఆమె అనేది. ఉదయాన్నే లేచి కాగితం మీద 10 సార్లు ‘దేవుడికి నమస్కారం’ అని రాయించేదామె. నేటికీ సుధా మూర్తి ఆ అలవాటును మానలేదు. ఇక స్కూల్ టీచరు రాఘవేంద్రయ్య... ‘నీకు లెక్కలు భలే వస్తున్నాయి. లెక్కల్ని వదలకు. పైకొస్తావ్‘ అన్నాడు. ఆమె ఆనాటి నుంచి లెక్కల్నే రెక్కలుగా చేసుకుంది. ► కుతూహలమే గురువు చిన్నప్పుడు సుధామూర్తికి ప్రతిదీ కుతూహలమే. వీధుల్లో కొట్లాటలు అవుతుంటే అక్కడకు పరిగెత్తి వెళ్లి నిలబడేది. వినోదం కోసం కాదు. కారణం ఏమై ఉంటుందా అని. చిన్న ఊళ్లో ప్రతి ఇల్లూ అందరికీ పరిచయమే. అందరి జీవితాలనూ ఆమె పరిశీలిస్తూ ఉండేది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగితే ఆమె తప్పని సరిగా ఒక స్టీలు క్యారేజీ తీసుకుని బయలుదేరేది. విందులో ఏ పదార్థాలు బాగున్నాయో ఏ పదార్థాలు బాగలేవో మొత్తం రుచి చూసి వస్తూ వస్తూ బాగున్న వాటిని క్యారేజీలో అడిగి తెచ్చుకునేది. కాలేజీ రోజుల వరకూ కూడా పెళ్ళిళ్లకు క్యారేజీ తీసుకోకుండా సుధామూర్తి వెళ్లేది కాదు. ‘ఎందుకో నాకు గిన్నెల క్యారేజీ అంటే నేటికీ ఇష్టం’ అంటుందామె. ► మసాలా దోసె పార్టీ లెక్కలు బాగా నేర్చుకున్న సుధా హుబ్లీలోని బి.వి.బి. కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇక ఆ రోజు నుంచి ఊళ్లోని పెద్ద మనుషులంతా ఆమె తండ్రి దగ్గరకు వచ్చి వాపోవడమే. ‘అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నావ్. పెళ్లెవరు చేసుకుంటారు’ అని బెంగపడటమే. తండ్రి కూడా ఒక దశలో తప్పు చేశానా అనుకున్నాడు. కాని సుధామూర్తి మొదటి సంవత్సరానికి ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. తండ్రికి సంతోషం కలిగింది. ‘ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నావ్ కదా... పద మసాలా దోసె పార్టీ చేసుకుందాం’ అని తీసుకెళ్లాడు. ప్రతి సంవత్సరం ఆమె ఫస్ట్‌క్లాస్ తెచ్చుకోవడం.. తండ్రి తీసుకెళ్లి మసాలా దోసె తినిపించడం. ఆ తండ్రీ కూతుళ్ల జీవితంలో పార్టీ చేసుకోవడం అంటే అదే. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ‘కాని ఆ పార్టీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అపురూపం అనిపించేది’ అంటుందామె. ► చరిత్ర మార్చిన కార్డు ముక్క 1974లో టాటా వారి ‘టెల్కో’ సంస్థలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు పడ్డాయి. పేపర్లో ఆ యాడ్ చూసింది సుధామూర్తి. అర్హతలు అన్నీ ఆమెకు ఉన్నాయి. కాని యాడ్ కింద ‘స్త్రీలు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఉంది. అప్పుడు సుధామూర్తికి ఆగ్రహం వచ్చింది. రోషం కలిగింది. జె.ఆర్.డి.టాటాకు ఒక కార్డు గీకి పడేసింది. ‘దేశంలో ఉన్న ఇంతమంది స్త్రీలకు పని చేసే హక్కు లేకపోతే వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు?’ అని ప్రశ్న. ఆ కార్డు జె.ఆర్.డి. టాటాకు చేరింది. ఆ వెంటనే ఆమెకు ఇంటర్వ్యూకు పిలుపు, ఆపై ఉద్యోగం వచ్చాయి. పూణెలో సుధామూర్తి తొలి ఉద్యోగం చేసింది. ఆమె రాసిన లేఖను టాటా సంస్థ నేటికీ భద్రపరిచి ఉంచింది. 1974లో టెల్కోలో సుధామూర్తి ఒక్కతే మహిళా ఉద్యోగి. దాదాపు 50 ఏళ్ల తర్వాత సుధామూర్తి పూణెలో ఆ సంస్థను సందర్శిస్తే (ఇప్పుడు టాటా మోటార్స్) 900 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ‘నేను అక్కడ నిలబడి మా తండ్రిని తలుచుకుని ఉద్వేగంతో కన్నీరు కార్చాను. ఎవరు భయపెట్టినా నన్ను ఆయన చదివించాడు. నా వల్ల ఇవాళ ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు అని’ అందామె. ► జీవితం అంతులేని పోరాటం ‘జీవితం అంటే అంతులేని పోరాటం. ఎవరికీ ఏ వయసులో ఉన్నా కన్సెషన్ ఉండదు. పోరాటం చేయాలి. ఓడిపోయినా పోరాట అనుభవం మిగులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. క్షమిస్తే మంచిది. మర్చిపోతే ఇంకా మేలు. కాని ముందుకు సాగడమే అన్నింటికన్నా ఉత్తమమైనది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని మెరిపిస్తాయి. ప్యాషన్‌తో పని చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. ఒక మనిషిని పైకి తెచ్చేది డబ్బు కాదు ప్యాషన్. నమ్మిన పనిని విలువలతో ఆచరిస్తే ఎవరైనా పైకి రావాల్సిందే’ అంటుందామె. ► రాజ్యసభ సభ్యురాలు ‘ఇది ఊహించలేదు. రాష్ట్రపతి నన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీని గురించి నేను కూచుని ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ఏం చేయగలనో అంతా చేయాలి. ఇప్పుడు నేను భారత ప్రభుత్వ సేవకురాలిని’ అని కొత్త బాధ్యతకు సిద్ధమవుతోంది సుధామూర్తి. ఇల్లాలే శక్తి నారాయణ మూర్తితో వివాహం అయ్యాక ఇన్ఫోసిస్ సంస్థను ఆయన స్థాపించాలనుకున్నప్పుడు 10 వేల రూపాయలు పెట్టుబడి తనే ఇచ్చింది సుధామూర్తి. అయితే ఆమెను ఇన్ఫోసిస్‌కు బయటి వ్యక్తిగానే ఉండటం మంచిదని సూచించాడు నారాయణమూర్తి. ఆమె కొంచెం బాధపడింది. ఎప్పటికైనా ఇన్ఫోసిస్ సంస్థలో చేరతాననే భావించింది. అదే సమయంలో చాలా కాలం పాటు పిల్లల కోసం గృహిణిగా ఉండిపోయింది. ‘సంవత్సరంలో 200 రోజులు ప్రయాణాల్లో ఉండేవాడు నారాయణమూర్తి. ఆ రోజుల్లో ఫోన్ లేదు. కారు లేదు. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కదాన్నే వెళ్లాలి. సంస్థ ఆర్థిక కష్టాలు.. ఇంటి కష్టాలు.. అన్నీ తట్టుకుని నారాయణమూర్తికి వెన్నుదన్ను అందించాను. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్ అయ్యాను. ఆ ఫౌండేషన్‌తో వేలాది మంది జీవితాల్లో వెలుగు తెచ్చే వీలు నాకు కలిగింది. ఈ సంతృప్తి ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా పని చేసి ఉంటే నాకు దక్కేది కాదు’ అంటుందామె. -
ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం ద్వారా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్ అయినందుకు శ్రీమతి సుధామూర్తిగారికి నా హృదయపూర్వక అభినందనలు. పరోపకారిగా, సామాజిక సేవకురాలిగా, వ్యాపారవేత్తగా, రచయిత్రిగా ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి. భవిష్యత్ లో సుధామూర్తి మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారాయన. My heartfelt congratulations to @SmtSudhaMurty garu on being nominated to the Rajya Sabha on International Women’s Day. Her invaluable contributions as a philanthropist, social worker, entrepreneur and author are immeasurable. I earnestly hope that she achieves even greater… — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటంతో డబుల్ సర్ప్రైజ్గా.. చాలా ఆనందంగా ఉందని ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సుధా మూర్తి ఓ మీడియా సంస్థ ద్వారా స్పందించారు. -
అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం
ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్, సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ నిర్ణయం వెలువడడం విశేషం. సుధామూర్తి సంఘ సేవకురాలిగా అందరికీ సుపరిచితం. ఈమె గొప్ప రచయిత్రి. కంప్యూటర్ ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సుధామూర్తి పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్దికి సహకరిస్తున్నారు. కర్ణాటకలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్యను చేరేలా తోడ్పడుతున్నారు. ఆమె గతంలో కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిసింది. ఆమె నవలే సీరియల్‌గా.. సుధామూర్తి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ‘ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ ప్రారంభించారు. ఆమె కాల్పనిక రచనలు కూడా రాస్తారు. ఆమె రచించిన కన్నడ నవల ‘డాలర్ సొసే’ ఇంగ్లిష్‌లో డాలర్ బహుగా ట్రాన్స్‌లేట్ చేశారు. తర్వాత ఆ నవల 2001లో ‘జీ టీవీ’లో సీరియల్‌్‌గా ప్రసారం చేశారు. భూరి విరాళాలు.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుధామూర్తి ఐఐటీ కాన్పూర్‌లోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఉండే హెచ్.ఆర్.కాదిం దివాన్ బిల్డింగ్ హౌసింగ్ ఏర్పాటుకు, నారాయణరావ్ మెల్గిరి స్మారక న్యాయ కళాశాలకు భూరి విరాళాలను అందజేశారు. కర్ణాటకలోని బి.వి.బి.టెక్నికల్ కాలేజీలో ఎలక్టికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్) నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించారు. పోరాడితే దక్కిన ఉద్యోగం.. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆటో పరిశ్రమలో పేరొందిన టెల్కో కంపెనీలో మహిళా ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. అంతా ఈజీగా ఈ ఉద్యోగం రాలేదు. అప్పటికి ఈ సంస్థలో కేవలం పురుషులకే స్థానం కల్పించేవారు. దాన్ని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి పోస్టుకార్డు రాశారు. దానికి స్పందించిన ఆయన తనకు ఇంటర్వ్యూ నిర్వహించారు. అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించారు. ఆ సంస్థకు పుణె బ్రాంచిలో పనిచేస్తున్నపుడే ఆవిడకు నారాయణ మూర్తితో పరిచయం ఏర్పడి తర్వాత వివాహం చేసుకున్నారు. అందుకున్న పురస్కారాలు.. మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగా పలు సేవలు అందిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్‌కు క్యాపిటలిస్ట్‌గా ఉన్న కెటారామన్ వెంచర్స్ సంస్థలకు పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నారు. 2004 - సామాజిక సేవకుగాను శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం 2006 - భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం. (సామాజిక సేవ, దాతృత్వం, విద్యా రంగం) దేశంలో న్యాయ విద్య , ఉపకారవేతనాల అందజేతకు ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డేతో కలిసి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. సాహితీ సేవ, ఆమె రచనలకు ఆర్.కె.నారాయణన్ పురస్కారం అందుకున్నారు. 2011లో కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అట్ఠిమబ్బే (Attimabbe) అవార్డు అందుకున్నారు. 2023 -పద్మ భూషణ్ అవార్డు 2023 - గ్లోబల్ ఇండియన్ అవార్డు. ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’ ప్రముఖ రచనలు మదర్ ఐ నెవెర్ న్యూ మేజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ వైస్ అండ్ అదర్ వైస్ మేజిక్ డ్రమ్ అండ్ ఆదర్ ఫేవరేట్ స్టోరీస్ 3000 స్టిచెస్: ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రార్డినరీ లైవ్స్ గ్రాండ్ మాస్ బాగ్ ఆఫ్ స్టోరీస్ -
రాజ్యసభకు సుధామూర్తి.. ‘నారీ శక్తికి నిదర్శనం’: మోదీ
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రచయిత, సామాజిక వేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి ఎంపికపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం భారత ‘నారీ శక్తి’కి శక్తివంతమైన నిదర్శమని మోదీ పేర్కొన్నారు. సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని కొనియాడారు. విద్య, దాతృత్వంతో సహా విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి ఆపారమైనదని ప్రశంసించారు. మహిళల శక్తి, సామర్థ్యాలను చాటిచెప్పేలా ఆమె పార్లమెంట్ పదవీకాలం ఉన్నతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు చేశారు. I am delighted that the President of India has nominated @SmtSudhaMurty Ji to the Rajya Sabha. Sudha Ji's contributions to diverse fields including social work, philanthropy and education have been immense and inspiring. Her presence in the Rajya Sabha is a powerful testament to… pic.twitter.com/lL2b0nVZ8F— Narendra Modi (@narendramodi) March 8, 2024 కాగా సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. -
Sudha Murty: ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా రిటైరయ్యేదాన్ని..
దేశంలో అత్యంత గుర్తింపు పొందిన దంపతుల్లో ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధా మూర్తి ఒకరు. దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషితో నారాయణమూర్తి ప్రసిద్ధి చెందితే రచయిత్రిగా, సేవా కార్యక్రమాలతో ఆయన సతీమణి సుధా మూర్తి గుర్తింపు పొందారు. అయితే భర్త కంపెనీ కోసం ఎంతో కష్టపడిన ఆమె కంపెనీలో మాత్రం భాగం కాలేకపోయారు. దానికి తన భర్త పెట్టిన షరతే కారణమంటున్నారు సుధా మూర్తి. అనేక దశాబ్దాల సహచర్యం ఉన్న ఈ దంపతులు తమ జీవిత విశేషాల గురించి పలు సందర్భాల్లో పంచుకుంటుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుధా మూర్తి తన భర్తతో సాన్నిహిత్యాన్ని, తమ వైవాహిక బంధం గురించి వెల్లడించారు.తమ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను కంపెనీ (ఇన్ఫోసిస్)లో చేరలేకపోవడమే జీవితంలో నాకు అత్యంత కష్టతరమైన విషయం. నేను ఎందుకు చేరలేకపోయానంటే.. కంపెనీ భార్యాభర్తల కంపెనీ కాకూడదని ఆయన షరతు పెట్టారు. ఆ కష్టతరమైన సమయం నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. నేను ఎంతగానో ప్రేమించిన కంపెనీ, దాని కోసం చాలా పనిచేశాను. కానీ అందులో భాగం కాలేకపోయాను" అన్నారు సుధామూర్తి. అయినప్పటికీ తాను జీవితంలో సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు. ‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పటికి నేను బహుశా ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసి ఉండేదాన్ని. కానీ నేను నా పనితో చాలా మంది జీవితాలను స్పృశించగలిగాను. బహుశా ఇది దేవుడి నిర్ణయం. నాకు మాత్రమే సాధ్యమైంది" అన్నారు. నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన ఇన్ఫోసిస్. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు. -
Infosys Sudha Murty: పుస్తకం కలిపింది ఇద్దరినీ
1974. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం మొదటిసారి సుధామూర్తి, నారాయణమూర్తి పూణెలో కలిశారు. వారి మధ్య ప్రేమ చిగురించడానికి దోహదం చేసింది పుస్తక పఠనం. ఆ ప్రేమ కథ ఏమిటో 50 ఏళ్ల తర్వాత ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024’లో పంచుకున్నారు సుధామూర్తి. తమ సుదీర్ఘ వైవాహిక జీవితం సఫలం కావడానికి ఇద్దరూ తీసుకున్న జాగ్రత్తలు చెప్తూ ఈనాటి యువతకు అనుభవంతో నిండిన సూచనలు చేశారు. అందమైన ప్రేమకథలు, సఫలమైన ప్రేమకథలు తెలుసుకోవడం బాగుంటుంది. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో ఫిబ్రవరి 5న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పాల్గొన్నారు. చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన బయోగ్రఫీ ‘యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ డేస్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ విడుదలైన సందర్భంగా తనకు నారాయణమూర్తికీ మధ్య ఎలా ప్రేమ పుట్టిందో కొద్దిగా సిగ్గుపడుతూ, ముసిముసిగా నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ప్రేమ కథ వినండి. 1974 అక్టోబర్. పూణెలోని ‘టెల్కొ’లో మొదటి మహిళా ఇంజనీరుగా చేరిన సుధ రోజూ కంపెనీ బస్‌లో వచ్చి వెళుతుండేవారు. ప్రసన్న ఆమె కొలీగ్. అతను ఏదో ఒక పుస్తకం చదువుతుంటే ఏ పుస్తకమా అని సుధ తొంగి తొంగి చూసేవారు. అతను చదివే ప్రతి పుస్తకం మీద ఒకే పేరు ఉండేది... మూర్తి అని. ఒకరోజు ఉండబట్టలేక ‘ఎవరీ మూర్తి’ అని అడిగారు సుధ. ‘నా రూమ్మేటు. పుస్తకాల పిచ్చోడు. చాలా పుస్తకాలు చదువుతాడు’ అన్నాడు ప్రసన్న. ‘నీకూ పుస్తకాల పిచ్చేగా. కావాలంటే పరిచయం చేస్తానురా’ అన్నాడు. ‘అమ్మో... బేచిలర్ల రూముకు వెళ్లడమా’ అని సుధ జంకారు. కాని కుతూహలం పట్టలేక ‘ఫలానా రోజున ఐదు నిమిషాలకు వచ్చి వెళతా’ అని ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆలోచనలు రకరకాలుగా సాగాయి. ఈ మూర్తి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడా... రింగుల రింగుల జుట్టుతో ఉంటాడా.. షోగ్గా (అప్పటికి హిందీ సినిమాల ఫ్యాన్ కాబట్టి) రాజేష్ ఖన్నాలా ఉంటాడా అని ఒకటే ఊహలు. తీరా రూముకు వెళ్లేసరికి దళసరి కళ్లద్దాల బక్కపలచటి యువకుడు ఎదురుపడ్డాడు. సుధని చూసి, ఆమెకు పుస్తకాలంటే ఇష్టమని తెలిసి తన దగ్గరున్న పుస్తకాలన్నీ చూపించాడు. ఆమె బయల్దేరే ముందు అబ్బాయిలు వేసే పాచిక ‘కావాలంటే తీసుకెళ్లి చదివి ఇవ్వు’ అన్నాడు. కొన్నిరోజుల తర్వాత ‘మనం డిన్నర్ చేద్దామా’ అని ఆహ్వానించాడు. దానికీ భయమే సుధకు. ‘వస్తా. కాని మన కామన్ఫ్రెండ్ ప్రసన్న కూడా మనతో ఉండాలి. నా వాటా బిల్లు డబ్బులు నేనే కడతా’ అందామె. వారి స్నేహం బలపడింది. ఒకరోజు నారాయణమూర్తి ధైర్యం చేసి సుధతో చెప్పాడు– ‘ఆరోజు నువ్వు మొదటిసారి నా రూమ్‌కు వచ్చి వెళ్లాక అంతవరకూ లేని వెలుగు వచ్చినట్టయ్యింది. జీవితం పట్ల ఇంత ఆసక్తి ఉన్న అమ్మాయిని నేను చూళ్లేదు’... ఆ మాటలే ప్రేమను ప్రపోజ్ చేయడం. ఆమె సంతోషంగా నవ్వడమే ప్రేమను అంగీకరించడం. ప్రేమ మొదలైన నాలుగేళ్లకు సుధ.. సుధామూర్తి అయ్యారు. ‘నారాయణమూర్తి, నేను భిన్నధృవాలం. నేను అన్నింటికీ మాట్లాడతాను. అతను అసలు మాట్లాడడు. నాకు అన్నింట్లో జోక్యం కావాలి. అతను అవసరమైతే తప్ప జోక్యం చేసుకోడు. మా జీవితంలో అనంగీకారాలు, ఆర్గ్యుమెంట్లు లేవని కాదు. ఇన్ఫోసిస్ మొదలెడుతున్నప్పుడు నువ్వు ఇందులో ఉండకూడదు అన్నాడు నారాయణమూర్తి. ఐదేళ్లు నేను పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడప్పుడు కొంత చివుక్కుమంటూండేది. కాని తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా నేను సామాజిక సేవతో ఎందరి జీవితాలకో చేయూతనిచ్చి తృప్తి పొందాను. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఎవరిని వారులా ఉండనివ్వాలి. నారాయణమూర్తి కోరుకున్నట్టుగా నేను అతణ్ణి ఉండనిచ్చాను, నాలా నన్ను అతను ఉండనిచ్చాడు’ అన్నారామె. ‘ఇన్ఫోసిస్ పెట్టాక అతి కష్టమ్మీద ఒక క్లయింట్ దొరికాడు. కాని పేమెంట్స్ ఇష్టమొచ్చినప్పుడు ఇచ్చేవాడు. నారాయణమూర్తికి ఉద్యోగుల జీతాలు సమయానికి చెల్లించాలని నియమం. అతను టెన్షన్ పడుతుంటే– ఎందుకంత టెన్షన్... నగలు బ్యాంకులో కుదవ పెట్టి డబ్బు తెస్తాను. సర్దుబాటు చేసుకో అన్నాను. నారాయణమూర్తి కదిలిపోయాడు. ఎందుకంటే ఏదో అవసరం వచ్చి గతంలో తల్లి నగలు కుదువ పెట్టాల్సి వచ్చిందట. అవి విడిపించుకోలేకపోయారు. అది గుర్తొచ్చి వద్దు వద్దు అన్నాడు. ఏం పట్టించుకోకు.. లోను తీసుకోవడానికి సెంటిమెంట్లు ఏమిటి అని తెచ్చి ఇచ్చాను. ఆ రోజు గాజులు లేని నా బోసి చేతులను చూసి నారాయణమూర్తి చాలా బాధ పడ్డాడు. కొన్నాళ్లకు విడిపించాడనుకోండి. ఈ మాత్రం సర్దుబాట్లు కాపురంలో అవసరం’ అన్నారామె. వైవాహిక బంధం ఎలా నిలబడుతుంది? ఆడియెన్స్‌లో ఎవరో అడిగారు. ‘నమ్మకం, సహనం, సర్దుబాటుతనం వల్ల మాత్రమే. జీవితంలో సహనం ముఖ్యమైనది. సహనంగా ఉంటే జీవితం మనకు కావలసినవి ఇస్తుంది. వైవాహిక జీవితంలో అనుకున్నవన్నీ చేసే స్వేచ్ఛ, వీలు లేకపోవచ్చు. అప్పుడు ఉన్న పరిమితుల్లోనే ఎలా ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ మొదలుపెట్టి బిజీగా ఉండగా నేను ఐదేళ్లూ పిల్లల్ని చూసుకుంటూ కూడా పుస్తకాలు రాసి సంతోషపడ్డాను. వీలైనంతగా కొత్త ప్రాంతాలు చూశాను. మగవాళ్లకు సాధారణంగా ఆడవాళ్లు తమ కంటే తెలివితక్కువగా ఉండాలని ఉంటుంది. అవసరమైతే వారిని అలా అనుకోనిచ్చేలా చేస్తూ స్త్రీలు తమ సామర్థ్యాలను వీలైనంత ఉపయోగించుకోవాలి. జీవితంలో, వైవాహిక జీవితంలో రాణించాలి’ అన్నారు సుధామూర్తి. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
సుధా-నారాయణమూర్తి లవ్ స్టోరీ: పెళ్లికి తండ్రి నో....చివరికి పెళ్లి ఖర్చు కూడా!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేరు టెక్ ప్రపంచంలో తెలియని వారుంటారు. ఆయన భార్య, ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కి రిటైర్డ్ చైర్పర్సన్ సుధామూర్తి కూడా చాలామందికి ఇన్సిపిరేషన్. తాజాగా వీరిద్దరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్‌గా మారింది. నాలుగేళ్ల డేటింగ్ తరువాత 1978, ఫిబ్రవరి 10న నారాయణ, సుధా మూర్తి మూడుముళ్ల బంధంలో ఒక్కటైనారు. అయితే అన్ని విషయాల్లో గుంభనం, దూరదృష్టితో ఉండే నారాయణమూర్తి, భోళాగా, డబ్బు విషయంలో చాలా ప్రణాళికా బద్దంగా ఉండే సుధ పరిచయం ప్రేమ విచిత్రంగానే జరిగింది. కొన్ని భేదాభిప్రాయాలున్నప్పటికీ, ఒకరిపై మరొకరు నమ్మకం వారి ప్రేమను శాశ్వతం చేసింది. పూణేలో తమ కామన్ ఫ్రెండ్ విప్రో ప్రసన్న ద్వారా తామిరువురం కలుసుకున్నామని జ్ఞాపకాలను ఒక ఇంటర్వ్యూలో సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె పూణే బ్రాంచ్‌లో టెల్కోగా పనిచేస్తున్నారు. ఒక సాయంత్రం పూణేలోని గ్రీన్ ఫీల్డ్స్ హోటల్లో భోజనానికి ప్రసన్న ద్వారా సుధ , ఆమె స్నేహితులను నారాయణ ఆహ్వానించారు. ఈ బృందంలో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో మొదట్లో వెళ్లేందుకు ఇష్టపడలేదు కానీ నారాయణ ఆమెను ఒప్పించారట. అలాగే ప్రసన్న దగ్గరినుంచి చాలా పుస్తకాలను తీసుకోవానే వారట సుధ. ఆ పుస్తకాలపై ఎక్కువగా నారాయణమూర్తి పేరు ఉండేదట. అలా తన మనస్సులో నారాయణ ఊహాచిత్రం ముందే ఉండేదంటూ గుర్తు చేసుకున్నారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది.. ముఖ్యంగా ఆయనలోని వినయం, ముక్కు సూటిగా ఉండే తత్వం తననను ప్రేమలో పడేసిందని ఆమె చెప్పారు. ‘‘నా పొడవు 5'4" పొడవు ఉన్నాను . దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నేను నా జీవితంలో ఎప్పటికీ ధనవంతుడు కాలేను,నేను మీకు ఏ సంపదను ఇవ్వలేను. మీరు అందంగా ఉన్నారు. పైగా తెలివైనవారు కూడా. నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగారట నారాయణమూర్తి. పెళ్లి ఖర్చు సమంగా పంచుకున్నాం రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నారాయణమూర్తి మొదట్లో వీరిద్దరి వివాహాన్ని సుధ తండ్రి వ్యతిరేకించారు. జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నారు అని సుధ తండ్రి అడిగితే, కమ్యూనిస్టు పార్టీలో నాయకుడిగా ఎదగాలని, అనాథాశ్రమాన్ని తెరవాలనుకుంటున్నానని మూర్తి చెప్పారట. దీంతో ఆయన ససేమిరా అన్నారట. చివరికి 1977 చివరిలో నారాయణ పాట్నీ కంప్యూటర్స్‌లో జనరల్ మేనేజర్‌గా జాయిన్అయిన తరువాత మాత్రమే ఆయన అంగీకరించారు. అమెరికా వెళ్లే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం మేరకు వబెంగుళూరులోని నారాయణ ఇంట్లో కుటుంబ సన్నిహితుల పెళ్లి చేసుకున్నామని ఆమె చెప్పారు. అలా తనకు తొలి పట్టు చీర వచ్చిందని గుర్తు చేసు కున్నారు. అంతేకాదు ఆనాటి తమ పెళ్లి ఖర్చును ఇద్దరమూ సమానంగా పంచుకున్నామని సుధామూర్తి వెల్లడించారు. ఒక్కొక్కరు రూ.400 చొప్పున మొత్తం పెళ్లి ఖర్చు రూ.800 అయిందని చెప్పారు. అలాగే ఇటీవల కాలంలో ఆయన పాత జ్ఞాపకాల గురించి మీడియాతో పంచుకుంటున్న నారాయణమూర్తి కూడా . తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మధ్యతరగతి నేపథ్యం తాము ఎక్కువగా ఆటోలోనే ప్రయాణించే వారమంటూ ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. కన్నడ రాని డ్రైవరున్న ఆటోలో తాము కన్నడలోమాట్లాడుకుంటూ తమ జీవితంలో కీలక మైన విషయాలను షేర్ చేసుకున్నట్టు నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. 1981లో పూణేలో తన సహచరులతో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాలన్న తన భర్త కల సాకారం కోసం 10 వేల రూపాయలను సుధామూర్తి అప్పుగా ఇచ్చారు. అదే ఆ తరువాత కోట్లాది రూపాయల విలువ చేసే దేశంలో అనే అత్యున్నత ఐటీ సంస్థగా అవతరించింది. అలాగే ఇటీవల తన భార్య సుధ చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని మరీ నారాయణ మూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. -
మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి..
నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే.. ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన 'ఇన్ఫోసిస్' (Infosys). ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు. ఈ రోజు 83.92 బిలియన్ల విలువ కలిగిన స్థాయికి చేరిన ఇన్ఫోసిస్ ప్రారంభంలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నట్లు, దాని కోసం అనేక త్యాగాలను చేయాల్సి వచ్చినట్లు సుధామూర్తి చెబుతూ.. తమ కుమార్తె అక్షతా మూర్తిని 90 రోజుల వయసున్నప్పుడు తమ తల్లిందండ్రుల దగ్గర వదిలిపెట్టాల్సి వచ్చిందని వెల్లడించింది. టెక్ కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు సుధామూర్తి, నారాయణ మూర్తి ముంబైకి మారారు. ఆ సమయంలో కంపెనీ వృద్ధికి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పరిస్థితులు ఎలా మారతాయో ఊహకందని సమయంలో.. నా బిడ్డ అక్షతా మూర్తి తన తాతయ్యల వద్ద పెరగడం మంచిదని భావించిన సుధామూర్తి.. చిన్నారిని ముంబై నుంచి కర్ణాటకలోని తన తల్లిదండ్రులు, సోదరి వద్ద వదిలి పెట్టింది. ఎంతో గారాబంగా పెంచుకోవాల్సిన చిన్నారిని విడిచిపెట్టడం చాలా కష్టమైన నిర్ణయమని సుధామూర్తి చెబుతూ.. ఆ రోజు నుంచి అక్షతకు నా తల్లి, సోదరి తల్లులుగా మారారని తెలిపింది. ఈ రోజు ఇన్ఫోసిస్ ఇంత పెద్ద సంస్థగా అవతరించినదంటే ఒక్క రోజులో జరిగిన పని కాదు. ఇదీ చదవండి: అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి మీరు ఒక కంపెనీ స్థాపించినప్పుడు.. ఎదురయ్యే కష్టమైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సుధామూర్తి చెప్పారు. ఈ రోజు యూకే ప్రధాని భార్యగా.. వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఎదిగిన 'అక్షతా' కర్ణాటకలోని హుబ్లీలో తన తాతయ్యలతో కలిసి పెరిగింది. ఏదైనా విలువైనది చేయాలని ఆకాంక్షించినప్పుడు త్యాగాలు అనివార్యమని మూర్తి దంపతులు స్పష్టం చేశారు. -
స్టోర్‌రూంలో పడుకోబెట్టిన క్లయింట్.. ‘దాన్ని బట్టే నువ్వు ఎలాంటివాడివో తెలుస్తుంది’
Infosys Narayana Murthy: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి జీవితానికి సంబంధించిన ఏదో ఒక విశేషం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. ప్రారంభ రోజుల్లో ఆయన పడిన అవమానం గురించిన అంశం తాజాగా బయటకు వచ్చింది. భార్య సుధామూర్తికి కోపం తెప్పించిన ఈ ఘటన గురించి నారాయణమూర్తి ఏం చెప్పారంటే.. ఇన్ఫోసిస్ ప్రారంభ రోజులలో క్లయింట్ వర్క్ కోసం నారాయణ మూర్తి ఒకసారి యూఎస్ వెళ్ళినప్పుడు, ఒక అమెరికన్ వ్యాపారవేత్త తన ఇంటిలో నాలుగు బెడ్రూమ్లు ఉన్నప్పటికీ నారాయణమూర్తిని స్టోర్‌రూంలో పడుకోబెట్టాడు. కిటికీలు లేని ఆ రూంలో చుట్టూ అట్టపెట్టెల మధ్య ఒక పెట్టెపైనే ఆ రాత్రి ఆయన నిద్రించారు. సుధా మూర్తి, నారాయణ మూర్తి జీవితాల్లో తొలినాళ్ల గురించి భారతీయ-అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుణి రచించిన "యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి" జీవితచరిత్ర పుస్తకంలో ఈ విశేషాలు వెల్లడయ్యాయి. న్యూయార్క్‌కు చెందిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ అనే కంపెనీ అధినేత డాన్ లీల్స్.. నారాయణమూర్తి పట్ల కొన్ని సందర్భాల్లో అనుచితంగా ప్రవర్తించేవాడు. తరచుగా చెల్లింపులను ఆలస్యం చేసేవాడు. మ్యాన్‌హట్టన్ వెళ్లినప్పుడు తనకే కాకుండా ఇతర ఇన్ఫోసిస్ సహచరులకు సైతం హోటల్లను బుక్ చేసుకోవడానికి అనుమతినిచ్చేవాడు కాదు. ఇలా మూర్తి ఒకసారి క్లయింట్ వర్క్ కోసం యూఎస్ వెళ్ళినప్పుడు, డాన్ లీల్స్ ఆయన్ను స్టోర్‌రూమ్‌లో పడుకోబెట్టాడు. కిటికీలు కూడా లేని ఉన్న ఆ రూంలో చుట్టూ అట్టపెట్టెల మధ్యే ఆ రాత్రి ఆయన నిద్రించాడు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న కంపెనీ కోసం నారాయణమూర్తి ఇలాంటి అవమానాలను ఎన్నో సహించారు. అతిథి దేవుడిలాంటివారని తన అమ్మ అంటుండేదని, అతిథులతో వ్యవహరించిన తీరుని బట్టే నువ్వు ఎలాంటివాడివో తెలుస్తుందని చెబుతూ ఈ ఘటన గురించి భార్య సుధా మూర్తితో నారాయణమూర్తి చెప్పారు. అనుకోకుండా వాళ్ల నాన్న ఎవరినైనా ఇంటికి ఆహ్వానించినప్పుడు తన తల్లి తాను తినకుండా అతిథికి అన్నం పెట్టేదని గుర్తు చేసుకున్నారు. కానీ డాన్ లీల్స్ తాను విలాసవంతమైన బెడ్‌పై పడుకుని తనను మాత్రం స్టోర్‌రూంలో పెట్టెపై పడుకోబెట్టాడని నారాయణమూర్తి చెప్పగా సుధామూర్తికి మాత్రం ఈ ఘటన కోపం తెప్పించినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. -
‘తప్పు చేశాను సుధా.. నన్ను క్షమించవా!’
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాణయ మూర్తి పరిచయం అక్కర్లేని పేరు. రెండు దశాబ్ధాల పాటు టెక్నాలజీ రంగంలో విశేష కృషి చేసిన ఆయన తన అభిప్రాయాలను తెలపడంలో ఎప్పుడూ మెుహమాట పడరు. ఇలా చేయడం వల్ల అనేకసార్లు విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఆయినప్పటికీ ఆయన మాత్రం తనపని తాను చేసుకుపోతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. కష్టపడి పనిచేసే వారికి రుణ పడి ఉండాలి కొద్ది రోజుల క్రితం భారత యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ వ్యవస్దాపకుడు నారాయణ మూర్తి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేశంలోని విద్యావంతులు అత్యంత ఎక్కువగా కష్టపడే వారికి తక్కువగా కష్టపడి పనిచేసే వారు రుణ పడి ఉండాలని అన్నారు. ‘రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తారు’ అంటూ తన వైఖరిని సమర్థించుకున్నారు. చాలా మంది భారతీయులు, ఎన్ఆర్ఐలు చాలా మంది ప్రజలు శారీరకంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకుంటారు. కాబట్టి భారత్‌లో కష్టపడి పనిచేయడం అనేది ఓ సర్వ సాధారణం. అలాగే భారీ రాయితీలతో విద్యను పూర్తి చేసిన మనలో చాలా మంది ప్రభుత్వం అందించే సబ్సీడీలకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక తాను చేసే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చినప్పటికీ భారత్‌లో చాలా మంది, ఎన్ఆర్ఐలు తన వ్యాఖ్యల్ని ఏకీభవిస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యల్లో తప్పు ఏమైనా ఉందా? నా ఫీల్డ్‌లో నా కంటే మెరుగ్గా ఉన్నవారు ఎవరైనా ఉంటే నేను వారిని గౌరవిస్తాను. వారితో మాట్లాడుతాను. ఈ తరహా వ్యాఖ్యలు చేయడంలో తప్పు ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేనైతే తప్పు ఉందని అనుకోను అని అన్నారు. నేను చేసిన పనికి చింతిస్తున్నా పనిలో పనిగా తన భార్య సుధా మూర్తి విషయంలో తాను చేసిన పనికి చింతిస్తున్నట్లు తెలిపారు. 1981లో కేవలం తన వాటాగా రూ.10,000తో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా నారాయమూర్తి మారారు. అయితే ఈ డబ్బును తన భార్య సుధా మూర్తి దాచుకున్న సొమ్మని పలుమార్లు గతంలోనే వెల్లడించారు. భార్య దాచుకున్న మెుత్తాన్ని వ్యాపార పెట్టుబడిగా పెట్టి దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఇన్ఫోసిస్‌ను తీర్చిదిద్దటంలో ఆయన తన జీవితాన్ని వెచ్చించారు. సహా వ్యవస్థాపకుల కంటే సుధా మూర్తికి తాజా ఇంటర్వ్యూలో పెట్టుబడిగా డబ్బులిచ్చిన భార్యకు కంపెనీలో ఎందుకు అవకాశం కల్పించలేదని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తన భార్య డబ్బుతో కంపెనీని ప్రారంభించినప్పటికీ ఆమెతో పాటు కుటుంబాన్ని ఇన్ఫోసిస్‌కు దూరంగా ఉంచాలనే తన నిర్ణయం సరైంది కాదన్నారు. ఇదే విషయంలో తాను చింతిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇతర సహ వ్యవస్థాపకుల కంటే సుధా మూర్తికి ఎక్కువ అర్హత ఉందని నమ్మినప్పటికీ.. తన భార్యను సంస్థలో చేరడానికి ఎప్పుడూ అనుమతించలేదని అన్నారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి.. తన భార్య సుధా మూర్తిని క్షమాపణలు కోరేలా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.