Infosys Sudha Narayana Murthy Couple Donate Gold Ornaments To Tirupati Balaji - Sakshi
Sakshi News home page

శ్రీనివాసుడంటే ఎంత భక్తో.. భారీ కానుకలు సమర్పించిన ఇన్ఫోసిస్‌ మూర్తి దంపతులు

Published Sun, Jul 16 2023 6:28 PM | Last Updated on Mon, Jul 17 2023 10:32 AM

infosys narayana murthy sudha murthy offers gold ornaments to tirumala lord balaji - Sakshi

ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి దంపతులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భారీ కానుకలు సమర్పించారు. సతీమణి సుధామూర్తి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆదివారం(జూలై 16) తిరుమలకు చేరుకున్న నారాయణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. 

స్వామివారికి ప్రత్యేకంగా చేయించిన బంగారు కానుకలను టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు గాను బంగారుతో ప్రత్యేకంగా శంఖం, కూర్మ ఆకృతులను తయారు చేయించారు. రెండు కేజీల పరిమాణంతో ఉన్న ఈ స్వర్ణాభరణాల విలువ కోటి రూపాయలు ఉంటుందని సమాచారం.

ఇదీ చదవండి  ఇన్ఫోసిస్‌ మూర్తిపై మహాభారత పాత్ర ప్రభావం.. అప్పట్లో కరుడుకట్టిన వామపక్షవాది! 

తిరుమల వేంకటేశ్వర స్వామిని సుధామూర్తి ఇష్టదైవంగా భావిస్తారు. ఏటా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. తొలిసారి తాను 1953లో తిరుమల కొండకు వచ్చానని, అప్పటి నుంచి 70 ఏళ్లుగా తిరుమలకు వస్తున్నానని సుధామూర్తి తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే సుధామూర్తి.. ప్రస్తుతం టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యురాలిగానూ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement