tirumala balaji
-
తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు.. భక్తుల ఆగ్రహం
సాక్షి, తిరుమల: తిరుమల ఆలయం వద్ద మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై మళ్లీ విమానం ఎగిరింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై విమానం ఎగరడం అపచారంగా భావిస్తారు. ఇటీవల తిరుమల ఆలయంపై వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనిత తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇంతలోనే తాజాగా విమానం చక్కర్లు కొట్టడం గమనార్హం.తిరుమలలో గురువారం ఉదయం ఓ విమానం తిరుమల శ్రీవారి ఆలయానికి దగ్గరగా వెళ్లింది. భక్తులు విమానం వెళ్లే సమయంలో విమానం చక్కర్లు కొట్టడంతో వారంతా ఫొటోలు, వీడియోలు తీశారు. అనంతరం, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్లకూడదని చెబుతారు. దీనిపై టీటీడీ గతంలోనూ కేంద్ర పౌరవిమానయాన శాఖ దృష్టికి తీసుకెళ్లింది.. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కోరింది. కానీ, కేంద్రం మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు.అయితే ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు వెళ్లకూడదని.. అపచారం అంటున్నారు. గతంలో తిరుమల శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో హెలికాప్టర్లు కూడా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇలా విమానం, హెలికాప్టర్లు వెళ్లిన ప్రతీసారి విజిలెన్స్ సిబ్బంది అలర్ట్ అవుతోంది. వివరాలు ఆరా తీస్తోంది. -
తిరుమల లడ్డూపై సీబీఐ సిట్ విచారణ
-
తిరుమల శ్రీనివాసుడికి ఇన్ఫోసిస్ మూర్తి దంపతుల భారీ కానుకలు
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి దంపతులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భారీ కానుకలు సమర్పించారు. సతీమణి సుధామూర్తి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆదివారం(జూలై 16) తిరుమలకు చేరుకున్న నారాయణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేకంగా చేయించిన బంగారు కానుకలను టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు గాను బంగారుతో ప్రత్యేకంగా శంఖం, కూర్మ ఆకృతులను తయారు చేయించారు. రెండు కేజీల పరిమాణంతో ఉన్న ఈ స్వర్ణాభరణాల విలువ కోటి రూపాయలు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి ➤ ఇన్ఫోసిస్ మూర్తిపై మహాభారత పాత్ర ప్రభావం.. అప్పట్లో కరుడుకట్టిన వామపక్షవాది! తిరుమల వేంకటేశ్వర స్వామిని సుధామూర్తి ఇష్టదైవంగా భావిస్తారు. ఏటా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. తొలిసారి తాను 1953లో తిరుమల కొండకు వచ్చానని, అప్పటి నుంచి 70 ఏళ్లుగా తిరుమలకు వస్తున్నానని సుధామూర్తి తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే సుధామూర్తి.. ప్రస్తుతం టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యురాలిగానూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
350 సార్లు తిరుమల మెట్లు ఎక్కిన శ్రీవారి భక్తుడు
శ్రీకాకుళం కల్చరల్: ఏడుకొండల వారిని ఒక్క క్షణం కళ్లారా చూడాలని కోట్లాది మంది మొక్కుతుంటారు. రెండు ఘడియల పాటు స్వామిని చూసే అవకాశం వస్తే జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అలాంటిది ఆయన 350 సార్లు తిరుమల మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. ప్రతి మెట్టు పరిచయమే అన్నట్లు ప్రతినెల కాలినడకన తిరుపతి కొండ ఎక్కడం అలవాటుగా మార్చుకున్నారు. తాను వెళ్లడమే కాదు 780 మందితో తిరుమలకు పాదయాత్ర కూడా చేసి గోవిందుడి ఆశీస్సులు పొందారు. పాదయాత్రలకు గాను ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించుకున్నారు. ఆయన పేరు మహంతి శ్రీనివాస్. ఊరు శ్రీకాకుళం. గోవింద వరల్డ్‌వైడ్ వాట్సాప్ గ్రూపు.. శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాస్‌కు తిరుమలేశుడంటే ఎనలేని భక్తి. ఇప్పటివరకు 350 సార్లు తిరుపతి మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. సెప్టెంబరు 6వ తేదీ ఏకాదశి పర్వదినాన 780 మందితో గ్రూపుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకోసం ‘గోవింద వరల్డ్‌వైడ్’ వా ట్సాప్ గ్రూపును రూపొందించారు. అందులో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు సభ్యులుగా చేరారు. ఈ గ్రూపులో జూన్ 25లోగా సెప్టెంబరు 6న మెట్ల మార్గం ద్వారా పాదయాత్రకు ఆసక్తి ఉన్న వారు తమ సమ్మతిని తెలపాలని కోరారు. సమ్మతి తెలిపిన వారు తిరుమలకు 5వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు హాజరు కావాలని సూచించారు. దీంతో కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ, ఒడి శా రాష్ట్రాల నుంచి 780 మందితో పాదయాత్ర కన్నుల పండువగా సాగింది. ఆ రోజు సాయంత్రం గోవిందరాజస్వామి దర్శనాలు, శ్రీపద్మావతి అమ్మ వారి దర్శనాలు చేసుకున్నాక, రాత్రి తిరుపతిలో బస చేసి, 6వ తేదీ ఉదయం 6 గంటలకు మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర ప్రారంభించారు. 2388 మెట్లను 150 నిమిషాలు నడచి తిరుమల చేరుకున్నారు. ఇది ఆయన 350వ పాదయాత్ర. ఆ దారిలోనే.. తిరుమల వెళ్లే భక్తులు సాధారణంగా ముందుగా తిరుమల వరకు నేరుగా వెళతారు. కానీ దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని శ్రీనివాస్ అంటారు. తిరుమల వెళ్లే భక్తులు ముందుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాక.. కొండపైకి చేరుకొని తలనీలాలు సమర్పించి, పుష్కర స్నానం చేసి ఆ తర్వాత వరాహ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవాలి. అలాగే కొండపై ఉన్న 6 ముఖ్యమైన ప్రదేశాలను దర్శించుకున్న తర్వాత యాత్ర పూర్తి అవుతుందని ఆయన చెబుతుంటారు. 350 సార్లు ఇలా.. 1996లో మొదటిసారిగా పాదయాత్ర ప్రారంభించారు. 1996 నుంచి 2016 వరకు 85 సార్లు వెళ్లారు. 2017లో ఆయన వయసు 50 ఏళ్లు ఆ ఏడాదే 50 సార్లు పాదయాత్ర చేశారు. 2018లో 71 సార్లు, 2019లో 50 సార్లు, 2020లో రెండు సార్లు(ఆ సమయంలో కరోనాతో గుడి మూసివేశారు). 2021లో 52 సార్లు, 2022లో 8 సెప్టెంబరుæ వరకు 40 సార్లు పాదయాత్ర నిర్వహించారు. మొత్తంగా 350 దఫాలు మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. ఇలా ఒకరోజులో ఒకసారిగా వెళ్లింది 193 సార్లు, ఒకరోజులో 2 సార్లు నడచింది 142సార్లు, ఒక రోజులో మూడుసార్లు నడిచింది 15 సార్లు కావడం విశేషం. ఆయనతో పాటు ఆయన భార్య కూడా 59 సార్లు, కుమారుడు కూడా 30 సార్లు పాదయాత్ర చేశారు. ఇప్పటికి 2వేల మంది భక్తులను తనతో పాటుగా తీసుకువెళ్లారు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం తిరుమలలో పనిచేసిన జిల్లాకు చెందిన ఉన్నతాధికారి రుంకు అప్పారావు స్ఫూర్తితో శ్రీనివాస్ ఈ పాదయాత్రలు చేశారు. రుంకు అప్పారావు 108 సార్లు మెట్ల ద్వారా పాదయాత్ర చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డు పొందారు. అయితే శ్రీనివాస్ 2019 జనవరి 27 వరకు 205 పర్యాయాలు మెట్ల యాత్ర చేశాక ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించి యోగ్యతాపత్రాన్ని, గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సర్టిఫికేటును అప్పటి ఈఓ అనిల్ సింఘాల్ చేతుల మీదుగా అందుకున్నారు. తిరిగి తన యాత్రను కొనసాగిస్తూ 258 పర్యాయాలు పూర్తి చేసినందుకు గాను 2020 మే8న ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. అలాగే టీటీడీ నిర్వహిస్తున్న సప్తగిరి మాస పత్రికలో శ్రీనివాస్‌పై వ్యాసం కూడా ప్రచురించారు. ప్రతి నెలా వెళ్తా.. నేను ప్రతి నెల తిరుమల వెళ్లి మెట్ల దారి నుంచి స్వామి దర్శనం చేసుకుంటాను. ఇప్పటి వరకు 350సార్లు పాదయాత్ర చేశాను. తిరుమల అంటే సాక్షాత్తు వైకుంఠధామమే. తిరుమల యాత్ర ఏవిధంగా చేయాలో అందరికీ చెబుతాను. ఎప్పటికప్పుడు తిరుమలలో జరిగే తాజా మార్పులను వాట్సాప్ గ్రూపు ద్వారా అందరికీ చేరవేస్తుంటాను. స్వామిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. – మహంతి శ్రీనివాస్, శ్రీకాకుళం -
‘పింక్ డైమండ్’ పిల్‌ను తోసిపుచ్చిన హైకోర్టు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మనుగడ విషయంలో తగిన విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. పింక్ డైమండ్ విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు కమిటీలు రెండు నివేదికలు ఇచ్చాయని, అందువల్ల దీనిపై మళ్లీ విచారణకు ఆదేశించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. చదవండి: నేడు పోలవరంపై కీలక భేటీ ఈ మేరకు సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పింక్ డైమండ్ విషయంలో విచారణకు ఆదేశించాలని కోరుతూ టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ అప్పటి ప్రధానార్చకులు రమణ దీక్షితులు, అప్పటి ఈవోలు ఐవైఆర్ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. సాయిరెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది. -
చిన్నతిరుమలేశుని సాక్షిగా..స్వాహా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అందినకాడికి దండుకోవడం.. అది బట్టబయలైతే సరిచేసుకోవడం. ఇదీ చినవెంకన్న సాక్షిగా ద్వారకాతిరుమల ఆలయంలో సాగిపోతున్న వ్యవహారం. ‘పెద్దల’ అండదండలు, అధికారుల ఆశీస్సులు ఉన్న కొందరు సిబ్బంది, వారు చేసిన తప్పులను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. వెంకన్న సొమ్ములు దిగమింగి ఏళ్లతరబడి దర్జాగా తిరుగుతున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుంటున్నారు. దీంతో ఇక్కడ అక్రమార్కులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ఎలాగో క్రిమినల్ చర్యలుండవు.. మహా అయితే సస్పెండ్ చేస్తారు. ఎలాగోలా నెల తిరక్కుండా మళ్లీ ఉద్యోగంలో చేరిపోవచ్చు. ఇది దేవస్థానంలోని కొందరు ఉద్యోగుల ధీమా.! రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం దినదినాభివృద్ది చెందుతోంది. భక్తుల రాకకు అనుగుణంగా స్వామి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అయితే ఈ దేవస్థానంలో కొందరు సిబ్బంది రూ.లక్షల్లో సొమ్ములు స్వాహా చేసి ఏళ్లు గడుస్తున్నా, వారిపై అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోక పోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఈఎండీలు, నేతిడబ్బాలు, కవర్ల స్కామ్‌లు దర్పణంగా నిలుస్తున్నాయి. పక్కదారిపట్టిన ఈఎండీలపై చర్యలేవీ.. శ్రీవారి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు గాను కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) సొమ్ము దేవస్థానానికి పూర్తిస్థాయిలో జమకావడం లేదని గతేడాది అక్టోబర్‌లో అప్పటి ఈవో వేండ్ర త్రినాథరావు గుర్తించారు. 2013 నుంచి 2016 మధ్య కాలంలో సుమారు 200 డీడీలకు సంబంధించి రూ. 10 లక్షలకు పైగా సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుసుకుని, దానిపై సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఆయన నోటీసులిచ్చారు. దీనిపై అప్పట్లో సాక్షి దినపత్రికలో ‘గోవిందా.. గోవింద’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇదిలా ఉంటే ఇంజినీరింగ్ విభాగ పీఎస్ చార్జెస్ ఉద్యోగి ఎల్టీ.కుమార్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించి కొన్ని డీడీలు అకౌంట్ సెక్షన్‌కు పంపకుండా పక్కన పడేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే మరికొన్ని డీడీలు పనులు పూర్తి కాకుండానే సంబంధిత కాంట్రాక్టర్లకు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న అధికారులు పక్కనపడేసిన డీడీలను అకౌంట్లో వేయించి, ఆడిట్లు చేయించారే గానీ ఇందుకు బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకన్నా... కవర్ల స్కామ్ ఏమైందయ్యా? శ్రీవారి ఆలయంలో ప్రసాదాల కవర్ల కొనుగోలులో సైతం కొందరు సిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. 2013లో దాదాపు రూ.15 లక్షల వరకు కవర్ల స్కామ్ జరిగినట్లు బట్టబయలైంది. దీనిపై అప్పట్లో సాక్షి దినపత్రికలో ‘ప్రసాదాల కవర్ల కొనుగోలులో కుంభకోణం’ శీర్షికన 2013 అక్టోబర్ 29 నుంచి వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై అప్పటి ఈవో వేండ్ర త్రినాథరావు విచారణ నిర్వహించి, కవర్ల కొనుగోలులో భారీ స్కామ్ జరిగినట్లు నిర్ధారించారు. దీనిపై ముగ్గురు ఉద్యోగులకు మెమోలు కూడా జారీ చేశారు. అలాగే కవర్లు తక్కువగా సరఫరా చేసి, ఎక్కువ బిల్లులు వసూలు చేయడంపై సంబంధిత కాంట్రాక్టర్‌కూ అధికారులు నోటీసులిచ్చారు. అధికారుల చర్యలను నిలుపుదల చేసేందుకు కొందరు ఉద్యోగులు అప్పట్లో జోరుగా పైరవీలు సాగించారు. ఇవి ఫలించడంతో అక్రమార్కులు ఈ స్కామ్ నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే కవర్లు సరఫరా చేసిన కాంట్రాక్టరు సెక్యూరిటీ నిమిత్తం దేవస్థానం వద్ద ఉంచిన సుమారు రూ. 15 లక్షలను అధికారులు రికవరీ చేసి, చేతులు దులుపుకున్నారు. సొమ్ము రికవరీ జరిగిందంటే.. ఇక్కడ తప్పు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అటువంటప్పుడు ఈ అవకతవకలు జరగడానికి కారకులైన ఉద్యోగులపై ఇప్పటి వరకు క్రిమినల్ చర్యలుగానీ, శాఖాపరమైన చర్యలుగానీ ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేతి డబ్బాల వ్యవహారంలో.. ఆలయంలో ఇటీవల కొందరు వంట స్వాములు మూడు నేతిడబ్బాలను పక్కదోవ పట్టించారు. విషయం తెలుసుకున్న అధికారులు వాటిని దాచిపెట్టిన ఇంటికెళ్లి మరీ స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఇంటి యజమాని ఫలానా ఉద్యోగులు తమ వద్ద నేతిడబ్బాలను ఉంచినట్లు చెప్పారు. అయితే ఆ ఉద్యోగులు తమకు సంబంధం లేదని, ఆ ఇంటి యజమానికి, తమకు పడకపోవడం వల్లే అలా చెబుతున్నారని అన్నారు. దీనిపై విచారణ నిర్వహించిన అధికారులు క్రిమినల్ చర్యలు తీసుకోకపోయినప్పటికీ కనీసం శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇందుకు బాధ్యులుగా భావించి, ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అయితే చిన్నచిన్న తప్పులు చేసే ఉద్యోగులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్న అధికారులు దేవుడి సొమ్మును రూ.లక్షల్లో స్వాహా చేస్తున్న ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెద్దల అండదండలున్న ఉద్యోగులకు అధికారులు సైతం కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు గోల్మాల్ అయిన సొమ్మును రికవరీ చేయడమే కాకుండా, అందుకు బాద్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. -
తిరుమలలో కిటకిట
-
వేంకటేశ్వరుని దర్శించుకున్న రాష్ట్రపతి
-
వేంకటేశ్వరుని దర్శించుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం నాడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కూడా ఉన్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఎస్డీ కపల్ స్వాగతంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అర్చకులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు.