
సాక్షి, తిరుమల: తిరుమల ఆలయం వద్ద మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై మళ్లీ విమానం ఎగిరింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై విమానం ఎగరడం అపచారంగా భావిస్తారు. ఇటీవల తిరుమల ఆలయంపై వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనిత తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇంతలోనే తాజాగా విమానం చక్కర్లు కొట్టడం గమనార్హం.
తిరుమలలో గురువారం ఉదయం ఓ విమానం తిరుమల శ్రీవారి ఆలయానికి దగ్గరగా వెళ్లింది. భక్తులు విమానం వెళ్లే సమయంలో విమానం చక్కర్లు కొట్టడంతో వారంతా ఫొటోలు, వీడియోలు తీశారు. అనంతరం, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్లకూడదని చెబుతారు. దీనిపై టీటీడీ గతంలోనూ కేంద్ర పౌరవిమానయాన శాఖ దృష్టికి తీసుకెళ్లింది.. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కోరింది. కానీ, కేంద్రం మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు.
అయితే ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు వెళ్లకూడదని.. అపచారం అంటున్నారు. గతంలో తిరుమల శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో హెలికాప్టర్లు కూడా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇలా విమానం, హెలికాప్టర్లు వెళ్లిన ప్రతీసారి విజిలెన్స్ సిబ్బంది అలర్ట్ అవుతోంది. వివరాలు ఆరా తీస్తోంది.

Comments
Please login to add a commentAdd a comment