ఇన్ఫోసిస్‌ను నడిపించిన ఈ ధీర వనితల్ని గుర్తుపట్టారా? వీరే లేకపోతే..! | Successful women behind the Infosys Dreamers  | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ను నడిపించిన ఈ ధీర వనితల్ని గుర్తుపట్టారా? వీరే లేకపోతే..!

Published Tue, Mar 21 2023 1:34 PM | Last Updated on Wed, Mar 22 2023 4:40 PM

Successful women behind the Infosys Dreamers  - Sakshi

సాక్షి, ముంబై: భారతీయ ఐటీ పరిశ్రమలో  రెండో అతిపెద్ద సంస్థగా ఇన్ఫోసిస్ తన సేవలతో దిగ్గజంగా నిలిచింది.  1981లో  టెక్‌ దిగ్గజం ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి మరో ఆరుగురు టెక్కీల కలల పంటగా ఇన్ఫోసిస్  ఆవిష్కారమైంది. 

ఏడు మంది ఇంజనీర్లు కలిసి, మహారాష్ట్ర పూణే లో 250 డాలర్ల పెట్టుబడితో 1981లో ప్రారంభించారు. 1981 జులై 2న ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గాఅవతరించింది. ఆ తరువాత 1983 నుంచి కర్ణాటకలోని బెంగుళూరుకు మారింది. 1992 ఏప్రిల్లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుని అదే ఏడాది  ఐపీవోకి వచ్చింది.   ఇక ఆ తరువాత  2011 జూన్ నాటికి ఇన్ఫోసిస్ లిమిటెడ్‌గా  సేవలందిస్తోంది. 

కలలైతే ఉన్నాయి, కానీ  డబ్బు లేదు. కానీ ముందుకు సాగాలనే  పట్టుదల, ధైర్యం, దృఢ నిశ్చయం, స్ట్రగుల్‌కి తోడుగా  నిలిచారు. ముగ్గురు  మహిళలు. వాకి ఎనలేని తోడ్పాటుతో వారు దూసుకుపోయారు ఇన్ఫోసిస్‌ డ్రీమర్లు.  ఫోన్లు లేవు.. కార్లు లేవు.. ఎలాంటి విందులు,  విలాసాలు లేవు.  ఉన్నదల్లా కంపెనీని నిలబెట్టాలనే ఆరాటం మాత్రమే. పగలూ రాత్రి అదే పోరాటం మాత్రమే వినూత్నంగా సృష్టించాలనే తపన తమను ముందుకు నడిపించిందంటారు నారాయణమూర్తి.

తగినంత సొమ్ము లేనపుడు ఇన్ఫోసిస్‌ ఫౌండర్స్‌కు వారి భార్యలనుంచి లభించిన సహకారం మద్దతు మాత్రం  కొండంత అండగా నిలిచింది.  ఆ రోజు వారందించిన సాయమే ఇన్ఫోసిస్‌ను టాప్‌ కంపనీగా నిలబెట్టింది. ఫలితంగా సుధామూర్తి, రోహిణి  నీలేకని,  కుమారి దేశంలో  అత్యంత ధనవంతులైన మహిళలుగా నిలిచారు. 

ఆ ముగ్గురు మూర్తులు వీరే

సుధా మూర్తి
ఇన్పీ నారాయణమూర్తి  భార్య సుధామూర్తి అంటే పరిచయం అవసరం లేని పేరు. తనదైన వ్యక్తిగతం, ఆదర్శ జీవితం, దాతృత్వంతో  అనేకమంది మనసు దోచుకున్న ఆదర్శమూర్తి. ఇన్ఫోసిస్ స్థాపనలో తన దగ్గర 10వేల రూపాయలను ఇచ్చిన నారాయణమూర్తిని సొంతకంపెనీ వైపు నడిపించిన ధీర వనిత.  ప్రస్తుతం ఇన్ఫోసిస్  ఛారిటీ, సోషల్ సర్వీసెస్ వింగ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు సుధా నాయకత్వం వహిస్తున్నారు. తన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత అవసరమైన వారికి ఇవ్వడంలోనే తనకు సంతోషం అంటరావిడ. 

రోహిణి నీలేకని
ఇన్ఫోసిస్ ఫౌండర్‌, ఆధార్‌ సృష్టికర్త నందన్‌ నీలేకని భార్య రోహిణి నీలకేని. ఇన్ఫోసిస్ కష్టాల్లో ఉన్న తొలి రోజుల్లో నందన్‌కు అండగా నిలిచారు. తన దగ్గరున్న 10వేల రూపాయలను సంస్థలో పెట్టుబడి పెట్టారు.  ఆ తరువాత ఇన్ఫోసిస్‌ అఖండ విజయంతో ధనవంతురాలిగా నిలిచారు.  జర్నలిస్టుగా తన కరియర్‌ ప్రారంభించిన రోహిణి ప్రముఖ రచయిత కూడా.  నవలలు, ట్రావెలాగ్‌లు,  టెక్‌ బుక్స్‌, పిల్లలకోసం బుక్స్‌ లాంటి  దాదాపు 19 పుస్తకాలు రాశారు. అలాగే అర్ఘ్యం , అక్షర లాంటి ఫౌండేషన్స్‌తో గొప్ప ఫిలాంత్రపిస్ట్‌గా నిలిచారు.  (రోహిణి నీలేకని గురించి ఈ విషయాలు తెలుసా? ఇన్పీలో ఆమె తొలి పెట్టుబడి ఎంతంటే?)

కుమారి శిబులాల్:
ఇన్ఫోసిస్ ఫౌండర్స్‌లో ఒకరైన  శిబులాల్  భార్య కుమారి శిబులాల్‌. గ్లోబల్‌ కస్టమర్ డెలివరీకి డైరెక్టర్, ఫౌండర్‌ కుమారి  ఇన్ఫోసిస్  అద్భుతమైన జర్నీలో కీలక పాత్ర పోషించారు. శిబులాల్, కుమారి  దంపతులు ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో బోస్టన్  సౌత్ షోర్ శివారులో నివసిస్తున్నప్పటికీ  ఆమె తరచూ ఇండియాలో సందడి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బెంగళూరులో పేద పిల్లలకు సహాయం కోసం  స్థాపించిన అక్షయ అనే స్వచ్ఛంద ట్రస్ట్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అక్షయ స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. 2002 సంవత్సరంలో   వెయ్యి మంది  పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్స లకు స్పాన్సర్‌గా నిలవడం విశేషంగా  నిలిచింది.   మనం చేసే సమాయం సముద్రంలో నీటి బిందువు లాంటిది..కానీ చుక్క చుక్క కలిస్తే సముద్రం.. ఆమాత్రం మనం చేయకపోతే  ఎలా అంటారు  కుమారి శిబులాల్. ఆమె మంచి  క్రీడా ప్రేమికురాలు కూడా.  ఈ నేపథ్యంలోనే స్వస్థలమైన కేరళలో ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌ను స్థాపించడానికి ఘన సాయం అందింబారు.  గోల్డెన్‌ గర్ల్‌, అథ్టెట్‌, పీటీ ఉషకు ఈ విషయంలో అండగా నిలిచారు. అంతేకాదు ఉషా స్కూల్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన ఆరుగురు విద్యార్థులకు అక్షయ ట్రస్ట్‌ పూర్తిగా స్పాన్సర్‌ చేసింది.  

ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్స్‌ 
ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తి
నందన్‌ నీలేకని 
ఎస్‌. గోపాలకృష్ణన్‌
ఎస్ డి షిబులాల్ 
కే. దినేష్‌
ఎన్‌ఎస్‌ రాఘవన్‌
అశోక్‌ అరోరా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement