ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి లింగ సమానత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితం అనే బండికి చక్రల్లాంటివారు. జీవన యానం సాఫీగా సాగాలంటే ఇద్దరూ ఉండాలి.. తన దృష్టిలో స్త్రీపురుషులిద్దరూ సమానమే కానీ, వేర్వేరు మార్గాల్లో అన్నారు.
లింగ సమానత్వం అంటే ఏమిటో వివరిస్తూ ఒక వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. స్త్రీ, పురుషులు సైకిల్‌కి రెండు చక్రాల్లాంటివారు. వీరిలో ఎవరూ లేకపోయినా బండి ముందుకు సాగదు.. అని ఇన్ఫోసిస్ మాజీ చైర్‌పర్సన్ శ్రీమతి మూర్తి పేర్కొన్నారు.
In my view, men and women are equal but in different ways. They complement each other like two wheels of a bicycle; you can't move forward without the other. pic.twitter.com/MMShEOtg9Q
— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 27, 2024
మహిళలు పురుషులు ఇద్దరూ ఒకరికొకరు భిన్నం. ఇద్దరిలోనూ ప్లస్, మైనస్‌లు ఉంటాయి. అయితే పురుషులతో పోలిస్తే మహిళలకు చాలా భాష తెలుసు. మేనేజ్‌మెంట్‌లో వారు చాలా అద్భుతం. పుట్టుకతోనే వారు మంచి మేనేజర్లు. ప్రేమ, జాలి కరుణ ఎక్కువ. అమ్మ, నాన్న, తోబుట్టువులు, అత్తమామలు, వదినలు, పిల్లలు ఇలా సన్నిహిత బంధువులు అందరికీ చక్కటి ప్రేమను పంచుతారు. మరోవైపు పురుషులు మహిళలంత భావోద్వేగులు కాదు. కొంచెం భిన్నం. పురుషుల్లో మంచి ఐక్యూ ఉండివచ్చు కానీ,మంచి ఈక్యూ (ఎమోషనల్ కోషెంట్) ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment