IT major
-
ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్?
సాక్షి,ముంబై: ఐటీ కంపెనీల్లో ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్ ఇస్తోంది. తాజా సమాచారం ప్రకారం దాదాపు 15 నెలలకు పైగా ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు మరో పరీక్ష విధించనుంది. ఇలాంటి శిక్షణను ఇప్పటికే పూర్తి చేసినప్పటికీ, మరోసారి ప్రాజెక్ట్ రెడీనెస్ ప్రోగ్రామ్ (పీఆర్పీ) శిక్షణ అంటే.. ఈ సాకుతో కొంతమంది ఫ్రెషర్స్‌ను తొలగించేందుకేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వేతనాల్లో సగం కోతం విధించిన తరువాత కూడా ఆన్‌బోర్డింగ్ కష్టాలకు తెరపడటం లేదు. (ఇదీ చదవండి: Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్) ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రెషర్ల వేతనాలను రూ.6.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. తాజా పరీక్షలో ఫ్రెషర్స్ కనీసం 60 శాతం ఓవరాల్ స్కోర్‌తో, పీఆర్పీ శిక్షణను ఉద్యోగులు క్లియర్ చేయకపోతే, వారు వెంటనే తొలగించబడతారని వారికి పంపిన సూచనలలో కంపెనీ పేర్కొన్నట్టు సమాచారం. అయితే దీనిపై విప్రో అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఐటీ మేజర్ తీసుకుంటున్న చర్యలు అనైతికం, అన్యాయమని, ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు. కంపెనీ పాలసీలో ఆకస్మిక మార్పులు ఉద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయని వ్యాఖ్యానించారు. (ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైనా చార్జీలు!) -
ఇన్ఫోసిస్‌ను నడిపించిన ఈ ధీర వనితల్ని గుర్తుపట్టారా? వీరే లేకపోతే..!
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ పరిశ్రమలో రెండో అతిపెద్ద సంస్థగా ఇన్ఫోసిస్ తన సేవలతో దిగ్గజంగా నిలిచింది. 1981లో టెక్ దిగ్గజం ఎన్ఆర్ నారాయణ మూర్తి మరో ఆరుగురు టెక్కీల కలల పంటగా ఇన్ఫోసిస్ ఆవిష్కారమైంది. ఏడు మంది ఇంజనీర్లు కలిసి, మహారాష్ట్ర పూణే లో 250 డాలర్ల పెట్టుబడితో 1981లో ప్రారంభించారు. 1981 జులై 2న ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గాఅవతరించింది. ఆ తరువాత 1983 నుంచి కర్ణాటకలోని బెంగుళూరుకు మారింది. 1992 ఏప్రిల్‌లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుని అదే ఏడాది ఐపీవోకి వచ్చింది. ఇక ఆ తరువాత 2011 జూన్ నాటికి ఇన్ఫోసిస్ లిమిటెడ్‌గా సేవలందిస్తోంది. కలలైతే ఉన్నాయి, కానీ డబ్బు లేదు. కానీ ముందుకు సాగాలనే పట్టుదల, ధైర్యం, దృఢ నిశ్చయం, స్ట్రగుల్‌కి తోడుగా నిలిచారు. ముగ్గురు మహిళలు. వాకి ఎనలేని తోడ్పాటుతో వారు దూసుకుపోయారు ఇన్ఫోసిస్ డ్రీమర్లు. ఫోన్లు లేవు.. కార్లు లేవు.. ఎలాంటి విందులు, విలాసాలు లేవు. ఉన్నదల్లా కంపెనీని నిలబెట్టాలనే ఆరాటం మాత్రమే. పగలూ రాత్రి అదే పోరాటం మాత్రమే వినూత్నంగా సృష్టించాలనే తపన తమను ముందుకు నడిపించిందంటారు నారాయణమూర్తి. తగినంత సొమ్ము లేనపుడు ఇన్ఫోసిస్ ఫౌండర్స్‌కు వారి భార్యలనుంచి లభించిన సహకారం మద్దతు మాత్రం కొండంత అండగా నిలిచింది. ఆ రోజు వారందించిన సాయమే ఇన్ఫోసిస్‌ను టాప్ కంపనీగా నిలబెట్టింది. ఫలితంగా సుధామూర్తి, రోహిణి నీలేకని, కుమారి దేశంలో అత్యంత ధనవంతులైన మహిళలుగా నిలిచారు. ఆ ముగ్గురు మూర్తులు వీరే సుధా మూర్తి ఇన్పీ నారాయణమూర్తి భార్య సుధామూర్తి అంటే పరిచయం అవసరం లేని పేరు. తనదైన వ్యక్తిగతం, ఆదర్శ జీవితం, దాతృత్వంతో అనేకమంది మనసు దోచుకున్న ఆదర్శమూర్తి. ఇన్ఫోసిస్ స్థాపనలో తన దగ్గర 10వేల రూపాయలను ఇచ్చిన నారాయణమూర్తిని సొంతకంపెనీ వైపు నడిపించిన ధీర వనిత. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఛారిటీ, సోషల్ సర్వీసెస్ వింగ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు సుధా నాయకత్వం వహిస్తున్నారు. తన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత అవసరమైన వారికి ఇవ్వడంలోనే తనకు సంతోషం అంటరావిడ. రోహిణి నీలేకని ఇన్ఫోసిస్ ఫౌండర్, ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకని భార్య రోహిణి నీలకేని. ఇన్ఫోసిస్ కష్టాల్లో ఉన్న తొలి రోజుల్లో నందన్‌కు అండగా నిలిచారు. తన దగ్గరున్న 10వేల రూపాయలను సంస్థలో పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత ఇన్ఫోసిస్ అఖండ విజయంతో ధనవంతురాలిగా నిలిచారు. జర్నలిస్టుగా తన కరియర్ ప్రారంభించిన రోహిణి ప్రముఖ రచయిత కూడా. నవలలు, ట్రావెలాగ్లు, టెక్ బుక్స్, పిల్లలకోసం బుక్స్ లాంటి దాదాపు 19 పుస్తకాలు రాశారు. అలాగే అర్ఘ్యం , అక్షర లాంటి ఫౌండేషన్స్‌తో గొప్ప ఫిలాంత్రపిస్ట్‌గా నిలిచారు. (రోహిణి నీలేకని గురించి ఈ విషయాలు తెలుసా? ఇన్పీలో ఆమె తొలి పెట్టుబడి ఎంతంటే?) కుమారి శిబులాల్: ఇన్ఫోసిస్ ఫౌండర్స్‌లో ఒకరైన శిబులాల్ భార్య కుమారి శిబులాల్. గ్లోబల్ కస్టమర్ డెలివరీకి డైరెక్టర్, ఫౌండర్ కుమారి ఇన్ఫోసిస్ అద్భుతమైన జర్నీలో కీలక పాత్ర పోషించారు. శిబులాల్, కుమారి దంపతులు ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో బోస్టన్ సౌత్ షోర్ శివారులో నివసిస్తున్నప్పటికీ ఆమె తరచూ ఇండియాలో సందడి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బెంగళూరులో పేద పిల్లలకు సహాయం కోసం స్థాపించిన అక్షయ అనే స్వచ్ఛంద ట్రస్ట్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అక్షయ స్కాలర్షిప్లను అందిస్తుంది. 2002 సంవత్సరంలో వెయ్యి మంది పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్స లకు స్పాన్సర్‌గా నిలవడం విశేషంగా నిలిచింది. మనం చేసే సమాయం సముద్రంలో నీటి బిందువు లాంటిది..కానీ చుక్క చుక్క కలిస్తే సముద్రం.. ఆమాత్రం మనం చేయకపోతే ఎలా అంటారు కుమారి శిబులాల్. ఆమె మంచి క్రీడా ప్రేమికురాలు కూడా. ఈ నేపథ్యంలోనే స్వస్థలమైన కేరళలో ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ను స్థాపించడానికి ఘన సాయం అందింబారు. గోల్డెన్ గర్ల్, అథ్టెట్, పీటీ ఉషకు ఈ విషయంలో అండగా నిలిచారు. అంతేకాదు ఉషా స్కూల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఆరుగురు విద్యార్థులకు అక్షయ ట్రస్ట్ పూర్తిగా స్పాన్సర్ చేసింది. ఇన్ఫోసిస్ కో ఫౌండర్స్ ఎన్ ఆర్ నారాయణమూర్తి నందన్ నీలేకని ఎస్. గోపాలకృష్ణన్ ఎస్ డి షిబులాల్ కే. దినేష్ ఎన్ఎస్ రాఘవన్ అశోక్ అరోరా -
"ఓన్లీ ప్యాకేజ్, నో బ్యాగేజీ" ఉద్యోగ కోతలపై మామూలు చురకలు కాదు! వైరల్ వీడియో
న్యూఢిల్లీ: మేజర్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోతపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గూగుల్; మెటా, అమెజాన్ ట్విటర్, మెటా కంపెనీల్లో ఇటీవలి కాలంలో వేలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగులు ఆయా కంపెనీల్లో తమ సుదీర్ఘ జర్నీని, ఉన్నట్టుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వైనంపై తమ బాధాకరమైన అనుభవాల్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. టెక్ పరిశ్రమలో భారీ తొలగింపులపై అభిప్రాయాన్ని తెలియజేస్తూ,సోషల్ మీడియాలో తాజాగా కమెడియన్, యూట్యూబర్ శ్రద్ధా జైన్ (అయ్యో శ్రద్ధ) ఒక హిల్లేరియస్ వీడియోను షేర్ చేశారు. భారీ లాభాలను ఆర్జించినప్పటికీ టెకీలను తొలగించడంపై ఆమె వ్యంగ్య బాణాలు సంధించారు. లైడ్ ఆఫ్టెకీ పేరుతో షేర్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్ను తెగ షేర్ అవుతోంది. లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ సామూహిక తొలగింపులపై టెక్ కంపెనీలపై ఆమె వ్యంగ్య హాస్య దోరణిలో ధ్వజమెత్తారు. ఆమె మాట్లాడిన ప్రతీ మాటా ఒక తూటా. కంపెనీ ఆఫ్‌సైట్‌లో, ఒక ఏడాదిలో కంపెనీ లాభాలను మూడు రెట్లు పెంచాం. ఏమి జరిగింది? ఒక నెల తరువాత ఏమైంది? మమ్మల్ని ఎవరు దోచుకున్నారు?" ఆమె ఒక టెకీగా ప్రశ్నించారు. కంపెనీ ఉద్యోగం లేదు కానీ, కంపెనీ ఇచ్చిన టీ-షర్ట్, బ్యాగ్, వాటర్ బాటిల్, పెన్, నోట్‌బుక్, క్యాప్, కాఫీ మగ్, మాస్క్, వీకెండ్స్..ఇలా ప్రతీదీ పాత కంపెనీని గుర్తుచేస్తూ ఉంటుందన్నారు. ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటూనే ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారని పరోక్షంగా విమర్శించారు. చివరగా బ్యాగేజీ కాదు, ప్యాకేజీ కావాలంటూ చణుకులు విసిరారు. "ఈ కంపెనీని ఇప్పుడు మర్చిపోవడం కంటే నా మాజీని మర్చిపోవడం చాలా సులభం," "తదుపరి ఉద్యోగం ఏదైనా ఓన్లీ ప్యాకేజీ అంటూ కంపెనీలకు చురకలేశారు. దీంతో ప్రస్తుత ట్రెండ్‌పై సరైన అవగాహనతో వీడియో చేశారంటూ అందరూ ప్రశంసించారు."ట్రూత్ టు ది పవర్ ఇన్ఫినిటీ" అంటూ యూజర్, దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన, సృజనాత్మక ,అసలైన కమెడియన్ అంటూ మరొకరు ప్రశసించారు. ముఖ్యంగా వ్యాపారవేత్త, RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకాను ఈ వీడియో ఆకట్టుకుంది. ట్విటర్లో దీన్ని షేర్ చేయడం విశేషం. 7 లక్షలకు పైగా వ్యూస్, ట్విటర్ 183,000 వ్యూస్‌ను సొంతం చేసుకుంది. A laid off techie….this is so funny @AiyyoShraddha pic.twitter.com/uIlVwHeX21 — Harsh Goenka (@hvgoenka) January 30, 2023 -
విప్రో హిట్టా.. ఫట్టా?
ముంబై: వరుసగా ఐటి దిగ్గజాలు మార్కెట్ వర్గాలను నిరాశ పరుస్తున్న నేపథ్యంలో సోమవారం మరో సాఫ్ట్ వేర్ దిగ్గజం విప్రో ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది. 2016 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్ -జూన్ మొదటి త్రైమాసికంలో రూ 13,794 కోట్ల అమ్మకాలతో రూ 2,181 కోట్ల నికర లాభం ఆర్జించవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. గత సంవత్సరపు చివరి( ప్రీవియస్) క్వార్టర్ లోరూ. 13,741 కోట్ల అమ్మాకలతో రూ. 2,235 నికర లాభాన్ని ఆర్జించింది. అటు డాలర్ ఆదాయంలో కూడా 2.4 శాతం జంప్ ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు విప్రో ప్రకటించే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గైడెన్స్ పై విశ్లేషకులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఆదాయ వృద్ధి మార్గదర్శకత్వం, పెద్ద ఒప్పందం విజయాలపై సంస్థ విశ్లేషణ, రాంప్ అప్ షెడ్యూల్ తదితర అంశాలకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విప్రో డాలర్ రెవెన్యూ 1,882 మిలియన్ డాలర్లనుంచి 1,926 మిలియన్ల డాలర్ల వరకు పెరగొచ్చని అంచనా. దాదాపు 2.1 ఆదాయ వృద్ధి నమోదు చేయనుందని భావిస్తున్నారు. అయితే అమెరికా మార్కెట్ లో 2016 మొదటి క్వార్టర్ లో విప్రో వ్యాపారం కొద్దిగా నెమ్మదించిందని కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో విప్రో చీఫ్ అజీం ప్రేమ్ జీ సోమవారం ప్రకటించారు. రాబోయే ఆరు నెలల్లో పుంజుకుంటామని తెలిపారు. స్థూల లాభం లేదా ఎబిట్టామార్జిన్ (ఆసక్తి, పన్నులు ముందు ఆదాయాలు) హెల్త్ ప్లాన్ సర్వీసెస్ ఇంటిగ్రేషన్ , అధిక వీసా ఖర్చులు కారణంగా మునుపటి త్రైమాసికంతో 20.1 శాతం పోలిస్తే 18.5 శాతంగా నమోదు కావచ్చని భావిస్తున్నారు. -
విప్రోకు గోల్డెన్ పీకాక్ అవార్డ్
బెంగళూరు: విప్రో కంపెనీకి ఈ ఏడాది గోల్డెన్ పీకాక్ అవార్డ్ లభించింది. తాము రూపొం దించిన ఏష్యూర్ హెల్త్ సొల్యూషన్కు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్/సర్వీస్ కేటగిరిలో ఈ అవార్డ్ లభించిందని విప్రో సోమవారం తెలిపింది. రోగి కేంద్రంగా తాము ఈ చౌక హెల్త్‌కేర్ సొల్యూషన్‌ను రూపొందించామని పేర్కొం ది. కేరళలో జరిగిన 24వ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ టోటల్ క్వాలిటీ అండ్ లీడర్షిప్ కార్యక్రమంలో ఈ అవార్డ్‌ను స్వీకరించామని పేర్కొంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెరైక్టర్స్ సంస్థ కార్పొరేట్ ఎక్స్‌లెన్స్‌లో అత్యుత్తమ ప్రమాణాలు సాధించిన సంస్థలకు 1992 నుంచి గోల్డెన్ పీకాక్ అవార్డులనందజేయడం ఆరంభించింది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల నుంచి వచ్చే 1,000 ఎంట్రీల నుంచి విజేతలను ఎంపిక చేస్తారు.