విప్రోకు గోల్డెన్ పీకాక్ అవార్డ్ | Wipro gets Golden Peacock Award 2014 | Sakshi

విప్రోకు గోల్డెన్ పీకాక్ అవార్డ్

Jun 10 2014 1:43 AM | Updated on Sep 2 2017 8:33 AM

విప్రోకు గోల్డెన్ పీకాక్ అవార్డ్

విప్రోకు గోల్డెన్ పీకాక్ అవార్డ్

విప్రో కంపెనీకి ఈ ఏడాది గోల్డెన్ పీకాక్ అవార్డ్ లభించింది. తాము రూపొం దించిన ఏష్యూర్ హెల్త్ సొల్యూషన్‌కు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్/సర్వీస్ కేటగిరిలో ఈ అవార్డ్ లభించిందని విప్రో సోమవారం తెలిపింది.

బెంగళూరు: విప్రో కంపెనీకి ఈ ఏడాది గోల్డెన్ పీకాక్ అవార్డ్ లభించింది. తాము రూపొం దించిన ఏష్యూర్ హెల్త్ సొల్యూషన్‌కు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్/సర్వీస్ కేటగిరిలో ఈ అవార్డ్ లభించిందని విప్రో సోమవారం తెలిపింది. రోగి కేంద్రంగా తాము ఈ చౌక హెల్త్‌కేర్ సొల్యూషన్‌ను రూపొందించామని పేర్కొం ది.  కేరళలో జరిగిన 24వ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ టోటల్ క్వాలిటీ అండ్ లీడర్షిప్ కార్యక్రమంలో ఈ అవార్డ్‌ను స్వీకరించామని పేర్కొంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెరైక్టర్స్ సంస్థ  కార్పొరేట్ ఎక్స్‌లెన్స్‌లో అత్యుత్తమ ప్రమాణాలు సాధించిన సంస్థలకు 1992 నుంచి గోల్డెన్ పీకాక్ అవార్డులనందజేయడం ఆరంభించింది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల నుంచి వచ్చే 1,000 ఎంట్రీల నుంచి విజేతలను ఎంపిక చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement