సాక్షి, ముంబై: ఇన్ఫీ సుధా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వానికి ఆమె ఒక ప్రత్యేక ఉదాహరణ అని చెబుతూ ఉంటారు. అయితే ఈ సారి మాత్రం ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, సుధా మూర్తి రచయిత్రిగా, విద్యావేత్తగా, పరోపకారిగా మాత్రమే కాకుండా ఒక్కోసారి తన విశాల హృదయంతో చాలా ప్రత్యేకంగా నిలుస్తారు. తాజాగా 2019 నాటి ఒక ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే కొంతమంది ఈ ఫోటోపై నెగిటివ్‌గా స్పందిస్తుండగా, మరికొంతమంది పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఆమె ఒకరోల్ మోడల్ అంటూ ప్రశంసిస్తున్నారు.
ఎన్‌డీటీవీ కథనం ప్రకారం మైసూరు రాజ కుటుంబానికి చెందిన ప్రమోదా దేవి వడియార్ కాళ్లకు మొక్కుతున్న ఒకటి విశేషంగా నిలిచింది. ఇదే పిక్‌లొ అలనాటి అందాల నటి బి. సరోజా దేవిని కూడా గుర్తించవచ్చు. మైసూర్ రాష్ట్ర చివరి పాలకుడు జయచామరాజ వడియార్ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన క్రమంలో ఈ ఫోటో తీసినట్టు తెలుస్తోంది. ప్రమోదా దేవి వడియార్ దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ భార్య.
Sudha Murthy bowing before a member of the mysore royal family. She is supposed to be a role model.
— Kamran (@CitizenKamran) September 26, 2022
Is this still a tradition of greeting the members of Royal family in India?
Or was it more like an action out of reverence or respect? pic.twitter.com/1xSedjLXXB

Comments
Please login to add a commentAdd a comment