తన అల్లుడు ఎంతో మంచివాడని, ఆయన్ని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉందని అంటున్నారు ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి. లండన్ విద్యాభవన్‌లో జరిగిన దీవాళి గళా కార్యక్రమంలో ఆమె భారతీయ విలువలు, సంస్కృతి మీద మాట్లాడుతూ..
మనిషికి మంచి చదువే కాదు.. సంప్రదాయ మూలాలు కూడా ముఖ్యమేనని అంటున్నారు సుధా మూర్తి. శనివారం లండన్‌లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్‌లో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూతురు అక్షతా మూర్తి, ఆమె భర్త..బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌లు హాజరయ్యారు.
మంచి విద్య మీకు పైకి ఎగరడానికి(ఎదగడానికి) రెక్కలను ఇస్తుంది, కానీ గొప్ప సంస్కృతి మిమ్మల్ని మీ మూలాల్లో నిలబెట్టేలా చేస్తుంది. ఉషా సునాక్(రిషి తల్లి) ఆయన్ని(రిషి) అద్భుతంగా పెంచారు. ఆ పెంపక పునాదుల్లో.. బలమైన భారతీయ సంస్కృతి ఉంది. సునాక్ బ్రిటిష్ జాతి గర్వించదగ్గ వ్యక్తి. అదే సమయంలో.. ఆయన భారతీయ వారసత్వంలో విలువలు కూడా కనిపిస్తాయి అంటూ అల్లుడిని ఆకాశానికెత్తారామె.
ఈ సందర్భంగా.. భారతీయ కళను, సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు భారతీయ విద్యాభవన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. భారతీయ సంప్రదాయాల్ని నేర్చుకునేందుకు మీ పిల్లలను ఇక్కడికి(విద్యాభవన్)కు పంపండి. మనం ఒక వయసుకి వచ్చాక.. మన మూలాలను తాకాల్సి ఉంటుంది అంటూ ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్‌లు సైతం హాజరయ్యారు. విద్యాభవన్ నిర్వాహకులకు రిషి, అక్షతలు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్,
అంతకు ముందు.. భవన్ యూకే చైర్మన్ సుభాను సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎన్ నందకుమారలు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే.. భారత కళలను ఎలా ప్రదర్శిస్తున్న తీరును, ఆ సెంటర్ సాధించిన విజయాల్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. రామాయణం, కలిపూజ వంటి అంశాలను ప్రస్తావించారు. పలువురు కళాకారులు భారతీయ నృత్య కళలు ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment