Indian culture
-
‘మా అల్లుడు వెరీగుడ్’: సుధా మూర్తి
తన అల్లుడు ఎంతో మంచివాడని, ఆయన్ని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉందని అంటున్నారు ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి. లండన్ విద్యాభవన్‌లో జరిగిన దీవాళి గళా కార్యక్రమంలో ఆమె భారతీయ విలువలు, సంస్కృతి మీద మాట్లాడుతూ..మనిషికి మంచి చదువే కాదు.. సంప్రదాయ మూలాలు కూడా ముఖ్యమేనని అంటున్నారు సుధా మూర్తి. శనివారం లండన్‌లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్లో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూతురు అక్షతా మూర్తి, ఆమె భర్త..బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌లు హాజరయ్యారు.మంచి విద్య మీకు పైకి ఎగరడానికి(ఎదగడానికి) రెక్కలను ఇస్తుంది, కానీ గొప్ప సంస్కృతి మిమ్మల్ని మీ మూలాల్లో నిలబెట్టేలా చేస్తుంది. ఉషా సునాక్(రిషి తల్లి) ఆయన్ని(రిషి) అద్భుతంగా పెంచారు. ఆ పెంపక పునాదుల్లో.. బలమైన భారతీయ సంస్కృతి ఉంది. సునాక్ బ్రిటిష్ జాతి గర్వించదగ్గ వ్యక్తి. అదే సమయంలో.. ఆయన భారతీయ వారసత్వంలో విలువలు కూడా కనిపిస్తాయి అంటూ అల్లుడిని ఆకాశానికెత్తారామె.ఈ సందర్భంగా.. భారతీయ కళను, సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు భారతీయ విద్యాభవన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. భారతీయ సంప్రదాయాల్ని నేర్చుకునేందుకు మీ పిల్లలను ఇక్కడికి(విద్యాభవన్)కు పంపండి. మనం ఒక వయసుకి వచ్చాక.. మన మూలాలను తాకాల్సి ఉంటుంది అంటూ ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్లు సైతం హాజరయ్యారు. విద్యాభవన్ నిర్వాహకులకు రిషి, అక్షతలు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్,అంతకు ముందు.. భవన్ యూకే చైర్మన్ సుభాను సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎన్ నందకుమారలు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే.. భారత కళలను ఎలా ప్రదర్శిస్తున్న తీరును, ఆ సెంటర్ సాధించిన విజయాల్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. రామాయణం, కలిపూజ వంటి అంశాలను ప్రస్తావించారు. పలువురు కళాకారులు భారతీయ నృత్య కళలు ప్రదర్శించారు. -
వరి అంటే ఆహారం మాత్రమే కాదు, మన కరెన్సీ కూడా!
‘అన్నం గురించి చెప్పండి’ అని అడిగితే... ‘రోజూ తింటాం’ అనేవాళ్లే ఎక్కువ. ‘మీకు తెలిసిన వరివంగడాల గురించి చెప్పండి’ అని అడిగితే... ఒకటి, రెండు మాత్రమే చెప్పేవాళ్లు ఎక్కువ. అంతేనా! ‘కాదు... ఎంతో ఉంది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ వినయ్ వారణాసి. భారతీయ సంస్కృతిలో అన్నం, సంప్రదాయ వరి ధాన్యాల ప్రాముఖ్యతను చెబుతున్న వినయ్ ప్రసంగాలు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి.మనం ఎప్పుడూ వినని కొత్త కథలు కాదు. అయితే వాటిని కొత్తగా ఎలా చెప్పవచ్చో వినయ్ ప్రసంగాలు వింటే అర్థం అవుతుంది. అన్నంతో సంబంధం ఉన్న వివిధ ఆచారాలు, వాటి పట్ల రుషులకు ఉన్న భక్తి, మనిషి జీవితాన్ని నిలబెట్టడంలో దాని విలువైన పాత్ర, దైవత్వానికి దాని ప్రతీకాత్మక సంబంధం గురించి వివరిస్తాడు. అన్నదానం చేసే ప్రక్రియను పౌరాణిక కథల ద్వారా చెబుతాడు. ‘మన దేశంలో బియ్యం అనేది సామాజిక, ఆర్థిక కరెన్సీ’ అంటున్న వినయ్ ‘స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్’ అనే సంస్థతో కలిసి బడులను నుంచి వ్యవసాయ కళాశాలల వరకు వరి ధాన్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.‘ఎన్నో రకాల వరి వంగడాలను పునరుద్ధరించడంపై మేము దృష్టి సారించాం. ప్రతి దానికి దాని ప్రత్యేకమైన ఆకృతి. రంగు, వాసనకు పేరు ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు కన్యాకుమారిలో కనిపించే అనికొంబస్ ఇప్పుడు అంతరించిపోయింది. అనేక దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి’ అంటుంది ‘స్పిరిట్ ఆఫ్ ఎర్త్’ ఫౌండర్ షీలా బాలాజి. ప్రాచీన వరి వంగడాల పునర్జీవానికి వాటి గురించి అవగాహన కలిగించడం అనేది కీలకం.హైబ్రిడ్ వరి వంగడాల వైపు ఎక్కువగా దృష్టి సారించడం వల్ల అనేక సంప్రదాయ వరి రకాలు క్షీణించాయి. ఎక్కువమంది ఈ పురాతన రకాలపై ఆసక్తి చూపితే సహజంగానే వాటికి డిమాండ్ పెరుగుతుంది. పెరిగిన డిమాండ్ మన వ్యవసాయ వైవిధ్యాన్ని కాపాడుతుంది. దీనికి అవగాహన కల్పించడం అవసరం. ఆ పనిని సగర్వంగా భుజాల కెత్తుకున్నాడు వినయ్ వారణాసి.ఇక వినయ్ మల్టీ టాలెంట్ విషయానికి వస్తే... ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ మాత్రమే కాదు ఆర్కిటెక్ట్, డిజైన్ రిసెర్చర్, క్లాసిక్ మ్యూజిక్ లిరిసిస్ట్, డిజైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘అన్బైండ్’ ఫౌండర్. -
Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా!
పురాణాలు ఇప్పుడు కాలక్షేపం కోసం కాదు. వయసు మళ్లిన వారి కోసం మాత్రమే కాదు. మిలీనియల్స్ నుంచి జెన్ జెడ్ వరకు యువతరం పురాణాలను ఇష్టపడుతోంది. అయితే అది చదువు రూపంలో కాదు. గేమింగ్ రూపంలో. ఇండియన్ మైథలాజికల్ గేమ్స్‌ను ఆడడానికి గేమర్స్‌లో 82 శాతం మంది ఇష్టపడుతున్నట్లు చెబుతోంది గేమింగ్ అండ్ ఇంటరాక్టివ్ మీడియా ఫండ్ సంస్థ లుమికై. అర్జునుడి నుంచి కర్ణుడి వరకు రకరకాల పురాణపాత్రలలో ‘ప్లేయర్’ రూపంలో పరకాయ ప్రవేశం చేస్తోంది యువతరం...వెల్కమ్ టు గేమ్ జోన్..అహ్మదాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని శాన్వీకి గేమింగ్ అంటే బోలెడంత ఇష్టం. ఎక్కువ సమయాన్ని టెక్ట్స్బుక్స్తోనే గడిపే శాన్వీ కాసేపు వీడియో గేమ్స్ ఆడడం ద్వారా రిలాక్స్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డెత్స్ డోర్’ నుంచి ‘మాన్స్టర్ హంటర్’ వరకు ఎన్నో గేమ్స్ ఆడింది. అయితే ఒక ఫ్రెండ్ సలహా ప్రకారం కొన్ని నెలల క్రితం తొలిసారిగా ఇండియన్ మైథలాజికల్ గేమ్ ఆడింది. ఇక అప్పటి నుంచి అలాంటి గేమ్స్ మాత్రమే ఆడుతోంది.‘మైథలాజికల్ గేమ్స్‌కు ఇతర గేమ్స్‌కు తేడా ఏమిటో తొలిసారిగా తెలుసుకున్నాను. ఇవి కేవలం కాలక్షేప ఆటలు కావు. పురాణ జ్ఞానాన్ని, తార్కిక శక్తిని పెంచుతాయి’ అంటుంది శాన్వీ. ‘చిన్న పట్టణాలతోపాటు గ్రామీణ ్రపాంతాలలో కూడా స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగింది. మన దేశంలో పెద్ద గేమింగ్ కన్జ్యూమర్ బేస్ ఉంది. గతంతో ΄ోల్చితే వచ్చిన మార్పు ఏమిటంటే మన సాహిత్యం, సంస్కృతితో ముడిపడి ఉన్న పాత్రలను యువ గేమర్స్ ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్–క్లాస్ టెక్నాలజీతో మనవైన పాత్రలను ఇండియన్ స్టూడియోలు డెవలప్ చేస్తున్నాయి’ అంటుంది ‘విన్జో గేమ్స్’ కో–ఫౌండర్ సౌమ్య సింగ్ రాథోడ్.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మన పురాణాలు, చరిత్ర, సంస్కృతి, జానపద సాహిత్యంలోని పాత్రల ఆధారంగా మరిన్ని గేమ్స్ ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ నుంచి రానున్నాయి అంటుంది సౌమ్య. ‘పురాణాలను గేమింగ్‌తో మిళితం చేయడంతో ప్లేయర్స్ కొత్త రకం అనుభూతికి గురవుతున్నారు. అన్ని వయసుల వారిని ఈ గేమ్స్ ఆకట్టుకుంటున్నాయి’ అంటున్నాడు ‘ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్’ ఫౌండర్ చిన్మయ్ శర్మ. ‘మన పురాణాల్లో దాగున్న ఎన్నో ఇతివృత్తాలు డెవలపర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ పాత్రలు యూత్‌ను ఆకట్టుకునేలా గేమ్‌ను డిజైన్ చేస్తున్నారు’ అంటున్నాడు యుగ్ మెటావర్స్ సీయీవో ఉత్కర్ష్ శుక్లా.మైథలాజికల్ గేమ్స్ అనేవి ఎక్కువగా ఫస్ట్–పర్సన్ షూటర్(ఎఫ్‌పీఎస్) గేమ్స్. మెయిన్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆడే గేమ్స్.‘టెస్ట్ యువర్ స్కిల్స్ ఇన్ దిస్ ఎపిక్ స్ట్రాటజీ గేమ్’ అంటూ ఆహ్వానించిన ‘కురుక్షేత్ర: అసెన్షన్’ దిల్లీకి చెందిన సజనికి బాగా నచ్చింది. ఈ వీడియో గేమ్‌లో అర్జునుడు, భీముడు, కర్ణుడులాంటి ఎన్నో పాత్రలు ఉంటాయి.‘మైథలాజికల్ గేమ్స్ మనల్ని మన మూలాల్లోకి తీసుకువెళతాయి. మన పురాణాలు, జానపదాల ఆధారంగా గేమ్స్‌ను రూపొందించే అద్భుత అవకాశం ఇప్పుడు గేమ్ డెవలపర్లకు వచ్చింది. దేవ, దానవుల మధ్య యుద్ధానికి సంబంధించి సెకండ్ గేమ్‌ను రూపొందిస్తున్నాం’ అంటున్నాడు ‘కురుక్షేత్ర’ గేమ్‌ను రూపొందించిన ‘స్టూడియో సిరా’ కో–ఫౌండర్ అభాస్ షా.‘కురుక్షేత్ర’ను తక్కువ సమయంలో ఆరు లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారు.మన దేశంలోనే కాదు ఆగ్నేయాసియా దేశాలలో కూడా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించిన గేమ్స్‌ను ఆడడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టాన్ని క్యాష్ చేసుకోవడం అని కాకుండా ఈ గేమ్స్ ద్వారా యువతలో నైతిక విలువలు పాదుకొల్పే, ఆత్మస్థైర్యం పెంచగలిగే ప్రయత్నం చేస్తే భవిష్యత్ కాలంలో వాటికి మరింత ఆదరణ పెరుగుతుంది. రాజీ పడకుండా...నోడింగ్ హెడ్స్ గేమ్స్ కంపెనీ రూపొందించిన ‘రాజీ: యాన్ ఏన్షియెంట్ ఎపిక్’ మనల్ని మన పురాణ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. మన దేవాలయాల సౌందర్యం నుంచి ఇతిహాస కళ వరకు ఈ గేమ్‌లో ప్రతిఫలిస్తుంది. కంపెనీ ్రపారంభం నుంచి మన పురాణాల ఆధారంగా గేమ్‌ను రూపొందించాలని కల కన్నది పుణేకు చెందిన ‘నోడింగ్ హెడ్స్ గేమ్స్’ కంపెనీ ఫౌండర్ శృతి ఘోష్.‘రాజీ’ రూపంలో తన కలను నిజం చేసుకుంది.‘గ్రీకు ఇతర పురాణాలు సినిమాలు, గేమ్స్ రూపంలో మనల్ని ఆకట్టుకున్నాయి. అయితే ఆ స్థాయిలో మన పురాణాలు గుర్తింపు పొందలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పురాణాల ఆధారంగా రాజీ గేమ్‌కు రూపకల్పన చేశాం. ఇది ఎంతో మంది డెవలపర్లకు స్ఫూర్తిని ఇచ్చింది. ఎంత చెప్పినా మన పురాణాల్లో నుంచి చెప్పడానికి ఇంకా ఎంతో ఉంటుంది’ అంటుంది శృతి ఘోష్.– శృతి ఘోష్ -
ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియో : విభిన్న నృత్య రీతులతో
టాటా గ్రూపు యాజమాన్యంలో ఎయిరిండియా ఇటీవల సరికొత్తగా ముస్తాబైంది. విమానాల్ని కలర్ఫుల్గా, ముఖ్యంగా ఎయర్హెస్టెస్ తదితర సిబ్బంది డ్రెస్ కోడ్‌ను అందంగా తీర్చిదిద్దింది. తాజాగా మరో కొత్త అప్డేట్ను కూడా ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కొత్త ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియోను తీసుకొచ్చింది. ఎయిరిండియా విమానం బయలు దేరడానికి ముందు వినిపించే ప్రయాణీకుల కోసం 'సేఫ్టీ ముద్ర' అనే కొత్త ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియోను పరిచయం చేసింది. వివిధ కళారూపాల నుండి ప్రేరణ పొందినట్టు తెలిపింది. "శతాబ్దాలుగా, భారతీయ శాస్త్రీయ నృత్యం , జానపద-కళా రూపాలు కథలు, సూచిక మాధ్యమంగా పనిచేశాయి. నేడు, అవి విమాన భద్రత గురించి మరొక కథను చెబుతున్నాయి." అని ట్వీట్ చేసింది. సుసంపన్నమైన, విభిన్నమైన నృత్య రీతుల ప్రేరణతో కొత్త సేఫ్టీ ఫిల్మ్అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. మెకాన్ వరల్డ్గ్రూప్కు చెందిన ప్రసూన్ జోషి, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ , డైరెక్టర్ భరతబాల సంయుక్తగా 'సేఫ్టీ ముద్రాస్'ను దీన్ని తీసుకొచ్చారు. భరతనాట్యం, బిహు, కథక్, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్ .గిద్దా, ఎనిమిది విభిన్న నృత్య రూపాల్లో ముద్రలు లేదా నృత్యవ్యక్తీకరణలు ఇందులో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులకు భారతదేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అవసరమైన భద్రతా సూచనలను అందించేలా దీన్ని తీర్చిదిద్దడం సంతోషదాయమన్నారు ఎయిరిండియా సీఎండీ కాంప్‌బెల్ విల్సన్ For centuries, Indian classical dance and folk-art forms have served as medium of storytelling and instruction. Today, they tell another story, that of inflight safety. Presenting Air India’s new Safety Film, inspired by the rich and diverse dance traditions of India.#FlyAI… pic.twitter.com/b7ULTRuX1Z — Air India (@airindia) February 23, 2024 -
G20 Summit: నేతల సతీమణులకు ప్రత్యేక విందు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్రానికి వచి్చన ప్రపంచ నేతల సతీమణులకు శనివారం జైపూర్ హౌస్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. అనంతరం వారందరికీ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో కళాకృతులను తిలకించేందుకు అవకాశం కలి్పంచారు. విందులో భాగంగా వారికి మిల్లెట్లతో చేసిన వంటకాలను వడ్డించారు. స్ట్రీట్ ఫుడ్ రుచి చూపించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విందుకు తుర్కియే అధ్యక్షుడి సతీమణితోపాటు, జపాన్ ప్రధాని సతీమణి యోకో కిషిదా, యూకే ప్రధాని సతీమణి అక్షతామూర్తి, ఆ్రస్టేలియా, మారిషస్ తదితర దేశాల ప్రధానుల సతీమణులు, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా సతీమణి రితు బంగా తదితర 15 మంది వరకు హాజరయ్యారని వెల్లడించాయి. అంతకుముందు, వీరంతా సుమారు 1,200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఏఆర్ఐ)పుసా క్యాంపస్‌కు వెళ్లారు. వీరికి విదేశాంగ మంత్రి జైశంకర్, ఆయన భార్య కియోకో స్వాగతం పలికారు. తృణధాన్యాల సాగు గురించి తెలుసుకున్నారు. ప్రముఖ చెఫ్‌లు లైవ్ కుకింగ్ సెషన్లో తృణధాన్యాల వంటకాలను వివరించారు. మధ్యప్రదేశ్‌లోని డిండోరికి చెందిన గిరిజన మహిళా రైతు లహరీ బాయి తదితర 20 మంది మహిళా రైతులతో వీరు ముచ్చటించారు. -
టీబీజెడ్‌లో ‘మంగళ 2023 కలెక్షన్’
హైదరాబాద్: ఆభరణాల విక్రయ సంస్థ టీబీజెడ్ ‘మంగళ 2023 కలెక్షన్’ ఆవిష్కరించింది. పంజాగుట్ట షోరూంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతం వేడుకలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కొత్త కలెక్షన్ విడుదల చేసింది. ‘‘భారతదేశ సంస్కృతి స్ఫూర్తితో తీర్చిదిద్దిన ఈ బంగారు వజ్రాభరణాలు ఏ సందర్భంలో ధరించినా ప్రత్యేకత చాటుతాయి. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగం కావడం గౌరవంగా ఉంది’’ అని రకుల్ తెలిపారు. పంజాగుట్ట స్టోర్ పునః ప్రారంభంతో భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని టీబీజెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభిõÙక్ మాలూ ఆశించారు. -
గ్రామదేవతలే భరత సంస్కృతికి ఆధారం!
నిజామాబాద్: భారతీయ సంస్కృతికి ఆధారం గ్రామ దేవతలేనని, ఆ గ్రామ దేవతలే గ్రామాలను, దేశాన్ని రక్షిస్తున్నాయని విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ గంగల్ లక్ష్మీపతి వ్యాఖ్యానించారు. శనివారం ఇందూరు ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో స్థానిక హరిచరన్ మార్వాడీ విద్యాలయంలో శ్రీగ్రామ దేవతలు – ఆరాధనా సంస్కృతిశ్రీ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనిషి తాను చేసే ప్రతి పనిలో భగవంతుని దర్శించడమే సంస్కృతి అని పేర్కొన్నారు. శ్రీరాముడు, పాండవులు సైతం అయోధ్య గ్రామ దేవతను, రాజ్యలక్ష్మీ దేవతను ఆరాధించినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 145 రూపాల్లో గ్రామ దేవతల్ని ఆరాధిస్తున్నారని వెల్లడించారు. ఇతిహాస సంకలన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్ మాట్లాడుతూ చరిత్ర అధ్యయనం కోసమే ఇతిహాస సంకలన సమితి అంకితమైన సంస్థ అన్నారు. ఈ కార్యక్రమంలో భోగరాజు వేణుగోపాల్, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్, బొడ్డు సురేందర్, డా వారె దస్తగిరి, బలగం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
Special Marriage : బ్యాండ్ బాజాలతో ఘనంగా చిలుక పెళ్లి!
పెళ్లి అనేది భారతీయ సంప్రదాయంలో ఒక గొప్ప వేడుక. పెద్దలు ఈ వేడుకను గొప్ప పవిత్ర కార్యంగా నిర్వహిస్తారు. అలాంటి సంప్రదాయరీతిలో ఇక్కడొక ఇద్దరు వ్యక్తులు రెండు పక్షులకు పెళ్లి చేశారు. ఈ వింత పెళ్లి మధ్యప్రదేశ్‌లోని కరేలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని పిపారియాలో ఉండే రామ్‌స్వరూప్ పరిహర్ మైనా అనే పక్షిని కన్న కూతురి మాదిరిగా చూసుకుంటున్నాడు. అలాగే బాదల్ లాల్ విశ్వకర్మ చిలుకను కన్న బిడ్డలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వారిద్దరూ తమ పక్షులకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఆ ఇద్దరు తమ పక్షులకు హిందూ సంప్రదాయ పద్ధతిలో జాతకాలు చూసి మరీ భాజ భజంత్రీల నడుమ అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఆ పక్షులను రెండింటిని చిన్న కారులో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ పెళ్లి అంతటిని రామస్వరూప్ తన ఇంటిలో ఘనంగా నిర్వహించాడు. ఈ పెళ్లికి బాదల్ తరుఫున అతని గ్రామం నుంచి విజయ పటేల్, ఆదిత్య పటేల్, పితమ్ పటేట్, దేవి సింగ్ పటేల్, ఆశోక్ పటేల్, రాజు పటేల్, పురుషోత్తం శివన్య, సునీల్ పటేల్, విమేలేష్ పటేల తదితరులంతా హాజరయ్యారు. ఈ వింత పెళ్లిలో బరాత్ కూడా నిర్వహించడం విశేషం. ప్రస్తుతం అక్కడి గ్రామస్తులు ఈ పెళ్లి గురించే కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. (చదవండి: 17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..) -
ఆ కథ.. తీరని వ్యథ.. ‘సిరివెన్నెల’పై కళాతపస్వి మానసిక సంఘర్షణ
భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకుని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి కె. విశ్వనాథ్ కళాతపస్వి అనిపించుకున్నారు అయన ఆవిష్కరించిన శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారాన్ని అందుకుని తెలుగుతెరపై ఒక కళాఖండంగా మిగిలిపోయింది. అలాగే, స్వాతిముత్యం, సాగరసంగమం, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల.. ఇలా ఆయన ప్రతి చిత్రం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇంతటి గొప్ప చిత్రాలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన్ని పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే తదితర అవార్డులతో సత్కరించింది. కానీ, తన సినిమాలతో ప్రేక్షకుల మనసుని తేలికపరిచే విశ్వనాథ్ మనసుని మాత్రం ఒక సినిమా చిత్రవధ చేసిందట. అదే ‘సిరివెన్నెల’ సినిమా. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మిమ్మల్ని బాగా తృప్తిపరిచిన సినిమా ఏది’ అని ప్రశ్నించగా.. విశ్వనాథ్ బదులిస్తూ, ‘కళాకారుడు అనేవాడు జీవితాంతం తృప్తి పొందడు. ఇంకా ఏదో చేయాలి, సాధించాలనే అసంతృప్తితోనే బతుకుతాడు. నేను అంతే. కానీ, నన్ను మానసికంగా చాలా సంఘర్షణకు గురిచేసిన సినిమా మాత్రం ‘సిరివెన్నెల’. అసలు ఒక మాటలు రాని అమ్మాయి ఏంటి.. కళ్లు కనబడని అబ్బాయి ఏంటి.. వారిద్దరి మధ్య సన్నివేశాలు సృష్టించడానికి నేను రాత్రి పగలు కష్టపడడం ఎందుకు? ఆ కథ ఎందుకు మొదలుపెట్టానా అని ఎంతో బాధపడ్డా. చిత్రీకరణ మధ్యలో సినిమాను ముగించలేను, ఆపేయలేను.. ఆ సమయంలో మానసికంగా ఎంతో చిత్రవధ అనుభవించా’.. అంటూ విశ్వనాథ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కట్ చేస్తే.. సిరివెన్నెల సినిమా తెలుగుతెరపై మరో కళాఖండమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Rishi Sunak: పక్కా హిందూ
‘‘నేను హిందువుని అని చెప్పుకోవడానికి గర్వపడతాను’’ అని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పలు సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించారు. ఎంత ఎదిగినా తన మూలాలను ఆయన ఎన్నడూ మరచిపోలేదు. రిషి బ్రిటన్‌లో పుట్టి పెరిగినప్పటికీ చిన్నప్పట్నుంచి భారత సంస్కృతి సంప్రదాయలను వంటపట్టించుకున్నారు. తరచూ దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. సోమవారం ఉపవాసం చేస్తారు. గోమాంసం ముట్టరు. యూకే రాజకీయాల్లో హిందువునని చెప్పుకునే రిషి పైకి ఎదిగారు. అదే ఆయన ప్రత్యేకత. హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీతపైన అపారమైన నమ్మకం. 2015లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేశారు. జాన్సన్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు కూడా గీతపైనే ప్రమాణం చేశారు .ప్రధానిగా లిజ్ ట్రస్‌తో పోటీ పడే సమయంలో ప్రచారంలోనూ శ్రీకృష్ణ జయంతి రోజున గోపూజ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో ఆయన ట్వీట్లు చేశారు.రిషి ఇంగ్లీషుతో పాటు హిందీ, పంజాబీ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. సునాక్‌కు భారత్ పాస్‌పోర్టు కూడా ఉంది. బెంగుళూరుకు చెందిన బ్రాహ్మణ కుటుంబమైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను పెళ్లి చేసుకున్న సునాక్ ఇంట్లో కూడా భారతీయ సంప్రదాయాలనే పాటిస్తారు. వారి ఇద్దరి ఆడపిల్లలు అనౌష్క, కృష్ణని కూడా భారతీయతనే నేర్పిస్తున్నారు. కుటుంబానికి అత్యంత విలువ ఇస్తారు. తన అత్తమామలు ఎప్పటికీ గర్వకారణమని చెప్పుకుంటారు. వారిని కలవడానికి తరచూ బెంగుళూరు వచ్చి వెళుతుంటారు. ప్రతీ ఏటా దీపావళిని ఘనంగా జరుపుకునే సునాక్ ప్రధానిగా దీపావళి రోజే ప్రమాణం చేయడం విశేషం. ఒక హిందువును ప్రధానిగా అంగీకరించడం ద్వారా బహుళ విశ్వాసాలు, వైవిధ్యాలను అంగీకరించగలిగే సహనం యూకే ప్రజలకు బాగా ఉందని అర్థమవుతోంది. కుటుంబ నేపథ్యం ఇదీ రిషి సునాక్ తాత రామదాస్ సునాక్ అవిభాజ్య భారత్‌లో పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రనవాలాకు చెందినవారు. 1935 సంవత్సరంలోనే రామదాస్ తూర్పు ఆఫ్రికాలోని నైరోబియాకి వలస వెళ్లిపోయారు. నాన్నమ్మ రాణి సునాక్ ఓ రెండేళ్లు ఢిల్లీలో ఉండి తర్వాత భర్త దగ్గరకి వెళ్లారు. రామదాస్ దంపతులకి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ 1949లో కెన్యాలో జన్మించారు. 1960లో ఆఫ్రికాలో భారతీయులపై జరిగే దాడులకు భయపడి యశ్వీర్ యువకుడిగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. పంజాబ్ నుంచి టాంజానియా వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందిన ఉషా బెర్రీని యశ్వీర్ వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల మొదటి సంతానమే రిషి సునాక్. రిషి తాత ముత్తాతలు ఉంటే గుజ్రనవాలా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండడంతో ఆ దేశం కూడా రిషి మా వాడే అని అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాణి ఎలిజబెత్–2కు భారత్ అంటే అభిమానం
లండన్: భారత్ అంటే రాణి ఎలిజబెత్–2కు ప్రత్యేకాభిమానం. బ్రిటిష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చాక బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తు్తరాలైన తొలి పాలకురాలు ఆమే. 1952లో రాణిగా బాధ్యతలు స్వీకరించారు. భారత సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకొనేందుకు అమితాసక్తి చూపేవారు. 1961, 1983, 1997ల్లో మూడుసార్లు భారత్‌ను సందర్శించారు. ‘జలియన్‌వాలాబాగ్’పై విచారం.. 1961లో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ దంపతులు తొలిసారిగా ఇండియా వచ్చారు. నాటి బాంబే, మద్రాస్, కలకత్తాలను సందర్శించారు. తాజ్మహల్నూ తిలకించారు. ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాదరక్షలు విప్పి గౌరవం చాటుకున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఢిల్లీలో రాంలీలా మైదానంలో నాటి ప్రధాని నెహ్రూ అధ్యక్షతన జరిగిన సభలో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ భవనాన్ని ప్రారంభించారు. కామన్వెల్త్ దేశాధినేతల భేటీలో పాల్గొనేందుకు 1983లో ఎలిజబెత్ రెండోసారి భారత్ వచ్చారు. మదర్ థెరిసాకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ ప్రదానం చేశారు. ఇక భారత 50వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 1997లో భర్తతో కలిసి మూడోసారి భారత్ వచ్చారు. వలస పాలన నాటి చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ జలియన్‌వాలా బాగ్ ఉదంతం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అమృత్‌సర్‌లో జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని సందర్శించారు. కాల్పుల్లో అమరులైన వారికి నివాళులర్పించారు. ముగ్గురు భారత రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, ప్రతిభా పాటిల్‌కు ఇంగ్లండ్‌లో రాణి ఆతిథ్యమిచ్చారు. 1983లో భారత్ పర్యటన సందర్భంగా ఇందిరాగాంధీతో... -
గురుపూజోత్సవం: గురువంటే... వెలిగే దీపం
భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది. సమున్నతమైనది, గౌరవప్రదమైనది. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుది. ఒక వ్యక్తి, సమాజ, జాతి నడకకు, నడతకు, పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం. ఉత్తమ గ్రంథాలన్నీ ఆచార్యుని ప్రాధాన్యతను ప్రస్తుతించాయి. ఒక జాతి ఉత్తమజాతిగా రూపొందటంలో ప్రజల గుణగణాలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. ప్రజలు శీలవంతులుగా ఉండాలంటే ప్రప్రథమంగా వారు చక్కని సంస్కార వంతులు కావాలి. ఈ గొప్ప సంస్కారం మన మనస్సుల్లో ఉద్దీపింప చేసే మహోన్నతుడే గురువు. మనకు విద్యను బోధిస్తూనే మన హృదయ సంస్కారాన్ని పెంచే యత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఒకసారి మృదువుగా, మరొకసారి కఠినంగా వ్యహరిస్తుంటాడు. ఆపై తల్లిగా లాలిస్తాడు. ప్రేమను కురిపిస్తాడు. అక్కున చేర్చుకుంటాడు. అందుకే తల్లి ప్రేమ, ఆత్మీయత; అవసరమైన వేళలో తండ్రిలా దండన, సంరక్షణల మేళవింపే గురువు. ఉత్తమగురువు తన విద్యార్థులతో ఒక స్నేహితుడిగా, వేదాంతిగా, మార్గదర్శకుడిగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాడు. చదువు ద్వారా జ్ఞానాన్ని పెంచుతూనే హృదయ సంస్కారాన్ని పెంచుతాడు. విద్యను చెప్పేవాడికే బుద్ధులు చెప్పే విశేష అధికారం, అవకాశం ఉంటాయి. ఉత్తమ గురువెన్నడూ తన ఈ గురుతర బాధ్యతను విస్మరించడు. తన ఆధిక్యతను ఎక్కడా ప్రదర్శించడు. చక్కని విద్యతోపాటు హృదయ సంస్కారం అలవడి వృద్ధి చెందే గొప్ప వాతావరణం, జ్ఞానం గురువు నుండి శిష్యుడికి, శిష్యుడి నుంచి గురువుకు ప్రసరిస్తుంది. గ్రీకు తత్త్వవేత్త, వేదాంతి, విద్యావేత్త ప్లేటో ఏథెన్స్ నగరంలో బోధనా పద్ధతిలో ఒక గొప్ప పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆయన కూడ తన విధానంలో విద్యార్థులకు పెద్ద పీట వేసాడు. అక్కడ ప్రతి లౌకిక, అలౌకిక విషయాలను, జ్ఞానం, దాని లోతుపాతులు, అది లభ్యమయ్యే మార్గాలు.. ఇలా ఎన్నో విషయాలను గురుశిష్యులు చర్చించేవారు. ఎవరి భావాలు ఉన్నతంగా ఉంటే వాటినే తీసుకునే వారు. ఇక్కడ విద్యంటే ఆలోచనల మార్పిడి. అలాగే ఈ గురుకులంలో ఎవరు ఎవరికీ బోధిస్తున్నారో చెప్పటం కష్టం. ఎవరిది గొప్ప ఆలోచనైతే దాన్నే మిగిలినవారు స్వీకరించే వారు. ఈ దేశాలలో కూడ ఒకరు ఎక్కువ, రెండవవారు తక్కువన్న ప్రసక్తే లేదు. ఎంత ఉన్నతమైన భావనో గమనించండి. ప్రాచ్య దేశాలైనా, పాశ్చాత్య దేశాలైనా గురువు విలువను, ఆయన ఆవశ్యకతను గుర్తెరిగి వర్తిస్తాయని ఆయనకు ఉన్నత స్థానాన్నిస్తాయని చెప్పటానికే ఈ ఉదాహరణ. గురువులో రవ్వంత గర్వమైనా ఉండకూడదు. అసలు పొడచూపకూడదు. మనస్సు నిర్మలమైన తటాకం కావాలి. ఇలా కావటానికి అతడు పక్షపాత రహితుడు కావాలి. అపుడే తన జ్ఞానాన్ని శిష్యులకు అందచేస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందిన శిష్యుడు దాన్ని జీర్ణించుకుని తన మేధతో మరింతగా ప్రకాశింపచేసి తరువాత తరాలవారికి అందచేస్తాడు. అలా తన శిష్యులు తన జ్ఞానవాహికలు కావటం ఏ గురువుకైనా ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎంతో ఉప్పొంగిపోతాడు. జ్ఞానపరంపరకు వారధి కనుక అతనంటే అవ్యాజమైన ప్రేమ. ఎంతో గౌరవం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో గురుశిష్యులు జ్ఞానపాయలు. ఉత్తమ గురువు కోసం శిష్యుడు ఎలా తపిస్తూ, అన్వేషిస్తాడో, గురువు కూడ అంతే. గురువు క్షేత్రమైతే శిష్యుడు విత్తు లాంటివాడు. రెండిటి మేలు కలయిక వల్లే జ్ఞానమనే బంగరు పంట పండుతుంది. గురువు ఎవరినైనా శిష్యుడి తీసుకునే ముందు అతడి జ్ఞానంతో పాటు, అతడి జ్ఞానతృష్ణనూ పరీక్షిస్తాడు. అవి తృప్తికరంగా ఉన్నప్పుడే అతనికి విద్య గరిపేవాడు. గురువు జ్ఞానధారను ఒడిసిపట్టుకున్న శిష్యుడు తన ప్రతిభతో, అనుభవంతో దానిని మరింతగా విస్తరించి భావితరాలకు అందిస్తాడు. నేటి విద్యావ్యవస్థలో ఆనాటి ప్రమాణాలు, అంతటి ఉత్తమ గురుశిష్యులు, విలువలు లేవని కొందరి గట్టి నమ్మకం. ఆరోపణ. కొంత వాస్తవం లేకపోలేదు. నేటి కాలంలోనూ బోధనావృత్తిని ఎంతో పవిత్రంగా భావించి దానిని చేపట్టి ఎంతో సమర్థంగా నిర్వహించేవారు ఉన్నారు. దానికి మరిన్ని సొబగులద్ది, మరింత గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచిన వారు, పెంచుతున్న వారు ఉన్నారు. పొందవలసిన గౌరవాన్ని పొందుతూనే ఉన్నారు. సాంకేతికాభివృద్ధి విశేషంగా పెరిగి మనకు ఎంతగానో చేరువైంది. నేటి గురువులు ఈ సాంకేతికతని అందిపుచ్చుకుని మరీ పాఠాలు చెప్పేటందుకు సంసిద్ధులవుతున్నారు. వీరి లాగానే, ఉత్తమ శిష్యులు కూడ గురువుల మాదిరిగానే తయారవుతున్నారు. కనుక నేటి అధ్యాపకులకు చాలా అప్రమత్తత ఉండాలి. తమ జ్ఞానాన్ని, బోధనానైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి. అప్రమత్తులుగా ఉంటేనే కదా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని, నాలుగు కాలాలపాటు నిలువగలిగేది. ఉత్తమ గురువు మన ఆలోచనలకు నడకలు నేర్పుతాడు. మన ఊహలకు రెక్కలనిచ్చి మనం అద్భుత ప్రపంచాలలో విహరించే శక్తినిస్తాడు. ఉత్తమ గురువు మనలోని సృజనాత్మకతను మనం గుర్తించేటట్టు చేస్తాడు. ఉత్తమ గురువు చేసే, చేయగలిగే మహాత్తర కార్యమిదే. దీనివల్ల మనకు ప్రశ్నించే అలవాటు, శోధించే తత్వం అలవడుతుంది. అందుకే ఈ గురుశిష్యుల పాత్రను జాతిని సముద్ధరింపచేసే అత్యంత కీలకమైన అంశాలలో ఒకటిగా భావిస్తారు. వారి పాత్ర ఎంతో అమూల్యమైనది. అపురూపమైనది. ► మనకు తెలుసు అని అనుకున్నప్పుడు మనం నేర్చుకోవటం మానేస్తాం. ► విద్య అంతిమ లక్ష్యం ఒక స్వేచ్ఛా సృజనశీలిగా రూపొందటం. అపుడే చారిత్రక పరిస్థితులు, ప్రకృతి విపత్తులతో పోరాడగలడు. ► దేశంలో అందరికన్నా ఉపాధ్యాయుల మనస్సులు ఉత్తమమైనవిగా ఉండాలి. మన స్వీయ ఆలోచనాశక్తిని పెంపొందించటానికి సహాయపడే వాడే ఉపాధ్యాయుడు. ► విద్యావ్యవస్థకు ఉపాధ్యాయుడు వెన్నెముక. – డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ► ఏది చూడాలో చెప్పక ఎక్కడా చూడాలో మాత్రమే చెప్పేవాడు అధ్యాపకుడు. – అలెగ్జాండర్ ట్రెన్ఫర్ ► అగ్ర సింహాసనం మీదఎవరినైనా కూర్చోపెట్టదలచుకుంటే అతడు అధ్యాపకుడే. – గై కవాసాకి ► వెయ్యి రోజులు పరిశ్రమించి నేర్చుకున్న విద్యకన్నా ఒక గొప్ప అధ్యాపకుడితో ఒకరోజు గడపటం విలువైనది.– జపాన్ సామెత బోధించటమంటే మరోసారి నేర్చుకోవటం. – జోసెఫ్ జాబర్ట్ ► నేను అధ్యాపకుణ్ణి కాదు. కాని వైతాళికుణ్ణి – రాబర్ట్ ఫ్రాస్ట్ – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
‘క్లాస్ రూమ్‌లో గర్ల్స్, బాయ్స్ కలిసి కూర్చోవడం వల్లే అలా జరుగుతోంది’
ప్రస్తుత జనరేషన్లో కో-ఎడ్యుకేషన్ కామన్ అయిపోయింది. విద్యార్థులు జండర్ బేధం లేకుండా విద్యనభ్యసిస్తున్నారు. కాగా, కో-ఎడ్యుకేషన్‌పై కేరళ సీఎం పినరయి సన్నిహితుడు వెల్లపల్లి నటేశన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, వెల్లపల్లి నటేశన్ తాజాగా కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ ‘జండర్ న్యూట్రల్ పాలసీ’ గురించి స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ‘క్లాస్ రూమ్స్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడానికి మేము మద్దతు తెలపడం లేదు. భారతదేశానికి అంటూ ప్రాచీన కాలంగా ఓ సంస్కృతి ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు కౌగిలించుకోవడం, కలిసి కూర్చోవడం వంటి చర్యలను మన సంస్కృతి ఒప్పుకోదు. ఇలాంటిది మన సంస్కృతికి విరుద్ధం. మనమందరం ఇంగ్లండ్, అమెరికాలో బ్రతకడంలేదంటూ వ్యాఖ్యలు చేశారు. Girls, boys sitting together in classes against Indian culture: Kerala leader #VellappallyNatesanhttps://t.co/RsvHXARxCB — India TV (@indiatvnews) August 29, 2022 ఈ క్రమంలోనే 18 ఏళ్ల లోపు వారు లేదా కళాశాలల్లో యువకులు చదువుకుంటున్నప్పుడు ఒకరినొకరు కలిసి కూర్చుని కౌగిలించుకోకూడదని ఆయన అన్నారు. ఇలా వారు కలిసి కూర్చోవడం దేశానికే ప్రమాదకరమన్నారు. పిల్లలు పెద్దయ్యాక, పరిపక్వత వచ్చిన తర్వాత, వారు కోరుకున్నది చేయగలరని చెప్పారు. ఇలా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చుంటున్న కారణంగానే విద్యార్థులు చదువులో రాణించలేకపోతున్నారు. అలాగే, విద్యా సంస్థలు మంచి గ్రేడ్లను సాధించలేకపోతున్నాయి. దీంతో, విద్యాసంస్థలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి నిధులు పొందలేకపోతున్నాయి అని తెలిపారు. -
చరిత్ర తెలియదు.. సంస్కృతీ తెలియదు..
న్యూఢిల్లీ: ఖజురహో నృత్యోత్సవాలు మధ్యప్రదేశ్‌లో జరుగుతాయని మీకు తెలుసా? పోనీ .. ఆసియా సింహాలకు ఏకైక ఆవాసం గుజరాత్‌లోని గిర్ అభయారణ్యమనే సంగతి తెలుసా? కొంత మందికి తెలిసి ఉండొచ్చేమో గానీ.. చాలా మంది భారతీయులకు మన దేశం, చరిత్ర, సంస్కృతి, ఆహార విహారాలు మొదలైన వాటి గురించి పెద్దగా అవగాహనే ఉండటం లేదు. మహీంద్రా హాలిడేస్ తమ 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘‘తమ దేశం గురించి, దేశ భిన్నత్వం, విస్తృతి, సంస్కృతి, వారసత్వం, వంటకాలు మొదలైన వాటి గురించి మన వారిలో అవగాహన లేమి .. ఆశ్చర్యపర్చేలా ఉంది’’ అని సర్వే పేర్కొంది. ఇందులో పాల్గొన్న వారిలో 60 శాతం మంది మన దేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, పర్యటన స్థలాలు, వాతావరణం, ఆహారం మొదలైన వాటి గురించి తమకు అంతగా తెలియదని వెల్లడించారు. ‘‘భారతదేశ వైవిధ్యంపై అవగాహన, పరిజ్ఞానం గురించి నిర్వహించిన ఈ సర్వే ప్రకారం చాలా మందికి మన వంటకాల గురించి అతి తక్కువగా తెలుసు. నిజానికి భారతదేశానికి కాఫీని పరిచయం చేసినప్పుడు మొట్టమొదటి సారిగా కూర్గ్‌లో పండించిన సంగతి తెలిసిన వారి సంఖ్య మూడో వంతు కన్నా (31 శాతం) తక్కువే’’ అని సర్వే పేర్కొంది. దేశీయంగా వివిధ ప్రాంతాలను సందర్శించే కొద్దీ వివిధ రాష్ట్రాలకు సంబంధించి తమకు తెలియని సంస్కృతులు, వంటకాలు మొదలైన వాటి గురించి ఆసక్తి పెరుగుతుందని, తద్వారా భారతదేశ వైవిధ్యం గురించి అవగాహన పెంచుకోవచ్చని మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా ఎండీ కవీందర్ సింగ్ తెలిపారు. సర్వేలో మరిన్ని వివరాలు.. ► భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వంపై కూడా ప్రజల్లో అవగాహన అంతంతమాత్రమేనని సర్వేలో వెల్లడైంది. ఉదాహరణకు ఖజురహో ఉత్సవాలను మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తారన్న సంగతి మూడో వంతు మందికి (39 శాతం) పైగా తెలియదు. ఇక మహారాష్ట్ర .. పైఠనీ చీరలకు పెట్టింది పేరని సుమారు మూడో వంతు మంది (32 శాతం)కి తెలియదు. ► భారతదేశ భౌగోళికాంశాలపై కూడా ప్రజల్లో పరిజ్ఞానం ఒక మోస్తరుగానే ఉంది. భారతదేశంలోని గిర్ అభయారణ్యంలో మాత్రమే ఆసియా సింహాలు కనిపిస్తాయన్న విషయం మూడొంతుల మందికి (దాదాపు 39 శాతం) తెలియదు. అలాగే, ఉదయ్‌పూర్‌ను సరస్సుల నగరంగా వ్యవహరిస్తారని, చైనా వాల్ తర్వాత అత్యంత పొడవైన గోడ గల కుంభల్గఢ్ కోట .. రాజస్థాన్‌లో ఉందన్న సంగతి గానీ సుమారు మూడోవంతు మందికి తెలియదు. ► టెలిఫోన్, ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా మహీంద్రా హాలిడేస్ ఈ సర్వే నివేదిక రూపొందించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, చండీగఢ్ తదితర 16 నగరాల నుంచి 4,039 మంది ఇందులో పాల్గొన్నారు. -
ఢిల్లీ విమానాశ్రయంలో హ్యుందాయ్ రోబోటిక్ ‘నమస్కారం’
హైదరాబాద్: భారత సంస్కృతిలో నమస్కారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎదుటివారిని ఆహ్వానిస్తూ.. పలకరిస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించడం సంప్రదాయంలో భాగం. దీన్ని గుర్తిస్తూ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యందాయ్ ఇండియా ఒక వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 మీటర్ల ఎత్తయిన నమస్కార రోబోను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు నమస్కారంతో స్వాగతం పలుకుతుంది. ఒక మనిషి చేయి, ఒక రోబో చేయి కలిసిన ప్రతిరూపంగా ఇది కనిపిస్తుందని కంపెనీ తెలిపింది. మానవత్వం, టెక్నాలజీ ఈ రెండూ కలసి మెరుగైన భవిష్యత్తుకు ప్రతిరూపమని తెలియజేయడమే దీని ఏర్పాటులోని ఉద్దేశమని పేర్కొంది. ‘‘భారత్‌లో మనుషులు, టెక్నాలజీ మధ్య అంతరం పూడ్చడమే హ్యుందాయ్ అసలైన విజన్. దీన్ని ప్రతిబింబించే రూపమే ఈ ఏర్పాటు’’అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూకిమ్ తెలిపారు. -
ఆయన కవిత్వం... భారతీయాత్మ స్వరూపం
‘‘మామిడి కొమ్మ మీద కల మంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మ్రొక్కి యీ యభినవ స్వరకల్పన కుద్యమిం చితిన్’’ అంటూ గత శతాబ్దంలో తెలుగులో ఆధునిక కవిత్వానికి ప్రారంభ కుడైన వాడు రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు తన సమస్త వాఙ్మయం ద్వారా భారతీయ సంస్కృతి స్వరూప స్వభావాలను సమకాలీన జనానికి పునః సాక్షాత్కరింప జేసి వాటి విలువల పరిరక్షణకు సంకల్పించినారు. మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద చేసిన విద్యాభ్యాసం ప్రాచీన వాఙ్మయంలోని మౌలిక విషయాల అవగాహనకు తోడ్పడినది. వేదాధ్యయన అధ్యాప నలకు పుట్టిల్లు అయిన ‘వెదుళ్ళపల్లి’లోని ఆయన జీవనం వేదోపనిషత్తుల యందు ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగించినది. ఆధునిక కవులకు ‘మ్యానిఫెస్టో’గా రచించిన ‘రమ్యా లోకం’ లక్షణ గ్రంథంలో– ‘‘క్రొత్త నీరు తొల్కరి యేళ్ళ క్రుమ్మి పాఱ/ప్రాతనీరు కలంగుట బ్రమ్ముకాదు’’అని అంటారు. కాలానుగుణమైన మార్పును ఆహ్వానించవలసిందే అంటారు. ఆధునికతా పరివేషంలో నూతన అభివ్యక్తి కోసం మార్పును ఆహ్వానించిన రాయప్రోలు సంప్రదాయ సంస్కృతులను మాత్రం వదలి పెట్టలేదు. తన కవిత్వం ద్వారా రాయప్రోలు ప్రతిపాదించిన సంస్కృతీపరమైన అంశాలను మనం ఇట్లా గమనించవచ్చును – ‘‘ఏ దేశమేగిన ఎందు కాలిడినా / ఏ పీఠ మెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని / నిలుపరా నీ జాతి నిండు గౌరవమును’’అంటూ మాతృ దేశా రాధనం వ్యక్తి సంస్కృతికి నిదర్శనమని చాటినారు. అట్లే ‘‘తమ్ముడా! చెల్లెలా!’’ అంటూ సోదర సోదరీ భావంతో దేశీయమైన, జాతీయమైన సాంస్కృతిక వార సత్వాన్ని ప్రబోధించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాను తెలుగువాడిగా పుట్టడమే ఒక అదృష్టంగా భావించా డాయన. ‘‘ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు / పూజ సల్పి తినో యిందు పుట్టినాడ! కలదయేని పునర్జన్మ కలుగా గాక / మధు మధు రంబయిన తెన్గు మాతృభాష.’’ ప్రతి మనిషీ భాషా తపస్సు చేయడం ద్వారా మాతృ భావనకు పునాది వేయమంటా రాయన. భాషలు వేరైనా మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయుల సాంస్కృతిక విధానం ఒక్క టేనన్నది రాయప్రోలు ఉద్దేశ్యం. అందుకే మాతృ భాషలో ఇతర భాషా పదాలు వచ్చి చేరడమన్నది ఆ భాష గొప్పదనానికి నిదర్శన మంటాడు. భారతీయ సమాజంలో కుటుంబ సంబంధాలను, మానవీయ సంబంధాలను అంటి పెట్టుకొని ఉన్న సంస్కృతి ఆధు నిక కాలంలో ప్రేమ రాహిత్యం వల్ల సంక్షోభంలో పడిపోయిందన్న ఆవేదనను రాయప్రోలు తన ‘రూపనవనీతం’లో ఇలా వ్యక్తం చేసినారు – ‘‘మానవ గాత్రమునకు మాన్పరాని గాయములు తగిలి నవి చైతన్యమంతా అనిష్టముష్టి ఘాతాలతో కాయలు కాసినవి. ప్రేమ ప్రవహింపక గడ్డలు కట్టింది... నైతిక చక్రము సవ్యాప సవ్య మార్గములు తెలియకుండా త్రిప్పినందువల్ల, ఒడుదొడు కులతో మిట్టపల్లాలతో కుంటుతుంది. గమ్యం కానరాకుండా చాటయింది.’’ ‘‘పరమ ధర్మార్థమైన దాంపత్య భక్తి’’ అనే పద్యంలో ప్రేమ అన్నది ఒక అఖండమైన పదార్థంగా అది భక్తి, రక్తి, సక్తి అని మూడు విధాలుగా అభివ్యక్త మవుతున్నదని ప్రకటించినాడు. ఈ మూడింటినీ భారతీయ సంస్కృతిలోని ప్రధానమైన అంశాలుగా వ్యాఖ్యానించవలసి ఉన్నది. ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతికి అత్యున్నత గౌరవం లభించడానికి కారణం మన కుటుంబ వ్యవస్థ. మానవ సంస్కృతి వికాసానికి మూలమైన స్త్రీ – పురుష సంబంధాలను రాయప్రోలు తన కావ్యాలలోనూ, లక్షణ గ్రంథాలలోనూ ‘నరనారీ సంబంధం’ పేరుతో విశ్లేషించినారు. మానవులందరూ స్త్రీ పురుష భేదం చేత మౌలికంగా రెండే రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల పరస్పర సంబంధం మీదనే మానవ జీవితం, మానవ సమాజం అభివృద్ధి మార్గంలో విస్తరిస్తాయని అంటారు. ఇట్లే రాయప్రోలు సాహిత్యపరంగా రసభావనను గురించి చెప్పిన నిర్వచనము గానీ, సమాజపరంగా ఆయన ప్రతిపాదించిన నూతన సిద్ధాంతము శాంతం, శివం, సుందరం అన్నది కానీ భారతీయ సంస్కృతిలోని ప్రధాన లక్ష్యాన్ని ఆవరించుకొని చెప్పినవే. భారతీయ సంస్కృతీ సారమైన శాంతం, శివం, సుందరం అన్నవి మూడు వన్నెల జెండా వంటివనీ, ప్రతి ఒక్కరూ వాటిననుసరించి శిరసావహించి భారతీయ సంస్కృతికి గౌరవ వందనం చేయ వలసిందేనని ప్రబోధించినాడు. వ్యాసకర్త మాజీ సంచాలకులు తెలుగు అకాడమి ‘ 93901 13169 -
ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే
Priyanka Chopra Interesting Comments On India And Culture: గ్లోబల్ స్టార్ ప్రియాంక జోనాస్ ఎప్పుడూ తన సినిమాలతో బిజీగా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఎవరైన తక్కువ చేసిన ఊరుకోదు. వెంటనే కౌంటర్ ఇస్తుంది ప్రియాంక. ఇందుకు ఉదాహరణ ఇటీవల తనను 'వైఫ్ ఆఫ్ జోనాస్'గా ప్రస్తావించడమే. ప్రస్తుతం ప్రియాంక తన రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ ప్రమోషన్లో బిజీగా ఉంది. 'ది మ్యాట్రిక్స్' ఫ్రాంచైజీ నుంచి 18 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో ప్రియాంక సీత పాత్రను పోషించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన టెలివిజన్ హోస్ట్ రాషా గోయెల్‌తో ముచ్చటించింది ప్రియాంక. ఈ క్రమంలోనే ప్రియాంక తన మూలాలను గుర్తు చేసుకుంది. తాను ఇంటికి దూరంగా ఉన్నట్లు ఎప్పుడూ భావించలేదని చెప్పింది. అలాగే 'మీరు నన్ను భారతదేశం నుంచి బయటకు తీసుకురావచ్చు. కానీ భారతదేశాన్ని నా నుంచి వేరు చేయలేరు. నేను ఎక్కడికీ వెళ్లినా నాతోపాటు నా సంస్కృతి కూడా వస్తుంది. అందుకే నేను ఎప్పుడూ ఇంటికు (ఇండియా) దూరంగా ఉన్నట్లు భావించలేదు. నా ఇళ్లు, నా మందిరం, మా అమ్మ, నా ఆచారాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. కాబట్టి నేను బాగానే ఉన్నాను. ఇలా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను.' అని చెప్పుకొచ్చింది ప్రియాంక జోనాస్. ప్రియాంక, నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో నివసిస్తోంది. ఇప్పుడు ఇది చాలా వ్యూహాత్మకంగా ఉందని భావిస్తున్నట్లు ప్రియాంక తెలిపింది. అలాగే రెండు పరిశ్రమలను (బాలీవుడ్, హాలీవుడ్) బ్యాలెన్స్ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఎందుకంటే అలా చేయగలిగే నటులు ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ మంది ఉన్నారని ప్రియాంక అభిప్రాయపడింది. So much love for @priyankachopra and seeing her be a part of this franchise. not often South Asian actors get booked in these parts. Talked about her exp on set and how the Indian culture is always with her. ❤️Always fearless in her endeavors. #southasian #PriyankaChopraJonas pic.twitter.com/slRA0fbCfd — Rasha Goel (@RashaGoel) December 16, 2021 ఇదీ చదవండి: 'నిక్ జోనాస్ వైఫ్' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్.. -
Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ హర్నాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?
Interesting Facts About Harnaaz Sandhu: ప్రపంచం ఎదుట భారతీయ సౌందర్యం మరోసారి మెరుపు నవ్వు నవ్వింది. ప్రపంచం ఎదుట భారతీయ సంస్కారం మరోసారి తన ఎరుకను ప్రదర్శించింది. ప్రపంచం ఎదుట భారతీయ స్త్రీ సౌందర్యకాంక్ష తన శిరస్సు మీదకు జయ కిరీటాన్ని ఆహ్వానించింది. చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుంది. 21 ఏళ్ల హర్నాజ్ 2021లో 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత మరోసారి ఈ కిరీటాన్ని దేశానికి తెచ్చింది. ‘చక్ దే ఫట్టే ఇండియా’ అని కేరింతలు కొట్టింది హర్నాజ్ కిరీటం గెలిచాక. అంటే ‘సాధించు. గెలుపు సాధించు ఇండియా’ అని అర్థం. నేడు ఇండియా గెలిచింది. ‘విశ్వసుందరి’ మిస్ ఇండియా హర్నాజ్ సంధు (మధ్యలో) ఇరువైపులా రన్నరప్స్ పరాగ్వేకు చెందిన మిస్ నాడియా, సౌతాఫ్రికాకు చెందిన మిస్ లలేలా డిసెంబర్ 12న (మన తేదీ ప్రకారం 13 తెల్లవారుజామున) భారతీయురాలైన హర్నాజ్ సంధు తల మీద విశ్వసుందరి కిరీటం తళుక్కున మెరిసింది. ప్రపంచమంతా కరతాళధ్వనులు మోగిస్తుండగా దేశం అందమైన ఈ విజయంతో ఉత్సాహంగా నిద్ర లేచింది.1994లో సుస్మితా సేన్ మొదటిసారి ఈ టైటిల్ గెలిచి స్ఫూర్తి ఇచ్చాక 2000లో లారా దత్తా రెండోసారి గెలిచాక మూడోసారి టైటిల్‌కై సాగుతున్న ఎదురుచూపులకు అడ్డుకట్ట వేస్తూ హర్నాజ్ ఈ సౌందర్యాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇజ్రాయిల్ రేవు పట్టణం ఐలత్లో తాత్కాలికంగా నిర్మించిన భారీ ప్రాంగణంలో సుప్రసిద్ధ వ్యాఖ్యాత స్టీవ్ హార్వే హోస్ట్‌గా జరిగిన ఈ విశ్వ పోటీలో 80 దేశాల పోటీదారులను దాటి హర్నాజ్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. ఎర్రసముద్రం మురిసిపోయింది ఎర్రసముద్రం ఒడ్డు మీద ఉన్న 50 వేల జనాభా కలిగిన ఐలత్ పట్టణంలో హర్నాజ్ విజయంతో భారత్ పేరు మార్మోగింది. ఎవరీ అందగత్తె అని ఎర్రసముద్రం తొంగి చూసి మురిసిపోయింది. ‘భారతీయ సౌందర్యానికి నేను బెస్ట్ వెర్షన్‌ని’ అని పోటీలకు వెళ్లబోతూ వ్యాఖ్యానించిన హెర్నాజ్ 80 దేశాల అందగత్తెలతో తలపడి ముందు టాప్ 16లో ఆ తర్వాత టాప్ 10లో ఆపైన టాప్ 5లో వెళ్లి టైటిల్ మీద ఆశలు రేపింది. టాప్-3లోకి రాగానే ఉత్కంఠ నెలకొంది. చివరి ఇద్దరిలో పరాగ్వే దేశ పోటీదారైన నాడియా చేతులు పట్టుకుని అంతిమ ఫలితం కోసం నిలుచున్న హెర్నాజ్ ‘ఇండియా’ అన్న ప్రకటన వెలువడిన వెంటనే ఆనందబాష్పాలు రాల్చింది. సెకండ్ రన్నర్ అప్‌గా సౌత్ ఆఫ్రికాకు చెందిన లలేలా నిలిచింది. సౌందర్యంతో పాటు చైతన్యం కూడా అందాల పోటీలో భాగంగా ప్రశ్న–జవాబు ఘట్టంలో లాటరీ ద్వారా ‘గ్లోబల్ వార్మింగ్’ అంశం తన వంతుకు రాగా హర్నాజ్ చైతన్యవంతమైన జవాబు చెప్పింది. ‘ఒకనాడు మనకు మన జీవితం సాక్షాత్కరిస్తుంది. అది వీక్షించదగ్గదిగా ఉండాలని మనం అనుకుంటాం. కాని పర్యావరణానికి మనం చేస్తున్న అవమానకరమైన కీడు వల్ల ఆ జీవితం మనం ఆశించినట్టుగా ఉండదు. ప్రకృతి మరణిస్తుంది. ఇప్పటికైనా ఈ చేటును మనం నివారించగలం. కనీసం అక్కర్లేని లైట్లను ఈ రాత్రి నుంచే ఆఫ్ చేయడం మొదలెడదాం’ అంది. అలాగే ‘నేటి యువతులు ఎదుర్కొంటున్న వొత్తిడిని మీరెలా చూస్తారు’ అనే ప్రశ్నకు ‘నేటి యువతులకు అన్ని శక్తులూ ఉన్నాయి. కాని వారికి వారి పైన నమ్మకం లేదు. ఇతరులతో పోల్చుకుని న్యూనత చెందుతున్నారు. మీరు మీలాగే ఉండటం మీ ప్రత్యేకత అని తెలుసుకోవాలి’ అంటూ సమాధానం చెప్పింది. ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్‌కు విశ్వకిరీటం దక్కగానే తొలి భారతీయ విశ్వసుందరి సుస్మితాసేన్ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ’ అని వ్యాఖ్యానించింది. ఇక లారాదత్తా అయితే ‘విశ్వసుందరుల క్లబ్‌లోకి ఆహ్వానం. ఈ విజయం కోసం 21 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా’ అని ట్వీట్ చేసింది. నిన్న మొన్నటి వరకూ ఒకటి రెండు పంజాబీ సినిమాల్లో నటించింది సంధు. బహుశా అతి త్వరలో ఆమెను బాలీవుడ్ తెర మీద చూడొచ్చు. మధ్యతరగతి విజయం ‘హర్నాజ్ మధ్యతరగతి అమ్మాయి. మధ్యతరగతి అమ్మాయిలు కలలు కని సాధించుకోవచ్చు అనడానికి ఉదాహరణ’ అంటుంది హర్నాజ్ తల్లి రవిందర్ సంధు. ఆమె గైనకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. హర్నాజ్ తండ్రి పేరు పి.ఎస్.సంధు. ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు హరూన్. వీరి కుటుంబం చండీగడ్‌లోని మోహలీలో ఉంటుంది. ఒకవైపు అందాలపోటీ జరుగుతుంటే హర్నాజ్ తల్లి దగ్గరలో ఉన్న గురుద్వార్‌లో రాత్రంతా ప్రార్థనలో కూచుంది. తెల్లవారుజామున హర్నాజ్ టైటిల్ గెలవడం చూసి సోదరుడు హరూన్ పరిగెత్తుకుంటూ వెళ్లి గురుద్వారాలోని తల్లికి ఈ విషయం తెలియచేశాడు. ‘నా కూతురు తిరిగి రావడంతోటే ఆమెకు ఇష్టమైన ‘మక్కికి రోటీ’, ‘సర్సన్ ద సాగ్’ చేసి పెడతాను’ అంది తల్లి ఉత్సాహంగా. హర్నాజ్ చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేది. సాటి విద్యార్థుల గేలి ఎదుర్కొనేది. అయినా సరే టీనేజ్‌లోకి వచ్చాక అందాలపోటీ పట్ల ఆసక్తి పెంచుకుంది. 2017లో ‘మిస్ పంజాబ్’ టైటిల్ గెలుచుకుంది. 2019లో ‘మిస్ ఇండియా’లో సెమీ ఫైనలిస్ట్ దశకు చేరుకుంది. ‘అప్పుడు అర్థమైంది నాకు అందాల పోటీ అంటే కేవలం అందంగా కనిపించడం కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అని. విశ్వ కిరీటం సాధించడానికి ఆ విధంగా నేను సిద్ధమయ్యాను.’ అంటుంది సంధు. కుటుంబ సభ్యులతో హర్నాజ్ The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 -
సమాజాన్ని ఏకం చేసే శక్తి సంస్కృతిదే
సాక్షి, హైదరాబాద్: కుల, ప్రాంత, వర్గాలకు అతీతంగా సమాజాన్ని ఒకచోటకు చేర్చగలిగే శక్తి సంస్కృతికి ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్–బలయ్ కార్యక్రమమని, అస్తిత్వాన్ని కాపాడుకోవడంతో పాటు దేశ సాంస్కతిక పునరుజ్జీవనం మనందరి బాధ్యత అని తెలిపారు. ఆదివారం నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రే య ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దత్తన్న అలయ్ బలయ్–దసరా సమ్మేళన్’కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మా ట్లాడుతూ, భారతదేశానికే ప్రత్యేకమైన అస్తిత్వం ఇంకా నిలబడి ఉండడానికి కారణం మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణేనని అలయ్–బలయ్ కూడా అలాంటి కార్యక్రమమేనని తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్ర, విజ్ఞాన, పరిశోధన రంగాల్లో విశేష కృషి జరిపినందుకుగాను భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి, రెడ్డిలాబ్స్ ఎండీ జీవీ ప్రసాద్‌రెడ్డి, బయోలాజికల్ ఈవాన్స్ మహీమా దాట్లను నిర్వాహకుల తరఫున ఉపరాష్ట్రపతి సన్మానించారు. సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుచేసుకునేందుకే: దత్తాత్రేయ భిన్న సంస్కృతులు, ఆచారాలు, భావజాలాలున్నా అందరూ ఆత్మీయంగా ఒకచోట కూడి ఆడిపాడి, భిన్నరుచులతో కూడిన భోజనం చేయడం, మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకోవడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, అక్కడి నుంచి మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం ఉండడంతో రాలేకపోయారని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వారంతా శత్రువులు కాదు రాజకీయాల్లో ఉన్న వారంతా శత్రువులు కాదని, రాజకీయ ప్రత్యర్థులం మాత్రమేనని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. అందరూ ఐకమత్యంగా ఉండాలన్న భావనతోనే బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. భిన్నసంస్కృతులు, ఆచారాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఇలాంటి ఉత్సవాలను ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహించాల్సిన అవసరం ఉందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లెకర్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగే అలయ్ బలయ్ వంటి ఉత్సవాలు దేశంలోనే ఎక్కడా జరగవని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంచికి, సహృదయతకు దత్తాత్రేయ ప్రతిరూపంగా నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ప్రాంతీయతలు, ఎజెండాలకు అతీతంగా భాషలు వేరైనా మనమంతా ఒక్కటేననే సంస్కృతిని దత్తాత్రేయ ముందుకు తీసుకెళుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. బండారు దత్తాత్రేయ సతీమణి వసంత, ఆహ్వాన కమిటీ తరఫున దత్తాత్రేయ వియ్యంకులు బి.జనార్దనరెడ్డి, బండారు విజయలక్ష్మి–డాక్టర్ జిగ్నేష్రెడ్డి దంపతులు, చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళా కెప్టెన్ రేష్మా రెజ్వాన్, డా.షేక్ హసీనా, గాయకురాలు మధుప్రియ, అనూహ్యరెడ్డి, ప్రవీణ్‌కుమార్ గోరకవిలను ఈ సందర్భంగా సన్మానించారు. పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు... శాసనమండలి ప్రొటెమ్ చైర్మన్ ఎం.భూపాల్‌రెడ్డి, రాష్ట్ర హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి, సినీనటులు మంచు విష్ణు, కోట శ్రీనివాసరావు, ఎంపీ కె.కేశవరావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, వి.హనుమంతరావు, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్, బీసీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలయ్–బలయ్ కార్యక్రమంలో కోలాటమాడుతున్న గవర్నర్లు దత్తాత్రేయ, తమిళిసై. చిత్రంలో దత్తాత్రేయ కుమార్తె.. -
నాసా ఇంటెర్న్.. ఇష్ట దైవాలు
‘నాసా’ ఇంటెర్న్‌గా శిక్షణ పొందుతున్న భారత సంతతి అమెరికన్ ప్రతిమా రాయ్ నాసా లోగో ఉన్న షర్ట్ వేసుకుని, తన డెస్క్‌టాప్ వెనుక హైందవ దేవతల విగ్రహాలు కనిపించేలా తీయించుకున్న ఫొటో ఇంటర్నెట్ను ఇప్పుడు మంత్రముగ్ధం చేస్తోంది. నిజానికి ఆ ఫొటోను ఆమె షేర్ చేయలేదు. కొత్త అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించే ప్రకటనకు నాసా ఉపయోగించిన నలుగురు ఇంటెర్న్ ఫొటోలలో ఈ ఫొటో కూడా ఉంది. ‘మా దగ్గర శిక్షణ పొందదలచిన ఔత్సాహిక వ్యోమగాములకు గడువు తేదీ దగ్గర పడింది’ అని గుర్తు చేస్తూ ఈ నెల 10 న నాసా ఆ ఫొటోలను ట్విట్టర్లో అప్లోడ్ చేసింది. వాటిల్లో ఒకటైన ప్రతిమ ఫొటో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఉంది. అదే సమయంలో శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు సంకేతంగా ఆమె వేసుకున్న షర్ట్ ప్రతిఫలిస్తోంది. ఈ వైరుధ్యంపై నెటిజన్లు మొదట ప్రతికూలంగా స్పందించినప్పటికీ.. మెల్లిమెల్లిగా ప్రతిమకు మద్దతు లభించడం ఆరంభమైంది. సైన్స్‌కు, విశ్వాసాలకు పొంతన ఏమిటి అనే ప్రశ్న కన్నా.. ఒక దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రతిమ ఫొటో చక్కగా ఉన్నదన్న సమర్థింపులే ఎక్కువగా పోస్ట్ అవుతున్నాయి. అలా ఫొటో తీయించుకున్న ప్రతిమకు, ఆ ఫొటోనే ఏరి కోరి షేర్ చేసిన నాసాకు ప్రశంసలు లభిస్తున్నాయి. -
ప్లీజ్.. సంప్రదాయ దుస్తుల్లో రండి: షిర్డి
ముంబై: బాబా దర్శనానికి వచ్చే వారు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా షిర్డి సాయిబాబా ఆలయ ట్రస్టు నిర్వహకులు భక్తులను అభ్యర్థించారు. ఇది కేవలం అభ్యర్థన మాత్రమే అని.. భక్తులపై ఎలాంటి డ్రెస్ కోడ్ విధించలేదని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ బాగటే మాట్లాడుతూ.. ‘బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే గతంలో కొందరి వస్త్రధారణ పట్ల పలవురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకర దుస్తులు ధరించి ఆలయంలోకి వచ్చారని కొందరు ఫిర్యాదు చేశారు. అందుకే ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం. కనుక మోడర్న్ దుసుల్లో వచ్చే వారికి మా విజ్ఞప్తి ఇదే.. దయచేసి భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రండి. ఇది కేవలం విన్నపం మాత్రమే. భక్తుల మీద ఎలాంటి డ్రెస్ కోడ్ విధంచలేదు’ అని తెలిపారు. (చదవండి: సమసిన షిర్డీ వివాదం) -
చీరకట్టు కేవలం అలంకారం కోసమే కాదు..
జూబ్లీహిల్స్: భారతీయ మహిళల చీరకట్టు కేవలం అలంకారం కోసమే కాదు. వారి ఆత్మగౌరవం పెంచడంలో, చక్కటి స్ఫూర్తిని ఇవ్వడంతో పాటు ఒక విలక్షణ ఉనికిని చాటుతాయని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ అన్నారు. ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో సోమవారం “ద ఫ్యూచర్ ఆఫ్ లగ్జరీ అండ్ ద మేకిన్ ఇండియా’ పేరుతో నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన డిజైన్ ఎంతో సరళంగా ఉంటుందన్నారు. దుస్తులు మనిషి మేధకు పొడిగింపులాంటిదన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ మాజీ జాతీయ అధ్యక్షురాలు పింకీరెడ్డి, ఎఫ్ఎల్ఓ చాప్టర్ అధ్యక్షురాలు సుధారాణి సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఓగ్ ఇండియా మేగజైన్ ఎడిటర్ ప్రియాతన్నా సంధానకర్తగా వ్యవహరించారు. ప్రముఖ డిజైనర్ సవ్యసాచితో వెబ్‌నార్ దృశ్యం.. -
కోమేషా కరోనా
ఉహురు కెన్యాట్టా – కెన్యా అధ్యక్షుడు, మార్గరెట్ వాంజిరు గకువో – కెన్యా తొలి మహిళ, వాళ్ల ముందు భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి ప్రసంగించారు ఓ మహిళ. మన వివాహ వ్యవస్థను చప్పట్లతో అభినందిస్తూ మళ్లీ మళ్లీ విన్నారు వాళ్లు. కెన్యాలో ఉన్న హిందువుల పెళ్లిని నిర్ధారించాల్సిన బాధ్యత ఆమెకే అప్పగించారు. ఇప్పుడు... దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తున్నాయి... యుద్ధానికి దేశాన్ని సన్నద్ధం చేయాల్సిన బాధ్యతనూ ఆమె భుజాల మీదనే పెట్టింది కెన్యా. ఇప్పుడామె... ఆ దేశంలో వాళ్లకు మన నమస్కారాన్ని నేర్పిస్తున్నారు. చిలుక పచ్చ బోర్డరున్న నేవీ బ్లూ చేనేత చీర కట్టుకుని, చెవులకు బుట్ట జూకాలు ధరించిన ఓ అచ్చమైన తెలుగింటి మహిళ చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడి చివరగా స్వాహిలి భాషలో ‘కోమేషా కరోనా’ అంటూ నమస్కారంతో పూర్తి చేశారు. కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కెన్యా దేశ ప్రజలకు వివరించడానికి రూపొందించిన వీడియో అది. ఇరవై ఏడేళ్ల కిందట భర్త ఉద్యోగ రీత్యా ఆరు నెలలు మాత్రమే ఉండడానికి కెన్యాలో అడుగుపెట్టారు కోటంరాజు సుజాత. ‘ఇరవై ఏడు క్యాలెండర్లు మారినా నాకింకా ఆరు నెలలు పూర్తికాలేద’న్నారామె నవ్వుతూ. స్వాహిలి భాష నేర్చుకుని కెన్యా ప్రజలతో మమేకమైపోయారామె. కరోనాసంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కెన్యా తీసుకుంటున్న రక్షణ చర్యల్లో భాగంగా ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ సుజాత దగ్గరకు వచ్చింది. భౌతికదూరం పాటించడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడం, షేక్‌హ్యాండ్‌కు బదులు నమస్కారం చేయడం ద్వారా కరోనాను దూరంగా ఉంచవచ్చనే సందేశాన్ని సుజాత మాటల్లో చెప్పించుకుంది కెన్యా. ఆ దేశ టీవీల్లో ఆమె సందేశమిచ్చిన వీడియో ప్రసారమవుతోంది. బందరమ్మాయి కోటంరాజు సుజాత పుట్టింది, పెరిగింది మచిలీపట్నంలో. పెళ్లి తరవాత హైదరాబాద్‌కి వచ్చి చైల్డ్ సైకాలజీలో కోర్సు చేశారు. భర్త కోటంరాజు రుద్రప్రసాద్ బరోడాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్న రోజులవి. ఉద్యోగంలో భాగంగా కెన్యాకు వెళ్లాల్సి వచ్చింది. ఆ దేశం వెళ్లడానికి మొదట్లో ఏ మాత్రం ఇష్టపడని సుజాత... కొన్నాళ్ల తర్వాత అయిష్టంగానే కెన్యాలో అడుగుపెట్టారు. అది కూడా ఆరునెలల్లో వచ్చేయవచ్చనుకుంటూ విమానం ఎక్కారు. ఆ తర్వాత ఆమె ఇండియాకి వచ్చింది ప్రసవం కోసమే. ‘గృహిణిగా కెన్యాలో అడుగుపెట్టిన సుజాత... ఇప్పుడక్కడ కీలకమైన బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నారు. కెన్యా సమాజ నిర్మాణంలో కూడా ఆమె సేవలందిస్తున్నారు. జర్మనీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన అంతర్జాతీయ శాంతిసదస్సుకు కెన్యాప్రతినిధిగా హాజరయ్యారు. ‘ఆఫ్రికా ఉమెన్ ఫెయిత్ నెట్వర్క్’, కెన్యా హెల్త్‌కేర్, లేబర్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, యాంటీ కరప్షన్ స్టీరింగ్ కమిటీలలో మెంబరుగా విశేషంగా సేవలందిస్తున్నారు. కెన్యాలోని హిందూ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ, సత్యసాయి సేవా సమితి వైస్‌ప్రెసిడెంట్‌గా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కరోనా భూతాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో ఉపాధికి దూరమైన వాళ్లను ఆదుకోవడానికి కెన్యాలో ఉన్న హిందూ కౌన్సిల్ ప్రభుత్వానికి వంద మిలియన్ షిల్లింగులను (సుమారు ఏడు కోట్ల పదిలక్షల రూపాయలు) విరాళంగా ఇవ్వడంలో సుజాత చొరవ ప్రధానమైనది. ఇవి కాకుండా స్వయంగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, హెచ్ఐవి బాధితుల శరణాలయాలకు వెళ్లి విరాళాలను పంపిణీ చేశారామె. మనవాళ్లే స్ఫూర్తి ‘‘1992లో మా వారు కెన్యాలో కొంతకాలం పని చేయాలని చెప్పగానే ప్రపంచ పటం తీసుకుని కెన్యా ఎక్కడ ఉందోనని చూసుకున్నాను. అన్యమనస్కంగానే బయలుదేరాను. అప్పటికి కెరీర్ ప్లాన్లు కూడా ఏమీ లేవు. అక్కడికి వెళ్లిన తర్వాత నాలో మార్పు వచ్చింది. సమాజాన్ని చూసే దృక్కోణం మారిపోయింది. కెన్యాలో నూరుశాతం అక్షరాస్యత ఉంది. ఇళ్లలో పని చేయడానికి వచ్చిన వాళ్లు కూడా మంచి ఇంగ్లిష్ మాట్లాడతారు. రెండు–మూడు తరాల కిందట మనదేశం నుంచి వెళ్లిన అనేక కుటుంబాలు నాలో ఇండిపెండెంట్‌గా జీవించగలగాలనే కోరిక కలిగించాయి. ముఖ్యంగా గుజరాత్ వాళ్లయితే ముసలి వాళ్లు కూడా సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుని వస్తుంటారు. దాంతో నేను ఇండియాలో చదివిన మాంటిస్సోరీ చైల్డ్ సైకాలజీలోనే అడ్వాన్స్డ్ కోర్సు చేసి అదే విద్యాసంస్థలో టీచర్‌గా చేరాను. పిల్లలతోపాటు నేనూ స్కూలుకెళ్లేదాన్ని. కొన్నేళ్లకు మా వారు ఉద్యోగం మానేసి నైరోబీ (కెన్యా రాజధాని)లో సొంత వ్యాపారం మొదలు పెట్టారు. తరచూ మారిపోయే ఉద్యోగులతో ఆయనకు ఇబ్బంది ఎదురవుతుండేది. దాంతో నేను టీచర్ ఉద్యోగం మానేసి మా సంస్థలో హెచ్ఆర్, అకౌంట్స్ బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టాను. సంస్థ నిర్వహణలో నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయమేమిటంటే... కరోనా లాక్డౌన్ కారణంగా పనులు ఆగిపోవడంతో అనేక కంపెనీలు ఉద్యోగాల కోత, జీతాల కోతను ఆశ్రయిస్తున్నాయి. కానీ నేను ఆ పని చేయలేదు. కెన్యా భాష స్వాహిలి నేను సరదాగా స్వాహిలి భాష నేర్చుకున్నాను. నేను మాట్లాడే స్వాహిలి విన్న వాళ్లు నేను కెన్యాలో పుట్టి పెరిగాననుకుంటారు. వాళ్ల భాష నేర్చుకోవడం వల్ల స్థానికంగా సామాజిక కార్యక్రమాల నిర్వహణలో వాళ్లతో సులభంగా కలిసిపోగలిగాను. ప్రస్తుతం కెన్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి కరోనా నియంత్రణ, నివారణ కోసం పని చేస్తున్నాను. చాలా బాగా కట్టడి చేయగలిగామనే చెప్పాలి. మా దగ్గర కోవిడ్ కేసులు పదకొండు వందల దగ్గరే ఆగిపోయాయి. మరణాలు యాభై దాటలేదు’’ అన్నారు సుజాత. రెండూ సొంత దేశాలే మన భారతదేశంలో పుట్టి, కెన్యా గురించి మాట్లాడేటప్పుడు ‘మా దగ్గర’ అన్నారామె. అంతగా ఆ దేశంతో మమేకమైపోయారు సుజాత. ‘‘మరి ఈ దేశం (కెన్యా) మాకు పౌరసత్వం కూడా ఇచ్చింది. ‘మా’ అనుకోకుండా ఉండలేను. ఇండియా ఎంతో నాకు కెన్యా కూడా అంతే’’ అన్నారు సుజాత. కరోనా తగ్గిన తర్వాత ఫ్రాన్స్‌లో ఉన్న పెద్ద కొడుకు, యూఎస్‌లో ఉన్న చిన్న కొడుకుకీ సెలవు చూసుకుని అందరం ఒకసారి ఇండియాకి రావాలని ఉందన్నారామె. – వాకా మంజులారెడ్డి ‘కరోనాను కట్టడి చేద్దాం’ అని కెన్యా ప్రజలకు పిలుపునిస్తున్న కోటంరాజు సుజాత -
తెల్లని దుస్తుల్లో రాజహంసలా..
అహ్మదాబాద్: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. ఒకప్పటి మోడల్, ఫ్యాషన్ డిజైనర్ కూడా. భారత్ పర్యటన సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో వస్తారా లేదానని యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అమెరికా నుంచి అహ్మదాబాద్‌కి వచ్చిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం నుంచి మెలానియా తనకు ఎంతో ఇష్టమైన తెలుపు రంగు దుస్తుల్లో ఒక రాజహంసలా కిందకి దిగారు. తెల్లని జంప్ సూట్ ధరించి నడుం చుట్టూ ఆకుపచ్చని రంగు సాష్ (ఫ్యాషన్ కోసం ధరించేది) అందంగా చుట్టుకున్నారు. భారత సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా, మన దేశీ టచ్‌తో రూపొందించిన డ్రెస్ ధరించడం అందరినీ ముగ్ధుల్ని చేసింది. జుట్టును లూజ్‌గా వదిలేసి అతి కొద్దిగా మేకప్ వేసుకొని తన సహజ సౌందర్యంతోనే ఆమె మెరిసిపోయారు. స్వయంగా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మెలానియా సాధారణంగా తన దుస్తుల్ని తానే డిజైన్ చేసుకుంటారు. కానీభారత్ పర్యటన కోసం ప్రముఖ ఫ్రెంచ్ అమెరికన్ డిజైనర్ హెర్వ్ పెయిరె డిజైన్ చేసిన సూట్‌ని ధరించారు. పాల నురుగులాంటి తెల్లటి జంప్ సూట్ వేసుకొని, ఆకుపచ్చ రంగు పట్టు మీద బంగారం జరీ ఎంబ్రాయిడీతో చేసిన దుప్పట్టాను చుట్టుకున్నారు. భారత్ వస్త్ర పరిశ్రమకు చెందిన 20 శతాబ్దం నాటి తొలి రోజుల్లో డిజైన్లను ఆకుపచ్చ రంగు దుప్పట్టాపై చిత్రీకరించినట్టుగా హెర్వ్ పెయిర్ తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో వెల్లడించారు. తన మిత్రులు పంపించిన కొన్ని డాక్యుమెంట్లని చూసి అత్యంత శ్రద్ధతో ఆకుపచ్చ రంగు సాష్‌ను తయారు చేసినట్టు తెలిపారు. మెలానియా ధరించిన డ్రెస్‌పై ట్విటర్లో ప్రశంసలే వచ్చాయి. కొందరు హాస్యఛలోక్తుల్ని కూడా విసిరారు. అందానికే అందంలా ఉండే మెలానియా కొంటె కుర్రాళ్ల బారి నుంచి తనని తాను కాపాడుకోవడానికి కరాటే డ్రెస్ తరహాలో దుస్తులు ధరించారని కామెంట్లు చేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ డార్క్ కలర్ సూట్ , పసుపు రంగు టై ధరించారు. మన భారతీయు వాతావరణానికి తగ్గట్టుగా వారి దుస్తుల్ని డిజైన్ చేశారు. -
భళా బెలుం
కోవెలకుంట్ల/కొలిమిగుండ్ల: భారతీయ సంస్కృతిలో గుహలకు ప్రత్యేక స్థానం ఉంది. దేవుళ్లు, దేవతలకు గుహలు నివాసమని కొందరు నమ్మితే.. మరికొందరు ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లుగా గుర్తిస్తారు. అందుకే అవి పవిత్ర స్థలాలుగా, పర్యాటక స్థలాలుగా విలసిల్లుతున్నాయి. సాధారణంగా గుహలు కొండ చరియల్లో, అడవుల్లో ఎక్కువగా కన్పిస్తాయి. దీనికి భిన్నంగా సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సాగు భూమి లోపల ఏర్పడిన గుహలు కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. కొలిమిగుండ్ల మండలం బెలుం సమీపంలోని ఈ గుహలు ప్రపంచంలోనే రెండో అంతర్భూభాగ గుహలుగా, దేశంలోనే పొడవైనవిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఈ నేపథ్యంలో బెలుం గుహల విశేషాలు తెలుసుకుందాం. గుహల ఉనికిని చాటిన ఆంగ్లేయుడు 1884వ సంవత్సరంలో హెచ్‌బీ ఫూటే అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా బెలుం గుహల ఉనికిని చాటినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తర్వాత వందేళ్ల వరకు వీటి ప్రస్తావన లేదు. 1982–1984 మధ్య కాలంలో హెచ్డీ గేబర్ అనే జర్మనీ దేశస్తుడు ఇక్కడకు వచ్చి 3,225 మీటర్ల వరకు శోధించి ఒక పటాన్ని తయారు చేశాడు. వీరికి స్థానికులైన అప్పటి రిటైర్డ్ ఎస్పీ చలపతిరెడ్డి, ఆయన అల్లుడు రామసుబ్బారెడ్డి పూర్తి సహకారం అందించారు. 1988లో ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ ఈ గుహలను రక్షిత స్థలంగా ప్రకటించి కొన్నేళ్లపాటు కాపాలాదారుని నియమించింది. ఇక్కడ క్రీ.పూ. 450 సంవత్సరాల కాలం నాటి మట్టి పాత్రలో మనిషి అస్థికలు, రాతి కత్తి లభ్యం కావడంతో ఈ గుహలను కూడా ఆనాటి మానవులు నివాస స్థలాలుగా వినియోగించుకున్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. వీటిని అనంతపురం మ్యూజియంలో భద్రపరిచారు. 1999లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ బెలుం గుహలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ఆధీనంలోకి తీసుకుంది. 2003 నుంచి బెలుం గుహల సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. సొరంగ మార్గాల్లో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున మట్టి దిబ్బలను తొలగించి నాపరాళ్లు పరిచి నడక దారిని ఏర్పాటు చేశారు. విశేషాలివీ - బెలుం గుహల్లో 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల లోతు వరకు రకరకాలుగా ఉన్న ఈ సొరంగాలు కొన్నిచోట్ల ఇరుకుగాను, మరికొన్నిచోట్ల విశాలమైన గదులుగాను ఉండి కొన్నిచోట్ల స్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లు అనబడే స్ఫటికాకృతులు ఏర్పడి ఉన్నాయి. - ఈ శిలల ఆకృతుల ఆధారంగా కొన్ని ప్రదేశాలకు వేయి పడగలు, కోటి లింగాలు, ఐరావతం, ఊడలమర్రి, మాయా మందిరం, వంటి పేర్లు పెట్టారు. - ఇవికాకుండా ధ్యానమందిరం, మండపం, కప్పులో ఉన్న బొంగరపు గుంతలు, గుహల చివరి వరకు పోతే పాతాళగంగ అనే నీటి మడుగు అక్కడే రాతిలో మలచిన శివలింగం ఉన్నాయి. - విద్యుద్దీప కాంతులతో ఈ సొరంగ సోయాగాలను తిలకిస్తూ లోపలికి వెళ్లే కొద్దీ మరో ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. - గుహల్లో ఉండే నీటికి, బెలుం గ్రామంలోని శివాలయం పక్కనే నిటారు దారులు కలిగిన రాతిబావిలోని నీటిమట్టంకు సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండు చోట్లా ఎప్పుడూ నీటి మట్టాలు సమానంగా ఉంటాయని పేర్కొంటున్నారు. పెరుగుతున్న సందర్శకుల తాకిడి ప్రతి శని, ఆదివారాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు రోజుల్లో బెలుం గుహలకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు విదేశీయులు బెలుం గుహలను సందర్శిస్తున్నారు. పెద్దలకు రూ. 65, పిల్లలకు రూ. 45 ప్రకారం నామమాత్రపు రుసుం వసూలు చేస్తున్నారు. తద్వారా టూరిజం శాఖకు ఏటా రూ. 1.79 కోట్ల ఆదాయం చేకూరుతోంది. గుహల ప్రాముఖ్యత తెలియజేసేందుకు ఇక్కడ తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషలు తెలిసిన తెలుగు గైడ్లు అందుబాటులో ఉన్నారు. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాల కంటే బెలుం గుహల నుంచి టూరిజం శాఖకు అధిక ఆదాయం చేకూరుతుండటం విశేషం.