అందానికి చిరునామాగా నిలిచిన ఆ ముద్దుగుమ్మ.. పట్టుచీరలో మరింత మెరిసిపోయింది. అందం దేవుడిచ్చిన వరం అంటోన్న ఈ బ్యూటీక్వీన్ ఒకే ఏడాది ఏడు బ్యూటీ అవార్డులు సొంతం చేసుకుంది. భారతీయ సంస్కృతి చాటే చీరకట్టు.. మగువల అందాన్ని రెట్టింపు చేస్తుందని చెబుతోంది. సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో బ్యూటిఫుల్ బ్రైడ్‌గా కనిపించిన మిస్ ఇండియా ఎర్త్ అలంకృత సహాయ్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే...
..:: వాంకె శ్రీనివాస్
నేను పుట్టి పెరిగింది ఢిల్లీలో. చదువంతా అక్కడే సాగింది. చిన్నప్పుడు డ్రెస్సింగ్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు. ఓసారి మా బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ అంటే ఏంటో నాకు తెలిసొచ్చింది. నలుగురిలో స్పెషల్‌గా కనిపించాలంటే మన ఆహార్యం అదిరిపోయేలా ఉండాలనిపించింది. అప్పట్నుంచి మార్కెట్లోకి వచ్చే నయా డిజైన్స్ గురించి వాకబు చేస్తుండేదాన్ని. నచ్చిన కాస్ట్యూమ్‌ను ట్రై చేసేదాన్ని. కాలేజ్ డేస్‌లోనూ అందం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాను. అలా మోడల్‌గా రంగప్రవేశం చేశాను. బ్యూటీ అనేది దేవుడిచ్చిన వరం. అందుకే ఆ అందానికి ప్రాధాన్యం కలిగించేందుకు బ్యూటీ కాంపిటీషన్స్‌లో పాల్గొంటూ వచ్చాను.
నమ్మకంతో...
2009లో మిస్ నోయిడా కిరీటాన్ని దక్కించుకున్నా. ఏదో రోజు మిస్ ఇండియాగా మెరవగలననే నమ్మకం కలిగింది. తర్వాత సెకండ్ మిస్ దివా కాంటెస్ట్‌లో పాల్గొని ఫస్ట్ రన్నర్‌గా నిలిచాను. అదే జోష్‌లో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాను. ఫిలిప్పీన్స్‌లో జరిగిన అందాల పోటీల్లో ఎకో బ్యూటీ వీడియో అవార్డు కూడా దక్కింది. వీటితో పాటు మిస్ స్టైల్ ఐకాన్, మిస్ పర్‌ఫెక్ట్ బాడీ, మిస్ టాలెంట్ అవార్డులూ వరించాయి. ఒకే ఏడాది ఏడు అవార్డులు అందుకున్న ఇండియన్ బ్యూటీగా గౌరవం దక్కింది.
మా చెల్లి పుట్టింది ఇక్కడే...
నా చిన్నతనంలో మా పేరెంట్స్ కొన్నాళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మా చెల్లి అపూర్వ ఇక్కడే పుట్టింది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేను. అప్పుడప్పుడూ ఈ బ్యూటిఫుల్ సిటీకి వస్తుండేదాన్ని. ఇక్కడ షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. జ్యువెలరీ కొనుగోలు చేస్తాను. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించాలని ఉంది. టాలీవుడ్‌లో మంచి చాన్స్ దొరికితే తప్పకుండా చేస్తాను. సూపర్‌స్టార్ రజనీకాంత్ మూవీలో అవకాశం వస్తే అస్సలు వదులుకోను. ప్రస్తుతం ఫెమినా కవర్ పేజీపై దృష్టి సారించాను.
అందం ఓ వరం
Published Sun, Feb 15 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement