శాల్యూట్ టు లెజెండ్
ఖాదర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్-2014
శిల్పకళావేదికలో నేటి నుంచి
నవాబుగా పుట్టినా తన జీవితం భారతీయ సంస్కృతిలో ఉందని గుర్తించిన వ్యక్తి ఖాదర్ అలీ బేగ్!. 9 జూన్ 1938న మరణించిన ఖాదర్‌అలీ జీవించింది 46 ఏళ్లే. తరతరాలకూ స్ఫూర్తినిచ్చే నాటకాలను ప్రదర్శించి దక్కన్ పతాకను జాతీయ రంగస్థలిపై రెపరెపలాడించారు! ‘నీ చేతుల్లో నాటకరంగం భవిష్యత్తు పదిలంగా ఉంటుంది’ అన్నారు ఖాదర్ అలీ ప్రదర్శించిన నాటకాలను ముంబైలో చూసిన పృథ్వీరాజ్ కపూర్.
తండ్రికి తగ్గ తనయుడు మహమ్మద్ అలీబేగ్! తండ్రి నుంచి నటననే కాకుండా, జాతీయ భావాలనూ వారసత్వంగా స్వీకరించారు. ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్ స్థాపించి వివిధ దేశాలకు చెందిన నాటకాలను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచదేశాల కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శిస్తూ ఖాదర్ అలీ బేగ్‌కు ‘శాల్యూట్ టు లెజెండ్’ అంటున్నారు!
ఏటా జరుపుతున్న థియేటర్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ ఏడాది ఉత్సవాలను ఈ రోజు సాయంత్రం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శిల్పకళావేదికలో ప్రారంభిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 16 వరకు నగరంలోని వివిధ వేదికలలో వైవిధ్యభరితమైన నాటికలను ప్రదర్శిస్తున్నారు. వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నారు. పుస్తకావిష్కరణలు చేస్తున్నారు.
కార్యక్రమాల వివరాలు
శుక్రవారం (7): రాత్రి 7-30: శిల్పకళావేదిక- ‘బాయిల్డ్ బీన్స్ ఆన్ టోస్ట్’, దర్శకత్వం: లిలిట్ దుబె
శనివారం (8): రాత్రి 7-30: రవీంద్రభారతి- ‘సావన్-ఎ-హయత్’, దర్శకత్వం: మహ్మద్ అలీబేగ్
ఆదివారం (9): సాయంత్రం 6: రవీంద్రభారతి- ‘ద కిడ్స్ గాట్ చరిష్మా’, దర్శకత్వం: ముర్రెమలయ్
రాత్రి 7-30: రవీంద్రభారతి- ఫ్రెంచ్ నాటిక ‘ద టూ పారెలల్స్’
సోమవారం (10): రాత్రి 7-30: రవీంద్రభారతి- తెలుగు నాటిక ‘సుందరి-సుందరుడు’, దర్శకత్వం: రాళ్లపల్లి
మంగళవారం (11): రాత్రి 7-30: రవీంద్ర భారతి- తెలుగు-ఇంగ్లిష్-తమిళ్-హిందీ-సంస్కృతం-కన్నడ భాషలలో120 ని.ల నృత్యరూపకం ‘ద్వారం’, నృత్య దర్శకత్వం: వాణీగణపతి
బుధవారం (12): రాత్రి 7-30: రవీంద్రభారతి- ‘సిమ్లా కాఫీ హౌస్, దర్శకత్వం: బేడీ
గురువారం (13): సాయంత్రం 6, సాలార్‌జంగ్ మ్యూజియం- ‘ద వన్ అండ్ ఓన్లీ నానా’, దర్శకత్వం: మోహన్ అగాసే రాత్రి 7-30, ‘జుగ్ జుగ్ జియో’, దర్శకత్వం: స్మితాభారతి
శుక్రవారం (14): రాత్రి 7-30, సాలార్‌జంగ్ మ్యూజియం- ‘రోజానా’, దర్శకత్వం: ఉషాగంగూలీ
శనివారం (15): రాత్రి 7-30, సాలార్‌జంగ్ మ్యూజియం- ‘హమ్ ముక్తారా’, దర్శకత్వం: ఉషాగంగూలీ
ఆదివారం (16): రాత్రి 7-30, తాజ్ దక్కన్- ‘కామియా’, దర్శకత్వం: రామ్‌గోపాల్ బజాజ్