Silk sarees
-
‘ఇక్కత్’కు ఇక్కట్లు!
సాక్షి, యాదాద్రి: పోచంపల్లి ఇక్కత్ పట్టు చీర ప్రమాదంలో పడింది. పేటెంట్ హక్కు కలిగిన ఇక్కత్ పట్టు చీరల డిజైన్లు కాపీకి గురవుతున్నాయి. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ) కలిగిన ఇక్కత్ డిజైన్లను కొందరు బడా వ్యాపారులు కాపీ కొట్టి ప్రింటెడ్ పాలిస్టర్ చీరలను తయారు చేసి విక్రయిస్తున్నారు. నేతన్న నేసే పట్టుచీర డిజైన్‌ను బట్టి గరిష్టంగా రూ.20 వేలు పలుకుతుండగా ప్రింటెడ్ పట్టు చీరల పేరుతో వస్తున్న చీరలు కేవలం రూ.600కే లభ్యమవుతున్నాయి. దీంతో వినియోగదారులు ప్రింటెడ్ చీరల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పట్టు చీరల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు చేనేత వృత్తిదారులు దెబ్బతింటున్నారు. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సుమారు 50 వేల చేనేత వృత్తి దారుల జీవనోపాధిపై ప్రింటెడ్ చీరలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. చేనేత డిజైన్లు కాపీకి గురికాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చేనేత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రాండ్ ఇమేజ్‌పై దెబ్బ పట్టుదారానికి రంగులద్ది డిజైన్లు కట్టి నేసే ఇక్కత్ పట్టు చీరకు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ చీరలకు మహిళల్లో విశేష ఆదరణ ఉంది. పోచంపల్లి కేంద్రంగా తయారయ్యే పట్టు చీరలకు అంతర్జాతీయంగా గుర్తింపు కూడా ఉంది. అలాంటి పట్టు చీరల డిజైన్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో చీర ధర పడిపోవడం, ఏది అసిలీనో ఏది నకిలీనో గుర్తించలేకపోవడం, ఆన్లైన్లో మోసాలు జరగడం లాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా పోచంపల్లి డిజైన్లతో ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు బహిరంగ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ చీరలు రూ.600 నుంచి రూ.1000 లోపే లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఆకర్షితులవుతున్నారు. భారీగా పడిపోయిన అమ్మకాలు ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో 12,000 మంది చేనేత కళాకారులకు జియో ట్యాగ్ ఉంది. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతినెలా ఒక జియో ట్యాగ్ కళాకారుడితోపాటు మరో ఇద్దరు అనుబంధ కళాకారులు ఉంటారు. అంటే సుమారు 36 వేల మంది నేరుగా వృత్తిలో ఉన్నారు. నెలకు ఒక చేనేత కుటుంబం ఐదు చీరలు తయారు చేస్తుంది. ఇలా తయారైన చీరలతో గతంలో నెలకు రూ. 40 కోట్ల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం ప్రింటెడ్ చీరలు రాకతో రూ.20 కోట్లకు అంటే సగానికి సగం వ్యాపారం పడిపోయిందని నేతన్నలు చెబుతున్నారు. మూట వ్యాపారం దాకా విస్తరణ పోచంపల్లి ప్రింటెడ్ పట్టు చీరలు ఇప్పుడు గ్రామాల్లో మూట వ్యాపారం దాకా వచ్చాయి. గతంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనే లభించే ప్రింటెడ్ చీరలు ఇప్పుడు పల్లెల్లోనూ అమ్ముతున్నారు. ప్రింటెడ్ చీరల అమ్మకాలను అరికట్టాల్సిన యంత్రాంగం చేతులెత్తేయడంతో పోచంపల్లి పట్టు చీరల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని స్థానిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రింటెడ్ చీరలను అదుపు చేయాలి జీఐ పొందిన ఇక్కత్ చేనేత చీరలను పోలిన ప్రింటెడ్ చీరల తయారీని ప్రభుత్వం అరికట్టాలి. ఇటీవల పోచంపల్లికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కేంద్ర జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రచనా సాహు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. గుజరాత్లో ప్రింటెడ్ చీరల తయారీని, షాపింగ్ మాల్స్‌లో అమ్మకాలను నిరోధించాలి. కల్యాణ లక్ష్మి నగదు సహాయంతోపాటు పోచంపల్లి పట్టు చీరను వధువుకు ఇవ్వాలి. ఇక్కత్ వృత్తిని కాపాడాలి. – తడ్క రమేష్, చేనేత సంఘం నాయకులు, పోచంపల్లి మాల్స్‌పై మరిన్ని దాడులు చేస్తాం పోచంపల్లి పట్టు చీరలను పోలిన ప్రింటెడ్ చీరలు సూరత్ నుంచి వస్తున్నాయి. షాపింగ్ మాల్స్‌లో అమ్ముతున్నారన్న విషయాన్ని గుర్తించి దాడులు చేస్తున్నాం. ప్రతి డిజైన్‌ను కాపీతో ప్రింట్ చేసి చీరలను విక్రయిస్తున్నారు. చేనేత వృత్తిదారులకు ఇది తీరని నష్టం కలిగిస్తోంది. త్వరలో మరిన్ని దాడులు చేయబోతున్నాం. – వెంకటేశ్వర్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి -
Interior Decoration: పండగ వేళ పట్టుకుషన్
ఇంటి కళ పెరగడంలో గోడల రంగులు, ఫర్నిచర్ మాత్రమే కాదు చిన్న చిన్న వస్తువులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినవి కుషన్స్. ఇల్లు క్యాజువల్‌గా ఉండాలా, లేక పండగ వేళ కళ రెట్టింపు అవ్వాలా అంటే.. సింపుల్ చిట్కా అందమైన కుషన్స్‌తో సోఫా లేదా చెయిర్స్ను అలంకరించడం. కుషన్స్ కోసం అదనంగా ఖర్చు పెట్టాలా అని ఆలోచించనక్కర్లేదు. ఇంట్లో ఇప్పటికే ఉన్న పాత కుషన్స్కి కొత్త కవర్స్ వేసేస్తే సరి. ఈ కవర్స్‌ని కూడా ఎవరికి వారు స్వయంగా డిజైన్ చేసుకోవచ్చు కూడా. బ్రొకేడ్ సిల్క్ కవర్స్ జరీతో ఉన్న ఏ క్లాత్తోనైనా కుషన్ కవర్స్‌ని కుట్టొచ్చు లేదా బడ్జెట్‌ను బట్టి కొనుగోలు చేయవచ్చు. ఇవి పండగ వేళ ప్రత్యేకమైన శోభను తీసుకువస్తాయి. అమ్మ చీర చెంగే కవర్ అమ్మ పాత చీరలను కుషన్ కవర్లుగా మార్చేయవచ్చు. కొన్ని చీరలు కొని కట్టకుండా పక్కన పెట్టేస్తుంటాం. లేదంటే, ఎవరైనా కానుకగా ఇచ్చిన చీరలు నచ్చక, అవి అల్మరాలో అడుగుకు చేరి ఉంటాయి. వీటిలో జరీ అంచు ఉన్న చీరలను కుషన్ కవర్స్‌గా మార్చుకుంటే ఉపయోగంగానూ, కళగానూ ఉంటాయి. అంతే కాదు, అమ్మ ప్రేమ కుషన్ కవర్లపై మరింత ఆకర్షణీయంగా అమరిపోతుంది. పెయింటింగ్ కవర్ ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ, ప్రయత్నిస్తే సాధించలేనిదేమీ లేదు కాబట్టి ఏదైనా ఫ్యాబ్రిక్ పెయింట్‌ను ప్లెయిన్ కుషన్ కవర్‌మీద వేసి అలంకరించుకోవచ్చు. దీనితో మీ అభిరుచికీ ప్రశంసల వర్షం కురుస్తుంది. కలంకారీ కవర్ కొన్నింటిని ఏ విధంగానూ మార్చేయాలనిపించదు. వాటిల్లో కలంకారీ ఆర్ట్ ఒకటి. కలంకారీ ప్రింట్ చీరలు ఉంటే వాటిని కుషన్ కవర్‌గా మార్చేసుకోవచ్చు. అల్లికల కవర్ క్రోషెట్, ప్యాచ్ వర్క్ కుషన్ కవర్స్ కూడా ఎంబ్రాయిడరీ పనితనానికి పెట్టింది పేరు. వీటిని మీరుగా తయారుచేయలేకపోయినా ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్‌కు వెళ్లిన ప్పుడు కొనుగోలు చేస్తే, వాటిని ప్రత్యేక సందర్భాలప్పుడు అలకంరించి లివింగ్ రూమ్‌కు కొత్త అందం తీసుకురావచ్చు. రౌండ్ కుషన్ కవర్స్.. ఫ్లోర్ మీద వేసుకుని, కూచునే కుషన్స్ ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి కవర్లు మల్టీ కలర్‌తో ఉంటే గది అందం రెట్టింపు కాకుండా ఉండదు. ఇవి లివింగ్, డైనింగ్ హాల్‌కి అనువుగానూ, అట్రాక్షన్గానూ ఉంటాయి. -
ఏపీలోనే ప్రథమ స్థానం.. పట్టు.. ‘కొత్త’గా మెరిసేట్టు..
ధర్మవరం...పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది పట్టుచీర. రక్షా బంధన్ చీర, కట్టుకుంటే సంగీతం వినిపించే మ్యూజికల్ చీర, పూల వాసన గుబాళించే సంపంగి చీర, వాతావరణాన్ని బట్టి రంగు మారే చీర, భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే చీరలు.. ఇక్కడి నేతన్నల నైపుణ్యానికి నిదర్శనం. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మవరం చీరకు ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు కూడా ఇచ్చింది. నూతన జిల్లా శ్రీసత్యసాయి మకుటంలో ధర్మవరం పట్టుచీర మణిలా మెరుస్తోంది. రానున్న రోజుల్లో మరింత ప్రకాశించనుంది. చదవండి👉: మారేడు తెచ్చి.. నన్నారి షర్బత్ చేసి.. ధర్మవరం టౌన్(శ్రీసత్యసాయి జిల్లా): జిల్లాకు ధర్మవరం పట్టుచీర కీర్తికిరీటంలా నిలుస్తోంది. రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతం ధర్మవరం. ఇక్కడి నేతన్నలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, విదేశాలకు సైతం పట్టుచీరలను ఎగుమతి చేస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో సగటున వారానికి రూ.100 కోట్ల దాకా పట్టుచీరల బిజినెస్ జరుగుతోంది. ధర్మవరం నేతన్నల పనితనాన్ని గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇచ్చింది. ఉపాధికి ఊతం శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, పుట్టపర్తి, కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం, చిలమత్తూరు మండలాల్లో 28 వేల దాకా చేనేత మగ్గాలున్నాయి. ఒక్క ధర్మవరం పట్టణంలోనే 20 వేల మగ్గాలున్నాయి. చేనేత మగ్గాలతో పాటు పట్టుచీరల తయారీలో 18 దాకా అనుబంధ రంగాలు ఉంటాయి. రంగుల అద్దకం, డోలు చుట్టడం, పాలిషింగ్, పురిమిషన్, బోట్లు చుట్టడం, రేషం చుట్టడం, అచ్చులు అతకడం తదితర వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది దాకా ఉపాధి పొందుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ఇక్కడి డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందిస్తున్నారు. వందమంది దాకా పట్టుచీరల డిజైనర్లు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వివాహ శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీలు ధరించే చీరల కోసం ఇక్కడి డిజైనర్లు వినూత్న డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు. ధర్మవరం పట్టుచీర జరీ, మోడల్, డిజైన్బట్టి రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. భౌగోళిక గుర్తింపు ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచ్చింది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతర ప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్లు నేస్తే చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేశ, విదేశాలకు ఎగుమతులు ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ధర్మవరంలో 1,800 దాకా సిల్్కషాపులుండగా.. వీటి ద్వారా పట్టుచీరలను కొనుగోలు చేయడం, ఆపై షోరూంలకు హోల్‌సేల్‌గా ఎగుమతి అవుతాయి. ధర్మవరం నేసేపేటలోని పట్టుచీరల మార్కెట్లో వారానికి సగటున రూ.100 కోట్ల దాకా టర్నోవర్ జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసి శ్రీసత్యసాయి జిల్లాకు వన్నె తేవాలని నేతన్నలు కోరుతున్నారు. చేనేతకు మంచిరోజులు శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటుతో ధర్మవరం చేనేతలకు మంచిరోజులు వచ్చాయి. పుట్టపర్తి ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాక పోకలకు అనుమతినిస్తే వ్యాపారులు ఎక్కువ మంది ధర్మవరం వచ్చే అవకాశం ఉంటుంది. సరుకు ఎగుమతులకూ వీలు కలుగుతుంది. తద్వారా వ్యాపారం మరింత జోరందుకుంటుంది. –రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం జాతీయ అవార్డు అందుకున్నా ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. నేను తయారు చేసిన పట్టుచీర డిజైన్లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు లభించింది. –నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరం. అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తాం ధర్మవరం నేతన్నల నైపుణ్యంతో తయారైన పట్టుచీరలను కొందరు వ్యాపారులు కంచిపట్టు చీరలుగా చెలామణి చేస్తున్నారు. అందువల్లే ధర్మవరం నేతన్నకు అనుకున్నంత పేరు రాలేదు. భౌగోళి గుర్తింపు దృష్ట్యా ధర్మవరం పట్టుచీరకు ఉన్న ప్రత్యేకత తెలియజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రానున్న రోజుల్లో ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాం. –కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే, ధర్మవరం. -
పట్టుకు సింగారం
ఏ చిన్న వేడుకైనా మగువలు పట్టుచీర ధరించడం వైపే మొగ్గుచూపుతారు. దాని మీదకు సంప్రదాయ బంగారు ఆభరణాలను ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పట్టుచీర మీదకు ధరించడానికి రకరకాల ఫ్యాషన్ జువెల్రీ అందుబాటులోకి వచ్చింది. ఇండోవెస్ట్రన్, వెస్ట్రన్ డ్రెస్సులకు నప్పే ఈ ఆభరణాలు చీరకట్టు మీదకు ఇప్పుడు ఒద్దికగా ఒదిగిపోతున్నాయి. ►సంప్రదాయ చీరకట్టు అయినా ఈ రోజులకు తగినట్టుగా ట్రెండీగా కనపడాలనేది యువతుల ఆలోచన. వీటిలో ఫ్యాషన్ జువెల్రీలో భాగమైన సిల్వర్, కుందన్, పూసలు, రత్నాలతో చేసిన వెస్ట్రన్ డిజైన్‌వేర్ బాగా నప్పుతుంది. వీటిలో పొడవాటి హారాలు, మెడను చుట్టేసే చోకర్స్ ఉంటున్నాయి. ►ఫ్యాషన్ జువెల్రీలో చెప్పుకోదగినది థ్రెడ్ జువెల్రీ. ఇది రకరకాల డిజైన్లలో రంగులలో పట్టుచీరల మీద కొత్తగా మెరుస్తోంది. ఈ ఆభరణాల్లో చీర అంచులు, ప్రింట్ల రంగులను తీసుకొని డిజైన్లు సృష్టిస్తున్నారు. ప్లెయిన్ పట్టుచీర అయితే, దాని మీదకు కాంట్రాస్ట్ లేదా మ్యాచింగ్ కలర్ థ్రెడ్ జువెల్రీ ధరిస్తే అద్భుతంగా ఉంటుంది. ►థ్రెడ్ జువెల్రీతో పాటు చెప్పుకోదగినది టెర్రకోట ఆభరణాలు. ఈ డిజైన్స్ సంప్రదాయపు సొబగులు అద్దడంలో సరైన పాత్ర పోషిస్తున్నాయి. ►సంప్రదాయ పట్టుకు ఈ తరహా ఆభరణాలే ధరించాలనే నియమాలేవీ లేవు. ఫ్యాషన్ జువెల్రీతో లుక్‌లో కొత్త మార్పులు తీసుకోవచ్చు. -
పట్టుచీరకు రాయల్ టచ్
వెల్వెట్ క్లాత్ అంటేనే రాయల్ ఫ్యాబ్రిక్. వివాహ వేడుకల్లో సంప్రదాయపు సందడికి పెట్టింది పేరు పట్టు చీరలు. సంప్రదాయానికి రాయల్ టచ్ అద్దితే..! పట్టు చీరకు సెల్ఫ్ బ్లౌజ్ లేదంటే కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ వాడడటం ►చీర రంగు వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో హాప్ షోల్డర్ బ్లౌజ్‌ను డిజైన్ చేయిస్తే మోడ్రన్ లుక్. ఈ కాంబినేషన్‌కి రాళ్లు పొదిగిన హారాలు మరింత అందాన్నిస్తాయి. ►వెల్వెట్ బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూసలు, జర్దోసీతో స్లీవ్స్ ప్యాటర్న్‌కి మాత్రమే ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. పట్టుచీరకు పూర్తి కాంట్రాస్ట్ వెల్వెట్ బ్లౌజ్‌ను ధరిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. ►పట్టుచీర రంగులో ఉన్న వెల్వెట్ బ్లౌజ్‌కి చేతుల భాగంలో ఆ చీర అంచు భాగాన్ని జత చేస్తే రాయల్ లుక్‌తో మెరిసిపోతారు. ►సింపుల్‌గా మోచేతుల వరకు స్లీవ్స్ డిజైన్ చేయించుకున్నా, కాస్త హెవీ ఎంబ్రాయిడరీ చేసినట్లయితే హాఫ్వైట్శారీస్కి మరిన్ని హంగులు అద్దినట్టే. -
పట్టుచీరల కేసు మాఫీకి యత్నం!
వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట : పట్టణంలో బోయపాళె–2లో ఈనెల 10న రాత్రి టీడీపీ నాయకుల కనుసన్నలో ఓటర్లకు పట్టుచీరలు పంపిణీ చేసిన కేసు మాఫీకి ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ కేసు పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోకి రావడం, ఆ కేసు నమోదు కాకుండా చేసేందుకు టీడీపీ నేతల ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. కేసు నీరుగార్చేందుకు ఇద్దరు పోలీసులు అధికారులు ప్రమేయం ఉన్నట్లుగా విమర్శలు ఉన్నాయి. వివరాల్లోకి వెళి తే..టీడీపీ కి చెందిన జన్మభూమి కమిటీ సభ్యుడుగా ఉన్న సుబ్రమణ్యం ఓటర్లకు పంపిణీ చేసేందుకు మరో టీడీపీ నాయకుని సంబం ధించి అద్దె ఇంటిలో ఉన్న చీరల మూటను తీసుకొచ్చారు. ఓటర్లకు పట్టుచీరలు పంపిణీ చేసే సందర్భంగా సమాచారం తెలుసుకున్న ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు,పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. చీరలు పంపిణీ చేసిన నాయకున్ని అదుపులోకి తీసుకున్నారు. చీరలను స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఎన్నికల పోలింగ్ తర్వాత అంటే 13వతేదీ ఈ కేసు విషయం పరిశీలి స్తామని పోలీసుల చెప్పి, పట్టుబడిన వ్యక్తిని వదలివేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఆతర్వాత ఆ కేసు గురించి అతీగతి లేదనే అపవాదును పట్టణ పోలీసులు మూటకట్టుకున్నారు. అయితే పట్టుకున్నప్పుడు పట్టుచీరలు ఉంటే, వాటిని స్థానంలో స్కిల్ చీరలు పెట్టినట్లుగా తెలిసింది. ఇప్పుడు ఈ కేసు మాఫీ విషయంపై పట్టణంలో వైరల్‌గా మారుతోంది. ఎన్నికలపోలింగ్ ముందురోజు రాత్రి పట్టుకున్న పట్టుచీరల కేసు నమోదుచేశారా? లేక టీడీపీ నేతల ఒత్తిడితో పక్కనపెట్టేశారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
10 వేల పట్టుచీర రూ.4 వేలకే : రాష్ట్ర ప్రభుత్వం
కర్ణాటక, మైసూరు : వరమహాలక్ష్మి పండగ సందర్భంగా రూ.10 వేల పట్టుచీర రూ.4 వేలకే ఇవ్వనున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళకు తీవ్ర నిరాశ ఎదురైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న కూడా సగం ధరలకే మైసూరు పట్టు చీరలను అందించనున్నట్లు పట్టుపరిశ్రమశాఖ మంత్రి సారా మహేశ్ ప్రకటించారు. దీంతో వరమహాలక్ష్మి పండుగ సందర్భంగా చీరల కోసం మహిళలు నగరంలోని కేఎస్ఐసీ షోరూమ్‌ల ఎదుట బారులు తీరారు. ఆధార్‌కార్డులు, డబ్బులు, పట్టుచీరలు తెచ్చుకోవడానికి సంచులతో ఎంతో ఉత్సాహంతో అక్కడికి వెళ్లిన మహిళలు కొడగు జిల్లాలో చోటుచేసుకున్న ప్రకృతి వైపరిత్యాల కారణంగా పట్టుచీరలపై ప్రకటించిన ఆఫర్ ఉపసంహరించుకున్నామంటూ షోరూమ్‌ల అద్దాలపై అతికించిన నోటీసులు చూసి తీవ్ర నిరాశకు లోనయ్యారు. రెండు నెలలుగా సగం ధరలకే పట్టుచీరలు ఇస్తామంటూ ఆశలు పెంచి పండుగరోజున చీరల కోసం దుకాణాలకు వెళ్లాక ఇలా ఇవ్వడం కుదరంటూ చెప్పడం ఏమిటంటూ మహిళలు అధికారులపై మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని ఈ విషయంలో మేమేమి చేయలేమంటూ అధికారులు స్పష్టం చేయడంతో చేసేదిమి లేక తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ మహిళలు నిరాశగా ఇళ్లముఖం పట్టారు. -
పెళ్లి చీర
‘‘అమ్మలూ! అమ్మ ఎక్కడే..?’’ సోఫాలో కూర్చొని ల్యాప్‌టాప్ వంక తదేకంగా చూస్తున్న ప్రతిమ దగ్గరకు వెళ్ళి అడిగాను నేను, గౌరి గురించి.‘‘అత్త ఫోన్ చేసింది అమ్మమ్మా!’’ అని ప్రతిమ చెప్పింది. ప్రతిమ దృష్టి ల్యాప్‌టాప్ మీదే ఉన్నట్టుంది. అందుకే పొడిపొడిగా బదులిచ్చింది. ఏదో పని చేసుకుంటున్నట్టంది.‘‘అమెరికానించా?’’ అనడిగా.‘‘అవునమ్మమ్మా!’’ అంది తల ల్యాప్‌టాప్ నుండి తిప్పకుండానే.‘ఏ రంగు...? అలా రంగులేమీ అనుకోలేదు..’ అని మంచం మీద కూర్చుని కులాసాగా నవ్వుతూ మాట్లాడుతోంది గౌరి. నావైపు చూసింది కుర్చోమని చెప్తున్నట్టుగా, మంచం మీద తడుతూ. వెళ్ళి గౌరి పక్కన కుర్చున్నా. ‘‘నువ్వు ఇక్కడే ఉంటే ఆ ముచ్చట్లవీ దగ్గరుండి చూసుకునేదానివి కదా...’’ అంటోంది గౌరి. నేను గౌరి వైపు చూసాను. నేను అలా చూస్తే మాత్రం ఆ ముచ్చటించుకుంటున్న ముచ్చట్లేవో నాకు తెలిసేటట్టు.‘‘లేదు లేదు. ఈ రంగు అని అనుకోలేదు. పెళ్ళి దానిది, కాబట్టి ప్రతిమకి ఏ రంగు నచ్చితే ఆ రంగు తీసుకుంటాం.’’ అంది గౌరి.అప్పటికి నాకు విషయం అర్థమైంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నది పెళ్ళి చీర గురించి.నా మనవరాలు ప్రతిమ పెళ్ళి కుదిరింది. నేనిక్కడికి వచ్చింది కూడా ఆ పెళ్లి కోసమే. నేను వచ్చిన దగ్గరనుండి వింటున్న మాట ‘పెళ్ళి చీర’ గురించే. రోజుకి పదిసార్లు అయినా గౌరి పెళ్ళి చీర గురించి అనుకుంటూ ఉంటుంది.నా పెళ్ళి సమయంలో నేను కానీ మా అమ్మ కానీ పెళ్లిచీర గురించి ఇంత మాట్లాడుకున్నామా? నా ఆలోచనలు జ్ఞాపకాల్లోకి పరుగులు తీసాయి. నాకున్న మోకాళ్ళ నొప్పులు నా ఆలోచనలకి లేనట్టున్నాయి. సునాయాసంగా నా బాల్యాన్ని చేరుకున్నాయి అవి. మా అమ్మగారికి ఇద్దరు మగపిల్లల తరవాత మూడవ సంతానంగా పుట్టాను నేను. అమ్మ నన్ను చాలా మురిపెంగా చూసుకునేది. ఆటలాడుకుంటున్న వయసులో హఠాత్తుగా వచ్చి ‘నీకు పెళ్ళి’ అన్నారు.పెళ్ళి అయిపోయాక అత్తవారింటికి వెళ్ళిపోవాలని తెలియని వయసు నాది. పూల జడ కుట్టించుకుని, బుగ్గన చుక్క పెట్టించుకుని బుట్టలో కూర్చోడమే పెళ్ళి అనుకున్నాను అప్పుడు.మా అమ్మ ‘కాంతానికి మంచి చీర కొనాలి’ అని ఒకటి రెండుసార్లు అన్నదేమో. ఆకుపచ్చటి చీరకి ఎర్రని అంచు ఉన్న పెద్ద పట్టుచీర కొంది నాకోసం.‘‘కాంతం.. చీర ఎంత బాగుందో.. చాలా బాగుంది.’’ అని మా వైపు బంధువర్గం, మా అత్తింటి వారు అనడం నాకు జ్ఞాపకమే. ఆ చీర ఇప్పటిలా ఎక్కడికో బయటికి వెళ్ళి తీసుకురాలేదు. ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముకునే ఒకతని దగ్గరే మా అమ్మ తనకు కావాల్సిన చీరలన్నీ కొనేది. నాకు కూడా అతని వద్దే కొంది. మా నాన్నగారు పెళ్ళి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఏదో కొంత పైకం నా చీర నిమిత్తం మా అమ్మకు ఇచ్చారు. ఆ పెళ్ళి చీర బేరం చేస్తున్న రోజున – ‘‘ఏదీ.. ఆ చీర పైకి తియ్యి...’’ మా అమ్మ అమ్ముకునే అతనితో అంది. నేను మా అమ్మ పక్కనే కూర్చుని ఉన్నాను.‘‘ఏదమ్మగారూ?’’ అతను అడిగాడు. ఆ మూటలో చాలా చీరలు ఉన్నాయి. ‘‘ఇదీ..’’ అంది మా అమ్మ వేలు పెట్టి ఒక చీరని చూపించి. నేనూ అసక్తిగా చూస్తున్నాను. ఆ మూటలో పాతిక, ముప్ఫై చీరలు ఉంటాయేమో. అన్ని చీరలూ గొప్పవేమీ కావు. ఆ మూట కాక అతని వద్ద విప్పని ఇంకొక మూట ఉంది.మా అమ్మ అడిగిన చీర బయటకి తీసాడతను. మా అమ్మ వెంటనే ఆ చీరని నా భుజం పైన వేసి చూసింది. ‘‘అమ్మాయి గారికి ఈ రంగు బాగా నప్పింది.’’ అన్నాడతను.‘‘మా కాంతానికి చంద్రకాంతం లేకపోతే ఎలాగ.?’’ అని అమ్మ అంటూ ఉండగా అటువైపు వెళుతున్న నాన్నగారు అన్నారు – ‘‘చాల్చాలు ఇంకెన్ని చీరలు? ఆ మొదటి దానికి డబ్బిచ్చి అతన్ని తొందరగా పంపూ. అవతల చాలా పనులున్నాయి’’.నాన్నగారి మాటలకి అప్రమత్తం అవుతూ.. ‘‘ఈ చీరెంత?’’ అని గుసగుసగా అడిగింది అమ్మ. అతను ఏదో చెప్పేలోపే, ‘‘ఏమేవ్!’’ మా నాన్నగారు సింహంలా కేక వేసారు. మా అమ్మ అతనికేదో సైగ చేసి ఒక చీరకి డబ్బిచ్చి పంపేసింది. నా భుజం మీద చీరని అతను పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ రంగు నాకు ఎలా ఉందో అద్దంలో చూసుకోలేకపోయానే అనే బాధ అలాగే ఉండగా అతను వెళ్ళిపోయాడు. తరువాత నేనూ ఆ సంగతి మర్చేపోయాను. కానీ ఎలా వచ్చిందో మరి.. పెళ్ళి రోజున మళ్ళీ ఆ చీర కనిపించింది నాకు.‘‘అమ్మా! అమ్మా! ఈ చీర ఎప్పుడు కొన్నావే?’’ నేను హడావుడిలో కూడా మా అమ్మని అడిగాను. మా అమ్మ ‘ష్!’ అంది కానీ ఇంకేం చెప్పలేదు.కానీ పరుగున వెళ్ళి నాకు అ రంగు ఎలా నప్పుతుందో అద్దంలో ఆ రోజు చూసుకోనేలేదు నేను. ‘‘అమ్మా! భోజనం చేస్తావా?’’ అన్న గౌరి పిలుపుతో నా పెళ్ళి వయసు నుండి మనవరాలున్న వయసులోకి వచ్చేశాను. పెళ్ళి చీర అనగానే నాకు ఆ రెండు చీరలు, అవి ఎలా కొన్నది జ్ఞాపకం వచ్చాయి. ‘‘ఏమిటి? అంత దీర్ఘాలోచన?’’ అని అడిగింది గౌరి.‘‘ఏం లేదు. ఇంతకీ నీ ఆడపడుచు ఏమంటోందేమిటి?’’ అని అడిగాను.‘‘ఏముంది... రేపు బట్టలు కొనడానికి వెళ్ళాలి అంటేను, ప్రతిమకి ఏ రంగు చీర కొంటావ్ పెళ్ళి పీటల మీదకి, అని అడుగుతోంది.’’ అంది గౌరి. కాసేపు ఆలోచనల్లో పడింది. ‘అయినా రేపు వెళ్తాం కదాకొనడానికి, జాగ్రత్తగా చూసి కొనాలి‘ అని తనలో తను అనుకున్నట్టే పైకి అంది. ‘‘ప్రతిమ అత్తగారు కూడా వస్తామని అన్నారు కదా?’’ పెళ్ళిచీర కొనడానికి నేను, గౌరి, ప్రతిమ కార్లో వెళ్తోంటే గౌరితో అన్నాను. గౌరి ముందు సీట్లో మా అల్లుడుగారి పక్కన కూర్చుని ఉంది. అక్కడ నుండే తల తిప్పి, ‘‘ఆవిడ వస్తానని అన్నారు కానీ కుదరలేదుట. వాళ్ళ అబ్బాయి అయినా వస్తాడని అనుకున్నాం.’’ అంది గౌరి.‘‘ఏమే అమ్మలూ! అతను ఎందుచేత రావడంలేదు.’’ అని ప్రతిమని అడిగాను. ప్రతిమ ఫోన్‌తో చాలా బిజీగా ఉంది. నాకు సమాధానం కూడా ఫోన్ నుండి తల తిప్పకుండానే ఇచ్చింది – ‘‘తనకు ఈ షాపింగ్లూ అవీ నచ్చవుట అమ్మమ్మా!’’. కారు నడుపుతున్న మా అల్లుడు కిసుక్కున నవ్వి, ‘‘తెలివైనవాడు’’ అన్నాడు. గౌరి కనుచివర్ల నుండే భర్తని కోపంగా చూసింది.‘‘షాప్ ఇదేనా నువ్వు అనుకున్నది’’ అంటూ అల్లుడు తెలివిగా గౌరి కోపాన్ని మాయం చేసాడు. ‘‘ఇదే!’’ అని గౌరి చెప్పాక కారు ఆగింది. ‘‘మీరూ రండీ’’ బట్టల దుకాణం ముందు మేము ముగ్గురం దిగిపోయాక గౌరి భర్తతో అంది. ‘‘లేదు. నాకు పని ఉంది. మీరు వెళ్ళి రండి, మీ పని అవ్వగానే ఫోన్ చేస్తే నేను వస్తాను.’’ అని అల్లుడు అనగానే ప్రతిమ గౌరి వైపు చూసి చిన్నగా నవ్వింది.‘‘అమ్మా! ఈ చీర ఎప్పుడు కొన్నావే? ఇందాకటి నుండి అనుకుంటున్నాను’’ అని అల్లుడు వెళ్ళీ వెళ్ళగానే అడిగింది గౌరి, బట్టల దుకాణం మెట్లు ఎక్కుతుంటే. ‘‘ఇదా?’’ నేను కట్టుకున్న ఉల్లిపాయ రంగు పట్టుచీర వైపు చూపిస్తూ అడిగాను. ‘‘అవునూ!’’ అంది. ‘‘ప్రతిమ చిన్నప్పుడు కొన్నది’’ అని నేను చెప్పగానే గౌరి నమ్మలేనట్లుగా చూస్తూ, ‘‘అయినా ఎంత మెరుపుగా ఉందో,’’ అంటూ తన చీర వైపు చూసుకుంటూ, ‘‘ఇది కొని మూడేళ్లు కూడా కాలేదు. చూడూ, నీ చీర ముందు ఎంత వెలవెలపోతోందో’’ అంది.‘అలా ఏం కాదే బాగుంది.’’ అన్నాను. నేనేమీ గౌరి కోసం చెప్పలేదు. దాన్ని సాయంత్రం సంపెంగపండు రంగు చీరలో చూసిన దగ్గర నుండి అనుకుంటున్నాను, సంధ్యాదీపంలా మెరిసిపోతోంది అని. ‘‘నీకు వయసు అయిపోయింది. అందుకే అలా అంటున్నావ్’’ అంది. గౌరి వేళాకోళానికే అన్నదని తెలిసిపోతోంది.‘‘ఇందాకటి నుండి నీ గురించి సంధ్యాదీపంలా ఉన్నావ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పూ... నాకు వయసు అయిపోయిందా?’’ అని అడిగాను.ప్రతిమ ఫకాలున నవ్వింది. మౌనంగా మారడం గౌరి వంతయ్యింది.ముగ్గురం కలిసి ఆ పెద్ద బట్టల షాపులో అడుగుపెట్టాం. నేను ఇంత పెద్ద బట్టల దుకాణానికి రావడం ఇదే మొదటిసారి. లోపలికి వెళ్ళీ వెళ్ళగానే పెద్ద లక్ష్మి దేవి విగ్రహం, పక్కనే రెండు పెద్ద ఇత్తడి దీపపు సమ్మెల్లో దీపం వెలుగుతోంది. ఆ విగ్రహం ముందు అర్చక స్వామి కూర్చొని ఉన్నాడు. సన్నగా కీర్తనలు వినిపిస్తున్నాయి. ముక్కుకి అగరబత్తి పరిమళం తెలుస్తోంది. ఎటు చూసినా చీరలే. మమ్మల్ని చెప్పులు విడిచి చీరలు చూడటానికి వెళ్ళమన్నారు. నాకు ఆ చీరల అంగడిని చూడగానే ఇంటికి చీరల వాడు తెచ్చిన చీరల మూట గుర్తుకు వచ్చింది. ఇక్కడ చీరల సంఖ్య లక్షల్లో ఉండి ఉండచ్చు. ‘‘ఇది దుకాణంలా లేదు, గుడిలా ఉంది’’ అన్నాను గౌరితో.‘‘నాకు జరిగినట్టు ప్రతిమకి జరగకూడదనే ఎంతోమందిని ఎన్నోసార్లు వాకబు చేసి ఈ షాప్ గురించి తెలుసుకున్నాను.’’ అంది గౌరి గొప్పగా. ఆ మాట అనేసి గౌరి చీరలు చూడటంలో పడిపోయింది. నేను మాత్రం అక్కడే ఆగిపోయాను. గౌరికి నేనూ ఏం తక్కువ చెయ్యలేదు. కానీ ఎందుకు గౌరి అలా అన్నది అన్న చింతన మొదలయ్యింది. ఆ చింతనే నన్ను మళ్ళీ గతంలోకి లాక్కెళ్ళిపోయింది. గౌరి చదువు పూర్తి కావస్తుండగా మా అత్తగారి తరుపు వేలు విడిచిన బంధువొకడు ఆవిడ చెవిన ఒక మాట వేసి వెళ్ళాడు, ‘‘మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అని చెప్పటం కాదు కానీ ఆజానుబాహుడు, అందగాడు, ఆస్తిపరుడు, ప్రభుత్వోద్యోగి, తల్లిదండ్రులకి ఆఖరి సంతానం. మన గౌరమ్మ అక్కడ అడుగుపెడితే అంతే! ఇక చూసుకోవక్కర్లేదు.’’ అని. అంతే! మా అత్తగారు అబ్బాయిని నేరుగా చూడక మునుపే మాట మాత్రానికే, ‘‘తల్లీ కామాక్షీ! నా మనవరాలికి ఈ సంబంధం ఖాయం అయితే నీ దగ్గరికి వస్తాను తల్లీ!’’ అని మొక్కేసుకున్నారు. మొక్కు మహిమో లేక భగవంతుడే వేసిన బంధమో గౌరికి అదే సంబంధం ఖాయం అయిపోయింది. వెంటనే మా అత్తగారికి మొక్కు చెల్లించేసుకురావాలనే ఆదుర్దా మొదలయ్యింది. మా మరిదిగారిని వెంట తీసుకుని కంచి బయలుదేరారు. పెళ్ళి పనుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మేము వెళ్ళడం కుదరలేదు. అత్తగారు అక్కడికి వెళ్ళడం వలన, పట్టుచీరల విషయంలో కంచికి ఉన్న ప్రాశస్త్యంవల్ల గౌరికి అక్కడ నుండే చీరలు తెప్పించాం.పెళ్ళికి వచ్చిన ప్రతీ ఒక్కరూ చీరని పొగడకుండా వెళ్ళింది లేదు. ‘‘అమ్మా! చూడూ.. ఆ చీర ప్రతిమకి నప్పిందా?’’ అంటూ పిలిచింది గౌరి. ఆ పిలుపుకి నా ఆలోచనలు కాస్త విశ్రమించాయి. దుకాణంలోని ఒక అమ్మాయి చీరని పూర్తిగా విప్పకుండానే చీర కట్టినట్టు చీరని ప్రతిమకి చక్కగా చుట్టబెట్టింది. ‘బావుంది’ అని పైకి అన్నానే కానీ మనస్ఫూర్తిగా నా భావాన్ని వెల్లడించడానికి నేను ప్రతిమకి కట్టిన చీరని చూడనేలేదు. గౌరి అది గమనించినట్టుంది. ప్రతిమకి మరో చీర కూడా కట్టి చూడమని చెప్పి, ‘‘ఏమైందమ్మా! ఏమైనా ఇబ్బందిగా ఉందా?’’ అని అడిగింది. ‘‘లేదు’’ అని చెప్పినట్టు తల అడ్డంగా ఊపాను. అయినా గౌరి ఊరుకోలేదు. నేను నోరు మెదిపేదాకా అడుగుతూనే ఉంది. ‘‘నీకు మేం ఏం తక్కువ చేసాం చెప్పూ? ఆ రోజుల్లో కంచి నుండి చీర వేలు పోసి తెప్పించాం. నీకు జరిగినట్టు ప్రతిమకి జరగకూడదని ఎందుకన్నావ్?’’ అని ఉండబట్టలేక అడిగేసాను. గౌరి అన్నిసార్లు అడగబట్టి కానీ లేదంటే ఆ విషయం చెప్పేదాన్ని కాదేమో!గౌరి చిన్నగా నవ్వీ ‘‘అందుకా ఇంత ఆలోచనా?’’ అంది.‘‘నీకూ ఒక కూతురుంది, అది నిన్ను ఇలా అంటే అప్పుడు అర్థమవుతుంది నీకు నా బాధ’’ అని చెప్పాను నేను.‘‘అది కాదమ్మా! చీర ఖరీదు ఎంత, అది ఎక్కడ నుండి తెప్పించాం అన్నదే కాదు కదా.. ఆ రోజుల్లో నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళవాళ్ళ పెళ్ళి చీరలు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. కానీ నా విషయంలో అలా జరగలేదనే చిన్న బాధ మిగిలిపోయింది అంతే!’’ అంది.‘‘నువ్వు అప్పుడే చెప్పవలిసింది.’’‘‘అప్పుడు నాకు అంత వయసు లేదు కదే, చెప్తే ఎవరు ఏమంటారో అని నోరు తెరవలేకపోయాను.’’ అంది నవ్వుతూ. నేను ఇంక ఏం మాట్లాడలేదు. మళ్ళీ గౌరి కూతురికి నచ్చిన చీర కొనే పనిలో పడింది. అక్కడ సూపర్వైజర్ అన్ని రకాల చీరలు ఓపికగా చూపిస్తున్నాడు. ఒక్కో చీరకి ఒక్కో పేరు. వెయ్యి రూపాయలు మొదలుకొని లక్ష రూపాయల వరుకు ఎన్నో రంగుల్లో రకరకాల పేర్లు చెప్తూ చాలా చీరలు చూపించాడు సూపర్వైజర్. గౌరి చిన్నతనంలో ఇన్ని రకాల పేర్లతో చీరలు లేనే లేవు. ఇన్ని చీరల్లో ఏ ఒక్కటీ ప్రతిమని మురిపించలేకపోయింది. ఒక చీర రంగు నచ్చితే అందులో డిజైన్ నచ్చలేదు. డిజైన్ నచ్చిన చీర రంగు తన మేని ఛాయకి సరిపడదని ఇలా ఒక్కో చీరకి ఒక్కో వంక చెప్తూ చాలా సమయం గడిపేసింది కానీ ప్రతిమ ఒక్క చీర కూడా కొనలేదు. గౌరి ముఖంలో వెలుగు మాయం అయ్యింది కానీ, సూపర్వైజర్ పెదాల మీద నవ్వు చెక్కు చెదరలేదు. ప్రతిమలాంటి వాళ్ళని చాలా మందిని చూసి ఉంటాడు. ‘‘అయితే ఏం ఒద్దా?’’ గౌరి ప్రతిమని అడిగింది విసుగ్గా. ‘‘నాకు ఇక్కడ అంతగా నచ్చలేదు.’’ అని నిర్మొహమాటంగా చెప్పిన ప్రతిమని ఏమనాలి? ఇంత పెద్ద దుకాణంలో ఇన్ని లక్షల చీరల్లో దానికి ఒక్కటి కూడా నచ్చలేదంటే నేను ఆశ్చర్యపోయాను. గట్టిగా మాట్లాడలేక గౌరి నీరసంగా ముఖం వేలాడేసింది. ‘‘దాని సంగతి వదిలేయ్. నువ్వు ఏదైనా తీసుకో’’ అన్నాను నేను గౌరితో.‘‘ఇప్పుడు నాకేం ఒద్దే’’ అంది గౌరి విసుగ్గా.‘‘ఏమిటి ఒద్దంటావ్? పెళ్ళి పీటల మీద కన్య ధార పోసేటప్పుడు నువ్వు కట్టుకోవు కొత్త చీర?’’ అని నేను అనగానే గౌరి ఒద్దని చెప్పబోతే, ‘‘అప్పుడెలాగో నీ ముచ్చట గ్రహించలేకపోయాను. ఇప్పుడైనా నువ్వు ఇష్టపడి ఒక్క చీర కొనుక్కుంటే నేను సంతోషిస్తాను. నీ కూతురి పెళ్ళి వయసు వచ్చేంత ఆలస్యం చేసాను. అదే నన్ను గుంజుతోంది. నేను ఇంకా బాధపడేలా చెయ్యకు తల్లీ!’’ అన్నాను గౌరితో.గౌరి ముఖంలో వెలుగు మళ్ళీ తిరిగి వచ్చింది. ‘సరే’ అని నవ్వింది. సూపర్వైజర్కి మళ్ళీ పనిపడింది. ‘‘అమ్మమ్మా!’’ ప్రతిమ సంబరంగా నాకు కునుకు పడుతున్న సమయంలో వచ్చి పిలిచింది. కళ్ళు తెరిచి చూస్తే ప్రతిమే కాదు గౌరి కూడా ఉంది దాని పక్కనే. నేను వెంటనే గడియారం వంక చూసాను. గంట పన్నెండవుతోంది. ఏమైంది ఈవేళప్పుడు అని కంగారుగా లేచి కూర్చుని, ‘‘ఏమిటమ్మలూ?’’ అని అడిగాను.‘‘నా పెళ్ళిచీర చూపించేందుకు వచ్చాను.’’ అంది ప్రతిమ సంబరంగా.‘‘పెళ్ళిచీరా!?’’ మేం వెళ్ళిన దుకాణం నుండి తిరిగి వచ్చిన తరువాత ఆ వారం రోజుల్లో మరో దుకాణానికి వెళ్ళింది లేదు. నాకు చెప్పకుండా గౌరి వెళ్ళదు. మరి ఎలా? ఎప్పుడు? ఎక్కడ? కొన్నారు ప్రతిమకిచీర అని మనసులో అనిపిస్తూ ఉండగా, ‘‘ఏది చూడనీ?’’ అన్నాను.నా చేతికి ప్రతిమ చీర ఉన్న అట్టపెట్టే ఇస్తుందని అనుకుంటే ల్యాప్‌టాప్ అందించింది. బరువుగా ఉండి పట్టు సడలబోతుండగా, ‘‘ల్యాప్‌టాప్ అమ్మమ్మా! జాగ్రత్తా!’’ అని ప్రతిమ అన్నాక నా కళ్ళు బాగానే పని చేస్తున్నాయి అనుకున్నాను. ‘‘చీర అన్నావ్..’’‘‘ఇదిగో అమ్మమ్మా!’’ అంటూ స్క్రీన్ మీద వేళ్ళతో ముట్టుకుని ఏదో చేసేసరికి ఎదురుగా ప్రతిమ ఫొటో వచ్చింది. అందులో చీర కట్టుకుని ఉంది ప్రతిమ. ఆ చీర రంగు ఇది అని నేను చెప్పలేను. ‘‘ఎలా ఉంది?’’ అని అడిగింది మెరిసిపోతున్న వదనంతో.‘‘బావుందమ్మా!’’ అన్నాను మామూలుగా.‘‘చూడూ! నీ కన్నా అమ్మమ్మ బెటర్, వెంటనే బావుందని చెప్పింది.’’ అంటూ ఆ ల్యాప్‌టాప్ తీసుకుని ప్రతిమ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకు ప్రతిమ కొనుక్కున్న చీర సరిగ్గా గుర్తు కూడా లేదు. ప్రతిమ అలా గది దాటగానే, ‘‘నిజం చెప్పూ... చీర ఎలా ఉంది?’’ అని అడిగింది గౌరి.‘‘బాగుందే..!’’ అన్నాను. ప్రతిమకి నచ్చింది కదా అంతే చాలు అనిపించింది నాకు. ‘‘ఏం బాగుందే... అసలు ఆ బట్ట ఏమిటో, మామూలుదో, మంచిదో కాదో ఏం తెలీదు.దాని ఫ్రెండ్స్ ఎవరో ఇలా చేసారట. ఇది కూడా అలాగే కొనుక్కుంటుందిట. చీర ఎవరి ఇష్ట ప్రకారమో కాకుండా దానికి నచ్చిన తీరులో డిజైన్ చేయించుకుంటుందిట. పైటంచంతా ముత్యాలు వచ్చేస్తాయిట. డిజైనంతా రాళ్ళూంటాయిట. ఏమిటేమిటో చెప్తోంది ప్రతిమ. నాణ్యత చూడద్దే అంటే ఇంత ఖరీదుంది నాణ్యత అదే ఉంటుంది అంటుంది.’’ అని విసుగ్గా చెప్పింది గౌరి.‘‘పోనీలేవే....పెళ్ళి దానిది, చీర కట్టుకోవలిసినది అది. దానికి నచ్చితే మనకి సంతోషమే కదా...’’ అని నచ్చజెప్పచూసాను.‘‘అది కాదమ్మా! ఇన్ని వేలు పోసినప్పుడు కాస్త మంచిది, జీవితాంతం గుర్తుగా ఉండిపోయేది అయితే బావుంటుంది కదా...’’ అంది గౌరి నిట్టూరుస్తూ.‘‘నువ్వు అన్నది నిజమే, నేను అలా ఆలోచించే ఆ రోజు మీ నాయనమ్మ నీకు అక్కడ నుంచి చీర తీసుకువస్తానని అంటే సరే అన్నాను. కానీ ఇప్పుడు నీ మనసులో ఉన్న లోటు తెలుసుకున్న తరువాత అనాలోచితంగా ప్రవర్తించానా? అనిపించింది.’’ అని నేను చెప్పాక గౌరి ఏం మాట్లాడక మౌనంగా మారింది.‘‘పెళ్ళే కాదు... పెళ్ళి చీర కూడా ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక మధురమైన విషయం. అది ఒక జ్ఞాపకం మాత్రమే శాశ్వతం కాదు. అది ఇష్టపడి ఎంచుకోవడంలో కలిగే ఆనందం, అనుభూతి మాత్రమే శాశ్వతం. నువ్వు నీ కూతురికి అలాంటి అనుభూతిని మిగల్చబోతున్నావ్. రేపు నాలాగా నువ్వు ‘అయ్యో!’ అని బాధపడనవసరం లేదు. నేను ఇప్పుడు నీకు చెప్పిన విషయం అమ్మమ్మగా మనవరాలి పెళ్ళి సమయంలో తెలుసుకోవడం నాకు ఎంత బాధగా ఉందో!’’ అన్నాను నేను. ‘‘ఛ! అలా అంటావేంటమ్మా! ఇప్పటికీ ఆ చీర చెక్కు చెదరలేదు. నేనే ఏదో తెలియక బాధపడ్డాను. ఇప్పుడు ప్రతిమని చూసాక మీరు చేసిన పని ఎంత మంచిదో అర్థమవుతోంది.’’ అని నా పక్క నుండి లేస్తూ, ‘‘ఆలస్యం అయ్యింది నిద్రపో.’’ అని చెప్పి గౌరి వెళ్ళిపోయింది.ఈ సందర్భాన్ని గౌరి ఒకలా అర్థం చేసుకుంటే నేను మరోలా అర్థం చేసుకున్నాను. మా తరం అమాయకత్వంలో కొట్టుకుపోయింది. గౌరి తరం బయటపడటం సబబో కాదో తెలియని సందిగ్ధంలో కొట్టుకుపోయింది. ప్రతిమ తరం గురించి ఏమనుకోవాలో ఈ మారుతున్న పోకడకి ఏ పేరు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు.ఆడపిల్ల తన హక్కుని వినియోగించుకుంటోంది అనుకోవాలా? సొంతంగా నిర్ణయం తీసుకునే సమర్ధతని పొందింది అనుకోవాలా? తమకి ఏం తెలియదులే ఇంత రాణిస్తున్నాం నేటి ప్రపంచంలో అని దూసుకుపోతోంది అనుకోవాలా?ఇలా నాలో సాగుతున్న ఈ ఆలోచనలు నాకే వింతగా తోచాయి.ఏది అయితేనేం ఆనందంగా ప్రతిమ పెళ్ళి చీర కొనుక్కుంది. దీని మీద అనవసరమైన చర్చలు చేసి లాభనష్టాలు దానికి తెలిసేలా చేస్తే దాని వల్ల ప్రతిమకి మిగిలేది బాధే. గౌరికి కాలం ఎలా కొన్ని విషయాలని తెలియజెప్పిందో రేపు ప్రతిమకీ అదే కాలం అన్నీ తెలియజేస్తుంది. అప్పటి దాకా నేనుంటే చూస్తాను. లేదంటే ఎలా జరగవలిసినది అలా జరగక ఆగిపోతుందా? అనుకుని కళ్ళు మూసుకున్నాను. ఎంత ప్రయత్నించినా ప్రతిమ కొత్తగా కొనుకున్న ఆ పెళ్ళిచీర ఎలా ఉన్నది గుర్తుకురావడం లేదు. దానికి గుర్తుంటే చాలును కదా అని నాలో నేనే నవ్వుకుని నిద్రపోయాను. -
పట్టుచీరల దొంగలు అరెస్టు
ధర్మవరం అర్బన్: పట్టుచీరలు దొంగిలించే ఐదుగురిని ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 184 పట్టుచీరలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను ఇన్చార్జ్ డీఎస్పీ రామవర్మ మంగళవారం పట్టణ పోలీసు స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. ధర్మవరం పట్టణానికి చెందిన గిరక నరేష్, చింతాకుల రాజ్‌కుమార్, పప్పూరు షఫీ, మాయకుంట చక్రవర్తి, ఉమ్మడిశెట్టి శ్రీనివాసులు జనవరి 23న అర్ధరాత్రి వరలక్ష్మి థియేటర్ సమీపంలోని ఎస్బీఐ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో గల చీరల పాలిష్ షాపు బీగాలు పగులగొట్టి, అందులోని 63 పట్టుచీరలు అపహరించారు. ఫిబ్రవరి 12 అర్ధరాత్రి బలిజ కల్యాణమంటపం సమీపంలోని ఆనందం సిల్క్స్ దుకాణం తాళాలు పగులగొట్టి 140 పట్టుచీరలను దొంగిలించారు. మొత్తం 203 పట్టుచీరలు, పవర్‌లూమ్స్ చీరలు దొంగతనం చేశారు. సోమవారం సాయంత్రం ఐదుగురు దొంగలూ ఎర్రగుంటలోని వైఎస్సార్ సర్కిల్లో ఉండగా పట్టణ సీఐ హరినాథ్, ఎస్ఐలు జయానాయక్, శ్రీహర్షలు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 184 పట్టుచీరలు, పవర్‌లూమ్స్ చీరలు రికవరీ చేశారు. వీటి విలువ రూ.1.69 లక్షలు ఉంటుందని ఇన్చార్జి డీఎస్పీ తెలిపారు. -
పట్టు చీరపై పవన్ కల్యాణ్
అనంతపురం, హిందూపురం అర్బన్: అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లిలో పట్టుచీరల తయారీదారుడైన ఆనంద్ తన అభిమాన హీరో పవన్‌కల్యాణ్ ముఖచిత్రం ముద్రతో చీరను తయారుచేసి అభిమానం చాటుకున్నాడు. పట్టుచీరల తయారీలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పవన్‌కల్యాణ్ గిటార్ వాయిస్తున్న చిత్రాన్ని చీరపై ముద్రించాడు. ఇందుకోసం సుమారు రూ.25వేలు ఖర్చయినట్లు ఆనంద్ తెలిపాడు. -
లైఫ్ డిజైనర్..!
పోచంపల్లి పట్టు చీరలు ఇంకెక్కడా తయారు చేయలేరు. అలాంటి చీరలకు కొత్త డిజైన్లు వేయా లని నిరంతరం ఆలో చిస్తా. రోజుల తర బడి శ్రమించి కొత్త డిజైన్లు తయారు చేస్తా. అందులోనే ఆనందం ఉంది. – గంజి మహేష్, చౌటుప్పల్ స్వయం కృషి, సృజనాత్మకతను నమ్ముకుని తన జీవితాన్నే కాదు.. మరో వంద మంది జీవితాలను బ్యూటిఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాడు చౌటుప్పల్‌కు చెందిన గంజి మహేష్. తనకు ప్రవేశం ఉన్న వృత్తిని కొత్తకోణంలో చూస్తూ సమాజ పోకడలను అవగాహన చేసుకుని నయా డిజైన్లను సృష్టిస్తున్నాడు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం కలబోతే ఆయన నేసిన పట్టుచీర. నిరంతర తపనతో సాధించుకున్న నైపుణ్యంతో మగువల మనసుదోచే డిజైన్లు వేస్తూ పోచంపల్లి పట్టు చీరలకు ప్రాణం పోస్తున్నాడు. చేనేతకు సరైన చేయూత లభించని సమయం నుంచి నేటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోకుండా స్వయం కృషితో ఎదిగాడు. పోచంపల్లి పట్టు చీరల శకం ముగిసిందని కొందరు వృత్తిని వీడి ఇతర పనులకు వెళ్తున్నా.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎదురు నిలిచాడు. లీఫ్ టూ సిల్క్ విధానానికి శ్రీకారం చుట్టి విజయం దిశగా ముందుకు సాగుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన గంజి మహేష్ ఎందరికో స్ఫూర్తి. కొత్త డిజైన్ల సృష్టికర్త మహేష్.. వంద మందికి ఉపాధి చేనేత కుటుంబంలో పుట్టిన గంజి మహేష్ పోచంపల్లి చేనేత టై అండ్ డై ఇక్కత్ చీరల కొత్త డిజైన్లకు జీవం పోస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహం, ప్రచారంతోపాటు తన మార్కును నిలుపుకున్న పోచంపల్లి పట్టు చీరెలను అత్యంత ఆకర్షణీయంగా, రమణీయంగా కొత్త డిజైన్లతో రూపొందిస్తున్నాడు. వందమందికి ఉపాధికల్పన చీరల డిజైన్ల తయా రీలో విభిన్నంగా ఆలోచించే మహేష్ చౌటుప్పల్ సమీపం లోని న్యాలపట్ల శివారులో రెండేళ్ల క్రితం ఐదు ఎకరాలు కొనుగోలు చేశాడు. అందులో షెడ్ నిర్మించి ఆధునిక మగ్గాలు ఏర్పాటు చేసి సుమారు 100 మందికి పని కల్పిస్తున్నాడు. మల్బరీ సాగు వృత్తిపైన ఆధారపడి రెండేళ్లలో 20 ఎక రాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇందు లో 8 ఎకరాల్లో మల్బరీ సాగు చేశాడు. పట్టుగూళ్ల పెంపకం ప్రారంభించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా షెడ్ నిర్మించాడు. వ్యవసా య భూమిలో సుమారు వంద గొర్రె, మేకలను కొనుగోలు చేసి పెంచుతున్నాడు. ముడిపట్టు తయారీ ఆలోచన.. కర్ణాటక నుంచి సిదులగట్టు, కోలార్, రాంనగర్, చిక్‌బల్లాపూ ర్ల నుంచి తెచ్చుకుంటు న్న ముడి పట్టును ఇక్కడే తయారు చేయాలనేది ఆయన ఆశయం. ఇందు కు అవసరమైన రీలింగ్ మిషన్, ట్విస్టింగ్ మిషన్ ఏర్పాటు చేస్తే చాలు మల్బరీ ఆకులను తిని పెరిగే పట్టు పురుగుల ద్వారా పట్టును తయారు చేసి.. చీరలు నేసే వరకు ఇక్కడే చేస్తారు. దీంతో మరో 50 మందికి ఉపాధి లభిస్తుంది. మహేష్ తయారు చేసిన చీరలోఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి , వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి – యాదాద్రి నుంచి యంబ నర్సింహులు -
చీర కొంగున చూపుల తోరణం
న్యూలుక్ ⇒పట్టుచీర కొంగు చివరలో సిల్కు దారాలను తీసి ముడులు వేయడం గురించి తెలిసిందే! ఆ ముడులకే కొన్ని అందమైన పూసలు గుచ్చితే ఒక అందం. ⇒చీర రంగు కాంబినేషన్ సిల్క్ దారాలను, పూసలను ఉపయోగించి అల్లిన తర్వాత దానిని కొంగు చివరన జత చేయచేయవచ్చు. ⇒జుంకాలు, గాజులు సిల్కుదారాలతో అందంగా రూపొందిస్తున్నారు. వీటి డిజైన్లనే పోలి ఉండేలా చీర కొంగున దారాల అల్లిక చేయాలి. గాజులు, హారాలు, జుంకాలు, చీర కొంగున... ఒకే విధమైన డిజైన్ ఉండటంతో వేడుకలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది ∙ముందుగా చీర కొంగును కుట్టేసి ఆ తర్వాత విడిగా సిల్క్ దారాల కుచ్చులను కొంగుకు ముడి వేస్తే చాలు... ఇలా అందమైన తోరణం రూపుకడుతుంది. ⇒డిజైన్లను రూపొందించుకోవడానికి సమయం లేనివారు మార్కెట్లో ఉన్న రకరకాల మోడల్స్‌లో నచ్చినదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వీటిని తెచ్చి, జత చేయడమే! ∙పట్టు చీరలతో పాటు ప్లెయిన్ సిల్క్ చీరలు, దుపట్టాల కొంగులను కూడా ఇలాగే అందంగా ముస్తాబు చేయవచ్చు. ముత్యాలు, రతనాలు, జరీ జిలుగులతో తోరణం కడితే... చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ‘కళ్ల’ను చీరకొంగున కట్టేయాలంటే ఎన్నో సొబగులను కలిపి కుట్టాలి. అప్పుడే చీర అందం కొంగొత్త సింగారాలతో ముస్తాబవుతుంది. -
షడ్గజాలు
రంగులు కాంతిమంతంగా, చూపులకు ఆకర్షణీయంగా, మేనికి హాయిగా అనిపించే లైట్‌వెయిట్ పట్టుచీరలు మన ప్రాంతీయ హ్యాండ్లూమ్స్ సొంతం. ఇవి ఈ పండగకే కాదు వేసవికీ ప్రత్యేకం అనిపిస్తాయి. ►జార్జెట్ చీరలైనా లేతరంగులైతే సంప్రదాయ వేడుకలకు హాయిగొలిపే సౌందర్యాన్ని అద్దుతాయి. అతివల అందాన్ని వెయ్యింతలు చేస్తాయి. ►మేనికి సర్వత్రా హాయినిచ్చే కాటన్ చీరలలో ఎన్నో వెరైటీలు. వాటికి డిజైనర్ టచ్ ఇస్తే ఎన్నో ఆధునిక హంగులు. ►సంప్రదాయానికి కాస్త వెస్ట్రన్ టచ్ అద్దితే చీరకట్టుతో స్టైలిష్‌గా వెలిగిపోవడం ఎలాగో తెలుసుకోవచ్చు. పార్టీవేర్‌గా అల్లుకుపోయే లేతరంగు ముచ్చట పండగవేళకు ప్రత్యేకతను చాటుతుంది. ►విరిసిన నవ్వులతో పోటీపడుతూ లతలు, పువ్వులు ప్రకృతి పండగకు కొత్త శోభను మోసుకొస్తాయి. ►ఆభరణాల ఊసు లేకుండా అందంగా రూపుకట్టే పట్టుచీరలు పండగలకు ప్రత్యేకం. వేసవి వేడుక కళాత్మకంగా మారాలంటే తొలి ఎంపిక పట్టుచీరదే అవుతుంది. ►ఉగాది పచ్చడిలో ఆరు రుచుల్లాగ చీరల్లో ఆరు అభిరుచులు ఇవిగో ఆరు గజాల అరవిందాలు. -
కారు దగ్ధం
- రూ. లక్ష పట్టుచీరలు బూడిద - అంకిరెడ్డిపల్లె వద్ద ఘటన కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లె ప్రధాన రహదారిపై గురువారం మారుతి ఈకో కారు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి పంచాయతీ సర్పంచ్ లక్ష్మీనారాయణ పట్టుచీరలు నేస్తుంటాడు. వ్యాపారుల నుంచి ఆర్డర్ రావడంతో చీరలను కారులో లోడ్ చేసుకుని అనంతపురం జిల్లా యాడికికి బయలుదేరాడు. అంకిరెడ్డిపల్లె వద్దకు రాగానే కారులో పొగలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు కేకలు వేయడంతో లక్ష్మీనారాయణ కారు ఆపి బయటకు వచ్చాడు. క్షణాల్లోనే మంటలు కారుకంతా వ్యాపించాయి. ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఫైరింజన్ సిబ్బందిని రప్పించి మంటలను ఆర్పివేయించారు. కారులోని గ్యాస్ సిలెండర్ లీకేజీ కారణంగానే మంటలు వ్యాపించాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. కారులో ఉన్న లక్ష రూపాయల విలువైన చీరలు కాలిపోయాయని బాధితుడు తెలిపారు. -
పాతపట్టు కొత్తకట్టు
► పాతకాలం నాటి డిజైన్లే కొత్త పట్టు చీరలకు నిండుతనాన్ని తెస్తున్నాయి. అందమైన కనికట్టు చేసేస్తున్నాయి. ►చీర బంగారం లాంటిది ఎంత పాతదైనా! ఎంతో విలువ తెస్తుంది నాయినమ్మ, అమ్మమ్మ ప్రేమలా!! మనవరాళ్లూ గెట్ రెడీ! పెళ్ళిళ్ల సీజన్లో మీ తడాఖా చూపించండి పాత పట్టుతో కొత్తకట్టు కట్టండి. ఆ కట్టుకోండి. ►సాదా సీదా రంగులతోనే అందమైన మాయాజాలం. అంచెలంచెలుగా అంచులు అవుతున్నాయి చీరకట్టుకు నజరానాలు. ►వెడల్పాటి అంచులే కాదు నిలువెత్తు చెక్స్తోనూ చీరలు చూపులను చెక్కేస్తున్నాయి . కొత్త సింగారాలను అద్దేస్తున్నాయి. ►చీర అంచు ఎంత వెడల్పుగా ఉంటే వేడుక అంత వైభవంగా మారుతుంది. నేటి వనితల మేనికి వన్నెలు అద్దే ఘనత పట్టుదే అవుతుంది. ► హాయి గొలిపే రంగులు.. వెడల్పాటి అంచులు, అంచుల్లో జరీ చేసే జిలుగులు. వేడుకలో ప్రత్యేకతను చాటడానికి సిద్ధం అంటున్నాయి. -
జ్ఞాపకాల పట్టు
అమ్మమ్మ నవ్వు... నానమ్మ చిరునవ్వు... కలగలిసి కట్టుకుంటే ఏమవుతుంది?\ జ్ఞాపకాల కట్టు అవుతుంది. రెట్రో పట్టు అవుతుంది. అందుకే మనోళ్ల కోసం రెట్రో పట్టుల స్పెషల్. ఈ పెళ్లి సీజన్లో ప్రతి పెళ్లిమండపంలోనూ ఆనందాల నవ్వు. సంబరాల చిరునవ్వు. అలంకరణలోనూ, వేషధారణలోనూ ఇప్పుడు రెట్రోస్టైల్ ఆకర్షణీయంగా మారింది. ఇది పట్టుచీరల్లోనూ కనిపిస్తే మరింత బాగుంటుంది. అందుకే, నేటి తరం అమ్మాయిలకు నాటి తరం పట్టుచీరల మోడల్స్ ఎలా ఉంటాయో చూపించాలనుకున్నాను. అందులో భాగంగానే 50 ఏళ్ల కళ మళ్లీ వెలుగు చూసింది. ఇందుకోసం ఏడాది పాటు రీసెర్చ్ చేశాను. ఎన్నో రకాల పాత పట్టుచీరలను కొనుగోలు చేశాను. అయితే, పాత కాలం నాటి పట్టుచీరల మీద జరీ కాంతులు ఎక్కువ. అలాగే, రంగులు కూడా గాడీగా కనిపించేవి. నేటి తరానికి ఇష్టపడేలా, చూడగానే ఒక యూత్‌ఫుల్ లుక్ కనిపించేలా కలర్ వేరియేషన్స్, ప్యాటర్న్స్ వీటిలో మిక్స్ చేశాను. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ ►చీరలు ధరించినప్పుడు ప్రత్యేకమైన శిరోజాలంకరణ కూడా ప్రధానమైనదే. స్టైలిష్ లుక్‌కి ఏయే అంశాలు ప్రధానంగా ఉంటాయో గమనిస్తూ, ఆచరణలో పెట్టాలి. ►చీర మోడల్ ఎంత రెట్రో స్టైల్ ఉంటే లుక్ అంత స్టైలిష్‌గా మార్చేయవచ్చు. అందుకు కాంట్రాస్ట్ బ్లౌజ్, ఆభరణాల ఎంపికలో శ్రద్ధ అవసరం. ►చీరకు ఏమాత్రం సంబంధం లేని పూర్తి కాంట్రాస్ట్, డిఫరెంట్ నెక్‌లైన్స్ కూడా ప్రయత్నించవచ్చు. దీనివల్ల లుక్ చాలా స్టైయిల్‌గా కనిపిస్తుంది. ►గ్రాండ్‌గా కనిపించే ఈ తరహా చీరల మీదకు బ్లౌజులు వర్క్ చేయించినప్పుడు శారీకి సంబంధించిన ఒక ఎలిమెంట్ మాత్రమే జత చేయాలి. అలాగే నెక్లైన్ సింపుల్‌గా ఉండాలి. ► చీరలో ఉన్న కలర్ చీరలో కనిపించాలి. ►అలాగే బ్లౌజ్లో ఉండే కలర్ బ్లౌజ్లో కనిపించాలి. అంటే ఒకదానిని ఒకటి డామినేట్ చేస్తున్నట్టు ఉండకూడదు. అప్పుడే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. -
కొంగు బంగారం
ఆకుపచ్చ చీరపై బంగారు పువ్వుల కాంతి. ఈ పట్టుచీర కట్టుకుంటే మాటల్లో చెప్పలేని సౌందర్యంతో మెరిసిపోవాల్సిందే. మొత్తం సెల్ఫ్ డిజైన్, అబ్బురపరిచే పల్లూ... ఈ చీర వైభవాన్ని వెయ్యింతలు చేస్తున్నాయి. ఆకాశం రంగు మేనిని అల్లుకున్నట్లు ఈ చీర సౌందర్యం వర్ణనకు అందనిది. చీరంతా బంగారు వర్ణపు లైన్లు రావడంతో అద్భుతంగా మెరిసిపోతుంది. సింపుల్ డిజైన్ అనిపిస్తూ గ్రాండ్‌గా లుక్‌తో వెలిగిపోతున్న పల్లూ, జరీ అంచు ఈ చీరకు అదనపు హంగుగా చేరాయి. ఇంద్రధనుస్సును ఒంటికి చుట్టుకోవడం ఎలాగో పట్టుచీరలా మార్చి కట్టుకోవడం ఎలాగో హరివిల్లును మడతేసి బీరువాలో పెట్టుకోవడం ఎలాగో తెలియాలంటే ఈ చీరలను చూడాల్సిందే! రండి... కళ్లారా చూడండి... మేనికి చుట్టిన సింగారాలివి! కొంగున కట్టిన బంగారాలివి!! నీలి, వంగపండు రంగుల కలయికతో చూపులను కట్టడి చేస్తోందీ పట్టుచీర. వెండి, బంగారు వర్ణంలో సెల్ఫ్ డిజైన్, జరీ అంచుతో మెరిసిపోతున్న ఈ పట్టుచీరపెళ్లిలో ఓ ప్రత్యేక ఆకర్షణే. ఆకుపచ్చ రంగు.. అద్భుతమైన జరీ డిజైన్ ఈ చీర ప్రత్యేకతను చాటుతున్నాయి. మామిడిపిందెల డిజైన్ వర్ణించనలవి కాని సౌందర్యం వివాహవేడుకలో ప్రత్యేకం. రాణీ పింక్ కలర్లో రాణిలా వెలిగిపోతున్న ఈ చీర ఆధునికతను అందిపుచ్చుకునే వనితలను చూపులను తిప్పుకోనివ్వదు. బంగారు వర్ణంలో చీరంతా వచ్చిన డిజైన్ ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటేలా ఉంది. -
పట్టు కట్టు
కంచి పట్టుచీర కట్టుకున్నప్పుడు... మెరుపు జరీతో మేనిని చుట్టుకున్నప్పుడు కళ్లు రంజించేలా కంజీవరం శారీ చేసే, మ్యాజిక్కు మంత్రముగ్ధులైపోవాల్సిందే. కట్టుకుంటే మాగ్నిఫిసెంట్! ఆకట్టుకోవడంలో మ్యాగ్నెట్!! ఇంతకు మంచి ఏదైనా చెప్పాలా... కంచి కథే వేరు... ఆ పట్టు కనికట్టే వేరు! రాణీ పింక్ చీరకు బంగారు రంగు పెద్ద అంచు ప్రధాన ఆకర్షణ. చీరంతా బంగారు వర్ణపు చెక్స్ రావడంతో అద్భుతంగా మెరిసిపోతుంది. సింపుల్ డిజైన్ అనిపిస్తూ గ్రాండ్‌గా లుక్‌తో వెలిగిపోతున్న పల్లూ ఈ చీరకు అదనపు హంగుగా చేరింది. మస్టర్డ్, పచ్చ రంగులతో చూపు తిప్పుకోనివ్వని విధంగా ఉన్న ఈ పట్టుచీర కట్టుకుంటే మాటల్లో చెప్పలేని సౌందర్యంతో మెరిసిపోవాల్సిందే! రెండు రంగుల అంచులు, మామిడిపిందెల సెల్ఫ్ డిజైన్, చిన్న చిన్న బుటా ఈ చీర వైభవాన్ని వెయ్యింతలు చేస్తున్నాయి. వివాహ వేడుకలకు కళను తీసుకువచ్చేవి పట్టుచీరల రెపరెపలే! బంగారు రంగులో మెరిసిపోతున్న పెద్ద అంచు ముదురు ఎరుపు రంగు కంజీవరం పట్టుచీర పెళ్లికి ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే. చీరంతా బంగారు జరీ బుటీ, అంచు మీద సంప్రదాయ డిజైన్ చూపరుల కళ్లను కట్టిపడేస్తాయి. కలల్లో సాక్షాత్కరించిన మహాలక్ష్మి కళ్లముందు కనిపిస్తే మన ఇంటి అమ్మాయిగా ఇలా రూపుకడుతుంది. బంగారు, పచ్చ రంగు అంచులతో గంధం రంగు పట్టుచీర.. దానిపైన మెజెంటా రంగు పువ్వుల సెల్ఫ్ డిజైన్... వర్ణించనలవి కాని సౌందర్యం వివాహవేడుకలో ప్రత్యేకం. -
ఇది కేకు కాదను కోక
హెడ్లైన్ తప్పనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది నిజం. పట్టు చీరలా ధగధగలు ఒలకబోస్తోన్న ఆ శారీని చూసి అత్తింటివాళ్లు నోరెళ్లబెడితే.. ఆ చీరలో నుంచి చిన్న ముక్క తీసి అత్త నోట్లో పెట్టి ఆశ్చర్యపరిచిందట కోడలు. బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ట్రెండ్స్ సిటీలో కొంగొత్త పోకడలు పోతున్న ధోరణికి కేక పుట్టించే కోక కేకు ఓ చిరు ఉదాహరణ. - చల్లపల్లి శిరీష బర్త్‌డే, మ్యారేజ్ డే, ఫ్రెషర్స్‌డే, ఫేర్వెల్ డే, న్యూఇయర్.. సెలబ్రేషన్ ఏదైనా తన ప్రాధాన్యతను విస్తరించుకుంటూ నేనే ఫైన్ అంటోంది కేక్. నిజానికి ఇప్పుడు కేక్ రుచి చూడని వేడుకలు అత్యంత స్వల్పమనే చెప్పాలి. నూతన వేడుకలకు నేను సైతం అంటూనే ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఆధునికులను ఆకట్టుకుంటోంది రకరకాల ఫ్లేవర్లతో చవులూరించే కేక్. చాక్లెట్, స్ట్రాబెర్రీ, వెనీలా, బనానా.. ఇలా డిఫరెంట్ ఫ్లేవర్లలో విభిన్న ఆకృతులతో సందడి చేస్తోంది. అదే క్రమంలో రుచిలో, ఆకృతిలో లేటెస్ట్గా వచ్చింది త్రీడీ కస్టమైజ్డ్ కేక్. ఇంటీరియర్ టు కేక్ డిజైనర్ నేను ఇంటీరియర్ డిజైనర్‌ని. కేక్ తయారీ అంటే చాలా ఇష్టం. హాబీగా కేక్‌లు తయారు చేసేదాన్ని. త్రీడీ కేక్‌లు క్రేజీగా మారాక వాటి తయారీలో చాలా బిజీ అయ్యాను. 1.75 కి .గ్రాల బరువు కలిగిన త్రీడీ చీర కేక్‌ను ఎలాంటి మౌల్డ్‌లు ఉపయోగించకుండా స్వహస్తాలతో తయారు చేశాను. కేక్‌పై డెకరేషన్ కోసం 8 గంటలు కష్టపడ్డాను. దీని తర్వాత ఎంగేజ్మెంట్ల కోసం వెడ్డింగ్ రింగ్ కేక్, జ్యువెల్లరీ సెట్ కేక్, తాంబూలాల కేక్.. అంటూ నెలకు దాదాపు 50 నుంచి 60 రకాల ఆర్డర్లు వ స్తున్నాయి. అనేక థీమ్‌లతో ఆర్డర్లు రావడం.. నా క్రియేటివిటీకి పదును పెడుతున్నాయి. - తన్వీ పల్శికర్ అత్తకు ప్రేమతో... ఇది మాఘ మాసం. శుభకార్యాల సీజన్.ఎంగేజ్మెంట్, పెళ్లి, మెహందీ ఫంక్షన్లు, బ్యాచిలర్ పార్టీలకు కొదవుండదు. ప్రతీ వేడుకలోనూ ‘కేక్’దే హడావిడి. ఈ క్రమంలోనే నగరానికి చెందిన కోడలు అత్తగారి పుట్టినరోజు కోసం కేక్‌ను విచిత్రంగా డిజైన్ చేయించింది. ఆ మహారాష్ట్ర ఫ్యామిలీ కోడలు తన అత్తగారి ఇంటికెళ్లి ఆమె చేతిలో ఆప్యాయంగా పెట్టిన పట్టు చీర ఏంటో తెలుసా..? నిజానికి ఓ త్రీడీ కస్టమైజ్డ్ కేక్. ‘మా అత్తకు ఎంతో ఇష్టమైన పైథాని సిల్క్ చీర, నగలను పోలి ఉండేలా కేక్ తయారు చేయించాలనుకున్నాను. అదే ఆర్డర్ చేశాను. దాదాపు ఒక రోజంతా కష్టపడి చీరలా ఉండే త్రీడీ కేక్‌ను తయారు చేశారు బేకరీ నిర్వాహకులు. చీర కొంగు మీది డిజైన్‌తో పాటు, నేను చూపించిన జ్యూవెల్లరీ అచ్చుగుద్దినట్లు తయారు చేసి ఔరా అనిపించారు. దీన్ని మా అత్తగారికి అందిస్తే ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయ’ని గుర్తు చేసుకుందా కోడలు. ఈ కేక్ సహజంగానే అత్తగారి పుట్టినరోజు వేడుకలో ప్రధాన ఆక ర్షణగా నిలిచింది. అతిథులంతా ఫేస్బుక్, ట్వీటర్లో కేక్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటే కోడలు పిల్ల తెగ సంబరపడిపోయింది. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు... ఒక్క కేక్ తయారీతో ఆర్డర్లతో బిజీ అయిపోయారు దానిని తయారుచేసిన తన్వీ పల్శికర్. -
పట్టు చీరకు కొత్త హంగులు..
పెళ్లిళ్ల సీజన్. పాత పట్టుచీరలను పెట్టెల అడుగునే ఉంచేయకుండా వాటికో కొత్త రూపు ఇస్తే న్యూ లుక్ ఇలా నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి.సంప్రదాయ పట్టుచీరను ఆధునికపు హంగులు అద్ది లాంగ్ గౌన్‌గా రూపు కట్టవచ్చు.చీరంతా పాడైపోయినా, అంచులు, పల్లూ డిజైన్స్ జరీ మెరుపులు కొత్తగా అలాగే ఉండిపోతాయి. వీటిని అందమైన క్లాత్ హ్యాండ్ బ్యాగులుగా రూపొందించుకోవచ్చు. పట్టు చీరను ఇలా చుడీ టాప్‌గా డిజైన్చేయించుకోవచ్చు. చీరకట్టుకోవడానికి ఇబ్బంది పడే అమ్మాయిలు వీటిని సౌకర్యవంతంగా ధరించవచ్చు.అంచుల మీద ఆప్లిక్, గోటా వర్క్ చేసిన ఎరుపు, పచ్చ, నారింజ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న కంజీవరం లాంగ్ అనార్కలీ ఇది. చీరంతా పాడైపోయినా, అంచులు, పల్లూ డిజైన్స్ జరీ మెరుపులు కొత్తగా అలాగే ఉండిపోతాయి. వీటిని అందమైన క్లాత్ హ్యాండ్ బ్యాగులుగా రూపొందించుకోవచ్చు. -
రీతూ పవనాలు
ఆమె పేరే చాలు అంటారు ఫ్యాషన్ ప్రియులు. దేశీయ చేనేతలదే ఆ ఘనతంతా అంటారామె వినమ్రంగా. మన చుట్టుపక్కలే ఉన్న హస్తకళానైపుణ్యంతో విదేశీ సెలబ్రిటీలు సైతం తన ఫ్యాషన్‌కు చుట్టాలు పక్కాలుగా మారిపోయేలా చేసిన ఆ రీతూ‘పవనాలు’ మీ ఇంటా వీయాలని కోరుకుంటున్నారా... అయితే ఈ డిజైన్లు మీకోసమే... బనారస్ పట్టు చీర అనగానే పెళ్లిళ్లకు మాత్రమే అనుకుంటారు. కానీ, స్లీవ్‌లెస్ హాల్టర్ నెక్ బ్లౌజ్, బాటమ్‌గా షిమ్మర్ చుడీ ధరించి బెనారస్ పట్టు చీర కడితే సంప్రదాయ పార్టీ ఏదైనా ఆకర్షణీయంగా మెరిసిపోవచ్చు. పాలనురగ లాంటి లెహంగా , చున్నీ నైట్ పార్టీలో ప్రధాన ఆకర్షణ. చేతికి వెడల్పాటి పట్టీ, చెవులకు పెద్దపెద్ద రింగులు ధరిస్తే వెస్ట్రన్పార్టీకీ బాగా నప్పుతుంది.వేడుకలలో వైభవంగా వెలిగిపోవాలంటే ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ వర్క్ కలర్స్ బ్రైట్‌గా ఉండాలి. బెనారస్, క్రేప్ ఫ్యాబ్రిక్‌పైన జరీ పువ్వులు, ఆకులు, లతలతో గ్రాండ్‌గా తీర్చిదిద్దిన లెహంగా ఇది. పూర్తి ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఈ లెహంగాను తీర్చిదిద్దారు. ట్రెడిషనల్, వెస్ట్రన్ కలగలిపి డిజైన్ చేసిన టాప్, లెగ్గింగి కాంబినేషన్ ఇది. -
పట్టుచీరకు బ్లౌజ్ బొట్టు
పట్టు చీర కడితే పండగ వచ్చేసినట్టే. పండగ కళ రావాలంటే పట్టు చీర కట్టాల్సిందే. దీపాల వెలుగుల్లో మహాలక్ష్ముల్లా మెరిసిపోవడానికి పట్టు చీరలు రెపరెపలాడాల్సిందే! వరుసగా పెళ్లిళ్లు కూడా రావడంతో పట్టు చీరలు సందడిచేసే సమయం ఇదే! మీదైన ప్రత్యేకత వేడుకలో కనిపించాలంటే బ్లౌజ్ మీద దృష్టి పెట్టాలి. చీరకు తగిన బ్లౌజ్ కాదు, చీరను బ్రైట్ చేసే బ్లౌజ్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నుదుటికి బొట్టులా చీరకు బ్లౌజ్ ఓ తరగని అందం. జరీ అంచుల మెరుపులు పట్టు చీరకు ఎంతో అందాన్ని తీసుకువస్తాయి. జరీ లైన్స్, బార్డర్స్, మోటిఫ్స్.. వీటిలోనే పట్టు చీరలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అలాగే బ్లౌజ్ డిజైన్స్‌లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ ఇస్తున్నాం. - ఎన్ .ఆర్ భిన్నమైన రంగులు పట్టు చీర కొన్నాక అందులోనూ బ్లౌజ్‌కి సరిపడా క్లాత్ ఉంటుంది. దీంతోనే బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటారు. చీర రంగుకు పూర్తి భిన్నమైన రంగు బ్లౌజ్‌లు, విభిన్న మోడళ్లలో డిజైన్ చేయించుకుంటే సందర్భానుసారం స్టైల్‌గా మెరిసిపోవచ్చు. ఎంబ్రాయిడరీ కీలకం జరీ, కుందన్స్, స్టోన్స్‌ను ఉపయోగించే చేసే మగ్గం వర్క్ బ్లౌజ్‌లు చూపుతిప్పుకోనివ్వకుండా డిజైన్ చేస్తున్నారు. వీటి కన్నా కేవలం పట్టు క్లాత్‌ను ఉపయోగించి మాత్రమే డిజైన్ చేసిన బ్లౌజ్‌లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పెళ్లిళ్లకు వాడే బ్లౌజ్‌లలో ఎక్కువ మగ్గం వర్క్ చూస్తుంటాం. కానీ ప్రముఖ డిజైనర్స్ మాత్రం ఎంబ్రాయిడరీని ఉపయోగించకుండా పట్టు క్లాత్‌తోనే మోడ్రన్ డిజైన్స్ సృష్టిస్తున్నారు. ఫ్రంట్అండ్ బ్యాక్ నెక్ ఎప్పుడూ రౌండ్, స్క్యేర్ టైప్ కాకుండా బోట్ నెక్, హై నెక్, లెహంగా జాకెట్ స్టైల్.. ఇలా భిన్నమైన డిజైన్లు ఈ బ్లౌజ్లకు ఉపయోగించవచ్చు. ఈ డిజైన్ బ్లౌజులు ధరించడం వల్ల ఆధునికంగా కనిపిస్తారు. బాక్ నెక్స్‌లో క్రాస్, బ్రాడ్.. డిజైన్స్ ఈ కాలానికి తగ్గట్టుగా బాగా నప్పుతున్నాయి. స్లీవ్స్... స్లీవ్‌లెస్... పట్టు చీరల మీదకు ఒకే తరహా స్లీవ్స్ కాకుండా బుట్టచేతులు, లాంగ్, త్రీ బై ఫోర్త్.. ప్రస్తుతం బాగా వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ స్లీవ్స్ ఇప్పటి ట్రెండ్‌లో ముందున్నాయి. చీర అంచు అంతా ఇంకాస్త ఎక్కువగానే బ్లౌజ్ స్లీవ్స్ డిజైన్ చేయడం నిండైన వెలుగునిస్తుంది’ అంటారు ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైన్ గౌరంగ్‌షా, మనీషా మల్హోత్రాలు. -
‘పద్మ’వర్షిణి.. వర్ణ దర్శిని
ప్రకృతి సోయగాల సమ్మిళిత పట్టుచీర డిజైన్ పేరు : పద్మవర్షిణి రూపకర్త : మోహన్ ఆవిష్కర్త : బీరే ప్రసాద్ ఎక్కడ : బుధవారం ధర్మవరం పద్మారవింద ఫ్యాక్టరీలో ప్రత్యేకత : భారతీయతకు దర్పణం. పట్టుదారంతో పద్మపుష్పాలను తీర్చిదిద్దారు. ఇది అధిక కాంతిలో ఓ రంగులో, చీకటిచిమ్మితే మరో వర్ణంలోనూ మెరిసిపోతుంది. కొంగులో రత్నాల కూజాభాండం అమరిక, సప్తపుష్పాల అల్లిక, కుచ్చిళ్లలో ఆరుతులాల మేలిమి ముత్యాలతో మంగళతోరణాల కూర్పు. ఎంతమంది శ్రమిస్తే : పదిమంది 30 రోజులపాటు శ్రమిస్తే ఈ అద్భుత సృజనకు ఆవిష్కారం ఖరీదు : రూ.38వేలు మాత్రమే -ధర్మవరం -
క్రాఫ్ట్ బజార్
హైదరాబాద్ ముత్యాలు, కొండపల్లి బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్... వెంకటగిరి, నారాయణపేట, పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి సిల్క్ శారీస్ నగరవాసుల మనసు దోస్తున్నాయి. లేపాక్షి హస్త కళల అభివృద్ధి సంస్థ దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘లేపాక్షి క్రాఫ్ట్ బజార్’లో ఇలాంటివెన్నో ఆకర్షణీయమైన వెరైటీలు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఎక్స్పోలోని 150 స్టాల్స్‌లో తెలుగు రాష్ట్రాల చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు, అల్లికలు, కళాకృతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ ఇందులోని ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. ఈ నెల 15 వరకు ప్రదర్శన కొనసాగుతుంది. కవాడిగూడ -
అందం ఓ వరం
అందానికి చిరునామాగా నిలిచిన ఆ ముద్దుగుమ్మ.. పట్టుచీరలో మరింత మెరిసిపోయింది. అందం దేవుడిచ్చిన వరం అంటోన్న ఈ బ్యూటీక్వీన్ ఒకే ఏడాది ఏడు బ్యూటీ అవార్డులు సొంతం చేసుకుంది. భారతీయ సంస్కృతి చాటే చీరకట్టు.. మగువల అందాన్ని రెట్టింపు చేస్తుందని చెబుతోంది. సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో బ్యూటిఫుల్ బ్రైడ్‌గా కనిపించిన మిస్ ఇండియా ఎర్త్ అలంకృత సహాయ్ను ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: వాంకె శ్రీనివాస్ నేను పుట్టి పెరిగింది ఢిల్లీలో. చదువంతా అక్కడే సాగింది. చిన్నప్పుడు డ్రెస్సింగ్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు. ఓసారి మా బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ అంటే ఏంటో నాకు తెలిసొచ్చింది. నలుగురిలో స్పెషల్‌గా కనిపించాలంటే మన ఆహార్యం అదిరిపోయేలా ఉండాలనిపించింది. అప్పట్నుంచి మార్కెట్లోకి వచ్చే నయా డిజైన్స్ గురించి వాకబు చేస్తుండేదాన్ని. నచ్చిన కాస్ట్యూమ్‌ను ట్రై చేసేదాన్ని. కాలేజ్ డేస్‌లోనూ అందం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాను. అలా మోడల్‌గా రంగప్రవేశం చేశాను. బ్యూటీ అనేది దేవుడిచ్చిన వరం. అందుకే ఆ అందానికి ప్రాధాన్యం కలిగించేందుకు బ్యూటీ కాంపిటీషన్స్‌లో పాల్గొంటూ వచ్చాను. నమ్మకంతో... 2009లో మిస్ నోయిడా కిరీటాన్ని దక్కించుకున్నా. ఏదో రోజు మిస్ ఇండియాగా మెరవగలననే నమ్మకం కలిగింది. తర్వాత సెకండ్ మిస్ దివా కాంటెస్ట్‌లో పాల్గొని ఫస్ట్ రన్నర్‌గా నిలిచాను. అదే జోష్‌లో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాను. ఫిలిప్పీన్స్‌లో జరిగిన అందాల పోటీల్లో ఎకో బ్యూటీ వీడియో అవార్డు కూడా దక్కింది. వీటితో పాటు మిస్ స్టైల్ ఐకాన్, మిస్ పర్ఫెక్ట్ బాడీ, మిస్ టాలెంట్ అవార్డులూ వరించాయి. ఒకే ఏడాది ఏడు అవార్డులు అందుకున్న ఇండియన్ బ్యూటీగా గౌరవం దక్కింది. మా చెల్లి పుట్టింది ఇక్కడే... నా చిన్నతనంలో మా పేరెంట్స్ కొన్నాళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మా చెల్లి అపూర్వ ఇక్కడే పుట్టింది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేను. అప్పుడప్పుడూ ఈ బ్యూటిఫుల్ సిటీకి వస్తుండేదాన్ని. ఇక్కడ షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. జ్యువెలరీ కొనుగోలు చేస్తాను. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించాలని ఉంది. టాలీవుడ్లో మంచి చాన్స్ దొరికితే తప్పకుండా చేస్తాను. సూపర్‌స్టార్ రజనీకాంత్ మూవీలో అవకాశం వస్తే అస్సలు వదులుకోను. ప్రస్తుతం ఫెమినా కవర్ పేజీపై దృష్టి సారించాను.