కొంగు బంగారం | sarees special stories | Sakshi
Sakshi News home page

కొంగు బంగారం

Published Fri, Apr 1 2016 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

కొంగు బంగారం

కొంగు బంగారం

ఆకుపచ్చ చీరపై బంగారు పువ్వుల కాంతి. ఈ పట్టుచీర కట్టుకుంటే మాటల్లో చెప్పలేని సౌందర్యంతో మెరిసిపోవాల్సిందే.  మొత్తం సెల్ఫ్ డిజైన్,  అబ్బురపరిచే పల్లూ...  ఈ చీర వైభవాన్ని  వెయ్యింతలు చేస్తున్నాయి.

ఆకాశం రంగు మేనిని అల్లుకున్నట్లు ఈ చీర సౌందర్యం వర్ణనకు అందనిది. చీరంతా బంగారు వర్ణపు లైన్లు రావడంతో అద్భుతంగా మెరిసిపోతుంది.  సింపుల్ డిజైన్ అనిపిస్తూ గ్రాండ్‌గా లుక్‌తో వెలిగిపోతున్న పల్లూ, జరీ అంచు ఈ చీరకు  అదనపు హంగుగా  చేరాయి.

ఇంద్రధనుస్సును ఒంటికి చుట్టుకోవడం ఎలాగో  పట్టుచీరలా మార్చి కట్టుకోవడం ఎలాగో హరివిల్లును మడతేసి బీరువాలో పెట్టుకోవడం ఎలాగో తెలియాలంటే ఈ చీరలను చూడాల్సిందే! రండి... కళ్లారా చూడండి... మేనికి చుట్టిన సింగారాలివి!  కొంగున కట్టిన బంగారాలివి!!

నీలి, వంగపండు రంగుల కలయికతో చూపులను కట్టడి చేస్తోందీ పట్టుచీర. వెండి, బంగారు వర్ణంలో సెల్ఫ్ డిజైన్, జరీ అంచుతో మెరిసిపోతున్న ఈ పట్టుచీరపెళ్లిలో ఓ ప్రత్యేక ఆకర్షణే.

ఆకుపచ్చ రంగు..
అద్భుతమైన జరీ డిజైన్  ఈ చీర ప్రత్యేకతను చాటుతున్నాయి. మామిడిపిందెల డిజైన్ వర్ణించనలవి కాని సౌందర్యం వివాహవేడుకలో ప్రత్యేకం.

రాణీ పింక్ కలర్‌లో రాణిలా వెలిగిపోతున్న ఈ చీర ఆధునికతను అందిపుచ్చుకునే వనితలను చూపులను తిప్పుకోనివ్వదు. బంగారు వర్ణంలో చీరంతా వచ్చిన డిజైన్ ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటేలా ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement