జ్ఞాపకాల పట్టు
అమ్మమ్మ నవ్వు... నానమ్మ చిరునవ్వు... కలగలిసి కట్టుకుంటే ఏమవుతుంది?\ జ్ఞాపకాల కట్టు అవుతుంది.
రెట్రో పట్టు అవుతుంది. అందుకే మనోళ్ల కోసం రెట్రో పట్టుల స్పెషల్. ఈ పెళ్లి సీజన్‌లో ప్రతి పెళ్లిమండపంలోనూ ఆనందాల నవ్వు. సంబరాల చిరునవ్వు.
అలంకరణలోనూ, వేషధారణలోనూ ఇప్పుడు రెట్రోస్టైల్ ఆకర్షణీయంగా మారింది. ఇది పట్టుచీరల్లోనూ కనిపిస్తే మరింత బాగుంటుంది. అందుకే, నేటి తరం అమ్మాయిలకు నాటి తరం పట్టుచీరల మోడల్స్ ఎలా ఉంటాయో చూపించాలనుకున్నాను. అందులో భాగంగానే 50 ఏళ్ల కళ మళ్లీ వెలుగు చూసింది. ఇందుకోసం ఏడాది పాటు రీసెర్చ్ చేశాను. ఎన్నో రకాల పాత పట్టుచీరలను కొనుగోలు చేశాను. అయితే, పాత కాలం నాటి పట్టుచీరల మీద జరీ కాంతులు ఎక్కువ. అలాగే, రంగులు కూడా గాడీగా కనిపించేవి. నేటి తరానికి ఇష్టపడేలా, చూడగానే ఒక యూత్‌ఫుల్ లుక్ కనిపించేలా కలర్ వేరియేషన్స్, ప్యాటర్న్స్ వీటిలో మిక్స్ చేశాను. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్
►చీరలు ధరించినప్పుడు ప్రత్యేకమైన శిరోజాలంకరణ కూడా ప్రధానమైనదే. స్టైలిష్ లుక్‌కి ఏయే అంశాలు ప్రధానంగా ఉంటాయో గమనిస్తూ, ఆచరణలో పెట్టాలి.
►చీర మోడల్ ఎంత రెట్రో స్టైల్ ఉంటే లుక్ అంత స్టైలిష్‌గా మార్చేయవచ్చు. అందుకు కాంట్రాస్ట్ బ్లౌజ్, ఆభరణాల ఎంపికలో శ్రద్ధ అవసరం.
►చీరకు ఏమాత్రం సంబంధం లేని పూర్తి కాంట్రాస్ట్, డిఫరెంట్ నెక్‌లైన్స్ కూడా ప్రయత్నించవచ్చు. దీనివల్ల లుక్ చాలా స్టైయిల్‌గా కనిపిస్తుంది.
►గ్రాండ్‌గా కనిపించే ఈ తరహా చీరల మీదకు బ్లౌజులు వర్క్ చేయించినప్పుడు శారీకి సంబంధించిన ఒక ఎలిమెంట్ మాత్రమే జత చేయాలి. అలాగే నెక్‌లైన్ సింపుల్‌గా ఉండాలి.
► చీరలో ఉన్న కలర్ చీరలో కనిపించాలి.
►అలాగే బ్లౌజ్‌లో ఉండే కలర్ బ్లౌజ్‌లో కనిపించాలి. అంటే ఒకదానిని ఒకటి డామినేట్ చేస్తున్నట్టు ఉండకూడదు. అప్పుడే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు.