dominate
-
కివీస్ దీటైన జవాబు
కొలంబో: ఎట్టకేలకు శ్రీలంక–న్యూజిలాండ్ రెండో టెస్టుకు వరుణుడు అడ్డు తొలగాడు. తొలి రెండు రోజులు వర్షంతో సగం ఆట కూడా సాగని ఈ మ్యాచ్‌లో శనివారం మాత్రం పూర్తి ఓవర్లు పడ్డాయి. ఓవర్‌నైట్ స్కోరు 144/6తో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 90.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వా (109; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కెప్టెన్ దిముత్ కరుణరత్నె (65; 6 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. సౌతీ (4/63), బౌల్ట్ (3/75) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్ రోజు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (111 బ్యాటింగ్; 10 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. కెప్టెన్ విలియమ్సన్ (20), టేలర్ (23), నికొల్స్ (15) ఎక్కువసేపు నిలువలేదు. లాథమ్‌కు కీపర్ వాట్లింగ్ (25 బ్యాటింగ్) సహకారం అందించాడు. -
జ్ఞాపకాల పట్టు
అమ్మమ్మ నవ్వు... నానమ్మ చిరునవ్వు... కలగలిసి కట్టుకుంటే ఏమవుతుంది?\ జ్ఞాపకాల కట్టు అవుతుంది. రెట్రో పట్టు అవుతుంది. అందుకే మనోళ్ల కోసం రెట్రో పట్టుల స్పెషల్. ఈ పెళ్లి సీజన్లో ప్రతి పెళ్లిమండపంలోనూ ఆనందాల నవ్వు. సంబరాల చిరునవ్వు. అలంకరణలోనూ, వేషధారణలోనూ ఇప్పుడు రెట్రోస్టైల్ ఆకర్షణీయంగా మారింది. ఇది పట్టుచీరల్లోనూ కనిపిస్తే మరింత బాగుంటుంది. అందుకే, నేటి తరం అమ్మాయిలకు నాటి తరం పట్టుచీరల మోడల్స్ ఎలా ఉంటాయో చూపించాలనుకున్నాను. అందులో భాగంగానే 50 ఏళ్ల కళ మళ్లీ వెలుగు చూసింది. ఇందుకోసం ఏడాది పాటు రీసెర్చ్ చేశాను. ఎన్నో రకాల పాత పట్టుచీరలను కొనుగోలు చేశాను. అయితే, పాత కాలం నాటి పట్టుచీరల మీద జరీ కాంతులు ఎక్కువ. అలాగే, రంగులు కూడా గాడీగా కనిపించేవి. నేటి తరానికి ఇష్టపడేలా, చూడగానే ఒక యూత్‌ఫుల్ లుక్ కనిపించేలా కలర్ వేరియేషన్స్, ప్యాటర్న్స్ వీటిలో మిక్స్ చేశాను. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ ►చీరలు ధరించినప్పుడు ప్రత్యేకమైన శిరోజాలంకరణ కూడా ప్రధానమైనదే. స్టైలిష్ లుక్‌కి ఏయే అంశాలు ప్రధానంగా ఉంటాయో గమనిస్తూ, ఆచరణలో పెట్టాలి. ►చీర మోడల్ ఎంత రెట్రో స్టైల్ ఉంటే లుక్ అంత స్టైలిష్‌గా మార్చేయవచ్చు. అందుకు కాంట్రాస్ట్ బ్లౌజ్, ఆభరణాల ఎంపికలో శ్రద్ధ అవసరం. ►చీరకు ఏమాత్రం సంబంధం లేని పూర్తి కాంట్రాస్ట్, డిఫరెంట్ నెక్‌లైన్స్ కూడా ప్రయత్నించవచ్చు. దీనివల్ల లుక్ చాలా స్టైయిల్‌గా కనిపిస్తుంది. ►గ్రాండ్‌గా కనిపించే ఈ తరహా చీరల మీదకు బ్లౌజులు వర్క్ చేయించినప్పుడు శారీకి సంబంధించిన ఒక ఎలిమెంట్ మాత్రమే జత చేయాలి. అలాగే నెక్లైన్ సింపుల్‌గా ఉండాలి. ► చీరలో ఉన్న కలర్ చీరలో కనిపించాలి. ►అలాగే బ్లౌజ్లో ఉండే కలర్ బ్లౌజ్లో కనిపించాలి. అంటే ఒకదానిని ఒకటి డామినేట్ చేస్తున్నట్టు ఉండకూడదు. అప్పుడే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. -
దూకుడుగా ఆడాల్సి ఉంది: రైనా
టి20 సిరీస్‌లో దూకుడైన ఆటతీరుతోనే ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శిస్తామని భారత బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు. ప్రత్యర్థితో పోలిస్తే తమ జట్టులో మంచి అనుభవం ఉందని, దేశవాళీ క్రికెట్ కారణంగా తనకు కూడా తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించిందని అతను అన్నాడు. ఆస్ట్రేలియా మైదానాల్లో బౌండరీలు అంత సులభంగా రావు కాబట్టి సింగిల్స్‌పై దృష్టి పెట్టాలన్న రైనా, ఫీల్డింగ్ కూడా మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తుందన్నాడు. -
మంత్రుల సిగపట్లు..
గంటా అండతో ఏపీఐఐసీ ఈడీగా సత్యసాయి శ్రీనివాస్ అడ్డుచక్రం వేసిన మంత్రి అయ్యన్న వారమైనా అందని రిలీవింగ్ ఉత్తర్వులు మరో రెండు పోస్టులకూ మంత్రుల మధ్య ఆధిపత్య పంతం నలిగిపోతున్న అధికారులు విశాఖపట్నం: మంత్రులకు చెలగాటం.. అధికారులకు ప్రాణసంకటం అన్నట్లుగా తయారైంది జిల్లాలో పాలనావ్యవస్థ. కీలకమైన స్థానాల్లో తమకు అనుకూల అధికారే ఉండాలని మంత్రులు గంటా మంత్రి.. అయ్యన్న ఎవరికి వారు పట్టుబడుతున్నారు. మొండికేస్తున్నారు. కీలక పోస్టుల్లో అధికారులను నియమించడం...అంతలోనే అబైయన్స్లో పెట్టడం... వారిని మాతృశాఖ నుంచి రిలీవ్ చేయకపోవడం... బదిలీ ఉత్తర్వులు రద్దు చేయడం... చివరికి ఆ పోస్టులు భర్తీకాకుండా ఉండిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఏపీఐఐసీ ఈడీ పోస్టు కూడా మంత్రుల ఆధిపత్య పోరులో చిక్కుకుంది. డీఆర్వో, డీఎస్వో (విశాఖ సిటీ) పోస్టుల పరిస్థితి కూడా అంతే. శ్రీనివాస్‌కు అందలం పంచాయతీరాజ్ శాఖకు చెందిన సత్యసాయి శ్రీనివాస్ దీర్ఘకాలంగా డెప్యుటేషన్ మీద డీఆర్డీయే పీడీగా ఉన్నారు. ప్రభుత్వం ఆయన్ను ఇటీవల ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)గా బదిలీ నియమించింది. ఇందుకు మంత్రి గంటా సహకారం ఉందని తెలుస్తోంది. ఏపీఐఐసీ ద్వారానే భారీస్థాయిలో భూకేటాయింపులు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీఐఐసీలో తన మనిషి ఉండాలని మంత్రి గంటా వ్యూహాత్మకంగానే సత్యసాయి శ్రీనివాస్‌కు ఈడీగా నియమించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సత్యసాయి శ్రీనివాస్ డీఆర్డీయే నుంచి తన మాతృసంస్థ పంచాయతీరాజ్ శాఖకు వెనక్కి వెళ్లి... అక్కడి నుంచి ఏపీఐఐసీకి డెప్యుటేషన్ వేయించుకోవాలి. ఇంకేముందీ!...ఉత్తర్వులు వచ్చేశాయి కదా...ఏపీఐఐసీకి వెళ్లిపోదామని సత్యసాయి శ్రీనివాస్ భావించారు. కానీ కీలకమైన పీఠంపై గంటా అనుకూల అధికారి ఉండటం మంచిది కాదని అయ్యన్న పాత్రుడు భావించారు. తన శాఖకు చెందిన సత్యసాయి శ్రీనివాస్ తనకు తెలియకుండా గంటా ద్వారా పోస్టింగు తెప్పించుకోవడం ఆయన్ని అసహనానికి ఆగ్రహానికి గురి చేసింది. దాంతో అయ్యన్న పంచాయతీరాజ్ శాఖ నుంచి శ్రీనివాస్‌ను రిలీవ్ చేయొద్దని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. బదిలీ ఉత్తర్వులు వచ్చి వారం రోజులు దాటినప్పటికీ సత్యసాయి శ్రీనివాస్‌ను ఇంతవరకు పంచాయతీరాజ్ శాఖ రిలీవ్ చేయలేదు. అటు ఏపీఐఐసీ ఈడీగా వెళ్లలేక... ఇటు మంత్రి అయ్యన్న ఆగ్రహానికి గురై పంచాయతీరాజ్ శాఖలో కొనసాగలేక సత్యసాయి శ్రీనివాస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఆధిపత్య పోరు మంత్రులు గంటా, అయ్యన్నల ఆధిపత్య పోరు వల్ల జిల్లాలో మరికొన్ని కీలక పోస్టులు కూడా భర్తీ కావడం లేదు. జిల్లా రెవెన్యూ అధికారి( డీఆర్వో)గా తమ అనుకూల అధికారి కోసం ఇద్దరు మంత్రులు సిగపట్లు పడుతున్నారు. గతంలో విశాఖలో ఆర్డీవోగా పనిచేసిన వెంకటేశ్వరరావును డీఆర్వోగా నియమించేలా అయ్యన్న చక్రం తిప్పారు. ఇద్దరు మంత్రుల మధ్య వివాదంతో ఆ పోస్టింగును ప్రభుత్వం రద్దు చేసింది. కొన్ని రోజుల క్రితం మంత్రి గంటా చాపకిందనీరులా అనుకూల అధికారి చంద్రశేఖర్‌రెడ్డిని డీఆర్వోగా నియమించేలా చేయగలిగారు. ఈమేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీనిపై భగ్గుమన్న అయ్యన్న సీఎం వద్దే పంచాయితీ పెట్టారు. డీఆర్వోగా చంద్రశేఖరరెడ్డి నియమాకాన్ని కూడా ప్రభుత్వం అబయన్స్‌లో పెట్టింది. నగర పౌరసరఫరాల అధికారి పోస్టు కూడా ఇద్దరు మంత్రుల ఆధిపత్య పోరులో చిక్కుకుంది. తమ అనుకూల అధికారిని ఆ పోస్టులో నియమించుకునేందుకు ఇద్దరు మంత్రులు పంతానికి పోతున్నారు. దాంతో ఏడు నెలలుగా ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. -
నలిగిపోయిన గిరిజనం
మావోయిస్టులు..పోలీసుల ఆధిపత్యపోరులో గిరిజనం నలిగిపోతున్నారు. ఇరువర్గాలూ ఎవరికి వారే తమదే పైచేయి అని చెప్పుకుంటున్నప్పటికీ పీఎల్జీఏ వారోత్సవాలు జరిగినన్నాళ్లూ ఆదివాసీలు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వారు ఎదుర్కొన్న సమస్యలకు బాధ్యత వహించేదెవరని ప్రజా సంఘాలు, సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఎవరి కోసమైతే పోరాడుతున్నామంటున్నారో వారి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన పీఎల్జీఏ వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ప్రారంభం నుంచి చివరి రోజు వరకూ ఏజెన్సీ అంతటా ఉద్రిక్తతల నడుమ గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరం ఘటనలో సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ప్రతికారంతో రగిలిపోతున్నారని, ఆ సంఘటనకు కారకులైన గిరిజనులను హతమార్చేందుకు వారోత్సవాల్లో కచ్చితంగా ప్రయత్నిస్తారని పోలీసులకు సమాచారం రావడంతో గిరిజనులకు రక్షణ కల్పించారు. పీఎల్జీఏకు ఒక రోజు ముందే మావోయిస్టులు జీకే వీధి మండలం పెదవలస, దేవరాపల్లిలో గాలికొండ ఏరియా కమిటీ పేరుతో బ్యానర్లు కట్టారు, కరపత్రాలు వెదజల్లారు. వారోత్సవాలను అడ్డుకోవడానికి పోలీసులు బలగాలను కూడా భారీగానే మోహరించి విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. దీంతో సాయుధ బలగాలు అడవిని జల్లెడపాట్టాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనుమానం ఉన్న చోట ప్రతి ఇంటినీ సోదాచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సెల్‌టవర్లు, రైల్వే ట్రాక్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడో రోజున జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ఏజెన్సీలో పర్యటించారు. ఆ మర్నాడే (నాలుగోరోజు) జీకే వీధి మండలం నక్కబంద వద్ద పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పోలీసులు రాకముందే ఇది జరగడంతో పెనుప్రమాదం తప్పింది. ఐదోరోజు మరిన్ని బలగాలను మన్యంలోకి దించారు. కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. నాకా బందీ కట్టుదిట్టం చేశారు. వారోత్సవాలు విజయవంతం అయ్యాయని సీపీఐ మావోయిస్టు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి విజయలక్ష్మి ప్రకటించారు. కానీ ఎక్కడ, ఎప్పుడు వారోత్సవాలు నిర్వహించిందీ వెల్లడించలేదు. ఆరోరోజు పెదబయలు మండలంలో మావోయిసులు కరపత్రాలు వెదజల్లారు. సోమవారంతో ఉత్సవాలు ముగిశాయి. ఇంతకు మించి వారోత్సవాల్లో అటు మావోయిస్టులు , ఇటు పోలీసులు సాధించేందేమీ లేదు. కుంకుంపూడిలో భారీ స్ధూపాన్ని ఆవిష్కరించాలనే మావోల ప్రయత్నం కూడా ఫలించలేదు. అదే విధంగా భారీ బలగాలను దించినా, పక్కా సమాచారం ఉన్నా పోలీసులు ఒక్క దళ సభ్యుడిని కూడా పట్టుకోలేకపోయారు. కానీ గిరిజనులు నానా అవస్థలు పడ్డారు. వారోత్సవాల కారణంగా ఆర్టీసీ రాత్రిపూట సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. పగటిపూట కూడా మారుమూల ప్రాంతాలకు బస్సులు నడపలేదు. మరికొన్ని సర్వీసులను దారి మళ్లించింది. దీంతో గిరిజనులు సంతలు, రోజువారీ పనుల కోసం కాలినడకన కిలోమీటర్ల కొలదీ నడిచి వెళ్లాల్సి వచ్చింది. పర్యాటకులు సైతం తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. దానివల్ల పర్యాటకంపై ఆధారపడిన గిరిజనులు నష్టపోయారు. మారు మూల ప్రాంతాల్లో పనులకు కూడా వెళ్లలేకపోయారు. వారపు సంతలు బోసిపోయాయి. -
ఆధిపత్యం కోసం ఆరాటం
నియోజకవర్గాల్లో పట్టు పెంచుకోవాలి తొలి సమావేశంలో అధికార పార్టీ ఎంపీల నిర్ణయం కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై చర్చ నివురుగప్పిన నిప్పులా విభేదాలు సాక్షి,విజయవాడ : రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తమ పట్టు పెంచుకోవాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. ఇందుకోసం సమష్టిగా వ్యూహాలు రచించడం, మంత్రులను, ఎమ్మెల్యేలను కలుపుకుని పనిచేయడం, కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలకు మధ్యవర్తిగా ఉంటూ నిధులు రాబట్టడం.. తద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం విజయవాడలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, దేవేందర్‌గౌడ్, చిత్తూరు ఎంపీ ఎం.శివప్రసాద్ సమావేశానికి గైర్హాజరయ్యూరు. ఇక ప్రతి నెలా సమావేశాలు.. ఇక నుంచి పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ప్రతి నెలా ఎంపీ లంతా సమావేశ మై పలు అంశాలను చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఖర్చు చేసే విషయంలోనూ కీలక పాత్ర పోషించాలని, జిల్లాల అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం నూతనంగా ఏర్పాటు చేసిన ఫోరమ్స్‌లో టీడీపీ ఎంపీలకు అవకాశాలు లభించినందున నియోజకవర్గ సమస్యలను ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకువె ళ్లి సాధ్యమైనంత ఎక్కువ నిధులు రాబట్టాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళితే ఆయన వెంట ఎంపీల బృందం వెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇక్కడ సమర్ధంగా అమలు చేసేటట్లు చూడాలని ఎంపీలు చర్చించుకున్నారు. బందరు పోర్టు కోసం ఎంపీల పట్టు ... బందరు పోర్టు పనులను సతర్వమే ప్రారంభించాలని ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, కేశినేని శ్రీనివాస్ (నాని) పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ పోర్టు అభివృద్ధి ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, బందరుపోర్టు, విజయవాడ అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, బైపాస్ రోడ్ల అవసరం గురించి సమావేశంలో చర్చించారు. వీటి నిర్మా ణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే రాజధాని అభివృద్ధి వేగవంతం అవుతుందని ఎంపీలు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన నిధుల్ని సాధ్యమైనంత త్వరగా రాబట్టాలని నిర్ణయించారు. రెండు గ్రూపులు.. టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌ల నాయకత్వంలో రెండు గ్రూపులుగా చీలిపోరుునట్లు తెలిసింది. సమష్టిగా పనిచేయాలని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, లోలోపల మాత్రం ఎవరి ఎజెండాలు వారు అమలు చేస్తున్నట్లు తెలిసింది. ఎవరికి వారు తమ పట్టుపెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఆధిపత్య పోరు చంద్రబాబు అదుపులో ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఇటువంటి సమావేశాల వల్ల పోరు తీవ్రతరమై అధినేతకు తలనొప్పిగా మారుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.