Decoration
-
ఇంపైన ఆర్ట్.. ఇకెబనావో
ప్రపంచంలోని అద్భుతమైన ప్రకృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఇకెబనా కళకు హైదరాబాద్‌లో విశేష ఆధరణ లభిస్తోంది. జపాన్‌కు చెందిన ఈ కళ ప్రస్తుతం నగరంలో ట్రెండ్‌గానూ మారుతోంది. పర్యాటక ప్రాంతాలు, స్టార్ హోటల్స్, ఉన్నత శ్రేణి కుటుంబాల గృహాలంకరణ, శుభకార్యాలు, ఈవెంట్స్ ఇలా పలు సందర్భాల్లో ప్రత్యేకమైన ఇకెబనా అలంకరణకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నగరంలోని కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఉపాధి కోణంలోనే కాకుండా అధిక సంఖ్యలో సంపన్న వర్గాల కుటుంబాలకు చెందిన మహిళలు తమ గృహాలంకరణ కోసం ఈ కళను నేర్చుకుంటున్నారు. ఇందుకోసం దేశ, విదేశాల నుంచి ప్రత్యేకమైన పూలను దిగుమతి చేసుకుంటారు. దీంతోపాటు మన పెరట్లో లభించే పూలు, మొక్కలతో సులభమైన పద్దతుల్లో అద్భుతమైన కళాకృతులను తయారు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో భాగ్యనగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుంచి, స్టార్ హోటల్స్ వంటి ప్రదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న కళ ఇకెబనా. అయితే అధిక శాతం మంది తమ ఇంటిని అలంకరించుకోవడంలోనూ ఈ కళకు పదుపు పెడుతున్నారు. దీంతో పాటు పలువురు తమ ఆర్థికి స్థితిగతులకు సాయపడుతుందని, ఈ ఆకృతులు మనస్సుకు ఎంతగానో ప్రశాంతత ఇస్తున్నాయని మరి కొందరు ఈ కళపై మక్కువ పెంచుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లభించే ప్రతి వస్తువుతోనూ ఈ ఆర్ట్‌లో అలంకరించొచ్చు. ప్రత్యేకించి ఈ వస్తువులే ఉండాలన్న నిబంధనలేమీ లేవు. వృథాను అరికట్టే కళ.. వివిధ ఆకృతుల కోసం చెట్లను కొట్టేయడం, పూలను వృథా చేయడం వంటివాటికి స్వస్తిపలకాలని, ఉన్న వాటితోనే కనువిందైన ఆకృతులను తయారు చేయవచ్చంటున్నారు పలువురు ఆర్టిస్టులు. జపాన్‌కు చెందిన ఇకెబనా ఆర్ట్‌కు సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్‌లో గత 35 ఏళ్లుగా ఈ కళకు మంచి ఆదరణ లభిస్తోంది. కరోనా సమయంలో కాస్త నెమ్మదించినా, ప్రస్తుతం కళాకారులకు డిమాండ్ పెరిగింది. జపాన్‌కు చెందిన ది ఒహరా స్కూల్ ఆఫ్ ఇకెబానా సరి్టఫికెట్ కోర్సులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. దేశంలో సబ్ గ్రాండ్ మాస్టర్లు నలుగురు ఉండగా అందులో ఓ ప్రముఖ మాస్టర్ మన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి రేఖారెడ్డి కావడం గమనార్హం.ఆకులు, పూలతో సులువుగా.. నగరంలో ఇకెబనా ఆర్ట్‌కు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది హాబీ కోసం నేర్చుకుంటున్నారు. కళ విలువ తెలుసుకుంటున్నారు. ఆకులు, పూలతో ఇంత సులువుగా తయారు చేసిన ఆకృతులతో మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతిని ఎలా ఆస్వాదించొచ్చనేది తెలుస్తుంది. మన సంప్రదాయం ప్రకారం ప్రకృతిలోని చెట్టు, పుట్టలను పూజిస్తాం. జపానీస్ కూడా అలాగే చేస్తారని పలువురు ఆరి్టస్టులు చెబుతున్నారు.ఇంటికోసం..ఇష్టంగా.. ‘ఇండియన్ రీసెర్చ్ అసిస్టెంట్ షిప్ దొరకాలన్నా చాలా కష్టమైన టాస్క్ ఉండేది. హారీ్టకల్చర్ డిపార్ట్మెంట్లో ఈ ఆర్ట్ ఒక భాగం. ఆ క్లాస్‌కి రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశాను. ఎన్ని గంటలు పనిచేస్తే దానికి అన్ని డబ్బులు వచ్చేవి. ప్రిపరేషన్ మెటీరియల్, క్లాస్‌లో సాయం వంటివి చేస్తుండేదాన్ని.. 2019లో హైదరాబాద్ వచ్చేశాక ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. నాకు సమయం చిక్కినపుడు ఇష్టమున్న ఆర్ట్‌ని ఇంట్లోనే ఎరేంజ్ చేస్తుంటాను. ఊరెళ్లినపుడు జొన్నలతో తయారు చేస్తాను. దేనితో అయినా ఈ ఆర్ట్ తయారు చేయొచ్చు. ఇంటిని అందంగా తయారు చేయడం, ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తుంటాను. నేను నేర్చుకున్న తొలినాళ్లలో పూలు కొనుగోలుచేసి కళాకృతిని తయారు చేసేదాన్ని.. అయితే ఇది అంత సులువు కాదు. ప్రస్తుతం ఫ్లవర్ షాపులు అందుబాటులోకి వచ్చాయి. అవసరానికి మనకు పూలు దొరుకుతున్నాయి. అలా కాకుండా మన దగ్గర ఉన్న వాటితోనే మంచిగా డిజైన్ చేయొచ్చన్నది అలవాటైంది. మా నాన్నకి గార్డెనింగ్ ఇష్టం. ఎక్కడైనా కొంత మెటీరియల్ తెచ్చేవారు. దాన్ని నేను వినియోగించేదాన్ని’ అని చెప్పుకొచ్చారు నగరానికి చెందిన ఆరి్టస్ట్ దివ్య. 50 శాతం ఫీజు రాయితీ.. ఇకెబనా ఆర్ట్‌ని ఇంజినీరింగ్ చదివే సమయంలోనే నేర్చుకున్నాను. ఎప్పటికైనా ఉపయోగపడుతుందన్నారు. కోర్సుపూర్తి చేసి, జపాన్ నుంచి సరి్టఫికెట్స్ తీసుకున్నాను. వారాంతాల్లో, లేదా కుదిరినప్పుడు ఇంట్లో కళాకృతులు తయారు చేయడం అలవాటుగా మారింది. ఎగ్జిబిషన్స్ జరిగినపుడు పాల్గొనడం, మా గురువుకు సహకరించడం చేశాను. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లిపోయాను. మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సులో రీసెర్చ్ అసిస్టెంట్ స్కాలర్ కోసం హార్టీకల్చర్ విభాగం అధికారులు నాకున్న సరి్టఫికెట్స్, ఎగ్జిబిషన్ ఫొటోలు చూసి ఇంప్రెస్ అయ్యారు. ఉద్యోగం ఇచ్చారు. నాకున్న ఇకెబనా ఆర్ట్ సరి్టఫికెట్‌తో కోర్సు ఫీజులో సుమారు 50 శాతం తగ్గించారు. ఇది పెద్ద ఊరట కల్పించింది. – దివ్య, హైదరాబాద్ఏటా ఐదురోజుల వర్క్ షాప్..ఇకెబనా ఆర్ట్‌ను ఇంట్లోనే నేర్చుకోవచ్చు. నా దగ్గర వైద్యులు, లాయర్లు, ప్రొఫెసర్లు, గృహిణులు, చాలా మంది నేర్చుకున్నారు. కళకు ఉన్న ప్రాముఖ్యత ఇటీవలె తెలుస్తోంది. చెట్లను కాపాడటం, అందుబాటులో ఉన్న వనరులతో గ్రీనరీని తయారు చేస్తాం. ప్రస్తుతం అందరూ నేర్చుకుంటారు. ఈ కళకు గుర్తింపు తెచ్చేందుకు ఏటా 5 రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తాను. ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వరకూ అందరూ వచ్చి నేర్చుకుంటారు. చివరల్లో మినీ ఎగ్జిబిషన్ మాదిరి ఏర్పాటు చేస్తాం. ఆకులు, పూలను గౌరవించడం నేర్చుకుంటారు. ఇదొక హాబీ, కమర్షియల్ కాదు. చెట్లను కట్ చేయకుండా ఎండిన కొమ్మలతోనూ కళను ప్రోత్సహించొచ్చు.– రేఖారెడ్డి, హైదరాబాద్ చాప్టర్స్ అధ్యక్షురాలు. -
‘నీల్’ కాన్సెప్ట్' ఒకే ఒక రంగుతో అద్భుతం ..!
అందమైన రంగులు ఇంటికి అందాన్నిస్తాయనుకుంటాం. కానీ ఒకే ఒక రంగుతో ఇంటిని అద్భుతంగా అలంకరించవచ్చని ‘నీల్’ కాన్సెప్ట్ రుజువు చేస్తోంది. స్వచ్ఛమైన తెలుపుకి లేత నీలంరంగు థీమ్‌తో డిజైన్ని చూస్తుంటే నీలి మేఘం నట్టింట్లోకి వచ్చినట్లుంది. ఆకాశంలో మబ్బుల్లో రూపాలను వెతుక్కుంటాం. ఇది నట్టింట్లో ఆవిష్కరించిన కళారూపం. ఇందులో ప్రతి ఒక్కటీ చేత్తో చేసినవే. అచ్చమైన హ్యాండ్ క్రాఫ్టెడ్ హోమ్ డెకరేషన్ అన్నమాట. బెడ్ స్ప్రెడ్, పిల్లో కవర్, రన్నర్, కార్పెట్, డోర్ మ్యాట్, ల్యాంప్ షేడ్, సోఫా కుషన్లు, కవర్లతోపాటు డిన్నర్ సెట్ కూడా గౌరంగ్ షా డిజైన్ చేసిన నీల్ థీమ్‌లో ఒదిగి పోయింది. ఇండియన్ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాషన్ డిజైనర్‌గా జాతీయ అవార్డు గ్రహీత గౌరంగ్ షా ఇంటీరియర్ డెకరేషన్లో చేసిన ప్రయోగం ఇది. తన ప్రయోగాన్ని ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇది ‘గౌరంగ్ హోమ్’ అంటూ సగర్వంగా ప్రదర్శించాడు షా. ఇంటి నుంచి మనం ఏం కోరుకుంటున్నామో అది మన ఇంటి డెకరేషన్లో ప్రతిబింబిస్తుంది. వారసత్వ కళల సమ్మేళనం! లేత నీలం రంగులో అలరిస్తున్న పూలు, ఆకుల్లో కొన్ని జామ్దానీ నేతకు ప్రతిరూపాలు. కొన్ని కసౌటీ, చికన్కారీలతో సూదిమొన చెక్కిన రూ΄ాలు. మరికొన్ని అచ్చు అద్దిన పూలు. తెల్లటి పింగాణీ మీద విరిసిన నీలాలు ఫ్యాషన్‌తో ΄ోటీ పడుతున్నట్లున్నాయి. జామ్దానీ, అజ్రక్, కలంకారీ, చికన్‌కారీ, హ్యాండ్ ప్రింట్లతో ఇంటిని అలంకరిస్తే భారతీయ వారసత్వ హస్తకళకు ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకేముంటుంది? కళాకారులకు ఇవ్వగలిగిన ప్రోత్సాహం మరేముంటుంది? ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, నాచురల్ రంగులతో పర్యావరణ హితమైన జీవనశైలికి మరో నిర్వచనం ఇంకెక్కడ దొరుకుతుంది. -
కాసులు కురిపిస్తున్న అలంకరణ ఆకు!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: శుభకార్యం ఏదైనా సరే అలంకరణలో ‘‘డెకరేషన్ ఆకు’’ ఉండి తీరాల్సిందే! బాపట్ల తీర ప్రాంతంలోని ఇసుక నేలల్లో సాగు చేసే ఈ ప్రత్యేకమైన ఆకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. మన రైతులు డెకరేషన్ ఆకు (లైన్ ఆకు)ను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణలోని గుడి మల్కాపూర్ పూల మార్కెట్‌కు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఆకర్షణీయంగా, వాడిపోకుండా ఉండే లైన్ ఆకును పూలమాలల్లో కలుపుతారు. ప్రధానంగా శుభకార్యాల సందర్భంగా ఫంక్షన్ డెకరేషన్లో విరివిగా వినియోగిస్తున్నారు. అందువల్లే దీన్ని ఫంక్షన్ ఆకు, డెకరేషన్ ఆకు అని కూడా వ్యవహరిస్తారు.ఇసుక నేలలు అనుకూలం కావడంతో బాపట్ల పరిసరాల్లోని దరివాద కొత్తపాలెం, వెదుళ్లపల్లి కొత్తపాలెం, పోతురాజు కొత్తపాలెం, నాగేంద్రపురం, సుబ్బారెడ్డిపాలెం, కుక్కలవారిపాలెం, మరుప్రోలువారిపాలెం, బసివిరెడ్డిపాలెం, తులసీనగర్ తదితర గ్రామాల్లో దాదాపు 400 ఎకరాల్లో రైతులు దీన్ని విరివిగా సాగు చేస్తున్నారు. నెల రోజులకు తొలి కోతడెకరేషన్ ఆకును ఒకసారి సాగుచేస్తే రెండు నుంచి నాలుగేళ్ల పాటు దిగుబడి వస్తుంది. తొలి ఏడాది రూ.లక్షకు పైగా పెట్టుబడి వ్యయం అవుతుంది. నాటిన నెల రోజులకు కోతకు వస్తుంది. నాలుగు నుంచి ఆరు అంగుళాలు పెరగ్గానే ఆకును కోస్తారు. ప్రతి 40 నుంచి 50 రోజులకు ఒకసారి కోసి మార్కెట్‌కు తరలిస్తారు. ఆకు పెరిగేందుకు ఎరువుల వాడకంతోపాటు పాచి తెగులు, కుళ్లు తెగుళ్ల నివారణకు ఐదు రోజులకు కొకసారి మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి ఖర్చు అధికంగానే ఉన్నప్పటికి ఆకుకు ధర ఉంటే మంచి లాభాలే ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు. లాభదాయకమే..రెండు నెలల క్రితం కిలో రూ.25 పలికిన డెకరేషన్ ఆకు ప్రస్తుతం రూ.20 ఉంది. 70 క్వింటాళ్లు దిగుబడి వస్తే ఎకరాకు రూ.1.40 లక్షలు రాబడి వస్తుంది. ఏడాదిలో 8 కోతలు ద్వారా రూ.10 లక్షలు ఆర్జిస్తే పెట్టుబడి వ్యయం రూ.3 – 4 లక్షలు పోనూ ఎకరాకు రూ.6 లక్షల వరకు రైతుకు ఆదాయం వస్తుంది. కిలో రూ.5 నుంచి రూ.10 లోపు అమ్మిన సందర్భాల్లో నష్టాలు వచ్చాయని రైతులు చెబుతున్నారు. అయితే మిగిలిన పంటలతో పోలిస్తే లైన్ ఆకు సాగు లాభదాయకమేనన్నది రైతుల అభిప్రాయం. సీజన్‌తో నిమిత్తం లేకుండా ఏడాది పొడవునా దిగుబడి వస్తుండడంతో రైతులు ప్రతి 40 రోజులకు కోత కోసి 70 కిలోల చొప్పున బస్తాల్లో నింపి హైదరాబాద్‌లోని గుడి మల్కాపూర్ మార్కెట్‌కు లారీల్లో తరలిస్తున్నారు. కొందరు విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, చెన్నై తదితర మార్కెట్లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా డిమాండ్ నేపథ్యంలో లైన్‌ఆకు రైతులకు లాభాలు ఆర్జించి పెడుతోంది.ధర ఉంటే మంచి రాబడి20 సెంట్లలో లైన్‌ఆకు సాగు చేశా. తొలుత రూ.40 వేలు పెట్టుబడి పెట్టా. ఒకసారి సాగు చేస్తే మూడు సంవత్సరాలు పంట ఉంటుంది. ప్రతి 40 రోజులకొకసారి ఆకు కోతకోసి గుడిమల్కాపూర్ మార్కెట్‌కు పంపుతున్నాం. ప్రస్తుతం కిలో ఆకు రూ.20 ఉంది. ఈ మాత్రం ధర ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది. – ఎం.నారాయణరెడ్డి, రైతు, దరివాద కొత్తపాలెంకొమ్మ తెచ్చి నాటాలి70 సెంట్లలో లైన్ ఆకు సాగుచేశా. కొమ్మ తెచ్చి నాటితే మూడు నాలుగేళ్లు ఉంటుంది. కోసిన ఆకును 70 కిలోల బస్తాల్లో నింపి గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌కు పంపుతున్నాం. – రామకృష్ణారెడ్డి, రైతు, దరివాద కొత్తపాలెంజాగ్రత్తగా పెంచుకోవాలిఎకరం పొలంలో డెకరేషన్ ఆకు సాగు చేశా. తొలుత రూ.లక్ష పెట్టుబడి పెట్టా. ఆకు కోసిన ప్రతిసారీ ఎరువులు వేయడంతోపాటు వారానికి ఒకసారి పురుగు మందులు పిచికారీ చేస్తున్నా. ఆకును జాగ్రత్తగా పెంచుకోవాలి. నెల క్రితం కిలో రూ.25 చొప్పున ధర ఉంది. రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. రేటు తగ్గితే మాత్రం పెట్టుబడులు కూడా రావు.– కుక్కల కోటిరెడ్డి, రైతు, కుక్కలవారిపాలెంఏడాది పొడవునా పంటడెకరేషన్ ఆకు నాటిన నెలకే కోతకు వస్తుంది. పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి 40 రోజులకొకసారి కోతకు వస్తుంది. ఏడాది పొడవునా పంట ఉంటుంది. ఒకసారి సాగుచేస్తే మూడు నాలుగేళ్లు ఉంటుంది. ప్రస్తుతం దరలు బాగున్నాయి. – ఏ.రవణమ్మ, రైతు, దరివాద కొత్తపాలెం -
పాతబస్తీలో అగ్ని ప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కామటిపురాలోని ఓ డెకరేషన్ షాపులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అయిదు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తోంది. భవనంలో ఉన్నవారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. చుట్టుపక్కలా ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకుంది. -
లగ్జూరియస్ ఆర్ట్.. ఇంటి అలంకరణలో హస్తకళల శోభే వేరు!
ఇంటి అలంకరణలో హస్తకళల శోభే వేరు! ఆ జాబితాలో ‘సుజానీ’నీ చేర్చొచ్చు. అత్యంత లగ్జూరియస్ ఆర్ట్‌గా భావించే ఈ కళ ఆల్‌టైమ్ హోమ్ డెకర్‌గా పేరొందింది. ముఖ్యంగా సోఫా కుషన్స్, బెడ్ స్ప్రెడ్స్ మీద సుజానీ అమితంగా ఆకట్టుకుంటుంది.మధ్య ఆసియాలోని శతాబ్దాల కిందటి ఎంబ్రాయిడరీ కళే ‘సుజానీ’. సుజానీ అంటే పార్శీలో ‘సూది’ అని అర్థం. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాల సంచార తెగలలో పుట్టిన కళ ఇది. అక్కడి సంప్రదాయ వస్త్రాలపైన ఈ కళను చూస్తాం.ఒక బెడ్ స్ప్రెడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ పూర్తి చేయడానికి కనీసం 40 గంటల సమయం పడుతుంది. కళాకారుల నైపుణ్యం, అంకితభావం ఈ డిజైన్లలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. గతకాలపు కథలతో.. గొప్పదైన వారసత్వంతో.. ముచ్చటగొలిపే ఈ ఎంబ్రాయిడరీ వస్త్రాలను సుజానీ రెట్రో కలెక్షన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు.ఇవి చదవండి: ప్లాస్టిక్ ట్యూబ్స్ డిస్పెన్సర్ హోల్డర్.. -
చిప్స్ ఉండగా పూల చింత ఏల!
‘పెళ్లి ఉరేగింపు కారును దేనితో అలంకరిస్తారు?’ అనే ప్రశ్నకు టక్కున వినిపించే జవాబు... పువ్వులు. పూల కొరతో, ఖర్చు అనుకున్నారో.. వైవిధ్యం కోసమో ఏమో తెలియదుగానీ ఈ పెళ్లి కారును ΄పోటాటో చిప్స్ ప్యాకెట్స్‌తో అలంకరించారు. సత్పాల్ యాదవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. చిప్స్‌తో ముస్తాబైన ఈ పెళ్లి కారు గురించి నెటిజనులు సరదాగా స్పందించారు. ‘΄పోటాటో చిప్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే పబ్లిసిటీ ఇది’ ‘చిప్స్ అంటే ఎంత ఇష్టముంటే మాత్రం ఇలానా!’ ‘చిప్స్‌కు బదులుగా ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో ముస్తాబు చేసి ఉంటే కారు వెంట జనాలు పరుగులు తీసేవారు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. -
అంబానీ ఇంట పెళ్లి సందడి.. కళ్లు చెదిరేలా డెకరేషన్ (ఫొటోలు)
-
ఈ నెస్ట్ ట్యూబ్స్‌తో వేసవిలో ఇల్లు పచ్చగా.. చల్లగా..
వేసవిలో ఇల్లు పచ్చగా.. చల్లగా.. ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటాం. అందుకు ఇంట్లో ప్లేస్‌ని బట్టి కొన్ని ఇండోర్ ప్లాంట్స్‌ను ప్లాన్ చేసుకుంటాం. అయితే ఆ ప్లాన్‌లో కుండీల కన్నా ఈ నెస్ట్ ట్యూబ్స్‌ని ప్లేస్ చేసుకోండి. పచ్చదనం.. చల్లదనంతోపాటు వాల్ డెకర్‌గా ఇంటికి కొత్త కళనూ తీసుకొస్తాయి. ఇంట్లో మొక్కలు ఉంటే దోమలు వస్తాయనుకునేవారు హెర్బల్ ప్లాంట్స్‌ని పెంచుకోవచ్చు ఈ నెస్ట్ ట్యూబ్స్‌లో. వాటిని ఇదిగో ఇలా వుడెన్ స్టాండ్స్‌లో సెట్ చేస్తే మీ ఇంటికి కూల్ లుక్ వచ్చేస్తుంది. నెస్ట్ ట్యూబ్స్ నెస్ట్ ట్యూబ్స్‌తో ఉన్న రెడీమేడ్ వుడెన్ వాల్ స్టాండ్స్.. హ్యాంగింగ్స్.. వెరైటీ డిజైన్స్‌తో ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ మార్కెట్స్‌లో లభ్యమవుతున్నాయి. ఆసక్తి ఉంటే ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు. గ్లాస్ ట్యూబ్స్, వుడెన్ స్టాండ్స్, గ్లూ లేదా స్టికర్స్.. ఉంటే చాలు. గ్లాస్ ట్యూబ్స్ లేకపోతే చిన్న చిన్న వాటర్ బాటిల్స్‌ను ఉపయోగించవచ్చు. అయితే, అన్నీ ఒకే సైజ్‌లో ఉండేలా చూసుకోవాలి. ఈ ఎండాకాలంలో ట్రై చేసి చూడండి.. మీ ఇంటి అందం రెట్టింపు అవడం గ్యారంటీ! ఇవి చదవండి: నీ సంబడం సంతకెళ్లి పోను -
Kumar Mangalam Birla: మూడేళ్లలో రూ. 10 వేల కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: కొత్త వెంచర్ అయిన డెకరేటివ్ పెయింట్స్ వ్యాపార విభాగం నుంచి వచ్చే మూడేళ్లలో రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. అప్పటికల్లా లాభాల్లోకి మళ్లగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిర్లా ఓపస్ బ్రాండ్ కింద డెకరేటివ్ పెయింట్ల వ్యాపారంతో పాటు మూడు పెయింట్ ప్లాంట్లను గురువారం ఆయన ప్రారంభించారు. పానిపట్ (హరియాణ), లూధియానా (పంజాబ్), చెయ్యార్ (తమిళనాడు)లో ఈ ప్లాంట్లు ఉన్నాయి. బిర్లా ఓపస్ పెయింట్లు మార్చి నుంచి పంజాబ్, హరియాణ, తమిళనాడులో లభ్యమవుతాయి. జూలై నుంచి 1 లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో ఇవి లభిస్తాయని బిర్లా చెప్పారు. ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 6,000 పట్టణాలకు కార్యకలాపాలు విస్తరించాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. గ్రూప్‌లో కీలకమైన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గతేడాది డెకరేటివ్ పెయింట్ల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. 2025 నాటికి రూ. 10,000 కోట్లతో దేశీయంగా ఆరు తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రూ. 5,000 కోట్లు వెచి్చంచినట్లు బిర్లా ఓపస్ బిజినెస్ హెడ్ హిమాంశు కపానియా తాజాగా చెప్పారు. దేశీయంగా డెకరేటివ్ పెయింట్స్ మార్కెట్ దాదాపు రూ. 80,000 కోట్ల స్థాయిలో ఉంది. ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, నెరోలాక్, అక్జో నోవెల్ (డ్యూలక్స్) ఈ విభాగంలో దిగ్గజాలుగా ఉన్నాయి. -
లీఫ్ ఆర్ట్: ఇంటికి సరికొత్త అలంకరణ తెచ్చే ఆర్ట్!
ఇంటీరియ్లో వుడెన్ వర్క్ గురించి తెలిసిందే. ఇప్పుడు ఆకులు కూడా కొత్త పాత్ర పోషిస్తున్నాయి. రాలిన ఆకులను కొన్ని రోజుల పాటు నానబెట్టి, వాటి పలచని పొరను కూడా ఉపయుక్తంగా మార్చి, ఇంటి అలంకరణకు ఉపయోగిస్తున్నారు డిజైనర్లు. లీఫ్ ఆర్ట్‌గా పేరొందిన ఈ కళ ఇంటికి కొత్త శోభనిస్తోంది. బర్డ్స్‌గా, ఫెదర్స్గా, బెడ్ ల్యాంప్స్‌గా, ఎంబ్రాయిడరీ వర్క్తోనూ ఆకులుకొత్త సింగారాన్ని నింపుకుంటున్నాయి. స్కెలిటన్ లీవ్స్ తయారీకి.. 1. ఒక గిన్నెలో పది ఆకులను తీసుకొని, అందులో కప్పు సోడా వాటర్ పోయాలి. ఆకులు మునిగేలా నీళ్లు పోసి, సన్నని మంట మీద నీళ్లను మరిగించాలి. ఆకులు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. 2. ఆకులను బయటకు తీసి, చల్లని నీళ్లలో వేయాలి. 3. ఒక్కో ఆకు తీసుకొని, తడి ఆరాక టూత్ బ్రష్‌తో మెల్లగా రబ్ చేస్తూ, పై పొట్టును తీసేయాలి. 4. పొట్టు తీసేసిన ఆకులన్నిటినీ బ్లీచ్ నీళ్లలో వేసి రెండు గంటలు ఉంచాలి. 5. తర్వాత నీళ్లు పోయేలా ప్రతి ఆకును టిష్యూ పేపర్‌తో అద్ది, పక్కనుంచాలి. దీని వల్ల ఆకు పైపొర పూర్తిగా పోయి, స్కెలిటన్ భాగం తయారవుతుంది. 6. ఈ ఆకులను ఎండబెట్టి, అలంకరణకు తగినట్టుగా తయారుచేసుకోవచ్చు. -
ఇలా చేస్తే మీ ఇల్లు విశాలంగా, కాంతివంతంగా కనిపిస్తుంది
చలికాలం పొద్దు తగ్గుతుంది. వాతావరణం డల్‌గా మారుతుంది. ఆ దిగులు ఇంటికీ చేరుతుంది. ఇంట్లో వాళ్ల ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. సో.. కాలాన్ని బట్టి దుస్తులే కాదు ఇంటి అలంకరణనూ మార్చాలి.. హుషారురేకెత్తించేలా.. ఇలా.. ►చీకటి మూలలను బ్రైట్ చేసేయాలి. అందుకు ఫ్లోర్ ల్యాంప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉల్లాసం.. ఉత్సాహం కోసం ఇండోర్ మొక్కల అలంకరణ తప్పనిసరి. ► అల్లికలతో ఉన్న బెడ్‌షీట్స్, దిండు కవర్లు శీతాకాలాన్ని బ్రైట్‌గా మార్చేస్తాయి. అలాగే వెచ్చదనం కావాలన్నా.. విలాసంగా కనిపించాలన్నా.. వెల్వెట్ క్లాత్స్, సాఫ్ట్ ఫర్ ఉండే పిల్లోస్ బాగా ఉపయోగపడతాయి. ► సహజమైన కాంతి కోసం.. ఖాళీగా ఉన్న గోడపైన పెద్ద నిలువుటద్దాన్ని వేలాడదీయాలి. ఫ్రేమ్‌కి ఆకట్టుకునే రంగును వేయడం ద్వారా అద్దాన్ని అందంగా మార్చేయవచ్చు. దీని వల్ల ఇల్లు విశాలంగా, కాంతిమతంగానూ కనిపిస్తుంది. ► వింటర్ ఫ్యాషన్లాగానే వింటర్ హోమ్ డెకరేటింగ్ని ఫాలో అవ్వాల్సిందే. కుర్చీలను స్లిప్ కవర్లతో కవర్ చేయడం ద్వారా డైనింగ్ రూమ్‌కి వెచ్చదనాన్ని తీసుకురావచ్చు. ► విండోస్‌కి మందపాటి కర్టెన్లు వేసి, షీర్ డ్రేపరీలతో భర్తీ చేయవచ్చు. దీని వల్ల ఉష్ణోగ్రతలు పడిపోయినా వెచ్చదనం ఉంటుంది. ► శీతాకాలపు సువాసనల్లో సుగంధ ద్రవ్యాల పాత్ర అమోఘం. ముఖ్యంగా దాల్చిన చెక్క సువాసన వింటర్‌ని ఉత్సాహంగా మారుస్తుంది. సుగంధ పరిమళాల డ్రై ఫ్లవర్ బాస్కెట్‌ని అమర్చుకోవచ్చు. సెంటెడ్ క్యాండిల్స్ కూడా ఉల్లాసంగా ఉంచుతాయి. -
దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి ఇలా..
దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇంటిని డెకరేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి. ►గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది. ► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్‌ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది. ► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్ విండో, డోర్లకు కర్టెన్స్లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది. ► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ పెట్టి వెలిగించాలి. ► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి. ► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది. ► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్‌ఫుల్ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్‌తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. ► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్లో దొరికే చెక్క, యాక్రాలిక్ ల్యాంప్స్ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్ డెకరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టండి. -
దసరోత్సాహం! ఈ పండుగవేళ ఇంటిని ఇలా అలంకరిస్తే..
ఇంటి లోపల అడుగుపెట్టగానే మన దృష్టి ముందుగా హాలు, వంటగదివైపే ఉంటుంది. ఈ మధ్యలో ఉండే స్పేస్‌లో అలంకరణ ప్రత్యేకంగా ఉండాలనుకుంటే అందమైన గంటలను వేలాడదీయవచ్చు. అలాగే, గుమ్మం ముందూ వివిధ మోడల్స్‌లో దొరికే గంటలు వేలాడదీయవచ్చు. వాటికి నచ్చిన రంగులతో పెయింట్ చేయవచ్చు. ఇంటి లోపల మెట్లు ఉంటే ఫెయిరీ లైట్లను, మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రమిదలనూ అమర్చుకోవచ్చు. బొమ్మల కొలువు ఏర్పాటుచేసుకోవచ్చు. కర్టెన్స్ .. పెయింటింగ్స్ గాడీగా కాకుండా సింపుల్‌గా ఉండాలనుకుంటే లివింగ్ రూమ్‌లో సంప్రదాయ ప్రింట్స్‌తో ఉన్న కర్టెన్లను ఎంచుకోవాలి. ప్లెయిన్‌గా ఉండే గోడలపై పౌరాణిక పాత్రలున్న పెయింటింగ్స్‌ను అలంకరించుకోవచ్చు. లివింగ్ రూమ్ ఫ్లోర్ డల్‌గా ఉంటే వెంటనే కళాత్మకమైన డిజైన్ ఉన్న కార్పెట్‌ను వేసి గది శోభను పెంచొచ్చు. మరింత లుక్ రావాలంటే సెంటర్ టేబుల్ని ఒక సైడ్‌గా ఉంచి.. ప్రమిదలను ఏర్పాటు చేసుకోవచ్చు. మండపం అలంకరణ దేవుడిని పెట్టుకునే మండపానికి డార్క్ బ్రౌన్ కలర్ వేస్తే బాగుంటుంది. అలాగే పసుపు, గులాబీ, నారింజ రంగుల్లో పూల దండలతో అలంకరించుకోవాలి. మండపం ముందు రంగోలీకి బదులు సంప్రదాయ కార్పెట్‌ను వాడొచ్చు. మధ్యలో రాగి లేదా ఇత్తిడి గిన్నెను నీళ్లతో నింపి పువ్వులతో అలంకరించాలి. పూజగది గుమ్ముం ముందు రెండు ఏనుగు బొమ్మలను ఉంచితే ఇంట్లో ఆలయం కొలువుదీరిన అనుభూతి కలుగుతుంది. క్రొషే కళ పండగ ప్రత్యేక అలంకరణలో మరో ఆకర్షణీయమైన హంగు క్రోషే డిజైన్. ప్లెయిన్ గోడలపై క్రోషే వాల్ హ్యాంగింగ్స్‌ను వేలాడదీస్తే అద్భుతంగా ఉంటుంది. క్రోషే హ్యాంగింగ్స్ వద్దనుకుంటే క్రోషే తోరణాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. (చదవండి: థాయిలాండ్‌లో కూడా నవరాత్రులు..రెస్టారెంట్, హోటళ్లలో ఓన్లీ వెజ్!) -
ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..!
ఇంటిని విలాసవంతంగా డిజైన్ చేయించాలా లేక కళాత్మకంగా తీర్చిదిద్దుకోవాలా అని తర్జనభర్జన పడుతుంటారు చాలామంది. ఏ అలంకరణ అయినా ఇంటిల్లిపాదిలో పాజిటివ్ ఎనర్జీ నింపేలా ఉండాలంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. ద్వారపు కళ: పండగలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు, పూలతో అలంకరించడం తెలిసిందే. ఇదంతా పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, పండగల రోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించేలా ప్రధాన ద్వారం ఉండాలంటే.. పూల కుండీ లేదా వాల్ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేయాలి. ప్రశాంతత ఇలా : లివింగ్ రూమ్‌లోకి ఎంటర్ అవుతూనే మదిని ప్రశాంతత పలకరించాలంటే.. ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి ప్రతిమ, తాజా పువ్వులు, క్యాండిల్స్‌తో గది కార్నర్‌ను అలంకరించుకోవాలి. ఒత్తిడి మాయమై మనసు ఉల్లాసంగా మారుతుంది. నేచురల్ ఎలిమెంట్స్ : పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశాలను ఇంటి అలంకరణలో భాగం చేయాలి. అందుకు ఇండోర్ ప్లాంట్స్, చిన్న వాటర్ ఫౌంటెన్, క్యాండిల్స్‌ను అలంకరించాలి. గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి కిటికీలను తెరిచి ఉంచడం, దీని వల్ల బయటి ఆకాశం కూడా కనిపించడం వంటివాటినీ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఇంక్లూడ్ చేయాలి. సింబాలిక్ ఆర్ట్ వర్క్: మనకు నచ్చే.. ఇంటికి నప్పే ఆర్ట్ వర్క్‌ని గోడపైన అలంకరించుకోవచ్చు. ఇందుకోసం తామరపువ్వు, నెమలి, మండలా ఆర్ట్‌ను ఎంచుకోవచ్చు. వీటిలో పాజిటివ్ ఎనర్జీని పెంచే వైబ్స్ ఎక్కువగా ఉంటాయి. (చదవండి: తోడొకరుండిన అదే భాగ్యము!) -
పెయింట్ల బిజినెస్‌కు గ్రాసిమ్ సై
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పెయింట్ల బిజినెస్‌పై దృష్టి పెట్టింది. ప్రధానంగా డెకొరేటివ్ విభాగంలో పట్టు సాధించాలని యోచిస్తోంది. అత్యధిక వృద్ధికి వీలున్న ఈ విభాగంలో దేశంలోనే నంబర్ టూ కంపెనీగా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణరంగ మెటీరియల్స్ సరఫరాకు కొత్తగా ప్రవేశించిన బీటూబీ ఈకామర్స్ బిజినెస్‌కు జతగా పెయింట్ల బిజినెస్‌ను పెంచుకోవాలని ప్రణాళికలు వేసింది. పరివర్తన దశ వృద్ధిలో భాగంగా రెండు కొత్త బిజినెస్‌లవైపు దృష్టి సారించినట్లు కంపెనీ వార్షిక సమావేశంలో చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. దిగ్గజాలతో పోటీ గతేడాది పెయింట్ల బిజినెస్‌పై పెట్టుబడి ప్రణాళికలను సవరిస్తూ గ్రాసిమ్ రెట్టింపునకు పెంచింది. వెరసి రూ. 10,000 కోట్లను పెయింట్ల బిజినెస్‌పై వెచ్చించేందుకు సిద్ధపడుతోంది. తద్వారా మార్కెట్లో ఇప్పటికే విస్తరించిన పెయింట్స్ తయారీ దిగ్గజాలు ఏషియన్, బెర్జర్, కన్సాయ్ నెరోలాక్, ఆక్జో నోబెల్ ఇండియా తదితరాలతో పోటీకి తెరతీయనుంది. ప్రణాళికలకు అనుగుణంగా ఆరు సైట్లలోనూ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నట్లు బిర్లా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) నాలుగో త్రైమాసికానికల్లా ప్లాంట్లు ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. పరిశోధన, అభివృద్ధి యూనిట్ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలియజేశారు. డెకొరేటివ్ పెయింట్ల విభాగంలో నంబర్ టూ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంతో ఉన్నట్లు వాటాదారులకు బిర్లా తెలియజేశారు. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 4,307 కోట్లు వెచి్చంచగా.. వీటిలో రూ. 1,979 కోట్లు పెయింట్ల బిజినెస్‌కు కేటాయించినట్లు వివరించారు. దేశీ పెయింట్ల బిజినెస్ ప్రస్తుత రూ. 62,000 కోట్ల స్థాయి నుంచి రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లకు చేరనున్నట్లు కొన్ని నివేదికలు అంచనా వేశాయి. ఇటీవల గ్రాసిమ్తోపాటు.. జేఎస్‌డబ్ల్యూ, పిడిలైట్ సైతం పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. వారాంతాన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,775 వద్ద ముగిసింది. -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్: రూ. 31.25 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని తెలుగు లోగిళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తూర్పగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ముసలమ్మ తల్లి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయ నిర్వాహకులు సుమారు ₹13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో జగన్మాతను ప్రత్యేకంగా అలంకరించారు. రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై, వంద,రెండొందలు,అయిదొందలు సహా చెలామణిలో ఉన్న నోట్లతో అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు. అలాగే బ్యాంకుల నుంచి కూడా కొత్త నాణేలు తీసుకొని అలంకరించడం మరో ప్రత్యేకత. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాము ప్రతి ఏడాది కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. సుమారు 30 రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేశారు. ఇక గతంలోనూ సంక్రాంతి,విజయదశమి, దీపావళి తదితర వేడుకల్లో అమ్మవారిని వినూత్న రీతిలో అలంకరిస్తూ ఈ ఆలయ కమిటీ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ఇలా ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరించడం అందర్నీ ఆకట్టుకుంది. -
ఈ శ్రావణ మాసం ఇల్లుని ఇలా తీర్చిదిద్దుకుందామా!
సంప్రదాయ వేడుకలకు వేదిక శ్రావణం. కళ కళలాడే వెలుగులను మోసుకువచ్చే మాసం. తీరైన శోభను తీర్చడానికి శ్రమతోపాటు డబ్బునూ ఖర్చు పెడతారు. ఎక్కువ కష్టపడకుండా పర్యావరణ స్నేహితంగా శ్రావణ మాస వ్రతాలకు, పూజలకు ఎకోఫ్రెండ్లీ థీమ్‌తో ఇంటిని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చో హైదరాబాద్ వాసి డెకార్ నిపుణులు కల్పనా రాజేష్ ఇస్తున్న సూచనలు ఇవి.. ఆకులు అల్లుకున్న గోడ ఎక్కడైతే వ్రతం పీట పెడతారో ఆ చోట గోడకు తమలపాకులు, విస్తరాకులు, మర్రి ఆకులను ఒకదానికి ఒకటి కుట్టి, సెట్ చేయవచ్చు. మధ్య మధ్యలో బంతిపూలు లేదా గులాబీలు అమర్చవచ్చు. లేదంటే, ఇరువైపులా దండ కట్టి వేలాడదీయవచ్చు. ఏది సహజంగా ఉంటుందో దానిని ఎంపిక చేసుకోవాలి. బ్యాక్‌డ్రాప్‌లో వెదురు బుట్టలను ఉపయోగించవచ్చు. ఈ బుట్టలకు పూల అలంకారం చేస్తే కళగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలావరకు బ్యాక్ డ్రాప్లో వాడే కర్టెన్స్ ప్రింటెడ్‌వి వచ్చినవి వాడుతుంటారు. వాటిని ఎంపిక చేసుకుంటే మనం అనుకున్న థీమ్ రాదు. ఇక వీటిలో పాలియస్టర్వి వాడకపోవడం మంచిది. ఎకో థీమ్‌లో ఎంత పర్యావరణ హితంగా ఆలోచనను అమలు చేస్తే అంత కళ ఉట్టిపడుతుంది. రంగు రంగుల హ్యాండ్లూమ్ శారీస్‌ను కూడా బ్యాక్ డ్రాప్‌కి వాడచ్చు. వట్టివేళ్లతో తయారుచేసే తెరలు కూడా వాడచ్చు. అందమైన తోరణం... మామిడి ఆకులు చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఎలాగూ మామిడి ఆకులు తోరణం కడతారు. అలాగే, ఇప్పుడు వరికంకులతో తోరణాన్ని కట్టచ్చు. వీటిని వేడుక పూర్తయ్యాక మరుసటి రోజు బయట గుమ్మానికి అలంకారంగా వాడచ్చు. ఆ తర్వాత మట్టిలో వేస్తే ఎరువుగా మారిపోతుంది. అమ్మవారికి కట్టే చీర కూడా నారాయణ్‌పేట, ఇక్కత్ వంటి హ్యాండ్లూమ్ పట్టు చీర ఎంపిక చేసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ ఫ్రేమ్ చేసుకోవాలంటే మూడు వెదురు కర్రలు తీసుకొని, క్లాత్, అరటి ఆకులతో సెట్ చేయవచ్చు. ఇత్తడి బిందెలు .. గంటలు ఇంట్లో బిందెలు ఉంటాయి కదా... వాటిలో మట్టిని నింపి, అరటి చెట్లను సెట్ చేసుకోవచ్చు. స్టీల్ బిందె అయితే నచ్చిన క్లాత్ చుట్టి, మట్టి నింపితే చాలు. కుందులు జత అడుగు పొడవు ఉన్నవి ఎంచుకొని, రెండు వైపులా అమర్చుకోవచ్చు. ఒక వెడల్పాటి పాత్రలో బియ్యం నింపి, మధ్యలో కొబ్బరిపువ్వు సెట్ చేసి పెడితే ఎంతో అందంగా వచ్చేస్తుంది. అమ్మవారికి మల్లెపూల దండ, కలువపువ్వు మంచి కాంబినేషన్. లేదంటే గులాబీలు పెట్టుకోవచ్చు. గుమ్మం దగ్గర రెండువైపులా పాత కాలం నాటి ఇత్తడి పాత్రలు ఉంటే వాటిలో మొక్కలు పెట్టవచ్చు. ఇత్తడి గంటలు ఉంటే వాటిని డెకార్ ప్లేస్‌లో అలంకారంగా వేలాడదీయవచ్చు. అరటిగెల పెట్టచ్చు. ప్లాస్టిక్‌కు నో ఛాన్స్ ప్లాస్టిక్ పువ్వులతో వచ్చే అనర్థాలు ఎన్నో. వీటి బదులుగా బంతి, చామంతి, గులాబీ, కొబ్బరి ఆకుతో చేసిన దండలను, కాటన్ దారాలు ఉపయోగించవచ్చు. రంగవల్లికల కోసం రసాయన రంగులు వాడకుండా పువ్వులతో ముగ్గులు వేయచ్చు. ఆర్గానిక్ కలర్స్ వాడుకోవచ్చు. కింద కూర్చోవడానికి కోరాగ్రాస్ చాపలు, కలంకారీ, షోలాపూర్ బెడ్‌షీట్స్ వాడచ్చు. బొమ్మలతో భలే.. తెలుగు రాష్ట్రాల్లో మనవైన బొమ్మలు ఉన్నాయి. కొండపల్లి, నిర్మల్, చేర్యాల మాస్క్స్... ఆ బొమ్మలు పెట్టి కూడా అలంకారం చేసుకోవచ్చు. బ్రాస్ ఖరీదు ఎక్కువ అనుకుంటే టెర్రకోట ప్లాంటర్స్, గుర్రపు బొమ్మలు, మట్టి ప్రమిదలు, రంగురంగు గాజులు... వాడవచ్చు. అతిథులకు ఎకో కానుక మార్కెట్లో వెదురు బుట్టలు దొరుకుతున్నాయి. పండ్లు, పూలు వంటివి ఈ బుట్టల్లో సెట్ చేయవచ్చు. అతిథులకు అందజేయడానికి ఇవి బాగుంటాయి. రసాయనాలు కలపని ఆర్గానిక్ పసుపు, కుంకుమ ఎంచుకోవాలి. చేనేత బ్లౌజ్ పీస్ పెడితే గిఫ్ట్ ప్యాక్ రెడీ అవుతుంది. మన దగ్గర ఉన్న పర్యావరణ వస్తువులను సరిచూసుకొని, వాటితో ఎలా అలంకరణను పెంచుకోవచ్చనేది ముందుగా ఆలోచించి, ఆ విధంగా సిద్ధంగా చేసుకుంటే సంతృప్తికరమైన డిజైన్ వస్తుంది. పువ్వులు ఎక్కువ సేపు తాజాగా ఉండటానికి కెమికల్ స్ప్రే చేస్తుంటారు. థర్మోకోల్ మీద ఆకులు పెట్టి చాలా మంది ఎకో ఫ్రెండ్లీ అంటుంటారు. కానీ, మనం ఎంచుకునే థీమ్ మొత్తం తిరిగి మట్టిలో కలిసిపోయే విధంగా ఉంటేనే అది పర్యావరణ హితం అవుతుంది. – కల్పనా రాజేశ్, డెకార్‌బై కృష్ణ నిర్వాహకురాలు -
ఏపీలో అమెరికా పూల సోయగాలు
సాక్షి, అమరావతి: లిసియాంతస్.. ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పువ్వులు గులాబీలను పోలి ఉండే కట్ ఫ్లవర్స్. విభిన్న రంగుల్లో ఉండే ఇవి మైదాన, కొండ ప్రాంతాల్లోనే కాదు ఇంటి ఆవరణలో పూలకుండీల్లోనూ పెంచుకునేందుకు అనువైనవి. బొకేలు, అలంకరణకు ఉపయోగించే ఈ పూలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఏపీలోనూ సాగు చేసేవిధంగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. దేశంలోని బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో లిసియాంతస్ పూల ను సాగు చేస్తున్నారు. వీటి సాగుకు ఆంధ్రప్రదేశ్‌లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలోని పాలీహౌస్లో 6 రకాల లిసియాంతస్పై పరిశోధనలు జరిపారు. పింక్, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నీలం, పికోటీ, చాంపేన్ రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. శీతాకాలంలో మైదాన ప్రాంతాల్లోను, కొండ ప్రా ంతాల్లో వేసవి కాలంలోనూ వీటిని సాగు చేయవచ్చని గుర్తించారు. ఇండోర్ డెకరేషన్‌కు ఉప యోగించే ఈ పూలు కనీసం ఐదారు రోజుల పాటు తాజాదనం కోల్పోకుండా ఉంటున్నాయి. అలంకరణ కోసం ఉపయోగించే ఈ పూలకు యూరోప్, చైనా, ఇంగ్లాండ్, వియత్నాం, మలేíÙ యా, జపాన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రూ.40 లక్షల ఆదాయం వీటి పంట కాలం నాలుగు నెలలు. నర్సరీల్లో 70 నుంచి 75 రోజులు ఉంచాలి. నాటిన 60 రోజులకు పుష్పిస్తాయి. ఒక మొక్క మూడు కొమ్ములతో ఉంటుంది. కాండానికి 9 నుంచి 12 పువ్వులు వస్తాయి. సీజన్ బట్టి ఒక్కొక్క పువ్వు రూ.20 నుంచి రూ.35 వరకు పలుకుతుంది. రూ.24 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల నికర ఆదాయం పొందొచ్చు. మన ప్రాంతానికి రోసిట 3 బ్లూ పికోటీ వెరైటీ–2, ఎక్స్ కాలిబూర్ 3 బ్లూ పికోటీ, రోసిట 4 ప్యూర్ వైట్, రోసిట 3 పింక్ పికోటీ, రోసిట 4 గ్రీన్ రకాలు అనుకూలమని తేల్చారు. -
కంటికి కనబడని ఆభరణం
ఒకనాడు యవ్వనంలో ఎంతో మిసమిసలాడుతున్న వ్యక్తి... వృద్ధాప్యం వచ్చేసరికి ఒళ్ళంతా ముడతలు పడిపోయి, దవడలు జారిపోయి, జుట్టు తెల్లబడిపోయి ఉండవచ్చు. కానీ భౌతికంగా ఎంత అందంగా ఉన్నారన్నది కాదు, కాలక్రమంలో అది నిలబడదు. భగవంతుడిచ్చిన విభూతులను వయసులో ఉన్నప్పుడే సక్రమంగా వాడుకుని ఆ అందాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆ చివరి సమయంలో మనిషికి అందం – ఆయన అనుభవం, గతంలో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన నడవడిక మాత్రమే. ‘‘హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, కర్ణస్య భూషణం శాస్త్రం, భూషణైః కిం ప్రయోజనం’’ చేతికి కంకణములు, కేయూరములు, అంగదములు, ఉంగరములు... ఇవన్నీ కూడా అలంకారాలే.. భగవంతుడిచ్చినప్పుడు వేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ ఒక్కటే...అని.. అవతలి ప్రాణి కష్టాన్ని తన కష్టంగా భావించి ఆదుకోవడం కోసం తన చేతితో తనదైన దానిని ఇవ్వగలిగిన వాడు ప్రాజ్ఞుడు. ఆ చేతికి దానమే అతి పెద్ద అలంకారం. మిగిలిన అలంకారాలు తొలగిపోయినా... పైకి కనబడకపోయినా అది శాశ్వతంగా నిలిచిపోయే, వెలిగిపోయే అలంకారం. దానం చేయడం అంటే ఏమీ మిగుల్చుకోకుండా అని కాదు. తనకున్న దానిలో తన శక్తికొద్దీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం... అలా ఎందుకు? అంటే అలా చేయకుండా ఉండలేకపోవడమే మానవత్వం. శరీరంలో ఎక్కువగా ఆభరణాలు అలంకరించుకునే అవయవం కంఠం. వాటిలో మంగళప్రదమైనవి, ఐశ్వర్య సంబంధమైనవి ఉంటాయి.. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ... మనిషిని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళేది... సత్య భాషణం. నిజాన్ని నిర్భయంగా, ప్రియంగా మాట్లాడడం. సత్యాన్ని మించిన ఆభరణం మరేదీ కంఠానికి అంత శోభనివ్వదు. ఇతర ఆభరణాలను తీసినట్లుగా ఈ ఆభరణాన్ని తీయడం అసాధ్యం. భగవంతుడు మనకు రెండు చెవులిచ్చాడు. మన అందాన్ని పెంచడానికి వీటిని కూడా అలంకరించుకుంటూ ఉంటాం. కానీ వాటికి నిజమైన ఆభరణం.. శాస్త్రాన్ని ఎప్పుడూ వింటూ ఉండడం, అంటే మన అభ్యున్నతికి దోహదపడే మంచి విషయాలను వినడం, అలా విన్న వాటితో సంస్కరింపబడి ఉన్నతిని పొందడం. నోటితో తిన్నది శరీర పుష్టికి కారణమవుతున్నది. చెవులద్వారా విన్నది... మనిషి సౌశీల్యానికి కారణం కావాలి. ఆయన ఊపిరి వదలడు, ఊపిరి తియ్యడు..అని నిర్ధారించుకున్న తరువాత చిట్టచివరన శరీరాన్ని పంచభూతాల్లో కలిపివేసేటప్పుడు ఇక ఆ శరీరం మీద ఏ ఒక్క ఆభరణాన్ని కూడా ఉంచరు.. అన్నీ తీసేస్తారు... అప్పుడు తీయలేనివి, పైకి కనపడనివి కొన్ని ఉంటాయి... తన జీవిత కాలంలో దానగుణంచేత, సత్యభాషణం చేత, తన ఉన్నతికి పనికొచ్చే విషయాలను శాస్త్రాల ద్వారా వినడం చేత సమకూర్చుకున్న ఆభరణాలు మాత్రం ఉండిపోతాయి. ఇవి నీ పేరు శాశ్వతంగా ఉండిపోవడానికి, కాలంతో సంబంధం లేకుండా నిన్ను పదిమంది ఎప్పుడూ స్మరిస్తూ ఉండడానికి, నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకోవడానికి, నిన్ను పరమాత్మకు చేరువ చేయడానికి ఎప్పుడూ నిన్ను అలంకరించి నీ అందాన్ని, వైభవాన్ని పెంచుతుంటాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వైట్‌హౌస్‌లో క్రిస్మస్ వేడుకలు..డెకరేషన్లో బిజీగా ఉన్న బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో క్రిస్మస్ చెట్టును చక్కగా అలంకరించారు. అందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తాము కిస్మస్ చెట్టుకు కొన్ని తుది మెరుగులు దిద్దుతున్నాం. అందరూ ఈ క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు. బైడెన్ ఈ వారం ప్రారంభంలోనే వైట్‌హౌస్ నుంచి క్రిస్మస్ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో పెరుగుతున్న విభజిత అమెరికాను, రాజకీయాలను కలుషితం చేస్తున్న వాటిని పరస్పరం వ్యతిరేకించే ప్రక్షాళనతో తాజాగా ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. డెమొక్రాటిక్ నాయకుడు బైడెన్ ఇటీవల ప్రతిపక్ష రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మరింత దూకుడు వైఖరిని అవలంభించారు. ఈ క్రిస్మస్ సీజన్లో కొన్ని క్షణాలు నిశబ్దంగా ఆలోచించి మన హృదయంలో ఒకరినోకరు స్వచ్ఛంగా చూసుకోవాలనేదే ఆశ. అంతేగాదు క్రిస్మస్ చెట్లను పూలతో, దీపాలతో చక్కగా అలంకరించి చేసుకునే ఈ పండుగ నాడు డెమొక్రాటిక్ లేదా రిపబ్లికన్లుగా కాదు తోటి అమెరికన్లు లేదా తోటి మానవులు అన్న భావంతో సహృదయంతో ఈ పండుగను ఆనందంగా చేసుకోవాలన్నారు. Just a few finishing touches! Hope you and your loved ones are having a great Christmas Eve. pic.twitter.com/zdCjjRrI9o — President Biden (@POTUS) December 25, 2022 (చదవండి: అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్) -
3 కోట్ల నోట్లు, 6 కిలోల స్వర్ణం, 3 కిలోల వెండితో ‘మహాలక్ష్మి’
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విశాఖ కురుపాం మార్కెట్ సమీపంలో కొలువైన కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం వాసవీమాత మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. అమ్మవారి మూలవిరాట్‌కు పాలు, పెరుగు, గంధం, తేనె వంటి 108 సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం మహాలక్ష్మి రూపంలో అలంకరించి, స్వర్ణవస్త్రసహిత సకలాభరణాలు, 108 స్వర్ణ పుష్పాలతో నివేదన గావించారు. ఆలయ గర్భగుడిలో 6 కిలోల స్వర్ణాభరణాలు, బంగారు బిస్కెట్లు, 3 కిలోల వెండి వస్తువులు, బిస్కెట్లతో పాటు రూ.3 కోట్లు విలువైన భారతీయ కరెన్సీతో ఇలా అలంకరించారు. చదవండి: శ్రీరస్తు.. శుభమస్తు.. ‘కళ్యాణమస్తు’ -
ఇళ్లు అందంగా ఉండాలంటే.. నాలుగు రాళ్లు ఉన్నా చాలు!
ఇంట్లోకి ప్రకృతిని ఆహ్వానించాలంటే సహజత్వం ఉట్టిపడే అలంకరణ ఉండాలి. అందుకు రాతి కళ గొప్ప వేదిక అవుతుంది. పెద్ద రాతి నమూనాను గోడగా అమర్చినా, చిన్న చిన్న రాళ్లను ఫ్రేములుగా కట్టినా.. ఆ కళ వెంటనే చూపరులను ఆకట్టుకుంటుంది. సొంతింటి కల కోసం సంపాదనను సూచిస్తూ ‘నాలుగు రాళ్లు సంపాదించండి ’ అని హితులు సలహాలు ఇస్తుంటారు. అద్దెల్లు అయినా, సొంతిల్లు అయినా అలంకారంలో రాళ్లను రతనాలుగా మార్చేలా నవతరం వినూత్న ఆలోచనలు చేస్తోంది. గోడంత రాయి: లగ్జరీకి ప్రతిరూపం.. చూపు తిప్పుకోనివ్వని అందం వాల్ స్టోన్ది. పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాల్లో అతి పెద్ద రాయిని గోడకు బదులుగా నిర్మించడంలో వారి అభిరుచి తెలిసిపోతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన వాల్ డిజైన్లలో కొన్నేళ్లుగా వాల్స్టోన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒకవేళ అంత పెద్ద స్టోన్‌ని అమర్చలేం అనుకున్నవారు కాంక్రీట్‌తో గోడ మొత్తం స్టోన్ లుక్‌తో మెరిపిస్తున్నారు. సహజత్వాన్ని ఇంటి అలంకరణలో భాగం చేయడానికి ఖరీదు అనేది పెద్ద పట్టింపుగా ఉండటం లేదు. గోరంత దీపం: గొడుగులా ఉండే టేబుల్ ల్యాంప్.. ఇంటికెంత అవసరమో మనకు తెలిసిందే. ఈ టేబుల్ ల్యాంప్ సహజత్వంతో వెలుగులు రువ్వాలంటే రాళ్లతో ఇలా సృష్టించుకోవచ్చు. ఆకర్షణ రాళ్లు: రాళ్లపై అక్షరాలు గార్డెన్‌లోనే కాదు లివింగ్ రూమ్‌లోనూ ఆకర్షణగా నిలుస్తాయి. రోజులో మనకు కావల్సిన సందేశాన్ని మనమే సృష్టించుకోవచ్చు. కుటుంబ సభ్యుల పేర్లనూ రాసి అలంకరించుకోవచ్చు. టేబుల్ టాప్: నదీ తీరాలను సందర్శించే వారు కొందరు తమకు నచ్చిన రాళ్లను జ్ఞాపకంగా వెంట తెచ్చుకుంటారు. సెంట్రల్ టేబుల్ టాప్‌ను గ్లాస్ అమరికతో డిజైన్ చేయించుకోవాలనుకునేవారు ఇలా జ్ఞాపకాల రాళ్లను కూడా పొందిగ్గా వాడుకోవచ్చు. ప్లేట్ మ్యాట్స్: ఇప్పటి వరకు క్లాత్, జ్యూట్, ఫైబర్ వంటి ప్లేట్ మ్యాట్స్‌ను డైనింగ్ టేబుల్‌పైన అలంకరించి ఉంటారు. ఇప్పుడు ఈ స్టోన్ మ్యాట్స్‌ను ప్రయత్నించండి. మీ సృజనాత్మకతకు అతిథుల ప్రశంసలు తప్పక అందుతాయి. ఫొటో ఫ్రేమ్స్, స్టోన్ పెయింటింగ్, వాల్ డెకార్ హ్యాంగింగ్స్, ఫ్లవర్ పాట్స్.. ఇలా చిన్న చిన్న రాళ్లతో అందమైన కళాకృతులను ఆకర్షణీయంగా ఎవరికి వారు రూపొందించు కోవచ్చు. ఇందుకు కావల్సినవి కొన్ని రాళ్లు, మరికొంత గమ్. ఇంకొన్ని రంగులు. ఆర్ట్ మీ చేతిలో ఉంటే చక్కటి రాళ్లు మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. -
కాగితపు జాతీయ పతాకాలనే వినియోగించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జాతీయ దినోత్సవాలు, క్రీడలు, సాంస్కృతిక దినోత్స వాలను పురస్కరించుకుని అలంకరణ కోసం వినియోగించే జాతీయ పతాకాలను కాగితం తో తయారు చేసిన వాటినే ఉపయోగించాలని ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002 (2021 సవరణ) స్పష్టం చేస్తోంది. జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడేలా కాగితపు పతాకాలను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, పోలీసు విబాగాధిపతులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్‌తో రూపొం దించిన జెండాలను తొలగించి డిస్పోజ్ చేసే క్రమం కాస్త కఠినంగా ఉందని, అందువల్లే కాగితపు జెండాలను వాడితే గౌరవ ప్రదంగా వాటిని డిస్పోజ్ చేయవచ్చని అందులో పేర్కొన్నారు. వి విధ సంస్థలు, యాజమాన్యాలు జెండా కార్యక్రమం ముగి సిన తర్వాత తొలగించేటప్పుడు జాతీయ పతాక గౌర వాన్ని భంగం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని, జా తీయ పతాక నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. -
5 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ
-
ఇదో రకం ట్రెండ్.. ఆవకాయ జాడీతో అదిరిపోయే అలంకరణలు
Trendy House Interior Design: ఇంటి అలంకరణలో ఫ్లవర్ వేజ్‌ల వాడకం తెలిసిందే. అందమైన ఫ్లవర్‌వేజ్‌ల ఎంపిక గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. అయితే, ఇటీవల ఇంటీరియర్ డెకార్‌లో భాగంగా పాతకాలం నాటి వస్తువుల ప్రాధాన్యత పెరిగింది. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది పచ్చడి జాడీ. బామ్మల కాలం నుంచి వివిధ రకరాల పచ్చడి జాడీల గురించి మనకు పరిచయమే. పది కేజీల పచ్చడి మొదలుకొని, పావు కేజీ పచ్చడి పట్టేంత జాడీలు ఉండేవి. ఆవకాయ, మాగాయ, ఉసిరి, చింత, గోంగూర.. ఇలా రకరకాల పచ్చళ్లకు రకరకాల పరిమాణాల్లో జాడీలు ఉండేవి. ఇప్పుడు వాటి వినియోగం తగ్గి, చాలా వరకు అటక చేరిపోయాయి. లేదంటే, ఊళ్లోనే వాటిని వదిలేసి వచ్చి ఉంటారు. కానీ, ఇప్పుడు ఇంటి అలంకరణలో ఇవే వైవిధ్యం అయ్యాయి. అందుకే ఎక్కడో మూలన చేరిన జాడీలు ముందు గదిలో దర్జాపోతున్నాయి. ఇత్తడి.. జాడీ పక్క పక్కనే చేరి కొత్తగా కబుర్లు చెప్పుకుంటున్నాయి పాతకాలం నాటి ఇత్తడి వస్తువులు, పచ్చడి జాడీలు. జాడీ పువ్వులను సింగారించుకొని బామ్మల కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంటే ఇత్తడి పాత్రలు ఇంపుగా వింటున్నాయి. ఇంటి డెకార్‌లో వింటేజ్ స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకమే అని నిరూపిస్తున్నాయి. చిన్నా పెద్ద.. జాడీ పరిమాణాలు, షేపుల్లో వివిధ రకాల జాడీలను ఎంచుకొని తాజా పువ్వులు లేదా డ్రై పువ్వులను అలంకరిస్తే సంప్రదాయ సొగసు, పండగ కళ నట్టింటికి నడిచివచ్చినట్టే. పచ్చని మొక్కకు జీవం ఎర్రని నోరూరించే పచ్చడికే కాదు పచ్చని మొక్కలకూ జీవం పోస్తుంది జాడీ. ఇండోర్ ప్లాంట్స్‌కు ఇలవేల్పుగా కొత్త రకం కుండీలో ఖుషీగా మారిపోతుంది. మొక్కలకు, పూలకు కుండీలుగా మారి కొత్త కళతో వెలిగిపోతున్నాయి. ఎప్పటికీ కళగా! తాజా పువ్వులు రోజూ అలంకరించలేం అనుకునేవారు ఇప్పటికే ఉన్న కృత్రిమ ఆకులు, పువ్వుల కొమ్మలను జాడీలో పొందిగ్గా అమర్చితే చాలు. సెంటర్ టేబుల్‌కి ఆకర్షణీయత పెంచుతుంది. సైడ్ వాల్ షెల్ఫ్‌లో కళగా మెరిసిపోతుంది. అటు సంప్రదాయం, ఇటు ఆధునికత కలిసి ఇంటికి కొత్త కళను తీసుకువస్తుంది. ఆధునికత వైపు పరుగులు తీసి అలసిపోతే ప్రాచీన సంపద అక్కున జేర్చుకుని మనసును సేద తీరుస్తుంది. అందుకు అసలు సిసలైన ఉదాహరణగా పచ్చడి జాడీలు నిలుస్తున్నాయని ‘హోమ్ హార్మనీ, మై హోమ్ వైబ్స్’ క్రియేషన్స్ అలంకరణను ఇలా కళ్లకు కట్టింది. చదవండి: బెదిరించినా సరే మహేశ్ అలా చేయరు : సుధీర్‌బాబు -
విద్యుత్ వెలుగులతో ముస్తాబయిన ఏపీ సీఎం జగన్ కార్యాలయం
-
ప్రతి రోజూ పండగే
సాక్షి, హైదరాబాద్/కంటోన్మెంట్/గచ్చిబౌలి: నగరం సంక్రాంతి సంబురాలకు ముస్తాబవుతోంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ కైట్, స్వీట్ ఫెస్టివల్‌కు ముస్తాబవ్వగా, శిల్పారామం పల్లెసీమకు వేదికగా నిలవనుంది. శిల్పారామం సోమవారం నుంచి 19 వరకు సంప్రదాయ కళారూపాలను ఆవిష్కరించేందుకు ముస్తాబైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్లో ఐదో అంతర్జాతీయ కైట్ అండ్ మూడో స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు పలు కళారూపాల ప్రదర్శన, సాయంత్రం 7 నుంచి రాత్రి 10 వరకు 25 రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల కళాప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. స్వీట్ ఫెస్టివల్.. పాల్గొనేవారు: 22 దేశాల మహిళా హోమ్ మేకర్స్‌తో పాటు 25 రాష్ట్రాలకు చెందిన 2500 మంది హోమ్ మేకర్స్. ఎన్ని రకాలు: 1,200 ఏఏ రకాలు: తెలంగాణ సంప్రదాయ వంటలు, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతో పాటు ఇతర దేశాలకు చెందిన మహిళలు తయారు చేసిన స్వీట్లు ప్రదర్శించనున్నారు. ఇవి ప్రత్యేకం: మధుమేహంతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్లు. కైట్ ఫెస్టివల్... వేదిక: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నిర్వహణ: పర్యాటక, సాంస్కృతిక శాఖ తేదీలు: ఈ నెల 13 నుంచి 15 వరకు కైట్ ఫెస్టివల్లో పాల్గొనేవారు: 30 దేశాల నుంచి 100 మందికిపైగా అంతర్జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్, సుమారు 80 దేశవాళీ కైట్ క్లబ్స్ సభ్యులు. పల్లెసీమలో కళాప్రదర్శనలు... వేదిక: శిల్పారామంలోని పల్లెసీమ తేదీలు: ఈ నెల 13 నుంచి 19 వరకు నేటి ప్రదర్శనలు: ఉదయం నుంచి గంగిరెద్దుల ఆట, హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవర, కొమ్మదాసర్లు, పిట్టల దొర, పులి వేశాలు ప్రదర్శిస్తారు. సాయంత్రం ఆంపీ థియేటర్లో కాలిఫోర్నియా నుంచి వచ్చిన కుమారి శరణ్య భరతనాట్యం, ముసునూరి ఇందిరా శిష్య బృందంచే కూచిపూడి నృత్యం, సంక్రాంతి పాటలు ఉంటాయి. 14న: శిల్పారామంలోని నగరాజ్ లాన్లో 11 సంవత్సరాల లోపు పిల్లలకు శిల్పారామంలో భోగి పండ్లు పోసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి గంగిరెద్దుల ఆటలతో పాటు జానపద కళాకారులు సందడి చేస్తారు. సాయంత్రం ఆంపీ థియేటర్లో స్వర్ణ మంగళంపల్లి బృందం భోగి పాటలు ఆలపిస్తారు. రమణి సిద్ధి బృందం గోదా కళ్యాణం నృత్య రూపకం చేస్తారు. 15న: అందరికీ సెలవు దినం కావడంతో సందర్శకులు ఎక్కువ సంఖ్యలో తరలిరానున్నారు. ఉదయం గంగిరెద్దుల ఆటలు, జానపద కళాకారుల కోలాహలంతో ఆకట్టుకోనున్నారు. సాయంత్రం ప్రియాంక, మేఘన కూచిపూడి నృత్యం, విశాఖ ప్రకాష్ శిష్య బృందం అండాల్ చరిత నృత్య రూపకం ప్రదర్శిస్తారు. 16న: గంగిరెద్దుల ఆటలతో పాటు విభూతి బృందం హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవర, కొమ్మదాసర్లు, పిట్టల దొర, పులివేశాలు ప్రదర్శిస్తారు. రేణుక ప్రభాకర్ గోదా కళ్యాణం, ముంబైకి చెందిన రమేష్ కోలి బృందం భరత నాట్యం ప్రదర్శిస్తారు. 17న: సాయంత్రం చెన్నైకు చెందిన లత రవి బృందం గోదాదేవి నృత్య రూపక ప్రదర్శన. 18న: సాయంత్రం బెంగళూర్‌కు చెందిన అనీల్ అయ్యర్ భరతనాట్యం. 19న: సాయంత్రం బెంగళూర్‌కు చెందిన క్షితిజా కాసరవల్లీ భరత నాట్యం, కుమారి హిమాన్సి కాట్రగడ్డ బృందం కూచిపూడి నృత్యం ప్రదర్శన. -
దివ్వెకువెలుగు
దీపాల పండగకు దివ్వె వెలుగులు విరజిమ్ముతుంది. మరి ఆ దివ్వెకే వెలుగులు అద్దితే.. ఆ వెలుగు మరింత కళగా, కాంతిని విరబూస్తుంది. దీనికి ఎంతో ఖర్చు అక్కర్లేదు. ఇంట్లో ఏదో సందర్భంలో కొని వాడకుండా పక్కన పెట్టేసిన పూసలు, లేసులు, కలర్స్‌తో ప్రమిదలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ►మట్టి ప్రమిదలు, చిన్న చిన్న కుండలు, మట్టి ప్లేటు, పెయింట్, పూసలు, చమ్కీలు, లేస్, గ్లూ... తీసుకోవాలి. ►ప్రమిదలకు, ప్లేట్‌కు లోపలి వైపు ఒక రంగు, బయటి వైపు ఒక రంగు వేయాలి. ఆరిన తర్వాత లేస్ లేదా పూసల దండను గ్లూ సాయంతో ప్రమిదలకు, కుండలకు చుట్టూ అతికించాలి. ►ప్లేటులో కుండలను వరసగా పెట్టి, వాటి ముందు అలంకరించిన దివ్వెను అతికించాలి. ప్రమిదలకు అద్దాలు, చమ్కీలను కూడా అతికించవచ్చు. ఇలా అందమైన రూపాల్లో దివ్వెను నచ్చిన డిజైన్లలో అలంకరించుకోవచ్చు. -
పండుగ కళ కనిపించాలి
పండుగ రోజున డ్రెస్‌కు తగ్గట్టు అలంకరణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అప్పుడే కళగా కనిపిస్తారు. కొందరు కేవలం ముఖం ఒక్కటే బాగుంటే చాలు అనుకుంటారు. అలా కాకుండా కాలి వేళ్ల నుంచి కేశాల వరకూ పండగరోజున ప్రత్యేక అలంకరణతో మెరిసిపోవచ్చు. ►డ్రెస్ ఎంపిక పండగ కళను రెట్టింపు చేసేదై ఉండాలి. చీరలైనా, డ్రెస్సులైనా.. కాంతిమంతమైన రంగులు, డిజైనర్ వర్క్, మిర్రర్‌వర్క్.. వంటివి సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. ►ఎదుటివారి చూపు వేసుకున్న డ్రెస్ తర్వాత మన కేశాలంకరణ మీద పడుతుంది. తలకు నూనె పెడితే ముఖం జిడ్డుగా కనిపిస్తుంది కాబట్టి శిరోజాలను శుభ్రపరిచి, ఆరబెట్టుకున్నాక సంప్రదాయ అల్లికలను ఎంచుకోవాలి. వీటిలో జడ లేదా ముడులలోనే ప్రత్యేక అలంకరణలు బాగుంటాయి. ►ముఖారవిందానికి కళ తెచ్చేవి కళ్లు, కనుబొమ్మలు, పెదాలు. ఎండ, ఉక్కపోతను దృష్టిలో పెట్టుకొని ఫౌండేషన్ ఎక్కువ వాడకుండా కళ్లు, కనుబొమ్మలు, పెదాలను తీర్చిదిద్దుకోవాలి. -
పేపర్ కప్స్ తోరణం
దీపాల పండుగకు రంగు రంగుల అలంకరణ వస్తువులను సిద్ధం చేసుకునే పనిలో ఉండే ఉంటారు. ముఖ్యంగా విద్యుత్ తోరణాల జిలుగులకు ఎంతో ఖర్చు పెడుతుంటారు. తమదైన సృజన జోడించి పేపర్ కప్స్‌తో అందమైన తోరణాలను ఎవరికి వారు సిద్ధం చేసుకోవచ్చు. ►పార్టీలలో నీళ్లు, టీ, కూల్‌డ్రింక్స్ కోసం ఒకసారి ఉపయోగించి పడేసే పేపర్ కప్స్‌ని ఎక్కువ మొత్తంలో కొనేసి, వాడకుండా ఉన్నవి పక్కన పెట్టేస్తుంటారు. వాటిని ఈ విద్యుత్ తోరణాలకు వాడచ్చు. వాడేసిన కప్పులనూ తిరిగి ఇలా అందమైన తోరణాలుగా తయారుచేసుకోవచ్చు. ►ఒక్కో కప్పుకు ఒక్కో పెయింట్ వేయాలి. కప్పు అడుగు భాగాన చిన్న రంధ్రం చేయాలి. విద్యుత్ దీప తోరణాలకు ఈ కప్పులను జత చేయాలి. (లైట్ ఉన్న చోట కప్పును ఫొటోలో చూపిన విధంగా ఇలా తిరిగేసి తొడగాలి) ►రంగేసిన టీ కప్పులకు పూసలు, చమ్కీలు, అద్దాలు ఉపయోగించి అందమైన తోరణాన్నీ తయారుచేసుకోవచ్చు. ఈ పేపర్ కప్స్ తోరణాలకు ఖర్చూ తక్కువే. వాడేసిన వాటిని తిరిగి ఉపయోగించడం వల్ల పర్యావరణానికి హాని తగ్గుతుంది. -
వినోదాల దసరా...
దసరా అంటేనే సరదాల పండగ. గంగిరెద్దుల మేళం, బొమ్మల కొలువు, దసరా వేషాలు... అంతా దసరా హడావుడే. ఊళ్లన్నీ కొత్త కొత్త ఆచారాలతో సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా చెప్పుకోవలసినవి దసరావేషాలు. వీటినే పగటివేషాలు లేదా పైటే వేషాలు అంటారు. వీటి ముఖ్య ఉద్దేశం ప్రజావినోదం. ఆయా ప్రాంతాల ప్రజల ఆశలు, ఆశయాలకు ప్రతిబింబంగా ఇవి మనదేశంలో బహుళ ప్రచారం పొందాయి. పగటì పూట మాత్రమే ప్రదర్శించే వేషాలు కావడం వల్ల వీటికి పగటివేషాలనే పేరు వచ్చింది. ప్రేక్షకులను నమ్మించడం ఈ వేషాల గొప్పదనం. అంతేకాక ప్రజల సమస్యలను నాటి పరిపాలకుల దృష్టికి తీసుకురావడం, వర్తమానాలను చేరవేయడం కోసం ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోకి వచ్చాయని ప్రతీతి. ఇందులో పౌరాణికమైనవి, కల్పిత వేషాలు, హాస్య పాత్రలు ఉంటాయి. మొట్టమొదట్లో ఈ కళ భిక్షుక వృత్తిగా ప్రారంభమై తరవాత సంక్లిష్ట రూపంగా మారింది. శాతవాహనుల కాలం నుంచే ఈ కళారూపం ఉందని హాలుని గాథాసప్తశతి ద్వారా తెలుస్తోంది. మారువేషాలు ధరించి గూఢచారులుగా వీరు సమాచారాన్ని అందించేవారని, కాకతీయుల యుగంలో యుగంధరుడు పిచ్చివానిగా నటించి ఢిల్లీ సుల్తానులను జయించాడని చరిత్ర చెబుతోంది. వీటికి ఆదరణ తగ్గడంతో చాలా కళలు భిక్షుక వృత్తిగా మారిపోయాయి.పగటివేషాలు వేసేవారు ముఖ్యంగా దసరా పండుగ సమయంలోనే వేషాలు వేయడం వలన ఇవి దసరా వేషాలుగా ప్రసిద్ధికెక్కాయి. వీరు సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తూంటారు. వీళ్లనే బహురూపులు అని కూడా అంటారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలరోజుల పాటు ప్రదర్శనలు ఇస్తారు. ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ధ వహిస్తారు. చివరిరోజున సంభావనలు తీసుకుని అందరూ పంచుకుంటారు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్ధనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఒకే వ్యక్తి స్త్రీ, పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం ఈ వేషం ప్రత్యేకత. ముఖ మధ్య భాగంలో తెర కట్టుకుని ఒక వైపు శివుడుగా మరోవైపు పార్వతిగా అలంకరించుకుంటారు. తెరమార్చుకోవడంలోనే వీరి నైపుణ్యం ఉంటుంది. ఇదేకాక దసరా పోలీసులు, పిట్టలు దొరలు కూడా ప్రత్యేకంగా వస్తారు. వారు తడబాటు లేకుండా నిరాఘాటంగా పదేసి నిముషాలు చెప్పే కబుర్లు నవ్వు తెప్పిస్తాయి. ఒకప్పుడు దాదాపుగా 64 రకాల వేషాలు వేస్తే, ఇప్పుడు 32 వేషాలు మాత్రమే వేస్తున్నారు. ఆదిబైరాగి, చాత్తాద వైష్ణవం, కొమ్ముదాసరి, హరిదాసు, ఫకీరు, సాహెబు, బుడబుక్కలవాడు, సోమయాజులు – సోమిదేవమ్మ, వీరబాహు, గొల్లబోయిడు, కోయవాడు, దేవరశెట్టి, ఎరుకలసోది, జంగం దేవర, గంగిరెద్దులు, పాములవాడు, పిట్టలదొర, చిట్టిపంతులు, కాశీ కావిళ్లు... వంటి ఎన్నో వేషాలు వేస్తున్నారు. వీటిలో కొన్నింటికి సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే, మరి కొన్నింటిలో... పద్యాలకు, అడుగులకు, వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. బుడబుక్కలవాడు, ఎరుకలసాని వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. – డా. వైజయంతి -
గ్రేటర్ గృహాలంకరణ
కొబ్బరి, కొన్ని కాయగూరలు తురమడానికి వంటింట్లో తురుము పీటను ఉపయోగిస్తాం. వీటిల్లో హ్యాండిల్ ఉన్నవి, గుండ్రటి, పొడవాటి, డబ్బా పరిమాణంలో ఉన్న గ్రేటర్స్ (తురుమేవి) మార్కెట్లో రకరకాల మోడల్స్‌లో లభిస్తుంటాయి. ముచ్చటపడో, అవసరానికో తెచ్చుకున్నా ఇవి పదును పోయి సరిగ్గా తురమకపోతే పాతసామాన్లలో పడేయాల్సిందే. అయితే అలా కాకుండా వీటిని గృహాలంకరణకు ఉపయోగించుకోవచ్చు! ఇంటికి వచ్చిన వారు.. రూపు మారిన ఈ గ్రేటర్స్ని అబ్బురంగా చూసి మిమ్మల్ని ‘గ్రేట్’ అనాల్సిందే. ►కరెంట్ పోయినప్పుడో.. క్యాండిలైట్ డిన్నర్‌కో గాలికి కొవ్వుత్తులు ఆరిపోతుంటే డబ్బా రూపంలో ఉండే గ్రేటర్‌ను లాంతరుబుడ్డీలా ఉపయోగించాలి. బాల్కనీలో విద్యుద్దీపాలను అందంగా అలంకరించడానికి ఇదో చక్కని మార్గం. ►చిన్న డబ్బాలా ఉండే చీజ్ గ్రేటర్లో రకరకాల పువ్వులను అమర్చి టేబుల్ మీద పెడితే అందమైన వేజ్ సిద్ధం. ►గ్రేటర్ డబ్బాను పెయింటింగ్‌తో అందంగా అలంకరించి.. దానికి చెవి రింగులు, హ్యాంగింగ్స్ సెట్ చేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ మీద అమర్చుకోవచ్చు. ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. ►ఉడెన్ స్పూన్లు వేయడానికి సరైన హోల్డర్ లేకపోతేనేం.. తురుము డబ్బాను ఉపయోగించుకోవచ్చు. ►బోసిపోయిన వాల్‌ను ముచ్చటైన ఫ్రేమ్‌తో అలంకరించాలంటే.. నలు చదరంగా ఉండే ప్లేట్ లాంటి గ్రేటర్పైన చిన్న పెయింట్ వేసి అమర్చాలి. -
రంగమండపం
ఆలయంలో అర్ధమండపం దాటాక కొన్ని ఆలయాలలో రంగమంటపం కనిపిస్తుంది. మధ్యలో గుండ్రటి వేదిక, చుట్టూ నాలుగు స్తంభాలు, దాని చుట్టూ పన్నెండు స్తంభాలతో ఇలా పదహారు స్తంభాలతో నిర్మితమయ్యే మండపాన్ని రంగమండపం అంటారు.రంగం అంటే వేదిక. దాన్ని మధ్యలో ఉంచి నిర్మించబడేదే రంగమండపం. అర్ధమంటపానికి ముందు ఈ రంగమండపాన్ని నిర్మించే సంప్రదాయం ఉత్తరాది ఆలయాలలో ఎక్కువగా, కర్ణాటకలో కొన్నిచోట్ల కనబడుతోంది. ఆలయ సంప్రదాయ క్రియలలో ఒకటైన నాట్యసేవ ఈ రంగమండపంలోనే జరుపబడుతుంది. ఏ ఆలయం గొప్పతనాన్నయినా ఆ దేవుడి భోగాన్ని బట్టే బేరీజు వేస్తారు. ఆలయంలో జరిగే దేవభోగం సక్రమంగా జరిపే ఏర్పాట్లు అనాదిగా ఆలయాల్లో జరుగుతున్నాయి. వాటికోసం రాజులు ఎన్నో మాన్యాలను ఆలయాలకు రాసిచ్చారు. కాలక్రమేణా దేవభోగం రెండు రకాలుగా మారింది. అంగభోగం, రంగభోగం. అంగభోగం అంటే స్వామివారి పూజాదికాలు, విశేషసేవలకు సంబంధించినదని అర్థం. రంగభోగం అంటే ఆయా కాలాల్లో ఒకవేదికపై ఒకరు లేక అనేకమంది కళాకారులు నృత్య, గీత, వాద్యాలతో సమర్పించే స్వామిని సేవించుకోవటం. ఆలయంలో భగవంతుని వైభవానికి తగినట్లు అన్ని భోగాలను కల్పించడం ఆగమ సంప్రదాయం. విశేష ఉపచారాలలో నృత్యం, గీతం, వాద్యం వంటి సేవలు కూడా ఉన్నాయి.కనుక వీటి కోసం ఏర్పాటుచేసినదే రంగమండపం. అంగభోగం రంగభోగం అనే పదాల్ని సంక్షిప్తం చేసి నేడు అంగరంగవైభోగంగా అని అంటున్నారు. ఈ రంగ భోగమంటపానికే నవరంగం అని మరో పేరుంది. తొమ్మిది రకాలైన అలంకారాలు గల స్తంభాలతో నిర్మిస్తారు కనుక అది నవరంగం. ఆలయం అంతటిలో ఎక్కువ అలంకరణ కలిగిన మండపం అంటే అది రంగమండపమే. పూరీజగన్నాథస్వామి, కోణార్క్ సూర్య దేవాలయం, జగ్మోహన మందిరం వంటి ఉత్తరాది ఆలయాలతో పాటు కర్ణాటకలోని బేలూరు, హళేబీడు,పట్టదకల్ వంటి ఆలయాలలో రంగమంటపాలున్నాయి. హంపిలోని విఠ్ఠల దేవాలయంలో సప్తస్వరాలు పలికించే స్తంభాలున్నాయి. తెలుగునాట చాలా మటుకు ఆలయం బయట ప్రత్యేకంగా నాట్యమండపాలను నిర్మించారు.నృత్యంతో భగవంతుని లీలా విశేషాలను భక్తులకు దృశ్యరూపంగా చూపుతూ, గానంతో భగవంతుని గుణవైభవాన్ని కీర్తించి, వాద్యంతో వీనులనిండుగా సుశబ్దాలతో మనస్సును లయింపజేసే ఆ రంగస్థలం నిరుపమాన భక్తికి కార్యస్థలం. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
ఇలా రెడీ అవ్వండి
వేడుకలకు హాజరయ్యే వాళ్లు ముఖకాంతి పట్లనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కానీ, చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే టాప్ టు బాటమ్ అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ∙డ్రెస్ ఎంపిక పండగ కళను రెట్టింపు చేసేదై ఉండాలి. చీరలైనా, డ్రెస్సులైనా.. కాంతిమంతమైన రంగులు, డిజైనర్ వర్క్, సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. ∙దుస్తుల తర్వాత ఎదుటివారు చూపు ముందు కేశాలంకరణ మీద పడుతుంది. శిరోజాలను శుభ్రపరిచి, ఆరబెట్టుకున్నాక సంప్రదాయ అల్లికలను ఎంచుకోవాలి. వీటిలో జడ లేదా ముడులలోనే ప్రత్యేక అలంకరణ అదీ సౌకర్యంగా ఉండేది ఎంపిక చేసుకోవాలి. ∙ముఖారవిందానికి కళ తెచ్చేవి కళ్లు, కనుబొమ్మలు, పెదాలు, ఎండ, ఉక్కపోతను దృష్టిలో పెట్టుకొని ఫౌండేషన్ ఎక్కువ వాడకుండా కళ్లు, కనుబొమ్మలు, పెదాలను తీర్చిదిద్దుకోవాలి. ∙ముఖంపైనే ప్రత్యేక శ్రద్ధ చూపించడం కాదు సౌందర్యపోషణలో గోళ్లది కూడా పధాన పాత్ర. చేతులు, కాలి గోళ్లను చక్కగా కత్తిరించి, చుట్టూ మురికి లేకుండా శుభ్రపరిచి, నెయిల్‌పాలిష్ వేయాలి. ఆభరణాలు, శాండిల్స్, హ్యాండ్ బ్యాగ్... ఇతరత్రా అలంకరణలకు ఆ తర్వాత ప్రాధాన్యమివ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు మీ సౌందర్యాన్ని మరింతగా ఇనుమడిస్తుంది. -
‘విరి’జల్లు..
సాక్షి, హైదరాబాద్: అందం.. ఆకర్షణ.. సుకుమారం.. ఈ అంశాల్లో మహిళలకు, పూలకు పోలికలు ఎన్నో.. ‘ఉమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్’థీమ్‌తో వచ్చే వారం నగరంలో జరగనున్న ప్రపంచ పారిశ్రామిక సదస్సు(జీఈఎస్)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో పాటు మహిళలే ఎక్కువ మంది హాజరుకానున్నారు. దీంతో వారి మనసు దోచేలా, ఆకట్టుకునేలా దేశ, విదేశీ రకాలకు చెందిన పూలజాతులతో, విరబూసిన నిండు పువ్వులతో జీహెచ్ఎంసీ ప్రత్యేక అలంకరణ చేస్తోంది. సదస్సుకు వేదికైన హైటెక్స్‌లోనూ, అటువైపు వెళ్లే వివిధ ప్రాంతాల్లో దారి పొడవునా, పార్కుల్లో ప్రత్యేక పూల మొక్కలను ఏర్పాటు చేస్తోంది. రంగురంగుల పూలు.. వాటిపై వివిధ వర్ణాల సీతాకోక చిలుకలు వాలుతుంటే చూసే వారు వహ్వా అనుకునేలా సీతాకోక చిలుకలను ఆకర్షించే మొక్కలకు ప్రాధాన్యమిస్తోంది. అందుకుగానూ విదేశీ జాతులైన గల్తీనియా, హెమీలియా తదితర పూల మొక్కలను తెప్పిస్తోంది. వీటితోపాటు ఈ సీజన్లో పూసే బంతి, చామంతి, నందివర్థనం తదితరమైన పెద్దసైజులో ఉండి పూర్తిగా విరబూసే ఎఫ్1 హైబ్రిడ్ రకాలను ప్రత్యేకంగా పుణె తదితర నగరాల నుంచి రప్పిస్తోంది. ఈ మొక్కలకు కొంత ఖర్చు ఎక్కువే అయినప్పటికీ.. వచ్చే అతిథుల్ని, ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో ఉంచుకుని నిండుపూలతో కూడిన 40 వేల మొక్కలు తెప్పిస్తోంది. వివిధ రంగులు కలగలసిన అర్జెంటీనాకు చెందిన పెట్యూనియా, అందంగా ఉండే సిల్వియా తదితర రకాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఈస్టిండియన్ స్క్రూ ట్రీగా పిలిచే ఐజోరా రకాలనూ అలంకరణలకు ఎంచుకున్నారు. ప్రత్యేక శిల్పాలు.. జాతీయ స్థాయి అవార్డు గ్రహీత, వరంగల్‌కు చెందిన ప్రముఖ శిల్పకారుడు చిలువేరు మనోహర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర జంతువైన జింక శిల్పాన్ని 22 అడుగుల భారీ ఎత్తుతో తీర్చిదిద్దుతున్నారు. ఇంకా మహిషం తదితర విగ్రహాలు రూపొందిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో, ప్రజలతో కళలకున్న సంబంధాల్ని వివరించే ‘ఒడిస్సీ’ప్రాజెక్టులో భాగంగా ఆయన వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జీఈఎస్ థీమ్‌లో ‘మహిళలు ప్రథమం..’ కావడంతో తొమ్మిది రూపాల్లోని మహిళా శక్తితో ‘నవదుర్గ’ను ప్రదర్శించనున్నారు. వీటన్నింటికీ వెరసి రూ.60 లక్షలు ఖర్చు చేస్తుండగా, ఈ నిధులన్నీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) కింద ఐటీసీ, డీఎల్ఎఫ్, ఆదిత్య, బీఈ తదితర సంస్థలు ఆర్థిక సహకారం అందించినట్లు వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందన తెలిపారు. పూల కుండీలు.. కూర్చునే బెంచీలు కూడా.. పూల కుండీల్లో ఉంచేందుకు మెక్సికోకు చెందిన ఆకుపచ్చ, ఎరుపు రంగు ఆకులు కలిగిన ప్రత్యేకమైన పోయిన్సెట్టియా రకాలు వినియోగిస్తున్నారు. స్త్రీమూర్తులతోపాటు ఏనుగులు, జింకలు తదితర రూపాల్లో కుండీలను రూపొందించారు. హైటెక్స్ ముందు, కొత్తగూడ తదితర ప్రాంతాల్లో వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. హెచ్ఐసీసీ గేట్ ముందు ప్రత్యేకంగా అల్యూమినియం నిర్మాణాలకు పచ్చదనం, పూల అలంకరణలు చేస్తున్నారు. రాత్రుల్లో కనిపించేందుకు స్పెషల్ లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కుల్లో పక్షులు, జంతువులు, పూలు, చెట్ల తీగల వంటి వివిధ థీమ్‌లతో కూడిన ప్రత్యేకమైన ఫైబర్ బెంచీలును సిద్ధం చేశారు. ఒక్కో బెంచీకి రూ.9,500 చొప్పున వంద బెంచీలు రెడీ చేశారు. బెంచీలతోపాటు చెట్లపైనా ప్రత్యేక బొమ్మలు వేయిస్తున్నారు. కళాకృతి ఆర్ట్‌గ్యాలరీ ఇందుకు సహకరిస్తోంది. -
నేడు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం
-
సెట్టింగ్..అదుర్స్
మండపాల కళ..భళా రాజధానికి దీటుగా డెకరేషన్ వృద్ధి ♦ ఈ సెట్టింగ్‌లకు ప్రాధాన్యం.. ♦ దేవాలయ ప్రాంగణంలా సెట్టింగ్ ♦ అందమైన ప్యాలెస్ క్రిష్టల్, శిల్పారాం ♦ కొబ్బరి ఆకులతో సంప్రదాయంగా ♦ మండపం మొత్తం హరితవనంలా ♦ ఎటు చూసినా అందమైన పూలు కనపడేలా.. సెట్టింగ్ రూటే..సప‘రేటు’.. పగటి పూట వేడుకలకు సెట్టింగ్‌కు కనీసం రూ.40వేలు ఇక భారీ డెకరేషన్‌కు రూ.6లక్షల వరకు రాత్రిపూట మండప సెట్టింగ్‌లకు రూ.4లక్షల నుంచి రూ.10లక్షలు ఆరుబయట(ఓపెన్) సెట్టింగ్‌ల కోసమైతే రూ.20లక్షలు వెచ్చించిన వారూ ఉన్నారు ఆకాశమంత పందిరే కాదు..నింగిలోని చుక్కలు కూడా దిగివచ్చాయా..అన్నట్లు మిరుమిట్లు గొలిపే లైట్ల కాంతి..పూల మొక్కలతో పరుచుకున్న పచ్చందాలు..ఎటు చూసినా..అబ్బురపరిచే నగిషీలు, షామియానాల తోరణాలు అల్లుకొని వివాహ మండపాలు ఆకట్టుకుంటున్నాయి. సినిమాల్లో మాత్రమే కనిపించే అద్భుత దృశ్యకావ్యాలు సెట్టింగ్‌లతో కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లో హుందాను చాటి..ఇప్పుడు మనచెంతా డెకరేషన్ విశ్వరూపం దాల్చుతోంది. కాలేజీలో ఫేర్వెల్డే అయినా..గృహ ప్రవేశం చేసినా..కొత్త ఉత్పత్తిని పరిచయం చేయాలన్నా..మరే ఫంక్షనైనా సెట్టింగ్ ఉండాల్సిందే అన్నంతగా వృద్ధి చెందుతూ..అదుర్స్ అనిపిస్తోంది. ఖమ్మం అర్బన్: ఒకప్పుడు పెళ్లి అంటే తాటాకు పందిళ్లు, రంగుకాగితాలు, మామిడాకు తోరణాలు కనిపించేవి. ఆధునిక కాల ప్రభావంతో సంపన్నుల నుంచి మధ్యతరగతి వరకు పెళ్లిళ్లు, శుభకార్యాలప్పుడు డెకరేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చి సరికొత్త సెట్టింగ్‌లతో వైభవంగా జరుపుకుంటున్నారు. వివాహం మాత్రమే కాదు..భారీ కార్యక్రమాల నుంచి చిన్న, చిన్న ఫంక్షన్లకు కూడా డెకరేషన్ ఉండాల్సిందే అంటున్నారు. కళాశాల ఈవెంట్లు, పాఠశాల వార్షికోత్సవాలు, గృహప్రవేశం, షోరూంల ప్రారంభం, రిటైర్డ్ ఫంక్షన్లు, పుట్టిన రోజు వేడుకలు, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్..ఇలా ఏదైనా సెట్టింగ్ కనపడాల్సిందే. ఒకప్పుడు సినిమాల్లో పాటల షూటింగ్ కోసం ఒక ప్రాంతాన్ని తలపించేలా సెట్టింగ్‌లు వేసి ఔరా అనిపించేవారు. వాటిని మనం తెరపై చూసి ఆనందించేవాళ్లం. ఇప్పుడు మనం ఎలాంటి సెట్టింగ్ కావాలంటే..అలాంటింది మన శుభకార్యాల్లో వేస్తున్నారు. హైదరాబాద్‌ను తలదన్నే రీతిలో ఖమ్మంలో పలువురు కళాకారులు ఈ రంగంలో ఆరితేరారు. అనేక మంది డెకరేటర్లు మండపాల తయారీలో దిట్టగా నిలిచారు. ఖమ్మం..డెకరేటర్ల గుమ్మం.. ఖమ్మంలో సెట్టింగ్‌లు వేయడం ద్వారా 500 మందికి పైగానే నిత్యం ఉపాధి పొందుతున్నారు. మండపాల తయారీ, సెట్టింగ్‌లు, పూల అలంకరణ తదితర పనుల్లో వందలాదిమంది కుటుంబాలకు ఉపాధిగా లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా ఒడిశా, తమిళనాడుకు చెందిన వారు కూడా ఇక్కడ పనులు చేస్తున్నారు. పని నైపుణ్యతను బట్టి నెలకు రూ.9 వేల నుంచి రూ.18 వేల వరకు చెల్లిస్తున్నట్లు ఒక డెకరేషన్ సంస్థ అధినేత తెలిపారు. ఖమ్మంలో చిన్న,పెద్ద స్థాయిల్లో డెకరేషన్ల వ్యాపారం చేసే వారు 100మందికి పైగానే ఉన్నారు. ఇందులో పెద్దపెద్ద మండపాల సెట్టింగ్‌లు వేసే వారు 65 మంది. వీరికి నిత్యం ఏదో ఒక శుభకార్యాలు ఉంటూనే ఉంటాయి. కల్యాణముహూర్తాలు ఉన్నప్పుడు వివాహ మండపాలు, సెట్టింగ్‌లతో బిజీబిజీ. తర్వాత మిగతా వేడుకలు కూడా చేస్తుంటారు. ఆధునిక ఫీచర్ మేకింగ్ తయారీ కూడా ఖమ్మంలో ప్రారంభమైంది. హైదరాబాద్, పుణె, ఢిల్లీ స్థాయిలో ఇక్కడా కంప్యూటర్ల ద్వారా మేకింగ్ పరిశ్రమ సాగుతోంది. కోయంబత్తూరు, బెంగళూరు, కడియం, బ్యాంకాంగ్ తదితర ప్రాంతాలనుంచి పూలను తెప్పించి డెకరేషన్ చేస్తున్నారు. -
పాతవాటికే కొత్త ధగధగలు
ఇంటిప్స్ ఇంట్లో డెకరేషన్ కోసం పెట్టుకునే ఇత్తడి ఆర్టికల్స్ కాని ఇత్తడి పాత్రలు కాని మురికి పట్టినా, రంగు మారినా అమోనియాలో ముంచిన క్లాత్‌తో కాని మెత్తటి బ్రష్‌తో కాని తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి. బంగారు నగలకు దుమ్ము పట్టి డల్‌గా ఉన్నట్లనిపిస్తే ఒక కప్పు వేడినీటిలో అర కప్పు అమోనియా కలిపి ఆ మిశ్రమంలో నగను పదినిమిషాలసేపు ఉంచాలి. అమోనియా మిశ్రమంలో నుంచి తీసిన తర్వాత మెత్తని వస్త్రంతో రుద్ది ఆరనివ్వాలి. ముత్యాలు, పగడాలు, రాళ్లు పొదిగిన నగలకు ఈ పద్ధతి పనికి రాదు. -
భక్తిశ్రద్ధలతో ఆల్ సోల్స్ డే
ఆల్ సోల్స్ డే (సమస్త ఆత్మల దినం) సందర్భంగా భవానీపురంలోని క్రైస్తవ శ్మశానవాటికలో బుధవారం పండుగ వాతావరణం నెలకొంది. సమాధులన్నీ పూలతో అలంకరించారు. కొవ్వొత్తులు, అగరబత్తీలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధుల వద్ద తమవారి స్మృతులను గుర్తుచేసుకుంటూ మౌనంగా శ్రద్ధాంజలి ఘటించారు. తమ బంధువులు, ఫాదర్ల సమాధుల వద్దకు వచ్చి ప్రార్థనలు చేసిన సిస్టర్స్ ఖాళీగా ఉన్న సమాధులపై కూడా పూలు పెట్టి, కొవ్వొత్తులు వెలిగించారు. కొంత మంది పాస్టర్లు, ఫాదర్స్‌ను పిలిపించుకుని సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. – భవానీపురం -
బ్యూటిఫుల్ ఎస్కేప్!
పైట.. కానీ, పైట కాదు కోటు.. కానీ, కోటు కాదు అలంకరణ.. కానీ, ఒట్టి అలంకరణ కాదు అదీ కాదు.. ఇదీ కాదు.. మరి ఏంటిది? కేప్ అమ్మా.. కేప్! భుజాల మీద నుంచి జాలువారే బ్యూటిఫుల్ ఎస్కేప్!! ►ప్లెయిన్ బ్లూ కలర్ శారీ మీదకు డిజైనర్ కేప్ ధరించిన నటి సమంత. ►లెహంగా ఛోలీ పైన అదే రంగు క్రేప్ ధరించడంతో సీతాకోకచిలుకను తలపిస్తున్న నటి లావణ్యత్రిపాఠి. ►వెస్ట్రన్ లాంగ్ స్కర్ట్ సింపుల్ స్టైల్ కేప్ ధరించడంతో మోడ్రన్‌గా ఆకట్టుకుంటున్నారు నటి సోనాక్షి సిన్హా! ►స్ట్రాప్‌లెస్ వెస్ట్రన్ డ్రెస్‌కి అద్భుతమైన కాంబినేషన్ డిజైనర్ కేప్ అని చాటుతున్న బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ -
వెలుగుజిలుగుల్లో పెద్దమ్మగుడి
జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం దసరా పండుగకు ముస్తాబయింది. విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనుతోంది. ప్రత్యేక సెట్టింగ్Sఅలంకరణల మధ్య అమ్మవారి దేవాలయం ధగధగలాడుతోంది. – బంజారాహిల్స్ -
ప్రాణంతీసిన డెకరేషన్ పూలు
ఆటోడ్రైవర్ల ఘర్షణలో డ్రైవర్ మృతి చిన్న సమస్యకు ప్రాణం కోల్పోయిన వైనం గీసుకొండ : ఆటోలో డెకరేషన్ ఫ్లవర్స్‌ను దొంగిలించిన విషయంలో ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య తగాదా ఘర్షణగా మారి వారిద్దరిలో ఒకరి మృతికి కారణమైన సంఘటన మండలం లోని మచ్చాపూర్ వద్ద ఆది వారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మచ్చాపూర్ సమీపంలోని మాన్ సింగ్(స్తూపం)తండాకు చెందిన ఆటోడ్రైవర్ ఆంగోతు హరికృష్ణ(35) సాయంత్రం 6 గంటల సమయంలో విద్యుత్ సబ్‌స్టేన్ వద్ద మచ్చాపూర్–పల్లార్గూడ రోడ్డు వద్ద ఆటోను నిలిపి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఇంతలో అతడి ఆటోలో అమర్చి ఉన్న డెకరేషన్ ప్లాస్టిక్ పువ్వులను ఎవరో ఎత్తుకెళ్లిన విషయాన్ని గమనించాడు. ఎవరో ఆటోడ్రైవర్ పువ్వులను తీసి ఉంటాడనే అనుమానంతో అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఆటోను ఆపాడు. తన ఆటోలోని పువ్వులు అతని ఆటోలు ఉండటాన్ని గమనించిన హరికృష్ణ అతడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఆ ఆటోడ్రైవర్ అతడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలో పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో మృతదేహాన్ని భద్రపర్చారు. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న గీసుకొండ ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. హరికృష్ణపై దాడి చేసి కొట్ట చంపిన ఆటో డ్రైవర్ పరారీలో ఉండగా, అతడు ఎవరనే విషయాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
త్రీడీ మెరుపులు..
చిలకలగూడ: బతుకమ్మ, దసరా వేడుకలను పురష్కరించుకుని ఏర్పాటు చేసిన త్రీడీ వెలుగుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెరిసిపోతోంది. రంగుల విద్యుద్దీపాల కాంతులు భవనంపై త్రీడీలో ప్రతిబింబిస్తూ బతుకమ్మ ఆటపాటలు, దుర్గామాత అలంకరణలు చూపరుల మనసును చూరగొంటున్నాయి. రైల్వేస్టేన్ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన టెర్మినల్‌పై ప్రతిబింబిస్తున్న త్రీడీ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. -
జయశంకర్ జిల్లా కార్యాలయాలకు హంగులు
గోడలకు రంగులు.. గదుల్లో ఏసీల ఏర్పాటు తాత్కాలిక భవనాలకు కొనసాగుతున్న మరమ్మతులు మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తి భూపాలపల్లి : కొత్తగా ఏర్పాటవుతున్న ఆచార్య జయశంక ర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల్లో మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. అక్టోబర్ 1లోపు జిల్లా కార్యాలయాలను అన్ని విధాలుగా సిద్ధం చేసి 11 నుంచి పాలన కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు స్థానిక రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులు పనులను ముమ్మరం చేశారు. మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తవుతాయని స్థానిక రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. కలెక్టరేట్లో చురుగ్గా పనులు.. భూపాలపల్లి పట్టణంలోని మంజూర్‌నగర్‌లో ఉన్న ఇందూ అతిథిగృహంలో కింది అంతస్తు మొత్తాన్ని కలెక్టరేట్‌కు కేటాయించారు. ఇందులో కలెక్టర్, జేసీ, డీఆర్ఓ, ఏఓ, కలెక్టర్ కార్యాలయ సెక్షన్లు, వీడియో, సమావేశపు గదులకు కేటాయించారు. అలాగే పై అంతస్తులో డీఎం సీఎస్, డీఎస్ఓ, డీపీఓ, ఎ¯ŒSఐసీ వీసీ, రికార్డ్సŠ, ఐఅండ్‌పీఆర్, డీఆర్డీఏ, సీపీ ఓ శాఖలకు కేటాయించారు. ఆయా శాఖలకు కేటాయిం చిన గదుల్లో పనులు త్వరితగతిన సాగుతున్నాయి. ఇందూ అతిథిగృహంలోని 32 గదులకు నంబర్లు రాయించారు. అలాగే భవనం చుట్టూ పూల మొక్కలను నాటేందుకు ప్రస్తుతం ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. కలెక్టర్, జేసీకి కేటాయించిన గదుల్లో ఏసీలను ఏర్పాటు చేశారు. భవనం కొత్తదే అయినప్పటికీ ఇప్పటివరకు వినియోగంలో లేదు. దీంతో మరో మారు గదుల్లో పెయింటింగ్ చేస్తున్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయ నున్న తహసీల్దార్ కార్యాలయం వెనక భాగంలోని దేవాదుల డేటాబేస్ సెంటర్ భవనంలో పనులు కొనసాగుతున్నాయి. ఈ భవనంలో గోడలకు పగుళ్లు రావడంతో రెండు రోజులుగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. కార్యాలయం చుట్టూ మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్డీఓ గదిలో ఏసీని ఏర్పాటు చేశారు. ఇందులో మరో మారు రంగులు వేయిస్తున్నారు. సిద్ధంగా ఐటీఐ భవనం.. భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ భవనంలో టూరిజం, జీఎం ఇండసీ్ట్రస్, ట్రెజరీ, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆర్అండ్బీ, వ్యవసాయశాఖ, మార్కెటింగ్, మైనింగ్, కోఆపరేటివ్ కార్యాలయాలకు కేటాయించారు. అయితే ఈ భవనంలో నిర్మాణ, మరమ్మతు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో అధికారులు భవనానికి తాళం వేసి ఉం చారు. ఇదిలా ఉండగా, ఎస్పీ కార్యాలయానికి కేటాయించిన సింగరేణి మైనింగ్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. పోలీసు ఉన్నతాధికారులు రెండు రోజుల్లో భవనాన్ని పరిశీలించి పనులు చేయించనున్నట్లు తెలిసింది. కొత్త భవనాలతో తప్పిన తంటా.. నూతనంగా ఏర్పాటవుతున్న ఆచార్య జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుకు కొత్త భవనాలు రెడీగా ఉండడంతో అధికారులకు తిప్పలు తప్పాయి. సింగరేణి ఇందూ అతిథి గృహం, ప్రభుత్వ ఐటీఐ, దేవాదుల డాటా బేస్ సెంటర్ భవనాలు నిర్మించి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వినియోగంలో లేవు. ఇంతకాలం అవి ఖాళీగానే ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా భవనాల్లో మరమ్మతు పనులు పెద్ద మొత్తంలో చేపట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. -
వరసిద్ధుని కొలువు పుష్ప శోభితం
–50కి పైగారకాలతో అలంకరణ –మూడు టన్నుల వరకు వినియోగం కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి కొలువు గురువారం విరుల సోయగంతో అలరారింది. కల్పవృక్ష వాహనసేవ సందర్భంగా ఆలయాన్ని పలు రకాల ఫలాలు, పుష్పాలతో అలంకరించారు. ఫల, పుష్పాలతో చేసిన వినాయకుని ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే అంత్రాలయం, అర్ధమండపం, మూషిక మండపం, అన్వేటి, సుపథ మండపాలను విదేవీ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆన్వేటి మండపంలో ఏర్పాటు చేసిన ఆపిల్ పండ్ల వినాయకుడు, పుష్పాలతో తయారు చేసిన వినాయకుడు, అలాగే బంగారు ధ్వజస్తంభానికి విదేశీ పుష్పాలంకరణలు భక్తుల ను కట్టి పడేశాయి. పుష్పపల్లకి సేవ సందర్భంగా ఆలయం, పల్లకి అలంకరణలకు 50కి పైగా రకాల విదేశీ పుష్పాలు, సుమారు మూడు టన్నుల వరకు వినియోగించనున్నట్టు çకల్పవృక్ష వాహనసేవ ఉభయ దారులు తెలిపారు. నేడు విమానోత్సవ సేవ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేకోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారికి విమానోత్సవ సేవ జరుగుతుంది. కార్యక్రమం ఐరాల కె.రామకృష్ణ పిళై ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. -
ధన.. ధన.. గణనాథ
రూ. 20 లక్షల కరెన్సీతో వినాయకుడికి అలంకరణ దాచేపల్లి: దాచేపల్లిలోని అడితి నారాయణ కాంప్లెక్స్‌లో వినాయకుడి విగ్రహాన్ని నోట్లతో ఆదివారం అలంకరణ చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ. 20 లక్షల నోట్లతో వినాయకుడిని అందంగా అలంకరణ చేశారు. స్థానికులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. -
‘ధన’నాథులకు పూజలు
వినాయకచవితి మండపాలను నిర్వాహకులు పోటీ పడి లక్షల రూపాయల నగదుతో అలంకరిస్తున్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని మండపాన్ని రూ.27 లక్షల నగదుతో అలంకరించారు. పెదనందిపాడు మండలం కట్రపాడులోని పట్టాభిరామ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని రూ.10 లక్షల నగదుతో అలంకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేకతోటి సుచరిత బుధవారం రాత్రి గణనాథుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. – పెదనందిపాడు/ మంగళగిరి -
జ్ఞాపకాల పట్టు
అమ్మమ్మ నవ్వు... నానమ్మ చిరునవ్వు... కలగలిసి కట్టుకుంటే ఏమవుతుంది?\ జ్ఞాపకాల కట్టు అవుతుంది. రెట్రో పట్టు అవుతుంది. అందుకే మనోళ్ల కోసం రెట్రో పట్టుల స్పెషల్. ఈ పెళ్లి సీజన్లో ప్రతి పెళ్లిమండపంలోనూ ఆనందాల నవ్వు. సంబరాల చిరునవ్వు. అలంకరణలోనూ, వేషధారణలోనూ ఇప్పుడు రెట్రోస్టైల్ ఆకర్షణీయంగా మారింది. ఇది పట్టుచీరల్లోనూ కనిపిస్తే మరింత బాగుంటుంది. అందుకే, నేటి తరం అమ్మాయిలకు నాటి తరం పట్టుచీరల మోడల్స్ ఎలా ఉంటాయో చూపించాలనుకున్నాను. అందులో భాగంగానే 50 ఏళ్ల కళ మళ్లీ వెలుగు చూసింది. ఇందుకోసం ఏడాది పాటు రీసెర్చ్ చేశాను. ఎన్నో రకాల పాత పట్టుచీరలను కొనుగోలు చేశాను. అయితే, పాత కాలం నాటి పట్టుచీరల మీద జరీ కాంతులు ఎక్కువ. అలాగే, రంగులు కూడా గాడీగా కనిపించేవి. నేటి తరానికి ఇష్టపడేలా, చూడగానే ఒక యూత్‌ఫుల్ లుక్ కనిపించేలా కలర్ వేరియేషన్స్, ప్యాటర్న్స్ వీటిలో మిక్స్ చేశాను. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ ►చీరలు ధరించినప్పుడు ప్రత్యేకమైన శిరోజాలంకరణ కూడా ప్రధానమైనదే. స్టైలిష్ లుక్‌కి ఏయే అంశాలు ప్రధానంగా ఉంటాయో గమనిస్తూ, ఆచరణలో పెట్టాలి. ►చీర మోడల్ ఎంత రెట్రో స్టైల్ ఉంటే లుక్ అంత స్టైలిష్‌గా మార్చేయవచ్చు. అందుకు కాంట్రాస్ట్ బ్లౌజ్, ఆభరణాల ఎంపికలో శ్రద్ధ అవసరం. ►చీరకు ఏమాత్రం సంబంధం లేని పూర్తి కాంట్రాస్ట్, డిఫరెంట్ నెక్‌లైన్స్ కూడా ప్రయత్నించవచ్చు. దీనివల్ల లుక్ చాలా స్టైయిల్‌గా కనిపిస్తుంది. ►గ్రాండ్‌గా కనిపించే ఈ తరహా చీరల మీదకు బ్లౌజులు వర్క్ చేయించినప్పుడు శారీకి సంబంధించిన ఒక ఎలిమెంట్ మాత్రమే జత చేయాలి. అలాగే నెక్లైన్ సింపుల్‌గా ఉండాలి. ► చీరలో ఉన్న కలర్ చీరలో కనిపించాలి. ►అలాగే బ్లౌజ్లో ఉండే కలర్ బ్లౌజ్లో కనిపించాలి. అంటే ఒకదానిని ఒకటి డామినేట్ చేస్తున్నట్టు ఉండకూడదు. అప్పుడే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. -
మిఠాయిలతో అమ్మవారికి అలంకరణ
ఘట్కేసర్: ఆషాడమాసంలో అమ్మవారికి జరుగు ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పోచారంలోని సర్వమంగళ స్పటికలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని శనివారం అన్ని రకాల మిఠాయిలతో అలంకరించి పూజలు చేశారు. అలకరణ కోసం పలురకాల మిఠాయిలు ఉపయోగించినట్లు తెలిపారు. ఆషాడమాసోత్సవాల్లో అమ్మవారిని వివిధ రకాల పదార్థాలతో అలంకరిస్తున్నట్లు దేవాలయ నిర్వహకకమిటి చైర్మన్ చెరకు సరితా భద్రీనారాయణగౌడ్ తెలిపారు.అధిక సంఖ్యలోభక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. -
యుద్ధ ప్రాతిపదికన కలెక్టరేట్ ముస్తాబు
-
కలెక్టరేట్‌కు సొగసులు
కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన(సోమవారం) నేపథ్యంలో కలెక్టరేట్లోని భవనాలకు మెరుగులు దిద్దుతున్నారు. పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని సీఎం కలెక్టరేట్లోనే నిర్వహిస్తుండడంతో ఆ మేరకు యుద్ధప్రాతిపదికన ముస్తాబు ప్రక్రియను చేపట్టారు. ఇందుకు సంబంధించిన పనులను ఆదివారం కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జేసీ హరికిరణ్ పరిశీలించారు. గతంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్సార్, కిరణ్‌కుమార్‌రెడ్డి కలñ క్టరేట్‌లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో కూడా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. తాజాగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన మరోసారి కృష్ణా పుష్కరాల నిర్వహణపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా గాంధీ విగ్రహం దగ్గరి నుంచి పరిసరాలు, కలెక్టర్ కార్యాలయాన్ని అందంగా అలంకరిస్తున్నారు. చెత్త, చెదారం ఎత్తివేయడం, రంగులు వేయడం, గుంతలు పూడ్చడం, రోడ్లకు మరమ్మతులు తదితర పనులు చేయించారు. కలెక్టర్ సమావేశ మందిరానికి పట్టిన దుమ్మును దులిపారు. కుర్చిలను పూర్తిగా మార్చివేశారు. సువాసనలు వెదజల్లేలా పర్ప్యూమ్ స్ప్రే చేయించారు. లోన లొటారం సీఎం వస్తున్న క్రమంలో కలెక్టరేట్‌ను ఇంతలా తీర్చిదిద్దుతున్న అధికారులు అదే కలెక్టరేట్లో వెనుకవైపు బూత్ బంగ్లాలను తలపిస్తున్న భవనాల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఇప్పటి వరకు ఎంత మంది సీఎంలు వచ్చినా ముందువైపు మాత్రమే అదీ పైపై మెరుగులు దిద్ది అయిందనిస్తున్నారు తప్ప వెనుకవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. చిత్రాలు గ్యాలరీలో.... -
బాజాభజంత్రీలకూ ఆన్లైనే!
♦ ఒకే వేదికగా పెళ్లి సర్వీసులందిస్తున్న అప్లీ ఎవర్ ♦ డెకరేషన్, క్యాటరింగ్, మేకప్ వంటి సేవలెన్నో.. ♦ పెళ్లి దుస్తులు, నగలు, పాదరక్షల కొనుగోలుకు వీలు ♦ ఇటీవలే రూ.2.75 కోట్ల నిధుల సమీకరణ ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో సంస్థ కో-ఫౌండర్ రాకేష్ గుప్తా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘పెళ్లి చేసి చూడు.. ఇళ్లు కట్టి చూడు’ అంటారు పెద్దలు. ఇందులో ఇంటి విషయం కాసేపు పక్కన పెడితే పెళ్లి మాత్రం నిజంగా పెద్ద తతంగమే. ఆహ్వాన పత్రికలు ముద్రించటం నుంచి బంధువుల జాబితా, డెకరేషన్, మేకప్, భోజనాలు, బ్యాండ్‌బాజా.. వంటివెన్నో సమకూర్చుకోవాలి. అందుకే పెళ్లంటే నెల రోజుల ముందు నుంచి పనులు మొదలుపెడితే గానీ పెళ్లి నాటికి పూర్తవ్వవు. అయితే మరి ఇంతగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా పెళ్లి కోసం నెలల తరబడి సమయం కేటాయించాలా? అన్ని సదుపాయాలనూ ఒకే వేదికపై పొందలేమా? ఇదే ప్రశ్న ఈ మిత్రత్రయానికి ఎదురైంది. అయితే అందరిలా వీళ్లూ అక్కడిలో ఆగిపోలేదు. సమాధానం వెతికే పనిలో వెడ్డింగ్ సర్వీసెస్ స్టార్టప్ ‘అప్లీఎవర్’ను ప్రారంభించేశారు. ఆ కంపెనీ ఏంటో.. దాని సేవలేంటో అప్లీ కో-ఫౌండర్ రాకేశ్ గుప్తా ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఆయన మాటల్లోనే... 12 విభాగాల్లో సేవలు.. ‘‘నేను, మదన్ ఎల్పీ, సుమిత్ హండా ముగ్గురం కలిసి గతేడాది అక్టోబర్‌లో రూ.20 లక్షలతో హైదరాబాద్ కేంద్రంగా అప్లీఎవర్ను ప్రారంభించాం. ప్రస్తుతం మేం ఫొటోగ్రఫీ, మేకప్, మెహందీ, డీజే, డెకరేషన్, కొరియోగ్రఫీ, క్యాటరింగ్ వంటి 12 రకాల విభాగాల్లో సేవలందిస్తున్నాం. ఆయా విభాగాల్లో సేవలందించేందుకు 800-1,000 మంది వెండర్లు మావద్ద రిజిస్టరయ్యారు. అవసరమున్న సేవలను ఇక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఒక్కో డీల్ మీద రూ.5-15 వేల వరకు మార్జిన్లుంటాయి. ప్రస్తుతం నెలకు 3 వేల వరకుడీల్స్ జరుగుతున్నాయి. ప్రతి నెలా 50-70 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తున్నాం. లుక్ బుక్‌లో కొనుగోలు.. లుక్ బుక్ అనే అప్షన్లో ఏ దుస్తులకు, ఏ బూట్లు, నగలు మ్యాచ్ అవుతాయో వివరించేందుకు ప్రత్యేక నిపుణులుంటారు. సంబంధిత ఉత్పత్తుల కింద ఒక లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే పార్ట్నర్ సైట్ల నుంచి కొనుగోలు చేసే వీలుంటుంది. వీటి కోసం అమెజాన్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి 20-30 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఒక్కో కొనుగోలు మీద 5-15 శాతం క మిషన్ ఉంటుంది. ప్రస్తుతం 3 వేలకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయిక్కడ. అప్లీ ఎవర్ యాప్ ద్వారా వివాహ వేడుకలకు బంధువులను ఆహ్వానించవచ్చు. పెళ్లి వేడుకల ఫొటోలను, వీడియోలను షేర్ చేసుకోవచ్చు కూడా. 2.75 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సీడ్ రౌండ్లో భాగంగా రూ.2.75 కోట్ల నిధులను సమీకరించాం. దేశ, విదేశాలకు చెందిన 8 మంది ఏంజిల్ ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. యూనీ వెరైటీ ఫౌండర్ వరుణ్ అగర్వాల్, ఎజిలిటీ సొల్యూషన్స్ సీటీఓ సురేష్ వెంకట్, పీపుల్ కంబైన్ ఎండీ రాజ్ వై ఇందులో కొందరు. మరో ఆరు నెలల్లో దేశంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటూ మధ్య ప్రాచ్య, ఉత్తర అమెరికా దేశాలకు మా సేవలను విస్తరిస్తాం. ఇందుకోసం మరో మిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయి. పలువురు వీసీ ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నాం. ఈ ఏడాది ముగింపులోగా సమీకరిస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
వధూవిరులు
అందం చందం సంప్రదాయ అలంకరణల సొంతం. అమ్మాయిల రూపాన్ని ఒద్దికగా, కనులకు పండగలా మార్చేసే సుగుణం సంప్రదాయ అలంకరణకే ఉంది. ఆ అలంకరణలో పూలజడ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరనిది. అమ్మాయి పూలజడతో ముస్తాబు అయ్యిందంటే వేడుకకు సిద్ధమైంది అని అనుకునేవారు. ఇప్పుడు ఏ వేడుకకైనా కళ రావాలంటే అమ్మాయి పూలజడతో సిద్ధమవ్వాలని ఇంటిల్లిపాదీ ముచ్చటపడుతున్నారు. దీనికి కారణం ఇప్పుడు పూలజడల్లోనూ ఆధునికత అందంగా చేరిపోవడమే! నిన్నమొన్నటి వరకు మోయలేని భారాన్ని పిల్లల నెత్తిన ఎందుకు పెట్టడం అనుకునేవారు సైతం ఇప్పుడు చిన్నారులను కుందనపు బొమ్మలా తీర్చిదిద్దాలని ఆరాటపడుతున్నారు. అందుకేనేమో ఇప్పుడు పువ్వులతో పాటు టిష్యూ లేసులు, కుందన్ బిళ్లలు, ముత్యాలు, రతనాలు కూడా జడ ఒంపుల్లో చేరిపోవడానికి వేగిరపడుతున్నాయి. పూలజడల్లో మల్లెమొగ్గలు, కాడమల్లె, కనకాంబరాలు, మరువం ఇలాంటి పువ్వులను మాత్రమే ఉపయోగిస్తారు. మోయడానికి బరువుగా ఉంటాయి కాని, చూడటానికి అందంగా ఉంటాయి. కృత్రిమమైనవి వద్దనుకున్నవారు అసలు పూల జడలను ఎంపిక చేసుకుంటారు. గులాబీల జడ... ఈకాలం అమ్మాయిలు 90 శాతం మంది ఇష్టపడే పూల జడ ఇది. పూల జడ వేసుకున్నామన్న బరువు కూడా తెలియదు. గులాబీ రేకులు తీసి, కుట్టి, మల్లెమొగ్గలు పెడతాం. పూలజడకు బేస్ ఉంటుంది. బిళ్లలుగా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్‌గా కావాలనుకున్నవారు దూరం దూరంగా అమర్చుకోవచ్చు. హెవీగా కావాలనుకున్నవారు దగ్గరగా వాడచ్చు. అర్ధచంద్రాకారంగా పైన ఉన్నదాన్ని వేణి అంటారు. దీన్ని కూడా పెటల్స్‌తో తయారుచేస్తారు. గోల్డ్ కలర్ టిష్యూ లేస్తో తయారుచేస్తారు. ముత్యాల జడ... పూలజడ చిన్న చిన్న వేడుకలకూ వేసుకోలేం. అలాగని జడను సింపుల్‌గా వదిలేయలేం. పెళ్లికి పూలజడ సంప్రదాయబద్ధంగా నిండుగా ఉండాలి, రిసెప్షన్‌కి సింపుల్‌గా ఉంటే చాలు. ఇందుకుముత్యాల జడ మంచి ఆప్షన్. పెళ్లికూతురు, పెళ్లికొడుకు దగ్గరి బంధువుల అమ్మాయిలు కూడా ఈ జడను వేసుకుంటే వేడుకకు మరింత కళ. మల్లెల జడ.. వివాహ వేడుకల్లో మల్లెపూల జడది ప్రత్యేక ఆకర్షణ. మల్లెల సువాసన మనసును ఆహ్లాదభరితం చేస్తుంది. వాటి తెలుపు ప్రశాంతతను చేకూర్చుతుంది. తలంబ్రాల చీరకు మల్లెపూల జడ అదనపు అందాన్నిస్తుంది. బంగారు జడ... బయట అంతా బంగారు రంగు టిష్యూ లేస్తో డిజైన్ చేసి, లోపల మల్లెమొగ్గలు, పైన అర్ధచంద్రాకారంగా రెండు వేణిలను అమర్చాలి. ఒక వేణికి మల్లెమొగ్గలు, మరో వేణికి మల్లెపూలు వాడితే మరింత అందంగా ఉంటుంది. ఈ జడ తలంబ్రాల సమయంలో ఎక్కువ ఇష్టపడతారు. మీరూ ట్రై చేయవచ్చు... కాస్త సృజనను జోడిస్తే ఆకట్టుకునే జడలను మీరూ అందంగా రూపొందించవచ్చు. అందుకోసమే ఈ చిట్కాలు...మామూలుగా చాలా మంది రెడీమేడ్‌గా లభించే సాదా బిళ్లలు తెచ్చి జడంతా పెట్టేసుకుంటారు. కాని పూలతో వచ్చిన నిండుతనం మరి వేటికీ రావు. అందుకే బిళ్లల చుట్టూతా పూలతో సింగారిస్తే మరింత అందంగా కనిపిస్తుంది జడ.ముందుగా సిద్ధం చేసిన పూల జడలను గాలి తగలని బాక్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే 2-3 రోజుల వరకు అవి తాజాగా ఉంటాయి. బయటకు తీసిన 5 గంటల నుంచి పువ్వులు నెమ్మదిగా తాజాదనం కోల్పోతాయి. నీళ్లు చల్లితే నల్లబడతాయి. అందుకని పొడిగానే ఉంచాలి. చీర రంగులను బట్టి పూలజడలు... పసుపు, నారింజ, ఎరుపు రంగులో చీర ఉంటే గులాబీ రేకులు, కనకాంబరాలు వాడాలి.తెలుపు రంగు చీర అయితే- మల్లెమొగ్గలు, కాడ మల్ల్లె, లిల్లీలు, చమేలి పూలు, మధ్య మధ్యలో ముత్యాలు, ఆర్టిఫీషియల్ గోల్డ్ ఫ్లవర్స్, మోటివ్స్... అదనంగా జత చేయాలి.ఆకుపచ్చ రంగు చీర అయితే సంపెంగ, మరువం వాడుతూ ఇతర పువ్వులను, మోటివ్స్ను, రకరకాల జడబిళ్లలను ఉపయోగించవచ్చు. వయోలెట్ కలర్ అయితే ఆర్కిడ్స్, డబుల్ షేడెడ్ పువ్వులు కావాలనుకుంటే కార్నిషన్ వాడాలి. పూల జడల ధరలు డిజైన్‌ను బట్టి ఉంటాయి. ఖరీదైన జడబిళ్లలు వాడాలంటే ఖర్చు దానికి తగిన విధంగానే ఉంటుంది. జడబిళ్లలు, ఇతర యాక్సెసరీస్ హైదరాబాద్ ఇతర ముఖ్య పట్టణాల మార్కెట్లలో కొనుగోలు చేయవచ్చు. - కల్పన రాజేష్, పూలజడల డిజైనర్, ఎల్.బి.నగర్, హైదరాబాద్ -
డెకరేషన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
-
1.3 కోట్ల నోట్లతో గణనాథుడికి అలంకరణ
మంగళగిరి(గుంటూరు): కోటి ముప్పై లక్షల నోట్లతో గణనాథుడికి అలంకరణ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఈ అలంకరణ చేశారు. రూ. 10 నుంచి రూ.1000, 500 నోట్ల వరకు అన్ని రకాల నోట్లు ఉపయోగించి గణేశుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో నోట్లతో అలంకరించిన స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
కట్ చేస్తే.. కళాఖండం
చిన్నప్పుడు కాగితాల పడవలతో వర్షాకాలం ఎంజాయ్ చేశాం. కాస్త పెద్దయ్యాక కాగితం విమానాలను గాలిలో గింగిరాలు కొట్టించాం. కాలేజీకొచ్చాక రాకెట్లు చేసి.. అమ్మాయిల జడకుచ్చుల్లోకి గురి చూసి కొట్టాం. పేపర్‌తో పూలు చేసి క్లాస్రూమ్ డెకరేషన్లో కటింగ్‌లు ఇచ్చాం. కాగితాలతో కెమెరాలు, విచిత్రాకృతులు ఎన్నో చేశాం. స్మార్ట్ యుగం వచ్చే సరికి ఇప్పుడవన్నీ మరచిపోయాం. కంప్యూటర్లు, ఫోన్లతో ఆడుకుంటున్న ఈ తరం పిల్లలకు పేపర్ క్రాఫ్ట్స్ మజాను రుచి చూపిస్తున్నారు దేవకిరణ్. ఇటీవల ఆయన నిర్వహించిన కిర్గామి (పేపర్ క్రాఫ్ట్) వర్క్‌షాప్‌లో పిల్లలే కాదు, పెద్దలూ హుషారుగా పాల్గొన్నారు. కాగితాలతో కళాఖండాలు ఎలా చేయాలో నేర్చుకున్నారు. ఇంట్లో మీ చిన్నారి చేతికి కత్తెర, కాగితం దొరికితే.. ఇళ్లంతా డస్ట్‌బిన్‌గా మారిపోతుంది. చిన్నప్పుడే కాదు కాస్త పెద్దయిన తర్వాత కూడా పిల్లలకు కత్తెర.. కాగితం కాంబినేషన్ క్రేజీగానే అనిపిస్తుంటుంది. దొరికిన కాగితం ముక్కను రకరకాలుగా కట్ చేస్తూ ఏదో రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని కాస్త ప్రోత్సహిస్తే.. అద్భుతమైన డిజైన్లు ఆవిష్కృతం అవుతాయంటున్నారు.. పేపర్ క్రాఫ్ట్ ఎక్స్పర్ట్ దేవకిరణ్. దీని ద్వారా విద్యార్థుల్లోని సృజనను వెలికి తీయవచ్చని చెబుతున్నారు. ఇలాంటి పిల్లల కోసమే సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రె డ్ స్పేస్‌లో పేపర్ క్రాఫ్ట్ట్పై శిక్షణ ఇచ్చేందుకు రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు దేవకిరణ్. ఈ వర్క్‌షాప్‌లో చిన్నారులు ఆసక్తిగా పాల్గొన్నారు. తమ చేతుల్లో రూపుదిద్దుకున్న రకరకాల డిజైన్లు చూసి మురిసిపోయారు. తమ పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకూడదని భావిస్తున్న తల్లిదండ్రులు కూడా.. చిన్నారులను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నారు. వందల రకాల డిజైన్లు.. మార్కెట్లో దొరికే గ్లేజ్, కైట్ పేపర్ తీసుకుని వాటిని తమకు కావాల్సిన డిజైన్‌తో సిజర్స్‌తో కట్ చేయడమే పేపర్ క్రాఫ్టింగ్. వీటితో ఇంట్లో డెకరేషన్ కోసం వాల్ డిజైనింగ్స్, హారాలు, చెట్లు, జంతువులు.. ఇలా రకరకాల ఆకృతులు కాగితాలతో రూపొందించవచ్చు. పండుగలు, ప్రత్యేకమైన రోజుల్లో వీటిని ప్రత్యేకంగా అలంకరించుకోవచ్చు. ‘ఒక్కో ఐటమ్ నుంచి వంద రకాల డిజైన్లు కూడా తయారు చేయవచ్చు. 8వ తరగతిలో పేపర్‌తో చిత్రాలు చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు పిల్లలకు ఇందులో శిక్షణనివ్వడం సంతోషంగా ఉంద’ని ఆనందంగా చెబుతారు దేవకిరణ్. పేపర్ క్రాఫ్ట్ కూడా ప్రత్యేకమైన ఆర్ట్ అని చెప్పే ఆయన.. దీనివల్ల పిల్లలకు ఆనందం కలగటంతో పాటు ఒత్తిడి తగ్గుతుందన్నారు. పెద్దవాళ్లు దీన్ని ఉపాధిగా కూడా మలుచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. స్కిల్స్ పెరుగుతాయి.. ‘నా కూతురు శ్రీనిధి ఇంట్లో కత్తెర పట్టుకుని పేపర్లతో ఓ యుద్ధమే చేస్తుంది. అందుకే తనకు పేపర్ క్రాఫ్ట్‌లో శిక్షణ ఇప్పించాలనుకున్నాను. తనతో పాటు నేనూ నేర్చుకుంటున్నా’ అని తెలిపారు గీతాంజలి. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో స్కిల్స్ డెవలప్ అవుతాయని చెబుతున్నారు స్రవంతి. అందుకే తన కూతురు వేదతో వర్క్‌షాప్‌నకు వచ్చానని తెలిపారు. ఇంకా ఎందరో చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఈ వర్క్‌షాప్‌లో కాగితాలతో కుస్తీపడ్డారు. రంగుకాగితాలతో తమ చేతిలో తయారైన డిజైన్లను అపురూపంగా చూసుకున్న ఈ చిన్నారులు.. వాటిని పదిలంగా దాచుకుంటామంటున్నారు. -దార్ల వెంకటేశ్వరరావు (రాంగోపాల్‌పేట్) -
నడిచే నగల కొండ
అతను నడిచి వస్తుంటే ఓ నగల కొండ కదలివస్తున్నట్టే అనిపిస్తుంది. కళ్లు బైర్లు కమ్మే చైన్లు, వేళ్లకు వజ్రాల మెరుపులు, కళ్లకు సన్‌గ్లాసెస్.. అతని ట్రేడ్ మార్క్. ఆయనే సంగీత దర్శకుడు బప్పీలహరి. ఏళ్ల తరబడి ఈ విలక్షణమైన అలంకరణతో ఆకట్టుకుంటున్న ఈ నగల కొండ బర్త్ డే నేడు. 1980-90లలోని యువతరం బప్పీలహరి పేరు చెబితే ఇప్పటికీ చిందులేస్తుంది. ఆయన అందించిన బాణీలు అటు బాలీవుడ్లోనే కాదు ఇటు టాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ అయ్యాయి. హాలీవుడ్ దాకా పాకిన ఈ సంగీత దిగ్గజం ‘ఐ యామ్ ఎ డిస్కో డాన్సర్..’ అంటూ హుషారెత్తించే పాటలతో ఎంత ప్రాముఖ్యం పొందారో తను ధరించే ఆభరణాలతో కూడా అంతే ప్రచారం పొందారు. డిస్కో కింగ్‌గా పేరున్న ఈ సంగీత దర్శకుడిని ‘గోల్డెన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కూడా అభిమానులు కీర్తిస్తారు. ఆరు పదుల వయసు దాటిన ఈ సంగీత దర్శకుడు దాదాపు 500 సినిమాలకు పైగా సంగీత సారథ్యం వహించాడు. తన స్టైల్ స్టేటస్ గురించి అడిగితే బప్పీలహరి ఏమంటున్నారంటే... అమ్మానాన్నల వారసత్వం పశ్చిమబెంగాల్లోని కలకత్తా! నాన్న అపరేష్ లహరి, అమ్మ బన్సారీ లహరి. ఇద్దరూ శాస్త్రీయ సంగీత దిగ్గజాలే! వారసత్వంగా నాకు ఆ కళ వంటపట్టింది. జాతీయంగానే కాదు అంతర్జాతీయంగానూ సంగీతంలో ఎదగాలన్నది నా కల. మూడేళ్ల వయసులోనే తబలా వాద్యంతో సంగీత విద్యను మొదలు పెట్టాను. 19 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాను. నా భార్య చిత్రాణి కూడా గాయనే! మాకు ఇద్దరు పిల్లలు. కూతురు రేమ కూడా గాయనిగా మంచి పేరుతెచ్చుకుంది. కుమారుడు బప్పా లహరి హిందీ సినిమా పరిశ్రమకు సంగీత దర్శకుడుగా పరిచమయ్యాడు. తెలుగులోనూ త్రీడీ చిత్రానికి బాణీలు కట్టాడు. నచ్చేవి.. అందరూ పొగిడేవి.. నా పెదవులు. చాలా మంది నా పెదవులు బాగుంటాయని చెబుతారు. బహుశా నా గొంతులో నుంచి నా పెదవుల ద్వారా పాట బయటకు వస్తుందని కాబోలు! నేను పాడుతుంటే చాలా మంది నా పెదవుల వైపే చూస్తారు. ఆ విధంగా నా పెదవులంటే నాకు చాలా ఇష్టం. అదృష్టాన్ని తెచ్చే అద్దాలు! అవి కేవలం సన్ గ్లాసెస్ మాత్రమే కాదు. నా స్టైల్‌ను తెలియజేసేవి. కళ్ల మీద నేరుగా బాగా కాంతి పడకుండా నల్ల కళ్లద్దాలు ధరిస్తాను. ఇది మైఖేల్ జాక్సన్ సొంత స్టైల్ కూడా! అంతేకాదు, ఇది అంతర్జాతీయ స్టైల్. బప్పీలహరి వీటికి ఒక గుర్తింపు మాత్రమే. ధరించే ఆభరణాలు, సన్‌గ్లాసెస్, బ్రేస్లెట్స్, గడియారాలతో ఇలా నాకు నేను అందరిలో భిన్నంగా ఉండేలా చూసుకుంటాను. నా దగ్గర 51 సన్‌గ్లాసెస్ ఉన్నాయి. అందులో నాలుగైదు నాకు అదృష్టాన్ని తెచ్చినవి కూడా ఉన్నాయి. అయితే ఇంట్లో మాత్రం ఆభరణాలు, సన్‌గ్లాసెస్ ధరించను. పాటంత వేగంగా కొనుగోలు... దుస్తుల ఎంపిక..! నేనెప్పుడూ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటాను. అందుకు ప్రధానంగా దుస్తుల విషయంలో జాగ్రత్త తీసుకుంటాను. విభిన్నమైన డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను. ఎంత ఫాస్ట్‌గా అంటే.. నా పాట అంత వేగంగానే డ్రెస్‌ల కొనుగోలు కూడా ఉంటుంది. ఉదాహరణకు.. రేపు ఓ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకోండి. నేను ఇవ్వాళే ధరించాల్సిన దస్తులు, ఆభరణాలు, సన్‌గ్లాస్‌లు.. అన్నీ ముందే సిద్ధం చేసుకుంటాను. హడావిడి పడను. టైమ్, వేషధారణ, ఆహారం - ఇలా ఏదైనా చాలా నియమబద్ధంగా ఉండాలనుకుంటాను. నా భార్య కూడా నా వస్త్రధారణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. నా వేషధారణను చాలా మంది ఇష్టపడతారు. స్టైల్‌కి ఇప్పటి వరకు వచ్చిన అతి గొప్ప ప్రశంస... ఒకసారి లండన్‌లో షాపింగ్ చేస్తున్నాను. అక్కడ చాలా చల్లగా, అంటే మైనస్ డిగ్రీలలో ఉంది ఉష్ణోగ్రత. చలికి తట్టుకోవడానికి పై నుంచి కోటు వేసుకున్నాను. దీంతో ధరించిన బంగారు ఆభరణాలు కోటు లోపల ఉన్నాయి. అక్కడ కొంతమంది సడెన్‌గా ‘అరె మీరు బప్పీ లహరి కదూ!’ అన్నారు. నేను, ‘కాదు.. కాదు’ అన్నాను. అయినా వారు వినలేదు. ‘మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కానీ, ఒంటి మీద గోల్డ్ లేదు. మీ గోల్డ్ చైన్స్ చూపించండి’ అని పట్టు పట్టి, చూసి, అప్పుడు నిర్ధారించుకొని నవ్వుతూ వెళ్లారు. అది అత్యంత బెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తాను. ఫ్యాషన్‌లో అనుకరణ.. ఒకే ఒకరిని! నన్ను నేను ఇలా తీర్చిదిద్దుకోవడానికి కారణమైన ఎల్విస్ ప్రెస్లీని. అమెరికా గాయకుడైన అత ణ్ణి నా చిన్నప్పుడు ఒకసారి చూశాను. అతను అన్నీ చుంకీ బంగారు ఆభరణాలను ధరించేవాడు. అవి ఆయన్ని ఆడంబరంగానూ, సొగసుగానూ చూపించేవి. వాటితో పాటు నల్ల క ళ్లద్దాలు. ఆ వేషధారణతో అతను భలేగా కనిపించేవాడు. నాకూ అప్పుడే అనిపించింది నేనెందుకు అలా తయారవ్వకూడదని! అప్పటినుంచే ఇలా ఆభరణాలను ధరించడం మొదలుపెట్టాను. వ్యసనాలకు దూరం... బరువు గురించి ఆందోళన చెందిన మాట నిజమే! అయితే, అది ఒకానొకప్పుడు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. అందుకే నో వర్రీ. నా కోసమే తయారైన ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటాను. మద్యం, సిగరెట్, పాన్.. వంటి వ్యసనాలేవీ లేవు. కేవలం టీ, కాఫీలు సేవిస్తాను. అమితంగా ఇష్టపడేది మంచి ఆహారాన్ని. కలకత్తా వాసులు చాలా మంది తీపిని ఇష్టపడతారు. నేను మాత్రం తీపి పదార్థాలు తినను. డ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ మాత్రం చేస్తాను. చేపలు, రొయ్యల వంటకాలు.. నాకు ఇష్టమైనవాటిలో ప్రధానమైనవి. అయితే, వారంలో మూడు రోజులు పూర్తి శాకాహారం తీసుకుంటాను. కొసమెరుపు:... గత ఎన్నికల్లో బప్పీలహరి పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరామ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున పోటీచేశారు. నామినేషన్ అఫిడవిట్లో తన వద్ద కేవలం 754గ్రాములు, తన సతీమణి వద్ద 967 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇద్దరికీ కలిపి 13.5 కిలోల వెండి, కొన్ని విలువైన వజ్రాలున్నట్టు పేర్కొన్నారు. కానీ అనేక సందర్భాలలో సినిమా వేడుకల్లో ఒంటినిండా బంగారు నగలతో కనిపించే బప్పీలహరికి ఉన్న బంగారపు కొండ ఇంత చిన్నదా అని ఈ సందర్భంలో అందరికీ సందేహం కలిగింది. బహుశా ఇన్‌కంటాక్స్‌కు భయపడి ఇంత తక్కువగా చూపించి ఉండవచ్చని అందరూ అనుకున్నారు. మైఖేల్ జాక్సన్ అందుకోసమే కలిశారు! బంగారం కొనడానికి ధన్ తేరస్, అక్షయ తృతీయ అంటూ ప్రత్యేక రోజులంటూ ఏవీ ఉండవు. డిజైన్ నచ్చితే చాలు ఎలాంటి ఆభరణమైనా కొనేస్తాను. ధన్ తేరస్‌కు మా ఆవిడ ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంది. (మెరుస్తున్న ముంజేతులను చూపిస్తూ)నేనెప్పుడూ ఈ డైమండ్ వాచ్, బంగారు బ్రేస్లెట్ తప్పక ధరిస్తాను. చాలా మంది నాతోనే ‘బప్పాద బ్లింగ్ బ్లింగ్’ (నవ్వేస్తూ), ‘గోల్డెన్ మ్యాన్’ అంటుంటారు. ఈ ఆభరణాలు నాకో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. గతంలో ఒకసారి కలకత్తా సాల్ట్ లేక్ స్టేడియమ్లో పాట రికార్డింగ్ సందర్భంలో పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్‌ని చూశాను. ఆ తర్వాత మళ్లెప్పుడూ అతణ్ణి కలవలేదు. మైఖేల్ జాక్సన్ ముంబయ్ వచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగాకలిశారు. నేను స్టార్ సింగర్ అని కాదు కేవలం నేను ధరించే గణపతి చైన్‌ను ఇష్టపడి ఆయన నన్ను కలిశారు. కేశాలంకరణలో మార్పులు.. నా జుట్టు నా సొంతమే! (నవ్వుతూ) ఎలాంటి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించలేదు. బ్యూటీప్యాక్‌లు అసలే ఉండవు. వయసు పై బడినంత మాత్రాన బట్టతల రావాలనేమీ లేదుగా! నూనెలు వాడను. షాంపూ కూడా వాడను. బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యమే అసలైన అందం అనేది నా నమ్మకం. అయితే, నాదైన స్టైల్ ఉండాలి అని మాత్రం కోరుకుంటాను. -
ఇండో-వెస్ట్రన్ బాలానందం...
ఏ పార్టీకైనా, ఏ ఇంటికైనా కళ తెచ్చేది పిల్లల నవ్వులే! వేడుకేదైనా ఉందంటే పెద్దలు పది రోజుల ముందుగానే కావల్సిన అలంకరణ వస్తువులన్నీ సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు ఈ శ్రద్ధ పిల్లలపైనా పెట్టాల్సిందే! ఇటీవల పిల్లల అలంకరణలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఇండో-వెస్ట్రన్ స్టైల్లో ఉండే వస్త్రాలంకరణ, ఇతర అలంకరణ వస్తువులు పెద్దలను సైతం ఆకట్టుకుంటున్నాయి. అయితే సౌకర్యం, మన్నిక, ఆకర్షణీయం... ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని పిల్లలను తయారుచేస్తే రోజంతా వారి నవ్వులతో పెద్దలూ మురిసిపోవచ్చు. మెడ పొడవుగా ఉంటే... చైనీస్ కాలర్ నెక్ బాగుంటుంది. డ్రెస్ డిజైన్లలో ఇటీవల ఎక్కువ ఫ్లెయిర్ ఉన్న చుడీదార్లు, గౌన్లను అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు. అయితే అమ్మాయిలు బాగా సన్నగా ఉండి, పొడవుగా ఉంటే బాటమ్‌గా పటియాలా, బొద్దుగా ఉంటే చుడీని ఎంచుకోవడం మంచిది. వీటిని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలకు డ్రెస్ డిజైనింగ్ చేయవచ్చు. ఎప్పుడూ కంఫర్ట్‌గా కనిపించాలంటే స్పోర్టివ్ లుక్‌తో కనిపించే క్యాజువల్ డ్రెస్‌ను ఎంపిక చేయాలి. మెత్తటి ఫ్యాబ్రిక్... నెట్టెడ్, రా సిల్క్, షిఫాన్, బెనారస్... చాలా మార్కెట్లో ఫ్యాబ్రిక్స్ ఎన్నో ఉన్నాయి. అయితే పిల్లల చర్మానికి తగ్గట్టు మల్మల్, మెత్తటి నెటెడ్, లినెన్, డెనిమ్.. ఫ్యాబ్రిక్స్ బాగా నప్పుతాయి. వీటిలోనే కాంతిమంతమైన రంగులను ఎంచుకోవడం మంచిది. తెలుపు-నలుపు-ఎరుపు రెట్రో స్టైల్ అనిపించేలా పోల్కా డాట్స్ ప్రింట్లు గల ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన దుస్తులు పిల్లలను ఎప్పుడూ ఆకర్షణీయంగా చూపుతాయి. ఈ తరహా దుస్తులు సాయంకాలం పాశ్చాత్య వేడుకలకు అందంగా అమరుతాయి. చలికాలంలో వెచ్చని ఫ్యాషన్... వెచ్చగా ఉండటానికి స్వెటర్ వేస్తే చాలనుకునే రోజులు మారిపోయాయి. ఊలు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గౌన్లు, ఓవర్కోట్లు, షగ్స్,్ర క్యాప్స్.. రంగురంగుల్లో పిల్లలను చూపించడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ తరహా దుస్తులను ఎవరికి వారు తమకు నచ్చిన డిజైన్లు చేసుకోవడానికి వీలుగా ఉన్ని మెటీరియల్ కూడా మార్కెట్లో అందుబాటులో లభిస్తోంది. ఆధునికం...: చెక్స్ షర్ట్స్, ప్లెయిన్స్తో మిక్స్ అండ్ మ్యాచ్‌గా కలిపి ధరించి ఆధునికతకు కొత్త భాష్యం చెప్పడానికి ఈ దుస్తులు ముందుంటున్నాయి. అడ్డం, నిలువు మల్టీకలర్ చారలు ఈ దుస్తులలో ప్రధానంగా చోటుచేసుకుంటున్నాయి. సంప్రదాయ దుస్తులు: గౌను, సల్వార్-కమీజు, గాగ్రా-చోళీ, లంగా- జాకెట్టు, ధోతీ- కుర్తా.. ఇవన్నీ సంప్రదాయ దుస్తులు. పెద్దవారిలానే పిల్లల సంప్రదాయ దుస్తుల్లోనూ ఎక్కువ రంగులు, మెత్తటి ఫ్యాబిక్స్, మెరిసే అంచులు.. ఉండేలా రూపొందిస్తున్నారు డిజైనర్లు. ముఖ్యంగా చలికాలపు డల్ వాతావరణానికి ఇవి సరికొత్తగా జీవం పోస్తున్నాయి. సౌకర్యం...: సాధారణ చొక్కా, షార్ట్ ధరించినా కలర్ఫుల్గా, స్టైల్‌గా కనిపించాలంటే ఒక చిన్న స్కార్ఫ్‌తో రూపుమార్చేయవచ్చు.ఆటలకు, అల్లరికి సౌకర్యవంతమైన డ్రెస్గానే కాకుండా గెట్ టుగెదర్ పార్టీలకు ఆకర్షణీయంగా ఉంటుంది. బొద్దుగా ఉంటే... పిల్లలు బొద్దుగా ఉంటే వారి దుస్తుల్లో ఫ్రంట్ నెక్ వెడల్పుగా కాకుండా సన్నటి డీప్ నెక్కి ప్రాధాన్యత ఇస్తే చూడముచ్చటగా ఉంటారు. బ్రాడ్ నెక్ కావాలంటే దీంట్లో ‘యోక్ నెక్’ డిజైన్ చేసుకోవాలి. మరిన్ని సూచనలు... ⇔ డ్రెస్ పైన అనవసరమైన, బరువైన అలంకరణ ఉండకూడదు. ⇔ డ్రెస్ లోపలివైపు మెత్తని కాటన్ లైనింగ్ తప్పనిసరి. ⇔ జరీ ఎంబ్రాయిడరీ, స్టోన్స్.. దుస్తులు పిల్లలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సాధ్యమైనంతవరకు దారంతో చేసిన ఎంబ్రాయిడరీ, రంగు రంగుల పూసలను డిజైనింగ్‌లో వాడవచ్చు. మీరు ఎంపిక చేసిన డ్రెస్‌లో పిల్లలు రోజంతా సంతోషంగా నవ్వుతూ ఉన్నారంటే వారికి ఆ వేషధారణ సౌకర్యంగా ఉన్నట్టు. సంతోషంగా ఉంటేనే ధరించిన దుస్తులకు కొత్త అందం తెచ్చినట్టు. -
దసరా ఉత్సవాల్లో... ఖాళీగా బంగారు సింహాసనం
మైసూర్ ప్యాలెస్ అనగానే కళ్లు చెదిరే ఆ కట్టడ నిర్మాణం, అలంకరణ మదిలో మెదులుతుంది. ఇక దసరా ఉత్సవాల్లో అయితే ఆ అలంకరణ మాటల్లో చెప్పలేం. అందులోనూ ప్యాలెస్‌లో ఉండే బంగారు సింహాసనం దసరా సంబరాల్లో అంతర్భాగమై వస్తోంది. దసరా ఉత్సవాల ఆరంభంలో మైసూర్ మహారాజు ఆ సింహాసనం మీద కూర్చుని దర్బార్ నిర్వహిస్తారు. రాచరిక వ్యవస్థ రద్దు అయిన తర్వాత కూడా ఈ పరంపర కొనసాగుతూ వచ్చింది. ఈ బంగారు సింహాసనాన్ని కిందటేడాది వరకు శ్రీకాంతదత్త నరసింహరాజ వడయార్ రాజు అధిష్ఠించారు. ఆయన కిందటేడాది డిసెంబర్లో మరణించడం, ఆయనకు వారసులెవరూ లేకపోవడంతో ఈ సింహాసనం ఖాళీగా ఉంది. ప్యాలెస్ సంరక్షణదారుడైన నరసింహ ఖాళీ సింహాసనం పై రాజు కత్తిని పెట్టి, పూజారులచే పూజలు జరిపించారు. వేదమంత్రాలు పఠించి, సింహాసనం పైన పవిత్ర జలాన్ని చల్లారు. విలువైన జాతి రత్నాలను పొదిగిన బంగారు గొడుగును పట్టారు. ‘రాజు ఆసీనుడై ఉన్నట్టుగానే భావించి, అన్ని కార్యక్రమాలను చేశామని’ నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా బంగారు సింహాసం మైసూర్ మహారాజుల వంశాచారంగా ఎలా వచ్చిందో తెలిపారు. ఒక కథనం ప్రకారం ఈ సింహాసనం పాండవుల కాలం నాటిదని తెలుస్తోంది. మరొక కథనంలో 14 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులైన హరిహర బుక్కరాయల నుంచి ఈ సింహాసనం శ్రీరంగ పట్టణ సంస్థానాధీశుడైన శ్రీరంగరాయకు చేరిందని తెలుస్తోంది. మరొక కథనం ప్రకారం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1700 కాలంలో చిక్కదేవరాజ వడయార్‌కు ఈ సింహాసనాన్ని బహుమానంగా ఇచ్చారని చెబుతారు. ఈ సింహాసనాన్ని దసరా ఉత్సవాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. -
గ్రేట్ ముహూర్తం
బలమైన లగ్నాలు కుదిరాయి.. తిథులు, నక్షత్రాలు కలిశాయి.. వారాలు కలిసొచ్చాయి.. వివాహఘడియలకు శుభసూచకంగా మారాయి.. వీటికి తోడు శ్రావణ మాసం.. ఇలాంటి తరుణంలో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి.. వరుసగా మూడు రోజులు వివాహాలకు అనువుగా ఉండడంతో గ్రేటర్‌కు పెళ్లిక ళ వచ్చేసింది. మండపాలు, ఫంక్షన్ హాళ్లు, గృహాలు అందంగా ముస్తాబవుతున్నాయి. మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. - మూడు రోజులూ సందడే - వేల సంఖ్యలో వివాహాలు - ముస్తాబవుతున్న ఫంక్షన్‌హాళ్లు, మండపాలు - భారీగా పెరిగిన ధరలు - రెట్టింపైన పెళ్లి బడ్జెట్ సాక్షి, సిటీబ్యూరో/కంటోన్మెంట్, చంపాపేట్, హస్తినాపురం, నాగోల్: శ్రావణమాసం.. పెళ్లిళ్లకు అనుకూలం.. అందునా మంచి ముహూర్తాలు కలిసొస్తే ఇక పెళ్లి సందడే. బుధ, గురు, శుక్రవారాలు ఉన్నతమైన గ్రహస్థితి, చక్కటి తిథులు, వేళలు అన్నీ శుభసూచికంగా మారాయి. ఈ అద్భుత ఘడియల్లో వేలాది జంటలను ఒక్కటి చేసేందుకు మండపాలు, ఫంక్షన్‌హాళ్లు అందంగా ముస్తాబవుతున్నాయి. నగరంలో ఏ గల్లీ చూసినా పెళ్లి సందడే. వస్త్ర, బంగారు దుకాణాలు రద్దీగా ఉన్నాయి. భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతున్న సందర్భంగా ఫంక్షన్ హాళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. ధరలకు రెక్కలు... ఈ శ్రావణ మాసం అన్నీ మంచి రోజులే. అయితే ఈ నెల 13, 14, 15 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అన్ని రకాల వస్తువుల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు ధరలు అమాంతం పెంచేశారు. మండపాలను అలంకరించే ఆర్టిస్టులు మొదలుకొని సన్నాయి వాద్యకారులు, పురోహితులు, కేటరింగ్ వాళ్లు అందరికీ డిమాండ్ పెరిగింది. కిందటే డాది కంటే ఈసారి చార్జీలు భారీగా పెంచేశారు. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వ్యయం అయ్యే పెళ్లి బడ్జెట్ ఏకంగా రూ. 10 లక్షలకు చేరుకోనుంది. సికింద్రాబాద్, కంటోన్మెంట్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో సాధారణ రోజుల్లో రూ. 2 లక్షలు మాత్రమే ఉండే ఓ ఫంక్షన్ హాలు అద్దె రూ. 3 లక్షలకు పెంచేశారు. ఎల్బీనగర్, చంపాపేట్, నాగోల్, సాగర్ రింగురోడ్డు తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లు సాధారణ రోజుల్లో రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలుండగా ప్రస్తుతం రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెరిగాయి. ఫంక్షన్ హాళ్లు లభించని వారు బస్తీల్లోని కమ్యూనిటీ హాళ్లు, ఇంటి ముందు సెట్టింగులతో ఉన్నంతలో ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘డెకరేషన్’ ఎక్కువైంది! పెళ్లి మండపాలు, ఆహ్వాన వేదిక, సెట్టింగుల ఖర్చులు భారీగా పెరిగాయి. రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇందుకోసమే ఖర్చుచేస్తున్నారు. డెకరేషన్లకు జర్బరా, కార్నేషన్, ఆర్కిడ్, ఆంథోరియమ్ వంటి పూలను వాడుతారు. సాధారణ రోజుల్లో జర్బరా బంచ్ (పది పూల కట్ట)కు సగటున రూ. 50 ఉంటే ప్రస్తుతం అది రూ. 200 లకు పెరిగింది. కార్నేషన్ ధరలు రూ. 150 నుంచి రూ. 300 వరకు, ఆర్కిడ్ రేట్లు రూ. 200 నుంచి రూ. 400కు పెరిగాయి. - సాధారణ రోజుల్లో రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు తీసుకునే వీడియోగ్రాఫర్లు ప్రస్తుతం రూ. 2 లక్షలకు పైగా డిమాండ్ చేస్తున్నారు. - ఒకే సమయంలో ఎక్కువ ముహూర్తాలు రావడంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వేద పాఠశాలల్లో ఉండే పండితులు, దేవాలయ అర్చకులు సైతం రంగంలోకి దిగారు. - నాదస్వర విద్యాంసులకు సైతం డిమాండ్ నెలకొంది. సాధారణంగా ఒక పెళ్లికి రూ. 15,000 నుంచి రూ. 25,000 తీసుకునే ఐదుగురు సభ్యుల బృందం ప్రస్తుతం రూ. 30,000కు పైగా డిమాండ్ చేస్తున్నారు. మూసుకున్న హాళ్లూ తెరుచుకుంటున్నాయ్! కంటోన్మెంట్లో బీ-3 కేటగిరీకి చెందిన ఓల్డ్ గ్రాంట్ బంగళా స్థలాల్లో ఉన్న ఫంక్షన్ హాళ్లను గతేడాది బోర్డు అధికారులు మూసేయగా, మరికొందరు నిర్వహణ భారం మోయలేక మరికొందరు హాళ్లను మూసేశారు. మల్కాజ్‌గిరిలోని మల్లారెడ్డి గార్డెన్‌ను ఎనిమిది నెలల కిందట మూసేశారు. ప్రస్తుతం షెడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పెళ్లిళ్లకు సిద్ధం చేస్తున్నారు. -
కాంట్రాక్టర్ చెరలో టీటీడీ కల్యాణ మండపం
ఆదాయం రూ.లక్షల్లో.. టీటీడీకి చేరేది వేలల్లో విధులకు హాజరుకాని అధికారి రూ.లక్షలు గడిస్తున్న కాంట్రాక్టర్ నందిగామ, న్యూస్‌లైన్ : పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా నిర్మించిన టీటీడీ కల్యాణ మండపం అక్రమార్కుల చెరలో చిక్కుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నంది గామ టీటీడీ కల్యాణం మండపం నిర్వహణ బాధ్యతలు చూసే అధికారి, ఓ కాంట్రాక్టర్ కలిసి ఏటా రూ.50 లక్షల ఆదాయం పొందుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్యాణ మండపాన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన టీటీడీ దేవస్థానానికి మాత్రం వేలల్లోనే ఆదాయం అందుతోంది. పట్టణంలో రెండు దశాబ్దాల క్రితం టీటీడీ కల్యాణ మండపాన్ని నిర్మించారు. అప్పట్లో కొంత కాలం దాని నిర్వహణ బాగుంది. ఆ తరువాత టీటీడీ అధికారులు మండపం నిర్వహణను లీజుకు ఇచ్చారు. లీజ్ ముగిసిన తరువాత నాలుగేళ్లు టీటీడీ ఆధ్వర్యంలోనే కల్యాణమండపం నడిచింది. దీని బాధ్యతలు చూసేందుకు ఓ అధికారిని నియమించారు. అయితే ఆ అధికారి కల్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆ అధికారి నందిగామ వచ్చి ఏడాది గడిచిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేద, మధ్య తరగతి వారు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అందుబాటులో ఉండేలా రోజుకు కేవలం రూ.1500 అద్దెకే కల్యాణ మండపాన్ని ఇచ్చేలా టీటీడీ దేవస్థానం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం కల్యాణ మండపం బాధ్యతలు చూస్తున్న అధికారి రోజుకు రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారని అద్దెకు తీసుకున్నవారు ఆరోపిస్తున్నారు. శుభకార్యాల కోసం అద్దెకు తీసుకున్న వారు తమ స్థాయికి తగ్గట్టుగా విద్యుత్ దీపాలంకరణ, మండప అలంకరణలు చేసుకుం టారు. అయితే కాంట్రాక్టర్ మాత్రం ఈ అలంకరణ పేరిట లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. శాశ్వతంగా ఉండేలా విద్యుత్ దీపాల అలంకరణ ఏర్పాట్లు చేసున్న కాంట్రాక్టర్ ఇతర అలంకరణ కాంట్రాక్టర్లను ఇక్కడికి రానివ్వడంలేదు. ఈ కల్యాణమండపం బాధ్యతలు చూడాల్సిన అధికారి అద్దెకు తీసుకునేవారికి అందుబాటులో ఉండటంలేదు. కనీసం ఫోన్ నంబరు కూడా ఎవరికీ ఇవ్వడంలేదు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మండపాన్ని బుక్ చేసేందుకు ఆ అధికారిని సంప్రదించారు. అయితే ఆ అధికారి సూచనల మేరకు కాంట్రాక్టర్‌ను కలవగా ఆయన తన వద్దే ఉన్న బుకింగ్ రిజిస్ట్రర్ చూసి ఖాళీగా ఉందని రూ.13 వేలు ఇవ్వాలని కోరారు. రూ.13 వేలు చెల్లిం చిన పది రోజులు తరువాత కేవలం రూ.3వేలకు మాత్రమే రసీదు ఇచ్చారు. కల్యాణ మండపంలో పెళ్లికి అవసరమైన అన్ని రకాల అలంకరణలకు అయ్యే ఖర్చు రూ.లక్ష ఉంటుందని, అందుకు సిద్ధమైతేనే కల్యాణ మండపాన్ని అద్దెకు ఇస్తామని ఆ కాంట్రాక్టర్ స్పష్టంచేశాకరి అద్దెకు తీసుకున్న వ్యక్తి తెలిపారు. ఈ ఆరోపణలపై టీటీడీ నియమించిన అధికారి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆందుబాటులోకి రాలేదు. -
పాత వస్త్రాలే పెళ్ళికానుక
సంస్కృతి పెళ్లి పేరు చెప్పగానే ముందుగా తలపుకొచ్చేవి కట్నకానుకలు. ఇక్కడ భారీ అలంకరణతో కనిపిస్తున్న గిరిజన మహిళను చూశారుగా...ఆమె పెళ్లికి ఆమెకిచ్చిన కట్నం ఆ అలంకరణ మాత్రమే. అవును... ఆ అలంకరణనకు ఉన్న ప్రత్యేకత అలాంటిది. వందల సంవత్సరాల నుంచి వారసత్వంగా వస్తున్న ఆ వస్తువులే అక్కడి అమ్మాయిలకిచ్చే ఆస్తిపాస్తులు. అలంకరణ వస్తువులొక్కటే కాదు వస్త్రాలు కూడా వారసత్వంగా వస్తాయి. పెళ్లనగానే కొత్త బట్టలు, కొత్త వస్తువులు ఉంటాయని తెలుసు మనకి. కాని ‘డ్రోక్పా’ తెగ గిరిజనులు మాత్రం దీనికి భిన్నంగా ఏళ్లనాటి పాతవస్త్రాలకు, వస్తువులకే ప్రాధాన్యం ఇస్తారు. భారత్- పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం జమ్మూ కాశ్మీర్ దగ్గర ధహను లోయల్లో నివసించే ‘డ్రోక్పా’ తెగకు చెందిన గిరిజనులు పాటించే సంప్రదాయమిది. ఆ లోయలో ఉన్న మూడు గ్రామాల్లో 2,500మంది డ్రోక్పా తెగవారు ఇప్పటికీ వారి సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. తమ సొంత తెగవారిని మాత్రమే పెళ్లాడే ఈ గిరిజనులు పెళ్లప్పుడు పెళ్లికూతురుని తయారుచేయడమొక్కటే పెద్దపనిగా భావిస్తారు. ఒంటినిండా రకరకాల ఆభరణాలతో అమ్మాయిని అలంకరిస్తారు. రెండు మూడు వందల ఏళ్లనాటి అలంకరణ వస్తువులు వారి దగ్గర భద్రంగా ఉంటాయట! వాటితో నిండుగా పెళ్లికూతురికి అలంకరణ చేశాక తలపై ప్రత్యేకమైన పూలముస్తాబు చేస్తారు. అడవి మొత్తం తిరిగి ప్రత్యేకంగా ఉండే పూలను సేకరించి పెళ్లికూతురు, పెళ్లికొడుకు తలపై పూలగుత్తులు విరబూసినట్టు అలంకరిస్తారు. ఆ సమయంలో మిగతావారి ముస్తాబు కూడా భారీగా ఉంటుంది. ఈ తెగకున్న మరో ప్రత్యేకత... వీరి పూర్వీకులు కొందరు అలెగ్జ్జాండర్ సైన్యంలో పనిచేశారట. ఇప్పటికీ ఈ విషయాన్ని వారు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. -
చెప్పులకు బ్యాగ్ మ్యాచ్ అయ్యిందా?
చాలామంది దుస్తులమీదే దృష్టి పెడతారు. కొంతమంది దుస్తులతో పాటు మేకప్‌పై కూడా ఆసక్తి చూపిస్తారు. కాని చాలా మంది పట్టించుకోని యాక్ససరీ ఒకటుంది. అదే బ్యాగ్! అలంకరణలో హ్యాండ్‌బ్యాగ్ ప్రధాన భూమిక పోషిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. భుజానికి వేలాడే అతి చిన్న బ్యాగ్ కూడా మీ అలంకరణలో భాగమే. హ్యాండ్‌బ్యాగ్ ఎంపికలో ఫ్యాషన్ డిజైనర్స్ ఏమంటున్నారంటే.. ‘ధరించే దుస్తులకు మ్యాచ్ అయ్యే బ్యాగ్ కాదు, ధరించే చెప్పులకు, చేతపట్టుకునే బ్యాగ్‌కి సమన్వయం ఉండేలా చూసుకోవాలి’ అని చెబుతున్నారు. సాయంకాలం పార్టీకి పువ్వుల ప్రింట్లు ఉన్న డ్రెస్ ధరించాలని అన్ని వయసుల వారూ అనుకుంటారు. దాంట్లో మీరు వైవిధ్యం చూపించేదేమీ ఉండదు. అదే ముదురుపసుపు రంగు సాదా డ్రెస్ ధరించి, పువ్వుల ప్రింట్లు ఉన్న బ్యాగ్ దానికి మ్యాచ్ అయ్యే చెప్పులు వేసుకున్నారనుకోండి. పార్టీలో మీరే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. యానిమల్ ప్రింట్లు (జంతుచర్మాలపై చారలను పోలినవి) మీకు అత్యంత ఇష్టమైతే సాధారణంగా కనిపించే డెనిమ్ డ్రెస్ ధరించి, ప్రింట్లు ఉన్న ఎత్తుమడమల చెప్పులు వేసుకొని, అదే రంగు క్లచ్బ్యాగ్ చేత పట్టుకోండి. ఎత్తుమడమల చెప్పులు ఇష్టపడని వారు ఫ్లాట్స్ వేసుకోవచ్చు. ఏవైనా ఈ తరహా మ్యాచింగ్ చూసుకున్నప్పుడు అతి ఎక్కువగా అలంకరణలు చేసుకోకుండా ఉండటం మేలు. సంప్రదాయ తరహాలో కనిపించాలనుకునేవారు క్లాసిక్ కలర్స్ అయిన నలుపు, ఎరుపు, ముదురు రంగు దుస్తులను ధరిస్తుంటారు. ఇలాంటప్పుడు బ్యాగ్ ఎంపికలో ఏమాత్రం అలసత్వం చూపవద్దు. చేతికి తగిలించుకునే బ్యాగ్, అందుకు మ్యాచ్ అయ్యే చెప్పులు బాగుండేలా జాగ్రత్తపడాలి. అన్నివేళలా చెప్పులు-బ్యాగ్ మ్యాచ్ అవ్వాలనుకోకూడదు. తెల్లటి బ్యాగ్ వెంట తీసుకెళ్లాలనుకుంటే నీలం, నారింజ, పసుపు రంగు చెప్పులు లేదా షూస్ ప్రయత్నించవచ్చు. అలాగే సాధారణ దుస్తులకు దృఢంగా ఉండే బ్యాగులు నప్పవు. కొద్దిగా వేలాడుతుండే లెదర్ లేదా క్లాత్ బ్యాగ్‌లు వేసుకొని అదే రంగు, మెటీరియల్ గల చెప్పులు ధరించాలి. ప్యాంట్, షర్ట్, చెప్పులతో పాటు బ్యాగ్ కూడా ఒకే రంగులో ఒకే ప్రింట్లలో ఉంటే అలంకరణ మరీ అతిగా కనిపిస్తుంది. ప్యాంట్ లేదా టాప్ ఏదైనా ఒక రంగును పోలి ఉండే బ్యాగ్‌ను ఎంచుకోవచ్చు. మీరు ధరించే దుస్తులు ప్లెయిన్‌గా ఎలాంటి ప్రింట్ లేకుండా ఉన్నాయనుకోండి. అప్పుడు ఎక్కువ ప్యాటర్స్ ఉన్న బ్యాగ్ లేదా షూ ధరించవచ్చు. కాని గుర్తుంచుకోవాల్సిందేంటంటే... షూ, బ్యాగ్ మిమ్మల్ని మరింత అందంగా చూపించాలి. -
ఆహా కల్యాణం
ఆకాశమంత పందిరి.. భూదేవి అంతపీట వేసి వివాహం చేయాలని అంటుం టారు. ఆ స్థాయిలో కాకపోయినా ఇటీవల వివాహ వేడుకలను అదే తరహాలో నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. ఇప్పుడు పెళ్లంటే సినిమాలను తలపించే సెట్టింగులు.. కళ్లు జిగేల్మనిపించే విద్యుద్దీప కాంతులు.. స్వాగత తోరణం నుంచి పెళ్లి పందిరి వరకూ పూలతో డెకరేషన్.. ఆకట్టుకునే మంటపాలు.. ఇలా ఒకటేమిటి అడుగడుగునా వారి హోదాకు తగ్గట్టు పెళ్లి వేడుకలు దర్శనమిస్తున్నాయి. ఊరంతా చెప్పుకునేలా హంగూ ఆర్భాటాలూ.. ముచ్చటగా వివాహ వేడుకలు.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకుంటున్నారు. -
ఆకులో ఆకునై...
పచ్చదనం నుంచి పసుపు వర్ణం పులుముకున్న ఆకులు కొన్ని... సింధూరం రంగు నింపుకున్న పత్రరాజాలు మరికొన్ని. నారింజలా నయనాలకు కనువిందుచేసే దళాలు ఇంకొన్ని. పచ్చగా ఉన్నప్పుడే కాదు, వాడిపోయి, వడలిపోయి, ఎండిపోయిన విభిన్న రకాల ఆకులను సేకరించి ఇంటి అలంకరణలో ఉపయోగించడమంటే ప్రకృతికి మనసులో పెద్ద పీట వేసినట్టే! తక్కువ ఖర్చుతో అద్భుతమైన పర్యావరణ సౌందర్యాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాలంటే ఆకులను మించిన అలంకరణ మరేదీ లేదని ఈ కింది చిత్తరువులను చూస్తే మీరూ ఏకీభవిస్తారు. ఉడెన్ ఫ్రేమ్ ఉన్న పాత అద్దాల కిటికీ తలుపును తీసుకొని, ఆకులను అతికించే వైపు బూడిదరంగు పెయింట్‌ను పై భాగాన, ఆకుపచ్చని పెయింట్‌ను కింది భాగాన స్ప్రే చేయాలి. ఫ్రేమ్ భాగంలో ఆకుల కాడలను టేపుతో అతికించాలి. ఆకులు అద్దంలో నుంచి వేలాడుతున్నట్టుగా కనిపించేలా అమర్చితే చూడముచ్చటైన వాల్ ఫ్రేమ్ రెడీ అయినట్టే! (ఫొటోలో చూపిన విధంగా) రాలి, వాడిపోయిన కాడలున్న ఆకులను తీసి, బరువైన పెద్ద పుస్తకం మధ్యలో ఉంచాలి. మూడు రోజుల తర్వాత ఆ ఆకులను తీయాలి. ఎండిన ఆకులకు నచ్చిన పెయింట్ వేసి, శాటిన్ రిబ్బన్‌కు (తోరణంలా) అతికించాలి. ఆకుల తోరణాన్ని డోర్, విండో భాగాన అమర్చితే అందంగా కనిపిస్తుంది. రెండు సన్నని పొడవైన కర్రపుల్లలను ప్లస్ (+) ఆకారంలో పెట్టి, మధ్యలో దారంతో కట్టాలి. రంగురంగుల ఎండిన ఆకులను గుచ్చి, కిందిభాగంలో పూసలు లేదా గంటలు కట్టి, వేలాడదీయాలి. ఈ హ్యాంగర్‌ని కిటికీ దగ్గర వేలాడదీస్తే గాలికి కదులుతూ చూపరులను ఆకట్టుకుంటుంది. ఆకు డిజైన్ల కోసం ఓ కొత్త ఆలోచన. పాత మ్యాగజీన్ గ్లాసీ పేపర్‌పైన లేదా అందమైన మందపు వస్త్రం పైన ఆకును పెట్టి ఆ షేప్ వచ్చేలా కత్తిరించుకోవాలి. ఆ తర్వాత నచ్చిన రీతిలో ఆ కృత్రిమ ఆకును మరికొన్ని ఆకులతో కలిపి అలంకరించుకోవచ్చు. పార్టిషన్ కోసం ఈ రోజుల్లో పెద్ద మిర్రర్స్‌ని వాడుతున్నారు. ప్లెయిన్‌గా ఉండే అద్దాలు అలంకరణప్రాయంగా ఉండవు. అందుకని ఎండిన రకరకాల ఆకులను పార్టిషన్ మిర్రర్‌కు (ఫొటోలో చూపిన విధంగా) అతికిస్తే ఆర్టిస్టిక్‌గా ఉంటుంది. -
ప్రతి కదలికకూ ఓ అందం
చుడీదార్, లెహంగా, బ్లౌజ్, దుపట్టా... ఇంకాస్త కనువిందు చేయడానికి పూసలు, చమ్కీలు, అద్దాలు, జరీ మెరుపులు, కుందన్ తళుకులను నింపుకున్న బాల్స్ దర్జాగా కదులుతుంటాయి. రాణివాసపు కళ మాదే సుమా అంటూ మగువల మనసును గెలుచుకుంటాయి. వీటిని కూడా మన అభిరుచి మేరకు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో రెడీమేడ్ బాల్స్, విడిగా వీటికి సంబంధించిన మెటీరియల్ దొరుకుతుంది. ముందుగా డ్రెస్ కలర్ క్లాత్‌ని తీసుకొని గట్టి ఉండలా చుట్టాలి. దాన్ని ఎంపిక చేసుకున్న రంగు క్లాత్‌తో కుట్టేయాలి. బేస్ బాల్ చక్కగా రెడీ అయితే మిగతా పని అంతా సులువు అవుతుంది. ఆ బాల్మీద జరీ, మెటివ్స్, ముత్యాలు, పూసలు, కుందన్స్‌తో నచ్చిన తరహాలో వర్క్ చేసుకోవాలి. కొన్ని బాల్స్‌ను ఊలుతోనూ తయారుచేసుకోవచ్చు. మార్కెట్లో లైట్ మెటల్ బాల్స్కూడా దొరుకుతున్నాయి. ఏ బాల్ అయినా ముందుగా బేస్ తయారుచేసుకోవాలి. ఆ తర్వాతే వాటిపైన మగ్గం వర్క్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన బాల్స్ మెటీరియల్ వాడకాన్ని బట్టి రూ.300 నుంచి రూ.10,000 వరకు కూడా ఖరీదు చేస్తాయి. సాధారణంగా రూ.300 నుంచి రూ. 800 లతో మంచి కలర్ కాంబినేషన్లో వీటిని రూపొందించుకోవచ్చు. పెళ్లికూతురు డ్రెస్‌లు, ఇతర ట్రెడిషనల్ డ్రెస్లకైతే హెవీగా, కామన్‌గా అయితే తక్కువ ఖరీదు బాల్స్‌ని ఉపయోగించాలి. చుడీదార్‌కి వేసే బాల్స్ డ్రెస్ కలర్‌ను బట్టి, లెహంగా అయితే చున్నీ, బ్లౌజ్ రంగులను కూడా పరిశీలన లోకి తీసుకోవాలి. డ్రెస్‌ను మడతపెట్టేటప్పుడు బాల్స్‌ను ప్లాస్టిక్ కవర్లో పెట్టి, కదలకుండా రబ్బర్ బ్యాండ్ వేయాలి. లేదంటే బాల్స్ రాపిడి వల్ల పైన వాడిన పూసలు, లేసులు పోయే అవకాశం ఉంటుంది. అలాగే బాల్స్‌ని శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగించరాదు. డై వాష్‌కు ఇవ్వాలి. - శశి, ఫ్యాషన్ డిజైనర్