ప్రాణంతీసిన డెకరేషన్‌ పూలు | Pranantisina Decoration flowers | Sakshi
Sakshi News home page

ప్రాణంతీసిన డెకరేషన్‌ పూలు

Published Mon, Oct 10 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

Pranantisina Decoration flowers

  •  ఆటోడ్రైవర్ల ఘర్షణలో డ్రైవర్‌ మృతి
  • చిన్న సమస్యకు ప్రాణం కోల్పోయిన వైనం 
  • గీసుకొండ : ఆటోలో డెకరేషన్‌  ఫ్లవర్స్‌ను దొంగిలించిన విషయంలో ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య తగాదా ఘర్షణగా మారి వారిద్దరిలో ఒకరి మృతికి కారణమైన సంఘటన మండలం లోని మచ్చాపూర్‌ వద్ద ఆది వారం సాయంత్రం జరిగింది.
    స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మచ్చాపూర్‌ సమీపంలోని మాన్‌ సింగ్‌(స్తూపం)తండాకు చెందిన ఆటోడ్రైవర్‌ ఆంగోతు హరికృష్ణ(35) సాయంత్రం 6 గంటల సమయంలో విద్యుత్‌ సబ్‌స్టేన్‌  వద్ద మచ్చాపూర్‌–పల్లార్‌గూడ రోడ్డు వద్ద ఆటోను నిలిపి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఇంతలో అతడి ఆటోలో అమర్చి ఉన్న  డెకరేషన్‌  ప్లాస్టిక్‌ పువ్వులను ఎవరో ఎత్తుకెళ్లిన విషయాన్ని గమనించాడు. ఎవరో  ఆటోడ్రైవర్‌ పువ్వులను తీసి ఉంటాడనే అనుమానంతో అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఆటోను ఆపాడు. తన ఆటోలోని పువ్వులు అతని ఆటోలు ఉండటాన్ని గమనించిన హరికృష్ణ అతడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఆ ఆటోడ్రైవర్‌ అతడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలో పడిపోయాడు.  వెంటనే చికిత్స కోసం ఎంజీఎం  ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో మృతదేహాన్ని భద్రపర్చారు. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న గీసుకొండ ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. హరికృష్ణపై దాడి చేసి కొట్ట చంపిన ఆటో డ్రైవర్‌ పరారీలో ఉండగా, అతడు ఎవరనే విషయాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement