చలికాలం పొద్దు తగ్గుతుంది. వాతావరణం డల్‌గా మారుతుంది. ఆ దిగులు ఇంటికీ చేరుతుంది. ఇంట్లో వాళ్ల ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. సో.. కాలాన్ని బట్టి దుస్తులే కాదు ఇంటి అలంకరణనూ మార్చాలి.. హుషారురేకెత్తించేలా.. ఇలా..
►చీకటి మూలలను బ్రైట్ చేసేయాలి. అందుకు ఫ్లోర్ ల్యాంప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఉల్లాసం.. ఉత్సాహం కోసం ఇండోర్ మొక్కల అలంకరణ తప్పనిసరి.
► అల్లికలతో ఉన్న బెడ్‌షీట్స్, దిండు కవర్లు శీతాకాలాన్ని బ్రైట్‌గా మార్చేస్తాయి. అలాగే వెచ్చదనం కావాలన్నా.. విలాసంగా కనిపించాలన్నా.. వెల్వెట్ క్లాత్స్, సాఫ్ట్ ఫర్ ఉండే పిల్లోస్ బాగా ఉపయోగపడతాయి.
► సహజమైన కాంతి కోసం.. ఖాళీగా ఉన్న గోడపైన పెద్ద నిలువుటద్దాన్ని వేలాడదీయాలి. ఫ్రేమ్‌కి ఆకట్టుకునే రంగును వేయడం ద్వారా అద్దాన్ని అందంగా మార్చేయవచ్చు. దీని వల్ల ఇల్లు విశాలంగా, కాంతిమతంగానూ కనిపిస్తుంది.
► వింటర్ ఫ్యాషన్‌లాగానే వింటర్ హోమ్ డెకరేటింగ్‌ని ఫాలో అవ్వాల్సిందే. కుర్చీలను స్లిప్ కవర్లతో కవర్ చేయడం ద్వారా డైనింగ్ రూమ్‌కి వెచ్చదనాన్ని తీసుకురావచ్చు.
► విండోస్‌కి మందపాటి కర్టెన్లు వేసి, షీర్ డ్రేపరీలతో భర్తీ చేయవచ్చు. దీని వల్ల ఉష్ణోగ్రతలు పడిపోయినా వెచ్చదనం ఉంటుంది.
► శీతాకాలపు సువాసనల్లో సుగంధ ద్రవ్యాల పాత్ర అమోఘం. ముఖ్యంగా దాల్చిన చెక్క సువాసన వింటర్‌ని ఉత్సాహంగా మారుస్తుంది. సుగంధ పరిమళాల డ్రై ఫ్లవర్ బాస్కెట్‌ని అమర్చుకోవచ్చు. సెంటెడ్ క్యాండిల్స్ కూడా ఉల్లాసంగా ఉంచుతాయి.
Comments
Please login to add a commentAdd a comment