అందమైన రంగులు ఇంటికి అందాన్నిస్తాయనుకుంటాం. కానీ ఒకే ఒక రంగుతో ఇంటిని అద్భుతంగా అలంకరించవచ్చని ‘నీల్’ కాన్సెప్ట్ రుజువు చేస్తోంది. స్వచ్ఛమైన తెలుపుకి లేత నీలంరంగు థీమ్‌తో డిజైన్‌ని చూస్తుంటే నీలి మేఘం నట్టింట్లోకి వచ్చినట్లుంది. ఆకాశంలో మబ్బుల్లో రూపాలను వెతుక్కుంటాం. ఇది నట్టింట్లో ఆవిష్కరించిన కళారూపం. ఇందులో ప్రతి ఒక్కటీ చేత్తో చేసినవే. అచ్చమైన హ్యాండ్ క్రాఫ్టెడ్ హోమ్ డెకరేషన్ అన్నమాట.
బెడ్ స్ప్రెడ్, పిల్లో కవర్, రన్నర్, కార్పెట్, డోర్ మ్యాట్, ల్యాంప్ షేడ్, సోఫా కుషన్‌లు, కవర్‌లతోపాటు డిన్నర్ సెట్ కూడా గౌరంగ్ షా డిజైన్ చేసిన నీల్ థీమ్‌లో ఒదిగి పోయింది. ఇండియన్ టెక్స్‌టైల్స్ అండ్ ఫ్యాషన్ డిజైనర్‌గా జాతీయ అవార్డు గ్రహీత గౌరంగ్ షా ఇంటీరియర్ డెకరేషన్‌లో చేసిన ప్రయోగం ఇది. తన ప్రయోగాన్ని ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇది ‘గౌరంగ్ హోమ్’ అంటూ సగర్వంగా ప్రదర్శించాడు షా. ఇంటి నుంచి మనం ఏం కోరుకుంటున్నామో అది మన ఇంటి డెకరేషన్‌లో ప్రతిబింబిస్తుంది.
వారసత్వ కళల సమ్మేళనం!
లేత నీలం రంగులో అలరిస్తున్న పూలు, ఆకుల్లో కొన్ని జామ్‌దానీ నేతకు ప్రతిరూపాలు. కొన్ని కసౌటీ, చికన్‌కారీలతో సూదిమొన చెక్కిన రూ΄ాలు. మరికొన్ని అచ్చు అద్దిన పూలు. తెల్లటి పింగాణీ మీద విరిసిన నీలాలు ఫ్యాషన్‌తో ΄ోటీ పడుతున్నట్లున్నాయి. జామ్‌దానీ, అజ్రక్, కలంకారీ, చికన్‌కారీ, హ్యాండ్ ప్రింట్‌లతో ఇంటిని అలంకరిస్తే భారతీయ వారసత్వ హస్తకళకు ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకేముంటుంది? కళాకారులకు ఇవ్వగలిగిన ప్రోత్సాహం మరేముంటుంది? ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, నాచురల్ రంగులతో పర్యావరణ హితమైన జీవనశైలికి మరో నిర్వచనం ఇంకెక్కడ దొరుకుతుంది.
Comments
Please login to add a commentAdd a comment