interior
-
‘నీల్’ కాన్సెప్ట్' ఒకే ఒక రంగుతో అద్భుతం ..!
అందమైన రంగులు ఇంటికి అందాన్నిస్తాయనుకుంటాం. కానీ ఒకే ఒక రంగుతో ఇంటిని అద్భుతంగా అలంకరించవచ్చని ‘నీల్’ కాన్సెప్ట్ రుజువు చేస్తోంది. స్వచ్ఛమైన తెలుపుకి లేత నీలంరంగు థీమ్‌తో డిజైన్ని చూస్తుంటే నీలి మేఘం నట్టింట్లోకి వచ్చినట్లుంది. ఆకాశంలో మబ్బుల్లో రూపాలను వెతుక్కుంటాం. ఇది నట్టింట్లో ఆవిష్కరించిన కళారూపం. ఇందులో ప్రతి ఒక్కటీ చేత్తో చేసినవే. అచ్చమైన హ్యాండ్ క్రాఫ్టెడ్ హోమ్ డెకరేషన్ అన్నమాట. బెడ్ స్ప్రెడ్, పిల్లో కవర్, రన్నర్, కార్పెట్, డోర్ మ్యాట్, ల్యాంప్ షేడ్, సోఫా కుషన్లు, కవర్లతోపాటు డిన్నర్ సెట్ కూడా గౌరంగ్ షా డిజైన్ చేసిన నీల్ థీమ్‌లో ఒదిగి పోయింది. ఇండియన్ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాషన్ డిజైనర్‌గా జాతీయ అవార్డు గ్రహీత గౌరంగ్ షా ఇంటీరియర్ డెకరేషన్లో చేసిన ప్రయోగం ఇది. తన ప్రయోగాన్ని ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇది ‘గౌరంగ్ హోమ్’ అంటూ సగర్వంగా ప్రదర్శించాడు షా. ఇంటి నుంచి మనం ఏం కోరుకుంటున్నామో అది మన ఇంటి డెకరేషన్లో ప్రతిబింబిస్తుంది. వారసత్వ కళల సమ్మేళనం! లేత నీలం రంగులో అలరిస్తున్న పూలు, ఆకుల్లో కొన్ని జామ్దానీ నేతకు ప్రతిరూపాలు. కొన్ని కసౌటీ, చికన్కారీలతో సూదిమొన చెక్కిన రూ΄ాలు. మరికొన్ని అచ్చు అద్దిన పూలు. తెల్లటి పింగాణీ మీద విరిసిన నీలాలు ఫ్యాషన్‌తో ΄ోటీ పడుతున్నట్లున్నాయి. జామ్దానీ, అజ్రక్, కలంకారీ, చికన్‌కారీ, హ్యాండ్ ప్రింట్లతో ఇంటిని అలంకరిస్తే భారతీయ వారసత్వ హస్తకళకు ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకేముంటుంది? కళాకారులకు ఇవ్వగలిగిన ప్రోత్సాహం మరేముంటుంది? ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, నాచురల్ రంగులతో పర్యావరణ హితమైన జీవనశైలికి మరో నిర్వచనం ఇంకెక్కడ దొరుకుతుంది. -
ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో ఈ 'పెనా ప్యాలెస్' కూడా..
ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో పెనా ప్యాలెస్ ఒకటి. ఇది పోర్చుగల్ వైభవాన్ని కళ్లకు కడుతుంది. హంగు, ఆర్భాటాలతో ఉండే ఈ ప్యాలెస్‌ను 1838లో కింగ్ ఫెర్డినాండ్ 2 తన వేసవి విడిది కోసం కట్టించాడట. ఇది ప్రష్యన్ వాస్తుశిల్పి ‘లుడ్విగ్ వాన్ ఎష్పెజ్’ ఆలోచనలకు రూపం.ఆ కట్టడం మూరిష్, మాన్యులైన్ వంటి ఎన్నో నిర్మాణ శైలుల సమ్మేళనంతో.. గులాబీ, పసుపు రంగుల్లో ఆకట్టుకుంటుంది. ఇది గోపురాలు, మూరిష్ కీహోల్ గేట్స్, టవర్స్ ఇలా చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇంటీరియర్‌లో విలువైన పింగాణీ, పోర్చుగీస్ శైలి ఫర్నిచర్‌తో కళ్లు తిప్పుకోనివ్వదు.దీన్ని వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తూంటారు. ఆ నిర్మాణం.. ఎత్తైన కొండలపై.. దట్టమైన చెట్ల మధ్య ఉండటంతో ప్రకృతి కూడా ఆ ప్యాలెస్ అందాన్ని రెట్టింపు చేస్తోంది. చుట్టూ పొగమంచు, చల్లని వాతావరణం.. ఆ ప్యాలెస్‌కి అదనపు సొగసులు!ఇవి చదవండి: ప్లాస్టిక్ ట్యూబ్స్ డిస్పెన్సర్ హోల్డర్.. -
ఇంటీరియర్ డిజైనర్‌గా గౌరీ ఖాన్ ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా!
బాలీవుడు సూపర్ స్టార్ షారుఖాన్ భార్య గౌరీ ఖాన్ సక్సెస్ ఫుల్ ఇంటీరియర్ డిజైనర్ తన కెరీర్‌తో దూసుకుపోతున్నారు. ఓ ఇంటీరియర్ డిజైనర్‌గా తన ఇంటినే ఎంత విలావంతంగా తీర్చిదిద్దిందో చూస్తే సృజనాత్మకతకు నిర్వచనం గౌరీ ఖాన్ ఏమో అనిపిస్తుంది. అంతేగాదు ఓ పక్క తన భర్త కెరియర్‌కు తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తూనే మహిళా వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నారు. ఆధునాతన సృజనాత్మక నైపుణ్యానికి ఓ కొత్త అద్దాన్ని ఇచ్చారామె. ఈ సందర్భంగా ఇంటీరియర్ డిజైనర్‌గా తన జర్నీ ఎలా సాగింంది? అందులో తాను ఎదర్కొన్న సవాళ్ల గురించి ఓ ఇంటర్యూలో చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే.. నిజానికి గౌరీ ఖాన్ బీఏ పట్టభద్రురాలే గాక ఫ్యాషన్ డిజైన్ కోర్సు కూడా చేశారు. ఇక ఆమె తండ్రిది గార్మెంట్ వ్యాపారం కావడంతో టైలరింగ్‌లో కూడా కొంత ప్రావిణ్యం ఉంది. అయితే ఈ అర్హతల కారణంగా ఇంటీరియర్ డిజైనర్ రంగంలోకి ప్రవేశించలేదు. ముంబైలో ఐకానిక్‌గా. మంచి పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన షారుఖ్-గౌరీ ఖాన్ల ఇల్లు 'మన్నాత్' బంగ్లా అత్యద్భుతంగా ఉంటుంది. అయితే దీన్ని నిర్మించి ఏళ్లు కావొస్తుండటంతో అత్యంత సుందరంగా పునర్నిర్మించాలనుకున్నారు ఫారుఖ్. ఆ తరుణంలోనే గౌరీఖాన్‌కి ఇంటీరియర్ డిజైనర్ రంగంపై మక్కువ ఏర్పడింది. అంతేగాదు ఈ ఇంటిని అత్యంత సుందరంగా మలచడం కోసం ప్రముఖ ఆర్కిటెక్చర్లతో కలిసి పనిచేసింది కూడా. అలా ఆమె తనకు తెలియకుండానే ఇంటీరియర్ డిజైనర్‌గా మారారు. పైగా తమ విలాసవంతమైన బంగ్లా మన్నాత్ని ఎంతం అందంగా తీర్చిదిద్దిందంటో అదోక అద్భుతమైన ప్యాలెస్ అన్నంత రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం ఆ ఇంటి విలువ ఏకంగా రూ. 200 కోట్లు. అలా గౌరీ ఖాన్ తన ఇంటిని సర్వాంగాసుందరంగా మార్చే క్రమంలో ఇంటీరియర్ డిజైనర్‌గా మారారు గౌరీ. ఆ తర్వాత ఆ రంగాన్నే వృత్తిగా ఎంచుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. ఈ రంగంలో మరింత మెళ్లుకవలను నేర్చుకుని తన నైపుణ్యానికి మరింత పదునుపెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో 2013లో ముంబైలో గౌరీ ఖాన్ డిజైన్స్ పేరుతో డిజైన్ స్టూడియోని ఏర్పాటు చేసింది. ఇక అక్కడ నుంచి పలు విభిన్న ప్రాజెక్టులను టేకప్ చేసింది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతోంది గౌరీ ఖాన్. ఈ నేపథ్యంలో ఎందరో ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్లతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. అయితే తాను ఓ ఇంటీరియర్ డిజైనర్‌గా తన సంస్థను ప్రమోట్ చేసుకుంటూ ఈ వ్యాపారంలో తనకంటూ ఓ సముచిత స్థానాన్ని ఏర్పరచుకునేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని అంటోంది. అంతేగాదు ముఖేష్ అంబానీ , రాబర్టో కావల్లి రాల్ఫ్ లారెన్ వంటి ప్రముఖుల ఇళ్లకు ఇంటిరీయర్ డిజైనర్‌గా పని చేశారు. తాను ఓ స్టార్ భార్యను కాబట్టి ఈ రంగంలో సులభంగా విజయం వచ్చేస్తుంది అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పంటారు గౌరీ ఖాన్. ఎవ్వరైన ఓ వ్యాపారం చేసేటప్పడు జస్ట్ సపోర్ట్ ఇస్తారు ఇక అక్కడ నుంచి ఎవరికీ వారే స్వయంగా వ్యాపారాన్ని నడిపుంచుకుని, విజయం దక్కించుకోవాల్సిందే అంటున్నారు గౌరీ. దేనికైనా అత్యంత ఓపికతో కూడిన నేర్పు ఉంటేనే సాధ్యమని చెబుతోంది. ఈ రంగంలో తాను ఎదుర్కొన్నఇబ్బందిని, సవాళ్లని ఓ పాఠంగా తీసుకుని ముందుకు వెళ్లేదానిని, అందువల్లే ఇంటీరియర్ డిజైనర్ ఎంట్రప్రెన్యూర్‌గా సక్సెస్ అయ్యానని అన్నారామె. ఇక ఆమె ఇంటరీయర్ డిజైనర్‌గా టేకప్ చేసిన ప్రాజెక్టులకు ఎంత ఛార్జ్ చేస్తుందంటే సుమారు రూ. 6 లక్షలు నుంచి మొదలవ్వుతుందట. ఆమె ఇంటీరియర్ డిజైన్స్ నెట్ వర్తే దాదాపు రూ. 200 కోట్లు పైనే ఉంటుందట. దీంతోపాటు ఆమె 2014లో డిజైన్ సెల్ అనే పేరుతో కాన్సెప్ట్ స్టోర్‌ని కూడా ప్రారంభించింది. ఇందులో గౌరీనే స్వయంగా తీర్చిదిద్దినా ఫర్నీచర్ డిజైన్లు ఉంటాయి. అంతేగాదు పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన మైసన్ ఎట్ ఆబ్జెట్ షోలో తన ఫర్నిచర్ డిజైన్లను ప్రదర్శించడానికి ఆహ్వానం సైతం దక్కించుకుంది. అలాగే ఫార్చ్యూన్ మ్యాగజైన్ 50 అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఆమె కూడా ఒకరిగా నిలవడం విశేషం సెలబ్రెటీ హోదా కంటే ప్రత్యేక గుర్తింపు మిన్న.. ఇక్కడ షారుఖ్ స్టారడమ్ అతడి భార్యగా ఆమెకు ఉంటుంది. అలాగా ఆమె షారుఖ్ సినిమాలను నిర్మిస్తూ చిత్ర నిర్మాతగా కూడా మారింది. అయినా మహిళ సాధికారత అనే పదానికి అర్థమిచ్చేలా తనకంటూ ఓ గుర్తింపు కావాలనుకుంది. అందుకోసం నచ్చిన రంగాన్ని ఎంచుకుంది. అది మొదటగా తన ఇంటి డిజైన్ నుంచి ప్రారంభంచి.. ప్రముఖులు ఇళ్లు డిజైన్ చేసే స్థాయికి చేరుకుంది. తన సంస్థకు గౌరీ ఖాన్ అనే బ్రాండ్ నేమ్ దక్కించుకుని సక్సెఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా దూసుకుపోయింది. ఏ మహిళైనా సరే పెళ్లి, పిల్లలు కారణంతో కెరీర్‌ను ఆపేయాల్సిన పనిలేదని నిరూపించింది. అంతేగాదు పిల్లలు ఎదిగిపోయి మనం అవసరం లేదనుకున్న తరుణంలో మళ్లీ మన కెరీర్లో లేదా మనకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు యత్నించి, మనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకోగలమని ప్రూవ్ చేశారు గౌరీ ఖాన్. (చదవండి: 'నారీ శక్తి'.. 'నారీ శక్తీ' అంటారుగా! చేతల్లో చూపండి!) -
గోద్రెజ్ ఇంటీరియో స్టోర్‌ను ప్రారంభించిన హీరో కార్తికేయ
-
లక్షల్లో డబ్బు ఖర్చు అవుతున్నా..ఇంటీరియర్ డిజైన్లతో నయా ట్రెండ్
జ్యోతినగర్: ఇంటికి అందం ఇంటీరియర్ డెకరేషన్. ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఓ కల. ఆ ఇంటిని తమకు నచ్చేలా అందంగా తీర్చిదిద్దుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకునే వారు అందరిని ఆకట్టుకునేలా ఉండేలా డిజైన్ చేయించుకుంటారు. ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఇంటీరియర్ డిజైనింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇందుకు లక్షల్లో డబ్బు ఖర్చు అవుతున్నా వెనకాడడం లేదు. దీనికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో వివిధ రకాల ఇంటీరియర్ డిజైన్లతో నయా ట్రెండ్ కొనసాగుతుంది. ప్రతిఒక్కరూ స్థాయికి తగ్గట్టు ఇంటీరియర్ డెకరేషన్, సీలింగ్‌ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. గతంలో స్టార్ హోటళ్లు, పెద్ద దుకాణాలకు మాత్రమే పరిమితమయ్యే ఈ డిజైన్లు ప్రస్తుతం కొత్త ఇంటి నిర్మాణాలకు కూడా వ్యాపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాగా మారడం రియల్ ఎస్టేట్ వ్యాపారం అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖ పట్టడంతో కొత్త గృహ నిర్మాణాలకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గుర్తించిన కొందరు వ్యాపారులు పీవోపీతో వివిధ డిజైన్లలో గదులను తీర్చిదిద్దే కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. డెకరేషన్‌పై ఆసక్తి..వివిధ డిజైన్లతో ఇంటికి కొత్త కళ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో వివిధరకాల డిజైన్లతో సీలింగ్‌లను, ఇతర పనులను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో దగ్గర ఉండి పనులు చేయించుకుంటున్నారు. యజమానులు, నిపుణుల ద్వారా ఈ డిజైన్లను తయారు చేయించి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పీవోపీ, జిప్సం బోర్డులు, లైటింగ్, వాల్ పేయింట్స్, టెక్షర్ వాల్ పేపర్లు, ఫర్నిచర్, ఉడ్ వర్క్‌పై లామినేట్స్‌తో కంటికి అందంగా ఉండేలా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రస్తుతం డిజైన్లను బట్టి స్క్వేర్ ఫీట్ (మెటీరియల్, లేబర్చార్జి)కు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ధర వేస్తున్నారు. ఇంటిని బట్టి కేవలం ఇంటీరియర్ కోసమే సుమారు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు వెచ్చిస్తున్నారంటే ఇంటీరియర్ ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతోంది. ఇంటీరియర్‌పై ఆసక్తి గతంలో చాలామంది కొత్త ఇళ్లు నిర్మించుకునే వారు ఎక్స్టీరియర్పై ఆసక్తి చూపేవారు. కానీ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, రామగుండం, సుల్తానాబాద్ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకునేవారు ఇంటీరియర్ డిజైన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. డిజైన్లకు కూడా చాలా డిమాండ్ ఉంది. ఇంటి యజమానుల, అభిరుచికి తగ్గట్లు విభిన్నంగా సీలింగ్ డిజైన్లు, ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నాం. పీవోపీ ద్వారా చేసే డిజైన్లతో విద్యుత్ దీపాల వెలుగులో మరింత అందంగా కనిపిస్తుంది. –ఆర్.సాయితేజ, ఇంటీరియర్ డిజైనర్ జిల్లాలో ఆర్డర్లు వస్తున్నాయ్ అందరూ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో చాలా ఆర్డర్లు వస్తున్నాయి. ఇంటి యజమానులు కోరుకున్న రీతిలో వారికి డిజైన్చేసి చూపించిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. హైదరాబాద్‌లో ఎక్కువ ఇంటీరియర్ డిజైన్లు చేయించుకునే వారు. కానీ నేడు పెద్దపల్లి జిల్లాలో చాలామంది కొత్త ఇంటిని నిర్మించుకునే వారు ఇంటీరియర్ డిజైన్లను కోరుకుంటున్నారు. ఇంటి యజమాని కోరుకున్న రీతిలో డిజైన్ చేసి అందంగా ఇంటిని ముస్తాబు చేస్తాం. –ఎం.అక్షయ్‌కుమార్, ఇంటీరియర్ డిజైనర్ -
పొందికగా సొంతిల్లు
సాక్షి, హైదరాబాద్: మెట్రో నగరాల్లో విశాలమైన విస్తీర్ణాల్లోని ఇల్లు కొనాలంటే మధ్య తరగతివాసులకు కష్టమే. చిన్న ఫ్లాట్లనూ కొనుగోలు చేసినా సరే.. కాస్త పొందికగా ఇంటీరియర్‌ను అమర్చుకుంటే చాలు! ఇల్లు విశాలంగా కనిపిస్తుంది. ఇల్లు విశాలంగా కనిపించాలంటే ఇంట్లో అమర్చే ఫర్నీచర్ పొందికగా ఉండాలి. అలాగే ఆ ఫర్నీచర్ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి స్పేస్ సేవింగ్ ఫర్నీచర్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. రబ్బర్ ఉడ్‌తో తయారు చేసే స్పేస్ సేవింగ్ ఫర్నీచర్‌కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇది వాటర్ ప్రూఫ్, స్క్రాచ్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్. అలాగే ఈ ఫర్నీచర్‌ను విడి భాగాలుగా విడదీసి తిరిగి బిగించుకునే వీలుంటుంది. ఇలా రెండు మూడు సార్లు విప్పదీసి బిగించుకున్నా చెక్కుచెదరదు. ఈ ఫర్నీచర్‌కు కంపెనీలు వారంటీని సైతం అందిస్తున్నాయి. వంటగది వంటగది లేదా లివింగ్ రూమ్‌లో సెరామిక్ లేదా గ్లాస్‌వేర్‌ను అలంకరిం టానికి వాల్ క్యాబినెట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గోడకు ఆనించే వీలున్న ఈ స్పేస్ సేవింగ్ వాల్ క్యాబినెట్స్‌లో క్రాకరీ డిస్ప్లేకు వీలుగా గ్లాస్ షెల్ఫ్, ఇతర వస్తువుల కోసం సొరుగులుంటాయి. ఈ వాల్ క్యాబినెట్ టేబుల్‌గా కూడా ఉపయోగపడుతుంది. లివింగ్ రూమ్‌లోనైతే దీని మీద ఫొటో ఫ్రేములు, ఫ్లవర్ వాజులుంచుకోవచ్చు. డ్రెస్సింగ్ అద్దం ఇంట్లోని మొత్తం ఫర్నీ చర్లో డ్రెసింగ్ మిర్రర్ది ప్రత్యేక స్థానం. కాబట్టి ఇల్లు ఎంత చిన్నదైనా డ్రెస్సింగ్ మిర్రర్ కొనకుండా ఉండలేం. అయితే దాని వల్ల ఇల్లు ఇరుకుగా మారకుండా ఉండేలా చూసుకుంటే అవసరంలో పాటు ముచ్చటా తీరుతుంది. ఇందుకోసం స్థలం కలిసొచ్చేలా గోడకు ఫిక్స్ చేసేలా వీలుండే డ్రెస్సింగ్ మిర్రర్‌ను ఎంచుకోవాలి. ఇలాంటి మినీ మలిస్టిక్ డ్రెస్సింగ్ మిర్రర్‌ను ఎంచుకుంటే అద్దాన్ని విడిగా గోడకు బిగించి దానికింద సొరుగులున్న టేబుల్‌ను ఉంచి వాడుకోవచ్చు. డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కోసం ఇంట్లో డైనింగ్ ఏరియా తప్పనిసరేం కాదు. ఇల్లు ఇరుకవుతుందనే భయం లేకుండా తక్కువ స్థలంలో ఇమిడిపోయే కోజీ డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం 3 నుంచి నాలుగడుగుల వైశాల్యాన్ని మాత్రమే ఆక్రమించే నాలుగు కుర్చీల డైనింగ్ టేబుల్‌ను ఎంచుకుంటే ఇల్లు ఇరుగ్గా మారదు. డెకరేషన్ గోడవారగా వేసుకునే సైడ్ టేబుల్స్ వేర్వేరు అవసరాల కోసం ఉప యోగించుకోవచ్చు. డ్రాలు, షెల్ఫ్ లు కలిసి ఉండే ఈ సైడ్ టేబుల్‌ను పుస్తకాలు, అరు దుగా ఉపయోగించే ఇతర వస్తువుల కోసం విని యోగించుకోవచ్చు. ఈ టేబుల్ బోసిగా కనిపించకుండా పెద్దవిగా ఉండే డెకరేటివ్ ఐటమ్స్ ను అమర్చుకోవచ్చు. -
వావ్.. వంటిల్లు!
సాక్షి, హైదరాబాద్: నగరానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈఐపీఎల్.. మాడ్యులర్ కిచెన్, ఫర్నిచర్ విభాగంలోకి అడుగుపెట్టింది. గచ్చిబౌలిలో ది ప్లాటిన మాల్లో కొంటర్నో పేరిట లగ్జరీ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఈఐపీఎల్ (ఇంటీరియర్ సొల్యూషన్స్) సీఓఓ అశిత పర్మార్ ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ఇటలీకి చెందిన ప్రముఖ కిచెన్ బ్రాండ్స్ డైమొకుసినో, డల్లాగ్నీసీలతో పాటూ ఈఐపీఎల్‌కు చెందిన ఫ్లాగ్షిప్ బ్రాండ్ కొంటొర్నో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్టోర్‌లో నివాస, వాణిజ్య, కార్యాలయాల విభాగాలకు చెందిన అన్ని రకాల ఫర్నీచర్స్తో పాటూ కిచెన్ యూనిట్స్, వార్డ్రోబ్స్, టీవీ సెట్స్, బెడ్, లివింగ్ రూమ్ ఫర్నిచర్ వంటి పూర్తి స్థాయి ఇంటీరియర్ సొల్యూషన్స్ అందుబాటులో ఉంటాయి. నాణ్యత, మన్నికే ప్రత్యేకత: హైదరాబాద్‌లోని గండిపేటలో కొంటొర్నో తయారీ కేంద్రం ఉంది. దీని ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 100 మాడ్యుల్స్. నాణ్యత, మన్నికే మా ప్రత్యేకత. ఇప్పటివరకు వెయ్యికి పైగా ప్రాజెక్ట్‌లు, హైదరాబాద్‌లో 50 వరకు నివాస ప్రాజెక్ట్‌లకు ఇంటీరియర్ డిజైన్స్ అందించాం. ప్రస్తుతం 70కి పైగా ప్రాజెక్ట్ ఆర్డర్లున్నాయి. యూరోపియన్ తయారీ యూనిట్లపై అభివృద్ధి చేస్తున్న ఈ కొంటొర్నో ఉత్పత్తులు అంతర్జాతీయ డిజైన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటమే కాకుండా స్థానిక వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటాయని ఆమె తెలిపారు. 3–4 రోజుల్లో ఏర్పాటు: కస్టమర్ల అవసరాలను బట్టి ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, ఫాల్స్ సీలింగ్ వంటివి కూడా చేసిస్తాం. ఎందుకంటే ఇంటీరియర్ డిజైన్స్ అనుగుణంగా వీటిని రూపొందించే వీలుంటుంది. కస్టమర్ల బడ్జెట్‌ను బట్టి ఇంటీరియర్ డిజైన్స్ ఉంటాయి. బాలీవుడ్ తారలతో పాటూ పలువురు రాజకీయ ప్రముఖులూ మా కస్టమర్లుగా ఉన్నారు. ఇటాలియన్ బ్రాండ్స్ డెలివరీకి 4 నెలలు, కొంటొర్నో డెలివరీకి 6–8 వారాల సమయం పడుతుంది. 3–4 పని దినాల్లో ఇన్స్టలేషన్ పూర్తవుతుంది. మరిన్ని వివరాలకు ashitaparmar@eiplgroup.com సంప్రదించవచ్చు. నగరంలో డైమొకుసినో ఇటలీ నుంచి కిచెన్ బ్రాండ్ డైమొకిచినో, ఫర్నీచర్ బ్రాండ్ డల్లాగ్నిసీలను దిగుమతి చేసుకునే ఏకైక స్టోర్ మాదేనని ఆమె తెలిపారు. గ్లాస్, మెటల్‌తో రూపొందించే ఈ ఉత్పత్తులు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. ఫైర్, వాటర్ ప్రూఫ్‌ను కలిగి ఉంటాయి. ఇతర అంతర్జాతీయ బ్రాండ్లతో పోలిస్తే వీటి నిర్వహణ చాలా సులువని ఆమె తెలిపారు. -
అవసరమైతే ‘హద్దు’ దాటుతాం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: దేశ సమైక్యతను కాపాడుకునేందుకు.. అవసరమైతే భద్రతా దళాలు నియంత్రణ రేఖను దాటి ముందుకు వెళ్తాయని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు. పాక్ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా కశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేయలేదన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమిట్‌లో ఆయన ప్రసంగించారు. ‘భారత్‌ను అంతర్గతంగా భద్రంగా ఉంచుకుంటాం. అంతేకాదు అవసరమైతే.. దేశాన్ని రక్షించుకునేందుకు సరిహద్దులు దాటి ముందుకు వెళ్తాం’ అని వ్యాఖ్యానించారు. -
కొంటే ఏముంది? రెంటే బాగుంది!!
కొనుక్కునే బదులు అద్దెకు తీసుకుంటే మేలు గృహోపకరణాల నుంచి వ్యవసాయ పరికరాలు అందుబాటులో దుస్తులు, పుస్తకాలు, ఆభరణాలు, వాహనాలు, ఫర్నిచర్, బొమ్మలు అద్దెకు అవసరం తీరుతుంది; ఖర్చు ఆదా అవుతుంది తరచూ కొత్తవి మార్చుకోవచ్చు కూడా.. దేశంలో రూ.10,200 కోట్లకు చేరిన అద్దె విపణి ఉద్యోగాల బదిలీ, ప్రీమియం ఉత్పత్తులపై కోరికే వృద్ధికి కారణం: విశ్లేషకులు రమేష్, సునీత భార్యాభర్తలు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ నెల్లో దాదాపు నాలుగు ఫంక్షన్లకు అటెండ్ అవ్వాలి. అన్నీ దాదాపు బంధువులవే. ఇంట్లో బ్రాండెడ్ నుంచి డిజైనర్ దుస్తులదాకా చాలానే ఉన్నా... అన్నీ ఒకసారైనా వేసుకున్నవి కావటంతో ఫంక్షన్లకు కొత్తవి కొనాల్సిందే అనుకున్నారు. కానీ నాలుగు ఫంక్షన్లకీ కొత్తవి కొనాలంటే..? అమ్మో!! అనుకున్నారు. ఇంతలో రమేష్ స్నేహితుడు శేఖర్ వచ్చాడు. వీళ్ల సమస్య విని... ‘‘మంచి డిజైనర్ వేర్‌ను అద్దెకు తీసుకోవచ్చు కదా?’’ అంటూ సలహా ఇచ్చాడు. ‘‘నిజమా!! కార్లు, బైకులు అద్దెకిస్తారని తెలుసు కానీ... దుస్తులు కూడా ఇస్తారా?’’ అంటూ ఆశ్చర్యపోయాడు రమేష్. ‘‘అవేకాదు. జ్యుయలరీ, ఫర్నిచర్, బొమ్మలు... ఆఖరికి మీరో ఆఫీసు పెట్టి పది రోజులకు ఉద్యోగులు కావాలంటే కూడా పంపిస్తారు’’ అని వివరించాడు శేఖర్. ఇకనేం!! రమేష్, సునీత సమస్యకు పరిష్కారం దొరికింది. మీకూ ఆ పరిష్కారం కావాలా? దుస్తులు, ఆభరణాలు, వంటింటి సామగ్రి... ఇలా కావాల్సిన వస్తువులన్నీ ఎంచక్కా అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ప్రత్యేక కథనం.. అద్దెకు వస్తువులు తీసుకోవటమంటే ఒకప్పుడు ఇల్లు మాత్రమే. తరవాత కార్లు, బైకులు అద్దె వ్యాపారంలోకి వచ్చాయి. కానీ ఇపుడు వంటింట్లోని సామగ్రి నుంచి వ్యవసాయ పరికరాల వరకూ అన్నీ అద్దె మార్కెట్లోకి వచ్చేశాయి. దీన్నే కాస్త స్టైల్‌గా ‘షేరింగ్ ఎకానమీ’ అని పిలుస్తూ అంతా షేరింగ్ బాట పడుతున్నారు. కొత్త కొత్త వ్యాపారాలకు దారులు తెరుస్తున్నారు. నిజానికి ఈ రెంటల్ వ్యాపారంలో కస్టమర్ ఒక వస్తువును అద్దెకు తీసుకుని... దాన్ని వినియోగించుకున్నాక తిరిగి కంపెనీకి ఇచ్చేస్తాడు. కంపెనీ దాన్ని రీఫర్బిష్ చేసి తిరిగి కొత్తదానిలా మారుస్తుంది. అద్దెకు సిద్ధం చేస్తుంది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను అద్దెకివ్వటానికి మూడు మార్గాల్ని అనుసరిస్తున్నాయి. అవి... కొన్ని సంస్థలు ముందుగా ఉత్పత్తులను కొనేసి... వాటిని తమ వెబ్సైట్లో లిస్ట్ చేసి కస్టమర్లకు అద్దెకిస్తున్నాయి. ఫర్నీచర్, గృహోపకరణాలు, ఇంటీరియర్ ఈ విభాగంలో ఈ ధోరణి ఎక్కువ. కానీ ఈ వ్యాపారానికి కొంత పెట్టుబడి కావాలి. వస్తువుల తయారీ సంస్థలు, వెండర్లు, వ్యక్తులు ఇతరత్రా మార్గాల ద్వారా అగ్రిమెంట్, లీజు మీద ఆయా సంస్థలు ఉత్పత్తులను సమీకరిస్తాయి. వాటిని తమ వెబ్సైట్లలో పెట్టి అద్దెకిస్తున్నాయి. బైకులు, కార్ల వంటివి ఈ విభాగంలో ఎక్కువ. ఈ వ్యాపారానికి మొదటి రకం మాదిరి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. చాలామంది తమ దగ్గరున్న, అప్పటికి అవసరం లేని వస్తువులను ఇతరులకు అద్దెకివ్వాలనుకుంటారు. అలాంటి వారు ఉపయోగించుకోవటానికి రెంటల్ వెబ్‌సైట్లున్నాయి. ఒకరకంగా రెంటల్ అగ్రిగేటర్లన్న మాట. వారు ఈ వెబ్సైట్లలో తమ ఉత్పత్తులను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అవసరమున్న కస్టమర్ నేరుగా వస్తువు యజమానిని సంప్రదించి అద్దెకు తీసుకుంటాడు. ఈ వ్యాపారంలో వస్తువుల నాణ్యత, బాధ్యత విషయంలో సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. దుస్తులు: 3 గంటల నుంచి 3 రోజుల వరకూ దుస్తుల విషయానికొచ్చేసరికి ఫ్లైరోబ్, స్విష్‌లిస్ట్, వ్రాప్డ్, లైబ్ రెంట్, క్లోజీ, ది క్లాతింగ్ రెంటల్, ది సైటల్ డోర్, స్టేజ్3 వంటి సంస్థలు ఆన్లైన్ లో అద్దెకిస్తున్నాయి. సంప్రదాయ దుస్తుల నుంచి డిజైనర్ వేర్స్ వరకూ అన్నింటినీ వీటి సాయంతో అద్దెకు తీసుకునే వీలుంది. పిల్లలు, మహిళలు, పురుషులు... ఇలా అన్ని విభాగాల్లోనూ ఇవి దుస్తులను అద్దెకిస్తున్నాయి. అద్దె గరిష్టంగా 3 గంటల నుంచి 3 రోజుల వరకు తీసుకునే వీలుంది. ఎఫ్‌సీయూకే, ఫరెవర్ న్యూ, అసూస్, మ్యాంగో, క్విర్క్బాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్లు చాలానే ఉన్నాయి. రీతు కుమార్, మసాబా గుప్తా, సమ్మంత్ చౌహాన్, సెహ్లాఖాన్, సురేంద్రి వంటి ప్రముఖ డిజైనర్స్ కలెక్షన్స్ కూడా వీటిలో దొరుకుతున్నాయి. అయితే హైస్ట్రీట్ బ్రాండ్లకు మాత్రం ఎలాంటి ముందస్తు డిపాజిట్ అవసరం లేదు. డిజైనర్ దుస్తులకైతే 20 శాతం సొమ్మును డిపాజిట్‌గా ముందు చెల్లించాల్సి ఉంటుంది. ఫర్నిచర్: ఫ్రీ డెలివరీ, పికప్ ఫర్నిచర్‌ను అద్దెకివ్వటానికి ఫ్యూర్లెన్కో, రెన్టొమొజో, గ్యారెంటెడ్, రెంటల్వాలా తదితర సంస్థలున్నాయి. తరచుగా ఉద్యోగ బదిలీ కారణంగా మారిన ప్రతి చోటా కొత్త ఫర్నిచర్ కొనుక్కోవటమంటే చాలా కష్టం. పోనీ అప్పటికే ఉన్న ఫర్నిచర్‌ను మారిన చోటికి తీసుకెళదామంటే రవాణా ఖర్చులు మామూలుగా ఉండవు. వాటి బదులు కొత్తవి కొనుక్కోవటమే బెటరనిపిస్తుంది. ఫర్నిచర్ రెంటల్ కంపెనీలకు ఊపిరి పోసింది ఈ అంశమే. అయితే ఈ సంస్థలు ఫర్నీచర్‌తో పాటూ హోం అప్లయెన్సెస్, గేమింగ్, కెమెరా, వైఫై, స్మార్ట్ డోర్ లాక్స్ వంటి ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువునూ అద్దెకిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ ఉచితంగా డెలివరీ, పికప్ సర్వీసులను అందిస్తున్నాయి. వీటిని ఎన్నాళ్లయినా అద్దెకు వాడుకోవచ్చు. కాకపోతే కాలం పెరుగుతున్న కొద్దీ అద్దె కూడా పెరుగుతుంది. అదీ కథ. బొమ్మలు: మెట్రోల్లోనే ఎక్కువ పిల్లల కోసం ఆడుకునే బొమ్మలు ఒకసారి కొంటాం. నాలుగైదు సార్లు ఆడగానే... అది బోర్‌కొట్టి కొత్త బొమ్మ కావాలంటారు వాళ్లు. మరి పాత బొమ్మ సంగతో? అందుకే ఫన్ స్టేషన్, కిలోనేవాలా, రెంట్టాయ్స్, టాయ్ఎక్స్ప్రెస్, ఫ్రెండ్లీటాయ్స్ వంటి సంస్థలు బొమ్మలు అద్దెకిస్తున్నాయి. చాలా కంపెనీల సేవలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, అహ్మదాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమయ్యాయి. ఎందుకంటే మెట్రో నగరాలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో బొమ్మల వినియోగం తక్కువని, నాణ్యత కాసింత తక్కువని ఫన్ స్టేషన్ ఫౌండర్ కశ్యప్ షా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. బొమ్మల అద్దెలు వారం రోజుల నుంచి నెల, ఏడాది వారీగా ప్యాకేజీలుంటాయి. 2014లో ప్రారంభమైన ఫన్స్టేషన్లో 500 మంది రిజిస్టర్ యూజర్లున్నారని.. 400 లెగో సెట్స్ అద్దెకిచ్చామని ఆయన తెలియజేవారు. వ్యవ‘సాయం’: అవసరమైతేనే ట్రాక్టర్ మిగతా ఆన్ లైన్ రెంటల్ కంపెనీలతో పోలిస్తే మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కాస్త డిఫరెంటేనని చెప్పాలి. ఎందుకంటే ఇది ట్రింగో పేరిట సరికొత్త వ్యాపారానికి తెరతీసింది. ఓలా, ఉబెర్ సంస్థలు ఎలాగైతే కార్లను అద్దెకిస్తున్నాయో అదే తరహాలో ట్రింగో వేదికగా ట్రాక్టర్లను, వ్యవసాయ పరికరాలను అద్దెకు తీసుకోవచ్చన్నమాట. ‘‘మనది వ్యవసాయ ఆధారిత దేశం. 80శాతం మంది రైతులకు ట్రాక్టర్లు కొనాలనే కోరిక ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించట్లేదు. దీంతో చాలా మంది రైతులు పశువుల మీద ఆధారపడి పొలాన్ని దున్నిస్తున్నారు. చాలా సమయం వృథా అవుతోంది. దీనికి పరిష్కారం చూపించేందుకే గతేడాది రూ.10 కోట్ల పెట్టుబడితో ట్రింగోను ప్రారంభించాం’’ అని సంస్థ సీఈఓ అరవింద్ కుమార్ చెప్పారు. 3 వేల మంది రైతుల వినియోగం.. ట్రింగో ఫిజికల్, డిజిటల్ ఇలా రెండు విధాలుగా పనిచేస్తుంది. ఫిజికల్ విధానంలో.. ఫ్రాంచైజీ సెంటర్లుంటాయి. ఈ స్టోర్లలో ట్రాక్టర్లు, పరికరాలు ఉంటాయి. వీటిని ఎలా వినియోగించాలో శిక్షణ ఇచ్చేందుకు నిపుణులూ అందుబాటులో ఉంటారు. డిజిటల్ విధానంలో కాల్ సెంటర్, యాప్ ద్వారా సేవలను పొందవచ్చు. ప్రస్తుతం ట్రింగో కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 13 సెంటర్ల ద్వారా సేవలందిస్తుంది. సుమారు 3 వేల మంది రైతులు వినియోగించుకున్నారు. త్వరలోనే రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ట్రింగో సేవలను ప్రారంభించనున్నట్లు అరవింద్ తెలిపారు. బుక్స్: ఆధునిక టెక్నాలజీతో ‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. మంచి పుస్తకం కొనుక్కో’ అనేది ఒకనాటి మాట. రెంటల్ కంపెనీలిపుడు ‘పుస్తకం కొనుక్కోవడమెందుకు అద్దెకు తీసుకో’ అని దీన్ని మార్చేశాయి. దేశంలో ఇండియారీడ్స్, డోర్‌స్టెప్స్ బుక్స్, లైబ్రరీవాలా, ఐరెంట్ షేర్, జస్ట్బుక్స్ వంటి పలు సంస్థలు పుస్తకాలను అద్దెకిస్తున్నాయి. ఇందులో క్రీడ, ఆధ్యాత్మిక, సామాజిక, కాల్పనిక, సాహిత్యం, టెక్నాలజీ ఇలా అన్ని పుస్తకాలూ అందించటం వీటి ప్రత్యేకత. బెంగళూరు ఐఐఎంలో ఏర్పాౖటెన జస్ట్ బుక్స్ హైదరాబాద్‌లో కూడా పలు బ్రాంచిలు ఏర్పాటు చేసింది. అద్దెకు తీసుకెళ్లిన బుక్స్‌ను గుర్తించడానికి బార్ కోడ్ రీడర్ల వంటి టెక్నాలజీని కూడా ఇది ఉపయోగిస్తోంది. ఆభరణాలు: వారమైతే ఓకే! ఈవ్స్ 24, రెంట్ జ్యుయలరీ, లక్సీపిక్, రెంటల్వాలా, ఫ్లైరోబ్ వంటి సంస్థలు బంగారు, వజ్రాల ఆభరణాలతో ఇమిటేషన్ జ్యుయలరీని అద్దెకు ఇస్తున్నాయి. ఒక రోజు నుంచి 7 రోజుల వరకు అద్దెకు తీసుకోవచ్చు. ముందుగా కస్టమర్ ఆయా సంస్థల కేవైసీని పూర్తి చేసి సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. నెల, ఏడాది వారీగా ప్యాకేజీలుంటాయి. ఈవ్స్24 వంటి కొన్ని సంస్థలైతే అద్దెతో పాటూ కస్టమర్లు కావాలంటే ఆయా నగలను నెలసరి వాయిదా పద్ధతుల్లో విక్రయిస్తాయి కూడా. ఒకసారి కస్టమర్ ఆభరణాలను వినియోగించుకొని తిరిగి ఇచ్చేశాక ఆయా నగలను శుద్ధి చేసి తిరిగి అద్దెకు రెడీగా ఉంచుతారని ఈ పరిశ్రమలోని వర్గాలు పేర్కొన్నాయి. కార్లు, బైకులు, సైకిళ్లు: దూసుకుపో.. సొంత కారైతే నెలవారీ ఈఎంఐ, నిర్వహణ, బీమా వంటివి ఉంటాయి. ఏటా కారు విలువ కూడా తగ్గిపోతుంటుంది. అదే అద్దె కారైతే నచ్చిన కారులో షికారు చేయొచ్చు. ఇదే సెల్ఫ్ డ్రైవ్ కారు పరిశ్రమకు ఊతమిస్తుందనేది రేవ్ కో–ఫౌండర్ కరణ్ జైన్ మాట. ప్రస్తుతం దేశంలో మైల్స్, జూమ్‌కార్, కార్ క్లబ్, మైకార్, ఆటో రైడర్స్, ఈకో, రెంట్ ఏ కార్, లెట్ మి డ్రైవ్, జస్ట్ రైడ్, రేవ్, ఓలర్, డ్రివెన్ వంటి సంస్థలు బైకులు, కార్లు, సైకిళ్లను అద్దెకిస్తున్నాయి. నానో నుంచి మొదలుపెడితే స్విఫ్ట్, హోండా, ఆడి, ఫోర్డ్, బెంజ్, ఫార్చునర్, డస్టర్ వాహనాలన్నీ అద్దెకు తీసుకోవచ్చు. ధరలు రోజుకు సెడన్ వాహనాలైతే రూ.2,000–2,500, ఎస్యూవీ రూ.3,000–4,000 వరకున్నాయి. 25 ఏళ్ల వయస్సు, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉన్నవారే కారు అద్దెకు తీసుకోవటానికి అర్హులు. వీల్స్ట్రీట్లో బైక్స్.. గేర్, గేర్‌లెస్ ద్విచక్ర వాహనాలను మాత్రమే అద్దెకివ్వటం వీల్‌స్ట్రీట్ ప్రత్యేకత. అపాచి, షైన్, యాక్టివా, జూపిటర్, కరిజ్మా, ట్రయంప్, యమహా, హార్లే డేవిడ్సన్ , సుజుకీ హయాబుసా, నింజా, హ్యోసంగ్ వంటి 50కి పైగా సూపర్ బైక్స్ ఉన్నాయి. బైకు అద్దె రోజుకు ప్రారంభ ధర రూ.300. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, పుణె, ముంబై నగరాల్లో సేవలందిస్తున్నామని నెలకు 1000 బుకింగ్స్ అవుతున్నాయని వీల్‌స్ట్రీట్ కో–ఫౌండర్ మోక్షా శ్రీవాస్తవ చెప్పారు. సొంత వాహనాలతో పాటు డీలర్ల నుంచి, బైక్ ఓనర్ల నుంచి లీజు రూపంలో బైకులను అద్దెకు తీసుకుంటామని, ఇటీవలే ఆర్అండ్బీ పార్టనర్స్ నుంచి రూ.10 లక్షల నిధులను సమీకరించామని చెప్పారు. వస్తువులే కాదు ఉద్యోగులు కూడా.. వస్తువులే కాదు నిపుణులను కూడా అద్దెకిచ్చే సంస్థ ఒకటుంది. అదే డెవలపర్ ఆన్ రెంట్. ఇది రిటైల్, ఈ–కామర్స్, హెల్త్‌కేర్, టెలికం, రియల్ ఎస్టేట్, ట్రావెల్, అగ్రికల్చర్, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్ వంటి అన్ని రంగాల్లో నిపుణులను అద్దెకిస్తుంది. పీహెచ్‌పీ, పైథాన్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, యాంగ్లర్ జేఎస్, మీన్ స్టాక్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, హెచ్‌టీఎంఎల్ 5, ఐఓటీ, మాజెంటో, వర్డ్ ప్రాసెస్ వంటి అన్ని రకాల టెక్నాలజీల్లోనూ వీరు సేవలందిస్తారని సంస్థ ఫౌండర్ కపిల్ మెహతా తెలిపారు. ఇప్పటివరకు జస్ట్ డయల్, శుభ్‌కార్ట్, ఆటోమోబీ, స్కిల్ స్పీడ్, పిట్టిగ్రూప్, స్లాటర్ కన్సల్టింగ్, సెంతిక్ వంటి 50కి పైగా కంపెనీలు మా నిపుణుల్ని అద్దెకు తీసుకున్నాయని పేర్కొన్నారు. అనుభవం, పని కాలం ప్రాతిపదికన చెల్లింపులుంటాయి. రూ.10,200 కోట్లకు అద్దె పరిశ్రమ.. ప్రస్తుతం దేశంలో 300 వరకు ప్రధానమైన ఆన్ లైన్ రెంటల్ కంపెనీలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా షేరింగ్ ఎకానమీ రూ.7,82,000 కోట్లుగా ఉందని.. 2025 నాటికి ఇది రూ.22,78,000 కోట్లకు చేరుతుందని ప్రైస్‌వాటర్ హౌజ్ కూపర్స్ తాజా నివేదికలో వెల్లడించింది. మన దేశంలో విభాగాల వారీగా అద్దె విపణి గణాంకాలను పరిశీలిస్తే.. ఫర్నిచర్ రూ.5,400 కోట్లు, ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ రూ. 3,400 కోట్లు, కార్లు, బైకుల మార్కెట్ రూ. 2,040 కోట్లు, బొమ్మలు రూ.800 కోట్లుగా ఉంటుందని తెలిపింది. మొత్తంగా మన దేశంలో అద్దె విపణి రూ.10,200 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. నిధుల సమీకరణలోనూ జోరే.. నిధుల సమీకరణలోనూ రెంటల్ కంపెనీలు జోరుమీదున్నాయి. ముంబై కేంద్రంగా పనిచేసే ఫర్నిచర్ రెంటల్ సంస్థ ఫ్లైరోబ్ రెండు రౌండ్లలో 46 మిలియ న్ డాలర్లు సమీకరించింది. సెకోయా క్యాపిటల్, ఐడీజీ వెంచర్స్, జీఆర్ఈఈ వెంచర్స్‌తో పాటూ మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడి పెట్టారు. మరో ఫర్నిచర్ కంపెనీ రెన్ టొమొజో.. ఐడీజీ వెంచర్స్, యాక్సెల్ పార్టనర్స్ నుంచి గతేడాది నవంబర్‌లో 2 మిలియన్ డాలర్లను, ఫ్యూర్లెన్ కో సంస్థ లైట్‌బాక్స్ వెంచర్స్ నుంచి 6 మిలియన్ డాలర్లను సేకరించాయి. సెల్ఫ్ డ్రైవ్ కార్ పరిశ్రమలో 70 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకున్న జూమ్‌కార్ ఇప్పటివరకు 45 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. కి.మీ. చొప్పున కాకుండా గంటల వారీగా కార్లను అద్దెకిచ్చే రేవ్ సంస్థలో మెకెన్సీ సంస్థకు చెందిన పలువురు 1.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. అయితే అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో అద్దె మార్కెట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నది విశ్లేషకుల మాట. – సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
టైల్స్... స్టైల్స్..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో విలాసవంతమైన జీవనశైలి విస్తరిస్తున్న క్రమంలో... భవనాల అందాలను ఇనుమడింపజేసే ఇంటీరియర్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మోసుకొస్తోంది. ఈ క్రమంలోనే గచ్చిబౌలిలోని లార్వెన్ టైల్స్ షోరూమ్‌లో కొత్త రకం టైల్స్ కలెక్షన్‌ను ఆదివారం నటి అక్షత ఆవిష్కరించారు. సంస్థ ఎం.డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటీరియర్ మోసాలు
నగరవాసులను నిండాముంచుతున్న కెనడీ జోసెఫ్, కంతేటి అరుణ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు బాధితులు పదుల సంఖ్యలోనే.. ? సిటీబ్యూరో: మోసాలు కొంత పుంతలు తొక్కుతున్నాయి. సైబర్, లాటరీ, లక్కీ స్కీమ్, చిట్‌ఫండ్ ఇలా ఎన్నో మోసాలను మనం చూసి ఉంటాం. ఇప్పుడు ఇంటి నిర్మాణం విషయంలో యజమానులకు ఉండే కోర్కెలను ‘క్యాష్’ చేసుకునే ముఠాలు పుట్టుకొచ్చాయి. ఇంటీరియర్ డిజైన్ పేరిట లక్షల్లో కుచ్చుటోపీ పెడుతున్న ఓ జంట వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చెన్నై వాసి కెనడీ జోసెఫ్, హైదరాబాద్‌కు చెందిన కంతేటి అరుణ కలిసి కొత్తగా భవనాలు, ఫ్లాట్లు నిర్మించేవారిని సంప్రదించి అంతర్జాతీయ స్థాయి హంగులతో ఇంటీరియర్ డిజైన్ చేస్తామని నమ్మబలికి లక్షల్లో మోసం చేస్తున్నారని అత్తాపూర్‌కు చెందిన నాగమణి అనే బాధితురాలు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 155 వద్ద ఉన్న తమ ఫ్లాట్‌కు ఇంటీరియర్ డిజైన్ చేస్తామని రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇందులో రూ. 5.75 లక్షలు చెల్లించే వరకు తమపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ తర్వాత పనులు మొదలెట్టలేదని బాధితురాలు వాపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మరో 15 రోజుల్లో పని ప్రారంభిస్తామని చెప్తూ దాదాపు రెండేళ్లుగా కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఇదే విధంగా మోసపోయిన బాధితులు పదుల సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. ఇద్దరిదీ ప్రధాన పాత్రే... రఫెల్ కెనడీ చదివింది పది వరకు మాత్రమే. అయితే మాసబ్‌ట్యాంక్ జేఎన్టీయూ అర్కిటెక్చర్ కాలేజీలో బీఆర్క్ చేశానని చెప్తాడు. అలాగే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్లో ట్రేడ్ లెసైన్స్ ఉన్నట్టు నమ్మిస్తాడు. హోటల్ మేనేజ్మెంట్ చదివిన కంతేటి అరుణ తన పీఏగా చెప్పుకుంటూ బాధితులను ఆమె ద్వారా తమ ఉచ్చులో పడేలా చేస్తాడు. గూగుల్‌లోని డిజైన్లను డౌన్లోడ్ చేసి, వాటిని తామే చేశామని నమ్మిస్తారు. డబ్బులు వచ్చేదాకా అరుణను ముందుం డి నడిపిస్తాడు. దాదాపు 60 శాతం డబ్బు వసూలు చేసి తర్వాత తన నిజస్వరూపం బయటపెడతాడు. తాను బెంగళూరు, ముంబై, లక్షద్వీప్‌లలో బిజీ గా ఉన్నానని కొందరు బాధితులకు, సినిమా తారలను కలిసేందుకు ముంబైకి వచ్చానని మరికొందరికి కల్లబొల్లి కబుర్లు చెబుతాడు. ఇలా ఏళ్లు గడిచినా ఇంటీరియల్ డిజైన్ పని మాత్రం పూర్తి చేయడు. బాధితులు గట్టిగా నిలదీస్తే తన కార్యాలయాన్ని మార్చేస్తాడు. తొలినాళ్లలో మారేడ్‌పల్లి, నారాయణగూడలో ఆర్కే అసోసియేట్స్ పేరిట మోసం చేసిన జోసెఫ్, అరుణ జంట...ఆ తర్వాత బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న రిలయన్స్ మానర్‌లో తన కుటుంబం ఉంటున్న ఫ్లాట్‌లోనే రాఫెల్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని నడుపుతూ మోసాలకు తెరలేపాడు. మంత్రి కడియం శ్రీహరికి తాను దగ్గర వాడినని, అందుకే ఆయన కూతురు ఫ్లాట్‌లో ఉన్నానని, వారి ఇళ్లకు కూడా ఇంటీరియర్ డిజైన్ చేసింది తానేనని నమ్మిస్తాడు. మకాం గుంటూరుకు... కంతేటి అరుణ.. రఫెల్‌కు పీఏ కాదు... అతని రెండో భార్య. వీరిద్దరికీ ఒక బాబు ఉన్నాడు. దమ్మాయిగూడలో అరుణ అక్క పేరుతో కొనుగోలు చేసిన అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో అమ్మమ్మ, తాతల వద్ద ఆ బాబు ఉంటున్నాడు. అయితే అరుణ, రఫెల్ల మోసాలు పోలీసులకు తెలియడంతో సిటీ నుంచి తమ మకాంను గుంటూరులోని మాచవరానికి మార్చారు. రాజధాని అమరావతి నిర్మాణంతో అక్కడ ఇప్పుడు కొత్త భవనాలు నిర్మాణం పెద్ద ఎత్తును సాగుతుండటంతో అక్కడ ఇంటీరియల్ డిజైన్ పేరిట మోసాలకు తెరలేపేందుకు ఈ జంట వెళ్లిందని తెలుస్తోంది. -
ఖానాదానీ
రాజస్థానీ, గుజరాతీ వంటకాలు నగరవాసులకు మరింత చేరువయ్యాయి. దేశంలోనే పేరెన్నికగన్న వెజిటేరియన్ రెస్టారెంట్ చైన్ ‘ఖాన్‌దానీ రాజధాని’ కూకట్పల్లి సుజనామాల్‌లో గురువారం రెండో అవుట్లెట్ ప్రారంభించింది. ఆహ్లాదకరమైన ఇంటీరియర్... పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించిన చెఫ్‌లు వండి వార్చే నోరూరించే రుచులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. లంచ్, డిన్నర్స్‌లో మట్టర్ ఖాస్తా రోల్, సుర్తి ప్లాజా, బర్సాడొల్లా, హరివాలిపత్ర, జోధ్‌పురి పకోడా వంటి వెరైటీస్‌తో పాటు సూరతి ఉందియ, జైసల్మార్ పాంచ్ కుటా, పిథోడ్ కీ సబ్జీ, జోధ్‌పురి గట్టా, సాంగ్రి కీ కోఫ్టె, రాబోది హరాప్యాజ్, తిల్వాలే వంటి సబ్జీలను ఇక్కడ వేడివేడిగా లాగించేయచ్చు. అంతేకాదు చిల్లీసేవ్ పూరీ, టోక్రీ దహీ చాట్, డబెలీ, టమాటా, అక్రూట్ హల్వా, దూద్ప్యాక్ తదితర శ్నాక్స్ కూడా ఈ రెస్టారెంట్లో అందుబాటులో ఉంటాయి.