సాక్షి, హైదరాబాద్: నగరానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈఐపీఎల్.. మాడ్యులర్ కిచెన్, ఫర్నిచర్ విభాగంలోకి అడుగుపెట్టింది. గచ్చిబౌలిలో ది ప్లాటిన మాల్‌లో కొంటర్నో పేరిట లగ్జరీ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఈఐపీఎల్ (ఇంటీరియర్ సొల్యూషన్స్) సీఓఓ అశిత పర్మార్ ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ఇటలీకి చెందిన ప్రముఖ కిచెన్ బ్రాండ్స్ డైమొకుసినో, డల్లాగ్నీసీలతో పాటూ ఈఐపీఎల్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ కొంటొర్నో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్టోర్‌లో నివాస, వాణిజ్య, కార్యాలయాల విభాగాలకు చెందిన అన్ని రకాల ఫర్నీచర్స్‌తో పాటూ కిచెన్ యూనిట్స్, వార్డ్‌రోబ్స్, టీవీ సెట్స్, బెడ్, లివింగ్ రూమ్ ఫర్నిచర్ వంటి పూర్తి స్థాయి ఇంటీరియర్ సొల్యూషన్స్ అందుబాటులో ఉంటాయి. నాణ్యత, మన్నికే ప్రత్యేకత: హైదరాబాద్‌లోని గండిపేటలో కొంటొర్నో తయారీ కేంద్రం ఉంది. దీని ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 100 మాడ్యుల్స్. నాణ్యత, మన్నికే మా ప్రత్యేకత. ఇప్పటివరకు వెయ్యికి పైగా ప్రాజెక్ట్‌లు, హైదరాబాద్‌లో 50 వరకు నివాస ప్రాజెక్ట్‌లకు ఇంటీరియర్ డిజైన్స్ అందించాం. ప్రస్తుతం 70కి పైగా ప్రాజెక్ట్ ఆర్డర్లున్నాయి. యూరోపియన్ తయారీ యూనిట్లపై అభివృద్ధి చేస్తున్న ఈ కొంటొర్నో ఉత్పత్తులు అంతర్జాతీయ డిజైన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటమే కాకుండా స్థానిక వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటాయని ఆమె తెలిపారు.
3–4 రోజుల్లో ఏర్పాటు: కస్టమర్ల అవసరాలను బట్టి ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, ఫాల్స్ సీలింగ్ వంటివి కూడా చేసిస్తాం. ఎందుకంటే ఇంటీరియర్ డిజైన్స్ అనుగుణంగా వీటిని రూపొందించే వీలుంటుంది. కస్టమర్ల బడ్జెట్‌ను బట్టి ఇంటీరియర్ డిజైన్స్ ఉంటాయి. బాలీవుడ్ తారలతో పాటూ పలువురు రాజకీయ ప్రముఖులూ మా కస్టమర్లుగా ఉన్నారు. ఇటాలియన్ బ్రాండ్స్ డెలివరీకి 4 నెలలు, కొంటొర్నో డెలివరీకి 6–8 వారాల సమయం పడుతుంది. 3–4 పని దినాల్లో ఇన్‌స్టలేషన్ పూర్తవుతుంది. మరిన్ని వివరాలకు ashitaparmar@eiplgroup.com సంప్రదించవచ్చు.
నగరంలో డైమొకుసినో
ఇటలీ నుంచి కిచెన్ బ్రాండ్ డైమొకిచినో, ఫర్నీచర్ బ్రాండ్ డల్లాగ్నిసీలను దిగుమతి చేసుకునే ఏకైక స్టోర్ మాదేనని ఆమె తెలిపారు. గ్లాస్, మెటల్‌తో రూపొందించే ఈ ఉత్పత్తులు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. ఫైర్, వాటర్ ప్రూఫ్‌ను కలిగి ఉంటాయి. ఇతర అంతర్జాతీయ బ్రాండ్లతో పోలిస్తే వీటి నిర్వహణ చాలా సులువని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment