సొంతిల్లు ప్రతి ఒక్కరి స్వప్నం.. దానికి తగ్గట్టుగానే ఇంటిని (homes) అభిరుచికి తగ్గట్లు నిర్మించుకోవడంతో పాటు సరికొత్త ఇంటీరియర్ (interior) ఏర్పాటు చేసుకుంటున్నారు. విల్లా, ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌజ్ ఇలా ఏదైనా సరే.. కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపించేలా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు నగరవాసులు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వావ్ అనిపించేలా హాల్, మోడ్రన్ కిచెన్, బెడ్రూమ్స్‌తో పాటు బాల్కనీని (balcony) ముస్తాబు చేసుకుంటున్నారు. కాఫీ కప్పుతో అలా బాల్కనీలోకి వెళ్తే మనసుకు హాయినిచ్చేలా మలుచుకుంటున్నారు. చాలామంది గ్రీనరీ ఫీల్ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ లాన్ ఏర్పాటు చేసుకొని అందమైన మొక్కలతో అలంకరిస్తున్నారు. బాల్కనీ, పెంట్‌హౌస్ సైజును దృష్టిలో ఉంచుకొని కొన్ని సంస్థలు ప్రత్యేక డిజైన్లతో మైమరపిస్తున్నాయి.
కరోనా కాలం తర్వాత నగరవాసులు ఎన్నో నూతన ఒరవడుల వైపు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు (software employees) ఇలాంటి వాటికి అధికంగా మొగ్గుచూపారు. దీనికి ఓ కారణం ఉంది.. లాక్‌డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) కారణంగా అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇళ్లలో ఉండటం, వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ఇంట్లో ఇంటీరియర్‌తో పాటు బాల్కనీ ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వర్క్ మధ్యలో ఫ్యామిలీతో అలా బాల్కనీ, పెంట్‌హౌస్‌లో కూర్చొని సరదాగా కాసేపు గడిపి మళ్లీ పని చేసుకుంటున్నారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ (real estate) వ్యాపారంతో సమానంగా ఇంటీరియర్, పలు థీమ్స్‌తో కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఒకలా.. ఇప్పటి నుంచి మరోలా అనే విధంగా ముస్తాబు చేస్తున్నాయి.
అపార్ట్‌మెంట్స్ బాల్కనీ..
అపార్ట్‌మెంట్ బాల్కనీ కొద్ది స్పేస్ అయినా వాటిని మరింత సుందరీకరణకు మొగ్గు చూపుతున్నారు. కొందరు వారికి నచ్చిన థీమ్స్‌తో డిజైన్ చేయించుకుంటారు. థీమ్ నేమ్స్, లైటింగ్ కొటేషన్స్, సేఫ్టీ కోసం ఇన్‌విజిబుల్ గ్రిల్స్, వాల్ ఆర్ట్‌ను ఎంచుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు బాల్కానీని ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ చూస్తూ డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ ఇంట్రెస్ట్ రావడానికి సరికొత్త డిజైన్స్ ఎంచుకుంటున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. త్రీ బెడ్‌రూమ్స్‌లో ఒక బెడ్‌రూమ్‌లో కొత్త థీమ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విల్లాస్ కల్చర్ పెరిగింది. పెంట్‌హౌస్‌లో ఉన్న స్పేస్‌కి చాలా ఖర్చు పెడుతున్నారు. సిటీ వ్యూ కనబడేలా అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, జెకూజీ, బార్ కౌంటర్, హోమ్ థియేటర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఫ్యూచర్‌లో బాల్కనీ స్పేస్ పెరుగుతుంది
విల్లాస్, అపార్ట్‌మెంట్స్‌లో ఇంటీరియర్‌కి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అందులో భాగంగానే బాల్కనీని చేరుస్తున్నారు. ఫ్యూచర్‌లో బాల్కనీ స్పేస్ రెట్టింపు అవుతుంది. గ్రీనరీ, ఇంట్లోనే వెజిటబుల్స్ పెంచుకొనేలా ఉన్న స్పేస్‌తో కాకుండా కొత్త స్పేస్ ఇచ్చే ఆలోచన అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీలో వస్తోంది. వచ్చిన అతిథులు బాల్కనీ, పెంట్‌హౌస్ చూసి వావ్ అనేలా
ఉండాలని కోరుకుంటున్నారు. వారు బాల్కనీ, పెంట్‌హౌస్‌లనే ఇష్టపడేలా డిజైన్ చేసుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ ఉండేలా డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ రావడానికి వారికి నచ్చినట్లు డిజైన్ చేస్తున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు.
– హేమలత రామా, స్వర్గ బాల్కనీ మేకోవర్స్, సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment