Balcony
-
పుష్కలంగా కూరగాయలు కావాలా? అయితే ఇలా చేయండి!
సేంద్రియ ఆహారం ఆవశ్యకతపై వినియోగదారుల్లో పెరుగుతున్న చైతన్యంతో కిచెన్ గార్డెన్ల సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కూరగాయలు, పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇంటిపట్టునే 13 రకాల కూరగాయలను సేంద్రియంగా పండించుకొని తింటున్న కుటుంబాల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. పఠాన్‌చెరులోని ‘ఇక్రిశాట్’ ఆవరణలో గల వరల్డ్ వెజిటబుల్ సెంటర్ దక్షిణాసియా కేంద్రం సేంద్రియ పెరటి తోటల సాగుపై పరిశోధనలు చేపట్టింది (లాభాపేక్ష లేని ఈ సంస్థ కేంద్ర కార్యాలయం తైవాన్‌లో ఉంది). రెండు నమూనాల్లో సేంద్రియ పెరటి తోటల సాగుకు సంబంధించి ‘సెంటర్’ అధ్యయనంపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వ / ప్రైవేటు వ్యవసాయ పరిశోధనా సంస్థలతో కలసి కూరగాయలు, మిరప వంటి పంటలపై పరిశోధనలు చేసింది. టాటా ట్రస్టులతో కలిసి 36 చదరపు మీటర్ల స్థలంలో పౌష్టిక విలువలతో కూడిన 13 రకాల సేంద్రియ కూరగాయల పెరటి తోటల (న్యూట్రి గార్డెన్స్) పై తాజాగా క్షేత్రస్థాయిలో ఈ పరిశోధన జరిగింది. కుటుంబానికి వారానికి 5.1 కిలోల (ప్రతి మనిషికి రోజుకు 182 గ్రాముల) చొప్పున.. ఏడాదికి 266.5 కిలోల పోషకాలతో కూడిన తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సమకూరాయి. తద్వారా ఒక కుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75% అందాయి. బీటా కెరొటెన్ (విటమిన్ ఎ), విటమిన్ సి అవసరానికన్నా ఎక్కువే అందాయి. 25% ఐరన్ సమకూరిందని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది.జార్కండ్లో పెరటి తోటల పెంపకం ద్వారా కుటుంబాలకు కూరగాయల ఖర్చు 30% తగ్గింది. అస్సాంలో సేంద్రియ న్యూట్రిగార్డెన్ల వల్ల పది వేల కుటుంబాలు విషరసాయనాలు లేని కూరగాయలను సొంతంగానే పండించుకుంటున్నారు. మార్కెట్లో కొనటం మానేశారని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది. వ్యవసాయ దిగుబడులు పెంచే పరిశోధనలతో పాటు భవిష్యత్తు తరాల ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి ఉపయోగపడే క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తున్నామని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ చెప్పారు. స్క్వేర్ గార్డెన్ నిర్మాణం ఎలా?గ్రామీణ కుటుంబాలకు సర్కిల్ గార్డెన్తో పోల్చితే నలుచదరంగా ఉండే స్క్వేర్ గార్డెనే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉండే స్థలాన్ని ఎంపికచేసుకొని మెత్తగా దున్నాలి. మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువుతో వేప పిండి కలిపి చల్లితే చీడపీడలు రావు. 6-6 స్థలాన్ని 7 బెడ్స్ (ఎత్తుమడులు) గా ఏర్పాటు చేయాలి. వాటిని అడ్డంగా విభజించి 14 చిన్న మడులు చేయాలి. ఒక్కో మడిలో ఒక్కో పంట వేయాలి. పాలకూర, గోంగూర, ఉల్లి, క్యారట్, టొమాటో, బెండ, వంగ వంటి పంటలు వేసుకోవాలి. బెడ్స్ మధ్యలో అంతరపంటలుగా బంతి, మొక్కజొన్న విత్తుకుంటే రసంపీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ఇంటిపంటల ఉత్పాదకత 5 రెట్లు! సేంద్రియ ఇంటిపంటలు పౌష్టిక విలువలతో కూడి సమతులాహార లభ్యతను, ఆహార భద్రతను పెంపొందిస్తున్నాయి. తాము తినే ఆహారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సామర్ధ్యాన్ని కుటుంబాలకు ఇస్తున్నాయి. ఫలితంగా మరింత సుస్థిరమైన, ఆరోగ్యదాయకమైన జీవనానికి మార్గం సుగమం అవుతోంది. ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలను వ్యక్తిగత శ్రద్ధతో సాగు చేస్తే పొలాల ఉత్పాదకతో పోల్చినప్పుడు దాదాపు 5 రెట్ల ఉత్పాదకత సాధించవచ్చు. భారత్‌లో పొలాల్లో కూరగాయల దిగుబడి హెక్టారకు సగటున 12.7 టన్నులు ఉండగా, సేంద్రియ ఇంటిపంటల ద్వారా హెక్టారుకు ఏడాదికి 73.9 టన్నుల దిగుబడి పొందవచ్చు. విస్తారమైన కూరగాయ తోటల్లో సైతం సమీకృత వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రసాయనాల వినియోగం తగ్గటంతో పాటు 20% అధిక దిగుబడి పొందవచ్చు. – ఎం. రవిశంకర్, సీనియర్ హార్టీకల్చరిస్ట్, ప్రాజెక్టు మేనేజర్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం, పఠాన్చెరుసర్క్యులర్ కిచెన్ గార్డెన్ ఎలా?పట్టణ ప్రాంతాల్లో స్థలం తక్కువగా ఉన్న చోట సర్క్యులర్ గార్డెన్ అనుకూలంగా ఉంటుంది. చూపులకూ ముచ్చటగా ఉంటుంది. 3 మీటర్ల చుట్టుకొలత ఉండే మడిలో 11 రకాల పంటలు పండించవచ్చు. మధ్యలో ఉండే చిన్న సర్కిల్లో కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలు వేసుకోవచ్చు. పెద్దగా ఉండే వెలుపలి సర్కిల్లో అనేక మడులు చేసి వేర్వేరు కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు. ఒక మడిలో భూసారం పెంపుదలకు వాడే పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలి. చీడపీడల నియంత్రణకు పసుపు, నీలం జిగురు అట్టలు పెట్టుకోవాలి. వేపనూనె, పులిసిన మజ్జిగ పిచికారీ చేస్తుంటే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. ఈ సస్యరక్షణ చర్యల ద్వారా రసాయనిక పురుగుమందులు వాడకుండానే పంటలను రక్షించుకోవచ్చు. స్క్వేర్ గార్డెన్ దిగుబడి ఎక్కువగుండ్రంగా, దీర్ఘ చతురస్త్రాకారంలో ఉండే రెండు రకాల గార్డెన్ డిజైన్లు పెరటి కూరగాయ తోటల సాగుకు అనుకూలం. స్థలం లభ్యతను బట్టి గార్డెన్ డిజైన్‌ను ఎంపిక చేసుకోవాలి. 6 మీటర్ల చుట్టుకొలత గల సర్కిల్ గార్డెన్లో 150 రోజుల్లో 56 కిలోల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు పండాయి. ఎరువులు, విత్తనాలు తదితర ఉత్పాదకాల ఖర్చు రూ. 1,450. అయితే, 6“6 మీటర్ల విస్తీర్ణంలో పెరటి తోట (స్క్వేర్ గార్డెన్)లో అవే పంటలు సాగు చేస్తే 67 కిలోల దిగుబడి వచ్చింది, ఉత్పాదకాల ఖర్చు రూ. 1,650 అయ్యింది. ఈ గార్డెన్లు విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన సమతుల ఆహారాన్ని కుటుంబానికి అందించాయి. ఆమేరకు మార్కెట్‌పై ఆధారపడకుండా రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పౌష్టికాహారాన్ని ఆ కుటుంబం పండించుకొని తినవచ్చని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పేర్కొంది. ఇళ్లు కిక్కిరిసి ఉండే అర్బన్ ప్రాంతాల్లో కంటెయినర్ గార్డెన్లను ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను నగరవాసులు పండించుకోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. సేంద్రియ ఇంటిపంటలపై వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పరిశోధన36 చ.మీ. స్థలంలో వారానికి 5.1 (ఏడాదికి 266.5) కిలోల సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల దిగుబడికుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75%, ఐరన్ 25%, పుష్కలంగా ఎ, సి విటమిన్లు(ఇతర వివరాలకు.. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ప్రతినిధి వినయనాథ రెడ్డి 99125 44200) -
గుబురుగా, తాజాగా కొత్తిమీర : బాల్కనీలోనే ఇలా పెంచుకోండి!
ప్రస్తుతం కాలంలో ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు, పూలను సాగు చేయడం ఒక అలవాటుగా మారింది. చాలామంది టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెనింగ్ పేరుతో ఉన్నకొద్దిపాటి స్థలంలోనే చాలా రకాల మొక్కల్ని పెంచుతూ సేంద్రీయ ఉత్పత్తులను సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇది కాలుష్యం లేని ఆహారాన్ని అందించండం మాత్రమే కాదు ఇంటి వాతావారణానికి, పర్యావరణానికి చాలా మంచిది కూడా. ఇంట్లో చిన్న చిన్న కుండీలల్లో కొత్తమీర, పుదీనా లాంటి వాటిని సులభంగా పండించుకోవచ్చు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇంత అంత ఈజీ కూడా కాదు. మరి సులభంగా, చక్కగా కొత్తిమీరను ఎలా పండించుకోవాలో చూద్దామా!ఇంట్లో కొత్తిమీరను పెంచడం అనేది చాలా సులభమైన ప్రక్రియ. కొత్తిమీరలో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో పెంచేందుకు విత్తన ఎంపిక చాలా ముఖ్యం. ఇందులో శాంటో, లీజర్ లేదా కాలిప్సో వంటి రకాలను ఎంచుకోవడం ఉత్తమం. ఈ రకాలు త్వరగా మొలకెత్తి, ఎక్కువ కాలం పంట ఉండేలా చేస్తుంది.సరైన కంటైనర్కనీసం 8-12 అంగుళాల లోతు, మంచి డ్రైనేజీ ఉన్న కంటైనర్, లేదా గ్రో బ్యాగ్‌ను తీసుకోండి. ఎందుకంటే కొత్తిమీర వేళ్లు లోతుగా వెళతాయి. కుండీ, లేదా కంటైన్ లోతుగా ఉండేలా చేసుకోవాలి. కంటైనర్ దిగువన నీళ్లు పోయేలా రంధ్రాలేన్నాయో లేదో చూసుకోవాలి.సాయిల్ మిక్సింగ్ కొత్తిమీర బాగా పెరగాలంటే, బాగా ఎండిపోయే, సారవంతమైన మట్టి కావాలి. అందుకే కాస్త మట్టి, కొద్దిగా ఇసుక ఉండేలా సేంద్రీయ ఎరువు, అధిక-నాణ్యత పాటింగ్ మిశ్రమాన్ని ఉపయోగించాలి. మడి మరీ తడిగా, మరీ పొడిగా లేకుండా జాగ్రత్తపడాలి.విత్తనాలు విత్తడం నాటేముందు విత్తనాలను(ధనియాలు) కొద్దిగా నలపాలి. అంటే ఒక గుడ్డపై ధనియాలను పోసి చపాతీ కర్రతోగానీ, ఏదైనా రాయితో గానీ సున్నితంగా నలపాలి. అపుడు గింజలు రెండుగా చీలతాయి. ఇలా చేయడం వల్ల విత్తనాలు తొందరగా మొలకలొస్తాయి. 1-2 అంగుళాలు దూరంలో విత్తనాలను 1/4 అంగుళాల లోతులో చల్లాలి. ఆపై మట్టితో తేలికగా కప్పి, నీరు పోయాలి.మొలకలు కంటైనర్‌ను వెచ్చని ఎండ తగిలేలా ఉంచాలి. కొత్తిమీర గింజలు సాధారణంగా మొల కెత్తడానికి 7 నుంచి 14 రోజులు పడుతుంది. ఈ కాలంలో మట్టిలో నీళ్లు నిల్వలేకుండా, తేమగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం 4-6 గంటల పాటు ప్రత్యక్ష ఎండ తగలాలి. నీళ్లు పోయడానికి విత్తనాలు చెదిరిపోకుండా, దెబ్బ తగలకుండా, స్ప్రే బాటిల్‌ని ఉపయోగించాలి.నిర్దిష్ట సమయంలో సాధారణంగా మొలకలు వచ్చేస్తాయి. మట్టిని సమానంగా తేమగా ఉంచడానికి కొత్తిమీర మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. ఇంకా బలంగా పెరగాలంటే, నీటిలో కరిగే ఎరువులు, కంపోస్ట్ టీ లేదా డైల్యూటెడ్ ఫిష్ ఎమల్షన్ వంటి సేంద్రీయ ఎరువు వాడితే మంచిది. చక్కగా గుబురుగా, పచ్చపచ్చగా కొత్తిమీర మొక్కలు ఎదుగుతాయి. 6 అంగుళాల ఎత్తు పెరిగాక కొత్తమీరను హార్వెస్ట్ చేయ వచ్చు. కోస్తూ ఉంటే, కొత్తమీర ఇంకా గుబురుగా పెరుగుతుంది. అఫిడ్స్, సాలీడు , శిలీంధ్ర వ్యాధుల సమస్యలొస్తాయి. ఎలాంటి చీడపీడలు రాకుండా, వేపనూనె, పుల్లటి మజ్జిగ ద్రావణం లాంటి స్ప్రే చేయవచ్చు. కొత్తమీర పువ్వులు వచ్చేదాకా వాడుకోవచ్చు. దీన్ని బోల్టింగ్ అంటారు. ఈ టైంలో ఆకులు చేదుగా మారతాయనేది గుర్తించాలి. -
ఖరీదైన బాల్కనీ.. అద్దె ఎంత అని మాత్రం అడగకండి!
దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా అద్దె ఇంటి బాధలు అందరివీ ఒకటే. ఇక ఖరీదైన ఏరియాలో అద్దె ఇల్లు అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఈ కష్టాల కత వేరే ఉంటది. కానీ ఖరీదైన బాల్కనీ అద్దె గురించి ఎపుడైనా విన్నారా? ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పట్టుమని పది అడుగులు కూడా ఉండని ఒక బాల్కనీ అద్దె వింటే షాకవ్వాల్సిందే. స్టోరీ ఏంటంటే..ఒక విచిత్రమైన ఫేస్బుక్ ప్రకటన ఇది. సిడ్నీలోని ఒక ఇంట్లో ఒక బాల్కనీ అద్దెకు ఉందని ఒక యజమాని ప్రకటించాడు. ఒక మనిషికి ఉండేందుకు అవకాశం. దీని అద్దె నెలకు 969 డాలర్లు (రూ. 81,003)అంటూ ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్ లిస్టింగ్‌లో వెల్లడించాడు. ఇందులో బెడ్, అద్దం కూడా ఉంటుంది. మంచి వెలుతురు, ఎటాచ్డ్గా ఉన్న గదిలోపల బాత్రూమ్ వాడుకోవచ్చని, ఇక కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అదనమని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ప్రకటన తెగ వైరల్ అవుతోంది.దీంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందించారు. బాల్కనీకి ఇంత అద్దా? ఈ బాల్కనీని ఎంచుకునే వాళ్లుంటారా అని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా ఇటీవలికాలంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గృహాల అద్దె ధరలలో గణనీయమైన పెరుగుదల నమోద వుతోంది. తాజా లెక్కల ప్రకారం 2024 జూన్ త్రైమాసికంలో సిడ్నీ సగటు అద్దె వారానికి 750 డాలర్ల మేర రికార్డు స్థాయిలో ఉంది.అద్దె ఇళ్లకు పోటీ నేపత్యంలో ఆక్షన్ ద్వారా అద్దెను కేటయిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
స్టార్ హోటల్ బాల్కనీలో ఎండకు బట్టలు : అయితే ఏంటట? వీడియో వైరల్
నగరాల్లోని అపార్టమెంట్లలో ఉండేవాళ్లు బట్టలు బాల్కనీలోనే ఆరేసుకోవాలి తప్పదు. కానీ స్టార్ హోటల్ అయినా, లగ్జరీ హోటల్ అయినా హోటల్‌కి వెళ్లినపుడు, తడి బట్టలు ఎక్కడ ఆరేయాలి. ఇది టూర్లలో, ప్రతీ తల్లికి ఉండే ఇబ్బందే. (ఎందుకంటే బట్టలు ఆరేయడం గురించి మగవాళ్లు పెద్దగా పట్టించుకోరు కాబట్టి) అయినా తప్పదు ఆరేయ్యాలి కదా.. తడి బట్టలు అలాగే పట్టుకెళ్లలేం. ముక్కి, వాసన వస్తాయి అందుకేనేమో దుబాయ్ వెళ్లిన ఒక తల్లి బట్టలు ఆరేయడం ఇంటర్నెట్లో చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టోరీ ఏంటంటే..ఇండియాకు చెందిన ఒక కుటుంబం దుబాయ్‌లో విహార యాత్రకు వెళ్లింది. అక్కడ అత్యంత ప్రసిద్దమైన, విలాసవంతమైన ‘అట్లాంటిస్, ది పామ్’ హోటల్లో దిగారు. అక్కడ పొద్దున్నే బాల్కనీలో మహిళ దుస్తులు ఆరేసింది. తన తల్లి బట్టలు ఆరేసిన వీడియోను పల్లవి వెంకటేశ్ అనే యువతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘పొద్దున్నే అమ్మ పని ఇది’ అంటూ ఫన్నీగానే వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎక్కడైనా అమ్మ.. అమ్మే..తన బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోదు అని కొందరు కామెంట్ చేశారు. హాటల్లో అలా చేయడం మర్యాద కాదని కొందరు, ఈ అమ్మలు ఇంతే మారరు అని మరికొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pallavi Venkatesh (@iam.pallavivenkatesh) అయితే హోటల్ యాజమాన్యం స్పందన విశేషంగా నిలిచింది. తల్లి బాధ్యతలు అని కామెంట్ చేసింది. అలాగే దుస్తులు ఆరేసుకునేందుకు ప్రతి బాత్రూంలో డ్రైయింగ్ త్రాడును చేర్చుతాం తద్వారా అక్కడే దుస్తులను ఆరబెట్టుకోచ్చు అనే కూడా వివరణ ఇచ్చారు. ఏడు రోజుల కిందట పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 12 మిలియన్ల వ్యూస్‌ను, లక్షకు పైగా లైక్స్‌ను దక్కించు కోవడం విశేషం. -
మొక్కలు పెంచాలనుకుంటే చాలు.. అపార్ట్మెంట్లో కూడా పెంచొచ్చు!
పట్టణాల్లోని చిన్న అపార్ట్‌మెంట్‌వాసుల నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మొక్కలు అంటే మాకు చాలా ఇష్టం. కాని స్థలం ఎక్కడిది?’ ‘స్థలం పెద్దగా అక్కర్లేదు. పెంచాలనే సంకల్పం ఉంటే చాలు’ అంటుంది బిహార్‌కు చెందిన కమల్‌సింగ్. ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో ఉంటున్న కమల్‌సింగ్ తన చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచుతుంది. ‘వంటగది వ్యర్థాలతో కంపోస్ట్‌ను ఎలా తయారుచేయాలి?’ అనే విషయం నుంచి ఏ మొక్కలను ఎలా పెంచాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వరకు... ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ ‘అర్బన్ హోమ్ వైబ్స్’కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘స్టార్ట్ వేర్ యూ ఆర్ విత్ వాటెవర్ యూ హ్యావ్’ అంటున్న కమల్‌సింగ్ స్ఫూర్తితో ఎంతో మంది పట్టణ వాసులు తమ బాల్కనీలో మొక్కల పెంపకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ‘మేము సైతం’ అంటున్నారు. (చదవండి: వెరైటీగా బనానా ఆమ్లెట్ ట్రై చేయండిలా!) -
జగన్నాథ రథయాత్రలో అపశృతి.. ఇంటి రెండో ఫ్లోర్ కూలి..
గుజరాత్: గుజరాత్లో జరిగిన జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్ర కొనసాగుతుండగా.. పక్కనే ఉన్న శిథిలమైన ఇంటి రెండో ఫ్లోర్ బాల్కనీ కూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అహ్మదాబాద్‌లోని దరియాపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. 146వ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులతో రహదారి కిక్కిరిసిపోయింది. రోడ్డు వెంట ఉన్న ఇళ్లలోని బాల్కనీల నుంచి భక్తులు రథయాత్రను తిలకిస్తున్నారు. ఈ క్రమంలో ఓ శిథిలమైన ఇంటి రెండో ఫ్లోర్ బాల్కనీ అకస్మాత్తుగా కూలింది. దానిపై నిలుచుని ఉన్నవారు ఒక్కసారిగా కిందపడిపోయారు. కొన్ని శిథిలాలు రహదారిపై ఉన్న భక్తులపై పడిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. రథయాత్రకు సంబంధించి అన్ని జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారని వెల్లడించారు. భవనం చాలా కాలం క్రితం నిర్మించినందున శిథిలమైపోయిందని పేర్కొన్నారు. Accident during Rath Yatra in Ahmedabad, many injured due to balcony collapse #Ahmedabad #WhatsApp #AhmedabadRathYatra pic.twitter.com/Efi4zUW077 — Pawan Shandilya (@pawanshandilya8) June 20, 2023 ఇదీ చదవండి: డెలివరీ బాయ్ మృతి.. బైకును ఢీకొట్టి వంద మీటర్లు లాకెళ్లిన కారు -
బాల్కనీ ఉంటే చాలు.. సోలార్ పవర్ పొందొచ్చిలా..
సౌరవిద్యుత్తు వాడుక ఇప్పుడిప్పుడే వ్యాప్తిలోకి వస్తోంది. ఇంటికి సౌరవిద్యుత్తు అమర్చుకోవాలంటే, పైకప్పులో చాలాభాగం సౌరఫలకాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారికి ఇదంతా కుదిరే పనికాదు. అందువల్ల సౌరవిద్యుత్తుపై ఆసక్తి ఉన్నా, నగరాల్లో అపార్ట్మెంట్లలో ఉండే జనాలు సౌరవిద్యుత్తు జోలికి పోవడం లేదు. ఈ సమస్యను గమనించి, జపాన్‌కు చెందిన ‘ఇకో ఫ్లో’ బాల్కనీలో కూడా అమర్చుకోవడానికి వీలైన కాంపాక్ట్ పోర్టబుల్ సోలార్ పవర్ జెనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పవర్ జెనరేటర్‌తో పాటు ఉండే నాలుగు సౌరఫలకాలను బాల్కనీలో ఎండ సోకే ప్రదేశంలో పెట్టుకుంటే చాలు. (ఇదీ చదవండి: మొదలైన కీవే ఎస్ఆర్250 డెలివరీలు.. మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్!) దీని ద్వారా ఏడాదికి దాదాపు 1040 కిలో వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంటే, ఒక ఇంటి అవసరాలకు ఈ విద్యుత్తు పూర్తిగా సరిపోతుంది. దీనిని అరగంట లోపే కోరుకున్న చోట అమర్చుకోవచ్చు. ఆరుబయట పిక్నిక్లకు తీసుకువెళ్లేందుకు కూడా ఇది చాలా అనువుగా ఉంటుంది. దీని ధర 2,049 పౌండ్లు (రూ.2.10 లక్షలు) మాత్రమే! -
బుడతడు.. గుండె ఆగినంత పనిచేశాడు..
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఓ చిన్నారి ఆడుకుంటూ తల్లి స్నానానికి వెళ్లిన రూమ్‌కు బయట గడియ పెట్టేశాడు. ఆ తర్వాత ఆడుకుంటూ బాల్కనీలోని గ్రిల్స్‌లో కాలు పెట్టగా అది ఇరుక్కుపోయి గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. బాత్రూమ్లో ఉన్న తల్లికి బయట ఏం జరిగిందో తెలియక గుండె ఆగినంత పని అయ్యింది. రెండు మూడు గంటల ఉత్కంఠకు ఫైర్ సిబ్బంది రాకతో తెరపడింది. వివరాల్లోకి వెళితే... రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌లోని సాయిరాఘవ టవర్స్ మూడో అంతస్తులో ఎం.సంతోషలక్ష్మి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఆమెకు ఏడాదిన్నర బాబు (సాయిరామ్) ఉన్నాడు. మంగళవారం ఉదయం సాయిరామ్‌ను తీసుకుని తల్లి బాత్రూమ్కు వెళ్లింది. ఎప్పటిలా స్నానం చేయించి రూమ్ బయటకు వదిలింది. తర్వాత తానూ స్నానానికి ఉపక్రమించింది. ఇంతలో ఆ బాలుడు బాత్రూమ్ డోర్ వద్ద ఆడుకుంటూ గడియ పెట్టేశాడు. అక్కడి నుంచి నెమ్మదిగా బాల్కనీలోకి వచ్చాడు. బాల్కనీలోని గ్రిల్లో కాలు పెట్టగా ఇరుక్కుపోయింది. కాలు బయటకు రాకపోయేసరికి గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. బాబు ఏడుపు బాత్రూమ్ నుంచి విన్న తల్లి బయటకు రాలేక, బాబుకు ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళన చెందింది. ఏం చేయాలో తెలియక గట్టిగా కేకలు వేసింది. కింది భాగంలో నివాసం ఉంటున్న వారు విని పైకి వచ్చారు. లోపలికి వెళ్దామంటే మెయిన్ డోర్ వేసి ఉంది. లోపల ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితి. దీంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అపార్టుమెంటుకు చేరుకుని నిచ్చెన ద్వారా పైకి ఎక్కి బాల్కనీలోని గ్రిల్స్‌లో ఇరుక్కున్న బాలుడి కాలు బయటకు తీశారు. తర్వాత లోనికి వెళ్లి బాత్రూమ్ గడియ తీయడంతో తల్లి సంతోషలక్ష్మి బయటకు వచ్చింది. ఇద్దరూ క్షేమంగానే ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
Viral Video: బాల్కనీ నుండి బోర్లా పడ్డాడు..!
-
స్నేహితుల కళ్లదుటే ఘోరం.. 6వ అంతస్తు నుంచి పడి యువకుడి మృతి
మరణం ఊహించనిది. చావు ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. కళ్ల ముందే సంతోషంగా కనిపించిన వారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ మృత్యు ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రెండు క్షణాల ముందు వరకు స్నేహితులతో ఆనందంగా ముచ్చటించిన ఓ యువకుడు ప్రాణాలు అంతలోనే గాల్లో కలిసిపోయాయి. హాస్టల్ బిల్డింగ్‌లోని ఆరో అంతస్తు నుంచి కింద పడి అనూహ్యంగా మరణించాడు. వివరాలు.. జల్పైగురి జిల్లాలోని ధుప్గురికి చెందిన ఇషాంషు బట్టాచార్య అనే 20 ఏళ్ల యువకుడు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగష్టులో కోటాలోని జవహార్ నగర్లో కోచింగ్ తీసుకుంటూ ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఓ రోజు స్నేహితులతో బయటకు వెళ్లి అర్థరాత్రి తన హాస్టల్ తిరుగొచ్చాడు. రూమ్ ముందు ఉన్న బాల్కనీలో స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటున్నారు. గదిలోకి వెళ్లే ముందు బాల్కనీలో చెప్పులు పక్కకు పెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోవడంతో రెయిలింగ్‌పై పడ్డాడు ఇషాంషు బరువు తట్టుకోలేక అల్యూమినియం రెయిలింగ్ విగిరిపోవడంతో అక్కడి నుంచి కింద అమాంతం పడిపోయాడు. బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మరణించినట్లు కోటా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించామని.. పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించనున్నట్లు వెల్లడించారు. కాగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కన్నీరు పెట్టించే ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: Wildfires: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి.. Breaking News: Coaching student dies after falling from sixth floor of hostel in Rajasthan's Kota. The net was broken, he fallen out when he was trying to put on his slippers by standing with the support of net. Heart-wrenching !#Rajasthan #Kota pic.twitter.com/nZixPXwNfj — Ashwini Shrivastava (@AshwiniSahaya) February 3, 2023 -
టీచర్ క్రూరత్వం.. విద్యార్థిని స్కూల్ బాల్కనీలోంచి తోసేసి హత్య!
బెంగళూరు: కర్ణాటకలోని గడక్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు క్రూరంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని చితకబాది.. పాఠశాల భవనం మొదటి అంతస్తులోని బాల్కనీలోంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలైన ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన హగ్లీ గ్రామంలోని ఆదర్శ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. కుటుంబ గొడవలే కారణం.. ఆదర్శ్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు భరత్ అనే విద్యార్థి. అదే పాఠశాలలో పని చేస్తున్న ముత్తప్ప అనే ఉపాధ్యాయుడు.. భరత్‌ను చితకబాది బాల్కనీలోంచి బయటకు తోసేశాడని గడక్ జిల్లా సీనియర్ పోలీసు అధికారి శివప్రకాశ్ దేవరాజ్ తెలిపారు. ఈ దారుణం వెనుక కుటుంబ కలహాలు ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. బాధితుడు భరత్ తల్లి, అదే పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న గీతా బార్కర్‌ను సైతం ముత్తప్ప తీవ్రంగా కొట్టినట్లు చెప్పారు. ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా చేస్తున్న నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి: పాతబస్తీలో దారుణం.. లలిత్ బాగ్ కార్పొరేటర్ అల్లుడి హత్య -
భార్యతో మీద కోపంతో.. రెండేళ్ల కొడుకును భవనంపై నుంచి పడేసి..
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి రెండేళ్ల కొడుకుని మూడు అంతస్తుల బాల్కనీ నుంచి తోసేసి తాను దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలోని కల్కాజీ వద్ద ఉన్న స్లమ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలైన తండ్రి కొడుకులిదర్నీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మన్సింగ్ అతడి భార్య పూజా కుటంబ కలహలతో గత కొన్ని నెలలుగా వేర్వేరుగా నివశిస్తున్నారు. ప్రస్తుతం పూజ తన ఇద్దరు పిల్లలతో కల్కాజీలో ఉంటున్న తన నానమ్మ వద్దే ఉంటోంది. గత రాత్రి మన్సింగ్ తన భార్య పూజ వద్దకు వచ్చి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో మన్సింగ్ కోపంతో.. తన రెండేళ్ల కొడుకుని 21 అడుగుల ఎత్తులో ఉన్న బాల్కనీ నుంచి పడేసి..ఆ తర్వాత అతను దూకేశాడు. ఈ మేరకు పోలీసులు మనసింగ్పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఆ సమయంలో తాగి ఉన్నాడని పూజ నానమ్మ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: అది అత్యంత ముఖ్యమైనది: తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి) -
సో క్యూట్.. చిన్నారి కోసం ఈ పిల్లి ఏం చేసిందో చూడండి..
చాలామందికి ఇంట్లో జంతువులు పెంచుకోవడానికి పిచ్చిగా ఇష్టపడుతుంటారు. ఈ మధ్యకాలంలో ఈ సంస్కృతి బాగా పెరిగిపోయింది. కొందరు అయితే వాటిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. జంతు ప్రేమికులు ఎక్కువగా కుక్క, పిల్లి, చిలుకను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇంట్లో మనుషులను చూసినట్లుగానే వాటి ఆలనా పాలనా చూస్తుంటారు. కొన్ని సార్లు మనం పెంచుకునే పెట్స్ మనకు ఎంతో సాయం చేస్తుంటాయి. చాలా విషయాల్లో మనల్ని ప్రమాదం నుంచి కాపాడతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ పిల్లికి చెందిన వీడియో వైరల్‌గా మారింది. ఇంట్లో పెంచుకునే పిల్లి ఓ పిల్లాడికి బాడీగార్డ్‌గా మారింది. ఏడాది వయసున్న బాలుడు బాల్కనీ వద్దకు వచ్చి నిల్చొని బయటకు చూస్తుంటాడు. బాల్కనీలోని ఐరన్ గ్రిల్‌పై చేయి పెట్టి పెక్కి ఎక్కేందుకు మెల్లగా ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న పిల్లి అతన్ని చేయిని కిందకు తీసేస్తుంది. అయినా చిన్నారి చేతులు పెడుతుంటే పిల్లి మళ్లీ తీసేస్తుంది. Bodyguard pic.twitter.com/B9DIXaOAa6 — Gabriele Corno (@Gabriele_Corno) August 5, 2022 చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు కానీ గాబ్రియేల్ కార్నో అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశారు. ‘పిల్లి చాలా తెలివైనది. జంతువుల హృదయాల్లో కల్లాకపటం ఏం ఉండదు.. ప్రేమ, అప్యాయత మాత్రమే ఉంటాయని కామెంట్ చేస్తున్నారు. -
ఇదేం రూల్ సామీ.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ.20 వేలు ఫైన్!
మన ఇంటి బాల్కనీలో లేదా టెర్రస్‌పైన ఉతికిన దుస్తులను ఆరబెట్టడం సహజమే. అయితే ఓ ప్రాంతంలో మాత్రం అలా బాల్కనీలో బట్టలు ఆరబెడితే ఫైన్ కట్టాల్సివస్తుంది. ఎక్కడనుకుంటున్నారా.. ఈ వింత రూల్ యూఏఈలోనిది. అయితే ఇలాంటి నిబంధన తీసుకురావడానికి కారణం ఉందని ఆ ప్రాంత అధికారులు చెప్తున్నారు. అసలు ఆ కథేంటని తెలుసుకుందాం! వివరాల్లోకి వెళితే.. అబుదాబిలోని మున్సిపాలిటీ అధికారులు అపార్ట్మెంట్ల బాల్కనీలు, కిటికీలపై బట్టలు ఆరబెట్టవద్దని ఆ ప్రాంత నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 20,000) లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఓ కారణం ఉందని అంటున్నారు అక్కడి మున్సిపల్ అధికారులు. బాల్కనీలో దుస్తులు ఆరేయడం వల్ల నగర అందం దెబ్బతింటుందని, అందుకే బాల్కనీలో, కిటికీలకు బట్టలు వేలాడదీయవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయంగా లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చదవండి: ‘ఇది కరెక్ట్ కాదు.. రష్యా వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తోంది’ -
ఇదేం పిచ్చో.. బాల్కనీ అంతా దెయ్యం బొమ్మలతో నింపేశాడు!
బొమ్మలతో మనం మాట్లాడితే పర్వాలేదు. అవే బొమ్మలు మనతో మాట్లాడితే భయపడక తప్పదు. ఇలా బొమ్మలతో భయపెట్టే సినిమాలు ఎన్నో! విచిత్రంగా ఓ సామాన్యుడు కూడా బొమ్మలతో భయపెట్టిస్తున్నాడు. నిజానికి అతని ఉద్దేశం వేరే అయినా స్థానికులు మాత్రం అతని ఇంటిలోపలికి కాదుకదా కనీసం కింద నుంచి బాల్కనీ వైపు చూడ్డానికి కూడా భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. వెనెజులా రాజధాని కారకస్‌కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ ఎటాన్లస్ గోన్‌సాల్వెజ్‌కు ఓ డ్రైవర్‌తో మంచి స్నేహం ఉండేది. అతని కారులో ఎప్పుడూ బొమ్మలు ఉండేవి. అది చూసిన గోన్సాల్వెజ్ కొడుకు తనకు కూడా ఇలా బొమ్మలను ఒక చోట సెట్ చేయమని కోరాడు. దీంతో, గోన్సాల్వెజ్ మూడేళ్లపాటు శ్రమించి బాల్కనీ నిండా బొమ్మలతో విచిత్రంగా నింపాడు. అయితే, ఆ బొమ్మల బాల్కనీ చూసిన కొడుకు సంతోషించినా, స్థానికులు మాత్రం కలవరపడుతున్నారు. అచ్చం దెయ్యం బొమ్మల్లా కనిపించే వాటిని చూసి, అతనేదో క్షుద్రపూజలు చేస్తున్నాడని, వాటిని తీసేయాల్సిందే అంటూ గొడవకు దిగారు. ఇలా కొన్ని నెలలపాటూ ఈ బొమ్మలపై గొడవ జరిగింది. ఏం చేసినా గోన్సాల్వెజ్ వెనక్కి తగ్గకపోవడంతో.. స్థానికులే సైలెంటైపోయారు. దీంతో, ప్రస్తుతం ఈ బొమ్మల బాల్కనీ అక్కడ ఓ ల్యాండ్ మార్క్‌గా మారింది. కొంతమంది కేవలం ఆ బాల్కనీని చూడ్డానికి అదేపనిగా వస్తున్నారు. ప్రస్తుతం అతను ఇంటిలోనికి అనుమతించడటం లేదు కానీ, కింద నుంచి చూసే అవకాశం మాత్రం ఉంది. -
ప్రాణం తీసిన వీడియో కాల్
సాక్షి, హైదరాబాద్: సెల్ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ రెండో అంతస్తు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. మణికొండలో నివసించే తాళ్లూరి శ్యామ్యూల్ సుజిత్ (32) ప్రైవేటు ఉద్యోగి. శనివారం ఉదయం తన సోదరుడితో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. రెండో అంతస్తులోని బాల్కనీలో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు సుజిత్ జారిపడ్డాడు. వెంటనే స్పందించిన పక్కింటివారు సుజిత్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన సుజిత్‌ను కుటుంబసభ్యులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సుజిత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు సుశీల్ బాగ్యరాజ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
అమ్మ గోరుముద్దలే ఆఖరు..
కుత్బుల్లాపూర్: ఆప్యాయంగా అమ్మ తినిపించిన గోరుముద్దలే ఆ చిన్నారికి చివరివి అయ్యాయి. తల్లితో ప్రేమగా మాట్లాడిన మాటలే కడసారి పలకరింపులయ్యాయి. హోలీ పండగ కోసం మేనమామ ఇంటికి వచ్చిన ఆరేళ్ల బాబుకు నూరేళ్లూ నిండాయి. అపార్ట్మెంట్ మూడో అంతస్తులోనిబాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందిన ఘటన పేట్బషీరాబాద్పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరిగిన బాలుడు అసువులు బాయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లి రోదనలు మిన్నంటాయి. చేయి కడుక్కుని, గ్లాస్లో నీళ్లు తెచ్చేలోపు కుమారుడు మేడపై నుంచి పడి మృత్యు ఒడిలోకి చేరడంతో పండగ రోజు ఆ కుటుంబం విషాదంలో మునిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నితిన్ రెడ్డి, శ్రావ్య దంపతులు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు శ్రీహన్‌రెడ్డి (6) ఉన్నాడు. వీరు దుబాయ్‌లో ఉంటున్నారు. కుమారుడికి మాటలు సరిగా రాకపోవడంతో సర్జరీ నిమిత్తం కుమారుడిని తీసుకొని ఆరు నెలల క్రితం శ్రావ్య నగర శివారు ప్రాంతంలోని కోణార్క్ ఆస్పత్రి పైప్‌లైన్ రోడ్డు సమీపంలోని లక్ష్మీగంగా ఎంక్లేవ్‌కు వచ్చి ఉంటున్నారు. కుమారుడు Ôశ్రీహన్‌రెడ్డి ప్లేస్కూల్లో చదువుతున్నాడు. ఉద్యోగరీత్యా నితిన్‌రెడ్డి దుబాయ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో హోలీ పండగ కోసం జీడిమెట్లలోని భీమ్ప్రైడ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న సోదరుడి ఇంటికి శ్రావ్య తన కుమారుడు శ్రీహన్రెడ్డిని తీసుకొని ఆదివారం రాత్రి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాలుడికి అన్నం తినిపించారు. చేయి శుభ్రం చేసుకుని, గ్లాస్లో తాగునీరు తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లారు. ఈ సమయంలో బాల్కనీలో ర్యాలింగ్ ఎక్కిన శ్రీహన్‌రెడ్డి అదుపుతప్పి మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మరో ఘటనలో డిగ్రీ విద్యార్థి.. కుత్బుల్లాపూర్: డిగ్రీ చదువుతున్న విద్యార్థి బిల్డింగ్‌పై నుంచి పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్సీఎల్ గోదావరి హోమ్స్‌లో ఉంటున్న నాగరాజు రెండో కుమారుడు సుబ్రహ్మణ్యం (18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఫోన్లో మాట్లాడుతూ ఐదో అంతస్తుకు వెళ్లాడు. అనుమానాస్పదస్థితిలో కిందపడ్డాడు. వెంటనే గుర్తించి సూరారంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి స్నానం చేస్తుండగా..
సాక్షి, న్యూఢిల్లీ : యువతి స్నానం చేస్తుండగా సెల్లో ఫొటోలు తీసేందుకు యత్నించిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఢిల్లీలోని శంకరపురలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. యువతి స్నానం చేసి వస్తుండగా పైఅంతస్తులో నివాసముండే 42 ఏళ్ల వ్యక్తి బాల్కనీలో ఉండడం గమనించారు. అతని చేతిలో మొబైల్ ఉండడం.. అంతకు ముందుకూడా తనతో అసభ్యంగా ప్రవర్తించి ఉండడంతో ఆమెకు అనుమానం కలిగింది. స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడేమోనని నిశ్చయించున్నారు. అదేవిషయమై అతన్ని ప్రశ్నించడంతో తటపటాయించాడు. పొంతనలేని సమాధానాలు చెప్తూ ఇంట్లోకి జారుకున్నాడు. జరిగిన విషయాన్ని ఇంట్లోని వారికి చెప్పిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి నిందితున్ని నిలదీశారు. నిందితుడు తనకేమీ తెలియదని చెప్పి తప్పించుకోజూశాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేశామని, విచారణ ప్రారంభించామని తెలిపారు. ఓ ప్రముఖ హిందీ దిన పత్రికలో నిందితుడు టెక్నిషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
ఎంప్లాయ్స్ అంతా బాస్ పోయాడనుకున్నారు!
మోస్టర్: సాఫ్ట్వేర్ ఉద్యోగులను బాస్ మీటింగ్ ఉందంటూ పిలిచాడు. మీటింగ్‌కు వెళ్లిన వారితో ఉత్సాహంగా మాట్లాడాడు. తన ప్రసంగంతో అదరగొట్టాడు. ఇకమీటింగ్ ముగిసిందనగా.. ఒక్కసారిగా బిల్డింగ్ బాల్కనీలోంచి కిందకు దూకాడు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు ఆందోళనతో పరుగులు తీశారు. కొందరైతే తమ బాస్ ఇక లేడనుకున్నారు. బోస్నియా అండ్ హెర్జిగోవినాలోని మోస్టర్లో క్రెజిక్ అనే క్రేజీ బాస్ చేష్టలకు ఉద్యోగులకు నోటమాటరాలేదు. ఎన్సాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ సంస్థ ఫౌండర్, ఓనర్ అయిన క్రెజిక్.. కార్యాలయం నుంచి అలా కిందకు దూకగానే ఉద్యోగులు ఉరుకులు పరుగులతో బాల్కనీలోకి వచ్చి చూశారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న క్రాష్ మ్యాట్ మీద బాస్ నవ్వుతూ కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. తన ఉద్యోగులకు ‘పొలిటికల్ సూసైడ్’ అనే అంశం గురించి చెప్పడానికే తాను అలా చేశానని క్రెజిక్ వెల్లడించాడు. అన్నట్లు గతంలోనూ ఉద్యోగులను ఇలాంటి చేష్టలతో క్రెజిక్ షాక్‌కు గురిచేశాడట. ఆన్లైన్ గేమింగ్, స్పోర్ట్స్ బెట్టింగ్ ఇండస్ట్రీలో ఎన్సాఫ్ట్కు మంచి పేరుంది. -
ఫేస్బుక్ ఫ్రెండ్ పెళ్లికి ఒప్పుకోలేదని..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తనతో పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో యువతిని బాల్కనిలోంచి కిందకు తోశాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మొంగొల్పురి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమిత్(28), బాధిత యువతి రెండేళ్లుగా ఫేస్బుక్ ఫ్రెండ్స్. గత కొంతకాలంగా యువతిని పెళ్లి చేసుకుంటానని అమిత్ వేదిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అవంతికా ఎన్‌క్లేవ్‌లోని యువతి ఇంటికి వెళ్లిన అమిత్.. ఆమె కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. ఘర్షణలో భాగంగా యువతిని బలంగా నెట్టడంతో బాల్కనిలోంచి కిందపడిన ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. యువతిని వెంటనే బాబా సాహెబ్ అంబేడ్కర్ అసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అమిత్‌ను పట్టుకొని ఇరుగుపొరుగువారు పోలీసులకు అప్పగించారు. కాగా.. సదరు యువతి తనకు డబ్బులు చెల్లించాల్సి ఉందని.. అందులో భాగంగానే గొడవ జరిగిందని అమిత్ పోలీసులతో తెలిపాడు. -
అలల పందిరి
ఉదయం పదిన్నర దాటి ఉంటుంది. లేక ఎక్కువయినా ఉండొచ్చు. నా చేతికి గడియారం పెట్టుకునే అలవాటు లేదు. హాలులో గోడ గడియారం ఉంది. అది పని చేయడం మానేసి ఆరు నెలలు అయి ఉంటుంది. ఆ రోజు ఉదయం నుండే హాలులో కేన్వాస్ ముందు కూర్చుని పనిలో నిమగ్నమయ్యాను. స్పష్టమయిన ఆలోచన ఉంది. సంవత్సరం నుండి ఆ ఆలోచన తిరుగుతున్నా ఆ రోజే కూర్చుని మూడువంతుల పని ముగించాక అక్కడక్కడా మార్పులు చేస్తే బావుంటుందనిపించింది. పని ఆగింది. టీ కాచుకుని తాగి సిగరెట్ వెలిగించాను. మా ఇంటి వారెవరికీ నా పెయింటింగ్ మీద ఆసక్తి లేదు. అరవయ్యేళ్ళ వయసు దాటిన నన్ను ఈ విషయంలో నా మానాన నన్ను వదిలిపెట్టినట్టే. నా పనిలో జోక్యం కలిగించుకోరు. నేను వేసే బొమ్మలు వాళ్లకు అర్థం కావు. చెప్పాలి. ఇప్పటికి మూడుసార్లు సిటీలో కళామందిర్లో నా బొమ్మల ప్రదర్శన జరిగింది. అన్నీ కావుగాని కొన్ని అమ్ముడయ్యాయి. కొన్ని ఆసక్తి ఉన్న వాళ్లకు ఇచ్చాను. ఒక్కటి మటుకు మిగిలిపోయింది. దానితోనే సతమతమవుతుంటాను. విశ్వవిద్యాలయానికి అవతల నాకు మరో ఇల్లు ఉంది. ఈ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. మొదట్లో నా భార్య పిల్లలు ఈ ఇంట్లోనే ఉండేవాళ్లు. పిల్లలు పెద్దవాళ్లవుతుంటే ఇల్లు చిన్నది కావడం మొదలయింది. విశ్వవిద్యాలయం దగ్గర ఇల్లు కట్టుకున్నాక అందరం అక్కడకు మారాం. పాత ఇల్లు అమ్మలేదు. స్టూడియోగా ఉపయోగించుకుంటున్నాను. ఉదయం ఉపాహారం చేశాక పాత ఇంటికి వచ్చి కేన్వాస్ల ముందు కూర్చుంటాను. విసుగేసినప్పుడు నా మినీ లైబ్రరీలోంచి ఏ పుస్తకాన్నయినా తీసుకుని చదువుకుంటాను. నా భార్యకు వీలుంటే మధ్యాహ్నం భోజనం చేయడానికి ఏదయినా టిఫిన్‌లో పెట్టి ఇస్తుంది. వీలుకానప్పుడు ఈ ఇంట్లో నేనే ఏదయినా వండుకుంటాను. ఇంట్లో బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు అన్నీ ఉన్నాయి. ఫ్రిజ్ ఉంది. నాలుగయిదు పాలపేకట్లు ఎప్పుడూ ఉంచుకుంటాను. రోజులో నాలుగయిదు సార్లయినా టీ కాచుకుని తాగుతుంటాను. సాయంత్రం కొద్దిసేపు బీచ్‌లో కూర్చుని చీకటి పడే సమయానికి కారులో విశ్వవిద్యాలయం దగ్గర ఇంటికి వెళ్ళిపోతుంటాను. ఎప్పుడో తప్ప నా దినచర్యలో మార్పు ఉండదు. ఎండ కిటికీ ఎక్కింది. చేస్తున్న పని ఆపి సిగరెట్ వెలిగిద్దామనుకునేంతలో వీధి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. సామాన్యంగా ఈ ఇంటికి ఎవరూ రారు. స్నేహితులకు కూడా నేను ఇక్కడ ఉంటానని తెలియదు. ఎక్కువగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంటాను. లేచి తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు తెరిచాను. పై మెట్టు మీద భుజాలనిండా పైట కప్పుకుని ఆమె నిలబడి ఉంది. ఆమె మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటున్న సంగతి మినహా ఆమె గురించి ఏమీ తెలియదు. నలభై సంవత్సరాలుండొచ్చు. అందం వయసు మీదే ఉంది. సాదా చీరలో ఉంది. ‘‘నమస్కారమండీ’’ అంది. ‘‘నమస్కారమమ్మా’’ అన్నాను. ఆమె కన్నా ఇరవై సంవత్సరాలు పెద్దవాడిని. ‘‘నేను ఎదురింట్లో ఉంటాను...’’ ఆగింది. మాటలు నీరసంగా ఉన్నాయి. ఆ ఇల్లు ఆమె సొంతమో, అద్దెకు ఉంటుందో తెలియదు. ఏదో అడగడానికి వచ్చింది. వచ్చాక అడగడానికి మొహమాటం అడ్డం వస్తూ ఉండొచ్చు. ఆమె డెలికసీని తప్పిస్తూ, ‘‘అడుగమ్మా... నాకు నీ అంత కూతురుంది’’ అన్నాను. ‘‘మీరు ఏమనుకోకపోతే... మీ దగ్గర ఎంతో కొంత బియ్యం ఉంటే ఇవ్వగలరా...?’’ ఆమె ఏదో చెప్పబోతోంది. వినాలనిపించలేదు. ఆమెకు భర్త, పిల్లలు ఉన్నారేమో నాకు తెలియదు. నాకు అనవసరమయిన విషయం. ఆమె ఏ పరిస్థితిలో ఉండి బియ్యం అడిగి ఉంటుందో అర్థం చేసుకోగలను. ‘‘తప్పకుండా’’ అని వంటగది వైపు నడిచాను. ఉదయమే అయిదు కిలోల బియ్యం తెచ్చుకున్నాను. అప్పుడప్పుడు నాకు ఇష్టమయిన వంట చేసుకుని తింటుంటాను. బియ్యపు సంచి తీసుకువచ్చి ఆమెకు ఇస్తున్నప్పుడు ఆమె కళ్లు కృతజ్ఞతతో తడిచాయి. ‘‘వీలయినంత త్వరలో తిరిగిచ్చేస్తాను...’’ అని దుఃఖంతో నిండిన స్వరంతో అంటోంటే ఆమె మాటలకు అడ్డుతగిలి, ‘‘తొందరేమీ లేదమ్మా’’ అని జేబులోంచి వెయ్యి రూపాయల నోటు తీసి ఇచ్చాను. తీసుకుంది. ఆమె పేరు అడుగుదామనుకునేంతలో మెట్లు దిగి వెళ్లిపోయింది. రోడ్డు త్వరత్వరగా దాటి వాళ్ళింట్లోకి వెళ్తూ వెనక్కి తిరిగి నా వైపు చూస్తుందని అనుకున్నాను. చూడలేదు. తలుపు మూసి పడక కుర్చీలో కూర్చుని సిగరెట్ ముట్టించాను. నా ధ్యాస చిత్రం మీదకు మళ్లింది. సంతృప్తికరంగా చిత్రం వచ్చే వరకు సిగరెట్లు కాలుస్తుంటాను. సిగరెట్లు తాగడం ఎప్పటికప్పుడు మానేయాలనుకుంటాను. మానలేను. మా పిల్లల ముందు సిగరెట్లు తాగను. మరుసటి రోజు నుండి నా ఇంటి ముందు గోడ పక్కగా కారు ఆపి దిగబోతూ ఆమె ఇంటి వైపు చూశాను. వీధి తలుపు మూసి ఉంది. కిటికీ తలుపులు తెరిచివున్నాయి. కొత్త ఆలోచన వచ్చింది. కారు దిగి నా ఇంట్లోకి వెళ్లి బల్ల మీదున్న రఫ్‌బుక్ అందుకుని పెన్సిల్‌తో నాకు వచ్చిన ఆలోచనకు స్కెచ్ గీశాను. అలా చేయకపోతే మర్చిపోతాను. ఒహపట్టాన గుర్తురాదు. రెండు వారాలు గడిచాక ఆమె మళ్లీ వచ్చింది. లోగడ తీసుకున్న బియ్యం తిరిగి ఇచ్చేందుకేమో అనుకున్నాను. కాదు. ఖాళీసంచి నాకు అందిస్తూ, ‘‘మళ్లీ మీకు ఇబ్బంది పెడుతున్నాను...’’ అంది. మునుపటి మొహమాటం కనిపించలేదు. చక్కగా నవ్వింది. ఆమెకు ఏం కావాలో నాకు అర్థమయింది. ఆమె రావచ్చేమో అనుకున్నాను కాని వస్తుందని ఊహించలేదు. ఈసారి మునుపు ఇచ్చిన బియ్యం కన్నా ఎక్కువే ఇచ్చాను. కూరగాయలు, రెండు పాలపేకట్లు, డజను కోడిగుడ్లు కూడా ఇచ్చాను. ‘‘ఇవన్నీ ఎందుకండీ?’’ అంది కాని తీసుకుంది. వెళ్లిపోవడానికి ఒక మెట్టు దిగి, ఏదో ఆనబోయింది కాని అనలేదు. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు పేరు అడగడం మర్చిపోయానే అనుకున్నాను. దాదాపు పూర్తి చేసిన చిత్రంలో చిన్న మార్పు చేశాను. సంపూర్ణత వచ్చిందనిపించింది. చిత్రానికి ఏం పేరు పెట్టాలో తోచడం లేదు. చిత్రం ఒకసారి చూస్తే సాదాగా ఉంటుంది. మరోసారి చూసినప్పుడు నిగూఢత కనిపిస్తుంది. స్టేజి మీద ఆమె ఉంటుంది. థియేటర్లో లైట్లన్నీ ఆర్పబడి ఉంటాయి. ఒక్క లైటు మటుకు ఆమె మీద ఫోకస్ చేయబడి ఉంటుంది. తెరలు మెల్లగా పైకి లేస్తుంటాయి. ఒక చేత్తో ఆమె తెర తీయవద్దని, మరొక చేత్తో తీయమని సంజ్ఞలు చేస్తుంటుంది. అంతే. నెలరోజుల తర్వాత నా చిత్రప్రదర్శన కావ్య రెసిడెన్సీలో ఏర్పాటు చేసినప్పుడు ఆమె రాకకు ఆశ్చర్యం వేసింది. నా గురించి ఆమెకు తెలుసని నేను అనుకోలేదు. నల్ల చారలున్న తెల్లచీరలో మనిషి చాలా అందంగా ఉన్నట్లనిపించింది. వయసు కనబడడం లేదు. నన్ను ఆమె చూడలేదు. ఆమె ఒక్కొక్క బొమ్మ చూస్తూ మధ్యమధ్యలో సెల్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. వెళ్లి ఆమెను పలకరిద్దామనుకునేంతలో ఎవరో నన్ను పిలిచి పక్కకు తీసుకువెళ్లి మాట్లాడి తిరిగి హాల్లోకి వచ్చేసరికి ఆమె కనబడలేదు. వెళ్ళిపోయినట్టుంది. బాల్కనీలోకి వచ్చి కిందకు చూశాను. ఆమె తలవంచుకుని బయటకు వెళ్తోంది. ఆమె పేరు అడుగుదామనుకునేంతలో మెట్లు దిగి వెళ్లిపోయింది. రోడ్డు త్వరత్వరగా దాటి వాళ్ళింట్లోకి వెళ్తూ వెనక్కి తిరిగి నా వైపు చూస్తుందని అనుకున్నాను. చూడలేదు. వారం గడిచాక ఆ సాయంత్రం బీచ్‌లో ఎప్పుడూ కూర్చునే చోట కూర్చున్నాను. సూర్యుడు కనుమరుగయ్యాడు. కాని వెలుగు తగ్గలేదు. వర్షం వచ్చేట్టుగా ఉంది. వస్తే బావుణ్ణు. వర్షంలో తడవడం నాకు ఇష్టం. సమయం ఎంతయిందో తెలియదు. కొద్దిసేపు కూర్చున్నాను. కారుమేఘాలు చెల్లాచెదరయ్యాయి. లేచి రోడ్డుపక్కగా పార్క్ చేసిన నా కారు వైపు వస్తోంటే కాలిబాట మీద ఆమె నాకు ఎదురయింది. పలకరిద్దామనుకుని ఆగిపోయాను. పక్కనే ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఒకతను నడుస్తున్నాడు. ఇద్దరి చేతుల్లో ఐస్‌క్రీం కోన్లు ఉన్నాయి. అతనామెకు తినిపిస్తున్నాడు. ఆమె అతనికి తినిపిస్తోంది. అతను ఆమెకు భర్తగా అనిపించలేదు. వయసులో ఆమెకంటే చిన్నవాడిలా ఉన్నాడు. ఆమె అంత అందంగా లేడు. కాలిబాట దిగి వాళ్లకు దారి ఇచ్చాను. బీచ్‌లో ఇటువంటి దృశ్యాలు చూడడం కొత్తేమీ కాదు. కారులో కూర్చుని స్టార్ట్ చేస్తోంటే ఆమె వెనక్కి తలతిప్పి నా వైపు చూసింది. వాళ్ల పక్కనుండి కారు తీసుకువెళ్తూ వాళ్ల వైపు చూడలేదు. ఆ రాత్రి అన్నం కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ఆమె చూపులు గుర్తుకువచ్చాయి. చిన్నచిన్న పనులు ఉన్నందున స్టూడియో ఇంటికి వెళ్లడం కుదరలేదు. వారం తర్వాత వెళ్లి, ఇంటి బయట కారు పార్క్ చేసి, ప్రహరీ గోడ ఇనుప తలుపు తెరచుకుని మెట్లు ఎక్కి ఇంటి తలుపు తాళం తీస్తుండగా, ‘‘హలో’’ అన్న పిలుపు విని వెనక్కి తిరిగాను. ఆమె! ఆమె చేతిలో సంచి ఉంది. ‘‘మీ బియ్యం’’ అంది. మరో మాట అనలేదు. నా ముఖంలోకి కూడా చూడలేదు. చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయింది. బియ్యం తిరిగి ఇచ్చేసినందుకు నాకు బాధ అనిపించలేదు. కానీ ఆమె మాట తీరుకు నొచ్చుకున్నాను. తలుపు దగ్గరగా వేసి సోఫాలో కూర్చున్నాను. కిటికీ తలుపులు తెరవాలని కూడా అనిపించలేదు. ఇంటి తాళం చెవి తీయని సంగతి గుర్తుకువచ్చి, లేచి తలుపుతెరచి తాళం గుత్తి జేబులో వేసుకుంటూ ప్రహరీ గోడ తలుపువైపు చూశాను. అడుక్కుతినే బక్క మనిషి అటూ ఇటూ చూశాడు. తలుపుపక్కనే ఉన్న నన్ను గమనించలేదనుకుంటాను. ఆమె వదిలివెళ్ళిన బియ్యపు సంచి ఎత్తి భుజాన పెట్టుకుంటున్నప్పుడు ప్రహరీ గోడకు ఉన్న మేకు సంచికి తగిలి కింద కన్నం పడింది. అది అతను గమనించినట్టు లేదు. వేగంగా నడవడం మొదలెట్టాడు. అతన్ని వారించలేదు. పరుగెత్తితే బక్క ప్రాణం కింద పడిపోతుంది. చిరుగులోంచి బియ్యం కారిపోతోంది. - బి.పి. కరుణాకర్ -
బాల్కనీలో బందీనయ్యా!
‘‘హఠాత్తుగా వర్షం కురిసింది. దానివల్ల నా ప్లాన్ అంతా పాడైపోయింది. ఆ వర్షం కారణంగా నా బాల్కనీ తలుపు మీద బలప్రయోగం చేయాల్సి వచ్చింది’’ అని ఇలియానా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆ సాయంత్రం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటంతో ఇలియానాకి వాకింగ్‌కి వెళ్లాలనిపించిందట. హుషారుగా రెడీ అయిపోయి, ఇంటి బయట కాలుపెట్టాలనుకుంటున్న సమయంలో చిరుజల్లులు మొదలయ్యాయి. దానికి తోడు బలమైన గాలి కూడా. మేడ మీద బాల్కనీలో తలుపులు తెరిచి ఉండటంతో ఇలియానా పైకి వెళ్లారు. వాన చినుకుల్ని, చల్లని గాలినీ ఆస్వాదించాలని ఆమె బాల్కనీలోకి వెళ్లారు. ఆ తర్వాత జరగకూడనిదే జరిగింది. గాలికి బాల్కనీ తలుపు లాక్ అయిపోయిందట. ఇంట్లోకి రావాలంటే తాళం కావాలి. కానీ, ఆ తాళం ఎక్కడుందో పాపం ఇలియానాకి గుర్తు రాలేదు. ‘‘కాసేపు బాల్కనీలో బందీనయ్యా’’ అన్నారు ఈ బ్యూటీ. చివరికి తలుపు బద్దలు కొట్టి, లోపలికొచ్చారట. మూడ్ అంతా పాడైపోయిందని, నేనొకటి ప్లాన్ చేస్తే, ప్రకృతి మరోటి ప్లాన్ చేసిందని తన ట్విట్టర్లో ఇలియానా పేర్కొన్నారు