ఫేస్బుక్ ఫ్రెండ్ పెళ్లికి ఒప్పుకోలేదని..
ఫేస్బుక్ ఫ్రెండ్ పెళ్లికి ఒప్పుకోలేదని..
Published Wed, Sep 21 2016 10:05 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తనతో పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో యువతిని బాల్కనిలోంచి కిందకు తోశాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మొంగొల్పురి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమిత్(28), బాధిత యువతి రెండేళ్లుగా ఫేస్బుక్ ఫ్రెండ్స్. గత కొంతకాలంగా యువతిని పెళ్లి చేసుకుంటానని అమిత్ వేదిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అవంతికా ఎన్క్లేవ్లోని యువతి ఇంటికి వెళ్లిన అమిత్.. ఆమె కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. ఘర్షణలో భాగంగా యువతిని బలంగా నెట్టడంతో బాల్కనిలోంచి కిందపడిన ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. యువతిని వెంటనే బాబా సాహెబ్ అంబేడ్కర్ అసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అమిత్ను పట్టుకొని ఇరుగుపొరుగువారు పోలీసులకు అప్పగించారు. కాగా.. సదరు యువతి తనకు డబ్బులు చెల్లించాల్సి ఉందని.. అందులో భాగంగానే గొడవ జరిగిందని అమిత్ పోలీసులతో తెలిపాడు.
Advertisement
Advertisement