![Man Attack On Woman With Screwdriver For Refusing Marriage - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/3/fb.jpg.webp?itok=VZHfiwfi)
సాక్షి, రంగారెడ్డి: ఫేస్ బుక్ పరిచయం ఓ వివాహితను ఇబ్బందుల పాలు చేసింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కందుకూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన మహిళ స్థానిక ఎంబీఆర్ నగర్‌లో నివాసం ఉంటోంది. భర్త రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కూతురు ఉంది.
ఈమెకు ఫేస్‌బుక్ ద్వారా మంచాల మండలం రంగాపూర్‌కు చెందిన శివకాంత్(28)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని బెదరింపులకు పాల్పడుతున్నాడు. సోమవారం ఏకంగా వివాహిత ఇంట్లోకి చొరబడి స్క్రూ డ్రైవర్‌తో ఆమె మెడ, చెంప, కూడి చేతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
దీంతో బాధిత మహిళ, ఆమె అమ్మమ్మ కేకలు వేయడంతో నిందితుడు పారిపోయేందుకు యత్నించాడు. అదే భవనంలో ఉన్న వారు నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
చదవండి: Hyderabad: ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని దారుణం.. డెలివరీ బాయ్ వెంటపడి మరీ..
Comments
Please login to add a commentAdd a comment