Indian Woman Anju Marries Pakistan FB Friend Converts to Islam, Report Said - Sakshi
Sakshi News home page

బిగ్‌ ట్విస్ట్‌.. ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి!

Published Tue, Jul 25 2023 6:45 PM | Last Updated on Tue, Jul 25 2023 7:24 PM

Report: Indian woman Anju Marries Pakistan FB Friend Converts To Islam - Sakshi

ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ మహిళా అంజూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఫేస్‌బుక్‌ స్నేహితుడు నస్రుల్లాను కలిసేందుకు ఆమె తన భర్త, పిల్లలను వదిలి దాయాది దేశానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తరువాత నస్రుల్లా తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని, అతన్ని పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని పేర్కొంది అంజూ. తాను కేవలం ఓ పెళ్లికి హాజరు కావడానికి మాత్రమే పాక్‌కు చేరినట్లు, త్వరలోనే భారత్‌కు రానున్నట్లు తెలిపింది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్‌ నెలకొంది.

మాతం మార్చుకున్న అంజూ
ప్రియుడు నస్రుల్లాను పెళ్లి చేసుకునేందుకు అంజూ ఇస్లాం మతంలోకి మారినట్లు తెలుస్తోంది. తన పేరును సైతం అంజూ నుంచి ఫాతిమాగా మార్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె బురఖా ధరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పాక్‌లోని దిర్‌ జిల్లా కోర్టులో వీరిద్దరూ అధికారికంగా నిఖా జరుపుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ మేరకు అంజూ, నస్రుల్లా ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతూ.. టూరిస్ట్‌ ప్రాంతాలను సందర్శించే ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.
సంబంధిత వార్త:  అందుకే పాక్‌ వచ్చా.. అంజూ వ్యవహారంలో ట్విస్ట్‌!

నిఖా హోగయా
అంజూ, నస్రుల్లా వివాహాన్ని మలకాండ్‌ డివిజన్‌ డీఐజీ నసీర్‌ మెహమూద్‌ సత్తి ధృవీకరించారు. ఆ మహిళా ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరును మార్చుకున్నట్లు పేర్కొన్నారు. నస్రుల్లా కుటుంబ సభ్యులు, పోలీసులు, న్యాయవాదుల సమక్షంలో దంపతులు దిర్ బాలాలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా అంజూను పోలీసు భద్రతతో కోర్టు నుంచి ఆమె కొత్త అత్తవారి ఇంటికి తీసుకెళ్లారు.

24 గంటలు గడవకముందే
నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తన వీసా గడువు ముగియగానే ఆగస్టు 20న భారత్‌కు తిరిగి వస్తుందని పేర్కొన్న మరుసటి రోజే ఈ  పరిణామం చోటు చేసుకుంది. అటు నస్రుల్లా సైతం తమ ప్రేమ వ్యవహారంపై వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అయితే 24 గంటలు గడవకముందే మొత్తం సీన్ మారిపోవడంతో ప్రజలు అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు అంజూ చెప్పింది అబద్దమేనా..? ఆమె ముందుగానే ప్లాన్ ప్రకారం అతడిని పెళ్లి చేసుకుందా? లేదా వారు బలవంతంగా ఇలా చేశారా? అన్నది ఆసక్తిగా మారింది.

పాక్‌లోనే ఉంటుందా? తిరిగొస్తుందా!
ప్రస్తుతం అంజూ వీసా గడువు ఆగస్ట్ 20వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇండియా వచ్చేయాలి. అంజూ ఇప్పుడు ఇస్తాం మతం స్వీకరించటంతోపాటు.. నుజురుల్లాను పెళ్లి చేసుకోవటం, పేరు మార్చుకోవటం చూస్తుంటే పాకిస్థాన్‌లోనే ఉండిపోతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారమంతా లవ్ జీహాదీ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: ఏంటిది? మొత్తం ముఖానికే మాస్క్! బాబోయ్‌! మళ్లీ చైనాకు ఏమైంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement