Islam
-
తలాక్ అంటే..? ఈ వివరాలు తెలుసా?
దివ్య ఖుర్ఆన్ ఇలా చెబుతోంది...తమ భార్యలను ముట్టుకోము అని ఒట్టు పెట్టుకునే వారికి నాలుగు నెలల గడువు ఉంటుంది. 2:226వివరణ: పండితుల ప్రకారం షరిఅత్ పరిభాషలో దీనిని ‘ఈలా’ అని అంటారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ సుహృద్భావ పూర్వకంగా ఉండవు. అపశ్రుతులు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ ఉభయలు చట్టబద్ధంగానైతే దాంపత్య బంధంలోనే ఉంటూ క్రియాత్మకంగా ఇద్దరు భార్యాభర్తలు కానట్టుగానే వేరుగా మసులుకునేటటువంటి విధానాన్ని దైవ శాసనం (షరిఅత్) ఇష్టపడదు. ఇలాంటి అపసవ్యత కొరకు అల్లాహ్ నాలుగు నెలలు గడువు నిర్ణయించాడు. ఈ మధ్యకాలంలో వారు తమ సంబంధాలను సరి చేసుకోవాలి లేదా దాంపత్య బంధాన్నైనా తెంచి వేయాలి. అప్పుడైనా ఆ ఇరువురు పరస్పరం స్వేచ్ఛ ఉంది తమకు కుదురుగా ఉన్న వారితో పెళ్లి చేసుకోగలరు. తన భార్యతో దాంపత్య సంబంధం కలిగి ఉండనని భర్త ఒట్టు పెట్టుకున్న సందర్భానికే ఈ ఆదేశం వర్తిస్తుంది. పోతే ఒట్టు పెట్టుకోకుండా భార్యతో సంబంధాలను తెంచుకునే సందర్భంలోనయితే– అలా ఎంత కాలం సాగినా ఈ ఆదేశం దానికి అతకదని ఈ (ఆయత్) వాక్యం ఉద్దేశం.మరొక విషయం ఏమిటంటే ప్రమాణం చేసినా, చేయకపోయినా రెండు సందర్భాల్లోనూ బంధాన్ని విరమించుకుంటే దానికి గడువు కాలం ఈ నాలుగు మాసాలే. ఈ ఆదేశం కేవలం ఏవైనా మనస్పర్ధల వల్ల ఏర్పడే సంబంధాల ప్రతిష్టంబనకు వర్తిస్తుంది. కానీ మరేదైనా కారణంగా భర్త భార్యతో శారీరక సంబంధాన్ని విరమించుకుంటే సాధారణ సంబంధాలు సుహృద్భావ పూర్వకంగా కొనసాగే పక్షంలో ఈ ఆదేశం వర్తించదు. అయితే కొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాన్ని తెంచివేసే ఏ ప్రమాణమైన సరే అది ఇలా పరిగణించబడుతుంది. ఇది నాలుగు నెలలకు పైగా నిలవరాదు. ఇష్టంలేని పక్షంలోనైనా ఇష్టపూర్వకంగానైనా సరే.ఒకవేళ వారు వెనక్కి మరలినట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, దయ చూపేవాడు: 2:227కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ గడువు లోపల తమ ప్రమాణాన్ని భగ్ననపరిచి తిరిగి దాంపత్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే వారికి ప్రమాణ భంగం చేసినందుకు ప్రాయశ్చిత్తం లేదు. అల్లాహ్ అట్టే క్షమించి వేస్తాడు.మరికొంతమంది పండితుల అభిప్రాయంలో ప్రమాణభంగానికి ప్రాయశ్చిత్తం చెల్లించవలసి ఉంటుంది. వారనేది ఏమిటంటే దేవుడు ‘గఫూరుర్రహీం’ (మన్నించేవాడు కరుణించేవాడు) అన్న విషయానికి భావం ప్రాయశ్చిత్తం మాఫీ జరిగిందని కాదు మీ ప్రాయశ్చితాన్ని స్వీకరిస్తాడని, సంబంధ విరామ కాలంలో ఇరువురు పరస్పరం చేసుకున్న అన్యాయాన్ని మన్నించి వేయడం జరుగుతుందని మాత్రమే.– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
దారుణ విద్వేష క్రీడ!
అయిదు నెలలుగా బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాకులపై అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళకు తాజా ఉదాహరణ. మైనారిటీల హక్కుల కోసం బలంగా గళం విప్పే దాస్ బంగ్లాదేశీ జాతీయ పతాకాన్ని అవమానించారంటూ రాజద్రోహ నేరం మోపడం విడ్డూరం. ఆయనను మంగళవారం అరెస్ట్ చేసి, బెయిలివ్వకుండా, పది రోజుల కస్టడీకి పంపడంతో నిరసనలు చెలరేగాయి. సందట్లో సడేమియాగా దుష్టశక్తులు అల్లర్లు రేపి, పొరపాటున ఓ ముస్లిమ్ లాయర్ మరణానికి కారణమై, ఆ పాపం మైనా రిటీల నెత్తిన వేయడంతో ఢాకా మరోసారి భగ్గుమంది. ఆలయాలపై దాడులు, ప్రాణనష్టంతో... మైనారిటీలనూ, భావప్రకటనాస్వేచ్ఛనూ కాపాడాలంటూ బంగ్లాను భారత్ అభ్యర్థించాల్సొచ్చింది.ఇస్లామ్ అధికారిక మతమైనా, లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంగా, సమానత్వానికి రాజ్యాంగ బద్ధులమని చెప్పుకొనే బంగ్లా ఆ మాటకు తగ్గట్టు వ్యవహరించడం మానేసి, చాలాకాలమైంది.అందుకు తగ్గట్టే తాజాగా ‘ఇస్కాన్’ను ర్యాడికల్, మత ఛాందసవాద సంస్థ అని బంగ్లా అటార్నీ జనరల్ బుధవారం అభివర్ణించడం ఆందోళనకరం. ‘ఇస్కాన్’ను నిషేధించాలని బంగ్లా యోచిస్తు న్నట్టు వార్త. ఆధ్యాత్మిక చైతన్యం, పీడిత జన సముద్ధరణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో పనిచేస్తున్న ఒక సంస్థపై అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడం అక్షరాలా బుద్ధిహీనతే. దేశంలోని విభిన్న వర్గాల మధ్య సౌహార్దం పెంపొందించి, బాధితులకు న్యాయం చేసి, మానవ హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏ శక్తుల ప్రోద్బలంతో ఇలా మాట్లాడుతోందన్నది ఆశ్చర్యకరం. జూలై నాటి ప్రజా ఉద్యమంతో ఢాకాలో ప్రభుత్వ మార్పు జరిగిపోయింది కానీ, అల్పసంఖ్యాక వర్గాలపై సాగుతున్న దాడులు మాత్రం అప్పటి నుంచి ఆగడం లేదు. మైనారిటీలను పూర్తిగా తరిమేసి, బంగ్లాను హిందూ రహిత దేశంగా మార్చాలనే పన్నాగం దీనికి వెనక ఉందని స్థానిక స్వతంత్ర విశ్లేషకుల మాట. ఈ అల్లర్లు, అల్పసంఖ్యాక హిందువులపై దాడుల వెనుక మత ఛాందస జమాతే ఇస్లామీ ఉందనేది స్పష్టం. హసీనా సర్కారు కాలంలో నిషేధానికి గురైన ఈ ర్యాడికల్ గ్రూపు, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)లు యూనస్ యంత్రాంగంలో భాగమే. అసలు ఈ ప్రయత్నమంతా ఇస్లామిక్ షరియత్‌ను ప్రవేశపెట్టి, బంగ్లాదేశ్‌ను ప్రజాస్వామ్య ఎన్నికలు, పార్ల మెంట్‌తో పని లేని దేశంగా మార్చాలనే వ్యూహంలో భాగమని ఒక వాదన వినిపిస్తోంది. అదే గనక నిజమైతే, అత్యంత ప్రమాదకర పరిణామం. పౌరసమాజం, రాజకీయ నేతలు, ప్రజలు కలసి కట్టుగా అలాంటి వ్యూహాలను భగ్నం చేసి, కష్టించి సంపాదించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. అసలు అఫ్ఘన్ లాగానే బంగ్లాను తమ ప్రయోగశాలగా చేసుకోవాలని పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్నట్టుంది. అప్పుడిక బంగ్లా మరో తీవ్రవాద కేంద్రంగా మారే ప్రమాదముంది. అది భారత్‌కే కాదు... యావత్ ప్రపంచానికి నష్టం. నిజానికి, ఆసియా – పసిఫిక్ కూటమిలో బంగ్లాను భాగం చేసుకొని, లబ్ధి పొందాలని అమెరికా భావించింది. నిరుటి హసీనా సర్కార్ నో చెప్పడంతో అది కుదరలేదు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిచి ఉంటే ఏమో కానీ, ట్రంప్ గెలవడంతో బంగ్లా మధ్యంతర సర్కార్ సారథి – ట్రంప్ ద్వేషి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ట్రంప్ పగ్గాలు చేపట్టాక బంగ్లాపై కఠినవైఖరి అవలంబిస్తారని యూనస్‌కు తెలుసు. అందుకే, ఆలోగా మైనారిటీలపై అల్లర్లను ఆఖరి అస్త్రంగా చేసుకున్నారట. బంగ్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణకు అయిదు దశాబ్దాల పైచిలుకు క్రితం భారత్ అండగా నిలిచింది. కానీ, ఇప్పుడు అదే గడ్డపై భారత వ్యతిరేకత, మైనారిటీలపై ద్వేషాలను స్వార్థపరులు పెంచిపోషించడం విషాదం. దాదాపు 14 ఏళ్ళ పైగా షేక్ హసీనా ఏలుబడిలో నియంత పోకడల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత సాగిందని ఆరోపణలొస్తే, కొత్త హయాం కూడా తక్కువేమీ తినలేదు. విజృంభిస్తున్న విద్వేషం, విధ్వంసం ఢాకాలో పత్రికా స్వాతంత్య్రానికి సైతం ముప్పుగా మారాయి. ‘ప్రథమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’లాంటి స్వతంత్ర పత్రికా రచనకు పేరుపడ్డ పత్రికలపై దాడులు అందుకు ఓ మచ్చుతునక. బాధితు లకు సత్వర న్యాయం కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్ళ ఏర్పాటు సహా మైనారిటీల కనీసపాటి ఆకాంక్షల్ని నెరవేర్చడానికి బంగ్లా సర్కార్‌కు ఉన్న కష్టమేమిటి? హసీనా సర్కార్‌ను గద్దె దింపినప్పటి నుంచి ఇప్పటికి బంగ్లాలో మైనారిటీలపై 2 వేలకు పైగా దాడులు జరిగాయి. హిందూ, బౌద్ధ, క్రైస్తవ సోదరులపై జరుగుతున్న ఈ దౌర్జన్యకాండను మతపరంగా కాక మానవ హక్కుల పరంగా చూడాలి. అప్పుడే సమస్య తీవ్రత అర్థమవుతుంది. 1930లో బంగ్లాలో 30 శాతం పైగా ఉన్న హిందువులు ఇప్పుడు కేవలం 8 శాతం చిల్లరకు పడిపోయారన్న నిష్ఠుర సత్యం అక్కడ జరుగుతున్నదేమిటో ఎరుకపరుస్తుంది. విద్యుత్ సహా, బియ్యం, పత్తి, చమురు లాంటి అనేక సరుకుల విషయంలోనూ మనపై భారీగా ఆధారపడ్డ బంగ్లా సర్కార్‌పై ఇకనైనా భారత్ కఠినవైఖరిని అవలంబించాలి. పొరుగు దేశంలో బతుకు భయంలో ఉన్న హిందువులను కాపాడేందుకు క్రియాశీలంగా వ్యవహరించాలి. కేవలం మాటలకు పరిమితం కాకుండా, దౌత్య, వాణిజ్య రంగాల్లో చేయగలిగినదంతా చేయాలి. పేరుకు మాత్రం లౌకికవాదం ముసుగు వేసుకొని, మైనారిటీలకు వ్యతిరేకంగా, తెర వెనుక శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మిగిలిన అసమర్థ యూనస్ సర్కార్‌పై అంతర్జాతీయంగానూ ఒత్తిడి తేవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. -
భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి?
అల్లాహ్ స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యత ప్రసాదించడం వల్ల, పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చు పెడుతున్నందువల్ల పురుషులు స్త్రీలపై వ్యవహార కర్తలవుతారు. కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భర్తకు విధేయత చూపుతూ వారి కనుసన్నలలో నడుచుకుంటారు. పురుషులు (ఇంటిపట్టున) లేనప్పుడు దేవుని రక్షణలో వారి హక్కులు కాపాడుతుంటారు. మీ మాటలకు ఎదురు చెప్పి తిరగబడతారని భయం ఉన్న స్త్రీలకు (నయానా భయానా) నచ్చజెప్పండి. (అలా దారికి రాకపోతే) వారిని మీ పడకల నుండి వేరు చేయండి. ఆ తరువాత వారు మీకు విధేయులయిపోతే ఇక వారిని అనవసరంగా వేధించడానికి సాకులు వెతకకండి. పైన అందరికంటే అధికుడు, అత్యున్నతుడైన అల్లాహ్ ఉన్నాడని గుర్తుంచుకోండి.భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయని భయం ఉంటే భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని పెట్టుకోండి. వారిద్దరు కలిసి పరిస్థితిని చక్కదిద్దదలచుకుంటే అల్లాహ్ దంపతుల మధ్య సానుకూలత కలిగిస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞాని. సమస్తమూ ఎరిగినవాడు. (దివ్య ఖుర్ఆన్: 4:34–35)వివరణ: భార్య విననప్పుడు నచ్చజెప్పడం, పడకగదికి దూరంగా ఉండటం, విధేయత కనబరిస్తే ఆమెను మనసారా స్వీకరించడం ఎంత దానశీలి అయినా, ఎన్నిసార్లు దైవపూజలు చేసే వారయినా, భార్యని కొట్టే వారిని ప్రవక్త అభిమానించేవారు కాదు. 35 ఆయత్ (వాక్యం)లో అల్లాహ్ ఎంతోమంచి పరిష్కారం చూపాడు. భార్యాభర్తల మధ్య పొసగనపుడు అటువైపు నుండి ఒక మధ్యవర్తి ఇటువైపు నుండి ఒకరు మధ్యవర్తిత్వం వహించి వారిద్దరి మధ్య సమాధానం కుదిరిస్తే ఆ దంపతులు కూడా సమాధాన పడితే ఇద్దరి మధ్య అల్లాహ్ సానుకూలత కలిగిస్తాడు. మనిషికి దేవుడు మంచి చెడుల విచక్షణ జ్ఞానం, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇచ్చాడు. కాబట్టి వాటిని ఆయన అడ్డుకోకుండా స్వయంగా మనిషి సంకల్పించుకుంటే అల్లాహ్ దానిని పరిపూర్ణం చేస్తాడు. ఏ విషయంలోనూ ఎవరికీ బలవంతం పెట్టాడు. మనిషి విచక్షణను బట్టి అల్లాహ్ ఆ మనిషితో వ్యవహరిస్తాడు. కాబట్టి మనుషులమైన మనం మంచిని ఆలోచిస్తూ మంచినే కాంక్షిస్తూ మంచి చేస్తుంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అంతా మంచే జరుగుతుంది. అల్లాహ్ మనందరికీ మంచి చేసే భాగ్యాన్ని కలుగజేయుగాక ఆమీన్ (తథాస్తు)ఆధారం: అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ భావామృతం– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
పెళ్లి కేసులో ఇమ్రాన్‌కు ఊరట
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట. ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా పెళ్లాడారన్న కేసులో ఇమ్రాన్ (71), బుష్రా బీబీ (49) దంపతులను న్యాయస్థానం నిర్దోషులుగా తేలి్చంది. వారిపై మోపిన అభియోగాలను ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు శనివారం తోసిపుచి్చంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను కొట్టేసింది. మత ప్రబోధకురాలైన బుష్రా తన మొదటి భర్త ఖవర్ ఫరీద్ మనేకాతో 28 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుని ఇమ్రాన్‌ను పెళ్లా డారు. అయితే విడాకులకు, పునర్వివాహానికి మధ్య ముస్లిం మహిళ విధి గా పాటించాల్సిన 4 నెలల గడువు (ఇద్దత్)ను ఆమె ఉల్లంఘించిందంటూ ఫరీద్ కేసు పెట్టారు. ఈ కేసులో గత ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల ముంగిట ఇమ్రాన్ దంపతులకు ఏడేళ్ల శిక్ష పడింది. ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడ్డ మూడు కేసుల్లో ఇదొకటి. తోషా ఖానా కేసులో జైలు శిక్షను కోర్టు ని లుపుదల చేయగా, సిఫర్ కేసుల్లో నిర్దోíÙగా బయటపడ్డారు. దాంతో గత ఆగస్టు నుంచీ జైల్లోనే ఉన్న ఇమ్రాన్ విడుదలవుతారని భావించారు. కానీ తాజా తీర్పు వెలువడ్డ కాసేపటికే అల్లర్ల కేసులో ఆయన అరెస్టుకు ఉగ్ర వాద వ్యతిరేక కోర్టు అనుమతినిచ్చింది. దాంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు. -
Eid ul-Adha 2024: పరిపూర్ణ ఆరాధన హజ్జ్
ఇస్లామ్ ధర్మం ఐదు మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. ఇందులో ఏ ఒక్కదాన్ని విస్మరించినా విశ్వాసం పరిపూర్ణం కాదు. మొట్టమొదటిది సృష్టికర్త ఒక్కడే అన్న విశ్వాసం. రెండవది నమాజ్, మూడవది రోజా, నాల్గవది జకాత్, ఐదవది హజ్జ్. దైవ విశ్వాస ప్రకటనకు ఇవి ఆచరణాత్మక సాక్ష్యాలు. ఒక మనిషి విశ్వాసి/ ముస్లిమ్ అనడానికి రుజువులు. అన్ని ఆరాధనలకూ ‘హజ్జ్’ ఆత్మ వంటిది. ఆర్ధిక స్థోమత కలిగిన ప్రతి ముస్లింపై హజ్ విధిగా నిర్ణయించడం జరిగింది. అందుకని ఆర్థిక స్థోమత కలిగినవారు జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కాబా సందర్శన యాత్ర చేయడం తప్పనిసరి. ఈ‘హజ్’ జిల్ హజ్ మాసం పదవ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో జరుగుతుంది. ఆ రోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్ అజ్ హా’. దీన్ని బక్రీద్ పండుగ అని, ఈదె ఖుర్బాన్ అని కూడా అంటారు. ‘హజ్జ్ ’ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేద భావం మచ్చుకు కూడా కనిపించదు. ‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. మక్కా నగర ఆవిర్భావంమక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ్రపాంతంలో మహనీయ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హజ్రత్ హాజిరా అలైహిస్సలాంను, తనయుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు, శ్రీమతి హాజిరా, ’అదేమిటీ.. నన్నూ, నాబిడ్డను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటీ.?’అని ప్రశ్నించగా..,’ఇది దైవాజ్ఞ.’ అని మాత్రమే చెప్పి, అల్లాహ్‌పై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్ళిపోతారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం.కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్క నీరులేని ఆఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడమలు రాసుకుపోయిన చోట అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది. ‘జమ్ జమ్ ’అనే పేరుగల ఆ పవిత్ర జలంతో తల్లీ తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్ జమ్’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఆనాడు కేవలం రెండు ్రపాణాలకోసం వెలసిన ఆ జలం ఈనాడు హజ్ యాత్ర నిమిత్తం మక్కావెళ్ళే లక్షలాదిమంది ప్రజలతోపాటు, స్థానికులకూ నిరంతరం సమృద్ధి్ధగా సరఫరా అవుతూ, యాత్రికులందరూ తమ తమ స్వస్థలాలకు తీసుకు వెళుతున్నా ఏమాత్రం కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం అల్లాహ్ ప్రత్యక్ష మహిమకు నిదర్శనం. ఆ నాటి ఆ నిర్జీవ ఎడారి ్రపాంతమే ఈనాడు అత్యద్భుత సుందర మక్కానగరంగా రూపుదిద్దుకొని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తరువాత కొంతకాలానికి అల్లాహ్ ఆదేశం మేరకు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్ సహాయంతో ‘కాబా’ ను నిర్మించారు. చతుస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్ ఇబ్రాహీం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంలు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు. దీంతో కాబా దైవగృహంగా పేరు΄÷ందింది.అలౌకికానందంమక్కా చేరగానే ప్రతి హాజీ (యాత్రికుడు) కాబావైపు పరుగులు తీస్తాడు. పవిత్ర కాబాను చూడగానే భక్తులు ΄÷ందే ఆనంద పారవశ్యాలు వర్ణనాతీతం. ఒకానొక అలౌకిక ఆనందంతో, భక్తిపారవశ్యంతో కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్ని’తవాఫ్’ అంటారు. ప్రతి తవాఫ్ లోనూ హాజీలు కాబాగోడలో అమరి ఉన్న ’హజ్రె అస్వద్ ’ (నల్లనిశిల) ను ముద్దాడడానికి ప్రయత్నిస్తారు. దైవ గృహమైన కాబాకు సమీపంలో క్రీ. శ. 570 లో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. కనుక భక్తులు ఆ జ్ఞాపకాలనూ నెమరు వేసుకుంటారు. ’జమ్ జమ్ ’బావిలోని పవిత్ర జలాన్ని తనివి తీరా సేవిస్తారు. తరువాత సఫా, మర్వా కొండల మధ్య ’సయీ’చేస్తారు. దీని తరువాత కొన్నిరోజులు ఎవరి నివాసాల్లో వారు దైవచింతన, నమాజులతో కాలం గడిపి, ’జిల్ హజ్ ’మాసం ఎనిమిదవ తేదీన ’మినా’ గ్రామం వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉంటారు. తొమ్మిదవ తేదీన ప్రపంచం నలుమూలలనుండీ వచ్చిన హాజీలంతా ‘అరఫాత్ ’మైదానంలో గుమిగూడి దైవకారుణ్యాన్ని అభిలషిస్తూ ్రపార్ధనలు చేస్తారు. ఈ సందర్భంలోనే ఆనాడు ముహమ్మద్ ప్రవక్త (స) అశేష భక్తజనాన్ని ఉద్దేశించి తమ అంతిమ సందేశం వినిపించారు. అందుకని భక్తులు ఆ మహనీయుడు నిలిచిన ప్రదేశాన్ని కూడా దర్శించి పులకించి పోతారు. సూర్యాస్తమయానికి తిరుగు ప్రయాణం ్రపారంభించి’ముజ్దలఫా’ దగ్గర రాత్రి మజిలీ చేస్తారు. అక్కడే మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి సామూహికంగా చేస్తారు. మదీనాసాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్ ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడి లాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదె నబవిని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒకహాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్రకాబా గహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం గార్ల సహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశపాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలుపరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్ . ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్థం. అల్లాహ్ మనందరికీ ఈ విషయాలను అర్థం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. తఖ్వా ప్రధానందేవుని ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల ఉపాసనా రీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయీల్ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనా రీతులన్నీ పరిపూర్ణతను సంతరించు కున్నాయి. యాత్ర, నిరాడంబర సాధు వస్త్రధారణ, దైవ్రపార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహ సందర్శనార్ధం చేసే హజ్జ్ వల్ల ఉపాసనా రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం ΄÷ందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం స్త్రీ పురుషులందరూ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యంకోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. – యండి. ఉస్మాన్ ఖాన్ -
ఇస్లాంపై ఇటలీ ప్రధాని వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్ నాగరికతలోని విలువలు.. హక్కులకు చాలా తేడాలు ఉన్నాయి. అందుకే యూరప్‌లో ఇస్లాంకు చోటు ఉండబోదని అభిప్రాయపడ్డారామె. ఈ సందర్భంలో సౌదీ అరేబియాను, షరియా చట్టాల కఠినతత్వాన్ని ఆమె తప్పుబట్టారు. ఇస్లాం సంస్కృతికి, మా యూరోపియన్ నాగరికతకు చాలా తేడాలున్నాయ్. సౌదీ అరేబియా.. ఇటలీలో పలు చోట్ల ఇస్లామిక్ సెంటర్లకు నిధులు అందిస్తున్నాయి. అది తప్పు. ఆ విషయంలో కూడా నాకు సదాభిప్రాయం లేదు అని అన్నారామె. ఈ సందర్భంగా.. సౌదీ అరేబియాలో పాటిస్తున్న కఠినమైన షరియా చట్టాలను ఆమె తప్పుబట్టారు. 🚨Watch: #GiorgiaMeloni: "I believe... there is a problem of compatibility between Islamic culture and the values and rights of our civilization... Will not allow Sharia law to be implemented in italy.... values of our civilization are different! pic.twitter.com/VGWNix7936 — Geopolitical Kid (@Geopoliticalkid) December 18, 2023 షరియా చట్టాల్లో మతభ్రష్టత్వము, స్వలింగ సంపర్కం వంటి విధానాలు తీవ్రమైన నేరాలని తెలిపారు. షరియా అంటే వ్యభిచారానికి కఠిన శిక్ష విధించడం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడమని తెలిపారు. ఈ విధానాలను ఎక్కడైనా అమలుచేయాలని తెలిపారు. యూరప్‌లోని తమ నాగరికత విలువలకు.. ఇస్లాం విధానాల మధ్య చాలా తేడాలు ఉన్నాయని.. అలా సారూప్యత సమస్య తలెత్తుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, బిలియనీర్ ఎలన్ మ్కాస్‌లు కూడా పాల్గొన్నారు. చదవండి: Mexico: నేరస్తుల చేతికి ప్రభుత్వ డేటా? మెక్సికోలో ఏం జరుగుతోంది? -
ముస్లిం మహిళలకు ప్రత్యేక వ్రతాలు, ఉపవాసాలు ఉంటాయా?
ఉత్తరాదిన కర్వా చౌత్ పండుగ నాడు స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఆచరిస్తారు. ఇదేవిధంగా దక్షిణాదిన కూడా భర్త దీర్ఘాయుష్షు కోసం భార్యలు పలు వత్రాలు ఆచరిస్తుంటారు. అయితే కొందరు ముస్లిం స్త్రీలు తమ భర్త క్షేమం కోసం కర్వాచౌత్ ఉపవాసం పాటించినట్లు పలు ఫొటోలు వైరల్ అవుతుంటాయి. నిజానికి ముస్లిం మహిళలు తమ భర్త క్షేమం కోరుతూ ఉపవాసం పాటిస్తారా? ఇటువంటి నియమమేమైనా ఇస్లాంలో ఉందా? ఇంతకీ ఇస్లాంలో ఉపవాసానికి సంబంధించిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్లాంలో సాధారణంగా మూడు రకాల ఉపవాసాలు ఉంటాయి. వీటిలో పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాసాలు చాలా ముఖ్యమైనవి. పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఇందుకు చాలా నియమాలు ఉన్నాయి. కొంతమంది ముస్లింలు రంజాన్ ఉపవాసానికి భిన్నమైన రీతిలో మొహర్రం సమయంలో కూడా ఉపవాసం ఉంటారు. వీటితో పాటు కొందరు ముస్లింలు నఫిల్ ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. ఈ ఉపవాసాలు పాటించేందుకు వేర్వేరు నియమాలు ఉన్నాయి. నఫిల్ ఉపవాసం రంజాన్ లేదా ముహర్రం కాకుండా ఇతర సమయాల్లో పాటించే ఉపవాసం. దీనిని ఏ సాధారణ రోజున అయినా పాటిస్తారు. అయితే ముస్లిం మహిళలు ఉపవాసాన్ని ఆచరించాలంటే భర్త నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా వ్రతాలు, ఉపవాసాలు లాంటివి లేవు. ముస్లిం మహిళలు తమ భర్త లేదా పిల్లల కోసం ఎటువంటి ఉపవాసాలు పాటించరు. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో ఎక్కువ పనిగంటలు? తెలంగాణ సంగతేంటి? -
ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి!
ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ మహిళా అంజూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలిసేందుకు ఆమె తన భర్త, పిల్లలను వదిలి దాయాది దేశానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తరువాత నస్రుల్లా తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని, అతన్ని పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని పేర్కొంది అంజూ. తాను కేవలం ఓ పెళ్లికి హాజరు కావడానికి మాత్రమే పాక్‌కు చేరినట్లు, త్వరలోనే భారత్‌కు రానున్నట్లు తెలిపింది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మాతం మార్చుకున్న అంజూ ప్రియుడు నస్రుల్లాను పెళ్లి చేసుకునేందుకు అంజూ ఇస్లాం మతంలోకి మారినట్లు తెలుస్తోంది. తన పేరును సైతం అంజూ నుంచి ఫాతిమాగా మార్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె బురఖా ధరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పాక్‌లోని దిర్ జిల్లా కోర్టులో వీరిద్దరూ అధికారికంగా నిఖా జరుపుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ మేరకు అంజూ, నస్రుల్లా ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతూ.. టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించే ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. సంబంధిత వార్త: అందుకే పాక్ వచ్చా.. అంజూ వ్యవహారంలో ట్విస్ట్! నిఖా హోగయా అంజూ, నస్రుల్లా వివాహాన్ని మలకాండ్ డివిజన్ డీఐజీ నసీర్ మెహమూద్ సత్తి ధృవీకరించారు. ఆ మహిళా ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరును మార్చుకున్నట్లు పేర్కొన్నారు. నస్రుల్లా కుటుంబ సభ్యులు, పోలీసులు, న్యాయవాదుల సమక్షంలో దంపతులు దిర్ బాలాలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా అంజూను పోలీసు భద్రతతో కోర్టు నుంచి ఆమె కొత్త అత్తవారి ఇంటికి తీసుకెళ్లారు. 24 గంటలు గడవకముందే నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తన వీసా గడువు ముగియగానే ఆగస్టు 20న భారత్‌కు తిరిగి వస్తుందని పేర్కొన్న మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు నస్రుల్లా సైతం తమ ప్రేమ వ్యవహారంపై వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అయితే 24 గంటలు గడవకముందే మొత్తం సీన్ మారిపోవడంతో ప్రజలు అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు అంజూ చెప్పింది అబద్దమేనా..? ఆమె ముందుగానే ప్లాన్ ప్రకారం అతడిని పెళ్లి చేసుకుందా? లేదా వారు బలవంతంగా ఇలా చేశారా? అన్నది ఆసక్తిగా మారింది. పాక్‌లోనే ఉంటుందా? తిరిగొస్తుందా! ప్రస్తుతం అంజూ వీసా గడువు ఆగస్ట్ 20వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇండియా వచ్చేయాలి. అంజూ ఇప్పుడు ఇస్తాం మతం స్వీకరించటంతోపాటు.. నుజురుల్లాను పెళ్లి చేసుకోవటం, పేరు మార్చుకోవటం చూస్తుంటే పాకిస్థాన్‌లోనే ఉండిపోతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారమంతా లవ్ జీహాదీ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఏంటిది? మొత్తం ముఖానికే మాస్క్! బాబోయ్! మళ్లీ చైనాకు ఏమైంది? Video: Indian girl #Anju with her Pakistani friend Nasrullah Khan in his home district Dir pic.twitter.com/jJJaCmxq1U — Naimat Khan (@NKMalazai) July 25, 2023 -
పాక్‌లో ముగ్గురు హిందూ బాలికల కిడ్నాప్
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ వ్యాపారి ముగ్గురు కూతుళ్లను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చి ముగ్గురు యువకులు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. పాకిస్తాన్ దరేవార్ ఇతేహాత్ సంస్థ చీఫ్ శివ కచ్చి ఈ విషయం తెలిపారు. ధార్కి ప్రాంతానికి చెందిన హిందూ వ్యాపారి లీలా రామ్ ముగ్గురు కూతుళ్లు చాందిని, రోష్ని, పరమేశ్ కుమారిలను కొందరు అపహరించుకుపోయారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి అపహరించిన ముగ్గురు ముస్లింలు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారని శివ కచ్చి చెప్పారు. -
పాకిస్తాన్‌కు కొత్త ముప్పు.. దేశంపై పట్టుకు టీటీపీ ప్లాన్.. దాని లక్ష్యాలేంటి ?
ఆర్థికంగా దివాలా తీశామని ఒకవైపు దేశ రక్షణ మంత్రే ప్రకటిస్తున్న పరిస్థితుల్లో తెహ్రిక్–ఇ–తాలిబన్ రూపంలో కొత్త ముప్పుని ఎదుర్కొంటోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నప్పుడు సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ ఇప్పుడు తాము బలిపశువుగా మారినందుకు ఎలా అడుగు లు వెయ్యాలో తెలీక బిత్తరపోతోంది. ఎవరీ తెహ్రిక్–ఇ–తాలిబన్లు, వారి లక్ష్యమేంటి ..? 2021, ఆగస్టు అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భం... పాకిస్తాన్లో సంబరాలు జరిగాయి. తమ కనుసన్నల్లో మెలిగిన తాలిబన్లు అమెరికానే తరిమి కొట్టారని, అగ్రరాజ్యంపై ఇస్లాం ఘన విజయం సాధించిందంటూ నాయకులందరూ ప్రకటనలు గుప్పించారు. ఆ నాటి పాక్ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్‌కు వెళ్లి తాలిబన్ల ప్రభుత్వ స్థాపనకు స్వయంగా ఏర్పాట్లు చేసి మరీ వచ్చారు. నెల రోజులయ్యేసరికి.. అఫ్గాన్‌లో అధికారంలోకొచ్చిన తాలిబన్ల అండతో తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) రెచ్చిపోవడం ప్రారంభించింది. పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నిస్తూ దాడులకు దిగడం మొదలు పెట్టింది. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు వరకు పాక్‌లో కనీసం 250 దాడులు జరిగాయని పాక్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే దాడుల సంఖ్య రెట్టింపు అయింది. ఈ దాడుల్లో 95శాతం బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుఖ్వా(కె.పి)లో కీలక ప్రాంతాలు లక్ష్యంగా జరిగాయి. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 100 మంది ప్రాణాలను బలితీసుకున్న పెషావర్ మసీదు దాడి ఘటన జరిగిన కొద్ది రోజులకే కరాచీలో పోలీసుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఏమిటీ టీటీపీ తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్‌ను టీటీపీ అని పిలుస్తారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల మద్దతుతో వీళ్లు తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు. 2001లో అమెరికాపై ట్విన్ టవర్స్ దాడి తర్వాత అగ్రరాజ్యం చేసిన ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి పాకిస్తాన్ అండగా నిలవడంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన వీరంతా ఒక గూటి కిందకి చేరారు. పాక్ విధానాలను వ్యతిరేకిస్తూ దక్షిణ వజిరిస్తాన్‌లో బైతుల్లా మెహసూద్ నేతృత్వంలో 2007లో తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఏర్పాటైంది. టీటీపీ ప్రస్తుత చీఫ్ నూర్ వలీ మెహసూద్ అఫ్గాన్ నుంచి పాక్‌లో హింసను రాజేస్తున్నాడు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి.! అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారిపోతాయని పాక్ ప్రభుత్వం భావించింది. రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సాయం అందించి అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించుకున్న భారత్ ఓ పక్కకి వెళ్లిపోతుందని ఆనందపడింది. అయితే సరిహద్దు రూపంలో తాలిబన్లతో సమస్య మొదలైంది.డ్యూరాండ్ రేఖపై ఇరు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. టీటీపీ తుపాకీలు వదిలి జన జీవన స్రవంతిలోకి రావాలని పాక్ సర్కార్ చేసిన ప్రయత్నాలు కొనసాగలేదు. సరిహద్దుల్లో ఉన్న గిరిజనుల్ని పాక్ చేతుల నుంచి విడిపించడమే తమ లక్ష్యమన్నట్టుగా టీటీపీ మారిపోయింది. అఫ్గానిస్తాన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొన్నాళ్లు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా గత ఏడాది నవంబర్‌లో జనరల్ అసీమ్ మునీర్ బాధ్యతలు స్వీకరించగానే కాల్పుల విరమణను రద్దు చేసింది. అప్పట్నుంచి పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడులు, ప్రభుత్వ అధికారుల కిడ్నాప్‌లు, బెదిరింపులు వంటివి చేయసాగింది. మరోవైపు పాక్ ప్రభుత్వం కూడా తాలిబన్లను అదుపు చేయడానికి దాడులకు దిగుతూ ఉండడంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లూ అఫ్గాన్‌లో మంచి తాలిబన్లు, పాక్‌లో ఉన్న టీటీపీ చెడ్డ తాలిబన్లు అని భావించిన పాక్‌కు ఇద్దరూ చేతులు కలపడంతో అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అని నిట్టూరుస్తోంది. ఈ పరిణామాలన్నీ దేశంలో అంతర్యుద్ధానికి దారి తీయవచ్చుననే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దివాలా తీశాం: పాక్ రక్షణ మంత్రి ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న పాకిస్తాన్ రేపో మాపో దివాలా తీస్తుందని అందరూ అనుకుంటున్న వేళ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసీఫ్ బాంబు లాంటి నిజం చెప్పారు. ఇప్పటికే దేశం దివాలా తీసిందని అన్నారు. ఆదివారం సియాల్కోట్లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘‘పాక్ దివాలా తీస్తుందన్న వార్తలు మీరు వినే ఉంటారు. వాస్తవానికి ఇప్పటికే దేశం దివాలా తీసింది. మనం ప్రస్తుతం దివాలా తీసిన దేశంలో బతుకుతున్నాం’’ అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. దేశంలో ఆర్థిక సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఏమీ చేయలేదని మనమే ఏదో ఒకటి చెయ్యాలన్నారు. పాకిస్తాన్లో చట్టం, రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని, ఈ దుస్థితికి రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం, మన వ్యవస్థలు అన్నీ బాధ్యతవహించాలన్నారు. టీటీపీ లక్ష్యాలేంటి ? పాకిస్తాన్ మిలటరీ విధానాలను తీవ్రంగా వ్యతిరేంచిన ఈ సంస్థ దేశాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. 2021లో అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెళ్లిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పాకిస్తాన్‌పై దృష్టి సారించింది. ఇస్లాం విస్తరణ తాలిబన్ల ప్రధాన ధ్యేయంగా మారింది. అఫ్గానిస్తాన్‌లో మాదిరిగా పాకిస్తాన్లో కూడా ప్రభుత్వాన్ని కూల్చివేసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించి షరియా చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. పాకిస్తాన్ జైళ్లలో ఉన్న తమ వారిని బయటకు తీసుకురావాలని, అఫ్గాన్, పాక్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనికుల్ని వెనక్కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలంటూ పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోంది. పాకిస్తాన్లో ఉగ్ర దాడులకు ఐసిస్ అవసరం లేదు. పాకిస్తానీ తాలిబన్లు చాలు. అఫ్గానిస్తాన్ తరహాలో ఏదో ఒకరోజు తాలిబన్లు పాకిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. – తస్లీమా నస్రీన్, బంగ్లాదేశ్ రచయిత్రి – సాక్షి, నేషనల్ డెస్క్ -
త్యాగ నిరతికి చిహ్నం బక్రీద్
ఎన్నో త్యాగాలు.. ఎన్నోబలి దానాలు... ఒక మానవ మాత్రుని సహనానికి పరాకాష్ట అనదగిన అనేక పరీక్షలు... అన్నిటినీ తట్టుకొని మేరుపర్వతంలా నిలిచిన అపూర్వవ్వక్తిత్వం.. ఎన్నో ఉలిదెబ్బల తరువాత శిల శిల్పంగా మారుతుంది. కొలిమిలో కాలిన తరువాతనే నగ అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. ఇది మానవ జీవితానికీ వర్తిస్తుంది. సయ్యిదినా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితమే దీనికి చక్కని చారిత్రక ఉదాహరణ. ఆయన ఎన్నోపరీక్షలు ఎదుర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. విగ్రహారాధన, అధర్మవ్యాపారం వద్దన్నందుకు తండ్రి ఆయన్ని ఇంట్లోంచి గెంటేశాడు. సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలను వ్యతిరేకించినందుకు సమాజం కన్నెర్రజేసింది. అధికార దుర్వినియోగాన్ని, అవినీతిని, మిథ్యాదైవత్వాన్ని ప్రశ్నించినందుకు పాలకుల ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది. కళ్ళముందే అగ్గిరాజేసి, ఉవ్వెత్తున ఎగసిపడే మంటల్లో పడవేసినా ప్రాణత్యాగానికే సిద్ధమయ్యారు కాని, రాజును దైవాంశ సంభూతునిగా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. చివరికి దేశంనుండి బహిష్కరించినా సంతోషంతో సంచారజీవనం సాగించారాయన. అయినా పరీక్షల పరంపర అంతం కాలేదు. అదనంగా మరో పరీక్ష ఎదురైంది. మానవ ఇతిహాసం కనీవిని ఎరుగని పరీక్ష అది. దైవాదేశపాలనలో ప్రేమానురాగాలకు, వాత్సల్యానికి అణుమాత్రమైనా చోటులేదని రుజువు చేసిన పరీక్ష అది. సుదీర్ఘ ఎడబాటు తరువాత భార్యా బిడ్డలను కలుసుకున్న ఆనందం కూడా తీరక ముందే, ప్రాణసమానమైన పుత్రరత్నాన్ని దేవుని మార్గంలో త్యాగం చేయాల్సి రావడం మామూలు పరీక్షకాదు. హజ్రత్ ఇబ్రాహీం (అ) దానికీ సిద్ధమయ్యారు. బాబును సంప్రదించారు. ’దైవాజ్ఞ పాలనలో ఆలస్యం చేయకండినాన్నా! దైవచిత్తమైతే నన్నుమీరు సహనవంతునిగా చూస్తారు. ’ అన్నారు చిన్నారి ఇస్మాయీల్. ఆ సమయాన తండ్రీకొడుకుల మధ్య జరిగే సంభాషణ వినడానికి సృష్టిలోని అణువణువూ అవాక్కయి పోయింది. ఈ అచంచల, అద్వితీయ విశ్వాస బలాన్ని నివ్వెరపోయి చూస్తున్న ప్రకృతి ఒక్కసారిగా స్తంభించి పోయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అల్లాహ్ పవిత్ర నామాన్ని స్మరిస్తూ తనయుని మెడపై కత్తిపెట్టి జుబహ్ చెయ్యడానికి ఉద్యుక్తులయ్యారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. దీంతో తన ప్రియ ప్రవక్త ఇబ్రాహీం పట్ల దేవుని ప్రసన్నత పతాక స్థాయిన ప్రసరించింది. తన ఆజ్ఞాపాలనకు వారు మానసికం గా సిద్ధమైన క్షణంలోనే ఆయన వారి పట్ల అమిత ప్రసన్నుడై, వారి త్యాగాన్ని స్వీకరించాడు. చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో జుబహ్ చెయ్యడానికి ఓ స్వర్గ పొట్టేలును ప్రత్యక్షపరిచాడు. ఇదీ నేటి త్యాగోత్సవానికి(ఈదుల్ అజ్ హా/ బక్రీద్ సంబంధించిన సంక్షిప్త గాథ. ఇందులో మనందరికీ చక్కని ఆదర్శం ఉంది. మంచికోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మసంస్థాపన కోసం ఎంతోకొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈదుల్ అజ్ హా పర్వం మానవాళికిస్తున్న సందేశం ఇదే. (నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా..) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
నోటి దురుసుతో అనర్ధాలు
నరంలేని నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో మాట్లాడాలి. దైవానికి భయపడుతూ ఆచి తూచి ప్రయోజనకరమైన మాటలనే పలకాలి. దురుసుగా, పరుషంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. పరుల మనసు గాయపడేవిధంగా, వారు బాధపడే విధంగా పరుష పదజాలం ఉపయోగించకూడదు. మానవులకు దేవుడు ప్రసాదించిన వరాలు అనంతం. వాటిని లెక్కించడం గాని, ఊహించడం గాని, వర్ణించడం గాని అసాధ్యం. అటువంటి అసంఖ్యాక అనుగ్రహాల్లో ‘నోరు’ కూడా ఒకటి. కేవలం తినడానికి, తాగడానికి మాత్రమేకాదు, సంభాషణకు, సంవాదానికి, మానవుల మధ్య పరస్పర సంబంధాలకు ఇదేవారధి. దీని వినియోగ తీరుపైనే జయాపజయాలు, సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే అమృతపు జల్లు జాలువారుతుంది, ప్రేమామృత కుసుమాలను వికసింపజేస్తుంది. మంచిని పంచి మనిషి గౌరవ మర్యాదల్ని ఇనుమడింప జేస్తుంది. సంఘంలో ఉన్నత స్థానాన్ని సమకూర్చి పెడుతుంది. స్నేహ సౌభ్రాత్రతలను, శాంతి సామరస్యాలను పరిఢవిల్లజేస్తుంది. దుర్వినియోగం చేస్తేమాత్రం విద్వేషం చిలకరిస్తుంది. సమాజంలో అగ్గి రాజేస్తుంది. అశాంతి, అలజడులను సృష్టిస్తుంది. స్థాయిని దిగజారుస్తుంది. ఇహపర లోకాల్లో ఆపదలు తెచ్చి పెడుతుంది. వైఫల్యాలకు కారణమవుతుంది. దైవం దృష్టిలో నోటిదురుసు, దుర్భాష, అశ్లీలం తీవ్రమైన నేరాలు. దీనికి ఇహలోకంలో పరాభవం, పరలోకంలో నరక శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఇతరుల మనోభావాలు గాయపరిచేవారిని, అశ్లీలపు మాటలు పలికే వారిని, దుర్భాషలాడేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు. కొంతమంది పైకి ఎంతో చదువుకున్నవారిలా, ఎంతో భక్తి పరులుగా కనిపిస్తారు. కాని నోటితో ఇతరుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. పరుల మనసు గాయపరుస్తారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త వారితో ఇలా విన్నవించుకున్నాడు. ‘ఒక స్త్రీ ఎన్నెన్నో నఫిల్ నమాజులు చేస్తుంది. మరెన్నో నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది. పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తూ ఉంటుంది. ఈ సత్కార్యాల కారణంగా ఆమె గొప్పదాతగా ప్రసిద్ధి చెందింది. కానీ ఆమెకు నోటిదురుసు ఎక్కువ. ఏదో ఒకటి అని పొరుగువారి మనసు బాధ పెడుతుంది.’ అని నివేదించాడు. ‘అయితే ఆమె నరకానికి పోతుంది.’ అన్నారు ప్రవక్త మహనీయులు. తరువాత ఆ వ్యక్తి ‘‘దైవప్రవక్తా! ఒక స్త్రీ ఫర్జ్ నమాజులు ఫర్జ్ రోజాలు (అంటే, విధిగా పాటించవలసినవి) మాత్రమే ఆచరిస్తుంది. నఫిల్ నమాజులు నఫిల్ రోజాలు (ఐఛ్ఛికం) పాటించడం చాలా అరుదు. దానధర్మాలు కూడా పెద్దగా ఏమీ చేయదు. ఉన్నంతలోనే అప్పుడప్పుడూ కొన్ని జున్నుముక్కలు దానం చేస్తుంది. అయితే ఆమె ఎప్పుడూ ఇరుగు పొరుగు వారిని పల్లెత్తుమాట అనదు. వారి మనసు నొప్పించదు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుందని జనం చెప్పుకుంటూ ఉంటారు’ అని విన్నవించు కున్నాడు. ఈ మాట విని ప్రవక్త మహనీయులు, ‘ఆమె స్వర్గవాసి’ అని సెలవిచ్చారు. కనుక నరంలేని నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో మాట్లాడాలి. దైవానికి భయపడుతూ ఆచి తూచి ప్రయోజనకరమైన మాటలనే పలకాలి. దురుసుగా, పరుషంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. పరుల మనసు గాయపడేవిధంగా, వారు బాధపడే విధంగా పరుష పదజాలం ఉపయోగించకూడదు. హుందాగా సౌమ్యం, నమ్రత ఉట్టిపడే విధంగా మాట్లాడాలి. ఉపయోగంలేని ఉబుసుపోక మాటలకన్నా మౌనంగా ఉండడం ఎంతో మేలు. లేకపోతే అనర్ధాలు జరిగిపోతాయి. ప్రజలకు, ప్రభుత్వాలకు వివరణలు, సంజాయిషీలు ఇచ్చుకోవలసి ఉంటుంది. అంతేకాదు, మాట్లాడిన ప్రతి మాటకూ, పలికిన ప్రతి పదానికీ దైవానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. దైవం మనందరికీ ఆచితూచి మంచి మాట్లాడే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
చెడుల నిర్మూలనకు కంకణ బద్ధులు కావాలి
ప్రతి ఒక్కరు తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు సమాజంలో ప్రబలి ఉన్న చెడులను అరికడుతూ, మంచిని, మానవీయ విలువలను వ్యాపింపజేస్తూ ప్రజలను సంస్కరించడానికి కృషి చేయాలి. నేడు సమాజంలో ఎటు చూసినా చెడులు, దుష్కార్యాలు పెరిగిపోతున్నాయి. మానవ జీవితంలోని అన్ని రంగాలనూ ఈ రుగ్మతలు పరివేష్టించాయి. చెడులతో పోల్చుకుంటే మంచి తక్కువగా కనబడుతోంది. నిజానికి మంచి అన్న మేరు పర్వతం ముందు చెడు చీడ పురుగులా గోచరించ వలసింది. కాని దురదృష్ట వశాత్తూ దుర్మార్గమే దొడ్డుగా ఉన్నట్లు కనబడతా ఉంది. ఈ దుస్థితి మారాలి. మార్చాల్సిన బాధ్యత సమాజ శ్రేయోభిలాషులందరిపై ఉంది. ముఖ్యంగా దైవ విశ్వాసులపై మరీ అధికంగా ఉంది. దుర్మార్గాల నిర్మూలన, సత్కార్యాల స్థాపన పైనే మానవాళి సాఫల్యం ఆధారపడి ఉంది. ఈ గురుతరమైన బాధ్యతను గుర్తు చేస్తూ పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది: ’ మీలో కొందరు, ప్రజలను మంచి వైపుకు పిలిచేవారు, సత్కార్యాలు చేయమని ఆజ్ఞాపించే వారు, చెడులనుండి వారించేవారు తప్పకుండా ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఇహపర లోకాలలో సాఫల్యం పొందేవారు’..(3 –104). మరొక చోట:, ’విశ్వాసులారా! ఇకనుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరే.. మీరు సత్కార్యాలు చేయమని ప్రజలను ఆదేశిస్తారు, దుష్కార్యాలనుండి వారిస్తారు. దైవాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తారు’ అని చెప్పబడింది. (3–110) పవిత్ర ఖురాన్‌లోని ఈ వాక్యాలు దైవ విశ్వాసుల జీవిత లక్ష్యం ఏమిటో, వారు నిర్వర్తించవలసిన బాధ్యతలేమిటో విశదీకరించాయి. దీన్నిబట్టి ప్రతి ఒక్కరు తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు సమాజంలో ప్రబలి ఉన్న చెడులను అరికడుతూ, మంచిని, మానవీయ విలువలను వ్యాపింపజేస్తూ ప్రజలను సంస్కరించడానికి కృషి చేయాలని మనకు అర్ధమవుతోంది. అందుకే పవిత్ర ఖురాన్, ప్రజల్లో దైవ భీతిని, పరలోక చింతనను జనింపజేసి తద్వారా వారిని నీతిమంతులుగా, సత్పౌరులుగా తీర్చిదిద్దాలని అభిలషిస్తోంది. మూఢనమ్మకాలు, దురాచారాలతో సహా ప్రపంచంలోని అన్నిరకాల చెడులను నిర్మూలించి చక్కని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పదలిచింది. ఈ లక్ష్యసాధన కోసం పవిత్ర ఖురాన్ దైవ విశ్వాసులపై మంచిని పెంచే, చెడును నిర్మూలించే బృహత్తర బాధ్యత ను నిర్బంధం చేసింది. దీనికోసం దైవ విశ్వాసులు ఒక సంఘటిత శక్తిగా రూపొందాల్సిన ఆవశ్యకతను అది గుర్తు చేస్తోంది. – ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
ఆధ్యాత్మిక తరంగం రమజాన్
పవిత్ర రమజాన్ ప్రారంభవేళ..పగలంతా ఉపవాసాలు.. సాయంత్రం ఇఫ్తార్ విందులతో వీధులన్నీ కళకళలాడబోతున్నాయి. పిల్లలూ పెద్దల హడావిడితో వాతావరణమంతా అప్పుడే సందడిగా మారింది. మండువేసవిలోనూ నిండు వసంతం కుండపోతలా వర్షించడం మొదలైంది. మానవుల పాపాలను కడిగి, పునీతం చేసే పవిత్ర రమజాన్ నెల ప్రారంభమైంది. మనిషిలోని దుర్లక్షణాలను హరింపచేసి, ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి వంటి సానుకూల భావనలను పెంపొందింపచేసే పవిత్ర రమజాన్ మానవాళికి సరైన జీవన సూత్రాలను ప్రబోధించే మార్గదర్శి. రమజాన్ ఒక అలౌకిక భావన. తేజోమయ ఆథ్యాత్మిక తరంగం. సత్కార్యాల సమాహారం. వరాల వసంతం. మండువేసవిలో నిండు వసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికీ, జీవన సాఫల్యానికి అవసరమైన సమస్తమూ దీనితో ముడివడి ఉన్నాయి. రమజాన్‌లో పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది. సమస్త మానవాళికీ ఇది ఆదర్శ ప్రబోధిని. కారుణ్య సంజీవిని. మార్గప్రదాయిని. రమజాన్ లో ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయి. ఇవి మానవుల్లో దైవభక్తినీ, దైవభీతిని ప్రోదిచేస్తాయి. స్వర్గానికి బాటలు వేస్తాయి. వెయ్యి నెలలకన్నా విలువైన రాత్రి ‘షబేఖద్ర్’ కూడా రమజాన్ లోనే ఉంది. ఈ ఒక్కరాత్రి ఆరాధన వెయ్యినెలల ఆరాధనకన్నా మేలైనది. రమజాన్‌లో సత్కార్యాల ఆచరణ ఎక్కువగా కనబడుతుంది. దుష్కార్యాలు ఆగిపోతాయి. సమాజంలో చక్కని అహ్లాదకరమైన మార్పు కనిపిస్తుంది. ఐదుపూటల నమాజుతోపాటు, అదనంగా తరావీహ్ నమాజులు ఆచరించబడతాయి. సాధారణ దానధర్మాలతోపాటు,‘ఫిత్రా’అనే ప్రత్యేక దానాలు కూడా రమజాన్ లోనే చెల్లిస్తారు. దీనివల్ల సమాజంలోని పేదసాదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చాలామంది ‘జకాత్’ కూడా రమజాన్ లోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదల అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. అంతేకాదు, రమజాన్ నెలతో అనుసంధానమై ఉన్న విషయాలు అనేకం ఉన్నాయి. ప్రధాన ఆరాధన, ప్రత్యేక ఆరాధన మాత్రం’రోజా’ (ఉపవాసవ్రతం)యే. దేవుడు ఈ నెలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందే ప్రయత్నం చెయ్యాలి. నిజానికి ఉపవాస వ్రతమన్నది కేవలం ముహమ్మద్ ప్రవక్త వారి అనుచరులకు మాత్రమే, అంటే ముస్లింలకు మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలికమైన, సార్వజనీనమైన ఆరాధన. దీనికి చాలా ఘనమైన, ప్రాచీన సామాజిక నేపథ్యం ఉంది. ఇది అనాదిగా అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో చెలామణిలో ఉన్నట్లు దైవగ్రంథం పవిత్ర ఖురాన్ చెబుతోంది. ‘విశ్వాసులారా..! పూర్వ ప్రవక్తల అనుయాయులకు ఏవిధంగా ఉపవాసాలు విధించబడ్డాయో, అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా విధిగా ఉపవాసాలు పాటించాలని నిర్ణయించాము. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’ (2 – 183 ) అంటే, ఉపవాసవ్రతం కేవలం ఈనాటి ముస్లిం సముదాయానికి మాత్రమే ప్రత్యేకమైనది, పరిమితమైనది కాదని, పూర్వకాలం నుండీ ఆచరణలో ఉన్న సనాతన ధర్మాచారమని మనకు అర్థమవుతోంది. ఈరోజు కూడా ప్రపంచంలోని అన్నిదేశాల్లో అన్ని జాతులు, అన్ని మతాల వారిలో ఏదో ఒక రూపంలో ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. మానవ సమాజంలో మంచి, మానవీయత, భయభక్తుల వాతావరణాన్ని జనింపజేయడం, విస్తరింపజేయడమే ఈ ఉపవాసాల ఆచరణలోని అసలు ఉద్దేశ్యం. పవిత్ర ఖురాన్ మార్గదర్శకంలో, ప్రవక్తవారి ఉపదేశానుసారం మనం మన జీవితాలను సమీక్షించుకుంటే, సంస్కరణ ఎక్కడ అవసరమో గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా ఆచరణకు మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి స్వీయసమీక్ష కు, సింహావలోకనానికి రమజాన్ కంటే మంచి తరుణం మరొకటి ఉండబోదు. అల్లాహ్ అందరికీ రమజాన్ శుభాలను సొంతం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించమని వినమ్రంగా వేడుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
హిజాబ్... తప్పనిసరి మతాచారం కాదు
బెంగళూరు: హిజాబ్ ధరించడం అనేది ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదని కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిలిపివేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించినట్లు ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ్ నావడ్గీ వాదించారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై ఉత్తర్వు ఇచ్చిందని, ఇందులో అభ్యంతరకరమైన అంశమేదీ లేదని స్పష్టం చేశారు. ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హిజాబ్‌కు అనుమతివ్వాల్సిందే.. కర్ణాటకలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఓ వర్గం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలకు వచ్చారు. తమను తరగతుల్లోకి అనుమతించాలని పట్టుబట్టారు. హిజాబ్ ధరించడానికి ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వడం లేదన్న ఆవేదనతో తుమకూరు జైన్ పీయూ కాలేజీ అధ్యాపకురాలు చాందిని తన ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ఉడుపి మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంపీఎం) కాలేజీ 10 రోజుల తర్వాత శుక్రవారం పునఃప్రారంభమైంది. తరగతులు యథాతథంగా జరిగాయి. హిజాబ్‌కు సంబంధించిన కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని సీనియర్ అడ్వొకేట్ ప్రొఫెసర్ రవివర్మ కుమార్ విజ్ఞప్తి చేయగా, కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. -
ధర్మబద్ధమైన జీవనం
పూర్వం బాగ్దాద్ నగరంలో బహెలూల్ అనే పేరుగల ఒక దైవభక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆయన బాగ్దాద్ వీధుల్లో నడుస్తూ వెళుతున్నారు. అలా వెళుతూ ఒకచోట విశ్రాంతి కోసం ఆగాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా బాధగా, ఆందోళనగా ఉన్నాడు. అది గమనించిన బహెలూల్ ‘ఏమిటి చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు, విషయం ఏమిటి?’ అని ఆరా తీశారు. ‘అయ్యా.. ఏం చెప్పమంటారు? కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర కొంత పైకం అమానతుగా ఉంచాను. ఇప్పుడు వెళ్ళి అడిగితే, అసలు నువ్వెవరివి..? నాకు పైకం ఎప్పుడిచ్చావు?’ అని బుకాయిస్తున్నాడు. ఎంత ప్రాధేయపడినా కనికరించకుండా, అనరాని మాటలన్నాడు. కాని నా అమానత్తును మాత్రం తిరిగి ఇవ్వలేదు. రిక్తహస్తాలతో మిగిలాను. ఏ మార్గమూ కానరావడం లేదు’ అంటూ బోరుమన్నాడు. బహెలూల్ అతణ్ణి ఊరడిస్తూ.. ‘నువ్వేమీ బాధపడకు..దైవ చిత్తమైతే ఆ పైకం నేను ఇప్పిస్తాను’ అన్నారు ప్రశాంతంగా.. ‘అవునా..! నా పైకం ఇప్పిస్తారా..? కాని ఎలా సాధ్యం? ఆ వ్యక్తి పరమ దుర్మార్గుడు... నాకైతే ఏమాత్రం నమ్మకం కుదరడంలేదు.’ అన్నాడు అతనే నిరాశతో.. ‘అలా అనకు.. నిరాశ తిరస్కారం (కుఫ్ర్) తో సమానం.. ఇన్షా అల్లాహ్ నీ పైకం నీకు తప్పకుండా లభిస్తుంది.’ అన్నారు బహెలూల్. ‘నిజమే.. ఆశ లేకపోతే మనిషి బతకలేడు. కాని.. ఎలా సాధ్యమో కూడా అర్ధం కావడంలేదు.’ ‘నువ్వు ఆందోళన చెందకు. నేను చెప్పినట్లు చెయ్. నీ పైకం ఇప్పించే పూచీనాది’ అన్నారు బహెలూల్ ధీమాగా.. ‘సరే ఏం చేయమంటారో చెప్పండి. ’అన్నాడతను. ఆశగా.. ‘రేపు ఉదయం ఫలానా సమయానికి నువ్వు ఆ వ్యక్తి దుకాణం దగ్గరికిరా.. నేనూ ఆ సమయానికి అక్కడికి వస్తాను. నేను ఆవ్యక్తితో మాట్లాడుతున్న క్రమంలో నువ్వొచ్చి నీ అమానత్తును అడుగు’ అన్నారు బహెలూల్. సరేనంటూ ఆ వ్యక్తి బహెలూల్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి పోయాడు. తెల్లవారి ఉదయం బహెలూల్ ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నారు. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత, తాను కొన్నాళ్ళపాటు పని మీద ఎటో వెళుతున్నానని, తన దగ్గర ఉన్న సంచిలో వంద బంగారునాణాలు, కొంతనగదు ఉన్నాయని, కాస్త ఈ సంచి దగ్గర ఉంచితే తిరిగొచ్చిన తరువాత తీసుకుంటానన్నారు. ఆ వ్యక్తి లోలోన సంతోషపడుతూ, సరేనని సంచీ అందుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మోసపోయిన వ్యక్తి వచ్చి తను అమానతుగా ఉంచిన పైకం ఇమ్మని అడిగాడు. ఆ వ్యాపారి ఒక్కక్షణం ఆలోచించి, ఇప్పుడు గనక ఇతని తో పేచీ పెట్టుకుంటే, విలువైన బంగారు నాణాల సంచి చేజారే అవకాశముందని గ్రహించాడు. వెంటనే అతని పైకం అతనికిచ్చేశాడు. అతను సంతోషంగా పైకం తీసుకొని కృతజ్ఞత లు చెప్పి వెళ్ళిపోయాడు. బహెలూల్ తన సంచిని వ్యాపారి దగ్గర అమానత్తుగా ఉంచి తన దారిన తను వెళ్ళిపోయారు. కొంతసేపటి తరువాత, అతడు సంబరపడుతూ, బహెలూల్ దాచిన నాణాల సంచి విప్పిచూసి, నోరెళ్ళబెట్టాడు. అందులో గాజు పెంకులు, గులక రాళ్ళు తప్ప మరేమీ లేవు. తను చేసిన మోసానికి తగిన శాస్తే జరిగిందని భావించాడు. ఇకనుండి ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకొని ధర్మబద్ధమైన జీవనం ప్రారంభించాడు. మోసపోయినప్పుడు నిరాశ పడకూడదు. తెలిసిన వాళ్లు, తెలివైన వాళ్లను ఆశ్రయించాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మత గురువు నుంచి తాలిబన్ చీఫ్‌గా..
కాబూల్: ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా.. కల్లోలిత అఫ్గానిస్తాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇస్లాంపై అచంచల విశ్వాసం, షరియా చట్టంపై అపారమైన పరిజ్ఞానమే ఆయనకు అత్యున్నత పదవి దక్కేలా చేసిందని చెప్పొచ్చు. 60 సంవత్సరాల అఖుంద్జాదా అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ప్రాంతంలో జన్మించారు. పషూ్తన్లలోని నూర్జాయ్ అనే బలమైన తెగకు చెందిన ఆయన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కచ్లాక్ మసీదులో 15 ఏళ్లపాటు మత గురువుగా పనిచేశారు. అనంతరం తాలిబన్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. తాలిబన్ల అత్యున్నత మత గురువుగా ఎదిగారు. 1990వ దశకంలో తాలిబన్లలో చేరిన అఖుంద్జాదాకు 1995లో తొలిసారిగా పెద్ద గుర్తింపు లభించింది. 2016లో తాలిబన్ పగ్గాలు అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక కాందహార్‌లోని తాలిబన్ మిలటరీ కోర్టులో అఖుంద్జాదాకు కీలక స్థానం దక్కింది. తర్వాత నాంగార్హర్ ప్రావిన్స్‌లో మిలటరీ కోర్టు అధినేతగా పదోన్నతి పొందారు. 2001లో అమెరికా సైన్యం దండెత్తడంతో అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనకు తెరపడింది. అప్పుడు తాలిబన్ సుప్రీంకోర్టు డిప్యూటీ చీఫ్‌గా అఖుంద్జాదా అవతరించారు. మత గురువుల మండలికి పెద్ద దిక్కుగా మారారు. 2015లో తాలిబన్ అధినేత ముల్లా మన్సూర్ తన తదుపరి నాయకుడిగా (వారసుడు) అఖుంద్జాదా పేరును ప్రకటించారు. 2016లో తాలిబన్ అధినేతగా అఖుంద్జాదా పగ్గాలు చేపట్టారు. 2017లో ఆయన పేరు ప్రఖ్యాతలు విస్తరించాయి. అఖుంద్జాదా కుమారుడు అబ్దుర్ రెహమాన్ అలియాస్ హఫీజ్ ఖలీద్(23) అప్పటికే తాలిబన్ ఆత్మాహుతి దళంలో సభ్యుడిగా పని చేసేవాడు. ఓ ఉగ్రవాద దాడిలో ఖలీద్ మరణించాడు. కనిపించడం అత్యంత అరుదు తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ తరహాలోనే అఖుంద్జాదా కూడా గోప్యత పాటిస్తుంటారు. అత్యంత అరుదుగా జనం ముందుకు వస్తుంటారు. తాలిబన్లు అఖుంద్జాదా ఫొటోను ఇప్పటిదాకా కేవలం ఒక్కటే విడుదల చేశారు. బహిరంగంగా కనిపించకపోయినా, మాట్లాడకపోయినా తాలిబన్లకు ఆయన మాటే శిలాశాసనం. అఖుంద్జాదా ప్రస్తుతం కాందహార్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌గా అఫ్గానిస్తాన్ ప్రజలకు ఎలాంటి పరిపాలన అందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
ఇస్లామ్ ధర్మంలో జిల్ హజ్ నెల ప్రాముఖ్యం..
ఇస్లామ్ ధర్మంలో జిల్ హజ్ నెలకు చాలా ప్రాముఖ్యం ఉంది. మొదటి పదిరోజులు ఇంకా ప్రాముఖ్యం కలవి. వారంలోని ఏడురోజుల్లో శుక్రవారానికి, సంవత్సరంలోని పన్నెండు నెలల్లో రమజాన్ నెలకు, రమజాన్ లోని 30 రోజుల్లో చివరి పదిరోజులకు ఏవిధంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందో అదే విధంగా దైవం జిల్ హజ్ నెలలోని మొదటి దశకానికి.. అంటే, మొదటి పది రోజులకూ అలాంటి ప్రత్యేకతనే ప్రసాదించాడు. దైవ కారుణ్యం అపారంగా వర్షించే ఈ రోజులలో చేసే ప్రతి సత్కార్యమూ ఎనలేని ప్రాముఖ్యత కలిగి దైవ కృపకు పాత్రమవుతుంది. మనిషి ఈ దశకంలో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరం కావు. అంటే, జిల్ హజ్ నెల మొదటి పది రోజుల్లో చేసే ఆరాధనలు, సత్కార్యాలు దైవానికి మిగతా మొత్తం రోజులూ చేసిన ఆరాధనలు, సత్కార్యాలకంటే ఎక్కువ ప్రీతికరం అన్నమాట. ఈరోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా (ఉపవాసం) సంవత్సరం మొత్తం పాటించే రోజాలకు సమానం. ‘అరఫా’ నాటి ఒక్క రోజా రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. ఇందులోని ప్రతిరాత్రి ఆచరించే నఫిల్ లు షబేఖద్ర్ లో ఆచరించే నఫిల్లతో సమానం. అందుకని ఈ రోజుల్లో సత్కార్యాలు ఎక్కువగా ఆచరించే ప్రయత్నం చెయ్యాలి. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’, ‘అల్లాహుఅక్బర్ ’, ‘అల్ హందులిల్లాహ్ ’ వచనాలు ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. నిజానికి ఇవి హజ్ ఆరాధన కోసం ప్రత్యేకించబడిన రోజులు. ఆర్థిక స్థోమత కలిగినవారు తప్ప అందరూ హజ్ చేయలేరు. కాని అల్లాహ్ తన అపారమైన దయతో ఆ మహత్తరమైన పుణ్యఫలం పొందగలిగే అవకాశాన్ని అందరికీ ప్రసాదించాడు. జిల్ హజ్ నెల ప్రారంభమవుతూనే, తమ తమ ప్రాంతాల్లో, తమ తమ ఇళ్ళవద్దనే ఉంటూ హాజీలతో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. వారి ఆచరణలను అనుకరించే ప్రయత్నం చెయ్యాలి. ఇదే ఈద్ ఖుర్బానీలోని రహస్యం. హజ్ యాత్రకోసం మక్కాకు వెళ్ళిన హాజీలు జిల్ హజ్ మాసం పదవ తేదీన మినాలో ఖుర్బానీలు సమర్పిస్తారు. స్థోమత లేని కారణంగా హజ్ యాత్రకోసం మక్కా వెళ్ళలేకపోయిన ముస్లిములంతా తమ తమ స్వస్థలాల్లో ఇళ్ళవద్దనే ఖుర్బానీలు సమర్పిస్తారు. ఏ విధంగానైతే హాజీలు ‘ఇహ్రామ్’ ధరించిన తరువాత క్షవరం చేయించుకోరో, గోళ్ళు కత్తిరించుకోరో.. అలాగే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న ముస్లింలు కూడా గోళ్ళు కత్తిరించుకోరు, క్షవరం చేయించుకోరు. అంటే మక్కాకు వెళ్ళిన హాజీలను అనుకరించాలన్నమాట. ఈ విధంగా జిల్ హజ్ నెల మొదటి దశలో సాధ్యమైనంత అధికంగా సత్కార్యాలు ఆచరించి దైవానుగ్రహాన్ని, అపారమైన కారుణ్యాన్ని పొందడానికి శక్తివంచనలేని కృషి చేయాలి. మక్కావెళ్ళి హజ్ ఆచరించే అంతటి స్థోమత లేకపోయినా, కనీసం ఈదుల్ అజ్ హా పండుగ వరకు ఈ పదిరోజులను సద్వినియోగం చేసుకుంటే దైవం తన అపార కరుణతో హాజీలతో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. కనుక హజ్ పరమార్ధాన్ని అర్థం చేసుకొని, దానికనుగుణంగా కర్మలు ఆచరిస్తూ, ‘ఈదుల్ అజ్ హా’ పర్వదినాన్ని జరుపుకుంటే ఇహ పరలోకాలలో సాఫల్యం పొందవచ్చు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఇస్లాంకు వచ్చిన ముప్పేమీ లేదు: ఆరెస్సెస్ ఛీఫ్
భారత్‌లో ఇస్లాం మతం ప్రమాదంలో పడిందన్న కొందరి అసత్య ప్రచారాలను నమ్మొద్దని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అసలు అలాంటి ప్రచారాల వలలో చిక్కుకోవద్దని ముస్లింలను కోరాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్. ఘజియాబాద్: ఆ గడ్డపై హిందూ-ముస్లిం తేడాలేవీ లేవని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ పునరుద్ఘాటించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఆరెస్సెస్ ముస్లిం విభాగం) ఏర్పాటు చేసిన ‘హిందుస్తానీ ఫస్ట్.. హిందుస్తాన్ ఫస్ట్’ అనే కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు. ప్రజలు చేసే ఆరాధనలను బట్టి వారిని వర్గాలుగా విభజించలేమని అన్నారు. మూక దాడులకు పాల్పడే వాళ్లు హిందుత్వానికి వ్యతిరేకులేనని తేల్చిచెప్పిన ఆయన.. మూకదాడులపై కొన్ని సందర్భాల్లో తప్పుడు కేసులు నమోదవుతున్నాయని ఆక్షేపించారు. ఏ ఒక్క మతమో కాదు దేశంలో ప్రజల మధ్య ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘‘హిందు, ముస్లిం వర్గాలు వేర్వేరు కాదు. మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే. జాతీయవాదం, మన పూర్వీకులు సాధించిన కీర్తి ప్రజల మధ్య ఐక్యతకు ఆధారం కావాలి. హిందు–ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలకు పరిష్కార మార్గం చర్చలే. ఈ రెండు వర్గాల ఐక్యతపై తప్పుడు ప్రచారం సాగుతోంది. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, దేశంలో ఏ ఒక్క మతమో ఆధిపత్యం చెలాయించలేదు. కేవలం భారతీయులు మాత్రమే ఆధిపత్యం చెలాయించగలర’’ని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. కాగా, తాను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో, వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికో ఈ కార్యక్రమానికి రాలేదని, దేశాన్ని బలోపేతం చేయడానికి.. సమాజంలో అందరి బాగు కోసం ఆరెస్సెస్ పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అది అభివృద్ధికి ముప్పే! వివిధ రంగాలకు చెందిన 150 మంది ముస్లిం ప్రముఖులతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. జనాభా విపరీతంగా పెరగడం రాష్ట్ర అభివృద్ధికి ముప్పేనని ముస్లిం ప్రముఖులు అంగీకరించారని సమావేశం అనంతరం సీఎం కామెంట్ చేశారు. ఈ మేరకు అభివృద్ధి కోసం సూచనలు చేయడానికి వారితో 8 ఉపవర్గాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. -
ఏదో పెద్ద శక్తి ఉంది.. దానిపై నాకు చాలా నమ్మకం
ఇంటి వాతావరణం ఏది నేర్పిస్తే అది నేర్చుకోవడం సహజం. అలా ప్రియాంకా చోప్రాకి నేర్పించిన విషయాల్లో ‘ఆధ్యాత్మికత’ ఒకటి. ఆధ్యాత్మికత గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘భారతదేశం పలు మతాల సమాహారం. నేను చదువుకున్నది క్రిస్టియన్ కాన్వెంట్లో. దాంతో నాకు క్రిస్టియానిటీ గురించి తెలుసు. మా నాన్నగారు మసీదులో పాడేవారు. దాంతో నాకు ఇస్లాం గురించి తెలుసుకునే అవకాశం దక్కింది. నేను హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిని. హిందుత్వం గురించి సహజంగానే తెలిసిపోతుంది. భారతదేశంలో ఆధ్యాత్మికం అనేది ఓ పెద్ద భాగం. దాన్ని విస్మరించలేం. నేను హిందువుని. మా ఇంట్లో గుడి ఉంది. నేను పూజలు చేస్తాను. వీలు కుదిరినప్పుడల్లా చేస్తుంటాను. ఆ విషయం పక్కనపెడితే, ఏదో పెద్ద శక్తి ఉందని నమ్ముతాను. ఆ శక్తిపై నాకు చాలా నమ్మకం ఉంది’’ అన్నారు. -
బలమైన కుటుంబంతో బలమైన సమాజం
మానవజాతి మనుగడకు కుటుంబం పునాది. భార్యాభర్తల అనుబంధం ద్వారా కుటుంబం ఉనికిలోకొస్తుంది. ఈ అనుబంధమే కౌటుంబిక వ్యవస్థ పునాదులను పటిష్ట పరుస్తుంది. దానిద్వారా సమాజం ఏర్పడుతుంది. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య బంధం పటిష్టంగా ఉండాలి. ఆ బంధం పటిష్టంగా లేకపోతే సంసార నావ ముందుకు సాగదు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల బంధమే దీన్ని సురక్షితంగా కాపాడగలుగుతుంది. సంసార జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి, పోతుంటాయి. సర్దుకు పోవడమే సంసార రహస్యం. అలకలు, గిల్లికజ్జాలు, బతిమాల్పులు సహజం. ఐక్యత, ప్రేమ, అనురాగం, సహనం, త్యాగం తదితర సుగుణాల మేళవింపే కుటుంబం, సంసారం. కాని, నేడు అన్ని రంగాలూ కలుషితమైనట్లుగానే కుటుంబ వ్యవస్థ కూడా పాడైపోయింది. తద్వారా సమాజం ప్రభావితమై, సామాజిక అసమానతలకు, విచ్చిన్నతకు దారితీస్తోంది. బంధాలు అనుబంధాలు అపహాస్యం పాలవుతున్నాయి. ఈ విధంగా కుటుంబంలో, సమాజంలో ఆత్మీయత, మానవీయ విలువలు మృగ్యమైపోతున్నాయి. ‘తల్లిదండ్రుల పట్ల సత్ ప్రవర్తనతో మెలగమని, వారి సేవచేయాలని మేము మానవుణ్ణి ఆదేశించాము. అతని తల్లి బాధపై బాధను భరిస్తూ అతణ్ణి కడుపులో పెట్టుకొని మోసింది. అతణ్ణి పాలు మరిపించడానికి ఆమెకు రెండు సంవత్సరాలు పట్టింది. కనుక నాపట్ల కృతజ్ఞుడవై ఉండు. నీ తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞతగా మసలుకో. చివరికి నువ్వు నావద్దకే మరలి రావలసి ఉంది.’ (దివ్యఖురాన్ 31 – 14) హజ్రత్ ఆయిషా (రజి) ఉల్లేఖనం ప్రకారం: ‘మీలో ఎవరైతే మీ కుటుంబంతో మంచిగా మసలుకుంటారో వారే ఉత్తములు.’ అన్నారు ప్రవక్త మహనీయులు. కుటుంబ సభ్యులు, బంధుగణంతో సత్సంబంధాలు కొనసాగిస్తేనే బంధాలు బలపడతాయి. కుటుంబ వ్యవస్థ, తద్వారా సమాజం బలోపేతమవుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
కాలచక్రమే సాక్షి!
కాలం దేవుని అపార శక్తి సామర్థ్యాలకు, అసాధారణ కార్యదక్షతకు నిదర్శనం. అందుకే కాలాన్ని సాక్షిగా పెట్టి అనేక యదార్ధాలు చెప్పాడు దైవం. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే కాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. ఈ సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా మంచిపనులు చెయ్యాలి. ధర్మబద్ధ కార్యాలు ఆచరించాలి. సమస్త పాపకార్యాలకు. అన్యాయం, అధర్మాలకు దూరంగా ఉండాలి. సత్యంపై స్ధిరంగా ఉన్న కారణంగా కష్టనష్టాలు ఎదురు కావచ్చు. మనోవాంఛలను త్యాగం చేయాల్సి రావచ్చు. అవినీతి, అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, సత్యమార్గాన పయనిస్తున్న క్రమంలో కష్టాలు, కడగండ్లు సంభవించొచ్చు. ఇలాంటి అన్నిసందర్భాల్లో మనిషి విశ్వాసానికి నీళ్ళొదలకుండా, సత్యంపై, న్యాయంపై, ధర్మంపై స్ధిరంగా ఉంటూ సహనం వహించాలి. పరస్పరం సత్యాన్ని, సహనాన్ని బోధించుకుంటూ, దేవునిపై భారం వేసి ముందుకు సాగాలి. ఇలాంటి వారు మాత్రమే ఇహపర లోకాల్లో సాఫల్యం పొందుతారని, మిగతావారు నష్టపోతారని మనకు అర్ధమవుతోంది. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటినుండి గుణపాఠం నేర్చుకుంటారు. అలా కాకుండా గతకాలాన్ని గాలికొదిలేసి, కొత్త సంవత్సరంలో చైతన్య రహిత చర్యలతో, అర్ధం పర్థం లేని కార్యకలాపాలతో కొత్తకాలాన్ని ప్రారంభిస్తే ప్రయోజనం శూన్యం. కాలం ఎవరి కోసమూ ఆగదు. రాజులు రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు అంతా కాలగర్భంలో కలిసి పోయినవారే, కలిసి పోవలసినవారే. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. గతం నుండి గుణపాఠం గ్రహిస్తూ భవిష్యత్తును ప్రారంభించాలి. నిస్సందేహంగా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కాని ఆ సంతోషంలో హద్దుల్ని అతిక్రమించ కూడదు. నిషిద్ధ కార్యాలకు నూతన సంవత్సరంలో తావు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా అందరూ కాలం విలువను గుర్తించి, విశ్వాస బలిమితో సత్యంపై స్థిరంగా ఉంటూ, మంచి పనులు చేస్తూ, ప్రజలకు మంచిని, సత్యాన్ని, సహనాన్ని గురించి బోధిస్తూ, స్వయంగా ఆచరిస్తూ సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ భవిష్యత్ కాలాన్ని దివ్యంగా మలచుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని, సమస్త మానవాళికీ సన్మార్గ భాగ్యం ప్రాప్తం కావాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
దేవుడు ఎలా ఉంటాడు?
ఒకసారి బాగ్దాదు నగరంలో గొప్ప ధార్మిక సభ జరుగుతోంది. వేలాది మంది ప్రజలు ఆ సభలో పాల్గొన్నారు. అనేకమంది పండితులు ప్రజలను ఉద్దేశించి ప్రవచనం చేస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి సభలోకి ప్రవేశించి, పండితులకు ఒక సవాలు విసిరాడు. ‘మీరు చెబుతున్న ప్రకారం, ఈ సృష్టి మొత్తానికి ఒక కర్త ఉన్నాడు. అయన అల్లాహ్, అంటే సృష్టికర్త. మరి ఆయనే సమస్తాన్ని సృష్టించినప్పుడు ‘ఆయన్ని’ ఎవరు సృష్టించారు? ఆయనకు ముందు ఎవరున్నారు? ’అని ప్రశ్నించాడు. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పండితులు అతని ప్రశ్నకు సమాధానం చెప్పారు. కాని అతను సంతృప్తి చెందలేదు. పండితులు తల పట్టుకున్నారు. అతనికి అర్థమయ్యేలా సంతృప్తికరమైన సమాధానం ఎలా చెప్పాలో వారికి అర్థం కాలేదు. ఆ వ్యక్తి గర్వంగా సభికుల వైపు చూశాడు. అంతలో సభికుల్లోంచి ఓ పదకొండేళ్ళ బాలుడు సమాధానం చెబుతానని ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి బాలుణ్ణి చూసి, ‘నువ్వు సమాధానం చెబుతావా?’ అంటూ వెటకారంగా నవ్వాడు. ఆ బాలుడు ఏమాత్రం తొణక్కుండా, ‘అవును నేనే.. మీప్రశ్న మరోసారి వినిపించండి’ అన్నాడు.‘అన్నిటికీ అల్లాయే అంటున్నారు గదా.. మరి అల్లా‹ß కు ముందు ఎవరున్నారు?’ అని ప్రశ్నించాడు.అప్పుడా బాలుడు, ‘మీకు ఒకటి, రెండు ఒంట్లు వచ్చుగదా..? ఒకటి నుండి పది వరకు లెక్కించండి’. అన్నాడు.‘ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ‘ఇదేమి పిచ్చి ప్రశ్న’ అంటూనే ఒకటి నుండి పది వరకు లెక్కించాడు.‘పది తరువాత..?’ అన్నాడా బాలుడు.‘పదకొండు..పన్నెండు..’ఇలా ఎంతవరకైనా వెళ్ళవచ్చు.’ అన్నాడా వ్యక్తి. ‘అవును కదా..! అలాగే పది నుండి వెనక్కి లెక్కించండి. ’అన్నాడా బాలుడు. ‘పది..తొమ్మిది..ఎనిమిది..ఇలా .. ఒకటి వరకు వచ్చి ఆగి పొయ్యాడు.‘తరువాత..? లెక్కించండి..’ అన్నాడు బాలుడు.‘తరువాత ఇంకేముంటుంది. ఏమీలేదు.. సున్నా.. శూన్యం.’ అన్నాడా వ్యక్తి.‘..కదా..? అల్లాహ్ కు ముందు కూడా ఏమీ లేదు.. అంతా శూన్యం. అన్నిటికీ కర్త ఆయనే..’ అన్నాడు బాలుడు.సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ప్రశ్నించిన వ్యక్తి ముఖం వాడిపోయింది. వెంటనే రెండో ప్రశ్న సంధించాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మనసులు గెలిచే మంచితనం
అది ముహమ్మద్ ప్రవక్త (స) ధర్మ ప్రచారం చేస్తున్న తొలి దినాల మాట. ఒకసారి ఆయన మక్కా వీధిగుండా వెళుతున్నారు. కూడలిలో ఒక వృద్ధురాలు కొంత సామగ్రితో నిలబడి ఉంది. మూటలు బరువుగా ఉండడంతో దారిన వెళ్ళేవారిని బతిమాలుతోంది కాస్త సాయం చేయమని. కాని, ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అంతలో ముహమ్మద్ ప్రవక్త అటుగా వెళుతూ, వృద్ధురాలిని ఎవరూ పట్టించుకోక పోవడం చూసి, ఆమెను సమీపించారు. ‘అమ్మా నేను మీకు సహాయం చేస్తాను’ అన్నారు. ‘బాబ్బాబూ.. నీకు పుణ్యముంటుంది. ఈ మూట చాలా బరువుగా ఉంది. మోయలేక పోతున్నాను. కాస్త అందాకా సాయం చేస్తే నేను వెళ్ళిపోతాను’ అన్నదామె. ‘అయ్యో! దీనికేం భాగ్యం’ అంటూ మూట భుజానికెత్తుకొని, ఆమె కోరిన చోటుకు చేర్చారు ప్రవక్త మహనీయులు. ‘బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏ తల్లి కన్నబిడ్డవో గాని ముక్కూమొహం తెలియని నాలాంటి ముసలిదానికి ఇంత సహాయం చేశావు. బాబూ! ఒక్కమాట వింటావా. ఎవరో ముహమ్మద్ అట, ఏదో కొత్తమతాన్ని ప్రచారం చేస్తున్నాడట. అతని మాటల్లో ఏముందో గాని చాలామంది అతని ప్రభావంలో పడిపోతున్నారు. జాగ్రత్త నాయనా! అతని మాటల్లో పడకు. నేను కూడా అందుకే ఊరే విడిచి వెళ్ళిపోతున్నాను’. అని హితవు పలికింది. ‘సరేనమ్మా’ అంటూ ఆమె చెప్పిందంతా ఓపిగ్గా విని, వినయపూర్వకంగా అవ్వకు అభివాదం చేసి సెలవు తీసుకున్నారు ముహమ్మద్ ప్రవక్త(స). ఆ మహనీయుని మంచితనానికి, వినయ పూర్వకమైన ఆ వీడ్కోలుకు ఆనంద భరితురాలైన వృద్ధురాలు ఒక్కసారిగా భావోద్రేకానికి లోనై, ‘బాబూ !’ అని పిలిచింది ఆప్యాయంగా. ‘అమ్మా!’ అంటూ దగ్గరికి వచ్చిన ప్రవక్త తలపై చేయి వేసి నుదుటిని ముద్దాడుతూ, ‘బాబూ !’ నీ పేరేమిటి నాయనా?’ అని అడిగింది ప్రేమగా. ప్రవక్త ఏమీ మాట్లాడకుండా తలవంచుకొని మౌనం వహించారు. ‘బాబూ! పేరైనా చెప్పు నాయనా కలకాలం గుర్తుంచుకుంటాను’ అంటూ అభ్యర్ధించిందామె. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘అమ్మా! నా పేరు ఏమని చెప్పను? ఏ ముహమ్మద్‌కు భయపడి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావో ఆ ముహమ్మద్‌ను నేనేనమ్మా!’ అన్నారు తలదించుకొని. దీంతో ఒక్కసారిగా వృద్ధురాలు అవాక్కయి పోయింది. కాసేపటి వరకు ఆమెకేమీ అర్థ కాలేదు. ఏమిటీ.. నేను వింటున్నది ముహమ్మద్ మాటలనా..! నేను చూస్తున్నది స్వయంగా ముహమ్మద్నేనా..? నాకళ్ళు, చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా..!’ ఆమె మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. ఎవరి మాటలూ వినకూడదని, ఎవరి ముఖం కూడా చూడకూడదని పుట్టి పెరిగిన ఊరినే వదిలేసిందో, అతనే తనకు సహాయం చేశాడు. ఎవరూ పట్టించుకోని నిస్సహాయ స్థితిలో ఆప్యాయత కురిపించాడు. సహాయం కంటే ఎక్కువగా ఆయన మాట, మంచితనం, వినమ్రత, మానవీయ సుగుణం ఆమెను మంత్రముగ్ధురాల్ని చేసింది. కళ్ళనుండి ఆనంద బాష్పాలు జలజలా రాలుతుండగా, ‘బాబూ ముహమ్మద్ ! నువ్వు నిజంగా ముహమ్మద్వే అయితే, నీనుండి పారిపోవాలనుకోవడం నా దురదృష్టం. ఇక నేను ఎక్కడికీ వెళ్ళను. నీ కారుణ్య ఛాయలోనే సేద దీరుతాను.’ అంటూ అదే క్షణాన ప్రవక్తవారి ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. ఇదీ ప్రవక్తమహనీయుని ఆచరణా విధానం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
పహిల్వాన్ గర్వభంగం
పూర్వం ఒక ఊరిలో పెద్ద పహిల్వాను ఉండేవాడు. గొప్ప బలశాలి. ఎంతటి మల్లయోధుడినైనా క్షణాల్లో మట్టికరిపించగల కండబలం, నైపుణ్యం అతని సొంతం. కొన్నాళ్ళపాటు అతను కుస్తీ ప్రపంచానికి రారాజుగా వెలిగిపొయ్యాడు. తనతో పోటీకి దిగిన ప్రతి ఒక్కరినీ ఓడించి విజేతగా నిలిచేవాడు. అతని పేరు వింటేనే పెద్దపెద్ద యోధులు వణికిపొయ్యేవారు. దూరతీరాల వరకూ అతని ఖ్యాతి మారుమోగి పోయింది. దీంతో అతడికి ఎక్కడలేని గర్వం తలకెక్కింది. ఎవరినీ ఖాతరు చేసేవాడుకాదు. ఒకసారి అతడు అహంకారపు అంచులు తాకుతూ, ప్రపంచంలోని బలవంతులనందరినీ ఓడించిన తనకు ఎదురే లేదన్న అహంకారంతో దైవం పట్లకూడా తలబిరుసు తనం ప్రదర్శించాడు. ‘నన్ను ఎదిరించేవాడు, నాతో తలపడి గెలిచి నిలిచే వాడు ప్రపంచంలో ఎవడూ లేడు. నాతో తలపడడానికి ఇక నీ దూతలను పంపు నేను వారిని కూడా ఓడించి భూమ్యాకాశాల విజేతగా నిలుస్తాను.’ అంటూ పొగరుగా వికటాట్టహాసం చేశాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. సర్వశక్తిమంతుడైన దైవం అతని పొగరును, అహంకారాన్ని అణచాలని అనుకున్నాడు. తను ప్రసాదించిన శక్తిసామర్థ్యాలను చూసుకొని అతడు ఆ విధంగా విర్రవీగడం దైవానికి నచ్చలేదు. దాంతో దైవం అతని శక్తిని క్షీణింపజేశాడు. అతణ్ణి నిస్సహాయుడుగా మార్చాడు. ఒకరోజు అతడు ఓ ఎత్తైన కొండ ఎక్కి తన కళలన్నీ ప్రదర్శిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించడం ప్రారంభించాడు. తనను ఢీ కొట్టగల శక్తి ఈ భూమండలం పైనే కాదు, గగన తలంపై కూడా లేదని విర్రవీగాడు. అలా కొద్ది సేపటి తరువాత అదే బండరాతిపై ఠీవిగా కూర్చున్నాడు. అంతలో అతనికేదో మైకం ఆవరించినట్లు అనిపించిది. తలాపున ఇటుకలాంటి ఓరాతి ముక్కను పెట్టుకొని అలానే ఓపక్కకు ఒరిగి పొయ్యాడు. అంతలో ఒక ఎలుక ఎటునుండి వచ్చిందో, అతని కాలి వేలును పట్టుకొని కొరక సాగింది. అతను దాన్ని విదిలించుకోడానికి ప్రయత్నించాడు. కాని కాలు కుడా కదిలే పరిస్థితిలో లేదు. శరీరమంతా నిస్సత్తువ ఆవరించింది. కొద్దిసేపటి క్రితం వరకూ కొండల్ని సైతం పిండి చేయగల శక్తిసామర్థ్యాలు ప్రదర్శించి సత్తా చాటిన పర్వతమంత బలశాలి పహిల్వాన్ నిస్సహాయ స్ధితిలో పడి ఉన్నాడు. కొద్ది దూరంలో నిలబడి ఇదంతా గమనిస్తున్న కొందరు ఆ పహిల్వానుతో, ‘చూశావా.. అల్లాహ్ తన సైన్యంలో అత్యంత అల్పమైన ఒక సైనికుడిని నీ దగ్గరికి పంపాడు. ఎందుకంటే ఆయన నీకు నీ స్థాయినీ, నీ అసలు బలాన్ని చూపించ దలచాడు. అహంకారం నుండి నిన్ను మేల్కొలిపి, కళ్ళు తెరిపించాలనుకున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కళ్ళు తెరువు. అందరికంటే బలవంతుడు, భూమ్యాకాశాల సృష్టికర్త అహంకారాన్ని ఎంతమాత్రం సహించడు. ఆయన ముందు సాగిలపడు.. ఆయన సన్నిధిలో పశ్చాత్తాప పడు, క్షమాపణ కోరుకో.. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని అహంకారం వీడితే సర్వశక్తివంతుడు, దయామయుడు అయిన అల్లాహ్ నిన్ను క్షమిస్తాడు. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు’. అని హితవు పలికారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
లౌకికవాదం దిశగా ఇరాన్ అడుగులు
సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్‌ను షియా ముస్లిం దేశంగా అక్కడి పాలకులు ఎప్పుడూ చెప్పుకోవడం మనకు తెలిసిందే. అయితే అక్కడ ముస్లింల ప్రాబల్యం తగ్గుతూ లౌకికవాదం వేళ్లూనుకుంటున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ‘గ్రూప్ ఫర్ అనలైజింగ్ అండ్ మెజరింగ్ ఆటిట్యూడ్స్ ఇన్ ఇరాన్, లాడన్ బోరౌమాండ్’ సహకారంతో ఇటీవల నిర్వహించిన ఓ ఆన్లైన్ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్లో 32 శాతం షియా ముస్లింలు, ఐదు శాతం మంది సున్నీలు, మూడు శాతం సూఫీ ముస్లింలు ఉన్నట్లు తేలింది. అంటే ముస్లింల సంఖ్య 40 శాతం అన్నమాట. 9 శాతం మంది తాము నాస్తికులమని చెప్పగా, ఏడు శాతం మంది ఆధ్యాత్మిక వాదులమని చెప్పారు. 8 శాతం మంది జొరాస్ట్రియన్లమని చెప్పుకోగా, 1.5 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. మొత్తం ఇరాన్ జనాభాలో 78 శాతం మంది దేవుడిని విశ్వసిస్తుండగా, వారిలో 37 శాతం మంది పునర్జన్మ ఉంటుందని నమ్ముతుండగా, స్వర్గ నరకాలు ఉంటాయని 30 శాతం మంది విశ్వసిస్తున్నారు. మొత్తం జనాభాలో పాతిక శాతం మంది దేవుడు కాకపోయినా మానవాతీత శక్తులున్నాయని నమ్ముతున్నారు. 20 శాతం మంది మాత్రం తాము ఏ శక్తులను నమ్మమని, నాస్తికులమని చెప్పారు. మతాన్ని విశ్వసిస్తున్న వారిలో తాము మత సంప్రదాయాలను ఆచరిస్తున్నామని 90 శాతం మంది తెలిపారు. (చదవండి: వెయ్యిరెట్లకు మించి ప్రతీకారం : ట్రంప్) జీవన క్రమంలో తమ భావాలను కోల్పోయామని 47 శాతం మంది తెలుపగా, తాము మతాన్ని మార్చుకున్నట్లు ఆరు శాతం మంది తెలిపారు. మతాన్ని వదులుకుంటున్న వారిలో ఇతర మతాల నుంచి క్రైస్తవ మతంలోకి మారుతున్న వారిలో ఎక్కువ మంది యువతీ యువకులే ఉంటున్నారు. ఈ లెక్కన ఇరాన్ ఆధునికతను సంతరించుకుంటూ లౌకికవాదం దిశగా అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇరాన్ ప్రభుత్వం 2016లో విడుదల చేసిన జనాభా గణాంకాల ప్రకారం ఆ దేశంలో 99.5 శాతం మంది ముస్లింలని పేర్కొంది. అదే నిజమైతే 1979లో అయతుల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇస్లామిక్ తిరుగుబాటు ప్రభావం శూన్యమనే అనుకోవాలి. ఇస్లామిక్ తిరుగుబాటు వల్ల విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, దేశం అభివద్ధిని, ఆధునికతను సముపార్జించుకుందని విశ్లేషకులు ఎప్పుడో తేల్చి చెప్పారు. ఇరాన్లో మత మౌఢ్యం తగ్గుతోంది. పెరుగుతున్న అక్షరాస్యతతోపాటు తగ్గుతున్న జనాభా వద్ధి రేటు దీనికి నిదర్శనం. 2020లో ఇరాన్ జనాభా వద్ధిరేటు మునుపెన్నడూ లేనంతగా ఒక శాతానికి పడిపోయింది. గత యాభై ఏళ్లలో ఇరాన్ ప్రవాసీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. (చదవంండి: ఇరాన్‌తో చర్చలు ఫలవంతం) -
ఇస్లాం వెలుగువ్యాపార ధర్మం
‘మీ సామగ్రి అమ్ముకోడానికి ప్రజలకు అబద్ధాలు చెప్పకండి, అసత్య ప్రమాణాలు చెయ్యకండి. అలా చేయడం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందినట్లు తాత్కాలికంగా అనిపించినా, చివరికి మీ వ్యాపారం లో శుభాలు అంతరించి పోతాయి. వ్యాపారంలో ఎప్పుడూ నమ్మకం, విశ్వసనీయత కలిగి ఉండాలి. పనికిరాని, నాసిరకం వస్తువుల్ని మాయమాటలు చెప్పి అమ్మడం గాని, సాధారణ లాభం కంటే చాలా ఎక్కువ లాభం గడించడంగాని చేసి, ధర్మబద్ధమైన మీ వ్యాపారాన్ని అధర్మమైనదిగా చేసుకోకండి. సత్యవంతుడైన వ్యాపారి ప్రళయ దినాన ప్రవక్తలు, సత్య సంధులు, షహీదుల సహచర్యంలో ఉంటాడు.’ అని ప్రవక్త మహనీయులవారు ఉపదేశించారు. అంతేకాదు, మీరు చేస్తున్న పనిలో శుభం (బర్కత్ ) కలగాలంటే ప్రాతః కాలాన్నే నిద్రలేవాలని చెప్పారు. ఉపాథి అన్వేషణలో, ధర్మసమ్మతమైన సంపాదన కోసం ప్రాతః కాలాన్నే ఎంచుకోండి. ఎందుకంటే ఉదయకాల ప్రార్ధన(నమాజ్ ) తరువాత చేసే పనుల్లో శుభాలు, లాభాలు సమృద్ధిగా ఉంటాయి. ధర్మసంపాదనతో జీవితం గడిపినవారు నా సంప్రదాయాన్ని పాటించినవారవుతారు. నా సున్నత్ ను పాటించినవారు తప్పకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ప్రవక్త మహనీయులవారి ఈ ఉపదేశాల ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. కనుక ప్రవక్తవారి సుభాషితాలను దృష్టిలో ఉంచుకొని, వ్యాపారంలో విలువలు పాటించాలి. సాధ్యమైనంతవరకు వినియోగదారునికి మంచి సరుకు, మంచి వస్తువు సమకూర్చే ప్రయత్నం చెయ్యాలి. మీకు నమ్మకంలేని సామగ్రిని మీరసలు అమ్మనే కూడదు. నిజాయితీగా, పట్టుదలతో వ్యాపారం చేసి బాగా సంపాదించుకోవడంలో ఎలాంటి తప్పూలేదు. కాని అబద్ధాలు చెప్పి, కల్తీచేసి, మాయచేసి, మోసంచేసి అడ్డదారులు తొక్కి సంపాదించాలన్న దుర్బుద్ధి ఉండకూడదు. వ్యాపారంలో నమ్మకం, నిజాయితీ, ఖచ్చితత్వం ఉండాలి. సరుకును కల్తీచేయడం, తూనికలు, కొలతల్లో మోసం చేయడం, అబద్ధం చెప్పడం లాంటి చేష్టలకు పాల్పడితే అలాంటి వ్యాపారికి వినాశం తప్పదని ప్రవక్త హెచ్చరించారు. ఒకసారి ప్రజలు, ‘అన్నిటికన్నా శ్రేష్టమైన సంపాదన ఏది?’ అని ప్రవక్తవారిని అడిగారు. దానికాయన, ‘స్వహస్తాలతో ఆర్జించిన సంపాదన..అబధ్ధం, నమ్మక ద్రోహం లేని వ్యాపారం’ అని సమాధానం చెప్పారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అది ముస్లిం సంస్థల పనే
న్యూఢిల్లీ/లక్నో/మంగళూరు/జైపూర్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో బయటివారి ప్రమేయం ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ అల్లర్లలో పాలుపంచుకున్న ఇస్లామిక్ సంస్థలకు చెందిన ఆరుగురు పశ్చిమబెంగాల్ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ‘పౌర’ చట్టాన్ని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజులపాటు జరిగిన హింసాత్మక ఘటనల్లో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రాజధాని లక్నోతోపాటు గొడవలు ఎక్కువగా చోటుచేసుకున్న మీరట్, ఫిరోజాబాద్, కాన్పూర్, బిజ్నోర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం ప్రశాంతత నెలకొంది. కాగా, అల్లర్ల బాధిత కుటుంబాలను కలిసేందుకు వచ్చిన బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలను లక్నో విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. బిజ్నోర్ జిల్లాలో అల్లర్ల బాధిత కుటుంబాలను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పరామర్శించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ‘పౌర’ చట్టానికి అనుకూలంగా జరిగిన ర్యాలీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. అల్లర్ల కారకులను అరెస్ట్ చేశాం రాష్ట్రంలో అల్లర్లకు కారకులైన వారిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఆదివారం డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ మీడియాకు తెలిపారు. హింసాత్మక ఘటనల వెనుక పశ్చిమబెంగాల్‌కు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) కార్యకర్తల హస్తం ఉందన్నారు. వీరు అక్రమ ఆయుధాలను వాడారని తెలిపారు. బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన ఆరుగురు పీఎఫ్ఐకు చెందిన వారిని ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. జైపూర్‌లో భారీ ర్యాలీ పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆధ్వర్యంలో జైపూర్‌లో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో 3 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. ఆదివారం ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, బిహార్, రాజస్తాన్, తమిళనాడు ల్లోనూ ఆందోళనలు ప్రశాంతంగా కొన సాగాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు ఆదివారం దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపారు. తమ ప్రాంత స్థానిక ప్రజల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని మరుగున పరిచేలా, ‘పౌర’ ఆందోళన లకు మతం రంగు పులిమారని వారు ఆరోపించారు. ‘మా అజెండాను వేరొకరు హైజాక్ చేయనివ్వం. మా ప్రజల తరపున మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చాం’అని త్రిపుర రాచ కుటుంబ వారసుడు ప్రద్యోత్ దేవ్ వర్మన్ పేర్కొన్నారు. నాగపూర్‌లో అనుకూల ర్యాలీ నాగపూర్: పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ చట్టానికి అనుకూలంగా ఆదివారం నాగపూర్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూల సంస్థ చేపట్టిన ర్యాలీలో గడ్కరీ ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు ఎటువంటి అన్యాయం తలపెట్టదన్నారు. పొరుగు దేశాల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపబోదన్నారు. ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్న విషయం ముస్లింలు గ్రహించాలన్నారు. -
ఆపరేషన్ కైలా ముల్లెర్
-
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం
వాషింగ్టన్: ఉగ్రమార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ(48)ను అమెరికా సేనలు సిరియాలో అంతమొందించాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా అమెరికా సైన్యం కన్నుగప్పి దాడులకు పాల్పడుతున్న మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది బాగ్దాదీ.. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలోని అమెరికా సేనలు చేసిన ‘రహస్య దాడి’ సందర్భంగా చనిపోయాడని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. బాగ్దాదీ మరణించాక ఆ దాడి ప్రాంతం నుంచి అత్యంత విలువైన డాక్యుమెంట్లను అమెరికా సేనలు స్వాధీనంచేసుకున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణ, అంతర్జాతీయ సంబంధాల వివరాలు వాటిలో ఉన్నట్లు సమాచారం. ట్రంప్, అమెరికా సైనికాధిపతుల పర్యవేక్షణలో జరిగిన ఘటన క్షణ క్షణం నాటకీయంగా సాగినవైనమిది. బాగ్దాదీ స్థావరం ఇటీవల ఇరాక్ నుంచి వాయవ్య సిరియాకి మారింది. ఒక నెలక్రితం కుర్దుల నుంచి కచ్చితమైన సమాచారమందింది. ఆ గ్రామంలోనే బాగ్దాదీ ఉంటున్నట్లు రెండు వారాల క్రితం అమెరికా సేనలు నిర్ధారించుకున్నాయి. వాయవ్య సిరియాలోని స్థావరంపై దాడికి మూడు రోజుల ముందే ట్రంప్‌కి సమాచారం ఉంది. రష్యా, ఇరాక్, టర్కీ దేశాల అనుమతితో వాయు సేనలు సాగాయి. ఆపరేషన్ కైలా ముల్లర్ బాగ్దాదీని పట్టుకోవడం కోసం బాగ్దాదీ చేతిలో తీవ్ర చిత్రహింసలపాలై, అత్యాచారానికి గురై హతమైన అమెరికా మానవహక్కుల కార్యకర్త 26 ఏళ్ళ కైరా ముల్లర్ పేరుని ఈ ప్లాన్‌కి పెట్టారు. అసలేం జరిగింది? వర్జీనియాలో ఒక రౌండ్ గోల్ఫ్ ఆట ముగించుకొని సరిగ్గా సాయంత్రం 5 గంటలకు వైట్ హౌస్‌లోని ‘సిట్యుయేషన్ రూమ్’కి అధ్యక్షుడు ట్రంప్ చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, అమెరికా భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రీన్లు సిట్యుయేషన్ రూమ్‌కి వచ్చారు. బాగ్దాదీపై సైనిక రహస్యదాడిని వీడియోలో వీక్షించేందుకే సిద్ధమయ్యారు. గంటల్లో అంతా బూడిద గ్రామంపై చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్లను గ్రామస్తులు గమనించారు. అమెరికా హెలికాప్లర్లు, సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే వారందరినీ అమెరికా సైనికులు మట్టుబెట్టారు. ఆ తర్వాత బాగ్దాదీ ఉంటున్న ఇంటి ముఖద్వారాన్ని బాంబులతో పేల్చారు. సైన్యం దాడి విషయం తెల్సి బాగ్దాదీ వెంటనే రహస్య సొరంగ మార్గం ద్వారా భూగృహం(బంకర్)లోకి చొరబడ్డాడు. ఆయనను బంకర్ చివరివరకు అమెరికా సైనిక సేనలు, సైనిక శునకాలు తరిమాయి. బయటపడే మార్గం లేకపోవడంతో తన శరీరానికున్న బాంబుల జాకెట్‌ను పేల్చుకుని బాగ్దాదీ చనిపోయాడు. పిచ్చివాడిలా అరుచుకుంటూ.. అమెరికా సైనికులు చుట్టుముట్టడంతో ప్రాణభయంతో బాగ్దాదీ అరుచుకుంటూ, ఏడ్చుకుంటూ పరిగెత్తాడని ట్రంప్ వెల్లడించారు. అమెరికా సైనిక కే9 శునకాలు తరుముతుండడంతో చివరకు సొరంగంలోని బంకర్ చివరి అంచులకు చేరి తన ముగ్గురు పిల్లలతో సహా బాంబులతో పేల్చుకుని కుక్కచావు చచ్చాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో దాడి వీడియో ప్రత్యక్షప్రసారాన్ని చూస్తున్న అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్, జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ -
ఇస్లామోఫోబియా పోగొట్టేందుకు టీవీ చానల్
ఇస్లామాబాద్: పశ్చిమదేశాల్లో ముస్లింలకు సంబంధించిన అంశాలతోపాటు ఇస్లాం అంటే ఉన్న భయాన్ని పోగొట్టేందుకు పాకిస్తాన్, మలేసియా, టర్కీ కలిసి బీబీసీ తరహా ప్రత్యేక టీవీ చానల్‌ను ప్రారంభించనున్నాయి. ఇటీవలి ఐరాస సమావేశాల్లో ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఈ విషయం ప్రకటించడం తెల్సిందే. ఇంగ్లిష్‌లో ప్రసారమయ్యే టీవీ చానెల్‌తోపాటు సంయుక్తంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నా.. చానల్‌ను ఎప్పుడు ప్రారంభించేదీ ఇంకా నిర్ణయించలేదు. -
అల్లాహ్ అన్నీ చూస్తూనే ఉన్నాడు!
పూర్వకాలంలో దైవ విశ్వాసి, దైవభీతి పరుడు అయిన ఒక రాజు ఉండేవాడు. ఎప్పుడూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఆ రాజు అప్పుడప్పుడూ మారువేషంలో తిరుగుతూ ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. యధాప్రకారం ఒకరోజు మారువేషంలో తిరుగుతూ, చెరసాల వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో ఇద్దరు సిపాయీలు దొంగతనం చేసిన నేరంపై ఒక వ్యక్తిని పట్టుకొని చెరసాలకు తీసుకు వెళుతున్నారు. తను కూడా లోపలికి వెళ్ళి ఏం జరుగుతోందో చూడాలనుకున్నాడు. చెరసాల ప్రధానద్వారం దగ్గరకు చేరుకోగానే, ద్వారపాలకుడు రాజును గుర్తుపట్టి గౌరవంగా లోపలికి తోడ్కొని వెళ్ళాడు. రాజు జైలు పరిసరాలన్నీ నిశితంగా పరిశీలించాడు. అధికారులతో చెరసాల విషయాలను చర్చించాడు. ఒక్కొక్క ఖైదీని పిలిపించి, ఏ కారణంగా జైలుకు రావలసి వచ్చిందని ప్రశ్నించాడు. దానికి, ప్రతి ఒక్కరూ తాము ఏ నేరం చేయలేదని, అనవసరంగా తమపై అభియోగాలు మోపి జైలు పాలు చేశారని వాపోయారు. అలా ఎవరికి వారు ప్రతి ఒక్కరూ తాము ఏ పాపమూ చేయలేదనే చెప్పారు. కాని అందులో ఒకడు మాత్రం ఉదాసీనంగా ఒక మూలన కూర్చొని ఉన్నాడు. మిగతా ఖైదీలంతా పోటీలు పడి రాజు గారికి తమ నిర్దోషిత్వాన్ని గురించి చెప్పుకుంటుంటే, అతను మాత్రం కూర్చున్న చోటునుండి కదలకుండా పశ్చాత్తాపంతో కుమిలి పోతున్నాడు. ఇది గమనించిన రాజు అతన్ని దగ్గరికి పిలిచి, ‘‘నువ్వేమైనా నేరం చేశావా.. లేక నిన్ను కూడా అనవసరంగా జైల్లో వేశారా?’’ అని అడిగాడు.దానికతను, ‘లేదు రాజా.. నేను నేరం చేశాను. ఒకానొక బలహీన స్థితిలో, గత్యంతరం లేక చిన్న దొంగతనం చేశాను. నా తప్పును దేవుడు క్షమిస్తాడా.. లేదా.. అని పశ్చాత్తాప పడుతున్నాను. అలాంటిది, దొంగతనం చేసి, చెయ్యలేదని నేను మీతో అబద్ధం ఎలా చెప్పగలను?.’ అంటూ సిగ్గుతో తల దించుకున్నాడు. ‘‘అవునా..? సరే.. ఇంతమందిలో తప్పు చేసిన వాడివి నువ్వొక్కడివే కనబడుతున్నావు. ఇంత మంది నిరపరాధుల మధ్య ఒక అపరాధి, ఇంతమంది మంచి వాళ్ళలో ఒక చెడ్డవాడు ఉండడం మంచిది కాదు, సమంజసమూ కాదు. అందుకని నిన్ను విడుదల చేస్తున్నాను’’ అని ప్రకటించి, తన దారిన తను వెళ్ళిపోయాడు రాజు. మళ్ళీ కొన్నాళ్ళకు రాజు చెరసాల సందర్శనకు వచ్చాడు. ఈ సారి ఖైదీలందరూ రాజు గారిచుట్టూ గుమిగూడారు. ఒక్కొక్కరూ రాజును సమీపించి తాము నేరం చేశామని విన్నవించుకున్నారు. అందరి మాటలూ సావధానంగా విన్న రాజు ‘వీరందరికీ మరో రెండు నెలలు అదనంగా జైలు శిక్షను పొడిగించండి.’అని ఆదేశించి వెళ్ళిపొయ్యాడు. దీంతో లబో దిబో మన్న ఖైదీలు ‘ఏమిటీ ఇలా జరిగిందీ గతంలో రాజు గారు వచ్చినప్పుడు తప్పును అంగీకరించిన ఫలానా వ్యక్తిని విడుదల చేశారు కదా... మరి మేమంతా ఈ రోజు తప్పును అంగీకరిస్తే మా శిక్షను రెట్టింపు చేశారేమిటీ?’అని కారాగారాధికారి వద్ద వాపోయారు. రాజుగారి అంతరంగం బాగా తెలిసిన ఆ అధికారి, వారికి సమాధానమిస్తూ..‘ఆ రోజు మీరంతా రాజుగారికి అబద్ధం చెప్పి, బయట పడాలని అనుకున్నారు. రాజుగారు మీ మాటలు నమ్మి మిమ్మల్ని విడిచి పెడతాడని ఆశించారు. కాని ఆ వ్యక్తి అలా చేయలేదు. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ, నేరాన్ని నిజాయితీగా అంగీకరించాడు. నేరాంగీకారానికి కారణం ఏదో ఒక విధంగా బయట పడదామని కాదు. తనవల్ల తప్పు జరిగినందుకు సిగ్గుపడ్డాడు, పశ్చాత్తాపంతో కుమిలి పొయ్యాడు... భవిష్యత్తులో తప్పు చేయకూడదన్న బలమైన సంకల్పం అతనిలో కనిపించింది. కాని మీరు ఆరోజు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూశారు. మీమాటలు నమ్మి రాజుగారు విడుదల చేస్తారని ఆశించారు. ఈ రోజు కూడా అంతే.. చేసిన తప్పుల పట్ల ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోగా, పోటీలు పడి చేసిన ఘనకార్యాలను గర్వంగా చెప్పుకున్నారు. ఇలా నిజం చెప్పినందుకు అతణ్ణి విడిచి పెట్టారు కదా.. మమ్మల్ని కూడా అలాగే విడుదల చేస్తారని భావించి అలా చెప్పారు. అంతే తప్ప, నిజమైన పశ్చాత్తాప భావన మీలో ఏకోశానా కనిపించలేదు. అందుకే రాజు మిమ్మల్ని వదిలిపెట్టకపోగా శిక్షను పెంచాడు’’అనిఆ వివరించాడు. ఖైదీలు సిగ్గుతో తల దించుకున్నారు. అల్లాహ్ వ్యవహారం కూడా ఇలాగే ఉంటుంది. నిజమైన పశ్చాత్తాపాన్ని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. తప్పు చేసిన మనిషి తన తప్పు తెలుసుకొని, అంగీకరించి, మరలా మరలా అలాంటి తప్పులకు, పాపాలకు పాల్పడనన్న పశ్చాత్తాప భావనతో అల్లాహ్‌ను వేడుకుంటే, ఆయన తప్పకుండా మన్నిస్తాడు. తప్పులు చేస్తూ కూడా, పశ్చాత్తాప భావన లేకుండా ఏదో ఒకవిధంగా తప్పించుకోవాలని చూస్తే మాత్రం రెట్టింపు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
చిరస్మరణీయులు
పూర్వం ఇరాక్ దేశంలో నమ్రూద్ అనే చక్రవర్తి ఉండేవాడు. పరమ దుర్మార్గుడు. తనది సూర్యచంద్రాదుల వంశమని, తాను దైవాంశ సంభూతుడినని ప్రకటించుకొని నిరంకుశంగా పరిపాలన చేస్తుండేవాడు. రాజు మాట వేదవాక్కుగా పరిగణించబడేది. ప్రజలంతా బానిసలుగా బతకాల్సిన పరిస్థితి. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదుగదా, కనీసం అలా ఊహించడానికే ప్రజలు గడగడలాడేవారు. అలాంటి పరిస్థితుల్లో రాజ దర్బారులో పూజారిగా పని చేస్తున్న‘అజర్’ ఇంట ఓ బాబు జన్మించాడు. అతని పేరే ఇబ్రాహీం. ఆయన్ని దేవుడు తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నమ్రూద్ దైవత్వానికి, రాచరికపు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు. ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న వివిధ రకాల దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విగ్రహారాధనను ఖండించారు. తనయుని వైఖరి తండ్రికి నచ్చలేదు.మందలించాడు. చంపేస్తానని బెదిరించాడు. అయినా ఇబ్రాహీం అలైహిస్సలాం తన వైఖరి మానుకోలేదు. విషయం తెలుసుకున్న నమ్రూద్ ఇబ్రాహీం గారిని తన దర్బారుకు పిలిపించాడు. ‘నా దైవత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావట. ఎవరో కనబడని దేవుణ్ణి గురించి చెబుతున్నావట. ఎవరా దేవుడు చెప్పు?’అని గర్జించాడు. ప్రశాంతచిత్తంతో మౌనంగా నిలబడి ఉన్న ఇబ్రాహీం ఏమీ మాట్లాడలేదు. దీంతో.. ‘మాట్లాడవేం.. నీ దేవుడెవరో చెప్పు?’ అంటూ మళ్ళీ గాండ్రించాడు. అప్పుడు ఇబ్రాహీంగారు, ‘మహారాజా..! ఎవరి ఆధీనంలో జీవన్మరణాలున్నాయో ఆయనే నా ప్రభువు, ఆయనే మనందరి దేవుడు.’ అన్నారు. ‘..అలాగా..! అయితే చూడు..’ అంటూ ఒక ఉరిశిక్ష పడిన ఖైదీని, నిరపరాధి అయిన మరొక అమాయకుడిని పిలిపించాడు. మరణ శిక్ష విధించబోయేౖ ఖెదీని విడుదల చేస్తూ, అమాయక యువకుణ్ణి చంపేశాడు.’ తరువాత.., ‘ఇప్పుడు చెప్పు. చావబోయేవాడికి జీవితం ప్రసాదించాను, బతకవలసిన వాణ్ణి చంపేశాను. అంటే జీవన్మరణాలు నా చేతిలో ఉన్నాయి.. మరి నేను దేవుణ్ణికానా..?’ అంటూ చూశాడు గర్వంగా.. ఓహో.. జీవన్మరణాల అర్ధాన్ని ఈవిధంగా అన్వయించుకున్నావా..? అని మనసులో అనుకున్న ఇబ్రాహీం, ‘సరే అయితే, దేవుడు సూర్యుణ్ణి తూర్పున ఉదయింపజేసి, పశ్చిమాన అస్తమింప జేస్తాడు. మరి నువ్వు, పశ్చిమాన ఉదయింపజేసి, తూర్పున అస్తమించేలా చేయి.’ అని సవాలు విసిరారు. దీంతో దైవద్రోహి అయిన నమ్రూద్ కు నోట మాట రాలేదు. గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘ఇతణ్ణి తీసుకెళ్ళి భగభగ మండే అగ్నిగుండంలో వేసి కాల్చిచంపండి.’ అని ఆదేశించాడు. రాజాజ్ఞ క్షణాల్లో కార్యరూపం దాల్చింది. పెద్ద అగ్నిగుండం రాజేసి, కణకణ మండుతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్ని కీలల్లో ఆయన్ని విసిరేశారు. కాని దేవుని ఆజ్ఞతో అగ్ని తన కాల్చే గుణాన్ని కోల్పోయింది. ఇబ్రాహీం పాలిట పూల పానుపుగా మారిపోయింది. ఆయన సురక్షితంగా బయట పడ్డారు. తరువాత ఇబ్రాహీం ప్రవక్త స్వదేశాన్ని విడిచి పెట్టి ఇతరప్రాంతాలకు వెళ్ళిపోయారు. సత్యధర్మాన్ని, దేవుని ఏకత్వాన్ని బోధిస్తూ, మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వివిధ ప్రాంతాలు పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అనేక కష్టనష్టాలు, పరీక్షలు ఎదుర్కొన్నారు. దైవాజ్ఞ మేరకు భార్యాబిడ్డల్ని నిర్జన ఎడారి ప్రాంతంలో వదిలేయడం, కన్నకొడుకును దైవమార్గంలో త్యాగం చేయడం మానవ జాతి చరిత్రలో చిరస్మరణీయ పరిణామాలు. దైవాదేశ పాలనలో తన సమస్తాన్నీ సమర్పించిన త్యాగధనుడు కనుకనే ఐదువేల సంవత్సరాలు గడిచినా చరిత్ర ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది. ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే ‘ఈదుల్ అజ్ హా’ పర్వదినం ఆ మహనీయుని త్యాగస్మరణే. ఆయన నిలిచిన ప్రదేశం, నిర్మించిన కాబాలయం, జమ్ జమ్ జలం, సఫా, మర్వాల సయీ, ఆయన, ఆయన కుటుంబం నడయాడిన నేల, వారి ఒక్కోఆచరణ ప్రళయకాలం వరకూ, సందర్శనీయ, స్మరణీయ ఆచరణలుగా దేవుడు నిర్ధారించాడు. ఈ అన్నిటికీ అసలు ప్రేరణ అల్లాహ్ సంతోషం, శాశ్వత సాఫల్యం. ఎవరికైనా అంతకన్నా కావలసింది ఇంకేముంటుంది? సత్యం కోసం, ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించిన ఆ మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం కావాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
కారుణ్యం కురిసే కాలం
ఇస్లామ్ ధర్మంలోని ఐదు మౌలిక అంశాల్లో ‘హజ్జ్’ కూడా ఒకటి. వెసులుబాటున్న ప్రతి ముస్లిం జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక ఆచరించాల్సిన విధి. ఇది జిల్‌హజ్జ్ మాసంలో నిర్వహించబడుతుంది. అందుకే ఈ మాసానికి ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ మాసంలోని మొదటి పదిరోజులు చాలా ప్రాముఖ్యం కలవి. వారంలోని ఏడు రోజుల్లో శుక్రవారానికి, సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో రమజాన్ మాసానికి, రమజాన్‌లోని 30 రోజుల్లో చివరి పదిరోజులకు ఏవిధంగా ప్రత్యేకత ఉందో, అదేవిధంగా జిల్‌హజ్జ్ మాసంలోని మొదటి పది రోజులకూ అలాంటి ప్రత్యేకతనే ప్రసాదించాడు. ఈ మొదటి దశకంలో అల్లాహ్ కారుణ్యం వర్షిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చేసే ప్రతి సత్కార్యమూ ఎనలేని ప్రాముఖ్యతను కలిగి అల్లాహ్ కృపకు పాత్రమవుతుంది. మనిషి ఈదశకంలో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరమైనవికావు. అంటే, జిల్‌హజ్జ్ మాసం తొలి తొమ్మిది రోజుల్లో చేసే ఆరాధనలు, సత్కార్యాలు అల్లాహ్‌కు మిగతా మొత్తం రోజులూ చేసిన ఆరాధనలు, సత్కార్యాలకంటే అధిక ప్రీతికరం. ఈ రోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా సంవత్సరం మొత్తం పాటించే రోజాలకు సమానం. ఇందులోని ప్రతి రాత్రి ఆచరించే నఫిల్‌లు షబేఖద్ర్‌లో ఆచరించే నఫిల్లతో సమానం. నిజానికి ఇవి హజ్జ్ కోసం ప్రత్యేకించబడిన రోజులు. ఆర్థిక స్థోమత కలిగిన వారు తప్ప అందరూ హజ్ చేయలేరు. కాని అల్లాహ్ తన అపారమైన దయతో ఆ మహత్తరమైన పుణ్యఫలం పొందగలిగే అవకాశాన్ని అందరికి ప్రసాదించాడు. జిల్ హజ్జ్ మాసం ప్రారంభమవుతూనే, తమతమ ప్రాంతాల్లో, తమ తమ ఇళ్ళ వద్దనే ఉంటూ హాజీలతో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. వారి ఆచరణలను అనుకరించే ప్రయత్నం చెయ్యాలి. ఇదే ఈద్ ఖుర్బానీలోని రహస్యం. హజ్జ్ యాత్రకోసం మక్కాకు వెళ్ళిన హాజీలు జిల్ హజ్జ్ మాసం పదవతేదీన మినాలో ఖుర్బానీలు సమర్పిస్తారు. మక్కా వెళ్ళలేక పోయిన యావత్ ప్రపంచంలోని ముస్లిములంతా తమ తమ స్వస్థలాల్లో ఇళ్ళవద్దనే ఖుర్బానీలు సమర్పిస్తారు. ఏ విధంగానైతే హాజీలు ‘ఇహ్రామ్’ధరించిన తరువాత క్షవరం చేయించుకోరో, గోళ్ళు కత్తిరించుకోరో అలాగే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న ముస్లింలు కూడా గోళ్ళు కత్తిరించుకోవడం, క్షవరం చేయించుకోవడం చేయకూడదు. అంటే మక్కాకు వెళ్ళిన హాజీలను అనుకరిస్తూ వారితో ఆత్మీయ సంబంధాన్ని పెంపొందించుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఈ విధంగా జిల్ హజ్ మాసం మొదటి దశలో సాధ్యమైనంత అధికంగా సత్కార్యాలు ఆచరించి దైవానుగ్రహాన్ని, అపారమైన ఆయన కారుణ్యాన్ని పొందడానికి కృషిచేయాలి. మక్కా వెళ్ళి హజ్జ్ ఆచరించే స్థోమత లేకపోయినా, కనీసం ఈదుల్ అజ్హా పండుగ వరకు ఈ పదిరోజులను సద్వినియోగం చేసుకుంటే అల్లాహ్ తన అపార కరుణతో హాజీలతో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. కనుక హజ్జ్ పరమార్థాన్ని అర్థం చేసుకొని, దానికనుగుణంగా కర్మలు ఆచరిస్తూ, ‘ఈదుల్ అజ్ హా’ పర్వదినాన్ని జరుపుకుంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందవచ్చు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
జైరా వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం
న్యూఢిల్లీ: ఇస్లాంకు దూరం కావడం ఇష్టంలేక సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ‘దంగల్’ సినిమా నటి జైరా వసీమ్ ప్రకటించడం సినీ, రాజకీయవర్గాల్లో దుమారం లేపింది. కొందరు జైరా వసీమ్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. తన జీవితం గురించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు జైరాకు ఉందనీ, దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జైరా వ్యక్తిగత నిర్ణయాన్ని తాము గౌరవిస్తామనీ, మతానికి–కళకు ఏమాత్రం సంబంధం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ఇస్లాం అసహనంతో కూడిన మతం అనేలా జైరా వ్యాఖ్యలు ఉన్నాయని శివసేన నేత ప్రియాంకా చతుర్వేది విమర్శించారు. అన్నీ ఇచ్చిన సినీపరిశ్రమకు కొందరు రుణపడి ఉండరనీ, అలాంటివాళ్లు తమ మ్రౌనంగా వెళ్లిపోవడం మంచిదని నటి రవీనా టాండన్ అన్నారు. -
దైవాదేశ పాలనకే ప్రాధాన్యం
మహమూద్ గజనవీ దర్బారులో అయాజ్ అనే మంత్రి ఉండేవాడు. అయాజ్ అంటే చక్రవర్తికి ఎంతోఇష్టం. దీంతో మిగతా మంత్రులకు కాస్త అసూయగా ఉండేది. ఒకసారి చక్రవర్తి తన చేతిలో ఉన్న ముత్యాల హారాన్ని కొలనులో విసిరేశాడు. దర్బారులోని కొలను స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతోంది. ముత్యాలహారం నీటి అడుగుభాగానికి చేరింది. అప్పుడుచక్రవర్తి, మంత్రులను పిలిచి,’మీలోఎవరైనా ఈ హారాన్ని బయటికి తీస్తారా?’అని అడిగాడు. దానికి అందరూ’ అదెంతపని చిటికెలో తీస్తాం.’ అన్నారు.‘సరే.. అయితే, ఒంటిపై వస్త్రాలు తడవకుండా హారాన్ని బయటికి తీయాలి.’ అన్నాడు చక్రవర్తి.‘అదెలాసాధ్యం?’ అంటూ అందరూ చేతులెత్తేశారు. బట్టలు తడవకూడదు అన్న షరతు లేకపోతే తీస్తామన్నారు.అప్పుడు చక్రవర్తి, అయాజ్‌ను పిలిచి ‘నువ్వు తీస్తావా?’అని అడిగాడు. అయాజ్ వెంటనే వెనుకాముందూ ఆలోచించకుండా కొలనులోకి దూకి ముత్యాల హారాన్ని బయటికి తీశాడు. అతని బట్టలు, శరీరమంతా నీటిలో తడిసి పొయ్యాయి. వణుకుతున్న చేతులతోనే హారాన్ని చక్రవర్తికి అందించాడు అయాజ్ .‘నేను బట్టలు తడవకుండా హారాన్ని తియ్యాలని చెప్పానుకదా..!’ అని ఆగ్రహించాడు చక్రవర్తి.‘అవును ప్రభూ! హారం తియ్యాలి.. వస్త్రాలు తడవద్దు.’ అన్న మీ ఆజ్ఞను శిరసావహించాలన్న ఆరాటంలో బట్టలు తడుస్తాయా.. తడవకుండా ఎలా తియ్యాలి..? అనే విషయాలేవీ నేను పట్టించుకోలేదు ప్రభూ..! మీ రెండు ఆజ్ఞల్లో ఒకదాన్ని పాలించాను. మరొకదాని విషయంలో నన్ను క్షమించండి’ అని చేతులు జోడించాడు అయాజ్ .అప్పుడు చక్రవర్తి, ‘చూశారా.. ఇదీ అయాజ్ ప్రత్యేకత. మీరంతా బట్టలు తడవకుండా ఎలా? తడుస్తాయి కదా.. ఆ షరతు తొలగించండి.. అదీ ఇదీ..’ అంటూ మీనమేషాలు లెక్కించారు. కాని అయాజ్ అదేమీ ఆలోచించలేదు. విలువైన హారాన్ని తీయడమే అతని దృష్టిలో ఉంది. ఆ క్రమంలో బట్టలు తడిస్తే శిక్షించబడతానని అతనికి తెలుసు. అయినా సరే నా విలువైన హారం కోసం తను శిక్షకు సిద్ధపడ్డాడు.మీరేమో హారం సంగతి తరువాత.. మేమెందుకు శిక్ష అనుభవించాలి?’ అని ఆలోచించారు.దైవాదేశపాలనలో మన పరిస్థితి కూడా ఇలాగే ఉండాలి. ఆయన ఆజ్ఞాపాలనలో మనం త్యాగానికి సిద్ధపడితే అల్లాహ్ మనల్ని తన సన్నిహితుడిగా చేసుకుంటాడు. మన పాపాలను క్షమిస్తాడు. ఇహలోకంలో గౌరవాన్ని ప్రసాదిస్తాడు. దైవదూతల ముందు మనల్ని గురించి గర్వంగా పొగుడుతాడు. ఆయన అమితంగా ప్రేమించేవాడు. అనన్యంగా కరుణించేవాడు. గొప్ప క్షమాశీలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మతం మార్చుకున్న టాప్ హీరో సోదరుడు
సాక్షి, చెన్నై: కోలీవుడ్ టాప్ హీరో శింబు సోదరుడు కురళరసన్ తాజాగా మతం మార్చుకున్నారు. ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించారు. శింబుతోపాటు బాలనటుడిగా కురళరసన్ పలు చిత్రాల్లో నటించారు. ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించి శింబు, నయనతార జంటగా నటించిన ‘ఇదునమ్మ ఆలు’ చిత్రంతో సంగీతదర్శకుడిగా మారారు. ఆయన తండ్రి సీనియర్ దర్శక, నిర్మాత, నటుడు టీ. రాజేందర్.. ఆయన ఏ మతమైన సమ్మతమే అంటారు. ఇక, ఆయన పెద్ద కొడుకు శింబు శివభక్తుడు. కూతురు ఇలఖ్య ఆ మధ్య క్రైస్తవ మతంలోకి మారి పెళ్లి చేసుకున్నారు. తాజాగా కురళరసన్ ఇస్లాం మతం స్వీకరించారు. ఆయన శుక్రవారం చెన్నై, అన్నాశాలైలోని మక్కా మసీదులోని ముస్లిం మత గురువుల సమక్షంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కురళరసన్ తల్లిదండ్రులు టీ.రాజేందర్, ఉషా హాజయ్యారు. టీ.రాజేందర్ మాట్లాడుతూ కురళరసన్ చిన్నతనంలోనే ఇస్లాం మతం వైపు ఆకర్షితుడయ్యాడని, తనకు అన్ని మతాలు సమ్మతం కావడంతో తన ఇష్టాన్ని గౌరవించినట్లు తెలిపారు. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్‌రాజా ఇప్పటికే ఇస్లాం మతాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కురళరసన్ ఆ కోవలో చేరారు. అయితే కురళరసన్ ఒక ముస్లిం యువతిని ప్రేమిస్తున్నారని, ఆమెను పెళ్లి చేసుకోవడానికే తను మతం మారారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. -
పిక్నిక్కు వెళ్తున్నామని చెప్పి.. ప్రస్తుతం గర్భిణిగా!
మొన్న లియోనారా... నేడు షమీమా బేగం.. సిరియాలోని డెమొక్రటిక్ క్యాంపుల్లో ఆవాసం పొందుతున్న.. ఇలాంటి ఇంకెందరో టీనేజర్లు స్వదేశానికి వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించాలంటే చట్టపరంగా, రాజకీయపరంగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముస్లిం రాజ్య స్థాపనే ధ్యేయంగా సిరియా, ఇరాక్లలో నరమేధం సృష్టిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు వీరు ఒకప్పటి సానుభూతి పరులు. తెలిసీ తెలియని వయస్సులో వేసిన తప్పటడుగు ఇప్పుడు వీరికి, వీరి సంతానానికి పెనుశాపంగా మారింది. వారిద్దరితో పాటు.. షమీమా బేగం బంగ్లాదేశీ- బ్రిటీష్ టీనేజర్(19). లండన్‌లోని బెత్నల్ గ్రీన్ అకాడమీలో చదువుకునేది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే షమీమా ఐఎస్ సిద్ధాంతాలు, వీడియోల పట్ల ఆకర్షితురాలై.. 2015లో తన తోటి విద్యార్థులు ఖతీజా సుల్తానా, అమైరా అబేస్‌లతో కలిసి లండన్ నుంచి సిరియాకు పారిపోయింది. ఈ విషయం అప్పట్లో లండన్ పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచింది. పిక్నిక్కి వెళ్తున్నామని చెప్పి పరారైన ఈ ముగ్గురు మొదట టర్కీకి వెళ్లి... అక్కడి నుంచి సిరియాలో ఐఎస్‌కు పట్టు ఉన్న రాకాకు చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఖతీజా ఐసిస్- కుర్దిష్ వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో చనిపోయింది. అమైరా ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఈ క్రమంలో రాకా చేరిన పది రోజుల తర్వాత అక్కడే ఇస్లాం స్వీకరించిన ఓ డచ్ వ్యక్తి(27)ని షమీమా పెళ్లి చేసుకుంది. అప్పటిదాకా బాగానే గడిచిన ఆమె జీవితం పెళ్లి తర్వాత దుర్భరంగా మారింది. సరైన తిండిలేక, పోషకాహార లోపం వల్ల రెండుసార్లు గర్భవిచ్చిత్తి కావడంతో షమీమా ఆరోగ్యం క్షీణించింది. లండన్‌లో అయితే నా బిడ్డ భద్రంగా ఉంటుంది.. ఇదిలా ఉండగా ఐఎస్ నుంచి రాకాను స్వాధీనం చేసుకునేందుకు.. స్థానిక కుర్దిష్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా రాకాను స్వాధీనం చేసుకుని సగం విజయం సాధించాయి. ఈ క్రమంలో వేలాది మంది ఐఎస్ సానుభూతిపరుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదే అదనుగా దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. షమీమా కూడా వారికి చిక్కడం, ఆమె భర్తను ఎస్డీఎఫ్ దళాలు అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి. ఈ విషయం గురించి షమీమా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రస్తుతం నిండు గర్భిణిని. నాలుగేళ్ల క్రితంలా ఇప్పుడు నాది చిన్నపిల్లల మనస్తత్వం కాదు. బ్రిటన్ వెళ్తే కనీసం నాకు పుట్టబోయే బిడ్డ అయినా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నరకబడిన ఓ మనిషి తలను మా డస్ట్‌బిన్‌లో మొదటిసారి చూసినపుడు నాకేమీ అనిపించలేదు. ఎందుకంటే ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ వ్యక్తికి అదే సరైన శిక్ష అని భావించాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఐసిస్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది. వారిలో నిజాయితీ లేదు కాబట్టి ఓడిపోయేందుకు వారు అర్హులు. ఇక కాలిఫేట్(ఐసిస్ స్థాపించాలనుకున్న రాజ్యం పేరు) స్థాపన అసాధ్యం’ అని తన అనుభవాలను చెప్పుకొచ్చింది.(ఇంటికి వెళ్లాలని ఉంది) ఇక్కడకు తీసుకొచ్చి శిక్షిద్దాం.. తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను ఈ క్యాంపు నుంచి తిరిగి తమ తమ దేశాలకు తీసుకువెళ్లాలంటూ ఎస్డీఎఫ్ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఐసిస్ సానుభూతి పరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎస్డీఎఫ్ విఙ్ఞప్తిని మన్నించలేమని, గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వంలో ఈ విదేశీ జీహాదీలు భాగమైనపుడు మాత్రమే సహాయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు తీసుకువచ్చిన తర్వాత.. ఐసిస్‌కు ఒకప్పుడు మద్దతుగా నిలిచిన కారణంగా షమీమా వంటి వారిని శిక్షించినా ఫర్వాలేదు గానీ.. వారికిప్పుడు కనీస సాయం అందించాల్సిన అవసరం ఉందని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాల్లాస్ అభిప్రాయపడ్డారు. అదే విధంగా అమెరికా కూడా విదేశీ జీహాదీలను స్వదేశానికి తీసుకువచ్చినా సరే.. వారికి సరైన శిక్ష విధించాలనే దృఢచిత్తంతో ఉంది. అందుకే వివిధ దేశాలను ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. ఏదేమైనా టీనేజీ యువత పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ కనబరచనట్లయితే లియోనారా, షమీమాలాగే మరికొంత మంది ఐఎస్ కబంధ హస్తాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ‘ఐఎస్’ ఎక్కడో కాకుండా ప్రేమ రూపంలోనో, డబ్బు ఆశ చూపిస్తూనో అది మన వీధిలోనే మన పిల్లల కోసం వల పట్టుకుని తిరుగుతుండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది! -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
ఇంటికి వెళ్లాలని ఉంది
టీనేజీ యువత పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ కనబరచనట్లయితే లియోనారా లాగే మరికొంత మంది ఐఎస్ కబంధ హస్తాల్లో చిక్కుకోవాల్సి ఉంటుందని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ‘ఐఎస్’ ఎక్కడో ఉంటుందని అనుకోకండి. ప్రేమ రూపంలోనో, డబ్బు ఆశ చూపిస్తూనో అది మన వీధిలోనే మన పిల్లల కోసం వల పట్టుకుని తిరుగుతుండవచ్చు. ఇప్పుడు తెలుస్తోంది.. అవును ఇప్పుడే తెలుస్తోంది.. నేను పెద్ద తప్పు చేశాను... ఆ తప్పు దిద్దుకునే మార్గం కోసం రోజూ వెదుకుతూనే ఉన్నాను.. ఇంటికి వెళ్లాలని ఉంది.. పూర్వపు జీవితం గడపాలని ఉంది.. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) లో భాగమైన ఓ జర్మన్ యువతి ఆవేదన ఇది. ఉగ్రవాదికి మూడో భార్యగా ఉంటూ 19 ఏళ్లకే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారినందుకు తీరని వేదన అనుభవిస్తున్న ఆమె.. విముక్తి లభిస్తే స్వదేశానికి వెళ్తానంటూ పశ్చాత్తాపపడుతోంది. ఇస్లాం స్వీకరించి.. సిరియాకు లియోనారా జర్మనీకి చెందిన యువతి. పదిహేనేళ్ల ప్రాయంలో ఇస్లాం మతం స్వీకరించింది. ఆ తర్వాత అప్పటికే ఇద్దరు భార్యలు కలిగి ఉన్న జర్మన్ జీహాదిస్టు మార్టిన్ లెమ్కే (28) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం అతడి కుటుంబంతో కలిసి సిరియాకు పారిపోయింది. అయితే... సిరియాను వశం చేసుకునేందుకు ఐఎస్ సాగిస్తున్న మారణకాండను కళ్లారా చూసేంతవరకు .. ఆ ఉగ్రమూక పట్ల ఆమెకు సానుభూతి వైఖరే ఉంది. కానీ ఎప్పుడైతే అంతర్యుద్ధంలో తన కుటుంబం భాగస్వామ్యమైందో అప్పుడే తాను ఎంత పెద్ద తప్పు చేశానన్న విషయం లియోనారాకు బోధపడింది.భర్త, ఇద్దరు సవతులతో కలిసి లియోనారా మొదట ఐఎస్ రాజధాని రాకాలో నివాసం ఉండేది. ఆ సమయంలో భర్త తనను కేవలం ఒక పనిమనిషిగానే చూసేవాడు. వంట చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, అందరికీ సపర్యలు చేయడం ఇదే ఆమె రోజు వారీ దినచర్య. అలా నాలుగేళ్లుగా గృహిణిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్న లియోనారా.. ఇద్దరు పిల్లలకు తల్లయింది. తన ఇంట్లో తానే ఓ పనిమనిషిలా కాలం వెళ్లదీసింది. వారానికో ఇంట్లో నివాసం బహిరంగ శిరచ్ఛేదనలు, అత్యాచారాలతో సిరియా ప్రజలకు భీతికొల్పుతున్న ఐఎస్ నుంచి రాకాను స్వాధీనం చేసుకునేందుకు.. స్థానిక కుర్దిష్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సిరియాలో ప్రజాస్వామ్య పాలనే లక్ష్యంగా... ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా రాకాను స్వాధీనం చేసుకుని సగం విజయం సాధించాయి. ఈ క్రమంలో వేలాది మంది ఐఎస్ సానుభూతిపరుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదే అదనుగా దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. మరోవైపు తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను ఈ క్యాంపు నుంచి తిరిగి స్వదేశానికి తీసుకువెళ్లాలంటూ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.ఈ క్రమంలో ఎస్డీఎఫ్ నుంచి తప్పించుకునేందుకు లియోనారా కుటుంబం వారానికో ఇంట్లో తలదాచుకునేది. అయితే ఆ సమయంలో ఐఎస్ వీరి గురించి పట్టించుకునేది కాదు. ఐఎస్ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత వారి కంటే కుర్దిష్దళాలే నయమని భావించి లియోనారా.. భర్త, ఇద్దరుపిల్లలు, భర్త రెండోభార్యతో కలిసి ఎస్డీఎఫ్ క్యాంపునకు బయల్దేరింది. ఇందులో భాగంగా వారు ఇరాక్ సరిహద్దులోని బాగోజ్ గ్రామానికి చేరుకున్నారు. అయితే తూర్పు సిరియాలో గస్తీ కాస్తున్న అమెరికా మద్దతు దేశాల బలగాలు లియోనారా భర్త మార్టిన్‌ను గత గురువారం అదుపులోకి తీసుకున్నాయి. నా భర్త ఉగ్రవాది కాదు ‘నా భర్త కంప్యూటర్లు రిపేర్ చేసేవాడు. అదే విధంగా కంప్యూటర్ విడిభాగాలు, ఫోన్లు ఐఎస్‌కు సరఫరా చేసేవాడని మాత్రమే నాకు తెలుసు. ‘రాకా’ను కోల్పోయిన ఐఎస్ మమ్మల్ని పూర్తిగా వదిలించుకోవాలని చూసింది. తినడానికి తిండి ఉండేది కాదు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే అలా చూస్తూ ఉండటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. టీనేజ్‌లో నేను చేసిన తప్పు నా పిల్లల పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయాను. ఇప్పుడు నా సొంత ఇంటికి వెళ్లాలని ఉంది’ అంటూ లియోనారా తన పరిస్థితి గురించి అంతర్జాతీయ మీడియా ముందు మొరపెట్టుకుంటోంది.అయితే లియోనారా భర్త ఐఎస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించేవాడని, వేలాదిమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి అతడే సూత్రధారి అని జర్మన్ మీడియా అంటోంది. ఏదేమైనప్పటికీ లియోనారా గనుక నిజంగా పశ్చాత్తాపడితే మాత్రం ఆమెను స్వదేశానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. – యాళ్ల సుష్మారెడ్డి, సాక్షి వెబ్‌డెస్క్ -
నా ప్రభువే కాపాడాడు
హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్ గొప్పదైవభక్తుడు. అనునిత్యం దైవధ్యానంలో నిమగ్నమై ఉంటూ, ప్రజలకు ధార్మికబోధ చేస్తూ ఉండేవారు. ఒకనాటి రాత్రి ఆయన యధాతథంగా దైవారాధనలో నిమగ్నమై ఉన్నారు. అంతలో ఒక మహోజ్వలమైన వెలుగు కనిపించింది . హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మ బయటికి వెళ్ళి చూశారు. ఆకాశం వైపునుండి ఒక సింహాసనం జాజ్వల్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ భూమ్మీదకు దూసుకువస్తోంది. అసలు అది ఏమిటో కూడా చూడలేనంత వెలుగు భూమండలంపై పరచుకుంటోంది. అంతలో ‘అబ్దుల్ ఖాదర్ జీలానీ..! మేము నీ దైవభక్తిని, నీ ఆరాధనను మెచ్చుకున్నాము. ఇకనుండి ఇతరులకు ధర్మబద్ధం కానివి నీకు ధర్మబద్ధం చేశాము. అంటే హరాం విషయాలను నీకు హలాల్ గా చేశాము.’ అన్న అదృశ్యవాణి వినిపించింది.అప్పుడు హజ్రత్ జీలానీ రహ్మ, ‘హరామ్ వస్తువులు హలాల్ చేయడం ఎవరికి సాధ్యం? ఇదేమైనా షైతాన్ పన్నాగం కాదుకదా..?’ అని ఆలోచిస్తూ..,’ ఇంతకూ నువ్వు ఎవరివి? దైవానివా. సృష్టికర్తవా..?’అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అటువైపునుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. నేను దేవుణ్ణి అని చెప్పేధైర్యం షైతాన్ కులేదు. వాడు నేనే దైవాన్ని అని చెప్పలేడు. మౌనమే సమాధానమైంది. వెంటనే ఆయన, ఇదంతా షైతాన్ కల్పించిన భ్రమ మాత్రమే.. అని పసిగట్టి,’శాపగ్రస్తుడా..దుర్మార్గుడా..దూరంగా పారిపో..’ అంటూ.. అల్లాహ్ శరణు వేడుకున్నారు.అప్పుడు షైతాన్ మరోపాచిక విసురుతూ..‘జీలానీ . నిన్ను నీ జ్ఞానం కాపాడింది.’ అని పలికాడు. ‘కాదు.. కాదు.. నా జ్ఞానం కాదు.. నాప్రభువు కాపాడాడు.’ అన్నారు హజ్రత్ జీలానీ రహ్మ వెంటనే.. ఈ విధంగా షైతాన్ చివరి అస్త్రం కూడా పనిచేయకుండా పోయింది.దీనివల్ల మనకు అర్ధమయ్యేదేమిటంటే, మనమేదో దైవభక్తులమని, దానధర్మాలు చేస్తుంటామని, ఇతరసత్కార్యాలెన్నో చేస్తూ ఉంటామని, విద్యావిజ్ఞానాలు ఉన్నాయని, అందరికంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎవ్వరూ భ్రమపడకూడదు. అంతా దైవానుగ్రహమని మాత్రమే భావించాలి తప్ప దైవభక్తిపరులమని ప్రత్యేకతలు ఆపాదించుకొని గర్వించకూడదు. మాసం మహాత్మ్యం పుణ్యఫలాలనిచ్చే పుష్యం: పుష్యమీ నక్షత్రం పౌర్ణమినాడు చంద్రునితో కూడి ఉన్న మాసం పుష్యమాసం. చాంద్రమాన ప్రకారం సంవత్సరంలో ఇది పదోమాసం. దేవతలతో పాటు, పితృదేవతలనీ ఆరాధించడం ఈ మాసం ప్రత్యేకం. పుష్యమి అనేది శనిగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి బుద్ధి కారకుడు కావడం వల్ల ఈ మాసం బృహస్పతికీ, శనికీ అత్యంత ప్రీతికరమైనది. శనికి ఇష్టమైన పదార్థం నువ్వులు, వాటి నుంచి వచ్చే నూనె. కాబట్టి ఈ మాసంలో నువ్వులు, నువ్వులనూనెతో ఆయనను అభిషేకించి, పూజించాలని, నువ్వులు దానం చేయాలని, బెల్లంతో కలిపిన నువ్వులు తినాలని శాస్త్రవచనం. అలాగే ఇది మంచు కప్పబడి ఉండే మాసం కాబట్టి పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. ఆ కొద్దిసేపైనా ఎండతీక్షణత ఉండదు. సూర్యరశ్మి శరీరానికి తగినంత అందదు. అందువల్ల తైలగ్రంథులు వాటి విధిని సక్రమంగా నిర్వహించలేక మందగిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారి, పగుళ్లు ఏర్పడతాయి. దీనికి నివారణ నువ్వులనూనె ఒంటికి పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేయడం. అలాగే సంక్రాంతి పిండి వంటలన్నిటిలో నువ్వులు, బెల్లం తప్పకుండా ఉంటాయి, ఉండాలి కూడా. ఇక ఈ మాసం శూన్యమాసం అని ఆందరూ ఆడిపోసుకుంటారు కానీ, అత్యుత్తమమైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదీ, రైతులు పండుగగా, పితృదేవతల పండగగా చెప్పుకునే సంక్రాంతి పండగ వచ్చేది కూడా ఈ మాసంలోనే కాబట్టి చిన్న చూపు తగదు. -
సత్సంకల్పంతోనే సాఫల్యం
కాలాన్ని సాక్షిగా పెట్టి అనేక యదార్ధాలు చెప్పాడు దైవం. ఒక్కసారి మనం వెనక్కితిరిగి చూస్తే కాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటినుండి గుణపాఠం నేర్చుకుంటారు. అలా కాకుండా గతకాలాన్ని గాలికొదిలేసి, కొత్తసంవత్సరంలో చైతన్యరహిత చర్యలతో, అర్ధం పర్థం లేని కార్యకలాపాలతో కొత్తకాలాన్ని ప్రారంభిస్తే ప్రయోజనం శూన్యం. కాలం ఎవరికోసమూ ఆగదు. రాజులు రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు అంతా కాలగర్భంలో కలిసిపోయినవారే, కలిసి పోవలసినవారే. కొత్తసంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. గతం నుండి గుణపాఠం గ్రహిస్తూ భవిష్యత్తు కాలానికి స్వాగతం పలకాలి. నిస్సందేహంగా కొత్తసంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కాని ఆ సంతోషంలో హద్దుల అతిక్రమణ జరగకుండా చూసుకోవాలి. నిషిద్ధకార్యాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించే చర్యలకు దూరంగా ఉండాలి.కాలం చెప్పే చారిత్రక వాస్తవాలనుండి గుణపాఠం గ్రహించకుండా లక్ష్యరహితంగా భవిష్యత్తును ప్రారంభిస్తే మిగిలేది నిరాశే. అందుకని గడచిన కాలంలో ఏం చేశామన్నది కొత్తసంవత్సర ప్రారంభాన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మంచిపనులు చేసి ఉంటే భవిష్యత్ కాలంలో వాటిని మరింతగా విస్తరిస్తామని, తప్పులు, పొరపాట్లు, పాపాలు జరిగి ఉంటే ఖచ్చితంగా వాటిని ఈ క్షణం నుండే విసర్జిస్తామని సంకల్పం చెప్పుకోవాలి.ఈ విధంగా అందరూ కాలం విలువను గుర్తించి, విశ్వాస బలిమితో సత్యంపై స్థిరంగా ఉంటూ, మంచి పనులు చేస్తూ, ప్రజలకు మంచిని, సత్యాన్ని, సహనాన్నిగురించి బోధిస్తూ, స్వయంగా ఆచరిస్తూ సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ గడచినకాలం నుండి గుణపాఠం గ్రహిస్తూ, భవిష్యకాలాన్ని దివ్యంగా మలచుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని,సమస్తమానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తంకావాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మానవ మనుగడ మొక్కలోనే
చెట్లు (అడవులు) అనంతమైన దైవకారుణ్యానికి, ఆయన మహత్తుకు తిరుగులేని నిదర్శనాలు. మన జీవితాలకు, అడవులకు అవినాభావ సంబంధం ఉంది. మానవ మనుగడ, సమస్త ప్రాణికోటి మనుగడ అడవుల సంరక్షణపైనే ఆధారపడి ఉంది. అడవుల్ని సంరక్షించుకోక పోతే ప్రకృతి అసమతౌల్యానికి గురవుతుంది. అల్లకల్లోలం ప్రారంభమవుతుంది. అతివృష్టి, అనావృష్టి సమస్యలు తలెత్తుతాయి.దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. భవిష్యత్తు అంధకారమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమాదఘంటిక ఇప్పటికే మోగింది. తక్షణంమేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ముహమ్మద్ ప్రవక్త వారు మొక్కల పెంపకం, అడవుల సంరక్షణ దిశగా ప్రజల్ని ఎంతగానో ప్రోత్సహించారు. చెట్లను నరకడం వల్ల జరిగే అనర్ధాలు, నష్టాలను గురించి ప్రజలను రకరకాలుగా హెచ్చరించారు. వాటిని సంరక్షించడంవల్ల ఒనగూడే ప్రయోజనాలను అత్యంత మనోహరంగా వివరించారు. చెట్టునాటడం అత్యుత్తమ దానం(సదఖా)అని ఆయన ప్రవచించారు. మొక్కలు నాటడం వల్ల మానవాళికి అనంతమైన లాభాలు, శుభశ్రేయాలు కలుగుతాయని చెప్పారు. ఆయన స్వయంగా మదీనా లోని హజ్రత్ సల్మాన్ ఫార్శీ (ర) గారి తోటలో మొక్కలు నాటి చెట్ల పెంపకం ప్రాధాన్యతను జనావళికి చాటి చెప్పారు. వృక్షాలు మానవులకు జననం నుంచి, మరణం వరకు తోడూనీడగా ఉంటాయని, వాటిని నాశనం చేయడమంటే, మానవుడు స్వయంగా చేజేతులా వినాశనం కొని తెచ్చుకోవడమేనని ప్రవక్తమహనీయులు బోధించారు. ఎవరైతే ఒక మొక్కను నాటి, అది పెరిగి పెద్దయ్యేవరకు దాన్ని సంరక్షిస్తారో, వారుచేసిన ఈ సత్కార్యానికి ప్రతిఫలంగా అల్లాహ్ స్వర్గంలో వారికోసం ఒక చెట్టును నాటుతాడని కూడా ఆయన సెలవిచ్చారు. స్వర్గంలో అందమైన వనాలు, మధురమైన పళ్ళు, ఫలాలు ఉంటాయన్న వర్ణనలు పవిత్రఖురాన్ లో అనేకంఉన్నాయి. కనుక మానవ మనుగడకు ఇతోథికంగా తోడ్పడుతున్న చెట్లను, వృ క్షసంపదను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా తాత్కాలిక ప్రయోజనాలకోసం వృక్షవిధ్వంసానికి పాల్పడుతూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే భవిష్యత్తు అంధకారమౌతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
పాలకులు ఎలా ఉండాలి?
హజ్రత్ ఉమర్ గొప్పనాయకుడు. బాధ్యతాయుతమైన పాలకుడు. అన్నిటికీ మించి దైవభక్తి పరాయణుడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఆయన స్వయంగా పర్యటించేవారు. అందులో భాగంగానే ఒకసారి మారువేషం ధరించి గస్తీకి బయలుదేరారు. కొన్ని ప్రాంతాలు పర్యటించిన తరువాత ఒక పూరిగుడిసె దగ్గర ఆగారు. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు నివాసం ఉంటోంది. మారువేషంలో ఉన్న హజ్రత్ ఉమర్ (ర)ఆమె దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారాలు విచారించారు. మీ పాలకుడు ఉమర్ పాలన ఎలా ఉందని ప్రశ్నించారు.దానికామె, ‘‘ఆ..ఏమి ఉమరో ఏమిటో నాయనా! దేవుడు ఆయనకు మేలుచేయడు.’ అన్నది.‘‘అయ్యయ్యో.. ఏంటి పెద్దమ్మా.. అంతమాట అనేశావు..అసలేం జరిగింది?’’ అని ఆరాతీశారు.‘‘ఏమీలేదు నాయనా.. నేనింత ముసలిదాన్నికదా...నన్నెప్పుడైనా పట్టించుకున్నాడా..?’’అని నిష్టురమాడింది.‘‘అమ్మా..! రాజు అంటే చాలా పనులుంటాయి కదమ్మా..! నువ్వెప్పుడైనా నీసమస్యను రాజుగారి దృష్టికి తీసుకెళ్ళావా?’ అన్నారు ఉమర్ .‘‘అదేంటి బాబూ అలా అంటావు? పాలకుడన్నవాడికి తన రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతోంది? ప్రజలు ఎలా ఉన్నారు. వారి కష్టసుఖాలేమిటి? అన్న విషయాలు తెలుసుకోవాలన్న బాధ్యత ఉండదా? పాలకుడంటే సేవకుడు కదా..? నేను వెళ్ళి దేహీ అని అడుక్కోవాలా? ప్రజల బాగోగులు చూడడం, వారి అవసరాలు తీర్చడం పాలకుడి బాధ్యత కాదా?’అని ప్రశ్నించింది.వృద్ధురాలి మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకున్న హజ్రత్ ఉమర్ కు దుఖంపొంగుకొచ్చింది. ‘ఈ వృద్ధురాలికున్నంత తెలివి కూడా నీకు లేదా ఉమర్! రేపు దైవానికి ఏం సమాధానం చెబుతావు?’ అంటూ తనను తాను ప్రశ్నించుకున్నారు ఉమర్ తరువాత ఆయన, ‘‘అయితే.. నీ విషయంలో ఉమర్ వల్ల జరిగిన నిర్లక్ష్యానికి ఎంతమూల్యం చెల్లించమంటావో చెప్పు. నేను ఆ మూల్యాన్ని నీకు చెల్లించి ఉమర్‌ను కాపాడాలనుకుంటున్నాను’’ అన్నారు.‘‘బాబూ.. ఈ ముసలిదాన్ని ఎందుకు ఆటపట్టిస్తావు? ఉమర్ నిర్లక్ష్యానికి నువ్వు మూల్యం చెల్లిస్తావా?.’అంటూ నవ్వింది వృద్ధురాలు. ‘‘లేదమ్మా.. నేను నిజమే చెబుతున్నాను’’ నమ్మబలికారు ఉమర్.‘‘సరే, అయితే.. ఇరవై ఐదు వరహాలు ఇవ్వు..’ అన్నది వృద్ధురాలు..అంతలో హజ్రత్ అలీ(ర), హజ్రత్ ఇబ్నెమస్ ఊద్ (ర)అటుగా వచ్చారు. వారు హజ్రత్ ఉమర్ గారిని చూస్తూనే, సలామాలేకుం ఉమర్ ఖలీఫా’’ ఈ మాట వింటూనే వృద్ధురాలికి ముచ్చెమటలు పట్టాయి. ఆమె ఆందోళనను గమనించిన హజ్రత్ ఉమర్ ‘‘అమ్మా.. ఆందోళన చెందకు.అల్లాహ్ కరుణించుగాక.. నువ్వు సత్యం మాట్లాడావు’’ అంటూ ఆప్యాయంగా అనునయించారు. ఒక సామ్రాజ్యానికి పాలకుడైనటువంటి హజ్రత్ ఉమర్(ర)ఎంత నిబద్దతతో, ఎంతబాధ్యతతో, ఎంత జవాబుదారీతనంతో ప్రజలతో వ్యవహరించారో చూడండి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
జకీర్‌ను అప్పగించం: మలేసియా
కౌలాలంపూర్: వివాదాస్పద ఇస్లాం ప్రబోధకుడు జకీర్ నాయక్(52)ను భారత్‌కు అప్పగించబోమని మలేసియా ప్రధానమంత్రి మహతీర్ బిన్ మొహమ్మద్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన ఓ మీడియా సమావేశంలో మహతీర్ మాట్లాడుతూ.. ‘జకీర్ మలేసియాలో శాశ్వత నివాసహోదా కలిగిఉన్నారు. జకీర్‌తో ఎలాంటి సమస్యలు రానంతవరకూ ఆయన్ను భారత్‌కు అప్పగించబోం’ అని స్పష్టం చేశారు. అక్రమ నగదు చెలామణితో పాటు విద్వేష ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌ను తమకు అప్పగించాలని గత జనవరిలో ప్రభుత్వం మలేసియాను కోరింది. 2016, జూలైలో భారత్ నుంచి వెళ్లిపోయిన జకీర్.. తనపై విచారణ నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం కలిగినప్పుడే దేశానికి తిరిగివస్తానని ఇంతకుముందు ప్రకటించారు. -
నిబద్దతకు ప్రతీక రమజాన్ మాసం: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖ: ఇస్లాం మతబోధనలు భూమి మీద శాంతిని స్థాపించగలవనే విశ్వాసం తనకుందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రమజాన్ మాసం అంటే భక్తిప్రపత్తులకు, నిబద్దతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇస్లాం పవిత్ర గ్రంధం ఖురాన్ పుట్టిన నెల రమజాన్ మాసం అని గుర్తుచేశారు. శాంతి సామరస్యాలు, సౌభ్రాతృత్వాలను పెంపొందించేదే మతం అని పేర్కొన్నారు. మతాలకు అతీతంగా ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర, దేశా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. -
ఇస్లాం మతంపై చైనా యుద్ధం
బీజింగ్, చైనా : కమ్యూనిస్టు రాజ్యమైన చైనాలో క్త్రైస్తవంతో పాటు పలు మతాలు ఉన్నాయి. అయితే, అక్కడ ఇస్లాం మతం పడుతున్న బాధలు మరే ఇతర మతం పడటం లేదనే మాట వాస్తవం. చైనాలో నివసిస్తున్న 20 లక్షల మంది ముస్లిం జనాభాలో దాదాపు 11 లక్షల మంది గ్జిన్‌జియాంగ్‌లో ఉంటున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని చైనా ప్రభుత్వం గ్జిన్జియాంగ్ యుగర్ అటానమస్ రీజియన్‌గా ప్రకటించింది. అక్కడ ‘అటానమస్’ అన్నపదం పేరుకే తప్ప అక్కడి ప్రజలకు నిజమైన స్వతంత్ర లేదు. వేలాది మంది ఉగర్ ముస్లింలను చైనా ప్రభుత్వం అనధికారికంగా బంధించింది. గ్జిన్‌జియాంగ్‌లా ఇతర ప్రాంతాల్లో ముస్లింల జనాభా పెరగకూడదనే ఉద్దేశంతో రంజాన్ మాసం ప్రారంభమైన తొలి వారంలో ఆంక్షలు విధించింది. మసీదులపై కచ్చితంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన చైనా ఇస్లామిక్ అసోసియేషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నింగ్సియా, బీజింగ్, గాన్సూ, క్వింఘై, గ్జిన్జియాంగ్ అనే ఐదు ప్రాంతాల్లోనే మత ప్రచారాలు నిర్వహించాలని పేర్కొంది. రంజాన్ నెల గత వారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇస్లాం మత వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా ఈ చర్యలకు ఉపక్రమించదనే వాదనలు వినిపిస్తున్నాయి. మసీదుపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా ముస్లింలు వంటి మతాల ప్రజల్లో దేశ భక్తి పెరుగుతుందని తన ప్రకటనలో ఇస్లామిక్ అసోసియేషన్ పేర్కొంది. -
బీజేపీ దెబ్బకు ఆమె పేరు మారింది
సాక్షి, చెన్నై : ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుష్బూ సుందర్ తన పేరును మార్చేసుకున్నారు. ఆమె అసలు పేరు కుష్బూ కాదన్న విషయం కొందరికి తెలిసే ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో ఆమె తన పేరును మార్చుకుని కుష్భుగా సినీ రంగంలోకి ప్రవేశించారు. అయితే ఆమె అసలు పేరు నఖట్ ఖాన్ అనే విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ రాజకీయం చేయటం ప్రారంభించింది. ‘కుష్భూ తన గుర్తింపును దాస్తున్నారు. ఆమె తన మతాన్ని కించపరుస్తూ.. బయటపెట్టడం లేదు. దీనిపై ఆమె వివరణ ఇవ్వాలి’ అంటూ సోషల్ మీడియాలో చిన్నపాటి ఉద్యమాన్నే నడిపింది. అయితే అనూహ్యంగా చాలా మంది ఆమెకే మద్ధతు పలికారు. అయినప్పటికీ కుష్భూ మాత్రం తన పేరును ట్వీటర్లో మార్చేశారు. ‘కుష్బూసుందర్... బీజేపీ కోసం నఖట్ఖాన్’ అంటూ పేరును ఉంచారు. ఇక ఈ అంశంపై ఆమె స్పందిస్తూ.. ‘సమస్యలను పరిష్కరించాల్సిన నేతలు.. తోటివారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నఖట్ నా తల్లిదండ్రులు పెట్టిన పేరు. మతంతో రాజకీయాలు చేయటం బీజేపీ వారికి అలవాటైన పనే. వారికి బుద్ధి చెప్పటానికే పేరు మార్చుకున్నా’ అని కుష్భూ తెలిపారు. -
పాప ప్రక్షాళనకు మేరాజ్ నమాజ్
ముస్లిమ్ సముదాయానికి ‘నమాజ్’ (దైవప్రార్థన) ప్రాణం లాంటిది. నమాజులేని జీవితం అవిశ్వాసానికి చిహ్నం. అల్లాహ్ పిలుపు మేరకు ముహమ్మద్ ప్రవక్త(స)సప్తాకాశాల పర్యటన జరిపారు. అల్లాహ్‌తో నేరుగా సంభాషించారు. ఈసంఘటననే ‘మేరాజ్ ’ అంటారు. అల్లాహ్‌తో నేరుగా సంభాషించే అపూర్వ అవకాశం, మహా అదృష్టం ముహమ్మద్ ప్రవక్తకు మాత్రమే దక్కింది. ఆ శుభదినమే ‘షబే మేరాజ్’. ఈ శుభసందర్భంలో అల్లాహ్ తన ప్రియ ప్రవక్తకు కొన్ని కానుకలు అనుగ్రహించాడు. వాటిలో ప్రధానమైనది నమాజ్. ప్రవక్త వారి ‘మేరాజ్’ పర్యటనలో అల్లాహ్ ఆయనకు 50 పూటల నమాజ్‌తో పాటు, ‘బఖర’ సూరాలోని చివరి రెండు ఆయతులు, పాపక్షమాపణకు సంబంధించిన శుభవార్తనూ అందజేశాడు. మహదానందంగా బహుమతులతో తిరిగొస్తున్నప్రవక్త(స) వారికి మూసా ప్రవక్త (అ) ఎదురై, ‘మీ అనుచరులు రోజుకు యాభైపూటల నమాజు నెరవేర్చలేరు. వెళ్ళి ఆ సంఖ్యను తగ్గించుకు రండి’ అని సలహా ఇచ్చారు. దీంతో ప్రవక్త మహనీయులు పలుమార్లు అల్లాహ్ వద్దకు వెళ్ళి ఐదుకు తగ్గించుకు వచ్చారు. అయినా మూసా(అ) ‘మీ అనుచరులు ఐదు పూటలుకూడా చెయ్యలేరు. ఇంకా తగ్గించుకు రండి’ అనిసూచించారు. కాని ప్రవక్తమహనీయులు, ‘మాటిమాటికీ దైవం దగ్గరికి వెళ్ళి అడగడానికి సిగ్గుగా ఉంది. ఇక నావల్ల కాదన్నారు. ఈ ఐదు నమాజులు నాకు సమ్మతమే. సంతోషమే’ అని స్పష్టంచేశారు. ఎవరైతే హృదయ పూర్వకంగా, చిత్తశుధ్ధితో రోజూ ఐదుపూటల నమాజ్ ఆచరిస్తారో వారికి 50 పూటల నమాజు ఆచరించినంత పుణ్యఫలం ప్రసాదించ బడుతుంది. కనుక నమాజు ప్రాముఖ్యతను గుర్తెరిగి, ఆయన స్మరణలో హృదయాలను, ఆత్మను జ్యోతిర్మయం చేసుకోడానికి ప్రయత్నించాలి. ఎవరైతే క్రమం తప్పకుండా నమాజు చేస్తారో ప్రళయదినాన వారికది ఒకజ్యోతిగా, నిదర్శనంగా ఉపకరిస్తుంది. తద్వారా ప్రళయం నాటి గాఢాంధకారంలో వారికి వెలుగు లభిస్తుంది. వారివిశ్వాసానికి, దైవం పట్ల వారి విధేయతకు అది తార్కాణంగా నిలుస్తుంది. ముక్తిని ప్రసాదించే సాధనమవుతుంది.ముహమ్మద్ ప్రవక్త (స) నమాజు ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక ఉపమానం చెప్పారు.‘మీ ఇంటిగుమ్మం ముందు ఒక కాలువ ప్రవహిస్తూ ఉండి, మీరందులో రోజూ ఐదుసార్లు స్నానం చేసినట్లయితే, ఒంటిపై ఏమైనా మురికిగాని, మాలిన్యం గాని ఉంటుందా? ఉండదు. ఐదుపూటల నమాజు విషయం కూడా ఇంతే. దైవం ఈప్రార్థనల ద్వారా పాపాలను కడిగి ప్రక్షాళన చేస్తాడు.’నమాజు(ప్రార్థన)ప్రాముఖ్యం, దాని వాస్తవికత తెలిసిన దైవ విశ్వాసులు ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు, వారి ఆత్మ దేవుని మహిమాన్విత సౌందర్య సాగరంలో మునిగి తేలుతుంది. అల్లాహ్ మహోజ్వలమైన సౌందర్యకాంతుల అలలు దైవవిశ్వాసుల మురికిని ప్రక్షాళన చేసి, పరిశుభ్రపరుస్తాయి. రోజూ ఐదుసార్లు ఇలాంటి చర్య జరిగితే ఇక ఆదాసుల బాహ్యంలోగాని, ఆంతర్యంలో గాని మలినమనేది మచ్చుకైనా ఉండదు.కాబట్టి ‘మేరాజ్’ కానుకగా అల్లాహ్ అనుగ్రహించిన ఈ వరాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఆయన ప్రసన్నత పొందడానికి శక్తివంచన లేని ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
సుప్రీం తీర్పు అనంతరం స్పందించిన హదియా
కేరళ: ఇస్లాం మతం స్వీకరించడం వల్లనే ఎన్నో అవమానాలను, సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చిందని 'లవ్ జీహాద్' తీర్పు అనంతరం హదియా తెలిపారు. వారి వివాహం చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం తొలిసారి భర్త షఫిన్ జహాన్‌తో కలిసి ఆమె కేరళ వెళ్లారు. హదియా కేసులో న్యాయపరంగా ఎంతో కీలక పాత్ర పోషించిన 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' నాయకులను మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. ఇస్లామిక్ సంస్థ ముఖ్య నేత సైనాబాను కోజికోడ్‌లో కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. హాదియా మత మార్పిడిలో సైనాబానే కీలక పాత్ర వహించింది. ఈ సందర్భంగా సైనాబా స్పందిస్తూ సుప్రీంకోర్టు హదియా, జహాన్‌ల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించడం తనకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు. తమ కూతుర్ని బలవంతంగా మత మార్పిడి చేసి, ఇస్లాం స్వీకరించేలా ప్రోత్సహించి వివాహం చేసుకున్నారని హదియా తండ్రి కేరళ హైకోర్టును ఆశ్రయించగా తొలుత ఈ కేసును విచారించిన హైకోర్టు వారి విహహాం చెల్లదని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ కోర్టును సుప్రీంకోర్టులో హదియా దంపతులు సవాల్ చేయగా రెండేళ్ల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. -
రష్యా చర్చిలో కాల్పులు
మాస్కో: రష్యాలోని దగెస్తాన్ ప్రాంతంలోని కిజ్లయార్ పట్టణంలో ఆదివారం ఓ చర్చిలో ఇస్లాం ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు మృతిచెందారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆ తరువాత పోలీసులు నిందితుడిని హతమార్చారు. ప్రార్థన చేస్తున్న క్రైస్తవులపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని, నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళ ఆసుపత్రిలో కన్ను మూసినట్లు అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ పేర్కొంది. దుండగుడి వయసు 20–30 ఏళ్ల మధ్య ఉంటుందని, అతడు స్థానికుడేనని ఇంటర్ఫాక్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ‘అల్లాహు అక్బర్’ అని నినదిస్తూ గడ్డంతో ఉన్న వ్యక్తి రైఫిల్, కత్తితో చర్చిలోకి చొచ్చుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫాదర్ పావెల్ చెప్పారు. చెచెన్యాకు సరిహద్దుగా ఉన్న దగెస్తాన్ రష్యాలోని కల్లోలిత ప్రాంతాల్లో ఒకటి. -
ఇస్లాంకు, ఉగ్రవాదానికి సంబంధం లేదు
సాక్షి హైదరాబాద్: ‘‘భారత్‌తో ఇరాన్‌కు శతాబ్దాలుగా సత్సంబం«ధాలున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలతో ఇరానీల సంబంధాలు ఇప్పటికీ కొసాగుతున్నాయి. ఇరానీలు ఇక్కడ శతాబ్దాలుగా ఉంటున్నారు. ఎంతో చారిత్రక ప్రాముఖ్యమున్న నగరం హైదరాబాద్. అందుకే నా భారత పర్యటనను ఇక్కడి నుంచే ప్రారంభించాను’’అని ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహనీ పేర్కొన్నారు. అనేకానేక మతాల, కులాలు, వర్గాలు వేల ఏళ్లుగా ప్రేమానురాగాలతో శాంతియుతంగా జీవిస్తున్న భారత్ ఓ మ్యూజియం వదంటిదని కితాబిచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతమే తన పర్యటన లక్ష్యమని చెప్పారు. గురువారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన షియా, సున్నీ ఉలేమాలు, విద్యావేత్తలు, మేధావులు, వర్సిటీల కులపతులు తదితరులతో సమావేశమయ్యారు. ఇస్లాం ముసుగులో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారికి ఇస్లాంతో ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ‘‘ఇస్లాం ఎన్నడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదు. ఇస్లాం అంటేనే శాంతి, సామరస్యం, సోదరభావం’’ అని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళం విప్పిన దేశాల్లో ఇరాన్ ఎన్నడూ ముందే ఉందన్నారు. పాశ్చాత్య దేశాలు కొత్త రూపాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని రౌహనీ ఆరోపించారు. ‘‘అందుకే ఇరాక్, సిరియా తదితర దేశాల్లో ముస్లిం సముదాయంపై దాడులు పెరిగాయి. ఇలాంటి నరమేధాన్ని ఇరాన్ ఖండిస్తుంది’’అన్నారు. పాశ్చాత్య దేశాలను దీటుగా ఎదిరించడానికి ఇస్లామిక్ దేశాలు ఒక్కటవాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా షియాలు, సున్నీలు ఐకమత్యంతో ఉండాలన్నారు. ముస్లిం సముదాయాన్ని ఏ లక్ష్యంతో సృష్టించాడో నేడు మనం మరిచిపోయామని అభిప్రాయపడ్డారు. సెల్ ఫోన్‌తో కుటుంబ వ్యవస్థ ఛిద్రమవుతోందని ఆవేదన వెలిబుచ్చారు. టెక్నాలజీని మంచి కోసం వాడాలన్నారు. కార్యక్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీస్, అధ్యక్షుని సలహాదారు ముహ్మద్ వాయిజ్, స్థానిక ఇరాన్ కాన్సులేట్ అధికారులు పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడికి ఘన స్వాగతం అంతకుముందు హసన్ రౌహనీకి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రి ఆర్పీ సింగ్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇస్లాం, షరియత్‌ల పరిరక్షణకు కృషిచేయండి
సాక్షి, హైదరాబాద్: ముస్లిం సమాజంలోని అన్నివర్గాలు ఇస్లాం, షరియత్‌ల పరిరక్షణ కోసం కలసికట్టుగా కృషిచేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా రాబే హసనీ నద్వీ పిలుపునిచ్చారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు మూడు రోజుల ప్లీనరీ సమావేశాలు శుక్రవారం కంచన్‌బాగ్‌లోని సాలారే మిల్లత్ ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ముస్లిం ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం బోర్డు అధ్యక్షుడు హసనీ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్లాంతోపాటు షరియత్ చట్టాలను మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముస్లింలపై, షరియత్‌పై దాడులను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింలలోని అన్ని వర్గాలు సంఘటితమై ఎదుర్కొనాల్సిందిగా పిలుపునిచ్చారు. బాబ్రీ మసీదు అంశం కేవలం భూ వివాదం కాదని, ఇస్లాం ధర్మానికి అత్యంత గౌరవమైన విషయమని పేర్కొన్నారు. కాగా, బాబ్రీ మసీదు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున అది ఏ తీర్పు ఇచ్చినా గౌరవిస్తామన్నారు. ప్రస్తుత స్థానంలోనే తిరిగి మసీదును నిర్మించాలని కోరారు. బాబ్రీ మసీదు విషయంలో ఎలాంటి రాజీ పడబోమన్నారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానాలు చేశారు. -
పాక్‌లో హిందూ బాలికపై దారుణం
కరాచీ : పాకిస్తాన్‌లోని హిందువులపై అకృత్యాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని థార్‌లో గ్రామంలో నివాసముంటున్న ఒక హిందూ బాలికను ముగ్గురు సాయుధులైన ముస్లింలు అపహరించారు. అనంతరం బలవంతపు మత మార్పిడి చేసి.. వివాహం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్‌లోని డాన్ పత్రిక ఈ వార్తను ప్రచురించింది. ఈ ఘటనపై బాలిక తండ్రి హీరో మేఘవార్.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాన్ తెలిపింది. రెండు రోజులు కిందట ముగ్గురు సాయుధలైన వ్యక్తులు తమ ఇంటిలోని ప్రవేశించి.. అందరినీ బంధించినట్లు మేఘవార్ చెప్పారు. అనంతరం మైనర్ కుమార్తె (14 సంవత్సరాలు)ను వారు ఎత్తుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై స్థానిక నేతలను, పోలీసులను సంప్రదించినా ఎవరినుంచి స్పందన రాలేదని ఆయన చెప్పారు. చివరగా నసీర్ లుంజో అంనే వ్యక్తి.. తమ కుమార్తెను బలవంతపు మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నట్లు తెలిసిందని అన్నారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో.. మేఘవార్ సింథ్ ఎస్ఎస్పీ అధికారిని కలిశారు. ఈ ఘటనపై వెంటనే ఆయన స్పందించి.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు.. బాలికను వెతికించే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా.. బాలిక మతమార్పిడికి సంబంధించిన సర్టిఫికెట్ ఒకటి పోలీసులకు అందిందని తెలిసింది. దీనిపై మేఘవార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పెళ్లిని వ్యతిరేకిస్తూ సింధ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సింధ్ హైకోర్టు జనవరి17న విచారించనుంది. -
నేను నా భర్తతోనే ఉంటా: హదియా
కొట్టాయం: కేరళలో ఇస్లాం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్ జహాన్‌ను పెళ్లాడిన అఖిల ఆశోకన్ అలియాస్ హదియా(25) తాను తన భర్తతోనే కలిసి ఉంటానని స్పష్టం చేశారు. ‘లవ్ జిహాద్’ కేసుగా పేరుగాంచిన ఈ వ్యవహారంలో నవంబర్ 27న ఆమె సుప్రీంకోర్టు ముందు హాజరుకానుంది. ‘నేను ముస్లింను. నన్ను ఇస్లాంలోకి మారాలని ఎవ్వరూ బలవంతపెట్టలేదు. నా భర్త జహాన్‌తోనే ఉండాలనుకుంటున్నాను’ అని కోచి విమానాశ్రయంలో అరుస్తూ విలేకరులతో చెప్పింది. వెంటనే హదియాను ఆమె తల్లిదండ్రులు, పోలీసులు బలవంతంగా విమానాశ్రయం లోపలికి తీసుకెళ్లిపోయారు. -
ఫిరౌన్ పీచమణిచిన మూసా ప్రవక్త
పూర్వం ఫిరౌన్ అని ఒక పరమ దుర్మార్గుడైన చక్రవర్తి ఉండేవాడు. ఒకసారి కొంతమంది ప్రఖ్యాత జ్యోతిష్కులు ఫిరౌన్ దగ్గరికొచ్చి, ఇశ్రాయేలు జాతిలో ఒక బాలుడు పుడతాడని, అతని ద్వారా మీ అధికారానికి, దైవత్వానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఇది వింటూనే ఆ దుర్మార్గుడు, పుట్టిన మగ శిశువునల్లా చంపేయమని ఆజ్ఞ జారీచేశాడు. దీంతో ఎంతోమంది తల్లులకు కడుపుకోత మిగిలింది. కాని దైవ సంకల్పం మరోవిధంగా ఉంది. ఫిరౌన్ పీచమణిచే మొనగాడు స్వయంగా అతడి ఇంట్లోనే పోషించబడాలని, సంరక్షింపబడాలని రాసిపెట్టాడు. దీనికనుగుణంగానే ఒక తల్లి నెల కూడా నిండని తన పసిగుడ్డును ఓ చెక్కపెట్టెలో పెట్టి నీల్ సముద్రంలో పడవేసింది. ఆ పెట్టె సముద్రంలో కొట్టుకుపోతుండగా, వ్యాహ్యాళికి వెళ్ళిన ఫిరౌన్ భార్య, ఆమె చెలికత్తెలు చూసి ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చారు. పెట్టె తెరిచి ముద్దులొలికే అందమైన బాబును చూసి వారు మురిసిపోయారు. కాని ఫిరౌన్ మాత్రం పిల్లవాణ్ణి చంపెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కాని భార్య రకరకాలుగా నచ్చజెప్పి, ఆ ప్రయత్నాన్ని విరమింపజేసింది. మూసా అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. తరువాత అల్లాహ్ మూసాకు జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించాడు. ప్రవక్తగా మారిన తరువాత, మూసా దైవం ప్రసాదించిన మహిమలతో ఫిరౌన్ దగ్గరికొచ్చి దైవ సందేశాన్ని వినిపించారు. కాని తానే దేవుణ్నని ప్రకటించుకున్న ఫిరౌన్ మూసాను, ఆయన సందేశాన్ని తిరస్కరించడమేగాక దేశం నలుమూలల నుండి గొప్ప గొప్ప మంత్రగాళ్ళను పిలిపించాడు. మంత్రవిద్యలో ఆరితేరిన ఆ నిష్ణాతులు తమ చేతుల్లోని కర్రలను, తాళ్ళను నేలపై విసిరారు. అవి పాములుగా మారిపోయాయి. సమాధానంగా మూసా ప్రవక్త తన చేతి కర్రను నేలపై వేశారు. అది అనకొండ రూపాన్ని సంతరించుకొని వాటన్నిటినీ మింగేసింది. ఇది చూసిన మంత్రగాళ్ళు, ఇది దేవుని మహిమేనని ప్రకటిస్తూ మూసా సందేశాన్ని, వారి దైవాన్ని విశ్వసిస్తూ సజ్దాలో పడిపొయ్యారు. తరువాత మూసా దైవాదేశం మేరకు ప్రజలను వెంటబెట్టుకొని అక్కణ్ణించి బయలుదేరారు. ఫిరౌన్ కూడా సైన్యాన్ని తీసికొని సముద్రతీరానికి చేరుకున్నాడు. అప్పుడు మూసా తన చేతికర్రతో నీళ్ళపై కొట్టారు. దాంతో సముద్రం రెండుపాయలుగా చీలి. ఫిరౌన్ సైన్యం అంతా సముద్రంలో మునిగిపోయింది. తరాలుగా దౌర్జన్యాలు, బానిసత్వంలో మగ్గుతున్న ఇజ్రాయేలీయులకు విముక్తి లభించింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
‘2027 కల్లా ముస్లిం రాజ్యంగా భారత్’
మీరట్ : 2027 కల్లా భారత్‌ను ఇస్లాం రాజ్యంగా మార్చాలని ముస్లింలు యోచిస్తున్నారని హిందూ యువవాహిని ఆరోపణలతో దుమారం చెలరేగింది. ఇందుకోసం కావాలనే భారత్‌లోని ముస్లింలు సంతానాన్ని పెంచుకుంటూపోతున్నారని అంది. ఎక్కువ మంది పిల్లల్ని కంటున్న ముస్లిం వారిని భరిస్తుంది భారత్‌ను అక్రమించుకునేందుకని ఆరోపించింది. ముస్లింలు పిల్లల్ని కనడం తగ్గించకపోతే 2027 కల్లా భారత్ ఇస్లాం రాజ్యంగా మారడం ఖాయమని హిందూ యువవాహిని పశ్చిమ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు నాగేంద్ర ప్రతాప్ తోమర్ వ్యాఖ్యనించారు. ముస్లిం కమ్యూనిటీ ఈ కుట్రకు ప్రధాన సూత్రధారని కూడా ఆరోపించారు. అఖండ భారతావనిని ముస్లింలు తమ పిడికిట పట్టాలని భావిస్తున్నారని అన్నారు. హిందూ యువవాహిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2002లో స్థాపించారు. -
మక్కా ప్రధాన ఇమామ్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్(పాకిస్తాన్): ప్రపంచానికే ప్రమాదకారులుగా మారిన ఇస్లామిక్ స్టేట్, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలపై మక్కా ప్రధాన ఇమామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం శాంతిని ప్రభోధిస్తుందని..అటువంటి ఇస్లాంకు అల్‌ఖైదా, ఐఎస్ వంటి సంస్థలతో ఎటువంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మక్కా ప్రధాన మసీదులో ముఖ్య ప్రార్థనలను చేయించే షేక్ సలేహ్ బిన్ అబ్దుల్లా బిన్ హుమాయిద్ ఓ ప్రైవేట్ న్యూస్‌ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలిపారు. హింసావాదం అనేది పెనుశాపం వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. విభేదాలను పరస్పర అవగాహన కల్మా-ఇ-హఖ్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. జిహాద్(పవిత్ర యుద్ధం)కు జవాబుదారీగా ప్రభుత్వాలే ఉంటాయని, ఒక గ్రూప్ లేదా వ్యక్తి ఉండజాలవన్నారు. పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రకారం.. ఎలాంటి కారణం లేకుండా ఒక వ్యక్తిని చంపటం ఏకంగా మానవత్వాన్ని చంపినట్లేనని చెప్పారు. అసహనం, పరస్పర విభేదాల కారణంగానే ముస్లిం దేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. -
వివేకవంతమైన మాట... వెయ్యి వరహాల మూట
పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు ఆయన వేటకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక ముసలిరైతు తన చేలో మొక్కలు నాటుతున్నాడు. అది చూసి, వెంట ఉన్న భటులతో, ‘చూశారా ఈ వృద్ధుడు ఈ వయసులో కూడా ఎలా కష్టపడుతున్నాడో! ఆ మొక్కలు పెరిగేదెప్పుడు, కాసేదెప్పుడు, కాటికి కాళ్ళుజాపిన ఈ ముసలాడు తినేదెప్పుడు?’ అన్నాడు. ‘అవును మహారాజా తమరు చెప్పింది నిజం’ అన్నారు సేవకులు. ‘సరే ఆ వృద్ధుణ్ణి నాదగ్గరకు తీసుకురండి. అనవసరపు శ్రమ ఎందుకని నచ్చజెపుతా.’ అన్నాడు. వెంటనే ఆ వృద్ధరెతును ప్రవేశపెట్టారు భటలు. రాజు ఆ రైతునుద్దేశించి, ‘నీవయసెంత?’ అని ప్రశ్నించాడు. ‘ 86 సంవత్సరాలు’ సమాధానం చెప్పాడు వృద్ధుడు. ‘ఇంకెన్నాళ్ళు బతుకుతావో ఏమైనా అంచనా ఉందా?’ మళ్ళీ ప్రశ్నించాడు రాజు. ’లేదయ్యా. నేనే కాదు, ఎవరూ చెప్పలేరయ్యా. మహా అయితే ఇంకో రెండు మూడేళ్ళు బతుకుతానేమో’. అన్నాడు. ‘మరిప్పుడు నువ్వు నాటుతున్న మొక్కలు ఎన్నాళ్ళకు కాపుకొస్తాయి?’ ‘ఒక పదేళ్ళకు కాస్తాయనుకుంటా.’ ‘మరి వీటివల్ల నీకు లాభమేమిటి?’ అన్నాడు రాజు. ‘రాజా! అల్లాహ్ ఎవరి శ్రమనూ వృథాగా పోనివ్వడు. నా పూర్వీకులు నాటిన మొక్కల ఫలసాయాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఈ రోజు నేను నాటిన మొక్కల ఫలసాయం రేపు నా సంతానం అనుభవిస్తుంది. వివేకవంతులైన ప్రజలు ఇలాగే చేస్తారు.’ ‘ఓహ్! చాలా బాగా చెప్పావు. నీమాట నాకు నచ్చింది’ అన్నాడు మహారాజు. ముందుగా చెప్పిన ప్రకారం సేవకులు ఆ వృద్ధుడికి వెయ్యి నాణేల సంచి బహుమానంగా అందజేశారు. అందుకున్న వృద్ధుడు, ‘మహారాజా! నేను నాటిన ఈ మొక్కలు ఇంకా పదేళ్ళకు గాని ఫలాలనిస్తాయి. కాని వాటి ప్రతిఫలం ఇప్పుడే నా చేతికందింది.’ అన్నాడు. ‘ఎంతబాగా చెప్పావు. ఈ మాట నాకు బాగా నచ్చింది.’ అన్నాడు రాజు. వెంటనే మరో వెయ్యి నాణేల సంచి బహుమతిగా అందజేశారు. రెండవసారి మరోబహుమతి పొందిన వృద్ధుడు, ‘మహారాజా, మొక్కలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కాపునిస్తాయి. కాని నాకిప్పుడు వాటి రెండవ పంట కూడా చేతికందింది.’ అన్నాడు మహదానందంతో..‘ఎంత బాగా చెప్పావు. నాకు ఈ మాట కూడా నచ్చింది.’ అన్నాడు మహారాజు రైతును మెచ్చుకుంటూ.. దీంతో సేవకులు అతనికి మరోకానుకను బహూకరించారు. మూడవ బహుమతినీ అందుకున్న రైతు, ‘నా స్వహస్తాలతో నాటిన ఈ మొక్కలు పంటకొచ్చినప్పుడు వాటిని కోసి, సంతకు తీసుకెళ్ళి అమ్మాల్సి ఉంటుంది. కాని నాకైతే ఇప్పుడు ఎలాంటి శ్రమా లేకుండా, కూర్చున్న చోటే డబ్బులు కురుస్తున్నాయి.’ అన్నాడు.ఈ మాట రాజుగారికి ఎంతగానో నచ్చి, ‘భళా భళా’ అని గొప్పగా ప్రశంసించాడు. ఈసారి భటులు రైతుకు రెండువేల సంచిని బహూకరించారు!!ఒక వివేకవంతమైన మాట, సందర్భోచితమైన సమాధానం ఎంతటి ప్రభావాన్ని చూపిందో చూశారా..! దైవ విశ్వాసి అయిన రాజే ఇంతటి సేవాతత్పరుడైతే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన అల్లాహ్ ఎంతటి కరుణామయుడో ఒక్కసారి ఊహించండి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అంతా మన మంచికే...
ఇస్లాం వెలుగు ఒక్కోసారి అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అంతా దైవ నిర్ణయం. కాని అందులో శుభం ఉంటుంది. మంచైనా, చెడైనా దైవ నిర్ణయమని తలచడం విశ్వాసుల లక్షణం. పూర్వం యుద్ధరంగంలో ఒక రాజుకు చేతివేలు తెగిపోయింది. ఈ విషయం తెలిసి అందరూ వచ్చి పరామర్శించి వెళుతున్నారు. మంత్రి కూడా వచ్చి రాజుగార్ని పరామర్శించాడు. ‘మాషా అల్లాహ్... దేవుడు తాను తలచింది చేస్తాడు. అందులో శుభం ఉంటుంది. ఏది ఏమైనా అంతా మనమంచికే.’ అని ఊరడించాడు. కానీ రాజుకు తీవ్రమైన కోపం వచ్చింది. వెంటనే మంత్రిని కొలువునుండి తొలగించమని ఆదేశించాడు. మంత్రి ‘మాషా అల్లాహ్... దైవం తాను తలిచింది చేస్తాడు. అందులోనే శుభం ఉంది.’ అంటూ ఇంటిముఖం పట్టాడు. ఇంతలో రాజ్యం నుండి కూడా బహిష్కరించమని మరోఆజ్ఞ జారీ అయింది. దీంతో మంత్రి రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడూ రాజు తన చేతిని చూసుకొని బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి వేటకు బయలుదేరాడు. అడవిలో ఓ అందమైన లేడి కనిపించింది. దాన్ని పట్టుకోవాలని అశ్వాన్ని దౌడు తీయించాడు. ప్రాణభయంతో లేడి అడ్డదిడ్డంగా పరుగులు పెట్టసాగింది. రాజుకూడా అశ్వాన్ని దౌడుతీయిస్తున్నాడు. ఈ క్రమంలో వెంట ఉన్న రక్షణ దళం బాగా వెనుకబడి, రాజును సమీపించలేకపోయింది. కీకాకారణ్యంలో లేడి అదృశ్యమైపోయింది. బాగా అలసిపోయిన రాజు ఓ చెట్టుకింద మేనువాల్చాడు. నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చేసరికి అక్కడి పరిస్థితి అంతా చిత్రవిచిత్రంగా ఉంది. దేవతకు నరబలి ఏర్పాట్లు జరుగుతున్నాయక్కడ. అడవి మనుషులు పసుపు కుంకుమలు చల్లి, రకరకాల అలంకారాలతో రాజును బలిపీఠం ఎక్కించారు. తల తెగనరికేముందు నఖ శిఖ పర్యంతం పరిశీలించిన పూజారి అతణ్ణి బలివ్వడానికి తిరస్కరించాడు. ఏ లోపమూలేని బలినే దేవత స్వీకరిస్తుందని చెప్పడంతో వారు రాజును విడిచి పెట్టారు. రాజు రాజధానికి చేరుకున్నాడు. ’మాషా అల్లాహ్’ మర్మం తెలిసొచ్చిన రాజు వెంటనే మంత్రి ఎక్కడున్నా వెతికి సగౌరవంగా తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. మంత్రి రాగానే నమస్కరించి, గుండెలకు హత్తుకుని, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ‘నా వేలు తెగినప్పుడు, నన్ను సహనం వహించమని, దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడని చెప్పారు. మీమాట నిజమైంది. కాని, నేను మిమ్మల్ని పదవిలోంచి తీసేసి దేశబహిష్కారం చేసినప్పుడు కూడా మీరు అదేమాట అన్నారు. కారణం ఏమిటి?’ అని ప్రశ్నించాడు. ‘‘రాజా! మీరు నన్ను పదవిలోంచి తొలగించకుండా, రాజ్యబహిష్కారం చేయకుండా ఉండి ఉంటే, నేను కూడా మీతోపాటు వచ్చి ఉండేవాడిని. మీ వెన్నంటే ఉండేవాడిని. వేలు తెగిన లోపం వల్ల మీకు విముక్తి లభించినా, ఏలోపమూ లేని నన్ను బలిపీఠం ఎక్కించి తెగనరికేవారు. ఆరోజు నన్ను పదవినుండి తొలగించడం వల్లనేకదా బతికి పోయాను. దేవుడుఏది చేసినా మనమంచికే చేస్తాడు. మాషా అల్లాహ్! అంటూ నవ్వాడు మంత్రి. ఈసారి ప్రేమగా కౌగిలించుకున్నాడు రాజు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మంచికి ఆశీర్వచనం ఉంటుంది!
నేను నా దైవం గొప్పగుణాల వల్ల దేవుణ్ణి మనం కొలుస్తాం. గొప్ప స్నేహితుడిగా దేవుణ్ణి తలుస్తాం. కష్టం వచ్చినా.. సంతోషం వచ్చినా దేవాలయానికి చేరుతాం. ఆ దైవత్వం మనిషిలోనే ఉంటే..! మంచితనం సహాయగుణం మనిషే అయితే ..!! అప్పుడు మనిషే మసీద్ అయిపోతాడు. అలాంటి మంచితనానికి ఆశీర్వచనం ఉంటుంది. ఎస్.ఎం. మలిక్‌కు ధార్మిక సమాజంలో మంచి పేరు ఉంది. ఇస్లాం ధార్మిక కార్యకర్తగా, ఇస్లాం ధార్మిక పత్రిక ‘గీటురాయి’కి ముప్పై ఏళ్లుగా సంపాదకునిగా, వీటికంటే విశిష్టంగా ఖురాన్ తెలుగు అనువాదకునిగా సమాజంలో ఆయన గౌరవం, గుర్తింపు పొందారు. జమాతే ఇస్లామీ హింద్ సంస్థతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. దైవాన్ని కనుగొనడంలో, ఆరాధన ద్వారా దైవానికి చేరువ కావడంలో మలిక్ స్వీయ అనుభవాలు ఎలా ఉన్నాయి, ఇస్లాం ఒక మతంగా జీవన ధర్మంగా ఎటువంటి దైవమార్గాన్ని బోధిస్తుంది, తదితర సందేహాలకు ఏడు పదుల వయసు దాటిన మాలిక్ కూలంకషంగా జవాబులు చెప్పారు. మీ జీవితంలో ఇదంతా దైవికం అనుకున్న సందర్భం? మాది కర్నూలు జిల్లా. నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు. పది వరకు ఉర్దూ, తెలుగు, సంస్కృతం చదువుకున్నాను. కాలేజీ మెట్లు ఎక్కలేదు. పుస్తకాలు ముఖ్యంగా తెలుగుసాహిత్యం బాగా చదివాను. సింగరేణి కాలరీస్‌లో ఎలక్ట్రికల్ విభాగంలో డెయిలీ మజ్దూర్‌గా పనిచేశాను. తర్వాత సదరన్ రైల్వేలో పదేళ్లు డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేశాను. ఆ తర్వాత ధార్మిక సేవ చేయాలనిపంచింది. జాబ్‌కు రిజైన్ చేసి ఇస్లాం అంశాల తెలుగు అనువాదకుడిగా ఉన్నాను. ఇదే నాకు పోషణ అయ్యింది. నేను ఉర్దూ మీడియంలో కాకుండా తెలుగు మీడియంలో చదువుకోవడానికి ఇదే కారణం అయ్యుంటుందని ఆ తర్వాత నాకు అనిపించింది. ఆ తర్వాత గీటురాయి పత్రికను ఆరంభించాను. ఇదంతా దైవికంగా జరిగినదే. దైవాన్ని తెలుసుకోవాలంటే మతం తప్పనిసరా? మనిషి సమాజంతో ఎలా నడుచుకోవాలో చెప్పేదే మతం. ప్రపంచంలో ఎలా జీవించాలో, కుటుంబంతో ఎలా ఉండాలో, భాగస్వామితో, పిల్లలతో ఎలా మెలగాలో ఇవన్నీ మతం చెప్పాలి. అలాగే రాజకీయ, ఆర్థిక వ్యవస్థల పనితీరు గురించి కూడా తెలియజెప్పాలి. ఇవేవీ చెప్పని మతం మూఢమైనదని, మత్తుమందు వంటిదని మార్క్స్ వంటి వారు అన్నారు. ఇది నిజం. ఇవేమీ తన ప్రవక్తల ద్వారా సంకేతాల ద్వారా సందేశం ఇవ్వని దైవం ఇక మనకేం ఇస్తాడు. ఇస్లాంలో చూసినట్లయితే మనిషి సమాజంతో ఎలా నడుచుకోవాలో చెప్పేవన్నీ ఖురాన్లో ఉన్నాయి. ఖురాన్లో ఉన్న ప్రకారం మనిషి నడుచుకుంటే చాలు దైవం దృష్టిలో గొప్ప గుణశీలుడే. మనిషికి నిత్య జీవితంలో ఏమేం అవసరమో అవన్నీ చెప్పే దైవాన్ని నేను కొలుస్తాను. అలాంటి దైవం పట్ల ఆరాధన భావం లేకుండా చేసే పూజ పనికిరాదు. అలాంటి బోధనలు ఇవ్వని దైవమూ పనికిరాదు. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? ఈ భూమ్మీద ఇంత జంతుజాలం ఉంది. అది ప్రకృతికి ఏదో విధంగా ఉపయోగపడుతుంది. మనిషి మాత్రం అలా ఉపయోగపడడు. మరి మనిషి దేనికి ఉపయోగపడతాడు? దైవాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాడు. అందుకే సృష్టించబడ్డాడు. ఈ సృష్టిలో మానవుని సృజన దైవం కోసమే! దైవంలో ఏమున్నాయో అవన్నీ మనిషిలో ఉన్నాయి. ఇక్కడ మినియేచర్ గాడ్ మనిషి. అందుకే అతను కోరుకున్నవి తప్పక అవుతాయి. అయితే దైవంలో ఉన్న శక్తి అనంతం. మనిషిలో అవి పరిమితం. మనిషి తన శక్తులను సద్వియోగం చేస్తున్నాడా? దుర్వినియోగం చేస్తున్నాడా అనేది తెలుసుకోవడానికే మతం. దైవం గురించి తెలుసుకోవడానికి సమయం, సందర్భం రావాలంటారా? దైవం తన గురించి తెలుసుకోవడానికి మనకు ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు. వాటిని మనం అందిపుచ్చుకోవాలి. ఇందుకు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెబుతాను. మద్రాస్‌లో ఉద్యోగం చేసుకుంటున్న రోజులు. అప్పుడు నా వయసు 21. ఓ రోజు మా నాన్న ఉత్తరం రాశాడు... నువ్వేం చేయకపోయినా ఫజర్ నమాజ్ (సూర్యోదయానికి ముందు చేసే నమాజ్) మాత్రం తప్పక చేయమని అందులో ఉంది. మా నాన్న చెప్పినట్టు చేయాలని సంకల్పించుకున్నాను. అప్పుడు లాడ్జ్‌లో ఉండేవాడిని. లాడ్జి మేనేజర్ని కలిసి, ఉదయాన్నే నమాజ్‌కి వెళ్లాలి, గేటు తీస్తారా.. అని అడిగాను. వాళ్లు కుదరదన్నారు. అప్పుడు నా నెల జీతం 110 రూపాయలు. లాడ్జ్‌కి 10 రూపాయలు చెల్లిస్తున్నాను. 20 రూపాయలు అయినా సరే, అలాంటి రూమ్ కావాలని వెతికాను. కానీ, ఎక్కడా దొరకలేదు. ఎవరో దారిలో కలిసి ఆఫీసుకు దగ్గరలోనే మసీదు ఉంది అక్కడ రూమ్‌లు ఉన్నాయి అన్నారు. అక్కడకెళ్లి ఎవర్ని సంప్రదించాలో తెలియక నమాజు చేసుకోవడానికి కాళ్లూ చేతులు కడుక్కుం టున్నాను. ఇమామ్ పిలిచి ‘వేళకాని వేళలో నమాజ్ చేసుకోవడానికి వచ్చావేంటి?’ అని అడిగాడు. చెప్పాను. ‘‘మా నాన్న నమాజ్ చేయమన్నాడు అందుకు రూమ్ కోసం వెతుకుతున్నాను’’ అన్నాను. అప్పుడు అతను అన్నాడు.. నాన్న చెప్పాడనో.. అన్న చేయమన్నాడనో ... ఇంకెవరో ఆర్డర్ వేశారనో కాదు.. నీకు దైవాన్ని తలవాలనిపిస్తేనే చెయ్యి అన్నాడు. రూమ్ ఇప్పిస్తే చేసుకుంటాను అన్నాను. రూమ్ ఇచ్చాడు. నాకు చాలా నిశ్చింత అనిపించింది. అయితే, తెల్లవారు ఝామున జరిగే ఫజర్ నమాజ్‌కి ఎవరూ నన్ను నిద్ర లేపలేదు. వరుసగా నాలుగురోజులు చూశాను. నాకు దుఃఖం వస్తోంది. ఇమామ్‌ను కలిసి కంప్లైంట్ చేశాను, ఎవరూ నన్ను నిద్రలేపడం లేదని. నీకు నమాజ్ చేయాలనిపిస్తే నువ్వే లేస్తావు ఎవరో వచ్చి ఎందుకు లేపుతారు అన్నాడు. ఆ రోజు నమాజ్‌లో నాకు విపరీతమైన ఏడుపు వచ్చింది. ఏడుస్తూనే ప్రార్థన చేశాను. ‘అల్లా నేను సిన్సియర్‌గా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు’ అని కోరుకున్నాను. ఆశ్చర్యం... ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరూ నన్ను నిద్ర లేపలేదు. కానీ, ఫజర్ నమాజ్ టైమ్కన్నా ముందే మెలకువ వచ్చేస్తుంది. స్వామిని కోరితే ఇవ్వలేనిదేముంది? మనం కోరుకున్నవన్నీ ఇలా విని, అలా ఇచ్చేస్తాడా దేవుడు? ఖురాన్లో ఒక చోట– ‘ప్రవక్తా.. మానవులు అడిగినప్పుడు ఇలా చెప్పు. నా దాసుల హృదయం కన్నా అత్యంత చేరువలో నేను ఉన్నాను అని చెప్పు. వారు నన్ను ఆర్తిగా పిలిచినప్పుడల్లా నేను వారికి బదులిస్తాను అని చెప్పు’ అని ఉంది. ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఈ భూమ్మీద మనగలుగుతున్నాం. మనకు మేలైనది ఏదో అది కోరుకుంటే దానిని ఆయనే పూర్తి చేస్తాడు. ఎదుటివాడికి చెడు చేయాలనే తలంపు ఉంటే మాత్రం దానికి ఆయన అనుగ్రహం ఉండదు. నా విషయమే ఒకటి చెబుతాను. ఇరవై ఏళ్ల క్రితం గుండెకు మూడు స్టంట్లు వేశారు. అప్పటికి నేను మొదలెట్టిన ఖురాన్ అనువాదం పూర్తి కాలేదు. అందుకని ఆ సమయంలో ఆసుపత్రి నుంచే అల్లాను ప్రార్థించాను. ‘అల్లా... దివ్య ఖురాన్ తెలుగు అనువాదం, వ్యాఖ్యానం పూర్తిచేసే బాధ్యతలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసే శక్తి, వ్యవధి ఇవ్వు’ అని కోరుకున్నాను. ఆ దైవం నాకు ఆ సమయం ఇచ్చాడు. ఇప్పుడు అనువాదం ప్రింటింగ్ దశలో ఉంది. నా జీవితాన్ని పొడిగించే శక్తిని ఆ అల్లానే ఇచ్చాడు. దైవం నుంచి సరే... మరి ప్రజలు పాలకుల నుంచి ఏం కోరుకోవాలి? ప్రజలు ఫలానా వారు మాకు నాయకుడు కావాలని బలంగా కోరుకోవాలి. ఎవరైతే ప్రజలకు సేవ చేస్తాడో అతనే నాయకుడవుతాడు. అంతేకానీ పెత్తనం చెలాయించేవాడు నాయకుడు కాదు. ‘సాటి మనిషి కష్టాన్ని అంత త్వరగా గుర్తించి, చేయూతనివ్వు. అప్పుడే నువ్వు మనిషిగా ఎదుగుతావు’ అంటారు ప్రవక్త. పాలకుడు అలా ఉండాలి. కులం, మతం, ప్రాంతం, భాష, రంగులు.. వీటితో దైవానికి సంబంధం లేదు. అలాగే పాలకుడికీ సంబంధం ఉండకూడదు. దైవం దృష్టిలో ఏ మనిషి ధర్మబద్ధంగా నడుచుకుంటాడో. అతనే గొప్ప గుణశీలుడు. ఆత్మను ఎలా శుద్ధి చేసుకోవాలి? మనం చాలా బలహీనులం. ఎన్నో బలహీనతలు ఉంటాయి. అందుకే, ఎన్నో తప్పులు చేస్తాం. నేనూ చేశాను. వాటివల్ల వచ్చే కష్టాలు ఏవైనా అవి శిక్షగా కాదు. పరీక్షగా వస్తాయి. శిక్షలు ఏమైనా పరలోకంలో ఉంటాయి. మనం చేయాల్సింది తప్పు చేశానని దైవం ముందు ఒప్పుకోగలగాలి. ‘దైవమా నేను చాలా బలహీనుడిని, అనుగ్రహించు’ అని కోరుకోవాలి. నేను బాధతో ఎప్పుడు ఏడ్చినా దైవం సమక్షంలోనే ఏడ్చాను. ఎవరి ముందూ కన్నీరు పెట్టుకోలేదు. పశ్చాత్తాపంతో రాల్చే ఒక్క కన్నీటి బిందువు మన ఆత్మను పరిశుద్ధం చేస్తుంది. అలా రాల్చే కన్నీటిబొట్టు నేల రాలకముందే దైవకటాక్షం లభిస్తుంది. ఆత్మపరిశుద్ధత బయట ఎక్కడో వెతకనక్కర్లేదు. మనలోనే ఉంది. ఎవరికి వారే తమ ఆత్మను పరిశుద్ధ పరుచుకోవాలే తప్ప మరొకరి వల్ల కాదు. దైవం స్త్రీయా, పురుషుడా? దైవానికి రూపం లేదు. లింగం లేదు. దైవం మహాశక్తి. అయితే, ప్రాచీన కాలం నుంచి ఏ సామ్రాజ్యంలో చూసినా, ఏ భాషలో అయినా దేవుడు పుంలింగంగానే పరిగణించబడుతున్నాడు. మానవ స్త్రీ, పురుషుల్లో లైంగిక పరమైన విభేదాలు ఉన్నాయి. మానసిక, శారీరక రూపాల్లో విభేదాలు ఉన్నాయి. అయితే, దైవం దృష్టిలో ఇద్దరూ సమానమే! ఖురాన్లో పురుషునికి ఉన్నట్టే స్త్రీకీ సమాన హక్కులు ఉన్నాయి. బాధ్యతలు మాత్రమే వేరు. ఆర్థికరంగంలో బాధ్యత పురుషుడిది. కుటుంబపోషణకు ఖర్చుపెట్టే బాధ్యత స్త్రీది. అయితే, ప్రాక్టికల్‌గా వచ్చేసరికి కొన్ని తారతమ్యాలు వచ్చేశాయి. వాటిని సరిదిద్దుకోవాలి. సమాజ శ్రేయస్సు కోసం దైవాన్ని ఏమని కోరుకోవాలి? మన కోసం మనం ఎంత చేసుకున్నా కలగని తృప్తి ఎదుటివాడికి సాయపడటంలో కలుగుతుంది. జమాతే ఇస్లామ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి సమాజసేవలో పాల్గొంటున్నాను. ఈ సంస్థ మెటర్నిటీ ఆసుపత్రిని నిర్వహిస్తుంది. దాదాపు 50 శాతం మంది ముస్లిం స్త్రీలు ఈ ఆసుపత్రిలో పురుడు పోసుకుంటారు. సేవలో స్వార్థచింతన కూడదు. మేము అనే భావన పోయి, మనం అనే భావన రావాలి. హిందూ, ముస్లిం వైరుధ్యాలు పోవాలంటేæ ఉభయవర్గాలు కష్టపడాలి. త్యాగం చేయాలి. ఓర్పు, సంయమనం పాటించాలి. ప్రార్థనలు చేయాలి. అప్పుడే సమాజంలో మంచి పెరుగుతుంది. ఏది కోరినా ఇచ్చే అల్లా మంచితనాన్ని కోరితే ఇవ్వడా?! ఈ లోకంలో మంచిని నింపు అని వేడుకోవడంతో పాటు మనమూ సాటివారితో మంచిగా ఉండాలి. తారతమ్యాలు లేని ప్రపంచాన్ని చేరువచేయమని కోరుకోవాలి. అప్పుడు దైవం తప్పక కరుణిస్తాడు. మంచిలోనే మనల్ని ఉంచుతాడు. ఎందుకంటే మంచికి ఎప్పుడూ ఆశీర్వచనం ఉంటుంది. సంతృప్తిగా జీవించాలంటే దైవాన్ని ఏమని కోరుకోవాలి? దైవంతో మమేకమైతే సంతోషం కలుగుతుంది. ఆ సంతోషానికి మాటలు ఉండవు. దైవాన్ని కోరుకున్నవన్నీ జరుగుతాయని లేదు. కానీ, చిన్న ఆశ, నమ్మకం ఉంటాయి. అది జరిగిందనుకోండి. ఎంతో సంతోషం. అలాంటి ప్రత్యక్ష సాయం అందుతుండగా నేను నా కళ్లారా చూశాను. వాటి గురించి నా పుస్తకాల్లో రాశాను. ఆ సంతోషమే తృప్తి. ఆ సమయంలో దైవం గుర్తుండాలి. ఆ సమయంలో కృతజ్ఞతాభావం ఏదైతే ఉందో అదే దైవానికి మనం ఇచ్చే కానుక. నిర్మలారెడ్డి చిల్కమర్రి -
ఆ క్రికెటర్ కొడుకుతో చెస్ ఆడినా..!
సోషల్ మీడియాలో విమర్శల వర్షం ఈ మధ్య క్రికెటర్లు, సినిమా స్టార్లు ఏం పోస్టు చేసినా.. అయినదానికి కానిదానికి వారికి కించపరిచడం, పరిహాసించడం సోషల్ మీడియాలో సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా మతం పేరిట విమర్శలు చేయడం, కించపరచడం నిత్యకృత్యంగా కనిపిస్తోంది. మొన్నటికిమొన్న భార్యతో దిగిన ఫొటోను పోస్టు చేసినందుకు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై కొందరు మతం పేరిట ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యనమస్కారం చేస్తున్న ఫొటోను పోస్టు చేసినందుకు మరో క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌పై పలువురు మండిపడ్డారు. ఇవి తమ మతానికి విరుద్ధమంటూ విద్వేషం వెళ్లగక్కారు. తాజాగా క్రికెటర్ కైఫ్.. తన కొడుకు చెస్ ఆడుతున్న క్యూట్ ఫొటోను పోస్టు చేసినా.. విమర్శలు తప్పలేదు. ఓ మంచి విషయాన్ని ఆయన షేర్ చేసుకున్నా.. కొందరు మాత్రం మతకోణంలో విపరీత అర్థాలు తీసి విమర్శలు చేశారు. ఇస్లాం మతంలోని నిబంధనలు ప్రస్తావిస్తూ ఆయన తీరును తప్పుబట్టారు. 'ఇస్లాం ప్రకారం చెస్ ఆడటం నిషేధం. నేను మంచి చెస్ ఆటగాడిని కానీ చెస్ ఆడకూడదని హదీత్లో చదివిన తర్వాత చెస్ ఆడటం మానేశాను' అని నెటిజన్ అభిప్రాయపడగా.. 'మరోసారి ఖూరాన్' చదవమంటూ మరొకరు కైఫ్‌ను తప్పుబట్టారు. ఈమేరకు ఆయన పోస్టుపై పలు వ్యతిరేక, విద్వేష వ్యాఖ్యలు వెల్లువడ్డాయి. మరోవైపు ఇంకొందరు నెటిజన్లు మాత్రం కైఫ్ చర్యను స్వాగతించారు. ఈ విషయంలో కైఫ్ పోస్టుపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. -
ఇస్లాంలోకి మారకుంటే కాళ్లు, చేతులు నరికేస్తాం
కోజికోడ్: ఆరు నెలల్లోగా ఇస్లాం మతం స్వీకరించకుంటే కాళ్లు, చేతులు నరికేస్తామం టూ కేరళ రచయిత కేపీ రామనుణ్నికి బెదిరింపులు వచ్చాయి. కోజికోడ్‌కు చెందిన ఆయన... మతం పేరిట హిందూ ముస్లింలు ఘర్షణకు దిగవద్దంటూ స్థానిక పత్రికలో వ్యాసం రాయడంతో వారం క్రితం అజ్ఞాత వ్యక్తులెవరో ఇలా హెచ్చరిస్తూ లేఖ పంపారు. ‘నిష్పక్షపాతం పేరిట మీరు హిందూ , ముస్లింలను ఒకే గాటన లెక్క కట్టారు. ఇలాంటి రాతలు అమాయక ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. మీకో అవకాశం ఇస్తున్నాం... ఆరు నెలల్లోగా ఇస్లాం మతంలోకి మారండి లేదంటే అల్లా తరఫున శిక్ష విధిస్తాం. మీ కాళ్లు, చేతులను నరికేస్తాం’ అని అందులో బెదిరించారు. హత్యా బెదిం పులను సహించబోమని, ఇలాంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తామని సీఎం పి.విజయన్ అన్నారు. రామనుణ్ని ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. -
ధర్మం కాపాడుతుంది..!
ఇస్లాం వెలుగు పూర్వం కొంతమంది మిత్రులు కలిసి ఒక దూరదేశానికి ప్రయాణం కట్టారు. అలా వెళుతూ వెళుతూ ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. అడవిగుండానే ప్రయాణం. కొంతదూరం వెళ్ళిన తరువాత వారు దారి తప్పారు. కొన్నిరోజులపాటు ప్రయాణించినా వారికి సరైన మార్గం దొరకలేదు. అడవిలో తిరిగీ తిరిగీ బాగా అలసిపొయ్యారు. వెంట తెచ్చుకున్న తినుబండారాలు కూడా నిండుకున్నాయి. ఈ క్రమంలో వారికి ఒక ఏనుగు పిల్ల కనిపించింది. వారు దాన్ని పట్టుకున్నారు. ప్రయాణ బృందానికి నాయకుడుగా ఉన్న అబ్దుల్లాహ్, ఆ పిల్ల ఏనుగును వదిలేయమన్నారు సహచరులతో.. కాని వారు, చాలారోజులనుండి సరైన ఆహారం లేక ఆకలితో చచ్చిపోతున్నాం కనుక దీన్ని కోసుకొని తిని ఆకలి తీర్చుకుందామన్నారు. ఏనుగుమాంసాన్ని తినడం ధర్మ సమ్మతం కాదని, ఆకలితో ప్రాణం పోయే పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ఆలోచించవచ్చు గాని, ఇంకా అలాంటి గడ్డుస్థితి రాలేదు కాబట్టి దైవనియమావళిని ఉల్లంఘించవద్దని వారించాడు అబ్దుల్లా. కాని సహచరులు అబ్దుల్లా మాట వినకుండా దాన్ని కోసి వండుకొని తిన్నారు. అబ్దుల్లాను కూడా తినమని బలవంతం చేశారు. కాని అతను దాన్ని ముట్టలేదు. పైగా సహచరులు చేసిన పనికి చాలా బాధపడ్డాడు. చాలారోజుల తరువాత కడుపునిండా తిన్న సహచరులు అక్కడే ఒకచోట నిద్రకు ఉపక్రమించారు. తోటివాళ్ళంతా సుష్టుగా తిని గుర్రుపెట్టి నిద్రపోతుంటే, ఆకలి బాధతో అబ్దుల్లాకు నిద్రపట్టడం లేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయాన భూమి కదులుతున్నట్లు అనిపించసాగింది. ఆకలితో నిద్రపట్టక దొర్లుతున్న అబ్దుల్లాకు భూకంపం వస్తుందేమోనన్న అనుమానం కలిగింది. తీరా చూస్తే అది భూప్రకంపన కాదు. ఏనుగుల గుంపు... వారిని సమీపిస్తోంది. ఒక్కొక్కడి నోటిదగ్గర తొండాలతో వాసన చూస్తూ చీమల్ని నలిపినట్లు నలిపిపారేస్తున్నాయి. కొంతమంది మేల్కొని పారిపోడానికి ప్రయత్నించారు. కాని ఏనుగులు వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు..! అంతలో ఒక ఏనుగు అబ్దుల్లాను సమీపించింది. గట్టిగా కళ్ళు మూసుకొని దైవాన్ని తలచుకున్నాడు అబ్దుల్లా. కాని ఏనుగు తన తొండంతో అబ్దుల్లాను వాసన చూసి వెనక్కి వెళ్ళిపోయింది. బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకునేంతలోనే మరో పెద్దఏనుగుతో కలిసి అతణ్ణి సమీపించింది. అది కూడా అబ్డుల్లాను వాసన చూసింది. కాని ఏమీ చేయలేదు. ఇంతలో అందరి పని పూర్తిచేసిన మిగతా ఏనుగులు కూడా అక్కడ గుమిగూడాయి. అన్నీ తమ తమ తొండాలను రాసుకొని ఏమో గుసగుసలాడాయి. పెద్దఏనుగు తన తొండంతో అబ్దుల్లాను ప్రేమతో నిమిరి, ఎంతో అపురూపంగా తొండంతో ఎత్తి వీపుపై కూర్చోబెట్టుకుంది. మిగతా గుంపంతా జయజయ ఘీంకారం చేస్తుండగా నాయక ఏనుగు అబ్దుల్లాను తీసుకొని ఊరి పొలిమేరల వద్దకు చేర్చింది. మరొక్కసారి ఏనుగులన్నీ నిశ్శబ్దంగా తమ తొండాలను పైకెత్తి అబ్దుల్లాకు అభివాదం చేసి అడవిలో అదృశ్యమైపొయ్యాయి. కొంతదూరం నడిచి ఊళ్ళోకి చేరుకున్న అబ్దుల్లా, ధర్మాధర్మ విచక్షణను విడిచిపెట్టి, దైవ నియమావళిని ఉల్లంఘిస్తే సంభవించే దుష్పరిణామాలను ఊరివారికి సోదాహరణంగా వివరించాడు. ధర్మావలంబనలో ఉన్న మేలునూ, సాఫల్యాన్నీ విశదీకరించాడు. కనుక కట్టుబాట్లను విస్మరిస్తే... ధర్మాన్ని ఉల్లంఘిస్తే ఇహ పర వైఫల్యాలు తప్పవని గ్రహించాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వేయి పుణ్యాల మూట... షబె ఖద్ర్
రమజాన్ కాంతులు షబే ఖద్ర్ ఇస్లాం సంప్రదాయంలో పాటించే అతి పెద్ద పర్వదినం. ఎంతో గౌరవప్రదమైన, మరెంతో విలువైన ఈ రేయి శుభాలను ఏ ఒక్కరూ జారవిడుచు కోరాదు. ఎందుకంటే ఈ రాత్రి దైవదూతలతో భూలోకమంతా కిక్కిరిసిపోతుంది. కాబట్టి ఈ రాత్రి చేసే ఆరాధనలకు దైవం ఇచ్చే ప్రతిఫలాన్ని ఒడిసిపట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఈ రేయిలో వీలైనన్ని ఎక్కువసార్లు నఫీల్ నమాజులు, ఖుర్ ఆన్ పారాయణం చేయాలి. ఖుర్ ఆన్ భావాన్ని మనకు వచ్చిన భాషలో చదువుకోవాలి. ధార్మిక పుస్తకాలను అధ్యయనం చేసి, ధార్మిక జ్ఞానాన్ని పెంపొదించుకోవాలి. మంచి జీవితాన్ని ప్రసాదించమని అల్లాహ్‌ను వేడుకోవాలి. మన ప్రవక్త (స) రమజాన్ నెల చివరి పదిరోజుల్లో దైవారాధనలో పూర్తిగా నిమగ్నం అవడమేగాక తన సహచరులను, ఇంటివారిని కూడా ప్రోత్సహించేవారు. మహాప్రవక్త (స) రమజాన్ చివరి వారంలో చేసినన్ని విస్తృత ఆరాధనలు మరే నెలలోనూ చేసేవారు కారని హజ్రత్ ఆయిషా (ర) తెలిపారు. కాబట్టి వెయ్యి నెలలపాటు అల్లాహ్ ఆరాధన చేసి పొందిన పుణ్యఫలం కంటే ఎన్నో రెటు... ఈ ఒక్కరోజు ఆరాధన చేసి పుణ్యాలు మూటకట్టుకోవచ్చు. – బైరున్నీసాబేగం -
అల్లా కే బందే
నేను నా దైవం కుమారులు అబ్దుల్ మౌసింఖాన్, అబ్దుల్ ముజమిల్ ఖాన్‌లతో ఎ.కె.ఖాన్. తల్లి కడుపులో పుడితే తోబుట్టువులవుతాం కన్నవాళ్లకు పిల్లలమవుతాం అవ్వాతాతలకు వారసులమవుతాం. మరి అల్లాహ్ కి ఏమవుతాం? ఖుదాకి దాసులమవుతాం! అల్లాహ్ కే బందే అవుతాం సేవకు దాసులమవుతాం మంచికి బానిసలమవుతాం పవిత్రతకు బందీలమవుతాం. దేవుడున్నాడని మీరు నమ్ముతారా? ఎ.కె.ఖాన్: దేవుడు లేకుండా సృష్టిలో ఇంత క్రమశిక్షణ ఉండదు. మనుషులైనా, పశువులైనా, ఏ జీవ జాలమైనా, చివరకు గ్రహాలు కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండటం వల్లే సృష్టిలో సమతౌల్యం ఏర్పడింది. దేవుడు లేకుండా సృష్టే లేదసలు. ఇంత నమ్మకం మీకు ఎలా కలిగింది? దేవుడు ఉన్నాడని నమ్మి ఒక పనిని చేయడం మొదలుపెట్టి, ఆ పని పూర్తయ్యే విధానాన్ని గమనించండి మీకు తెలుస్తుంది. నిరాశ నిస్పృహలకు లోనయిన చాలా సందర్భాల్లో దేవుడు ఉన్నాడని నాకు తెలిసింది. ఒకటీ రెండు కాదు... ఎన్నో సంఘటనలు. ఎప్పుడైతే దేవుడ్ని ప్రార్థించడం జరిగిందో అప్పుడు అవి సమకూరిన సందర్భాలున్నాయి. ఇటీవలే మా కుటుంబంలో ఒక సంఘటనే తీసుకుందాం. మా చిన్నబ్బాయి ఒక దశలో విదేశీ ఉద్యోగాలకు వెళ్లడానికి సన్నద్ధమయ్యాడు. ఈ దేశంలో, ఈ సంస్కృతిలో వాడుండాలని దైవాన్ని మేం కోరుకున్నాం. ఐఏఎస్‌గా ఎంపిక కావడం దైవబలం అని నమ్ముతాను. అలాగే డెస్టినీని కూడా నమ్ముతాను. నా కెరియర్లోనే రావు అనుకున్నవి వచ్చాయి. వస్తాయి అనుకున్నవి రాలేదు. ఒక ప్రణాళిక అన్నది భగవంతుడి వద్ద సిద్ధంగా ఉంటుంది. దాని ప్రకారమే జరుగుతుంది. దేవుడి దగ్గర మన ప్రణాళిక ముందే ఉంటే ఈ దీక్ష ఎందుకు? రంజాన్ పవిత్రమాసం. చాలా అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మనం జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం. ఆ తప్పులను సవరించుకోవడానికి ఒక సమయం కావాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ఉండే ఉపవాసం ద్వారా ఆ అవకాశం లభిస్తుంది. రెండవది ఆకలి అనేది తెలిసి వస్తుంది. దీనివల్ల బీదల పాట్లు అర్థమవుతాయి. వారికి చేతనైన సాయం చేయాలనే ఆలోచన కలుగుతుంది. మూడవది.. వీలైనంత వరకు తప్పుడు పనులు చేయకూడదు అని నియమం పెట్టుకుంటాం. ఇస్లాంలో ఈ నెలలోనే ఇవి చేయాలనేది అభిమతం కాదు. ఈ నిష్ట ఎప్పుడూ ఉండాలి. కాకపోతే నెలరోజులు ఎలా నిష్టగా గడుపుతారో మిగతా అంతా అలాగే జీవించడానికి అవకాశం ఉంటుంది. నేను పోలీస్‌గా ఉన్నప్పుడు.. ఏడాదికి ఒకసారి 15 రోజులు మొబిలైజేషన్ పీరియడ్ ఉండేది. దీంట్లో యోగా, స్పోర్ట్స్, పరేడ్‌లో సెల్యూట్, షూటింగ్... ఇవన్నీ ఉండేవి. దీంట్లో విధి నిర్వహణలో జరిగే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఈ మొబిలైజేషన్ ఎలాంటిదో సంవత్సరాంతంలో చేసే తప్పులు సరిదిద్దుకోవడం ఈ మాసం ఇచ్చే ఒక అవకాశం. ఈ మాసంలో ఒక్కసారైనా పూర్తిగా ఖురాన్ పఠించాలి. రోజూ 1/3 ఖురాన్ తప్పక పఠించాలి. అర్థం చేసుకోవాలి. ఇందులో మన ప్రవర్తన ఎలా ఉండాలో రాసి ఉంటుంది. ఈ టైమ్‌లో అర్థం చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ఈ మాసంలోనే బీదలకు సాయం చేయమనడంలోని ఉద్దేశ్యం..? రంజాన్ చివరలో ‘ఈదుల్ ఫితర్’ ఉంటుంది. ఈదుల్ ఫిత్ర్ అంటే బీదల హక్కును కాపాడటం. జకాత్ అంటే దానం. జకాత్ ఏ నెలలోనైనా ఇవ్వచ్చు. కానీ ఈ నెలలోనే ఇవ్వాలనే నియమం తప్పనిసరి. లేకపోతే దానం చేయాలనే ధ్యాస తర్వాత తర్వాత ఉండకపోవచ్చు. పాపాలలో అధికమైన పాపం నిరుపేదల హక్కులు హరించడం. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడానికి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారో.. ఇది కూడా అలాగే! సంపాదనలో 2.5 శాతం కచ్చితంగా దానం ఇవ్వాలి. మొదట కష్టంలో ఉన్న బంధువులకు, తర్వాత ఇరుగు పొరుగుకి, తర్వాత మిగతా సమాజంలో ఉన్నవారికి. ఇక్కడ మతం, కులం అడ్డురాదు. ఎవరికైనా ఇవ్వచ్చు. రంజాన్‌లో ఏవైనా వండుకుంటే చుట్టుపక్కల వారికీ ఆ ఆహారం ఇవ్వాలనేది నియమం. ఇది సమాజంలో ఉన్న వారికి హక్కుగా వర్తిస్తుంది. ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ నియమం పాటిస్తే సమాజంలో పేదరికం చాలావరకు తగ్గిపోతుంది. ఏ మతమైనా అదే చెబుతుంది. పేదలకు మీరిచ్చే వాటా? ఈ మాసంలో నేను, మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు.. అందరం ఎవరికి ఎంత ఆదాయమో చూసుకొని జకాత్ ఇవ్వాల్సింది ఇంత.. అని లెక్క వేస్తాం. మొత్తం 10–15 లక్షలదాకా అవుతుంది. ఇదంతా మా అమ్మగారికి ఇస్తాం. ఆమె మా బంధువుల పరిస్థితి తెలుసుకుని, అవసరం ఉన్నవారికి ఆ డబ్బును పంపిస్తుంది. ఇది మా అన్ని కుటుంబాలలో తరతరాలుగా వస్తోంది. నాకు తెలిసి ఇలా జకాత్ ఇచ్చేవి వేల కుటుంబాలున్నాయి. జకాత్ తీసుకునేవాడు తిరిగి జకాత్ ఇచ్చే స్థాయికి ఎదగాలి. అప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. వేలాది కుటుంబాలు పేదలకు ఇలా సాయం చేస్తుంటే సమాజంలో ఇంకా పేదరికం కనిపిస్తూనే ఉంది..! అంటే, ఆదుకోవాల్సిన వారు అంత ఎక్కువగా ఉన్నారని అర్థం. ప్రభుత్వాలు ఆ పనులను చక్కగా నిర్వర్తించాలి. ఇప్పుడు ప్రభుత్వ పథకాల ద్వారా ఆ పనులకు పూనుకుంటున్నాం. సింహభాగం వ్యాపారం, విద్యకు కేటాయిస్తున్నాం. లక్షల మంది పిల్లలకు విద్య, చిరువ్యాపారులకు, స్వయంకృషితో ఎదగాలనే అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందిస్తున్నాం. ఈ పండగకు ఎంత బీదవారైనా వారు, వారి పిల్లలు కొత్త బట్టలు వేసుకోవాలనేది ఒక ఆచారం. ఎన్ని పాట్లు పడైనా పిల్లలకు కొత్తబట్టలు కొంటారు. కె.సి.ఆర్ గారు ఉద్యమం జరిగే రోజుల నాటి ఒక సంఘటన చెబుతుంటారు. అది రంజాన్ మాసం. వరంగల్‌లో చాలామంది మహిళలు బుర్ఖా ధరించి ఒకచోట నిలబడి ఉండటం చూశారు. ఎందుకని అడిగితే–‘పిల్లలకు కొత్త బట్టలు కొనడానికి రక్తం అమ్ముకుంటున్నామ’ని చెప్పారట. ఇది కళ్లనీళ్లు వచ్చే సంఘటన. రెండేళ్లుగా 200 ప్లేస్‌లలో ప్రభుత్వం తరపున 2 లక్షల కుటుంబాలకు (భార్యాభర్త, ఒక అమ్మాయికి) భోజనం, కొత్తబట్టలు ఇస్తున్నారు. ఈ సంవత్సరం దీనిని రెట్టింపు చేస్తున్నారు. అలాగే, ఈసారి నాంపల్లిలో అనీస్ ఘుర్బా ఆశ్రమ పిల్లలకు బట్టలు, భోజనం పెట్టించిన తర్వాతే ఇఫ్తార్ విందు. ఆ పిల్లలనీ విఐపిల దగ్గర కూర్చోబెడతాం. ఈ ఏడాది జరుగుతున్న మరో గొప్ప విషయం ఆ ఆశ్రమం వెనుక ఎకరం స్థలంలో ఆధునిక వసతులతో 600 మంది పిల్లలకు సరిపడా (ఎక్కువ మంది అమ్మాయిలు) రక్షణ కల్పించే దిశగా ప్లాన్లు చేస్తున్నాం. ఇస్లామ్‌లో దైవం స్త్రీకి ప్రత్యేకమైన నిబంధనలు ఏమైనా పెట్టిందా? ఇస్లాంలో అమ్మాయికి, అబ్బాయికి చదువు విషయంలో ఎక్కడా తేడా లేదు. ముందు ‘చదువు’ అన్నది దైవం చెప్పిన మాట. ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడకు వెళ్లి తెచ్చుకోమని చెబుతుంది. జ్ఞాన సముపార్జనలో చైనాకు కూడా వెళ్లమని చెప్పింది. ఆ దేశంలో ఏ ముస్లింలు ఉన్నారని. అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు ఎవరైతే ఓడిపోతారో బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టాలంటే రెండు కండిషన్స్ ఉండేవి. ఒకటి యుద్ధ పరిహారమైనా చెల్లించాలి. రెండవది అతనికి వచ్చిన విద్య అయినా ఇంకొకరికి నేర్పాలి. సైనికుడు విద్యాధికుడైతే అతని విద్యను బట్టి రిలీజ్ చేసేవారు. మహమ్మద్ ప్రవక్తతోనూ మహిళలు చాలా చర్చలు జరిపిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మార్పు అనేది సమాజంలోనూ వస్తోంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అనుకుంటున్నారు. దీనికి కావల్సిన సపోర్ట్ ఇవ్వడమే దైవత్వం. విధి నిర్వహణలో రాజకీయ నాయకుల వద్ద తలవంచాల్సిన పరిస్థితి వస్తే... ఇస్లామ్‌లో దైవానికి మాత్రమే తల వంచాలనే నియమం ఉంది కదా! రాజకీయ నాయకులు ఎప్పుడూ కోరుకునేది వ్యవస్థను సక్రమంగా నడపండి అనేదే! ఇస్లాంలో సాష్టాంగ ప్రణామం నమాజ్‌లో వస్తుంది. దేవుడికే తప్ప ఎవరికీ లేదు. తల్లిదండ్రులలో కూడా తల్లికే ఆ ప్రాధాన్యత ఉంది. ఈ విషయంలో మహమ్మద్ ప్రవక్త మూడు మాటలు చెప్పాడు. ఆ మూడు మాటలు కూడా తల్లి గురించే! తల్లి, తండ్రి, దైవాన్ని రక్షకులుగా భావిస్తాం. సమాజం పోలీసును రక్షకుడిగా భావిస్తుంది. దైవత్వానికీ, రక్షణ స్థానంలో ఉన్న యూనిఫామ్‌కి సంబంధం ఎలాంటిది? అన్నింటిలో పోలీస్ ఉద్యోగాన్ని మించిన ఉద్యోగం లేదు. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం అనేది కేవలం పోలీసు ఉద్యోగంలో ఉంది. రక్షణ కల్పించే అవకాశం పోలీసుశాఖలో పనిచేసే వ్యక్తికే ఉంటుంది. కాకపోతే చక్కటి విలువలున్న వ్యక్తి ఈ శాఖలోకి రావాలి. విలువల్లేని వ్యక్తి వస్తే ఇక్కడ కలిగేటంత హాని మరెక్కడా కలగదు. బాధించడం, అవమానించడం, ప్రాణాలు తీయడం.. ఈ ఫీల్డ్‌లోనే జరుగుతాయి. పోలిస్ అంటే దైవ స్వరూపమే! మీకు దక్కాల్సినవి దక్కనప్పుడు దేవుడి మీద మీకు కలిగిన భావం? నాకు పెద్ద పెద్ద జిల్లాలో మంచి పోస్టింగ్‌లు వచ్చాయి. కొన్ని నా హక్కు అనుకున్నప్పుడు రాలేదు. అప్పుడు నాకు రావాల్సింది రాలేదు అని బాధపడటంలో అర్థంలేదు. ఎందుకంటే, నాతో పాటు సమర్థత ఉన్నవారికి వాళ్లకు రాకుండా నాకు ఆ పదవులు వచ్చినప్పుడు ‘నన్నే ఎందుకు తీసుకుంటున్నారు?’ అని నేనడగలేదు కదా! 30 ఏళ్ల సర్వీసులో కొన్ని అర్హమైన పోస్టింగ్‌లు రానప్పుడు బాధపడ్డాను. కాకపోతే దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. రిటైర్మెంట్ తర్వాత నాకు బాధ్యతాయుతమైన పదవి వచ్చింది. కొన్నిసార్లు తాత్కాలికంగా బాధపడిన సందర్భాలున్నాయి. ఇవన్నీ సహజంగా జరిగిపోతుంటాయి. నేను క్రికెట్ ఆడుతుంటాను. ఒకసారి అనుకోకుండా ఈజీ బాల్ వస్తుంది. ఒకసారి డిఫికల్టీ బాల్ వస్తుంది. ఒకసారి బోల్డ్ అవుతాం. దీన్నే స్థితప్రతిజ్ఞత అంటారు. దేనికి పొంగిపోనివాడు, దేనికీ కుంగిపోనివాడు.. అనేది భగవద్గీతలోనూ ఉంటుంది. అయితే, కష్టం అనుకున్న సమయంలో దేవుణ్ణి ప్రార్థించిన సందర్భాలు లేవా? ఎందుకు లేవు. చాలా ఉన్నాయి. ఆ సమయంలో ఇంకా ఎక్కువ ప్రార్థిస్తాను. ఇప్పుడు కూడా ప్రతి రోజూ ప్రార్థన చేస్తాను. కష్టం గట్టెక్కిన తర్వాత ప్రార్థనలో కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఒకసారి ఓల్డ్‌సిటీలో కమ్యూనల్ సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో నేను దేవుణ్ణి పదే పదే ప్రార్థించాను. ‘నేను నా ప్రయత్నం చేస్తున్నాను. నీ సహకారం కావాలి’ అని వేడుకున్నాను. గీతలో కూడా ఒక అంశం ఉంది.. కృష్ణుడు అర్జునుడితో– ‘నీ విధిని నువ్వు నిర్వర్తించు. ఫలితం దైవానికి వదులు..’ అని చెబుతాడు. ‘నీవు ఆ విధిని కూడా చేయలేకపోతే ఆ పనిని దేవునికి అప్పగించు’ అని కూడా దైవం చెప్పిన విషయమే. పాహిమామ్ అంటే అదే కదా! సరెండర్ అయిపోవడం. ఇస్లామ్‌లో కూడా అంతే! చేయాల్సింది అంతా చేయ్, చేయలేని సమయంలో దైవానికి అప్పగించు. మానవప్రయత్నం చేయడం ఒక్కటే మన చేతుల్లో ఉంది. డీప్లీ ఇస్లాంలో 10 సంవత్సరాల కేసులు స్టడీ చేసి చూశాను ఒక్కటి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన లేదు. భగవంతుడు ఉన్నాడు. ఈ కష్టాలు ఇస్తున్నది అతనే, దానిని దాటించే శక్తిని ఇచ్చేది అతనిదే! ఇలా అనుకున్నడప్పుడు మనకు సహనం అలవడుతుంది. ఆ కష్టం కూడా సులువుగా దాటేస్తాం. ఇస్లామ్‌లో విగ్రహారాధన ఉండదు కదా! ప్రార్థనలో ఏకాగ్రత ఎలా కలుగుతుంది? ఇస్లామ్‌లో దైవం నిర్గుణాకారం. నమాజ్‌లో ఉన్నప్పుడు మనస్సు నిశ్చలంగా పెట్టుకొని ‘భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నాను. దేవుడు నన్ను చూస్తున్నాడు’ అనే నమ్మకంతో చేస్తాను. ఈద్గాలో నమాజ్ చేసేటప్పుడు 2 –3 లక్షల మంది ఉంటారు. ఆ సమయంలో గమనించండి. చిన్న శబ్దం కూడా కాదు. కేవలం ఇమామ్ చదివే విషయాల మీదే ఫోకస్ ఉండాలి. రెప్ప పాటు కాలంలో కూడా నమాజ్ పక్కకు వెళ్లిందంటే అది ప్రార్థన కాదు. దైవత్వానికి ఆహారానికి ఉన్న సంబంధం ఏంటి? ఆహారం అన్నది బతికుండటం కోసం, సరైన పోషణ కోసం ఆరోగ్యంగా ఉంటే దైనందిన జీవితం, విధి నిర్వహణ సరిగ్గా ఉంటుంది. ఏ మతంలోనైనా సరే సరైన పోషణ, సరైన ఆహారపు అలవాట్లు తప్పనిసరి. ఆ ప్రాంతాన్ని బట్టి, సంస్కృతిని బట్టి వారికా ఆహారపు అలవాట్లు వస్తాయి. ఇది మంచిది, ఇది మంచిది కాదు అని జడ్జ్ చేయకూడదు. మిమ్మల్ని ప్రజలుదేవుడిగా భావించిన ఘటనలు ఉన్నాయి కదా! అలా అని కాదుగానీ... ఒకరోజు అర్ధరాత్రి ఒక వృద్ధురాలు వచ్చింది. కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఆరోగ్యం సరిగా లేదు. కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇల్లెవరిద’ని అడిగాను. ‘మా ఆయనది, ఆయన చనిపోయాడు’ అని చెప్పింది. ఎస్సైని పిలిచి‘కొడుకు, కోడల్ని బయటకు పంపించి, ఈమెను ఆ ఇంట్లో ఉంచండ’ని చెప్పాను. అలాగే జరిగింది. తెల్లవారుజామున ఆమె కోడల్ని, పిల్లల్ని తీసుకొచ్చింది. ‘అయ్యా! చిన్న పిల్లలు. వీళ్ల ముఖాలైనా చూసి ఇంట్లో ఉండనివ్వండి’ అని. అప్పుడు వాళ్లకి చెప్పాను ‘ఆమెను మంచిగా చూసుకోండి. ఈ పిల్లల మొహం చూసి మిమ్మల్ని ఆ ఇంట్లో ఉండనిస్తాను’ అని. ఇది జరిగి ఎనిమిదేళ్లు జరిగింది. వాళ్లంతా కలిసి మెలిసి ఉన్నారు. చాలా ఆనందం వేసింది. లాలాపేట ఏరియాలో ఒక మహిళ... రైల్వే ఉద్యోగి అయిన ఆమె భర్త చనిపోయాడు. రావాల్సిన డబ్బులు ఈమెకు అందలేదు. ఈమెకు ఒక బిడ్డ. సపోర్ట్ కోసం ఒక వ్యక్తితో ఉంది. కొన్నాళ్లకు ఈమెకు ఉద్యోగం, ఆ ఎక్స్‌గ్రేషియా కూడా వచ్చింది. ఆమె విడిగా ఉండే ప్రయత్నం చేసింది. ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. పైగా ఈమె డబ్బంతా అతనే తీసుకునేవాడు. బాధించేవాడు. ముందు ఎస్సై దగ్గరకు వెళ్తే అతను ‘నీ ఖర్మ. అనుభవించు’ అన్నాడట. నా దగ్గరకు వచ్చింది. ‘గతం గతః. ఆమె ఇప్పుడు తనుగా బతకాలనుకుంటోంది. అతని నుంచి ఆ డబ్బులు ఇప్పించి కూతురి పేరున ఫిక్స్డ్ చేయండి. ఆమెను అతను వేధించకుండా వార్నింగ్ ఇవ్వండి’ అని చెప్పాను. అలాగే జరిగింది. రిటైర్ అయ్యాక కూడా ఇలాంటివే జ్ఞాపకం ఉంటాయి. మనుషుల్లో మీరు చూసిన దైవత్వం...? చాలా చోట్ల, చాలా సందర్భాల్లో చూశాను. స్థోమత లేకపోయినా వారు చేసే సాయం ఎంత గొప్పదో ఓల్డ్ సిటీలో ఫైరింగ్ జరిగినప్పుడు చూశాను. మరొక సంఘటన .. 2000వ సంవత్సరంలో విశాఖ పట్టణంలో కమిషనర్‌గా ఉన్నాను. విక్టర్ అనే ఒక అబ్బాయి కలకత్తాలో చదువుకుంటున్నాడు. హాలీడేస్‌లో ఇద్దరు ఫ్రెండ్స్‌తో ఇంటికి వచ్చాడు. టీ తీసుకురావడానికి అతని తల్లి లోపలికి వెళ్లింది. ఈ పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటూ.. ఏమైందో ఏమో అందులో ఒకడు స్క్రూæడ్రైవర్‌తో విక్టర్ని పొడిచాడు. అది ఛాతీలోకి దూసుకుపోయి ఆ పిల్లవాడు చనిపోయాడు. వాళ్లు భయపడి పారిపోయారు. కేస్ ఫైల్ అయ్యింది. పారిపోయిన వారిని పట్టుకొని జైల్లో పెట్టారు. ఆ తల్లి మా దగ్గరకు వచ్చింది ఆ అబ్బాయిలను కలవాలని. పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. ‘ఆమె వారితో ఏదో మాట్లాడాలనుకుంటుంది. ఆ ఏర్పాట్లు అక్కడే ఉండి చూడమ’ని చెప్పాను. ఆమె ఆ పిల్లల దగ్గరకు వెళ్లి ‘ఎందుకు చేశారయ్యా ఈ పని..’ అని అడిగింది. వాళ్లూ ఏడవడం మొదలుపెట్టారు ‘ఇలా జరుగుతుందని ఊహించలేద’ని. ఆ అబ్బాయిలను క్షమించి వదిలేయమని ఈమె వేడుకుంది. పైగా ‘వాళ్ల తల్లిదండ్రులు ఎక్కడుంటారు?’ అని అడిగింది. ‘ఎందుకు?’ అని అడిగితే.. ‘నేను నా కొడుకును పోగొట్టుకొని బాధపడుతున్నాను. వీళ్లు చేసిన పిచ్చి పని వల్ల జైల్లో ఉన్నారు. దీనికి వాళ్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో.. వాళ్లను ఓదార్చాలి’ అంది. ఎంత గొప్పతనం. ఎంతటి దైవత్వం. సమాజంలో కలిసి పనిచేస్తేనే ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
‘గోమూత్రం తాగేవారిని చంపేయండి’
న్యూఢిల్లీ: దేవుళ్లను పూజించేవారిని, గో మూత్రం తాగేవారిని హతమార్చాలని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టు సంస్థ తమ జిహాదీలకు తాజాగా పిలుపునిచ్చింది. భారత్‌కు చెందిన అధికారులను, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)గూఢాచారుల తలలను నరికివేయాలని చెప్పింది. ఎవరికి అనుమానం రాకుండా పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ అధికారులను కూడా చంపేయండని సూచించింది. వీరంతా మతానికి ద్రోహం చేస్తున్నందున వారంతా అల్లా ప్రకారం శిక్షార్హులేనని పేర్కొంది. ఈ మారణహోమంలో అవసరమైతే ప్రాణాలను త్యాగం చేయండని చెప్పింది. కశ్మీర్లో ఖలీఫా రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యం అని పేర్కొంది. ఈ మేరకు ఐఎస్ఐఎస్ సంస్థ ప్రచురించిన ఎనిమిది పేజీల వ్యాసం ఒకటి నేషనల్ మీడియా చేతికి చిక్కింది. ఇస్లాంకు ద్రోహం చేసే మత అవిశ్వాసకులకులను మట్టుపెట్టాలని సూచించింది. మత అవిశ్వాసకులకు వ్యతిరేకంగా కశ్మీర్, జమ్మూలోని మెజారిటీ ముస్లిం ప్రజలు ఎప్పటికప్పుడు ఎదురు తిరుగుతున్నారని, అయితే వారు స్వాతంత్య్రాన్ని మాత్రమే కోరుకుంటున్నారని, ఖలీఫా రాజ్యాన్ని కోరుకోవడం లేదని తెలిపింది. వారు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారని, వారి త్యాగాలను రాజకీయ పార్టీలు కొన్ని సంస్థలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించింది. ఇస్లాం ఉదారవాదులను కూడా క్షమించవద్దని, వారికి కూడా మరణదండన విధించాల్సిందేనని పేర్కొంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఇస్లాం, షరియా చట్టాల ప్రకారమే ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలని, ఈ విషయంలో ఆ అల్లా కూడా మన వెంటనే ఉంటారని, మనకు అండగా ఉండాల్సిందిగా తాము కూడా ఆయన్ని ప్రార్థిస్తామని ఐఎస్ఐఎస్ చెప్పింది. జీన్స్ ధరిస్తే చంపేస్తాం! కశ్మీర్ యువత జీన్స్ ప్యాంటులు ధరించినా, యువతులు ముఖానికి మేకప్ వేసుకన్నా వారిని చంపేస్తామంటూ తాలిబన్ ఏ కశ్మీర్‌కు చెందిన మిలిటెంట్ కమాండర్ జకీర్ ముసా ఓ ఆడియో టేప్‌లో హెచ్చరించారు. ఇది షరియాకు విరుద్ధమని షరియాను అమలు చేయడమే తమ ఏకైక లక్ష్యమని ఇటీవలనే ప్రకటించిన ముసా చెప్పారు. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ముసా కొంత మంది అనుచరులతో బయటకు వచ్చి ‘తాలిబన్ ఏ కశ్మీర్’ అనే గ్రూపును ఏర్పాటు చేశారు. -
ఆత్మశుద్ధికి అవకాశం
ఇస్లాం వెలుగు తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వారికి సేవలు చేయాలి. వారి అవసరాలు తీర్చాలి. వారి మనసు కష్టపెట్టకూడదు. తల్లిపాదాల కింద స్వర్గం ఉంది. తండ్రి స్వర్గానికి సింహద్వారం. తండ్రి సంతోషంలోనే దైవసంతోషం ఉంది. తండ్రి సంతోషంగా లేకపోతే స్వర్గద్వారం తెరుచుకోదు. ప్రసన్న వదనంతో తల్లిదండ్రులవైపు ఓసారి ప్రేమతో చూస్తే స్వీకార యోగ్యమైన ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త చెప్పారంటే, తల్లిదండ్రుల స్థానం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఏమిచేసి మనం వారి రుణం తీర్చుకోగలం ఒక్కసారి ఆలోచించండి. పవిత్ర రమజాన్ సత్కార్యాల సమాహారం. ఈ మాసంలో దైవకారుణ్యం విశేషంగా వర్షిస్తూ ఉంటుంది. ఆచరించే ప్రతి సత్కార్యానికి పుణ్యఫలం అనేకరెట్లు అధికం చేసి ప్రసాదించడం జరుగుతుంది. ఈ శుభమాసంలో చిత్తశుద్ధితో ఆరాధనలు చేసినవారి పూర్వపాపాలన్నీ క్షమించబడతాయి. కాని నలుగురి పాపాలు మాత్రం పవిత్ర రమజాన్ రోజాలు పాటించి, ఆరాధనలు చేసినా క్షమించబడవు. వారు ఎవరంటే... 1. బంధుత్వ సంబంధాలను తెంచేవారు. 2. మనసులో పగ, ప్రతీకారేచ్ఛ కలిగినవారు. 3. తల్లిదండ్రులకు అవిధేయత చూపేవారు. 4.తాగుబోతులు. అనంతమైన దైవకారుణ్యం, శుభాలు కుండపోతగా వర్షిస్తున్నప్పటికీ పాప ప్రక్షాళన జరగడం లేదంటే ఇవి ఎంత ఘోరమైన పాపాలో మనకు అర్థమవుతుంది. అందుకే బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఏ కారణం వల్లనైనా పొరపొచ్చాలు ఏర్పడితే సాధ్యమైనంత తొందరగా వాటిని దూరం చేసుకొనే ప్రయత్నం చెయ్యాలి. పంతాలు, పట్టింపులకు పోయి మనస్పర్ధలు పెంచుకోకూడదు. చిన్నచిన్న విషయాలకు మాట్లాడుకోవడం మానేయకూడదు. ఒకర్నొకరు క్షమించుకొని ప్రేమపూర్వక సంబంధాలు నెలకొల్పుకోవాలి. బంధుత్వసంబంధాలను గౌరవించాలి. ఇద్దరువ్యక్తుల మధ్యగాని, ఇరుకుటుంబాల మధ్యగాని, రెండుతెగలు, లేక వర్గాలమధ్యగాని ఏవైనా అభిప్రాయ భేదాలు తలెత్తితే సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యాలి. మనసులో పగ, ప్రతీకారాలు పెంచుకోకూడదు. మనసులో ఒకరిపై పగ పెంచుకోవడమనేది దేవుని ఆగ్రహానికి దారితీస్తుంది. మనసులో ఏదైనా ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ పరిస్థితి లేకపోతే మధ్యవర్తి ద్వారానైనా సమస్యను పరిష్కరించుకొనే ప్రయత్నం చెయ్యాలి. మనసులో పెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూడడం మంచి పద్ధతి కాదు. ఎల్లవేళలా క్షమాగుణం కలిగి ఉండాలి. ఈ జీవితం చాలా చిన్నది. బతికిన నాలుగురోజులైనా అందరితో మంచిగా ఉండాలి. పోయేటప్పుడు కట్టుకుపోయేదేమీలేదు. ‘అయ్యయ్యో! ఒక మంచి మనిషి పోయాడే’ అనేలా ఉండాలి. అంతేగాని పీడా వదిలింది అనేలా బతకకూడదు. సమాజం పట్ల బాధ్యతగా మసలుకోవాలి. తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వారికి సేవలు చేయాలి. వారి అవసరాలు తీర్చాలి. వారి మనసు కష్టపెట్టకూడదు. తల్లిపాదాల కింద స్వర్గం ఉంది. తండ్రిస్వర్గానికి సింహద్వారం. తండ్రి సంతోషంలోనే దైవసంతోషం ఉంది. తండ్రి సంతోషంగా లేకపోతే స్వర్గద్వారం తెరుచుకోదు. ప్రసన్నవదనంతో తల్లిదండ్రులవైపు ఓసారి ప్రేమతో చూస్తే స్వీకార యోగ్యమైన ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త చెప్పారంటే, తల్లిదండ్రుల స్థానం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఏమిచేసి మనం వారి రుణం తీర్చుకోగలం ఒక్కసారి ఆలోచించండి. తాగుడు అలవాటు ఉన్నవారికి దైవక్షమాపణ లేదు. లెక్కకు మిక్కిలి పాపాత్ములు కూడా క్షమించబడి పునీతులయ్యే తరుణం రమజాన్ లాంటి పవిత్రమాసంలో కూడా మన్నింపు లభించే పరిస్థితి లేదంటే తాగుడు ఎంతటి దుర్మార్గమైన, నీచమైన అలవాటో అర్థం చేసుకోవచ్చు. కనుక తాగుడు అలవాటు ఉన్నవాళ్ళు వెంటనే మానుకుంటే మంచిది. లేకపోతే జీవితంలో వారికి మన్నింపు లేనట్లే. ఎంతటి పాపాత్ములకైనా మన్నింపు ఉన్నది కాని ఈ నాలుగురకాల పాపాత్ములకు మాత్రం పవిత్ర రమజాన్‌లో కూడా మన్నింపులేదు. అందుకని ఎవరిలోనైనా ఈ దుర్గుణాలు ఉన్నట్లయితే వెంటనే దైవం ముందు సాగిలపడి, తప్పు ఒప్పుకొని క్షమాపణ వేడుకోవాలి. మళ్ళీ జీవితంలో ఇలాంటి పాపాల జోలికి వెళ్ళనని ప్రతినబూనాలి. పాపక్షమాపణకు ఇదే సరైన సమయం. సరైన తరుణం. క్షమించమని మొరపెట్టుకోవాలేగాని... దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక పవిత్ర రమజాన్ సాక్షిగా మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దైవం మనందరినీ ఈ దుర్గుణాలకు దూరంగా ఉంచి తన కరుణకు పాత్రులుగా చేయాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
తలాక్ ఇస్లాంలో భాగం కాదు
ఇది సమాజం అంతర్గత సంఘర్షణ మాత్రమే - ట్రిపుల్ తలాక్ వివాదంలో సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం - 69 ఏళ్లుగా చట్టం తేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ధర్మాసనం - ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత సుప్రీందే: అటార్నీ జనరల్ న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశం ఇస్లాంలో భాగం కాదని ఇది ఇస్లాం సమాజంలోని అంతర్గత సంఘర్షణ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నందున ఈ అంశంపై న్యాయపరమైన సూక్ష్మ పరిశీలన జరగాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ బుధవారం ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి తెలిపారు. ముస్లిం మహిళలకు, పురుషులకు మధ్యనున్న తీవ్రమైన అంతరాన్ని సూచించే ఈ అంశం నుంచి కోర్టు తప్పించుకోజాలదన్నారు. రోహత్గీ ప్రశ్నలపై ధర్మాసనం స్పందిస్తూ.. ట్రిపుల్ తలాక్‌తోపాటు ముస్లిం వివాహాలపై నియంత్రణ తెస్తూ ప్రభుత్వం చట్టం ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. ‘కోర్టు ట్రిపుల్ తలాక్ కేసును కొట్టేస్తే మీరు (కేంద్రం) చట్టం చేస్తారా? గత 69 ఏళ్లుగా మీరు ఎందుకు చట్టం తీసుకురాలేదు’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. ‘నేను చేయాల్సింది నేను చేస్తాను. కానీ మీరు (కోర్టు) ఏం చేస్తారనేదే ప్రశ్న?’ అని రోహత్గీ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ మహాపాపం అంటూనే.. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులతోపాటు ఇస్లాం మూల సూత్రాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రిపుల్ తలాక్‌ను సమర్థిస్తున్న సీనియర్ న్యాయవాదులను రోహత్గీ కోరారు. ట్రిపుల్ తలాక్ ‘మహా పాపం’, ‘అవాంఛితం’ అంటున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ అంశం మతంలో భాగమని చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.‘విశాఖ వర్సెస్ రాజస్తాన్ ప్రభుత్వం’ కేసులో పనిచేస్తున్న చోట లైంగి క వేధింపుల విషయంలో ప్రత్యేక చట్టాలేమీ లేకున్నా సుప్రీం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హిందూసంప్రదాయంలోని సతీసహగమనం, దేవదాసీ, అస్పృశ్యతలు కూడా కాలానుగుణంగా నిర్మూలించబడ్డాయన్నా రు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని ‘వీటిని కోర్టులు నిర్మూలించాయా? లేక చట్టాల ద్వారా రూపుమాసిపోయాయా?’ అని ప్రశ్నించింది. అయితే అలాంటప్పుడు విశాఖ కేసులో కోర్టు ఎందుకు జోక్యం చేసుకుందని రోహత్గీ తిరిగి ప్రశ్నించారు. కోర్టులు నిస్సహాయతను వ్యక్తం చేయలేవన్నారు. ‘దేశంలో ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుదే’ అని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను మహిళలు తిరస్కరించొచ్చా? నిఖానామా (వివాహ ఒప్పందం) సమయంలో ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్‌ను తిరస్కరించే అవకాశం కల్పిస్తారా? అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్)ను ధర్మాసనం ప్రశ్నించింది. ట్రిపుల్ తలాక్‌కు నో చెప్పే లా నిఖానామా సమయంలో మహిళలకు అవకాశం కల్పించే నిబంధనను తేవాలని సూచించింది. ‘దీన్ని అమల్లోకి తీసుకురావటం ఏఐఎంపీఎల్కు సాధ్యమేనా? ఖాజీలంతా ఈ ఆదేశాలను పాటిస్తారా?’ అని ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది యూసుఫ్ హతీమ్ ముచ్ఛాల స్పందిస్తూ.. ఏఐఎంపీఎల్ ఆదేశాలను ఖాజీలు పాటించాల్సిన అవసరం లేదన్నారు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్న వారిని సామాజికంగా బహిష్కరించాలని ఏప్రిల్ 14న పర్సనల్ లా బోర్డు ఇచ్చిన ఆదేశాలను ఎవరూ పాటించటం లేదన్నారు. -
మూగజీవులకూ హక్కులుంటాయి!
సృష్టిలోని అన్ని జీవరాసులకు సమాన హక్కులు ఉన్నాయన్న యథార్థాన్ని గ్రహించి, దానికనుగుణంగా నడుచుకుంటేనే సమాజ మనుగడ శాంతియుతంగా, ధర్మబధ్ధంగా ఉంటుంది. ఈ హక్కుల ఉల్లంఘన జరిగితే అశాంతి, అరాచకం, ఇహలోక పరాభవం, పరలోక వైఫల్యం తప్పవు. ముహమ్మద్ ప్రవక్త (స) ఇస్లామ్ వెలుగులో జీవరాసుల హక్కులను గురించి దేవునికి భయపడాలని హితవు చెప్పారు. ఒకసారి ముహమ్మద్ ప్రవక్త(స) ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి పెరట్లో ఒక ఒంటె గుంజకు కట్టేసి ఉంది. ప్రవక్తవారిని చూడగానే అది బోరుబోరున అరిచింది. దాని కళ్ళవెంట అశృవులు ధారగా కారుతున్నాయి. ఆ బాధను చూసి కారుణ్యమూర్తి దాని దగ్గరికి వెళ్ళి, ప్రేమగా దాని దేహాన్ని నిమిరారు. ఆత్మీయమైన ఆ కరస్పర్శతో ఆ ఒంటె శాంతించింది. వెంటనే దాని యజమానిని పిలిచి, ‘‘ఈ మూగజీవిని గురించి నువ్వు దేవుడికి భయపడవా? దీన్ని నీసంరక్షణలో ఇచ్చిన దేవుడంటే నీకు లెక్కలేదా? కడుపునిండా మేత, నీరు, తగినంత విశ్రాంతి ఈ మూగజీవుల హక్కు. నువ్వు ఆ హక్కును కాలరాసి సరైన మేత పెట్టకుండా, విశ్రాంతి కూడా లేకుండా, దానితో శక్తికి మించిన పని చేయించుకుంటున్నావు. ఈ విధంగా నువ్వు దీని హక్కును హరిస్తున్నందుకు దైవానికి సమాధానం చెప్పుకోవాలి జాగ్రత్త!’’ అని తీవ్రస్వరంతో మందలించారు ప్రవక్త. నోరులేని జీవుల మేత, నీరు, విశ్రాంతి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు. వాటి శక్తికి మించిన బరువులు లాగించడం, దుక్కులు దున్నడం చేయకూడదు. దున్నేటప్పుడు మేత, నీరు, విశ్రాంతి లాంటి ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒకసారి ప్రవక్త తన సహచరులతో కలిసి ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో పొదల మాటున ఓ చిన్నపక్షి ఆహారాన్వేషణలో తనపిల్లలతో సంచరిస్తోంది. సహచరులు ఆపిల్లల్ని పట్టుకున్నారు. అప్పుడా తల్లిపక్షి తన పిల్లలకోసం పదేపదే వారి తలలపైన్నే చక్కర్లు కొట్టసాగింది. ఇది చూసిన ప్రవక్త మహనీయులు, పాపం ఆ పసిపిల్లల్ని పట్టుకొని ఆ తల్లినెందుకు బాధపెడుతున్నారు. ముందు వాటిని వదిలేయండి. అని తీవ్రస్వరంతో మందలించారు. మానవ హక్కులతో పాటు విశ్వంలోని సమస్తజీవుల హక్కులను గుర్తించి నెరవేరిస్తేనే సృష్టిలో మానవ మనుగడ ప్రశాంతంగా సాగిపోతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
'ఆ పని చేస్తున్నది పాకిస్థానీలే'
ఇస్లాంకు, దేశానికి చెడ్డపేరు తెస్తున్నారు ఇస్లాం సందేశానికి చావుగంట మోగిస్తున్నారు సొంత దేశంపై తీవ్రంగా విరుచుకుపడ్డ మాలాలా న్యూఢిల్లీ: సొంత దేశం పాకిస్థాన్‌పై తీవ్రంగా విరుచుకుపడుతూ తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయి ఓ వీడియో సందేశాన్ని వెలువరించారు. 'దైవదూషణ'కు పాల్పడ్డాడన్న నెపంతో ఇటీవల పాకిస్థాన్‌లో ఓ యూనివర్సిటీ విద్యార్థిని దారుణంగా కొట్టిచంపారు. ఈ ఘటనను పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్‌కు చెడ్డపేరు రావడానికి మరెవరో కాదు పాకిస్థానీలే కారణమని ఆమె విమర్శించారు. 'మనం ఇస్లామోఫోబియా గురించి మాట్లాడుతాం. మన దేశానికి, మన మతానికి ప్రజలు ఎలా చెడ్డపేరు తెస్తున్నారో మాట్టాడుతాం. కానీ, ఇతరులెవరూ మన దేశానికి, మన మతానికి చెడ్డపేరు పెట్టడం లేదు. అది మనకు మనమే చేస్తున్నాం. అందులో మనం సరిపోతాం' అంటూ ఆమె తప్పుబట్టారు. గురువారం 23 ఏళ్ల జర్నలిజం విద్యార్థి మషాల్ ఖాన్‌ను యూనివర్సిటీ పరిసరాల్లోనే పట్టపగలు అతి కిరాతకంగా ఓ మూక కేకలు పెడుతూ హతమార్చింది. ఫేస్బుక్లో 'దైవదూషణ' చేశాడన్న ఆరోపణలతో ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. మషాల్ ఖాన్‌ను క్రూరంగా కొట్టిచంపడమే కాదు.. అతని మృతదేహాన్ని కాలేశారు. అతడు ప్రాణాలు కోల్పోయి నిర్జీవంగా పడి ఉన్నా.. అతని మృతదేహాన్ని కట్టెలతో కొడుతూ కసి తీర్చుకున్నారు. ఈ దారుణమైన ఘటన నేపథ్యంలో మలాలా మృతిచెందిన విద్యార్థి తండ్రితో మాట్లాడారు. ఇంతటి దారుణం తన కొడుకుపై జరిగినా, సమాజంలో శాంతి, సహనం నెలకొనాలంటూ ఆయన సందేశమిచ్చారని ఆమె చెప్పారు. 'ఈ ఘటన మషాల్ హత్యకు సంబంధించినదే కాదు. ఇది ఇస్లాం సందేశానికి చావుగంట మోగించడమే. మనం మన మతాన్ని మరిచిపోయాం. మనం మన విలువల్ని, సభ్యతని మరిచిపోయాం' అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
మానవత్వమే ఇస్లాం అభిమతం
నంద్యాలవిద్య: మానవత్వమే ఇస్లాం అభిమతమని జమాతే ఇస్లామిక్ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ సలాం దస్తగిరి అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక అంటికోట మసీదు ఆవరణలో ఆ సంఘం జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ గత 70సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ఉత్తమ సమాజ నిర్మాణానికి, మానవ విలువలు పెంపొందించడానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మీడియా సెక్రటరీ అక్బర్, సామాజిక కార్యదర్శి మౌలానా ఇదురుల్లా హుసేన్, పట్టణ అధ్యక్షుడు జక్రియ, తదితరులు పాల్గొన్నారు. -
'ఇస్లాం కోసం రాళ్లు రువ్వండి'
శ్రీనగర్: ఇస్లాం కోసం కశ్మీరీ యువత పోలీసులు, బలగాలపై రాళ్లు రువ్వాలంటూ హిజ్బుల్ మొజాహిద్దీన్ మిలిటెంట్ జకీర్ రషీద్ భట్ పిలుపునిచ్చాడు. గత ఏడాది హిజ్బుల్ మిలిటెంట్ బుర్హాన్ వానీని బలగాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. బుర్హాన్ స్ధానంలోకి వచ్చిన రషీద్.. కశ్మీరీల నేషనిలిజం కోసం మిలిటెంట్ల ఉద్యమం ప్రారంభమైందనే వ్యాఖ్యలను కొట్టిపడేశాడు. సెక్యులారిటీ, ఫ్రీడమ్ లాంటి పదాలకు మిలిటెన్సీలో చోటే లేదని హురియత్ కశ్మీర్ యువతలో అలాంటి భ్రమలు కలిగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన రషీద్ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మొత్తం 12 నిమిషాల పాటు మాట్లాడిన రషీద్.. ఇస్లాం పేరిట దాడులు చేయాలని అన్నాడు. కశ్మీర్లో త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుండా బహిష్కరించాలని కోరాడు. రాళ్లు ఒకరికోసం రువ్వుతున్నట్లు భావించకుండా ఇస్లాం కోసం చేస్తున్నట్లు భావించాలని అన్నాడు. ఏదో ఒక రోజు కశ్మీర్ వ్యాలీలో ఇస్లాం జెండా రెపరెపలాడుతుందని వ్యాఖ్యానించాడు. -
సామరస్యమే ఇస్లాం మూలసూత్రం
- కులమతాలకు అతీతంగా సాయపడే గుణం ఉండాలి - ముఫ్తి తల్లాసాహబ్ ఖాస్మి నక్ష్బందీ కర్నూలు(ఓల్డ్‌సిటీ): ముస్లింలు కుల, మతాలకు అతీతంగా సాయపడే గుణం కలిగి ఉండాలని ముంబయికి చెందిన ఇస్లామిక్ స్కాలర్, ముఫస్సిర్-ఎ-ఖురాన్ ముఫ్తి తల్హా సాహబ్ ఖాస్మి నక్ష్బందీ సూచించారు. జమైతుల్ ఉల్మా అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక ఇస్లామియా డిగ్రీ కళాశాల మైదానంలో ‘రాబోవు సమస్యలకు పవిత్ర ఖురాన్లో సూచించిన పరిష్కార మార్గాలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక బహిరంగ సభలో నక్ష్బందీతో పాటు జమైతుల్ ఉల్మా రాష్ట్ర అధ్యక్షుడు హాఫిజ్ పీర్ షబ్బీర్ ప్రసంగించారు. అందరితో సఖ్యతగా ఉంటూ సామరస్యాన్ని కాపాడడమే ఇస్లాం మూల సూత్రమని తెలిపారు. పవిత్ర ఖురాన్‌లోనూ ఇవే అంశాలను సూచించారని, వాటిని మహమ్మద్ ప్రవక్త ఆచరించారన్నారు. ఏవైనా సామాజిక సమస్య వచ్చినప్పుడు కుల, మతాలకు అతీతంగా అందరి ఆమోదంతోనే పరిష్కరించాలన్నారు. పిల్లలకు చదువుతో పాటు నైతిక విలువలు కూడా నేర్పించాలని, అలాంటి చదువులనే ప్రోత్సహించాలని కోరారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మౌలానా ఖాజీ అబ్దుల్‌మజీద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ముస్లింలు తరలివచ్చారు. -
మహోన్నత మానవతా ధర్మం ఇసా్లం
–సున్ని ఇస్తెమాలో ముస్లిం మత పెద్దలు పిలుపు - భారీగా హాజరైన ముస్లింలు కర్నూలు (ఓల్డ్‌సిటీ): మానవుల్లో ప్రేమానురాగాల బంధాలను బలోపేతం చేసే మహోన్నత మానవతా ధర్మం ఇస్లాం అని వివిధ దర్గాల పీఠాధిపతులు, ముస్లిం మత పెద్దలు అన్నారు. అహ్లె సున్నతుల్ జమాత్, మర్కజీ మిలాద్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు నగరలోని ఉస్మానియా కళాశాల మైదానంలో లతీఫ్ లావుబాలి దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా అబ్దుల్లా హుసేన్ బాద్షా ఖాద్రి అధ్యక్షతన జాతీయస్థాయి సున్ని ఇస్తెమా జరిగింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు ఉల్మాలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీలు బుట్టారేణుక, టీజీ వెంకటేష్ , ఆదోని, మంత్రాలయం, కర్నూలు ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, ఎస్వీమోహన్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ కర్నూలునియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, హాజరయ్యారు.అనంతరం అజ్మీర్ దర్గా గుడ్డీ నషీన్ మౌలానా సయ్యద్ ఫజ్లుల్ మతీన్, గుల్బర్గా దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్‌షా గౌస్దరాజ్ ఖుస్రూ హుసేని, దాదాహయాత్ ఖలందర్ దర్గా (కర్ణాటక) పీఠాధిపతి సయ్యద్ గౌస్ మొహియుద్దీన్ ఖాద్రి, మౌలానా రిజ్వాన్ పాషా ఖాద్రి, మౌలానా అహ్మద్ నక్స్‌బందీ, డాక్టర్ ఇస్మాయిల్ పీర్ ఖాద్రి ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. మానవాళి శ్రేయస్సును కాంక్షించి భువిపైకి వచ్చిన పవిత్ర గ్రంధం ఖురాన్ అని, మానవాళి ఎలా నడుచుకోవాలో అందులో పొందుపరిచారన్నారు. అల్లా ఆదేశాలను ఆచరించి చూపిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త (సఅస) అంటూ ఆయన జీవిత విశేషాలను వివరించారు. ప్రతి ముస్లిం ప్రవక్త మార్గంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఇస్తెమాలో అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా కార్యదర్శి సయ్యద్‌షా షఫి పాషా ఖాద్రి, ప్రతినిధులు సయ్యద్ ముర్తుజా ఖాద్రి, మాసుంపీర్ ఖాద్రి, డాక్టర్ సరఫరాజ్, సయ్యద్ జహీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. పీఠాధిపతుల ఆశీస్సులు పొందిన ఎంపీ బుట్టా రేణుక.. ఇసె్తమాకు హాజరైన కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పీఠాధిపతులు, మతపెద్దలు, ఉల్మాల ఆశీస్సులు పొందారు. కర్నూలులో జాతీయ స్థాయి ఇస్తెమా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మానవాళి శ్రేయసే్స అన్ని మత గ్రంథాల సారంశం అని ఎంపీ టీజీ, ఎమ్మెల్యే ఎస్వీ పేర్కొన్నారు. అందరికి మంచి జరగాలని ఇస్తెమాలో దువా చేయాలని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మతపెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఇస్తెమా నిర్వాహకులకు సత్కారం భారీ ఎత్తున సున్ని ఇస్తెమా నిర్వహించిన షఫిపాషా ఖాద్రిని ఇతర మతపెద్దలను మంత్రాలయం, ఆదోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి సత్కరించారు. -
ఇస్లాం మతంలో ఎవరి అభిమతం చెల్లదు
– మౌల్వీలు, మతపెద్దలు కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఇస్లాం మతంలో ఎవరి అభిమతం చెల్లదని బెంగుళూరుకు చెందిన మౌలానా పి.ఎం.ముజమ్మిల్ పేర్కొన్నారు. ముస్లిం పర్సనల్‌లా బోర్డుకు సంబంధించిన అంశంపై స్థానిక ఉమర్ అరబిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ముస్లిం మౌల్వీలు, మతపెద్దలు నిర్వహించిన ఈ కార్యక్రమం గురువారం రాత్రి 2.00 గంటల దాకా కొనసాగింది. కార్యక్రమానికి మౌలానా ముజమ్మిల్‌తో పాటు హైదరాబాదుకు చెందిన మౌలానా సయ్యద్ జహంగీర్, ముఫ్తి సయ్యద్‌షా ఆరిఫ్‌పాషా ఖాద్రి, మౌలానా జుబేర్‌అహ్మద్ ఖాన్, మన్సూర్ అహ్మద్ సల్ఫి, మౌలానా అబ్దుల్లా ఖాస్మి, వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్లాంలో మహిళలకు సముచిత గౌరవముందని, 2011 సర్వే ప్రకారం విడాకులు పొందిన వారి సంఖ్య విషయంలో ఇస్లాం మతం 6వ స్థానంలో ఉందన్నారు. మౌలానా జహంగీర్ మాట్లాడుతూ ఇస్లాంలో ఎవరి అభిమతానికి తావులేదని, ప్రపంచంలోని ముస్లింలందరు ఖురాన్, హదీసు వెలుగులో జీవనం సాగిస్తున్నారన్నారు. ముఫ్తి ఆరిఫ్ పాషా ఖాద్రి మాట్లాడుతూ ఇస్లాంలో మార్పులు–చేర్పులు చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. -
శాంతికి చిహ్నం ఇస్లాం
గోనెగండ్ల: ఇస్లాం మతం శాంతికి చిహ్నమని ముస్లిం మత పెద్ద మౌలానా జాకీర్ అహమ్మద్ రషాది పేర్కొన్నారు. గోనెగండ్ల సమీపంలో రెండురోజులపాటు నిర్వహించే జిల్లా స్థాయి ఇస్తెమా శనివారం ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుండి కూడా వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. మతపెద్దలు ఇస్తెమాను దువాతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవం సష్టించినవన్నీ మానవళికి ఉపయోగపడేవే అన్నారు. ఇస్తెమాలో మత పెద్దలు మౌలానా యాషిన్సాబ్, మౌలానా సలీం సాబ్, మౌలానా సత్తార్‌సాబ్, మౌలానా జుబేర్ సాబ్‌లు ప్రసంగించారు. -
జోరుగా పొట్టేళ్ల విక్రయాలు
బక్రీద్‌కు ఏర్పాట్లు పూర్తి పోచమ్మమైదాన్ : ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో రెండోది ఈద్ ఉల్ జుహా (బక్రీద్). దీనినే ఖుర్బానీ అనికూడా అంటారు. ఈ పండుగను మంగళవారం నిర్వహించేందుకు ముస్లింలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జంతువును బలి ఇచ్చే పండుగ కనుక ఈద్- ఉల్ -జుహా అంటారు. ఖుర్బానీ అంటే దేవుని పేరుతో పేదవారికి జంతుమాంసం దానం ఇవ్వడం. ఇస్లాం చరిత్రలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. నేడు బక్రీద్ కావడంతో వరంగల్‌లోని మండిబజార్, న్యూ రాయపుర, కాజీపేటలలో పొట్టేళ్లను జోరుగా విక్రయిస్తున్నారు. పండుగ రోజున ఖుర్బాని ఇచ్చేందుకు ముస్లింలు పొట్టేళ్లు కొనుగోలు చేస్తుండడంతో ఇదే అదనుగా అమ్మకందారులు ధరలు పెంచేశారు. దీంతో పేద ముస్లింలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. -
మేం ఇస్లాంలోకి మారే పరిస్థితి రావొచ్చు!
కరూర్ (తమిళనాడు): వివక్షపై దళితులు పోరుబాట పట్టారు. దేవాలయ ఉత్సవంలో పాల్గొనేందుకు తమను అనుమతించకపోవడంతో దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు వాపస్ ఇచ్చేస్తామని హెచ్చరించాయి. ఆలయంలోకి ప్రవేశించకుండా తమపై వివక్ష కొనసాగిస్తే.. అందుకు నిరసనగా తాము ఇస్లాం మతంలోకి మారుతామని వారు హెచ్చరించారు. తమిళనాడులోని కరూర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. దళిత కుటుంబానికి చెందిన గీత మాట్లాడుతూ తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని, తమపై ఇలాగే వివక్ష కొనసాగిస్తే.. తాము బలవంతంగా ఇస్లాం మతంలోకి మారే పరిస్థితి రావొచ్చునని చెప్పారు. -
ఇస్లాంకు అసలు సవాలు ఇదే
జాతిహితం యువ ముస్లిం వృత్తి విద్యావంతులు గూగుల్ నుంచి, ఆధునిక టీవీ మతప్రబోధకుల నుంచి తమ మత ధర్మాన్ని గురించి నేర్చుకోవడం అనే అతి పెద్ద సమస్యతో ఎలా వ్యవహరిం చాలి? జకీర్ నాయక్ వంటి వారు ప్రచారం చేస్తున్న ముస్లింలు బాధితులుగా ఉంటున్నారనే కథనం వారి మనసులను ముంచెత్తుతోంది. ఈ సమస్య ఇక్కడ మన దేశంలోనే ఇంత జటిలంగా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని పరిస్థితిని మీరే ఊహించుకోవచ్చు. దాదాపు 50 కోట్ల లేదా ప్రపంచ ముస్లిం జనాభాలో 40 శాతం మనసులపై ఈ దాడి జరుగుతోంది. సుప్రసిద్ధ పాకిస్తానీ వ్యాఖ్యాత ఖలీద్ అహ్మద్ చెప్పేంత వరకు (1984) జకీర్ నాయక్ అనే వ్యక్తి ఉన్నట్టే నాకు తెలియదు. నా మొట్టమొదట పాకిస్తానీ మిత్రుడు కూడా అయిన ఖలీద్... ఆయనను నేను ఎరుగనని తెలిసి ఆశ్చర్య పోయాడు. 2009లో జరిగిన ఒక సమాంతర సమావేశం లాంటి సంభా షణలో, జకీర్ నాయక్ ఉపఖండంలోనేగాక ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఇస్లామిక్ టెలీ-మత ప్రబోధకునిగా వృద్ధి చెందుతున్నట్టు ఖలీద్ చెప్పారు. జకీర్ ప్రవచనాలు చాలా వరకు ఇంగ్లిషులో సాగడం కూడా అందుకు కారణం. అప్పటికీ నాకు ‘పీస్ టీవీ’ అనేది ఒకటున్నదని తెలియనందుకూ అతను ఆశ్చర్యపోయాడు. ‘‘అది కూడా తెలుసుకోవయ్యా బాబూ, మన మంతా ముందు ముందు అతని గురించి ఇంకా చాలా ఎక్కువ వినాల్సి ఉంటుంది’’ అన్నారు. నైపుణ్యంతో కూడిన ఆయన భాషా పటిమకు, మిత వాద అంధ విశ్వాసాన్ని హేతుబద్ధతీకరించడానికి మంత్ర ముగ్దుడనైపోయా నని ఖలీద్ అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం అందరిలాగే నేనూ ‘‘హజరత్ (గౌరవనీయులైన) గూగుల్’’కు వెళ్లాను (ఈ పద ప్రయోగం నాది కాదు వేరొకరిది). జకీర్ గురించి చదవడం, ఆయన టీవీ ప్రవచనాల రికార్డింగులను చూడటం ప్రారంభించాను. ఇంగ్లిషు వైద్యుడైన జకీర్ టెలీ-మత ప్రబోధకునిగా మారి... సౌదీ తరహా మితవాద ఇస్లాంకు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన, వాక్పటిమగలిగిన, శక్తివంతమైన ప్రతినిధిగా అవతరించారు. రాక్-స్టార్ మతప్రబోధకుడు ఆయన భాష, దరహాస వదనంతో కూడిన నడవడిక, ఖురాను, భగవ ద్గీత, ఉపనిషత్తులు, బైబిల్ నుంచి అధ్యాయాలను, శ్లోకాలను అప్పటికప్పుడు అనర్గళంగా ఉల్లేఖించడం, క్రైస్తవులు, హిందువులు, నాస్తికులు సహా తన సమావేశాలకు హాజరైనవారు ఎవరు అడిగే ఏ ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి సుముఖంగా ఉండే వైఖరి అతనిని మౌలానా మూసపోతకు భిన్నంగా నిలుపుతుంది. నిజానికి ఆయన వారికి పూర్తిగా విరుద్ధం. సూటు, టై ధరించి, చక్కగా ఆలోచించి కూర్చిన ఇంగ్లిషు వాక్యాలను వేగంగా మాట్లాడతారు. ఆయన నడవడిక అంతటిలోకీ పలుచటి గడ్డం, మాడు మీది టోపీలే ఎక్కువగా ఆయన భక్తితత్పరుడైన ముస్లిం అని తెలుపుతాయి. నా సహచరులు కొందరి ద్వారా నేను ఆయనకు సంబంధించిన వారిని సంప్రదిం చాను. 2009 మార్చిలో ఆ ఇంటర్వ్యూ జరిగింది. జకీర్ నాయక్‌కు ఏ అధికారికమైన లేదా మతపరమైన బిరుదూ లేదు. కెమెరా ముందు తనను మౌల్వీ లేదా మౌలానాగా అభివర్ణించడానికి ఆయన అభ్యంతరం తెలిపారు. టెలీ-మతప్రబోధక రాక్-స్టార్‌గా వర్ణించడానికి అభ్యంతరం లేకపోవడమే కాదు, మహా ఆనందంగా అంగీకరించారు. ‘ఆస్తా’ చానల్లో ఎంతో ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కనిపించే చాలా మంది మత బోధకులు ఆయనకున్న టీవీ స్టార్ నైజాన్ని చూసి అసూయ చెందు తారు. ఆయన సంభాషణ చాలా వరకు ఘర్షణాత్మకమైనది కాదు. అత్యంత స్నేహపూర్వకమైన స్వరంతో మాట్లాడారు. భారత రాజ్యాంగంలో, న్యాయ వ్యవస్థలో తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని అంటుంటే ఇక వాదించడానికి ఏం మిగిలి ఉంటుంది. దేశవిభజన విషయంలో ఆయన వైఖరి ఆర్ఎస్ఎస్ వైఖ రికి భిన్నమైనదేం కాదు. అది, భారతదేశమనే దేశంగా ఉపఖండానికి గొప్ప విషాదం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ‘‘క్రీడల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రపంచ శక్తి’’గా ఎదిగి ఉండేవి అన్నారాయన. ముస్లింలలో చాలా మందికి ఎన్నడూ విభజన అవసరమే లేదు లేదా కోరలేదు, పాకిస్తాన్ ఉద్యమానికి నేతృత్వం వహించినవారిలో పలువురు ‘‘మతానుయాయులైన ముస్లింలు కూడా కారు.’’ అయితే అర్ఎస్ఎస్కు భిన్నంగా ఆయన ఈ అంశాన్ని ముస్లింల ప్రయోజనాల కోణం నుంచి చూశారు. మితవాద ముస్లింలు జమాత్ ఏ ఇస్లామీ నేతృత్వంలో సాగిన దేశ విభజనను వ్యతిరేకించడానికి నేపథ్యం ఉంది. అయితే నేటి చర్చలో భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, జాతీయవాదం, దేశవిభజనలపై ఆయన వైఖరి చాలా మంది పాకిస్తానీలకు మాత్రమే చికాకు కలిగిస్తుంది. కశ్మీర్‌పై జకీర్ అభిప్రాయాన్ని ఆయనను ద్వేషించేవారు, మహా దుర్మా ర్గునిగా చిత్రీకరించేవారిలో అత్యధికులు సైతం కొంత అయిష్టంగానైనా అంగీ కరిస్తారు. భారత్, పాకిస్తాన్‌లు రెండింటి పట్ల కశ్మీరీలు విసిగిపోయారు. స్వేచ్ఛగా ఓటింగ్‌ను నిర్వహిస్తే ఒంటరిగా వదిలేయమనే వారు కోరుకుం టారు. కానీ అది వారికి ఒక అవకాశంగా ఇవ్వజూపుతున్నది కాదు. కాబట్టి విద్య, ఉపాధులను మెరుగుపరచి, తన వైపు నుంచి శాంతిని నెలకొల్పి, సాధారణ పరిస్థితిని తీసుకురాగలగాలి అని ఆయన అభిప్రాయం. అతి సౌమ్యుని అతి ప్రమాదకర పార్శ్వం ఇక క్లిష్టమైన అంశాలకు వచ్చేసరికి సమస్యలు తలెత్తాయి. 26/11ను, 9/11ను సైతం ఆయన స్వేచ్ఛగా ఖండిస్తారు. కాకపోతే ‘‘జంట టవర్లను ధ్వంసం చేసిన వ్యక్తి మతధర్మాన్ని పాటించే ముస్లిం కాడు, అతన్ని ఖండిం చాల్సిందే...’’ నేనెప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాను కాబట్టి నాకు 9/11 డాక్యు మెంటరీల నుంచి సమాచారం లభించింది. దాన్ని బట్టి జార్జ్ బుష్ స్వయంగా చేసిన, లోపలి వారి పనేనని తెలుస్తోంది... ఈ ఆధారాలు ఒసామా బిన్ లాడెన్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలకంటే చాలా మెరుగైనవి’’ అంటారు. ముస్లింల మస్తిష్కాలపై ఆయన పట్టు పెరుగుతుండటాన్ని గుర్తించి ‘ఇండి యన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక జాగ్రత్తగా ఎంపిక చేసిన 2010 వార్షిక శక్తివంతుల జాబితాలో జకీర్ పేరును చేర్చింది. అయితే ఆయన ప్రయోగించే లాడెన్ తరహా సందిగ్ధ అభిభాషణా ధోరణి ఆయనలో ఉన్న తప్పుడు, ప్రమాదకరమైన అంశాన్ని నొక్కిచెబు తుంది. భార్యను ‘‘ఇస్లామిక్’’ పద్ధతిలో ‘‘ఏదో టూత్ బ్రష్‌తో కొట్టినట్టుగా మెల్లగా కొట్టడం’’ లేదా విశాలమైన అలంకారాలతో కూడిన ముస్లిం సమాధు లను ఇస్లాంకు విరుద్ధమైనవిగా ప్రకటించడం వంటి మూర్ఖత్వాలను ఆయన పదేపదే సమర్థిస్తుంటారు. ప్రతి మూడు వాక్యాలకు ఒకసారి ఒక సూక్తిని ఉల్లేఖించే జకీర్ ఉపన్యాస శైలి ఇస్లాం పట్ల లోతైన మితవాద, మతశాస్త్రవాద దృష్టికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయన పద్ధతి చూడటానికి భయపెట్టని దిగా, స్నేహపూర్వకమైనదిగా కనిపిస్తుంది. కానీ నిజంగానే తెలుసుకోగోరే, అమాయక మనసులతో ఆడుకోగలగడం ప్రమాదకరం. తోటి మనుషులకు లేదా రాజ్యానికి వ్యతిరేకంగా హింసను ప్రయోగించమని ఆయన ఎన్నడైనా సూచిస్తారని నేను విశ్వసించను. అయితే ఆయన ఐఎస్ఐఎస్ను కచ్చితంగా ‘‘ఇస్లామ్ వ్యతిరేక కుట్ర’’గా ఖండిస్తారు. ఇస్లాంకు ఆయన చెప్పే ఛాందస వాద వ్యాఖ్యానాలు.. అమాయక, యువ ముస్లింల మనసులు మరింత తీవ్ర పద్ధతులను అనుసరించడానికి సమంజసత్వాన్ని కలుగ జేసేట్టుగా విస్తరింప జేయగలుగుతాయి. బంగ్లాదేశీ ఉగ్రవాదులలో కొందరు ఆయన అనుయా యులు అయినందుకు నేను ఆశ్చర్యపోను. కొత్త, యువ ముస్లిం ఉగ్రవా దులు, ప్రత్యేకించి ఐఎస్ఐఎస్కు చెందినవారు బాగా చదువుకున్నవారు, సంపన్న కుటుంబాలకు చెందినవారు, ఇంగ్లిష్ మాట్లాడేవారుగా ఉంటున్నా రెందుకు? అనే ప్రశ్న ఈ రోజుల్లో తరచుగా ఎదురవుతోంది. క్లుప్తంగా చెప్పా లంటే కొత్త ముస్లిం ఉగ్రవాది, పాత పేద, నిరక్షరాస్యుడైన అజ్మల్ కసబ్ తరహా ఉగ్రవాద మూసపోతకు భిన్నంగా ఉంటున్నాడెందుకు? దీనికి సమా ధానం బహుశా హిందూ మితవాదులు ద్వేషించడానికి ఇష్టపడే మరో వ్యక్తి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీవద్ద ఉండవచ్చు. ఓవైసీ లేవనెత్తిన అసలు సమస్య ఆయన నన్ను ఒకసారి హైదరాబాద్‌లోని పాత బస్తీలోకి కార్లో తీసుకు పోయారు. ఆ ప్రాంతాన్ని ఆయన, ఆయన కుటుంబం దశాబ్దాలుగా నియం త్రిస్తోంది. ఒవైసీ నాకు తను నడుపుతున్న విద్యాసంస్థలను చూపించారు. ఆయన విద్యాసంస్థలోని ఎమ్‌బీబీఎస్ క్లాస్‌లో ఆడపిల్లలు/మగపిల్లల నిష్పత్తి 70:30గా ఉండటం చూసి సంతోషంతో నివ్వెరపోయాను. సోషల్ మీడి యాలో ఆ ఫొటోలను కొన్నిటిని పోస్ట్ చేశాను. వారంతా హిజబ్ (బురఖా) ధరించి ఉన్నారనే ఫిర్యాదుతో నన్ను తిట్టి పోస్తూ ఓ పెద్ద దుమారమే రేగింది. ‘‘ఈ ఆడపిల్లలు మెడికల్ కాలేజీకి వెళ్లాలా లేక మదారసాకు వెళ్లాలా? అని మిమ్మల్ని తిట్టిపోసే వాళ్లను ఆడగండి’’ అన్నారాయన. ఆ తర్వాత ఆయన కొద్దిసేపు ఆగి ‘‘బహుశా ఈ యువ ముస్లింలు మదా రసాకు కూడా వెళ్లి ఉంటేనే బాగుండేదేమో. ఇస్లాం అర్థాన్ని, సూత్రాలను, జిహాద్‌ను సైతం ఒక మౌల్వీ అయితే చెబుతారు’’ అన్నారు. ఈ యువ ముస్లింలు ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏలు అవుతారుగానీ వారికి తమ మతంగురించి తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. కాబట్టి ‘‘హజరత్ గూగుల్’’ తప్ప వారు ఎక్కడకు వెళ్లగలుగుతారు? ఒక యువ ముస్లిం గూగుల్‌లో జిహాద్ అని కొడితే ‘‘బహుశా మొహ్మద్ హఫీజ్ సయీద్, అతని జమా ఉద్ దవానే మొట్టమొదట కనబడొచ్చు’’ అంతకంటే మదా రసాకు వెళ్లడమే మంచిది అన్నారు ఒవైసీ. నేడు ఇస్లాం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఇదే అన్నారు. ఆయనకు ఐఎస్ఐఎస్ అంటే అసహ్యం, పాత బస్తీలో దానికి వ్యతిరేకంగా హోర్డింగ్‌లను పెట్టించారు. ఒవైసీ చెబుతున్న మరింత పెద్ద, ప్రబలమైన సమస్య కూడా మీకు ఇప్పుడు కనబడుతుంది. యువ ముస్లిం వృత్తి విద్యావంతులు గూగుల్ నుంచి, ఆధునిక టెలివిజన్ మత ప్రబోధకుల నుంచి తమ మత ధర్మాన్ని గురించి నేర్చుకోవడం అనే సమస్యతో ఎలా వ్యవహరించాలి? జకీర్ నాయక్ వంటి వారి ప్రబోధాలు వారి వారి మనస్సులను ముంచెత్తుతున్నాయి. వారు ప్రచారం చేస్తున్న ముస్లింలు బాధితులుగా ఉంటున్నారనే కథనం విశ్వసించ దగినదిగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు సహా కొందరు లౌకికవాదు లుగా చెప్పుకునేవారు- కేవలం దిగ్విజయ్‌సింగ్ మాత్రమేకాదు - ఇషత్ ్రజహాన్ కేసు నుంచి బాట్లా హౌస్ ఎన్కౌంటర్ వరకు ప్రతిదాన్ని ముస్లింలను బాధించడంగానే చూపుతూ ఆ బాధిత కథనానికి ఆజ్యాన్ని పోస్తుంటారు. ఈ సమస్య ఇక్కడ మన దేశంలోనే ఇంత జటిలంగా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని పరిస్థితిని మీరే ఊహించుకోవచ్చు. దాదాపు 50 కోట్ల లేదా ప్రపంచ ముస్లిం జనాభాలో 40 శాతం మనసులపై జరుగుతున్న దాడి ఇది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
శాంతిని కోరేదే ఇస్లాం
* ఐఎస్ఐస్ ఓ సైతాన్ * ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ సాక్షి, సిటీబ్యూరో: ఇస్లాం ఎప్పుడూ శాంతినే కోరుకుం టుందని, రక్తపాతం విధ్వంసాలు ఇస్లాం అభిమతం కాదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం మక్కా మసీదులో జరిగిన యౌముల్ ఖురాన్ సభలో ఆయన మాట్లాడారు. ఐఎస్ఐఎస్ ఓ సైతాన్, గుండాల దళమని, వారు మసీదులపై దాడులు చేసి ఎందరో ముస్లింలను హతమార్చారన్నారు. వారికి ఇస్లాంకు సంబంధం లేదన్నారు. భారత దేశంలోని ముస్లింలు ఐఎస్ఐఎస్కు ఎప్పుడూ సహకరించరని, తాను ఐఎస్ఐఎస్ తీవ్రవాదాన్ని తుదముట్టించాలని ఎప్పటినుంచో కోరుతున్నానన్నారు. ముస్లింలు దేశాన్ని ప్రేమిస్తారు తప్ప వదిలి పోరని, ఉగ్రవాదం వైపు వెళ్తున్నవారు ముస్లింలు కాదన్నారు. దేశం కోసం తన తల త్యాగం చేసేందుకైనా సిద్దమేననని, దేశంలోని గంగా జమునా తహజిబ్ కంటే ఏదీ గొప్పది కాదన్నారు. నిరాపరాధులైతే.... ఐఎస్ఎస్తో సంబంధాలున్నాయని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న యువకులు నిరాపరాధులని తేలితే సమాధానం ఏముంటుందని ఎన్ఐఏను అసదుద్దీన్ ప్రశ్నించారు. గతంలో మక్కామసీదు. మలేగావ్ సంఘటనల్లో కూడా అమాయకులను అరెస్ట్ చే శారని. ఇటీవల పాతబస్తీ ఘటనపై నిజానిజాలు న్యాయస్థానంలో రుజువవుతాయన్నారు. తాను ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టు చూశానని.. అల్లర్లు సృష్టించాలనే అభియోగం లేదని, మీడియా సృష్టిగా పేర్కొన్నారు. గతంలో బహదూర్‌పురా, సైదాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన ఇలాంటి సంఘటనల్లో సంఘ్ పరివార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసిందేనన్నారు. గతంలో మక్కా మసీదు, లుంబీని పార్కు, గోకుల్ చాట్లతో పాటు మాలెగావ్, ముం బాయి మారణకాండలో ఆర్ఎస్ఎస్ హస్తమున్న విషయం స్పష్టమైందన్నారు. ప్రస్తుతం అరెస్టయిన పాతబస్తీ యువకుల న్యాయ పోరాటానికి తాము సహకరిస్తామని, ముస్లిం లపై జరుగుతున్న దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ హక్కుల కోసం పోరాడుతామన్నారు. ముస్లింల పరిరక్షణకు పోరాడుతున్న తమపై సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నాయన్నారు. ముస్లింలపై ఉగ్రవాద ముద్రవేయవద్దని సూచించారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలి తెలంగాణ హైకోర్టును తక్షణమే ఏర్పాటుచేయాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఇక్కడి హైకోర్టు ఉమ్మడి రాష్ట్రాల కోసం పని చేస్తుందని.. ప్రస్తుతం తెలంగాణ న్యాయవాదుల కోరిక మేరకు హైకోర్టు విభజన జరగాల్సిందేనన్నారు. న్యాయ వాదుల పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు.