
కరాచీ : పాకిస్తాన్‌లోని హిందువులపై అకృత్యాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని థార్‌లో గ్రామంలో నివాసముంటున్న ఒక హిందూ బాలికను ముగ్గురు సాయుధులైన ముస్లింలు అపహరించారు. అనంతరం బలవంతపు మత మార్పిడి చేసి.. వివాహం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్‌లోని డాన్ పత్రిక ఈ వార్తను ప్రచురించింది. ఈ ఘటనపై బాలిక తండ్రి హీరో మేఘవార్.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాన్ తెలిపింది.
రెండు రోజులు కిందట ముగ్గురు సాయుధలైన వ్యక్తులు తమ ఇంటిలోని ప్రవేశించి.. అందరినీ బంధించినట్లు మేఘవార్ చెప్పారు. అనంతరం మైనర్ కుమార్తె (14 సంవత్సరాలు)ను వారు ఎత్తుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై స్థానిక నేతలను, పోలీసులను సంప్రదించినా ఎవరినుంచి స్పందన రాలేదని ఆయన చెప్పారు. చివరగా నసీర్ లుంజో అంనే వ్యక్తి.. తమ కుమార్తెను బలవంతపు మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నట్లు తెలిసిందని అన్నారు.
స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో.. మేఘవార్ సింథ్ ఎస్‌ఎస్‌పీ అధికారిని కలిశారు. ఈ ఘటనపై వెంటనే ఆయన స్పందించి.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు.. బాలికను వెతికించే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా.. బాలిక మతమార్పిడికి సంబంధించిన సర్టిఫికెట్ ఒకటి పోలీసులకు అందిందని తెలిసింది. దీనిపై మేఘవార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పెళ్లిని వ్యతిరేకిస్తూ సింధ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సింధ్ హైకోర్టు జనవరి17న విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment