
కరాచీ: పాకిస్తాన్‌లో హిందువుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మత ఛాందసవాదులు ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతమార్పిడి చేయించి, పెళ్లి జరిపించిన ఉదంతం చోటుచేసుకుంది. ఇలాంటి అనేక కేసులు అనేకం వెలుగుచూస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్రలో కనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో పదేళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పాకిస్తాన్ దారావర్ ఇత్తెహాద్ (మైనారిటీల హక్కుల కోసం ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ) అధ్యక్షుడు శివకట్చి తెలిపిన వివరాల ప్రకారం సంఘర్ ప్రాంతానికి చెందిన 10 ఏళ్ల హిందూ బాలికను 50 ఏళ్ల ముస్లిం వ్యక్తి బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అవినీతికి అలవాటు పడిన పోలీసు సిబ్బంది సహకారంతో ఈ వివాహం జరిగిదనే ఆరోపణలున్నాయి. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయవాది సహకారంతో కోర్టులో కేసు వేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసిందని శివకట్చి తెలిపారు.
గ్రామంలోని తమ ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను మిర్‌పుర్‌ఖాస్‌కు చెందిన గులామ్ ముహమ్మద్ అపహరించి, సిర్‌హండి ఎయిర్ సమరో మదర్సాకు తీసుకెళ్లారని శివకచ్చి చెప్పారు. తరువాత ఆ బాలికకు బలవంతంగా మత మార్పిడి చేయించి షాహిద్ తల్పూర్ అనే వ్యక్తితో వివాహం జరిపించారని తెలిపారు. అయితే ఆ ప్రాంత న్యాయ అధికారుల చొరవతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ బాలికను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారని శివకచ్చి తెలిపారు.
ఇది కూడా చదవండి: సగం మంది ఇంటి నుంచే పనిచేయండి
Comments
Please login to add a commentAdd a comment