
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ వ్యాపారి ముగ్గురు కూతుళ్లను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చి ముగ్గురు యువకులు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. పాకిస్తాన్ దరేవార్ ఇతేహాత్ సంస్థ చీఫ్ శివ కచ్చి ఈ విషయం తెలిపారు.
ధార్కి ప్రాంతానికి చెందిన హిందూ వ్యాపారి లీలా రామ్ ముగ్గురు కూతుళ్లు చాందిని, రోష్ని, పరమేశ్ కుమారిలను కొందరు అపహరించుకుపోయారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి అపహరించిన ముగ్గురు ముస్లింలు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారని శివ కచ్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment