marriages
-
పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలు
‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అన్నమాట ఎంతవరకు నిజమో కానీ పెళ్లి వేడుకకు ఆకాశమే హద్దుగా మారిందన్నది మాత్రం వంద శాతం నిజం! కిందటేడు అంటే 2024లో ఒక్క నవంబర్, డిసెంబర్ నెలల్లోనే 4.8 లక్షల పెళ్లిళ్లయ్యాయి. అవి ఆరు లక్షల కోట్ల వ్యాపారం చేశాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ నివేదిక! దీని ప్రకారం ఈ మొత్తం 4.8 లక్షల్లో రూ. 3 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిన వివాహాలున్నాయి. ఈ లెక్క చూశాక తెలిసింది కదా.. పెళ్లి ఖర్చుకు ఆకాశమే హద్దు అని! ఆచార సంప్రదాయాలు, వ్యవహారాలు, పెట్టుపోతలు ఇవన్నీ ఆడంబరాలుగా మారి పెళ్లిఖర్చును పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయింది. జనవరి 30 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. మార్చి 10 వరకు సందడే సందడి! ఆ సందర్భంగా మ్యారేజ్ ఇండస్ట్రీ, మధ్యతరగతి (Middle Class) మీద ప్రభావం వంటివి స్పృశిస్తూ ఒక కథనం..మన దేశంలో సగటు వివాహ ఖర్చు.. ఒక ఇంటి ఏడాది ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ! అది మన దేశ వెడ్డింగ్ ఇండస్ట్రీని (Wedding Industry) దాదాపు రూ. లక్షాపదమూడు కోట్లతో ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా చేర్చింది. ఇది అమెరికా వెడ్డింగ్ మార్కెట్ (US Wedding Market) కన్నా రెండింతలు పెద్దది. కోవిడ్ తర్వాత పెళ్లి వ్యయం మరింత ప్రియం అయింది. అతిథుల సంఖ్య తగ్గింది. కానీ ఖర్చు నయా పైసా కూడా తగ్గలేదు. ఇదివరకు ఆడపిల్ల పెళ్లంటే బంధువులు, స్నేహితులు అన్నిరకాలుగా అండగా నిలిచి ఉన్నదాంట్లో ఆ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించి తల్లిదండ్రులు తేలికపడేలా చేసేవారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారైతే ఇల్లు వాకిలి, పొలమూ పుట్రా అమ్మడమో, తాకట్టు పెట్టడమో చేసి పెళ్లి జరిపించేవారు.అప్పుడు వరకట్నాలు లాంఛనాలు, బంగారం కిందే జమయ్యేవి. ఇప్పుడా సీన్ మారిపోయింది. అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లాన్‌తో ఉంటున్నారు. ఆ ప్రణాళికలో పెళ్లికీ ప్రయారిటీ ఇస్తున్నారు. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కూతురు– పెళ్లికొడుకు సహా పెళ్లిని అయిదు రోజుల ఈవెంట్స్‌తో ఘనంగా జరిపించుకోవాలనుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలే కాదు సోషల్ మీడియా షాట్స్, రీల్స్గానూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.వీటన్నిటి ఖర్చు కోసం కొలువు తొలిరోజు నుంచే ఆదా చేయడం మొదలు పెడ్తున్నారు. అలా పెళ్లి ఖర్చును అమ్మాయిలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కట్నకానుకలను మాత్రం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తున్నారు. అవి స్థిర, చరాస్తులుగా రూపాంతరం చెందాయి. అమ్మాయి పేరు మీదే ఉంటున్నాయి. అవీ పెళ్లి ఖర్చులో భాగమయ్యి, తల్లిదండ్రులు పెట్టే ఖర్చుల జాబితాలో చేరుతున్నాయి. అయితే ఇవి మ్యారేజ్ ఇండస్ట్రీలో కలవని అదనపు ఖర్చన్నమాట. బ్యాచిలర్.. బ్యాచిలరేట్ పార్టీలు కూడా.. దేశంలో సగటు మధ్యతరగతి కుటుంబం కూడా పెళ్లి మీద భారీగా ఖర్చుపెడుతోందంటోంది సీఏఐటీ సర్వే! తెలుగు రాష్ట్రాల్లో అయితే అది కనిష్టంగా రూ. 30 లక్షలు. పెళ్లి వేదిక, వచ్చే అతిథుల సంఖ్య, వంటకాల సంఖ్య, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సోషల్ మీడియా రీల్స్, షాట్స్ వగైరాలను బట్టి ఈ బడ్జెట్ పెరుగుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) అయితే అది రూ. కోటి దాటుతోంది. ఈ ΄్యాకేజ్లో బ్యాచ్‌లర్, బ్యాచ్లరెట్ ట్రిప్స్ కూడా ఉన్నాయి.ఇప్పుడు పెళ్లి ఖర్చును వధూవరులిద్దరూ సమంగా పెట్టుకునే ఆనవాయితీ మొదలైంది. ఇది ఒకందుకు మంచి పరిణామంగానే భావించినా.. అసలు పెళ్లనేది వ్యక్తిగత లేదా రెండు కుటుంబాలకు చెందిన వ్యవహారం. దానికి అంతంత ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందని అబీప్రాయపడుతున్నారు సోషల్ ఇంజినీర్స్. ఫలానా వాళ్ల పిల్లల పెళ్లి కన్నా గొప్పగా తమ పిల్లల పెళ్లి చేయాలని తల్లిదండ్రులు, తమ స్నేహితులు.. కొలీగ్స్ కన్నా ఘనమనిపించుకోవాలని వధూవరులు.. పోటీలకు పోతూ, ఉన్న సేవింగ్స్ అన్నీ ఊడ్చేసుకుని.. అప్పులు కూడా తెచ్చుకుని మరీ పెళ్లి చేస్తున్నారు.. చేసుకుంటున్నారు.ఎస్బీఐ సహా పేరున్న ప్రైవేట్ బ్యాంకులన్నీ పెళ్లిళ్లకు లోన్స్ ఇస్తున్నాయి. పర్సనల్ లోన్ ఖాతాను పెంచడంలో వీటి పాత్ర గణనీయం. కస్టమ్ వెడ్డింగ్ లోన్ప్రోడక్ట్స్ బ్యాంకుల డిమాండ్‌నూ పెంచుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వోద్యోగులైతే ఆ అప్పులు తీర్చడానికి అవినీతికి పాల్పడిన దాఖలాలూ ఉన్నాయంటున్నారు సోషల్ ఇంజినీర్స్. ఈ అప్పులతో కొత్త పెళ్లిజంట మధ్యలో కూడా స్పర్థలు వచ్చి విడాకుల దాకా వెళ్లిన సంఘటనలూ ఉన్నాయని చెబుతున్నారు.ఇవీ ఉన్నాయి.. ఈ ఘనమైన మాయకు ఇరుగు పొరుగు, బంధుగణం, తోటివాళ్లే కాదు సినిమాలు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లూ బాధ్యులు. ‘మురారి’ సినిమా వచ్చిన కొత్తలో మాట.. ఒక ప్రోగ్రెసివ్ కుటుంబంలోని అమ్మాయి ‘మురారీ’ సినిమాలో పెళ్లి సీన్స్‌కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి.. తన పెళ్లి ఆ సినిమాలో చూపించినట్టే జరగాలని పట్టుబట్టి మరీ ఆ తరహాలోనే పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు తమ అమ్మాయి పెళ్లికోసం అప్పట్లోనే అయిదు లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇందులో బాలీవుడ్ పాత్రా ఉంది. ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ దాని పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్‌ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్‌లు.వృథా కూడా అదే స్థాయిలో!ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 బిలియన్ టన్నులు అంటే మనిషి పండించే పంటలో మూడొంతులు వృథా అవుతోందట. ఈ వృథాలో అధిక వాటా పెళ్లిళ్లు లాంటి వేడుకలదే! అందులో మనమేం తక్కువలేం! ఈ వృథా వల్ల ఇంకొకరి ఆహారపు హక్కును మనం హరించినట్టే! అంతేకాదు.. ఈ ట్రెండ్ ధరలనూ ప్రభావితం చేసి నిత్యవసరాలను అందుకోలేనంత ఎత్తులో పెట్టేస్తోంది. ఇకో ఫ్రెండ్లీ యువత అంతా లగ్జరీ వైపే చూస్తోందని ఆందోళన చెందక్కర్లేదు. పెళ్లనేది పూర్తి వ్యక్తిగత వ్యవహారంగా భావించి రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటవుతున్న జంటలూ ఉన్నాయి. తమ పెళ్లికి ఆత్మీయులు, సన్నిహితుల ఆశీస్సులు అవసరమనుకునేవారు దాన్ని కుటుంబ వేడుకకే పరిమితం చేసుకుంటున్నారు. అనవసర ఖర్చు లేకుండా, స్థానికంగా దొరికే వస్తువులతోనే పర్యావరణహితంగా మలచుకుంటున్నారు. ఈ జంటలే భవిష్యత్ జంటలకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం! ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ సినిమాల పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్‌ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్‌లు. – సరస్వతి రమ⇒ పెరుగుతున్న పెళ్లి ఖర్చును అదుపు చేయాల్సిందిగా 2017లో రంజిత్ రంజన్ అనే కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆన్ స్పెషల్ అకేషన్స్’ అనే ప్రైవేట్ బిల్‌ను ప్రవేశపెట్టాడు. దీనిప్రకారం పెళ్లికి అతిథుల సంఖ్య వందకు, పదిరకాల వంటకాలు, కానుకల విలువ రూ. 2,500కు మించరాదు. ఎవరైనా పెళ్లి మీద రూ. 5 లక్షలకు మించి ఖర్చు పెడితే పది శాతం డబ్బును ప్రభుత్వ సంక్షేమ నిధికి ఇవ్వాలి. అలా జమ అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఏటా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఖర్చుపెట్టాలి. కానీ ఈ బిల్లు ఆమోదం పొందలేదు. చదవండి: పుస్తకాలు మా ఇంటి సభ్యులు⇒ 1993లో నాటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్.. పెళ్లికి ముందు పెళ్లిలో రూ. 25 వేలకు మించి ఖర్చు చేయకూడదంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ అదీ పాస్ అవలేదు.కన్‌స్ట్రక్టివ్‌గా ఇన్వెస్ట్ చేసుకోవాలిసంపాదించుకుంటున్నాం కదాని ఉన్న సేవింగ్స్ అన్నిటినీ పెళ్లి అట్టహాసాలకే ఖర్చు చేయడం కరెక్ట్ కాదు. ఉన్న వాళ్లు ఎంత ఖర్చుపెట్టుకున్నా పర్లేదు. కాని వాళ్లను మిడిల్‌క్లాస్ పీపుల్ ఫాలో అయితేనే తర్వాత ఆర్థికంగా, ఎమోషనల్‌గా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పులు చేసి మరీ మన చుట్టూ ఉన్నవాళ్లను మెప్పించడం వల్ల మన ఇల్లు గుల్లవడం తప్ప పైసా ప్రయోజనం ఉండదు. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లలు .. వాళ్ల చదువులు లాంటి ఎన్నో బాధ్యతలుంటాయి. వాటి కోసం సేవింగ్స్‌ని ప్లాన్ చేసుకోవాలి. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆచితూచి మదుపు చేసుకోవాలి. దానివల్ల మనం సంతోషంగా ఉండటమే కాదు ప్రకృతి వనరులను, శ్రమను గౌరవించిన వాళ్లమవుతాం! – డాక్టర్ కస్తూరి అలివేలు, అసోసియేట్ప్రోఫెసర్, డీన్, డీజీఎస్ సెస్, హైదరాబాద్.డిమాండ్ పెరిగిందిపెళ్లి ఫొటో, వీడియోగ్రఫీలు తక్కువలో తక్కువ రెండు లక్షల నుంచి మొదలు ఈవెంట్స్ కవరేజ్‌ను బట్టి బడ్జెట్ పెరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం స్టూడియోస్ కూడా ఉన్నాయి. డబ్బుండి, టైమ్ లేని వాళ్లు ఆ స్టూడియోస్‌లో షూట్స్‌ని ప్రిఫర్ చేస్తుంటే.. డబ్బు, టైమ్ రెండూ ఉన్నవాళ్లు విదేశాలకూ వెళ్లి షూట్ చేయించుకుంటున్నారు. మొత్తం మీద ఫొటో, వీడియోగ్రాఫర్స్తోపాటు ఈ స్టూడియోస్కీ డిమాండ్ బాగా పెరిగింది. – వీఎన్ రాజు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్కాంప్రమైజ్ అవ్వట్లేదువెడ్డింగ్ సెలబ్రేషన్స్ విషయంలో ఎవరూ కాంప్రమైజ్ అవట్లేదు. కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. పెళ్లికి వచ్చే అతిథులు తగ్గారు కానీ.. వేడుకల విషయంలో మాత్రం ఎవరూ వెనకడుగు వేయట్లేదు. మధ్యతరగతి వాళ్లు కూడా వెడ్డింగ్ ప్లానర్‌ని పెట్టుకుంటున్నారు. ఎంత తక్కువనుకున్నా 30 లక్షల నుంచి మొదలవుతోంది వెడ్డింగ్ బడ్జెట్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయితే 50.. 60 లక్షలు ఇంకా ఆపై కూడా ఉంటోంది. ఇదివరకు ఈవెంట్స్ అన్నీ ఫొటోలు, వీడియోలకే పరిమితమై ఉండేవి. ఇప్పుడు రీల్స్, షాట్స్‌లో సోషల్ మీడియాలోనూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.బ్రైడ్ అండ్ గ్రూమ్ కొత్త కొత్త ఐడియాలతో వచ్చి వాటిని అమలు చేయడానికి ప్లాన్లు అడుగుతున్నారు. పీర్స్ కన్నా డిఫరెంట్‌గా ఉండాలనీ, తామే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. దీంతో వెడ్డింగ్ ప్లానర్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. వాళ్లమధ్య పోటీ కూడా ఎక్కువే ఉంటోంది. కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు వెడ్డింగ్ ప్లానర్ అనే బోర్డ్ పెట్టేసుకుంటున్నారు. – వర్ధమాన్ జైన్, వెడ్డింగ్ ప్లానర్ -
మన బ్రెయిన్ చిప్ లాకైందా?
ఈమధ్య నేను మానవ జన్యుశాస్త్రం మీద కొంత అధ్యయనం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎపిజెనెటిక్స్, యునిజెనెటిక్స్ మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నాకర్థమైంది. మానవ మెదడు ఒక తరం నుండి మరో తరానికి మేధా శక్తిని జన్యు మార్పు ద్వారా అందిస్తుందని ఈ సైన్సు చాలా స్పష్టంగా నిరూపించింది. ఈమధ్య కాలంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఒడెడ్ రెచావీ అనే జెనెటిసిస్టు మానవ మెదడులోని ఆలోచనా శక్తి పిల్లలకు చాలా తరాల నుండి సంక్రమిస్తుందని తేల్చాడు.కులం, ఏకవృత్తి మనకేం చేశాయి? ఈ అధ్యయనంలో ఆయన కనుక్కున్నదేమంటే, తల్లిదండ్రుల డీఎన్ఏ, ఆర్ఎన్ఏతో పాటు వారి ఇరు కుటుంబాల తాతముత్తాతల, అమ్మమ్మల, వారి వెనుక తరాల మెదడు జన్యుశక్తితో పాటు వారి అనుభవాల సమూలశక్తి, క్రియాశీల శక్తి, భావ ప్రకటనా శక్తిని ఇప్పుడు పుడుతున్న పిల్లల మెదళ్లు సంక్ర మించుకుంటాయి. ఈ సంక్రమణ వాళ్ళ కుటుంబాలలోని చాలా తరాల నుండి పిల్లలకు వస్తుందట. భారతదేశంలో ఒకే కులం పెళ్ళిళ్లు, ఆయా కులాల తరతరాల ఏక వృత్తి వల్ల ఎన్ని వేల ఏండ్లు మన మెదళ్ళు బంధించబడ్డాయో మన సోషల్ సైన్సు అధ్యయనం చెయ్యలేదు. అసలు కులం, కుల వృత్తులపై ఈ మధ్యనే కొద్దిపాటి చర్చ మొదలైంది. ఏక కుల పెళ్ళిళ్లు ఎదుగుదల లేని, రోగభరిత సంతానాన్ని అందిస్తాయని కొద్దిగా చర్చ జరుగుతోంది. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న జంటల సభలో ఈ మధ్యనే మాట్లాడుతూ జస్టిస్ రాధారాణి గారు మనం మనుషులుగా బతకడం లేదు, కులాలుగా బతుకు తున్నామన్నారు. అదీ 21 శతాబ్దంలో. అయితే అసలే చర్చకు రాని సమస్య ఏమంటే, మెదడు క్రియాశీల శక్తిని ఒకే కుల వృత్తికి పరిమితి చేసినందువల్ల ఈ తల్లిదండ్రుల సంతానాల మెదళ్ళు పరిమిత అనుభవ, ఆలోచన, క్రియాశీల, కమ్యూనికేషన్ శక్తిని మాత్రమే సొంతం చేసుకోవడం.ఉదాహరణకు నా కుల కుటుంబ వృత్తినే చూస్తే, నా తల్లిదండ్రుల, అమ్మమ్మ, తాతముత్తాతల కుల జన్యు పరిమితి, వారి ఏకవృత్తి అయిన గొర్రెల కాపరి అనుభవ జ్ఞానం మాత్రమే నా మెదడుకు అందింది. అది ఎన్ని రకాల శక్తిని బంధించిందో తెలియదు. నా ముందు తరాల నిరక్షరాస్యత నా క్రియేటివ్, కమ్యూనికేషన్ శక్తులను ఎంత బంధించిందో తెలియదు. ఒకవేళ నా తల్లి గొర్రెల కాపరి కుటుంబం, తండ్రి వడ్రంగి కుటుంబం నుండి వచ్చి ఉంటే నా మెదడు ఎలా పని చేసేదో తెలియదు. ఇదే అంశం ఒక బ్రాహ్మణ మంత్ర పఠన కుటుంబానికీ, చెప్పులు చేసే మాదిగ కుటుంబానికీ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ రుగ్వేద కాలం నుండి మొదలైందని మనకు ఆ అధ్యయనం చెబుతుంది.ఒక కుటుంబంలో వివిధ వృత్తులుంటే...ఈ క్రమంలో మన దేశంలోని మానవ మెదళ్ల చిప్ లాక్ చెయ్యబడిందని నా అభిప్రాయం. దీనిపై చాలా అధ్యయనం జర గాలి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి, ఈ మధ్య చనిపోయిన జిమ్మీ కార్టర్ ఆత్మ కథ ‘ఎ ఫుల్ లైఫ్’ చదివాను. ఆయన తండ్రి వేరుశనక్కాయ బాగా పండించే రైతు, ఇండ్లు కట్టే వడ్రంగి, చెప్పులు చేసే మోచి, ఇంట్లో అన్నీ బాగుచేసే ప్లంబర్, మంచి వ్యాపారి. ఆయన తల్లి నర్సు, మంచి వంట పనివంతురాలు, చేను పనుల్లో దిట్ట. వారి వెనుక తరాలు ఎన్ని రకాల పనులు చేశారో ఆయన రాయలేదు. కానీ వారి పిల్లలు, ముఖ్యంగా జిమ్మీ కార్టర్ విభిన్న మానసిక, శారీరక శక్తులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన అతి చిన్న వయస్సు నుండే వేరుశనగ పంట పని చైతన్యమంతా మెదడుకెక్కించాడు. తండ్రిలా షూ మేకర్ అయ్యాడు. బ్రహ్మాండమైన నేవీ ఎలెక్ట్రికల్ ఇంజినీర్ అయ్యాడు. అన్నిటినీ మించి తన 95వ సంవత్సరం వరకు తాను పెట్టిన స్వచ్ఛంద సంస్థ ‘హబిటాట్ ఫర్ హ్యుమానిటీ’ తరఫున కార్పెంటర్‌గా ఎన్నో దేశాల్లో వేలాది ఇండ్లు కట్టించాడు. స్వయంగా 400కు పైగా ఇండ్లు కట్టాడు. ఈ పనులన్నీ చేస్తూ 22 పుస్తకాలు రాశాడు. 95వ ఏటి వరకు తన ఇంటి సమీపంలోని స్కూళ్లలో పాఠాలు చెప్పేవాడు. గొప్ప ఉపన్యాసకుడు. వీట న్నిటితోపాటు, జార్జియా స్టేట్ గవర్నర్. ఆ తరువాత అమెరికా 39వ అధ్యక్షుడు. ఆ మెదడు బలంతో క్యాన్సర్‌ను గెలిచి 100 సంవత్సరాలు బతికాడు. మానవ మెదడు చిప్ లాక్ చెయ్యబడి ఉండకపోతే ఒక మనిషి ఎన్ని పనులు చెయ్యగలడో జిమ్మీ కార్టర్ నిరూపించాడు.కృత్రిమ మేధ ప్రపంచంలో...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని ఏం చెయ్య బోతున్నదోనని చాలా చర్చ జరుగుతోంది. చాలా పనులు ఏఐ తప్పులు జరక్కుండా మనిషిని మించి చెయ్యగలదు. కనుక మును ముందు మానవులకు పని మాయమై, క్రమంగా మానవాళి జీవనమే ఆగిపోతుందా అనేది సమస్య. ఇజ్రాయెల్‌కు చెందిన యువల్ నోవా హరారీ పదేపదే ఈ విషయమే చెబుతున్నాడు. ఐతే మానవ మెదడుకు ఉన్న కొత్త ఆలోచన సృష్టి ఏఐకి ఉండదు. ఇప్పటివరకు ప్రపంచంలో సృష్టించబడ్డ ఆలోచనలను క్రోఢీకరించి ప్రపంచంలో ఏ మూలన జీవిస్తున్న వారికైనా అది అందిస్తుంది. కానీ కొత్త క్రియాశీల ఆలోచనలు, అంచనాలను మానవ మెదడు మాత్రమే చెయ్యగలదు. ఐతే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కుల–ఏకవృత్తి పెళ్ళిళ్ల వల్ల తరాలు, తరాలు లాక్ చెయ్యబడ్డ మెదళ్ళతో పుట్టాం.అందుకే అతి చిన్న దేశంలోని ఇజ్రాయెలీలు సృష్టించగలిగిన కొత్త ఆలోచనలు మన దేశంలోని మనుషులు చెయ్యలేకపోతున్నారు. మత మూఢ నమ్మకాలు తర తరాల మెదళ్ళను క్రియేటివ్ ఆలోచనలోకి పోనియ్యక పోవడం కూడా మరో ప్రతిబంధకం. ఇది మన దేశంలో జరిగింది. ఇతర దేశాల్లో కూడా జరిగింది. ముస్లిం దేశాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.వేల ఏండ్లు మెదడు చిప్ లాకై ఉన్నప్పుడు అలా ఉన్నదని సమాజం కనుక్కోడానికే చాలా కాలం పడుతుంది. దళితులు, ఆది వాసులు, శూద్రులు, స్త్రీలలో చదువుకునే అవకాశం లేనప్పుడు ఇంత పెద్ద మానవ జెనెటిక్ సైన్సు సమస్య ఉన్నదని గుర్తించడం, దానికి పరిష్కారం వెతుక్కోవడం, దాన్ని కులాల చేత, మతాల చేత ఒప్పించడం చాలా పెద్ద సమస్య. మన దేశంలో ఈ విధమైన సమస్యను లాబరేటరీకి, సోషల్ సైన్సు పాఠాల్లోకి తీసుకుపోవడం చాలా కష్టం. అయితే ఇతర దేశాల్లోని ప్రయోగాలు, అన్ని రంగాల్లో రచనలు, వీడియో చర్చలు బయటికి వస్తున్న నేపథ్యంలో మన దేశంలో కూడా ఆ సామాజిక వ్యాధిని కనుక్కోకపోయినా, దానికి పరిష్కారాలు వెతక్కపోయినా, మనం ఇతర దేశాలకు మానసిక బానిసలవ్వడం తప్పుదు. ఇప్పటికి జరిగింది అదే. ఇక ముందు కూడా జరుగుతుంది. కేవలం మనల్ని మనం జాతీయవాద పొగడ్తల్లో ముంచెత్తుకుంటే మనం ఉపయోగించాల్సిన మెదడు అలాగే లాక్ వెయ్యబడి ఉంటుంది. సమాజం ముందుకు కొత్త ఆలోచన తేగానే కేసులు, దాడులు మామూలయ్యే కుల–మత విలువల్లో అది మరింత నిజం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
ఇలా అయితే మగపిల్లలకి పెళ్లి అవుద్దా..!
"పెళ్లి ఎప్పుడవ్వుతుంది బాబు..నీకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు".. అని పాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతోంది మగపిల్లలున్న తల్లిదండ్రులకు. విజ్ఞానం గొప్ప జ్ఞానం ఇవ్వాలే గానీ అతి తెలివి, అత్యాశని ఇవ్వకూడదు. ఆ విధంగా విద్యను ఆర్జించకూడదు కూడా. కానీ ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు ఇలానే ఉన్నాయి. వారి కోరికలకు అంతులేదు. వారి అంచనాలకు సరితూగలేకపోతున్నామనే వ్యధలో పెళ్లికానీ ప్రసాదులుగా మిగిలిపోతున్నారు చాలామంది. చెప్పాలంటే వివాహం ఓ వ్యాపారంగా మారిపోయింది. ఈడు జోడు అన్న మాటకు తావులేకుండా పోయింది. ఇంతకుముందు కట్నలు ఇవ్వలేక లభోదిభోమనే ఆడపెళ్లివారే డిమాండ్ చేసే స్థాయికి చేరిపోయింది పరిస్థితి. ఈ పరిణామం బాగుందనిపించినా..వాస్తవికతకు అద్దం పెట్టేలా సమంజసమైనా డిమాండ్లు ఉంటే బావుండు..ఇదేంటిది అని పారిపోయేలా ఉంది పరిస్థితి. అస్సలు మగవాళ్లకి పెళ్లి అవుద్దా?. మ్యాచ్ సెట్ అవుద్దా..? అనే సందిగ్ధ స్థితికి వచ్చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే ఏ కుర్రాడికైనా పెళ్లి కుదిరిందంటే..అదృష్టవంతుడివిరా అనాల్సి వస్తోంది. అంతలా పెళ్లి కరువు తాండవిస్తోంది మగపిల్లలకి. ఎందుకిలా..? ఇది మంచి పరిణమామేనా అంటే..ఒకప్పుడు పెళ్లిళ్లు ఇరువైపుల పెద్దలు ఈడు-జోడు, స్థాయిలు చూసుకుని చక్కగా కుదర్చుకునేవారు. ఈజీగా పిల్లలకు ముడిపెట్టేసేవారు. హైరానా పడేవారు కాదు. కానీ ఇప్పుడు పెళ్లి అనే రెండక్షరాల పదమే భయానకం అనేలా హడలెత్తిస్తోంది. ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులు భయంగుప్పిట్లో బతుకీడుస్తున్నారు. ఒకప్పడు మా అబ్బాయి ఈ ఉద్యోగం చేస్తున్నాడు..కట్నం ఇంత అని డిమాండ్ చేసే నోళ్లు కాస్త తడబుడుతున్నాయి. అమ్మాయినిస్తే అదే పదివేలు అనే పిరిస్థితికి వచ్చేశారు. ఎందుకిలా అంటే..పెరుగుతున్న టెక్నాలజీ మనకు విజ్ఞానం ఇస్తోందో లేదో చెప్పలేకపోతున్నా..బంధాలను కాలరాసుకునే అజ్ఞానాన్ని సముపార్జిస్తున్నాం అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ టెక్నాలజీ సాయంతోనే కడుపులో ఉంది ఆడపిల్ల ? మగపిల్ల అని ముందుగా తెలుసుకుని వాళ్లని భూమ్మీద పడనీయకుండా చేశాం. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. అదే నేటి ఈ దుస్థితికి కారణం కూడా. అందువల్లే పిల్లనిచ్చేవాళ్లు దొరకడం లేదని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పోటీ పడి మరీ చదువుకుంటున్నారు. వారికంటే మెరుగ్గా ఉండేస్థాయికి చేరుకుంటున్నారు. వారి కాళ్లపై వారు నిలబడి బతికే స్థాయిలో ఉంటున్నారు కూడా. ఇది మంచి శుభపరిణామమే కానీ..దీన్నే చూసుకుని ఆడిపిల్లలు తల్లిదండ్రులు అంచనాలు ఓ రేంజ్‌కి వెళ్లిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే "గొప్ప" కాస్తా ఇగోగా మారిపోయింది. మా అమ్మాయి మీ అబ్బాయికి తక్కువ కాదు అనేస్థితికి వచ్చేసి.. అణుకువకు తిలోదాకాలు ఇచ్చి "అహాం" తలెకెక్కించుకుంటున్నారు. అంటే విద్యావంతులుగా మారుతున్నాప్పుడు తక్కువ ఎక్కువలకు చోటిస్తే..అది చివరకు ఏ స్థాయికి తీసుకొస్తుందో ఊహించలేం. ఇక్కడ సరిజోడికి తావివ్వకపోయినా..కనీసం ఒక్కటవ్వనున్న జంట ఇష్టాలకు ప్రాధాన్యత, వారి ఫైనాన్షియల్ స్థితి చూస్తే బాగుండు. కానీ అంతకు మించి అంటున్నారు ఆడిపిల్లల తల్లిదండ్రులు. జస్ట్ 25 నుంచి 30 ఏళ్లలోపు ఏ మగపిల్లవాడైనా..మహా అయితే రూ. 30-50 వేలు లేదా లక్షలోపు సంపాదించగలరు. ఎక్కడో మహా ఇంటిలిజెంట్స్ లక్షల్లో వేతనాలు అందుకోగలరు. దాన్ని ఆలోచింకుండా ఓ కారు, బంగ్లా, లక్షల్లో జీతాలు, అత్తమామలు పక్కన ఉండకూదు అనే అంచనాలు ఉంటే..పెళ్లి అనే పదం బరువైపోతుంది. చెప్పాలంటే ఈ అంచనాలను చేరుకోవడం అందరికీ సాద్యం కాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న జీవనవిధానానికి ఇరువురు ఉద్యోగాలు చేస్తే కుటుంబాన్నిబ్యాలెన్స్ చేయగలరా లేదా అన్నదానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మన అమ్మాయిని మంచిగా చూసుకోగలడా, బాధ్యతయుతంగా ప్రవర్తించగలడా అన్నది పరీక్షించండి అంతే తప్ప ఇలా గొంతెమ్మ కోరికల లిస్ట్ ముందే పెడితే..ఏ వరుడి తల్లిదండ్రులు ముందుకు రాగలరు. ఈ కారణాలతోనే చాలామంది అబ్బాయిలకు పెళ్లి అవ్వడం కష్టమవుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఇంకొకటి కూడా ఉంది. పెళ్లితో బాధ్యతలు తెలుసుకుని సంసారాన్ని చక్కబెట్టే స్థాయికి వచ్చిన వాళ్లు ఉన్నారనే విషయాన్ని గుర్తు ఎరగండి. సర్దుకుపోవడం, అణుకువ, బాంధవ్యాన్ని నిలబెట్టుకోవడం వంటి విలువైన పదాలకు వాల్యు ఇవ్వండి అప్పుడూ పెళ్లికి అర్థం..పరమార్థం ఉంటుంది. ఇలా పిచ్చి పిచ్చి అంచనాలతో పెళ్లిళ్లు చేయడం..అవతలవాళ్లు పెళ్లి కోసం అబద్ధాలు చెప్పడం...చివరికి ఒకరికొకరు మోసం పోయామని అరవడం..కోర్టుల చుట్టూ తిరగడం..మన వివాహ వ్యవస్థ గొప్పది..అది వ్యాపారంగా మార్చుకోవద్దు. భవిష్యత్తులో హాయిగా ఉంచే ఓ గొప్ప ఇన్వెస్టెమంట్గా చూడొద్దు. జీవితం అనేది ఎంతో విలువైనది..ఏరోజు ఎవరంటారో తెలియని స్థితి..ఉన్నన్నిరోజులు సంతోషంగా హాయిగా ఉండేలా వర్తమానానికి విలువ ఇద్దాం. ప్రస్తుతం ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అయ్యి చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కూడా పోస్ట్‌లలో ఇదే ఏకరవు పెడుతున్నారు కాబట్టి పెద్దలు ఆలోచనా తీరు మార్చుకోండి..వయసు దాటక ముందే పిల్లలకు పెళ్లి చేసి హాయిగా ఉండండి. Salary expectations of groom during wedding matches is insane … <1L / month are not even being considered if person is in IT Mindset of parents requires RESET. How can 28 year old earn 1-2L, have own car and a house ??Your generation had all these for retirement#Life— Vineeth K (@DealsDhamaka) January 6, 2025 (చదవండి: సేద్యంలో మహిళా సైన్యం!) -
కలిసే దూరంగా ఉందాం!
పెళ్లయిన కొత్తలో ఆమె ఏం చెప్పినా, చేసినా అతనికి ఎంతో ఇష్టం. ఇద్దరికీ నచ్చిన ఫుడ్, నచ్చిన రంగు, నచ్చిన హాలిడే వెకేషన్. కొన్నాళ్లు గడిచాక సీన్ రివర్స్. ఏం చేసినా తప్పే. చేయకపోయినా తప్పే. టాయిలెట్ కమోడ్ మూత వేయకపోతే మాటల యుద్ధం. మంచంపై తడిసిన తువ్వాలు కనిపిస్తే పెద్ద వాగ్వాదం. ఏసీ నంబర్ పెంచినా, తగ్గించినా పట్టరానంత కోపాలు. పెద్దలు కుదిర్చిన పెళ్లికావొచ్చు మనసులు కలిపిన ప్రేమ వివాహం కావొచ్చు. కీచులాటలు కామన్. ఇలా కొట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోతే బాగుండు అనే జంటలు కోకొల్లలు. శాశ్వతంగా విడిపోకుండా దూరం దూరంగా వేర్వేరు ఇళ్లలో ఉంటూ ఒకరికిపై మరొకరు గాఢమైన ప్రేమానుబంధాలను పెంచుకునే కొత్త ధోరణి ఇప్పుడు మొగ్గ తొడిగి వేగంగా విస్తరిస్తోంది. దీనికే ఇప్పుడు చాలా జంటలు ‘దూరంగా కలిసి బతకడం( లివింగ్ అపార్ట్ టుగెదర్ ) అనే కొత్త పేరు పెట్టి ఆచరిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్‌లోని విశేషాలను తెల్సుకునేందుకు ఆయా జంటల జీవితాల్లోకి ఓసారి తొంగిచూద్దాం.. ఏమిటీ ఎల్ఏటీ? లివింగ్ అపార్ట్ టుగెదర్ (ఎల్ఏటీ) గురించి 19వ శతాబ్దానికి చెందిన లెబనాన్ మూలాలున్న అమెరికన్ రచయిత కహ్లిల్ గిబ్రాన్ తన ‘పెళ్లి’కవితలో తొలి సారిగా ప్రస్తావించారు. భా ర్యభర్తలు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ తమ అహం కిరీటం కిందపడొద్దనే కారణంగా తమ మాటే నెగ్గాలనే మొండిపట్టుదలతో చిన్నపాటి వాగ్వాదాలకు దిగుతారు. తర్వాత బాధపడతారు. మళ్లీ అంతా సర్దుకోవడానికి కాస్తంత సమ యం పడుతుంది.ఇప్పుడున్న ఆధునిక యుగంలో భార్యాభర్తలిద్దరూ సొంత కెరీర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, వృత్తుల్లో నిమగ్నమవుతున్నారు. పని కోసం వేరే చోట ఉండాల్సి రావడం, వ్యక్తిగత అభిప్రాయాలకు గౌరవించాల్సి రావడం, అన్యోన్యంగా ఉన్నాసరే కొన్నిసార్లు వ్యక్తిగత ఏకాంతం(పర్సనల్ స్పేస్) కోరుకోవడం వంటివి జరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గంగా జంటలే తమకు తాముగా ఎల్ఏటీకి జై కొడుతున్నాయి. చినికిచినికి గాలివాన దుమారంగా మారే ప్రమాదాలను దూరం దూరంగా ఉండటం వల్ల తప్పించుకోవచ్చని జంటలు భావిస్తున్నాయి.ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తూనే ఇలా దూరంగా ఉంటూ మానసికంగా అత్యంత దగ్గరగా ఉంటున్నామని ఎల్ఏటీ జంటలు చెబుతున్నాయి. ‘‘సాన్నిహిత్యంలోనూ కా స్తంత ఎడం ఉంచుదాం. ఈ స్వల్ప దూరా ల్లోనే స్వర్గలోకపు మేఘాల స్పర్శను స్పశిద్దాం’’అంటూ జంటలు పాటలు పాడుకుంటున్నాయని కవి గిబ్రాన్ ఆనాడే అన్నారు. ఎవరికి బాగా నప్పుతుంది?వేర్వేరు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే జంటలు ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యమైన పనుల మీద దూరంగా, విదేశాల్లో గడపాల్సిన జంటలు ఈ మార్గంలో వెళ్లొచ్చు. వ్యక్తిగత ఏకాంతం కోరుకుంటూనే జీవిత భాగస్వామికి అత్యంత విలువ ఇచ్చే జంటలూ ఈ సిద్ధాంతం తమకు ఆమోదయోగ్యమేనని చెబుతున్నాయి. వేర్వేరు కార్యాలయాలు, భిన్న వృత్తుల్లో, విభిన్న సమయాల్లో పనిచేసే జంటలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామికి అతిభారంగా మారకూడదని, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడదామని భావించే జంటలూ ఈ ట్రెండ్‌ను ఫాలో కావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎలా సాధ్యం?కథలు, సినిమాల్లో, నవలల్లో ప్రస్తావించినట్లు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులను విరహవేదన కాల్చేస్తుంది. అదే వేదన ఈ జంటలకు ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కలిసిమెలిసి ఉంటేనే బంధం బలపడుతుందన్న భావనకు భిన్నమైన సిద్ధాంతం ఇది. కాస్తంత కష్టపడితే ఈ బంధాన్నీ పటిష్టపరుచుకోవచ్చని మనోవిజ్ఞాన నిపుణులు చెప్పారు. ‘‘వారాంతాలు, సెలవు దినాల్లో ఒకరి నివాస స్థలానికి ఇంకొకరు వచ్చి ఆ కాస్త సమయం అత్యంత అన్యోన్యంగా గడిపివెళ్తే చాలు. తమ మధ్య దూరం ఉందనే భావన చటక్కున మటుమాయం అవుతుంది.కలిసి ఉన్నప్పటి సరదా సంగతులు, మధుర స్మృతులను మాత్రమే టెక్ట్స్ రూపంలో సందేశాలు పంపుతూ గుర్తుచేసుకుంటూ ప్రేమ వారధికి మరింత గట్టిదనం కల్పించొచ్చు. కలిసి ఉన్నప్పుడు జరిగిన గొడవలను భూతద్దంలోంచి చూడటం మానేయాలి. ఆధునిక జంటల్లో స్వతంత్ర భావాలు ఎక్కువ. గతంతో పోలిస్తే వ్యక్తిగత ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పాత, చేదు విషయాలను తవ్వుకోవడం తగ్గించాలి’’అని ఢిల్లీలోని ఎల్ఏటీ నిపుణుడు రుచీ రూహ్, మానసిక నిపుణుడు, జంటల మధ్య మనస్పర్థలను తగ్గించే డాక్టర్ నిషా ఖన్నా సూచించారు. చివరగా చెప్పేదేమంటే? విడివిడిగా జీవించే సమయాల్లో ఇద్దరి మధ్యా నమ్మకం అనేది అత్యంత కీలకం. ఆర్థిక, శారీరక, మానసిక అంశాలను నిజాయతీగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకుని కష్టాల కడలిలోనూ జీవననావ సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? ఎంతసేపు కలవాలి? ఏమేం చేయాలి? అనేవి ముందే మాట్లాడుకుంటే వేచి చూడటం వంటి ఉండవు. అనవసర కోపాలు, అపార్థాలు రావు. భారత్‌లో బ్రతుకు దెరువు కోసం లక్షలాది కుటుంబాల్లో పురుషులు వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వలసవెళ్తూ భార్యను గ్రామాల్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు.విశాల దృక్పథం, మానసిక పరిణతి కోణంలో చూస్తే భారత్‌లో దశాబ్దాలుగా ఎల్ఏటీ సంస్కృతి ఉందనే చెప్పాలి. ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా నోయిడా, గుర్గావ్, ఢిల్లీ, ముంబైలలో ఇద్దరూ పనిచేసే చాలా జంటలు ఇదే సంస్కృతిని ఆచరిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, సొంతూర్లలో వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతల కారణంగా మెట్రో నగరాల్లో చాలా జంటలు దూరంగా ఉంటున్నాయి. పశ్చిమదేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి బాగా విస్తరిస్తోంది. -
వివాహాల గూఢచారి...భావనా పాలివాల్
గతంలో పెళ్లిళ్ల పేరయ్య ఏం చెప్తే అది. లేదా తెలిసిన వారి ఎంక్వయిరీతో సరి. ఇప్పుడు మాత్రం ఎవరినీ ఎవరూ నమ్మడం లేదు. ఏకంగా గూఢచారుల రిపోర్టు తెప్పించుకుంటున్నారు. ఈ కాలం పెళ్ళిళ్లలో అబ్బాయి, అమ్మాయిల కాండక్ట్‌ను కనిపెట్టి చెబుతున్న ‘మ్యారేజ్ డిటెక్టివ్’లు పెరిగారు. ఢిల్లీకి చెందిన భావనా పాలివాల్ వీరిలో ముందు వరుసలో ఉన్నారు. ఈమె ఏం చేస్తుంది? పెళ్లిళ్ల పరిశోధన ఎందుకు అవసరమని చెబుతోంది?పెళ్లి అనగానే ఖర్చులు రాసుకోవడం మొదలెడతారు ఇటు పక్షం వాళ్లు, అటు పక్షం వాళ్లు. కల్యాణ మంటపం, బట్టలు, నగలు, భోజనాలు... ఇప్పుడు మరో ఖర్చు కూడా చేరుతోంది. డిటెక్టివ్ ఖర్చు. ప్రేమ పెళ్ళిళ్లయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లయినా ‘సరిగ్గా ఆచూకీ తీసి’ పెళ్లి చేయాలనే నిర్ణయం ఎక్కువ కుటుంబాలలో కనిపిస్తోంది. మెట్రో నగరాలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో. అందుకే 48 ఏళ్ల భావనా పాలివాల్ నిత్యం బిజీగా ఉంటోంది. ఈమెకు ఢిల్లీలో ‘తేజాస్ డిటెక్టివ్ ఏజెన్సీ’ ఉంది. ఈమెకు రోజుకు 4 కేసులు వస్తాయి– డిటెక్టివ్ పని చేసి పెట్టమని. కావాల్సిన వివరాలను బట్టి 50 వేల నుంచి లక్షన్నర వరకూ ఫీసు తీసుకుంటుందామె.నమ్మకం కోసం:‘ఊర్లలో పెళ్లిళ్ల పేరయ్యల, ఉమ్మడిగా తెలిసిన బంధువులో మిత్రులో చెప్పే మాటల వల్ల పెళ్ళిళ్లు ఖరారు అయ్యేవి. నగరంలో వివిధ మెట్రిమోనియల్ ఏజెన్సీల ద్వారా సంబంధాలు కలుపుకుంటున్నారు. లేదంటే సోషల్ మీడియా పరిచయాలు పెళ్ళిళ్ల వరకూ వెళుతున్నాయి. అయితే ఎవరు ఎలాంటివారో తెలిసేది ఎలా అందుకే మమ్మల్ని సంప్రదిస్తున్నారు’ అంటుంది భావనా పాలివాల్. ఢిల్లీలో ఈమెలాంటి వారు– మెట్రిమోనియల్ డిటెక్టివ్స్ లేదా వెడ్డింగ్ డిటెక్టివ్స్ ఐదారుగురు ఉన్నారు. ‘జీతం ఎంత, వేరే వారితో లైంగిక సంబంధాలు ఉన్నాయా, అబద్ధాలు ఏమైనా చెబుతున్నారా’ అనేది వీళ్లు కనిపెట్టి చె΄్పాలి.పెళ్లికి ముందు జాగ్రత్త‘పెళ్లికి ముందు సరిగ్గా కనుక్కుంటే పెళ్లి తర్వాత సరిగ్గా కనుక్కోలేదే అనే బాధ ఉండదు. ఈ మధ్య వచ్చిన అమెరికా సంబంధంలో వరుడు సంవత్సరానికి 70వేల డాలర్లు సంపాదిస్తున్నానని చె΄్పాడు. మా ఎంక్వయిరీలో పావు వంతు కూడ లేదని తేలింది. సంబంధం కేన్సిల్ చేశాం. మరో కేసులో కూతురు ప్రేమించిన కుర్రవాడి మీద నిఘా పెట్టి రిపోర్ట్ ఇవ్వమని కూతురి తల్లి ఫీజు చెల్లించింది. దానికి కారణం ఆమె పెళ్లి విఫలమైంది. కూతురిది కూడా కాకూడదనే. ప్రేమ పెళ్లికి సమ్మతమే అయినా కుర్రాణ్ణి అన్ని విధాలుగా తెలుసుకునే ‘ఎస్’ అనాలని ఆ తల్లి ప్రయత్నం. మేం దానికి సహకరించాం’ అందామె. మరికొందరైతే కుర్రాడు హోమో సెక్సువల్ అవునా కాదా తేల్చి చెప్పమని అడుగుతారట. ‘అబ్బాయి హోమో సెక్సువల్ అయ్యి పెళ్లి వద్దు మొర్రో అంటున్నా సంఘం కోసం తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. అందుకే ఇలాంటి ఎంక్వయిరీలూ వస్తున్నాయి’ అని తెలిపింది భావన. గతంలో జర్నలిస్టుగా పని చేసిన భావన ఆ వృత్తిలో సంతృప్తి దొరక్క ఇలా డిటెక్టివ్‌గా మారానని అంటోంది.ఆధునిక పరికరాలుప్రయివేట్ డిటెక్టివ్ ఏజెన్సీలకు చట్టపరమైన అనుమతి ఉంది. కాబట్టి వారు పని చేయవచ్చు. అయితే అనైతిక పద్ధతుల్లో పరిశోధన చేయకూడదు. అదీగాకప్రాణాపాయ ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే డిటెక్టివ్లు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తారు. కెమెరాలు, జిపిఎస్ ట్రాకర్లు, సూక్ష్మమైన మైక్‌లు... ఇవన్నీ నిజమేమిటో అబద్ధమేమిటో చెబుతాయి. ‘వధువరుల వయసు, చదువు, ఆస్తిపాస్తులు, గతంలో విఫల ప్రేమలు, ఎంగేజ్మెంట్ వరకూ వచ్చి ఆగిపోయిన సంబంధాలు, రెండో పెళ్లి... ఈ వివరాల్లో వీలున్నంత వరకూ తెలియచేసి పెళ్లికి వెళ్లాలి. లేకపోతే వాటిలోని అబద్ధాలు పెళ్లయ్యాక మెడకు చుట్టుకుంటాయి’ అంటుంది భావన.పెళ్లికి సిద్ధమయ్యి...అన్నింటికి మించి ఈ స్థితికి వధువరుల ఆమోదయోగ్యమైన సంసిద్ధత లేకపోవడమే గొడవలకు ముఖ్యకారణం అంటారు మానసిక నిపుణులు. ‘పెళ్లి వ్యవస్థను విశ్వసించి దానిలో అవసరమైన కమింట్మెంట్, సహనం, అడ్జస్ట్మెంట్, నిజాయితీ... వీటన్నింటి పట్ల పూర్తి అవగాహనతో పరిణితి వచ్చాకే పెళ్లికి ఎస్ అనాలి వధూవరులు. లేకుంటే పెళ్లయిన వెంటనే గొడవలు మొదలవుతాయి. డిటెక్టివ్లు వాస్తవాలు తెలియచేస్తారు. కాని పెళ్లి నిలబడేది ప్రేమ, నమ్మకాల వల్లే. వాటిని తమలో బేరీజు వేసుకుని పెళ్లికి సంసిద్ధం కావాలి’ అని తెలియచేస్తున్నారు వారు. లేకపోతే భావన వంటి వారికి పని పెరుగుతూనే ఉంటుంది. -
48లక్షల పెళ్లిళ్లు.. రూ.5.76లక్షల కోట్లు ఖర్చు
సాక్షి అమరావతి: జూన్ నెలాఖరు నుంచి సరైన ముహూర్తాలు లేవు. వివాహాలు, శుభకార్యాలు వాయిదా పడుతూ వస్తు న్నాయి. ఎట్టకేలకు ఇక ముహూర్తం కుదిరింది. వధూవరులు ఒక్కటయ్యే తరుణం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శనివారం నుంచి పెళ్లి సందడి అంబరాన్ని తాకనుంది. ఈ ఏడాది చివరి వరకు ఇది కోలాహలం కొనసాగనుంది. అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 81 మధ్య 23 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ఘడియల్లో దాదాపు 48లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాన్సెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఎఐటీ) తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023వ సంవత్సరంలో చివరి మూడు నెలల్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. సుమారు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు ఉన్న ముహూర్తాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 48లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క పెళ్లి వేడుకకు సగటున రూ.12 లక్షలు ఖర్చు పెడతారని అంచనా. ఈ లెక్కన ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.5,76 లక్షల కోట్లు ఖర్చు అవుతుం దాని ప్రాథమికంగా లెక్క తేల్చారు.షాపింగ్ సందడి షురూ..దసరా పండుగతోపాటు పెళ్లిళ్ల షాపింగ్ కూడా కొందరు. ప్రారంభించారు. దీంతో మార్కెట్లో సైతం సందడి నెలకొంది. భోజనాలు, క్యాటరింగ్, కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, డెకరేషన్లకు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖల ప్రీం టింగ్స్, ఫ్లెక్సీ ప్రింటర్స్, ఫొబో గ్రావర్లు, టెంట్ హౌస్, వంటమేస్త్రీలు, ముట పనివాళ్లు, క్యాటరింగ్ బాయ్స్, బ్యూటీ మనన్లు, మెహందీ ఆది పూలు అమ్మేవాళ్లు, మంగళ వాయిద్య కళాకారులు, డీజే మ్యూజి నివ్వాహకులు ఇలా పెళ్లి వేడుకతో ప్రతి ఒక్కరిని ముందుగానే ఎంపిక చేసుకుని అడ్వాన్సులు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. దేశంలో సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి సంపన్నుల వరకు పెళ్లి వేడుక అన్నట్లుగా ఖర్చు చేస్తున్నారు. ఎంగేజ్మెంట్, ఫ్రీ వెడ్డింగ్, హల్దీ, రిసెప్షన్ పోస్ట్ వెడ్డింగ్... ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకకు రాజీపడకుండా నిర్వహిస్తున్నారు. అందువల్ల ఈ ఏడాది చివరి వరకు దేశవ్యాప్తంగా పెళ్లి సందడి ఉంటుందని సీఏఐటీ వెల్లడించింది.ముహూర్తాలు.. ఇవీ అక్టోబర్ 12, 13, 16, 20,27వ తేదీల్లో మహూర్తాలు ఉన్నాయి. నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 16,17. డిసెంబర్లో 5,6,7 8, 11, 12, 14, 15, 26 వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి మాసం ప్రారంభం కావడంతో మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలు వరకు శుభ ముహూ కోసం ఆగాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఏడాురు దీపావళి తర్వాత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉపనయనాలు, గృహప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతాయని అంచనా. -
పెండ్లిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు?
వివాహ సంప్రదాయంలో తలంబ్రాల వేడుక చూడముచ్చటగా సాగుతుంది. వధూవరులు పోటాపోటీగా ఇందులో పాల్గొంటారు. మాంగల్య ధారణ తర్వాత జరిగే తంతు ఇది. తలంబ్రాలకు ఎంచుకునే బియ్యానికి కొన్ని కొలతలు ఉంటాయి. అవి ఆయా ఇంటి ఆచారాలను బట్టి ఉంటుంది. ఇందులో విరిగిన బియ్యం వాడకూడదు. తలంబ్రాల వేడుకలో పఠించే మంత్రాల్లో విశేషమైన అర్థాలు ఉంటాయి. అవి సంసార బాధ్యతలను గుర్తుచేస్తాయి.మొదట తలంబ్రాలను కొబ్బరి చిప్పలో పోసి, రాలతో ్రపోక్షించి వధూవరులకు అందిస్తూ దానం, పుణ్యం చేయాలని, శాంతి, పుష్టి, తుష్టి వృద్ధి కలగాలని, విఘ్నాలు తొలగి ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమం, మంగళం కలగాలని, సత్కర్మలు వృద్ధి చెందాలని, తారలు, చంద్రుని వల్ల దాంపత్యం సజావుగా సాగి, సుఖశాంతులు కలగాలని’ పురోహితుడు మంత్ర పఠనం చేస్తాడు.మొదటగా వరుడు వధువు శిరస్సున పోస్తాడు. ఆ సమయంలో ‘నీవలన సత్సంతాన మృద్ధి జరుగునుగాక‘ అను మంత్రాన్ని చదువుతారు. వధువు చేత ‘పిడిపంటలు వృద్ధియగునుగాక‘ అను మంత్రాన్ని చదువుతూ తలంబ్రాలు పోయిస్తారు. మూడోసారి వరుడిచేత ‘ధన ధాన్య వృద్ధి జరుగునుగాక‘ అంటూ తలంబ్రాలు వధువు శిరస్సుమీద పోయిస్తారు. ఆ తర్వాత ఆ తలంబ్రాలను అన్నింటినీ వధూవరులు ఉల్లాసంగా ఒకరి శిరస్సున ఒకరు దోసిళ్ళతో పోసుకుంటారు. ఆ తర్వాత, వారి దాంపత్య బంధం ఆజన్మాంతం వర్ధిల్లాలను విషయానికి సూచనగా, వారి కొంగులను ముడివేస్తారు. దీనినే బ్రహ్మముడి/ బ్రహ్మగ్రంధి అంటారు. -
ఏటా జరిగే వివాహాలు 2.5 లక్షలు..
సాక్షి, హైదరాబాద్: వివాహ రిజిస్ట్రేషన్లు ఓ మోస్తరుగానే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఏటా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయనే అంచనా ఉండగా, రిజిస్ట్రేషన్లు మాత్రం లక్షలోపే ఉంటున్నాయని లెక్కలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2019–20 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏటా సుమారు 90 వేలకు పైగా మాత్రమే వివాహ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఐదేళ్ల కాలంలో కూడా ఈ సంఖ్యలో మార్పు లేకపోవడం విశేషం. అయితే..2023–24లో మాత్రం ఈ రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజా నివేదికలో వెల్లడైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా 1.09 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు జరిగాయని తేలింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే గ్రేటర్ పరిధిలోనే 40 శాతం వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2023–24 సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 15,733 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రంగారెడ్డిలో 13,502, హైదరాబాద్ జిల్లాలో 10,925 మంది తమ వివాహాలను రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్లో 14,027, వరంగల్ జిల్లాలో 11,565 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఐదు జిల్లాల్లోనే సగం రిజిస్ట్రేషన్లు జరగ్గా, మిగిలిన ఏడు రిజి్రస్టేషన్ జిల్లాల్లో కలిపి మరో సగం జరగడం గమనార్హం. ఏ డాక్యుమెంట్లు కావాలంటే...! వివాహ రిజిస్ట్రేషన్ల విషయంలో అలసత్వం వద్దని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు పెద్దగా సమయం పట్టదని, స్లాట్ బుక్ అయిన రోజునే పూర్తవుతుందంటున్నారు. అయితే డాక్యుమెంట్లు పూర్తిస్థాయిలో సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి పత్రిక, 2 పెళ్లి ఫొటోలు, వధూవరుల ఆధార్‌కార్డులు, వయసు ధ్రువీకరణ పత్రం, ముగ్గురు సాక్షులు, వారి ఆధార్ కార్డులు తప్పకుండా ఉండాలి. వివాహానికి చట్టబద్ధత కల్పించడంతోపాటు విదేశాలకు వెళ్లాలనుకునే దంపతులకు ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ఇటీవలి కాలంలో వివాహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆధార్ కార్డులో చిరునామా మార్పు కావాలన్నా, కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఈ సర్టిఫికెట్ అవసరం. అయితే, కల్యాణలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవసరమవుతోంది. కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి కోసం ఏడాదికి 2 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తుండగా, అందులో ఎక్కువగా స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు) ఇచ్చే వివాహ ధ్రువపత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, స్థానిక సంస్థల్లో ధ్రువపత్రాలు ఒకసారి, వివాహాల రిజిస్ట్రేషన్లు మరోసారి కాకుండా నేరుగా సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇతర అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. గతం కంటే అవగాహన పెరిగింది కానీ..అది సరిపోదని, ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సి ఉంది. జరిగే ప్రతి వివాహం రిజి్రస్టేషన్ అయితేనే అన్ని విధాలుగా మంచిదని సూచిస్తున్నాయి. -
ఛేజ్ చేసి పట్టుకుంటే.. చాల్లే ఊరుకోమన్నారు!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీ సీసీసీ)లో శుక్రవారం జరిగిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్–2024కు అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్ ఎం.భగవత్ ప్యానల్ స్పీకర్‌గా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) క్యాడర్‌కు రావడానికి ముందు ఆయన కొన్నాళ్లు మణిపూర్‌లో పని చేశారు. వివాహాలకు సంబంధించి అక్కడ, భద్రత కోణంలో న్యూయార్క్‌లో తనకు ఎదురైన అనుభవాలను ఆయన పంచుకున్నారు. అక్కడ ఎస్పీ కూడా అలానే వివాహం చేసుకున్నారట...నేషనల్ పోలీసు అకాడమీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1997లో ట్రైనీ ఏఎస్పీ హోదాలో మణిపూర్‌లోని ఓ పోలీసుస్టేషన్‌కు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా పని చేశా. ఓ రోజు ఠాణాలో ఉండగా నలుగురు యువకులు ఓ యువతిని కిడ్నాప్ చేశారంటూ ఫోన్ చేసిన వ్యక్తి వాళ్లు వెళ్లిన వాహనం నెంబర్ కూడా చెప్పారు. వెంటనే అప్రమత్తమై అందుబాటులో ఉన్న సిబ్బందితో కలిసి రంగంలోకి దిగా. నాలుగు కిలోమీటర్లు ఛేజ్ చేసి కిడ్నాపర్ల వాహనాన్ని పట్టుకుని యువతిని రెస్క్యూ చేశాం. వాళ్లను ఠాణాకు తీసుకువచి్చన తర్వాత మా ఎస్పీకి ఫోన్ చేసి పెద్ద ఆపరేషన్ చేశానని చెప్పాం.దీనికి ఆయన ఫక్కున నవ్వుతూ తానూ అలాంటి గాంధర్వ వివాహమే చేసుకున్నానని అన్నారు. అలాంటప్పుడు ఫిర్యాదు, కేసు ఎందుకని ప్రశ్నించా. ‘‘అది అక్కడ ప్రొసీజర్ అని, కేసు పెట్టి ఇరుపక్షాలను ఠాణాకు పిలవాల్సిందేనని’’అన్నారు. ‘‘ఆపై యువతీయువకులు తమ సర్టిఫికెెట్లు చూపించి మేజర్లుగా నిరూపించుకుంటారు. వారి కుటుంబీకులకు కౌన్సెలింగ్ చేసి అప్పగిస్తే మూడునాలుగు రోజులకు మరోసారి ఘనంగా వివాహం చేస్తారు ’’అని ఎస్పీ చెప్పడంతో నాకు ఆశ్చర్యమేసింది. అమెరికాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడిగితే అనుమానించారు...అమెరికాలో వ్యాపార ఆసక్తి కంటే దేశ భద్రతపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. 2001లో జరిగిన 9/11 ఎటాక్స్ తర్వాత ఇది చాలా పెరిగింది. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం యాంటీ టెర్రరిజం శిక్షణ కోసం ఓ పోలీసు బృందాన్ని అమెరికా పంపింది. ఆ బృందంలో నేను కూడా ఉన్నా. అప్పట్లో నక్సలిజం చాలా ఎక్కువగా ఉండటంతో భద్రతాపరంగా అనేక చర్యలు తీసుకునేవాళ్లం. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడిగా. విక్రయించనంటూ నిర్మొహమాటంగా చెప్పేసిన దాని యజమాని బయటకు వచ్చి నేను వినియోగించిన వాహనం నెంబర్ కూడా నోట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరైనా అలాంటి ఓ దుకాణానికి వెళ్లి అడిగితే.. వారి వద్ద లేకపోయినా పది నిమిషాలు కూర్చోమంటూ ఎన్ని కావాలంటే అన్ని తెచ్చి ఇస్తామంటారు. ఈ ధోరణి మారి వ్యాపార ఆసక్తి కంటే దేశ భద్రతపై ఆసక్తి పెరగాలి. ప్రజలను చైతన్యవంతం చేయడమే సవాల్... ఇక్కడ నివసిస్తున్న ప్రజలను నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడేలా మోటివేట్ చేయడమే పెద్ద సవాల్. నగరంలో ఉన్న హుస్సేన్‌సాగర్‌లో సరాసరిన రోజుకో ఆత్మహత్య చొప్పున జరుగుతూ ఉంటుంది. ఇలా ఆత్మహత్యకు యత్నించిన వారిని రక్షించడానికి పోలీసు విభాగం తరఫున సుశిక్షితులైన సిబ్బంది పని చేస్తున్నారు. అయితే ఆ ఉదంతం జరిగే ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న వాళ్లు మాత్రం స్పందించరు. తొలి ప్రాధాన్యం వీడియో చిత్రీకరించడానికే ఇస్తారు. తాము ఫస్ట్ సేవర్ కావాలని ఆశించడం కన్నా సోషల్‌మీడియాలో పెట్టడానికి ఫస్ట్ రికార్డర్ కావాలని భావిస్తుంటారు. దీనికి భిన్నంగా ప్రజలను మోటివేట్ చేయడమే ప్రస్తుతం సమాజంలో ఉన్న పెద్ద సవాల్. -
మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
హిందూ వివాహ వ్యవస్థలో మేనరికపు వివాహాలు సర్వసాధారణంగా చూస్తుంటాం. కుటుంబాల మధ్య సంబంధాలు నిలిచి ఉండాలనే ఆలోచనతో కొంతమంది, ఆస్తుల పరిరక్షణ కోసంమరికొంతమంది మేనత్త, మేనమామ పిల్లల మధ్య మేనరికపు వివాహాలు జరుగుతుంటాయిం. అయితే ఇలా మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్న కొన్ని కుటుంబాల్లో పిల్లలు జెనెటిక్ లోపాలతో పుట్టడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20శాతం పెళ్లిళ్లు దగ్గరి బంధువుల్లోనే జరుగుతున్నాయి. ఇలాంటి వివాహాలను వైద్య పరిభాషలో ‘కన్‌సాంగ్వినియస్ మ్యారెజెస్’ అంటారు. అసలు మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.బావ మరదలు పెళ్లి, మేనమామ మేనకోడలు పెళ్లి, ఇంకా రెండు కుటుంబాల మధ్య తరాల తరబడి కుండ మార్పిడిఅంటే వీళ్ల అమ్మాయిని, వారి అబ్బాయికి, వారి అబ్బాయిని వీరి అబ్బాయికి ఇచ్చి పెళ్లిళ్లు చేయడం. డా.శ్రీకాంత్ మిర్యాల ఎక్స్‌లో పోస్ట్ చేసిన వివరాలు.సాధారణంగా రక్తసంబందీకులు కాని తల్లిదండ్రులకి పుట్టే పిల్లల్లో సుమారు 2-4శాతం మందికి చిన్న లేదా పెద్ద అవకారాలు పుట్టుకతో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది సాధారణం. అయితే ఈ మేనరికపు వివాహాల్లో ఇది రెట్టింపు అవుతుంది. అయితే పిల్లలు అవకారాలతో పుట్టే స్థితి పైన చెప్పిన మూడింట్లో చివరిదాంట్లో ఎక్కువ. మొదటి దాంట్లో తక్కువ. ఈ ఎక్కువ తక్కువలు పెళ్లి చేసుకున్న జంటలో భార్య భర్తల మధ్య జన్యుసారూప్యం ఎంత అన్నదానిబట్టి ఉంటుంది. బావమరదళ్ల కంటే, మేనమామ మేనకోడలి మధ్య జన్యుసారూప్యం ఎక్కువ, అలాగే కుండ మార్పిడిలో అవే జన్యువులు మాటిమాటికీ పంచుకోవడం వలన ఇంకా ఎక్కువ.ఇటువంటి వివాహాలవలన అబార్షన్లు ఎక్కువవటం, మృత శిశువులు జన్మించటం, పుట్టినపిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, గుండెలో అవకారాలు, బుద్ధిమాంద్యంతో పాటు ఇతర మానసిక సమస్యలు, మెదడు జబ్బులు, రక్తహీనత మొదలైన రకరకాల సమస్యలు చాలా ఎక్కువగా కలుగుతాయి. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అవకారాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కానీ పుట్టే పిల్లలందరూ అవకారాలతో పుడతారని కాదు.అయితే ఈ వివాహాలు మిగతా వివాహాల కంటే దృఢంగా ఉండటం, విడాకుల సంఖ్య తక్కువగా ఉండటం, ఆరోగ్య సమస్యలున్నప్పుడు రెండు కుటుంబాలూ సహాయపడటం మొదలైనవి లాభాలు.ఇటువంటి వాళ్లు పెళ్లిచేసుకునేముందు జెనిటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. దీనిలో ఇప్పటికే కుటుంబంలో ఉన్న వంశపారంపర్య జబ్బుల్ని కనుక్కుని, అవి పుట్టే పిల్లలకి వచ్చే అవకాశం లెక్కగట్టి చెబుతారు. దాన్ని బట్టి కాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చు. ఇప్పటివరకూ కుటుంబంలో పెద్ద సమస్యలు లేనివాళ్లు, అవగాహన ఉంటే, ప్రేమ ఉన్న బావమరదళ్ల వరకూ ఫర్వాలేదు కానీ మిగతావి సమంజసం కాదు. -
Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
దెయ్యాల వివాహ సంప్రదాయం గురించి విన్నారా!. ఏంటిదీ ఈ రోజుల్లోనా అనుకోకుండా కొన్ని చోట్ల దీన్ని పాటిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏకంగా ఆ వివాహతంతు గురించి మ్యాట్రిమోనియల్ సైటల్లోనే ప్రకటన ఇచ్చింది ఓ కుటుంబం. అది విని అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆ ప్రకటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..సోషల్ మీడియాలో ఓ వినియోగదారుడు 2022లో ఈ ట్వీట్ గురించి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. తాను అలాంటి వివాహానికి హాజరయ్యానని చెప్పుకొచ్చాడు. ఇది మీకు పనికిరాని విషయంగా అనిపించొచ్చు. కానీ ఇలాంటివి ఈ రోజుల్లో కూడా ఉన్నాయా? ఇలాంటి సంప్రదాయల్ని పాటిస్తున్నారా అనే విషయం గురించి తెలియజేయడం కోసం ఇది షేర్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇలాంటి సంప్రదాయాలు భారత్‌లో ఎక్కువగా కేరళ, కర్ణాటకలో నిర్వహిస్తుంటారు. అలానే ఓ కేరళ కుటుంబం ఏకంగా 30 సంవత్సరాల క్రితం చనిపోయిన వధువు తగిన వరుడు కావాలంటూ ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత చనిపోయిన వరుడు కుటుంబం ఆచూకి లభించగానే..చాలా ఏళ్ల క్రితం చనిపోయిన ఆ వధువరులిద్దరికి వివాహతంతు జరిపి ఇరుకుటుంబ సభ్యులు ఒకరింటికి ఒకరు వెళ్లి భోజనాలు చేసి వచ్చారు. ముఖ్యంగా ఇలా కడుపులో శిశువుతో చనిపోయిన మహిళకి, యుక్త వయసు రాకుండానే చనిపోయిన పిల్లలకు ఇలాంటి తంతు జరిపిస్తారట. ఇలా చేస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో వృద్ధిలో ఉంటుందనేది పెద్దల నమ్మకం. వాళ్ల దృష్టిలో పిల్లల తమను విడిచిపెట్టిపోలేదని ఆత్మల రూపంలో తమ వెంటే ఉన్నారని భావించి ఇలా చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ దీన్ని పాటించడం విశేషం.(చదవండి: రోల్స్ రాయిస్ కార్లతో వీధులు ఊడిపించిన భారతీయ రాజు! ఎందుకో తెలుసా) -
17మందికి ఒకేసారి పెళ్లి..ఒకే శుభలేఖ.. హాట్ టాపిక్‌గా తాతగారు
ఒకరికి పెళ్లి చేయడమే చాలా ఖరీదైన మారిన ప్రస్తుత రోజుల్లో 17 పెళ్లిళ్లంటే మాటలా అనుకున్నాడో ఏమోగానీ రెండంటే రెండు రోజుల్లో వరుసపెట్టి మనవళ్లు, మనవరాళ్లకు సామూహిక వివాహ వేడుక జరిపించాడు. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఈ వివాహాలు జరిగాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పెద్దాయన పేరు రాజస్థాన్‌లోని నోఖా మండలం లాల్‌మదేసర్ గ్రామానికి చెందిన సుర్జారామ్. ఆయన గ్రామపెద్ద కూడా. సుర్జారామ్ వారసులు ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. ఈయనకు 17 మంది మనవళ్లు, పెళ్లికి ఎదిగి ఉన్నారు. వీరందరికీ విడివిడిగా పెళ్లి చేయడం ఖరీదవుతుందని భావించి కేవలం రెండు రోజుల్లో పన్నెండు మంది మనవరాలు, ఐదుగురు మనవళ్లు పెళ్లి చేశారు. వింతగా అనిపించినా ఇదే జరిగింది. వీరందరికి భాగస్వాములను వెతకడం కూడా విశేషమే. అంతేకాదు వీరందరికీ కే శుభలేఖను ముద్రించడం మరో విశేషం. బంధుమిత్రుల సమక్షంలో ఐదుగురు మనుమలకు ఏప్రిల్ 1న, 12 మంది మనుమరాళ్ల ముళ్ల వేడుక కాస్తా ముగించాడు.ఒకే ఇంట్లో, ఒకే వెడ్డింగ్ కార్డ్‌తో జరిగిన ఈ సామూహిక వివాహ తంతుకు అందరూ ఆశ్చర్యపోవడం గ్రామస్తుల వంతైంది. ఒకే కుటుంబంలో సామూహిక వివాహాలు జరగడం ఈ ప్రాంతంలో ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. -
చిన్నవాళ్లైనా... తప్పులు మన్నించమని కాళ్లపై పడతారు!
భారతదేశంలో అనే వివాహ ఆచారాలు,సంప్రదాయాలు ఆచరణలో ఉన్నాయి. చట్టబద్ధంగా చేసుకునే రిజిస్టర్ పెళ్లిళ్లు, వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అనేది ప్రధానంగా చూస్తాం. అలాగే అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను అత్తారింటికి పంపించే సన్నివేశం ఆమె కుటుంబ సభ్యుల్ని మాత్రమే కాదు అక్కడనుంచి వారందరి చేత కన్నీరు పెట్టిస్తుంది. తాజాగా గుజరాత్‌లోని ఒక వివాహ ఆచారం కూడా ఇదే కోవలో నిలిచింది. గుజరాత్‌లోని కచ్ పటేల్ కమ్యూనిటీ సంప్రదాయం ప్రకారం కుమార్తె వివాహ సమయంలో,కుటుంబ సభ్యులందరూ పెళ్లి కుమార్తె కాళ్లు మొక్కుతారట. ఆమె పట్ల ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించమని అందరూ అడుగుతారట. అలా ఆమె పాదాలను తాకి మన్నించమని వేడుకొని ఆమె పట్ల సంస్కారాన్ని గౌరవాన్ని చాటుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్విటర్లో షేర్ అవుతోంది. రాము జీఎస్వీ ట్విటర్ హ్యాండిల్లో ఇది షేర్ అయింది. WILL BRING YOU TEARS: This is the custom of the Kutch Patel community of Gujarat. At the time of marriage, all the members of the family touch the feet of the DAUGHTER and ask for forgiveness if there was any mistake in behaving towards her. What a culture & respect to the Girl. pic.twitter.com/Klp4ocxgMr — Ramu GSV (Modi Family) (@gsv_ramu) March 12, 2024 -
పండంటి కాపురానికి ఏడడుగులు!
పెళ్లంటే.. రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. కాపురం చక్కగా సాగాలని కోరుతూ పెళ్లిలో ఏడు అడుగులు నడిపిస్తారు. ఇందులో ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం ఉంది. మొత్తంగా కాపురం సుఖంగా సాగేందుకు దేవతలందరూ కరుణించాలని ప్రార్థన. స్నేహంగా, పరస్పరం గౌరవించుకుంటూ, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అన్యోన్యంగా జీవించాలని ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. లేదంటే మూడు వాదనలు, ఆరు గొడవలుగా రచ్చకెక్కుతుంది. పెద్దల పంచాయతీకి చేరుతుంది. చివరకు విడాకులుగా తేలుతుంది. వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనే విషయంపై సైకాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు, అధ్యయనాలు చేశారు. వైవాహిక జీవితాలను నాలుగు దశాబ్దాల పాటు అధ్యయనం చేసిన డాక్టర్ జాన్ గాట్మన్, నాన్ సిల్వర్.. వైవాహిక బంధం బలపడటానికి ఏడు సూత్రాలను చెప్పారు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం. 1. పరస్పర అవగాహనే ప్రేమకు మూలం పెళ్లంటే వేర్వేరు ప్రపంచాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఒకటిగా జీవించడం. ఆ జీవితం సుఖంగా సాగాలంటే ఒకరి అనుభవాలను మరొకరు తెలుసుకోవాలి. వారి జీవితంలో ముఖ్యమైన సంఘటనలను పంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. పరస్పర అవగాహన ఒకరి పట్ల మరొకరికి శ్రద్ధను కలిగిస్తుంది, బంధాన్ని పెంచుతుంది. మీ భాగస్వామికి ఇష్టమైన మూడు పాటలేవి? ఎందుకిష్టం? వారి అతిపెద్ద భయం ఏమిటి? భవిష్యత్తు కోసం వారు కంటున్న కలలు ఏమిటి? వారు దేనికి ఒత్తిడి చెందుతారు? వారి జీవితంలో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉంటే మీకు పరస్పర అవగాహన ఉందని అర్థం. లేదంటే, పెంచుకోవడానికి ప్రయత్నించాలి. 2. మీ అభిమానాన్ని పంచుకోండి, పెంచుకోండి వైవాహిక బంధం బలపడటంలో ప్రేమ, అభిమానాలది ప్రధానపాత్ర. అవి లోపించినప్పుడు ఆ బంధం నిలిచే అవకాశాలు తక్కువ. మీ వైవాహిక బంధంలో అభిమానం ఉందో లేదో అంచనా వేయడానికి మీ తొలి పరిచయం రోజులను వివరించడం మంచి మార్గం. బంధాన్ని బలపరచుకోవడానికి చేయాల్సిన పనులు.. కలసి గడపడానికి ప్లాన్ చేయలి ఇద్దరూ కలసి కొత్త హాబీ నేర్చుకోవాలి భాగస్వామికి కృతజ్ఞతలు తెలపాలి భాగస్వామిని అభినందించాలి అభిమానాన్ని పెంపొందించుకోవడంలో సమస్యలుంటే కపుల్ థెరపీకి వెళ్లాలి 3. కలసి మెలసి నడవండి ఆరోగ్యకరమైన సంబంధంలో భాగస్వాములు తరచుగా ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరినొకరు చూసుకోవడం వారి ప్రేమ ట్యాంక్‌ను నింపుతుంది. ఇరువురి మధ్య ఎమోషనల్ కనెక్షన్ పెరిగేందుకు తోడ్పడుతుంది. లైంగిక జీవితాన్ని ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలం మాట్లాడుకోకపోవడం, చూసుకోకపోవడం జంటను దూరం చేస్తుంది. 4. భాగస్వామి మాటకు విలువనివ్వండి దంపతులు జట్టుగా పనిచేసినప్పుడు కలసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అభిప్రాయాలను పంచుకునేటప్పుడు లేదా ఆలోచనా విధానంలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువనివ్వాలి. ఏకీభవించనప్పుడు గౌరవంగా, ప్రశాంతంగా, హేతుబద్ధమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. 5. పరిష్కరించగల సమస్యలను పరిష్కరించుకోండి వివాహంలో రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి: శాశ్వతమైనవి, పరిష్కరించదగినవి. పరిష్కరించగల సమస్యల్లో వైరుధ్యం, ఆగ్రహం ఉండవు. కేవలం సవాలు మాత్రమే ఉంటుంది. ఐదు దశల్లో వాటిని పరిష్కరించుకోవచ్చు. ఇద్దరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో చర్చ ప్రారంభించాలి · మాటలు, చేతల వల్ల సంఘర్షణ పెరగకుండా చూసుకోవాలి అవసరమనిపించినప్పుడు 20 నిమిషాల విరామం తీసుకోవాలి· ఇద్దరూ కలసి బతికేందుకు అవసరమైతే రాజీ పడాలి ఒకరి తప్పులను ఒకరు సహించాలి 6. పీటముడిని అధిగమించండి నిరంతర విభేదాలు సంఘర్షణకు కారణమైనప్పుడు పీటముడి పడుతుంది. మాటలు ఆగిపోతాయి. ఒకరినొకరు ద్వేషించుకోవడం మొదలవుతుంది. దీన్ని అధిగమించడానికి.. సమస్య మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయాలి · చర్చించలేని వివాదాలను అంచనా వేయడానికి మార్గాన్ని కనుగొనాలి భాగస్వామికి కృతజ్ఞతలు, ప్రశంసలు తెలుపుతూ ప్రశాంతంగా చర్చను ముగించాలి 7. భాగస్వామ్యానికి సరైన అర్థాన్ని సృష్టించాలి జీవన భాగస్వామ్యమంటే.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు. మీ లక్ష్యాలు, పాత్రలు, ఆచారాలను కలపడం పరస్పర అవసరాలు, కోరికలు, కలలను గుర్తించడానికి అనుమతించడం అన్ని రకాల సాన్నిహిత్యాన్ని పంచుకోవడం అర్థవంతమైన అనుభవాలను సృష్టించుకోవడం --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: భూమికే గొడుగు పట్టనున్న శాస్త్రేవత్తలు! ఏకంగా లక్షల కోట్లు..) -
ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల నమోదు తప్పనిసరి
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), భారత సంతతికి చెందిన విదేశీయులు(ఓసీఐ)–భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాల పెరుగుతండటం ఆందోళనకరమని న్యాయ కమిషన్ పేర్కొంది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి సమగ్రమైన చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. భారతీయులు–ఎన్ఆర్ఐలు, భారతీయులు–ఓసీఐల మధ్య పెళ్లిళ్లను విధిగా రిజిస్టర్ చేసే విధానం ఉండాలని స్పష్టం చేసింది. జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ ‘లా ఆన్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఎన్ఆర్ఐ, ఓసీఐ’ అంశంపై అధ్యయనం చేసింది. ఇటీవల కేంద్ర న్యాయ శాఖకు ఇటీవలే నివేదిక సమర్పించింది. దీనిపై కేంద్రం తేదలచిన చట్టం పెళ్లిళ్లకు వివాదాలన్నింటినీ పరిష్కరించేలా సమగ్రంగా ఉండాలని అభిప్రాయపడింది. మోసపూరిత ఎన్ఆర్ఐ వివాహాలతో భారత యువతులు అధికంగా నష్టపోతున్నారని గుర్తుచేసింది. విడాకులు, భాగస్వామికి భరణం, కస్టడీ, చిన్నారుల జీవన వ్యయాన్ని భరించడం వంటి అంశాలను చట్టంలో చేర్చాలని సిఫార్సు చేసింది. వైవాహిక స్థితిని కచి్చతంగా వెల్లడించేలా పాస్‌పోర్టు చట్టం–1967లో సవరణలు చేయాలని పేర్కొంది. పాస్‌పోర్టులో మ్యారేజీ రిజి్రస్టేషన్ నెంబర్ కూడా ఉండాలని తెలిపింది. ఇద్దరు జీవిత భాగస్వాముల పాస్‌పోర్టులను అనుసంధానించాలని, దీనివల్ల మోసాలను అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. -
రామలక్ష్మి సిగ్గుపడింది.. ఎందుకో?
పండక్కి తాతగారి ఊరికొచ్చిన రామలక్ష్మి పెరట్లో ఒక్కో పువ్వూ తెంచి వోనీలో వేసుకుంటోంది. చూడమ్మీ ముల్లు గుచ్ఛీగలవు అన్నాడు అప్పుడే వచ్చిన నాగరాజు. మీ ఊళ్ళో మందారాలకు కూడా ముళ్లుంతా యేటి అంది కొంటెగా చూస్తూ... చెస్.. గుంటకు పోత్రం తగ్గలేదు అని మనసులో అనుకుంటూనే ఎప్పుడొచ్చినారు... ఏటి సేత్తన్నావు అన్నాడు. బీఎస్సి నర్సింగ్ అయింది.. ఎసోదాలో చేస్తన్నా అంది.. మరి నన్నేం అడగవా అన్నాడు నాగరాజు.. అడగక్కర్లే మందారాలకు ముల్లుంతాయని అన్నావంతే నువ్వు బీకామ్ ఫిజిక్స్ అని అర్థమైంది అంది మళ్ళీ ... దీనికి ఐడ్రాబాడ్ ఎళ్ళింతర్వాత తెలివెక్కువైంది అనుకుంటుండగానే ఎవుల్తోనే మాటలూ అంటూ తల్లి నాగమణి వచ్చింది. ఎవులో తెలీదే అమ్మా అంది రామలక్ష్మి.. అంతలోనే నాగరాజును చూస్తూ... ఒరే నువ్వా నాగీ ఎలాగున్నావు.. యేటి సేత్తన్నావు అంది... దీంతో వీడికి కాస్త మద్దతు దొరికినట్లై.. బాప్పా బాగున్నా.. మొన్నే వచ్చినాం.. ఇజివాడలో ఉంతన్నాం ... నన్ను బీకామ్ సేసి రొయ్యల కంపినీలో మేనేజరుగా చేస్తన్ను అన్నాడు గర్వంగా.. ఇంతలో రామలక్ష్మి వచ్చి... అమ్మా ఎవరి అంది కళ్ళతోనే... చిన్నప్పుడు గొర్రిపిల్ల తగిలికొస్తే కోలగూట్లో దాగుందామని దూరిపోయి అందులో ఉన్న పిల్లల బేపికి దొరికిపోనాడని అప్పుడు చెప్పినాను కదా... ఆడే ఈడు అంది నాగమణి.. పాపం నాగరాజు మళ్ళీ దెబ్బతినేశాడు.. సెండాలం.. ఇంత సెండాలం ఇంట్రడక్షన్ ఏందీ అనుకుంటూనే రామలక్ష్మిని చూశాడు.. కళ్ళతోనే నవ్వింది.. సరే బాప్పా వెళ్తాను అని కదిలి ఆరేడు అడుగులు వేయగానే నాగీ అని పిలిచింది నాగమణి ... బప్పా అంటూ వెనక్కి తిరిగాడు వాడి చూపులు ఆవిడ భుజాలను దాటుకుంటూ వెనకాల నిలబడిన రామలక్ష్మిని చేరుకున్నాయి.. ఈలోపే.. నాగీ రేపు బోగీ నాడు అమ్మను నాన్నను రమ్మను మాట్లాడాలి అంది... సరే బాప్పా అంటూ వాడు కదిలాడు.. వాడి వెనకాలే రామలక్ష్మి చూపులు.. కూడా ఫాలో అయ్యాయి.. మర్నాడు నాగరాజు నాన్న నారాయణ తల్లి రాజ్యం వచ్చారు.. వస్తూనే... పలకరింపులు అయ్యాక నాగమణి మొదలెట్టింది.. మరేట్రా అన్నియ్యా మన రామలక్ష్మికి నాగరాజుకు సేసిద్ధుమా .. ఎలాగూ సిన్నప్పుటునుంచి ఒనేసిన సంబంధమే కదా.. కొత్తగా అనుకునేది ఏముందీ అంది.. నారాయణ అలాగేలేవే మణీ చూద్దుము అన్నాడు... రాజ్యం కాస్త మాటకారి.. ఎక్కడా మాటపడనివ్వదు .... తన భర్త నారాయణ అమాయకుడని.. ఆయన్ను ఎవరైనా మోసం చేసేయగలరని.. తానూ అలాకాదని.. బాగా తెలివైనదాన్నని,.. ఇంట్లో తనదే పెద్దరికం ఉండాలని కోరుకునే తత్త్వం.. అందుకే నారాయణ చూద్దుము లేవే అనగానే ఏటీ సూసేది... అప్పుడెప్పుడో అనుకున్నాం కదాని ఇప్పుడు సేసెత్తమా... మంచీ సెడ్డా ఉండవా అంది... నేను దిగితే సీన్ మొత్తం మారిపోద్ది అనే కమాండింగ్ ఆమె మాటల్లో స్పష్టమైంది. ఉంటాయుంటాయి ఎందుకుండవు వదినా మూడు లచ్చల కట్నం.. వీరో వోండా ఇస్తాం.. పిల్లడికి ఒక తులం సైను ... ఇక పెళ్లయ్యాక సారి సీరెలు ఉండనే ఉంతాయి కదా అంది నాగమణి.. ఉంటాయమ్మా ఎందుకుండవు.. అందరికీ ఉంటాయి.. ఎవరిళ్ళలో లేవూ అంటూ రాజ్యం మళ్ళీ లైన్లోకి వచ్చింది.. అమ్మ వాలకం చూస్తుంటే రామలక్ష్మిని మిస్సైపోతానేమోనని ఓ వైపు నాగరాజు కళ్ళలో చిన్న భయం.. మా అన్న కూతురు మంగ కూడా బీటెక్ చేసింది.. కట్నం ఐదు లచ్చలు ఇస్తామని కూడా వదిన మాట్లాడింది అంటూ రాజ్యం తమవాడి మార్కెట్ రేటు బయటపెట్టింది.. ఆమ్మో.. అంత ఇవ్వకపోతే రామలక్ష్మి దక్కదేమో అని నాగరాజు అందోళన... ఈలోపే రామలక్ష్మి వచ్చి.. పోన్లేమ్మా నా జీతం డబ్బులున్నాయి కదా కొంత సర్దుబాటు చేద్దాం అని చెప్పడం ద్వారా నాగరాజును మిస్ చేసుకునే ఉద్దేశ్యం లేదని తేల్చేసింది.. అమ్మనీ గుంటా తెలివైందే... . అని మనసులో అనుకుంటూనే కళ్ళతోనే రామలక్ష్మి కళ్ళకు దండం పెట్టేశాడు.. సరే ఐతే రేపిల్లుండి మంచిరోజు చూసి మాటనుకుందాం అన్నది రాజ్యం ధీమాగా .. మరి పండక్కి కొత్తకోడలికి కోక గట్రా పెడితే .... అంది నాగమణి కాస్త సందేహిస్తూ... ఆ చూద్దాంలే అని రాజ్యం అంటుండగానే అమ్మా నేను నీకు తెచ్చిన మూడు చీరల్లో ఆ అరిటాకు రంగు చీర ఇచ్చేయ్... రాముకు బావుంటుంది అనేశాడు ఆగలేక నాగరాజు.. బయటకు చెప్పకపోయినా రామలక్ష్మి మనసులోనే నాగరాజును వాటేసుకుని సిగ్గులమొగ్గయింది.. అమ్మనీ గుంటడా అప్పుడే ఇలా తయారయ్యావా అంది రాజ్యం.. పోన్లే వదినా .. పిల్లలకు ఇష్టమే కదా.. మరెందుకు మాటలూ అనేసింది.. నాగమణి.. మొత్తానికి పండక్కి వచ్చిన రెండు కుటుంబాలు ఇలా సంబంధం కుదుర్చుకున్నాయి.. ఇలాంటి సంఘటనలు.. సన్నివేశాలు.. ఎన్నో.. ఎన్నెన్నో.. వాటన్నిటికీ సంక్రాంతి ఒక వేదిక.. మధ్యతరగతి వాళ్లకు సంక్రాంతి ఒక వేడుక. -గాంధీ, విజయనగరం -
వెడ్ ఇన్ ఇండియా: 'ప్లీజ్ ఇక్కడే పెళ్లి చేసుకోండి'!
భారతదేశంలో ప్రజలు పెళ్లిళ్లకు ఎంతెంత రేంజ్లో డబ్బుల ఖర్చు పెడతారో తెలిసిందే. నిజం చెప్పాలంటే పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే భారత్‌లో అదొక వ్యాపారంలా సాగుతుంది. అయితే ఇటీవల ఆ పెళ్లిళ్లలో ట్రెండ్ మారుతోంది కూడా. ఏకంగా కోట్లు ఖర్చే చేసి మరీ విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం ఓ స్టేస్ సింబల్‌లా మారిపోయింది. ఇక రానురాను ఆ ట్రెండ్ ఓ రేంజ్లో కొనసాగేలా ఉంది. అయితే మన ప్రధాన మోదీ మాత్రం "ప్లీజ్ మన మాతృభూమిలోనే పెళ్లి చేసుకోండి" అని పిలుపునిస్తున్నారు. ఎందుకని ఆయన ఇలా విజ్ఞప్తి చేస్తున్నారు? కారణమేంటీ..? నిజానికి భారతీయుల్లో పెళ్లిళ్ల కోసం విదేశీయులకు వెళ్లే వాళ్లు కేవలం అత్యధిక ధనవంతులే. సాధారణ మానవుడు పెళ్లి చేసుకుంటే చాలనుకుంటాడు. అంత రేంజ్‌లకు వెళ్లడు. మన దేశంలో బడా బాబులకు కొదవలేదు కూడా. అయితే ఇంతకుమునుపు శ్రీమంతులు విభిన్నంగా కళ్లు చెదిరే ఆర్భాటాలతో చేసుకునేవారు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారంటా! అని కథలుగా చెపుకునేవారు. కానీ ఈ 20 ఏళ్లలో పరిస్థితుల చాలా మారిపోయాయి. అంతెందుకు పెళ్లిళ్ల సీజన్‌కి రాజకీయనాయకుల సైతం ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎంతలా అంటే? ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. ఎన్నికల సంఘం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 23న ఖరారు చేయగా ఆ టైంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయని ఏకంగా తేదీనే మార్చారు. వెడ్డింగ్ అతిపెద్ద వ్యాపార ఇండస్ట్రీ.. పెళ్లిళ్ల టైంలో కళ్యాణ మండపాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. వాటి ధరలు హడలెత్తించేలా ఉంటాయి. ఆఖరికి పూల దగ్గర నుంచి నగలు, బట్టలు అన్నింటికి మంచి గిరాకీ టైం అనే చెప్పాలి. ఎంత ఎక్కువ ధర చెప్పినా ప్రజలు కూడా లెక్కచేయకుండా కొనే సమయం కావడంతో వ్యాపారులు కూడా ఈ సీజన్‌ని భలే క్యాష్ చేసుకుంటారు. ఈ దృష్ణ్యా చూస్తే పెళ్లిళ్లు ఓ పెద్ద మార్కెట్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఈ పెళ్లి పేరుతో అన్ని రకాల వృత్తుల వారికి చేతినిండా పని, ఆదాయానికి ఆదాయం. పెళ్లిళ్ల కార్యక్రమాలను నిర్వహించే ఈవెంట్ మేనజర్లకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. గతేడాది 2023లో దాదాపు 38 లక్షల వివాహాలు జరిగాయని, దాదాపు 4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) స్వయంగా పేర్కొంది. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ఎందుకింత ఆధరణ.. అందుకు ప్రధాన కారణం..జీవితంలో ఒక్కసారే చేసుకునేది కావడం, గుర్తుండిపోయేలా గ్రాండ్‌గా చేసుకోవాలన్న కోరికలే ఇంతలా ఖర్చు చేసేలా చేస్తోంది. దీంతోపాటు అరచేతిలోనే ప్రపంచంలా స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం కూడా కొంత ఉంది. ఈ మేరకు ప్రముఖ మ్యారేజ్ ప్లానర్ అగ్నిశక్తి మాట్లాడుతూ..తాము సుమారు 8లక్షలు నుంచి 3 కోట్ల బడ్జెట్ వరకు వివాహాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ బడ్జెట్ ప్రధాన భాగం వేదికపైనే ఖర్చు అవుతుందని, మిగిలిన బడ్జెట్‌ని ఆహారం, పానీయాలు, డెకరేషన్ సెటప్, ఫోటోగ్రఫీ, మేకప్ ఆర్టిస్టులకు ఖర్చే చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా వధువు, వరుడు కుటుంబాలకు ప్రత్యేక డిజైనర్లను పెట్టుకుని మరీ బట్టలను కొనుగోలు చేయడం ఓ ట్రెండ్‌గా మారిందని అన్నారు. సెలబ్రెటీలైతే ఈ విషయంలో ఏకంగా సినిమాలో పనిచేసే కాస్ట్యూమ్ డిజైనర్లను కూడా పెట్టుకుంటున్నట్లు తెలిపారు. చాలామంది ఈ లగ్జరీ పెళ్లిళ్లను తమ స్టేటస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా భావించడం కూడా కొంత కారణం. ఈ నేపథ్యంలోనే బహుశా డిస్టినేపన్ వెడ్డింగ్‌లకు బాగా ఆదరణ పెరిగిందని చెప్పొచ్చు. ఎలాగో లక్షలు లక్షలు ఖర్చుపెడుతున్నాం కాబట్టి అదేదో అందరూ గుర్తు పెట్టుకునేలా విదేశాల్లో చేసుకుంటే..ఎంజాయ్మెంట్కి ఎంజాయ్, అందరూ గొప్పగా కూడా చెప్పకునేలా ఉంటుందన్న ధోరణి ప్రజల్లో బాగా పెరిగిందని మరో వెడ్డింగ్ ప్లానర్ సక్షమ్ శర్మ చెబుత్నునారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు అయ్యే ఖర్చు.. ఇది వారు వెళ్లే ప్రదేశం, వచ్చే అతిథుల బట్టి ఖర్చు ఉంటుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు బడ్జెట సుమారు 80 నుంచి 90 లక్షల నుంచి ప్రారంభమవుతుందని పెళ్లిళ్ల ఈవెంట్ మేనేజర్లు చెబుతున్నారు. అదే థాయిలాండ్, బాలి అయితే ఏకంగా కోట్లలోనే బడ్జెట్ మొదలవుతుందని తెలిపారు. ఇంతలా లగ్జరీయస్‌గా పెళ్లి చేసుకోవాడానికి కొన్ని హోటళ్లు క్రెడిట్ లోన్లు కూడా ఇస్తాయట. మోదీ వద్దు అనడానికి రీజన్.. నవంబర్‌లో మన్కి బాత్ రేడియో ప్రసంగంలో ప్రధాన మోదీ విదేశాలలో వివాహాలను చేసుకునే బడా కుటుంబాల ధోరణి కలవరపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత మొత్తంలో ఖర్చే చేసేటప్పుడూ..మన భారత్‌లో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాల్లో హుందాగా చేసుకోండని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేగాదు మేక్ ఇన్ ఇండియా మాదిరిగా వెడ్ ఇన్ ఇండియా అనే ఉద్యమం కూడా చేపట్టాలని అన్నారు. అంతగా కావాలనుకుంటే ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు జరుపుకోమని అన్నారు. మోదీ ఇలా అనడానకి ప్రధాన కారణం భారతదేశం డబ్బు విదేశాలకు తరలిపోవడం ఇష్టం లేక ఆయన ఈ విధంగా పిలుపునిచ్చారు. ఇది ఒక రకంగా భారతీయ ఆర్థికవ్యవస్థకు, స్థానిక వ్యాపారులకు ఉపకరించే చొరవ. ఇది చాలామంచి ప్రయత్నమే కానీ భారతీయులను ఇక్కడే పెళ్లిళ్లు చేసుకునేలా మంచి వెడ్డింగ్ సెట్టింగ్ మైదానాలతో మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే వెడ్డింగ్ టైంలో భారీ డిమాండ్ పలికే ఫంగ్షన్ హాల్స్ చార్జీల్లో కూడా మార్పులు వస్తే ఇదంతా సాధ్యమని అంటున్నారు ఈవెంట్ మేనేజర్లు. దీంతో ప్రవాస భారతీయులు సైతం తమ సొంత గడ్డలోనే పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారని చెబుతున్నారు. అలాగే తమ పెళ్లి గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకునే వాళ్లకు.. మన భారత్‌లో ఉన్న గోవా, రాజస్థాన్, హిమచల్‌ప్రదేశ్, అండమాన్ తదితర ప్రసిద్ద ప్రదేశాలను హైలెట్ చూస్తూ.. అక్కడి ఫంక్షన్ హాల్లో భారీ మార్పులు తీసుకొచ్చేలా తీర్చిదిద్ధడమే గాక అందుబాటు ధరలో ఉండేలా చేస్తే ప్రధాని మోదీ చెబుత్ను నినాదం సాకారం అవుతుందన్ని అంటున్నారు మ్యారేజ్ ఈవెంట్ మేనేజర్లు. ఈ నినాదానికి మద్దతు పలుకుతూ ప్రముఖ సెలబ్రెటీ రియా కపూర్ ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు కూడా. భారతదేశం వివిధ ఐకానిక్ ప్రదేశాలకు పెట్టింది పేరు. ఈ చొరవ నిజంగా భారతదేశ ఆర్థికవ్యవస్థకు మంచి బూస్టప్. (చదవండి: ఏకంగా రూ. 1 కోటి వార్షిక వేతనం అందుకుంటున్న భారత విద్యార్థి!అతనేమి ఐఐఎం, ఐఐటీ.. !) -
ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సినీతారలు వీళ్లే!!
మరో వారం రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. 2023కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల వారికి ఎన్నో మధురానుభూతులను తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ఏడాదిలో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు వివాహాబంధంతో ఒక్కటయ్యారు. వారిలో ప్రధానంగా వరుణ్-లావణ్య, శర్వానంద్-రక్షితా రెడ్డి, మంచు మనోజ్- భూమా మౌనిక లాంటి స్టార్ జంటలు ఉన్నాయి. ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలుకుతూ.. పెళ్లిబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారి పెళ్లి విశేషాలు తెలుసుకుందాం. వరుణ్- లావణ్య ఈ ఏడాది మెగా ఇంట పెళ్లి సందడి గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మాదాపూర్‌లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య హఠాత్తుగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) శర్వానంద్-రక్షితా రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది ఇంటివాడయ్యాడు. జూన్ 2న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. శర్వానంద్ పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం ఈ ఏడాది మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికమెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి మార్చి 3న హైదరాబాద్‌లోని మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. భూమా మౌనిక 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) మానస్ - శ్రీజ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్. ఈ బుల్లితెర నటుడు ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించిన మానస్ తర్వాత సీరియల్స్‌తో పాటు యాంకరింగ్‌లోనూ తన ప్రతిభ చాటుకున్నాడు. విజయవాడలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీతారలు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. మానస్ బిగ్‌బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న ఇతడు ఆ మధ్య మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన అతియాశెట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ భామ అతియా శెట్టి- కేఎల్ రాహుల్. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి పలు బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. కేఎల్ రాహుల్‌తో మూడేళ్లపాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. వీరిద్దరి పెళ్లి ముంబై సమీపంలోని ఖండాలాలో ఉన్న సునీల్‌శెట్టి ఫాంహౌస్‌లో జరిగింది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్‌ను టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లాడారు. అంతుకుముందే ఆమెతో నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన పాండ్యా ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన కుమారుడు అగస్త్య పాండ్యా సమక్షంలో నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిపెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఎంపీని పెళ్లాడిన హీరోయిన్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఈ జంట ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. చమ్కీలా అనే సినిమా షూటింగ్ పంజాబ్‌లో జరిగినప్పుడు వీరిద్దరు ప్రేమలో పడ్డారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగిన వీరిపెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. పెళ్లిబంధంతో ఒక్కటైన జంట బాలీవుడ్‌కు చెందిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సైతం ఈ ఏడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. షేర్షా చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించారు. రాజస్థాన్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అలాగే ఈ ఏడాది మరికొందరు సినీ తారలు కూడా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వారిలో రణ్‌దీప్ హుడా, స్వరాభాస్కర్, మసాబా గుప్తా లాంటి వారు కూడా ఉన్నారు. -
పాక్ కాల్పులతో పెళ్లిళ్లకు చిక్కులు
శ్రీనగర్: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం జరుపుతున్న విచక్షణారహిత కాల్పులతో జమ్మూలోని పలు గ్రామాల్లో పెళ్లిళ్లకు చిక్కులొచ్చి పడ్డాయి. దాంతో చివరి నిమిషంలో పలు పెళ్లిళ్లకు వేదికను మార్చుకోవాల్సి రావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. భారీ కాల్పుల దెబ్బకు అతిథులు పెళ్లి విందు మధ్య నుంచే అర్ధంతరంగా నిష్క్రమిస్తున్న ఉదంతాలూ చోటుచేసుకుంటున్నాయి. పాక్ రేంజర్లు ఇలా కాల్పులకు తెగబడటం 2021 కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇదే తొలిసారి. గురువారం రాత్రి నుంచీ అరి్నయా తదితర ప్రాంతాలపై కాల్పులు ఏడు గంటలకు పైగా కొనసాగాయి. మరోవైపు వరి కోతల వేళ కాల్పులకు భయపడి కూలీలెవరూ పొలాలకు కూడా వెళ్లడం లేదు. బంకర్లోనే పాఠాలు! కాల్పుల భయంతో జమ్మూ జిల్లాలో పలు స్థానిక స్కూళ్లు మూతబడ్డాయి. అయితే సరిహద్దుకు సమీపంలోని షోగ్పూర్లో ఉన్న సర్కారీ పాఠశాల మాత్రం శుక్రవారం భూగర్భ బంకర్లలో నడిచింది! తమ ఇంట్లోవాళ్లు భయపడ్డా తాను మాత్రం స్కూలుకు హాజరయ్యానని సునీతా కుమారి అనే విద్యారి్థని చెప్పింది. ఆమెతో పాటు దాదాపు 20 మంది విద్యార్థులు స్కూల్లోని బంకర్లో పాఠాలు విన్నారు. -
LGBTQ కమ్యూనిటీకి కలిసి జీవించే హక్కు ఉంది : సుప్రీం
-
స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు
ఢిల్లీ: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ వివాహాల చట్టబద్దతపై రెడ్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్.. స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపారు. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేశారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపిన సీజేఐ.. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 'స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేం. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించం. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదు. కలిసి జీవించడం గుర్తిస్తున్నాం.. కానీ దాన్ని వివాహంగా పరిగణించలేం. స్వలింగ సంపర్కులను దంపతులుగా గుర్తించలేము. స్వలింగ జంటల అభ్యర్ధనల పట్ల సానుభూతి ఉంది కాని అభ్యర్ధనలకు చట్టబద్ధత లేదు. ప్రత్యేక వివాహ చట్టం లో మార్పు చేయాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోలేం. ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేయలేం. వివాహ వ్యవస్థకు సంబందించిన నిర్ణయాలు పార్లమెంట్ మాత్రమే చేయగలదు.' అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. 'ప్రేమ అనేది మానవత్వ లక్షణం. వివాహ హక్కుల నిర్ధారణకూ ప్రభుత్వం కమిటీ వేయాలి. ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది. అసహజ వ్యక్తుల హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రపాలిత ప్రాంతాలు వివక్ష చూపకూడదు. అసహజ వ్యక్తుల హక్కులు, అర్హతలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ప్రకటనను రికార్డు చేస్తున్నాం. రేషన్ కార్డ్‌లలో అసహజ జంటలను కుటుంబంగా చేర్చడం, అసహజ జంటలు ఉమ్మడి బ్యాంకు ఖాతా కోసం నామినేట్ చేయడానికి వీలు కల్పించడం, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి నుంచి వచ్చే హక్కులను కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించాలి.' అని సుప్రీంకోర్టు స్పష్టం తీర్పును వెల్లడించింది. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్‌లోని సెక్షన్ 4 రాజ్యాంగ విరుద్ధం అనొచ్చని సీజేఐ చంద్రచుడ్ అన్నారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై సుప్రీంకోరు తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 20 పిటిషన్లపై విచారణ పూర్తైన అనంతరం ధర్మాసనం మేలో తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కాగా, 2018 సెప్టెంబర్‌లోనే భారత సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కం శిక్షార్హం కాదని తేల్చింది. పాతకాలపు చట్టాన్ని పక్కనపెట్టి ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే గగ్గోలు పుట్టింది. సాంస్కృతిక విలువలకు తిలోదకాలిచ్చి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటున్నామంటూ విమర్శలు రేగాయి. తీరా స్వలింగ సంపర్కం తప్పు కాదని కోర్టు చెప్పినా తమకు సామాజిక అంగీకారం లభించడం లేదనీ, తమపై దుర్విచక్షణ సాగుతూనే ఉందనీ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ల (ఎల్జీబీటీక్యూ) వర్గం ఫిర్యాదు చేస్తోంది. స్వలింగ సంపర్కం నేరం కాదనే దశ నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరడం దాకా ఇప్పుడు వచ్చింది. హోమో సెక్సువల్ పెళ్ళిళ్ళను చట్టబద్ధమైనవని గుర్తించాలని కోరుతూ, 2020లోనే ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తర్వాత సుప్రీమ్‌కు పిటిషన్లు చేరాయి. కోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. మార్చి 13న సుప్రీంకోర్టులో కేంద్రం తన అఫిడవిట్ దాఖలు చేస్తూ, స్వలింగ వివాహాల చట్టబద్ధతకు ససేమిరా అంది. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలు శిక్షార్హమని భారత శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్ మాట. ఆ సెక్షన్ కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని అయిదేళ్ళ క్రితం తీర్పునిచ్చినంత మాత్రాన ఏకంగా స్వలింగ వివాహాన్ని వివిధ చట్టాల కింద తమ ప్రాథమిక హక్కని పిటిషనర్లు అనుకోరాదని ప్రభుత్వం వెల్లడించింది. స్వలింగ వివాహాలు సమాజంలో కొత్త సమస్యను సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ వివాహాలకు గుర్తింపు కల్పించకపోవడం వివక్ష కాదని ప్రభుత్వం వాదించింది. ఇదీ చదవండి: ఢిల్లీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో ఆప్! స్వలింగ సంపర్కుల విషయంలో వివిధ దేశాల్లో ఉన్న శిక్షలు/హక్కులు... వాటి వివరాలు.. 1. మరణ శిక్ష 2. జీవితకాల ఖైదు 3. జైలు శిక్ష 4. హక్కులు లేవు 5. చట్టప్రకారం శిక్షలు 6. యూనియన్లకు కలిగి ఉండే హక్కు 7. చట్టప్రకారం వివాహం చేసుకోవచ్చు 8. ఉమ్మడిగా దత్తత తీసుకునే హక్కు -
పూర్వీకుల ఆస్తిలో వాళ్లకు కూడా హక్కు ఉంది : సుప్రీంకోర్టు
పెళ్లికి ముందు లేక వివాహేతర సంబంధంలో జన్మించిన సంతానానికి తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు ఉందా? అనే అంశంపై దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. చెల్లుబాటుకాని లేదా రద్దు చేయదగ్గ వివాహాల్లో జన్మించిన పిల్లలు కూడా చట్టబద్ధమైన వారసులేనని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఉమ్మడి కుటుంబంలో((Hindu Joint Family) తల్లిదండ్రులకు వచ్చే పూర్వీకుల ఆస్తిలో ఈ పిల్లలకు కూడా హక్కు ఉందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాంటి సంబంధంలో జన్మించిన పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుగా చూడాలని, ఆ బిడ్డ అన్యం పుణ్యం ఎరుగనదని తెలిపింది. వివాహేతర సంబంధంలో పుట్టిన పిల్లలకు ఇతర పిల్లల మాదిరిగానే అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. రేవణ సిద్దప్ప వర్సెస్ మల్లికార్జున్ (2011) కేసులో ఈ ప్రశ్నలు తలెత్తాయి. ఐతే అప్పటి జస్టిస్ (రిటైర్డ్) జిఎస్ సింఘ్వి, ఏకే గంగూలీలతో కూడిన ధర్మాసనం సెక్షన్ 16(3)లోని సవరణ ప్రధానాంశాన్ని ప్రస్తావిస్తూ.. వివాహేతర సంబంధంలో పుట్టిన పిల్లలకు చట్టబద్ధత ఉంటుందని, వారికి చెల్లుబాటయ్యే వివాహంలో జన్మించిన పిల్లల మాదిరి హక్కులు ఉంటాయని అప్పట్లో బెంచ్ ఉత్తర్వులిచ్చింది. అయితే పూర్వికుల ఆస్తిలో వాటా ఉండదని అభియప్రాయపడింది. ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉండిపోయింది. దీనిపై ప్రస్తుత చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి గతంలో బెంచ్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో విభేదించింది. ఆయా వివాహేతర సంబంధంలో పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉంటుందని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని వెల్లడించింది. అలాగే తల్లిదండ్రులకు వారి పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో కూడా ఈ పిల్లలకు వాటా పొందే హక్కు ఉందని పేర్కొంది. (చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!) -
కాసింత కపటం
‘నిజాన్ని పోలిన అబద్ధమాడి డబ్బు సంపాదించాలి’ అంటాడు ‘కన్యాశుల్కం’లో రామప్ప పంతులు. అందుకు ‘నమ్మినచోట మోసం, నమ్మని చోట లౌక్యం’ ప్రదర్శించాలంటాడు. కన్యాశుల్కం మలికూర్పు 1909లో జరిగింది కనుక రచనాకాలం ఇదమిత్థంగా తెలియకపోయినా ఇందులోని పాత్రలన్నీ 1880– 1910 కాలం నాటివి. అంటే నాటి మనుషుల జీవనాన్ని తెలిపేవి. వారు పాటించిన విలువలు, తొక్కగల పాతాళాలు, చూపిన చిత్తవృత్తులు, చేసిన టక్కుటమారాలు, హీనత్వాలు, అల్పత్వాలు... ఇవి తెలియాలంటే కన్యాశుల్కానికి మించిన ఆనవాలు లేదు. వందేళ్ల కాలం తర్వాత కూడా గురజాడ, ఆయన రచించిన ‘కన్యాశుల్కం’ వర్తమాన విలువను కలిగి ఉండటానికి నాటకంలో గురజాడ ఎంచుకున్న సాంఘిక సమస్య గాంభీర్యం ఎంత మాత్రం కారణం కాదు. సాంఘిక సంస్కరణ కూడా కాదు. పసిపిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేయడం, వితంతువుల పెళ్ళిళ్లు నిరాకరించడం, వేశ్యావృత్తి ప్రబలంగా ఉండటం... వీటి నిరసనగా గురజాడ కన్యాశుల్కాన్ని రాసినా కేవలం ఈ కారణం చేతనైతే నాటకం అవసరం ఏ పదేళ్లకో తీరిపోయి కనుమరుగైపోయేది. కన్యాశుల్కం బతికి ఉన్నదీ... ఇక మీదటా బతికి ఉండేదీ... అది కేవలం మనుషుల నిజ ప్రవర్తనల విశ్వరూపం చూపడం వల్లే! అగ్నిహోత్రావధాన్లకు మెరకపొలం ఉంది. భార్య వెంకమ్మ పసుపూ కుంకాలతో తెచ్చిన పొలమూ ఉంది. ఇరుగింటి గోడ, పొరుగింటి గోడ తనదేనని దబాయించి కలుపుకుంటున్నాడు. పెద్ద కూతురు బుచ్చమ్మను పదిహేను వందలకు అమ్మి, ఆమె విధవగా మారగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. బుచ్చమ్మ (చనిపోయిన) మొగుడి భూముల్లో వాటా కోసం దావా కూడా తెచ్చాడు. ఇన్ని ఉన్నా బంగారం లాంటి, పసిమొగ్గ వంటి చిన్నకూతురు సుబ్బిని పద్దెనిమిది వందలకు అమ్మడానికి సిద్ధమయ్యాడు– అరవై దాటిన, కాటికి కాళ్లుజాపుకున్న లుబ్ధావధాన్లకు! కొడుకు వెంకటేశం పెళ్లి జరగాలంటే చంటిదాన్ని అమ్మాల్సిందేనట. ఈ కాఠిన్యం, కపటత్వం ఎంత వెలపరం! ఇక కపటుల వరుస చూడండి. డబ్బుపై యావ తప్ప వేరే ఏ లిటిగేషన్ ఎరగని ముసలి లుబ్ధావధాన్లను పెళ్లికి ఎగదోసి, అతగాడు పిల్లకు పుస్తె గట్టి ఇంటికి తెచ్చుకుంటే గనక తన ఇలాకా చేసుకుందామని ఆరాటçపడుతుంటాడు ఉమనైజర్ రామప్పపంతులు. అప్పటికే అతడు లుబ్ధావధాన్ల పెద్ద కూతురు మీనాక్షిని లొంగదీసుకున్నాడు. మధురవాణిని ఉంచుకున్నాడు. చాలక అన్నెం పున్నెం ఎరగని పసిపిల్లను కబళించేందుకు లుబ్ధావధాన్ల హితం పలుకుతుంటాడు. గిరీశం ఇంతకన్నా దిగదుడుపు. స్త్రీలపై పడి బతుకుతాడు. పూటకూళ్లమ్మను ఉంచుకుని, ఆమె సరుకుల కోసం దాచుకున్న 20 రూపాయలను కాజేసి మధురవాణికిచ్చి ఆమెను ఉంచుకుంటాడు. సరైన పెద్దమనిషి దొరికితే ‘మధురవాణి లాంటి ఇరవై మందిని సపై్ల చేస్తానంటా’డు. బుచ్చమ్మ మీద కన్నేసి, విడో మేరేజీ పేరుతో ఆమెను నగానట్రాతో ఉడాయించుకు పోవాలని చూస్తాడు. గిరీశానికి ఇంగ్లిష్ వచ్చు. శ్రమ రాదు. చదువు ఉంది. నీతి లేదు. మేనకోడలైన సుబ్బిని కాపాడటానికి రంగంలో దిగిన కరటక శాస్త్రికి ఎన్ని సదుద్దేశాలున్నా అతడు మధురవాణికి పాత గిరాకీ. ‘ఎవరూ లభ్యం కాకపోతే నేను యాంటీ నాచే’ అంటాడు. ఇక ఆవు నైయ్యెనా ఇస్తాగానీ ఖూనీ కేసులో చిక్కుకున్న లుబ్ధావధాన్ల తరఫున సాక్ష్యం చెప్పననే పొలిశెట్టి, లేని దెయ్యాలను సీసాలో బంధించే గవరయ్య, హరిద్వార్‌లో మఠం కడతానని చిల్లర చందాలతో సాయంత్రాలు సారా కొట్లో గడిపే బైరాగి, కేసుంది అనగానే ఎంతొస్తది అనే కానిస్టేబు, చదవక తండ్రిని మోసం చేసే వెంకటేశం... కపటులు. మనుషులు బతకాలి. బతకడం ముఖ్యమే. అందుకై కాస్తో కూస్తో కపటత్వం అవసరం కావచ్చుగాని అందులోనే సోయి మరిచి కొట్టుకుపోవడమా? తెల్లారి లేస్తే కుత్సితాలు చేస్తూ, ఎదుటి వారి నెత్తిన చేయి పెడ్తూ, ఇతరుల కీడు కోరుతూ, బాగా గడుస్తూ ఉన్నా అత్యాశకొద్దీ విలువలు కాలరాస్తూ, పై అంతస్తుకు చేరేందుకు అయినవారిని కాలదంతూ, కేసులూ కోర్టులని తిరుగుతూ... ఆ కాలం మనుషులను తలుచుకుని గురజాడ– సౌజన్యారావు పంతులు రూపంలో కాసింత చింతిస్తూ ‘చెడ్డలో కూడా మంచి ఉండదా’ అంటాడు. ‘ఉన్నవారు వీరే. వీరిలో మంచి వెతికి సర్దుకుపోక తప్పదు’ అనే అర్థంలో! కాని నేటి రోజులు చూస్తుంటే ఆనాటి కపటులంతా మహానుభావులు అనిపించక మానదు. నేటి మనుషులకు కిందా మీదా పడి బతకడం రావడం లేదు. కపట జీవన సౌందర్యం తెలియడం లేదు. అసలు అంత ఓర్పు లేదు. చెడి బతికినా, బతికి చెడినా... బతకడం ముఖ్యం అనుకోవడం లేదు. చంపు లేదా చావు... అని క్షణాల్లో క్రూరత్వానికి తెగబడుతున్నారు. గురజాడ నేడు ‘కన్యాశుల్కం’ రాస్తే బుచ్చమ్మ, వెంకమ్మ కలిసి అగ్నిహోత్రావధాన్లకు విషం పెడతారు. లుబ్ధావధాన్ల పీక నొక్కి మీనాక్షి ఆస్తిపత్రాలతో పారిపోతుంది. చీటికి మాటికి తార్చి బతుకుతున్నాడని గిరీశం నిద్రలో ఉండగా మధురవాణి ఖూనీ చేస్తుంది. రామప్ప పంతులు ‘పోక్సో’ కింద అరెస్ట్ అవుతాడు. వెంకటేశం డ్రగ్స్ కేసులో పట్టుబడతాడు. దారుణం అనిపించవచ్చుగాని పేర్లను మారిస్తే ఇవాళ్టి వార్తలు ఇవే! ఆగస్టు – ‘కన్యాశుల్కం’ మొదటిసారి ప్రదర్శించిన మాసం. సినిమాగా రిలీజైన మాసం. మనుషులు పరిహాసం ఆడదగ్గ అల్పత్వాలతోనే జీవించాలని, ఈసడించుకునే స్థాయి కపటత్వంతోనే బతకాలని, భీతి కలిగించే రాక్షస మనస్తత్వాలకు ఎన్నటికీ చేరకూడదని కోరుకునేందుకు ఈ మాసం కంటే మించిన శుభతిథి ఏముంది – నెలాఖరైనా? -
శ్రావణమాసంలో మాంసాహారం తినకూడదు అని ఎందుకు అంటారు?
శ్రావణమాసం అంటేనే శుభ ముహూర్తాల సమ్మేళనం. ఈ మాసంలో మహిళలందరూ భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాలతో నియమ, నిబంధనలతో పూజలు ఆచరిస్తారు. ఇక శ్రావణమాసం పూర్తయ్యేవరకు మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి? మాసం పూర్తయ్యే వరకు నాన్‌వెజ్ ముట్టుకోకపోవడానికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు చూద్దాం. శ్రావణం కోసం కోసం తెలుగు లోగిళ్లలో చాలామంది వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.శ్రావణ మాసం అనగానే శుభకార్యాలకు ప్రత్యేకంగా భావిస్తారు. అయితే అధిక శ్రావణ మాసం అశుభకర మాసమని పండితులు నిర్ణయించటంతో ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేదు. నిజ శ్రావణ మాసం శుభ కార్యక్రమాలకు అనుకూలంగా నిర్ణయించగా వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి.నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనం, అక్షరాభాస్యం, అన్నప్రాశన, వ్యాపార, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనలు.. ఇలా పలు శుభకార్యాలు జరగనున్నాయి. ఎప్పటివరకు శ్రావణమాసం? సాధారణంగా శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంటుంది. సగటున జులై మధ్య నెలలో ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతుంది. కొన్నిసార్లు అధికమాసం వస్తుంటుంది. ఈసారి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఓ నెల అధిక శ్రావణ మాసం కాగా, మరో నెల నిజ శ్రావణ మాసం. తొలుత వచ్చిన అధిక శ్రావణ మాసం గత నెల 18న ప్రారంభమై ఈ నెల 16తో ముగిసింది. ఈనెల 17 నుంచి మొదలైన నిజ శ్రావణమాసం సెప్టెంబర్ 15వరకు ఉండనుంది. అయితే ఈ మాంసంలో శాకాహారానికే అధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. మాంసం ముట్టరు.. కారణాలు అవేనా? ► శ్రావణమాసం వర్షాకాలంలోనే వస్తుంది. సాధారణంగానే వర్షాకాలంలో కొన్నిరకాల ఆహార పదార్థాలను తినకూడదంటారు. వాటిలో ముందు వరుసలో ఉండేది మాంసాహారం. ఎందుకంటే ఈ కాలంలో హెపటైటిస్, కలరా, డెంగీ వంటి అనేక రోగాలు చుట్టుముడతాయి. ► నీరు నిల్వ ఉండటం, శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో వ్యాధులు వ్యాపిస్తాయి. ఇదే సమస్య జంతువులకు కూడా ఎదురవుతుంది. దీంతో వాటి ద్వారా ఇన్ఫెక్షన్లు మనుషులకు కూడా వస్తాయని అంటుంటారు. ► ఈ కాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.మాంసం అరగక పేగుల్లో బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణ మార్పులతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి తేలికపాటి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. ► ఇక మరో కారణం ఏంటంటే.. చేపలు, అలాగే ఇతర జలచరాలు వర్షాకాలంలో సంతానోత్పత్తి చేపడతాయి. ఈ ప్రక్రియలో ఉన్నప్పుడు జలచరాలు కొన్ని వ్యర్థాలను నీటిలో విడుదల చేస్తుంటాయి. మళ్లీ వాటినే చేపలు తింటుంటాయి. అలా ఈ మాసంలో నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలని అంటారు. పైగా, గర్భంతో ఉన్న జీవాలను చంపి తినడం మంచిది కాదన్న విశ్వాసం కూడా దీనికి మరో కారణం. -
పెళ్లి సందడికి వేళాయె!
శుభముహుర్తాలకు వేళయ్యింది. శ్రావణమాసం.. వరుస ముహూర్తాలు వస్తుండడంతో పల్లెలు, పట్టణాల్లో మళ్లీ పెళ్లి సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి డిసెంబర్ వరకు సుమారు 50కి పైగాముహూర్తాలు వస్తుండడం విశేషం. ఫలితంగా అన్ని జిల్లాలు పెళ్లిళ్లతో.. పందిళ్లు సందడిగా మారనున్నాయి. వివాహ ముహూర్తాలు ఆగస్టులో 8, సెప్టెంబరులో 6, అక్టోబరులో 10, నవంబరులో 14, డిసెంబరులో 14 వరకు ఉండటంతో ముఖ్యంగా కడప జిల్లా మరింత సందడిగా మారింది. అక్కడ జిల్లా వ్యాప్తంగా కల్యాణ మండపాలు పెద్దవి 800 మీడియం 1200 చిన్నవి వాటిల్లోనే ఏకంగా 1000కి పైగా వివాహాలు జరగడమే గాక మొత్తం ఖర్చు రూ. 25కోట్లు వరకు ఉండొచ్చు. ఏప్రిల్‌లో శుభ కార్యాలకు ముహూర్తాలు లేకపోవడం, జూన్‌లో కొన్ని మాత్రమే ఉండడం, జులైలో ఆషాఢమాసం, అధిక శ్రావణం కారణంగా ముహూర్తాలు లేక ఇన్నాళ్లు శుభ కార్యాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆగస్టు 19 నుంచి ముహూర్తాలు ఉండడంతో తమ పిల్లలకు వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబరు వరకు వరుసగా ఎక్కువ ముహూర్తాలు ఉండడంతో దాదాపు వెయ్యికి పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని ఆయా వర్గాల ప్రతినిధులు తెలుపుతున్నారు. ఆగస్టు 16న అమావాస్య అనంతరం నిజ శ్రావణమాసం వస్తుండడంతో 19వ తేదీ నుంచి దాదాపు 10 రోజులపాటు వరుసగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇవి డిసెంబరు వరకు కొనసాగనున్నాయి. కడప జిల్లాలో ఈ సంవత్సరాంతం వరకు ఉన్న 50కి పైగా ముహూర్తాల్లో వెయ్యికి పైగా వివాహాలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 800కు పైగా పెద్ద కల్యాణ మండపాలు, 1200కు పైగా మీడియం మండపాలు, 1000కి పైగా చిన్న మండపాలు ఉన్నాయి. వీటికి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంది. వివాహ ముహూర్తాలు ప్రారంభమయ్యే నాటికి దాదాపు అన్ని కల్యాణ మండపాలు, ముహూర్తాలుగల అన్ని రోజుల్లోనూ ముందే రిజర్వు అయి ఉండడం విశేషం. డిసెంబరు వరకు ఉన్న ఈ సీజన్లో వివాహాల కోసం కనీసం రూ. 15–25 కోట్లవరకు ఖర్చవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సీజన్‌కు ముందు వివాహాలు చేయలేకపోయిన తల్లిదండ్రులకు ఇప్పుడు మంచి ముహూర్తాలు ఆహ్వానం పలుకుతున్నా... పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. విందు భోజనాలు రెండు, మూడు నెలల క్రితం నాటికి విందు భోజనాలు ప్లేటు రూ. 150–180 వరకు ఉండగా, ప్రస్తుతం ఆ ధర రూ. 200–250కి పైగా చేరింది. దీంతో ఘనంగా వివాహాలు నిర్వహించుకోవాలని భావించిన తల్లిదండ్రులకు ధరల దడ పట్టుకుంది. రెండు నెలల క్రితం నాటి ధరలతో పోలిస్తే ఇటీవల కూరగాయల ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. అయినా జీవితంలో ఒక్కసారే నిర్వహించే అపురూపమైన ఘట్టం గనుక వివాహాలను ఘనంగానే నిర్వహించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. వస్త్రాల ధర కూడా 20–40 శాతం పెరిగింది. శ్రావణమాసంతో పండుగల సీజన్ ప్రారంభమైంది గనుక డిమాండ్ పెరిగి ఎక్కువ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది. (చదవండి: ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్ మరింత స్పెషల్!) -
పాక్‌లో ముగ్గురు హిందూ బాలికల కిడ్నాప్
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ వ్యాపారి ముగ్గురు కూతుళ్లను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చి ముగ్గురు యువకులు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. పాకిస్తాన్ దరేవార్ ఇతేహాత్ సంస్థ చీఫ్ శివ కచ్చి ఈ విషయం తెలిపారు. ధార్కి ప్రాంతానికి చెందిన హిందూ వ్యాపారి లీలా రామ్ ముగ్గురు కూతుళ్లు చాందిని, రోష్ని, పరమేశ్ కుమారిలను కొందరు అపహరించుకుపోయారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి అపహరించిన ముగ్గురు ముస్లింలు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారని శివ కచ్చి చెప్పారు. -
గిన్నిస్ పెళ్లిళ్లు
జైపూర్: రాజస్తాన్ పెళ్లిళ్లలో రికార్డు సాధించింది. కేవలం 12 గంటల్లో 2 వేలకు పైగా జంటలకు ముడిపెట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. బారన్లో ఈ సామూహిక వివాహ కార్యక్రమం మే 26న జరిగినట్టుగా గిన్నిస్ వరల్డ్ బుక్ అధికారులు వెల్లడించారు. శ్రీ మహవీర్ గోశాల కళ్యాణ్ సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా కార్యక్రమంలో హిందువులు, ముస్లిం జంటలు కూడా ఒక్కటయ్యారు. 2013లో 24 గంటల్లో 963 పెళ్లిళ్లు జరిపి యెమన్ పేరిట ఉన్న ఈ రికార్డుని బద్దలు కొడుతూ కేవలం 12 గంటల్లోనే 2,413 మంది జంటలకి వివాహం జరిపించారు. అప్పటికప్పుడు ఈ పెళ్లిళ్లను అధికారికంగా రిజిస్టర్ కూడా చేయించారు. -
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన వివాహ వేడుకలు
-
నూరేళ్ల పంటలో.. ఎన్నో వింతలు.. పెళ్లిళ్లు జరిగినా లేటు వయసులోనే!
అన్యోన్యంగా ఉంటే.. పెళ్లి నూరేళ్ల పంట! లేదంటే.. రోజూ ఒక తంటా! మాటా మాటా పెరిగితే... విడాకుల మంట! చిత్రంగా..వివాహం ఏడేడు జన్మల అనుబంధం అని నమ్మే భారతావనిలోనూ..సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని విడాకులు ఇప్పుడు క్షణాల మాటగా మారిపోయాయి. ఇంతోటి దానికి వివాహం ఎందుకు అనుకుంటున్నారో ఏమో కానీ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్లే తగ్గిపోయాయి. అయ్యే ఆ కొద్ది వివాహాలు కూడా కాస్త లేటు వయసులో జరుగుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లు పెరగడం ఇందుకు ఒక కారణంగా కన్పిస్తోంది. ఈ మూడు అంశాల వల్లే.. వైవాహిక వ్యవస్థ్థలో వచ్చిన ఈ మార్పులకు కారణాలేమిటని విశ్లేషిస్తే స్థూలంగా మూడు అంశాలు కనిపిస్తాయి. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండటం. రెండో అంశం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుండటం. ఇక మూడో కారణం అన్ని దేశాల్లోనూ వైవాహిక వ్యవస్థకు సంబంధించిన చట్టాల్లో మార్పులు వస్తుండటం.. పెళ్లి కాని వారి హక్కుల పరిరక్షణనూ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవడం. ఏ రకమైన కుటుంబం కావాలన్న దానిపై యువత స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పలు దేశాల్లోని ప్రస్తుత పరిస్థితులను ఒకసారి చూద్దాం. చాలా దేశాల్లో అరుదుగానే పెళ్లిళ్లు.. అగ్రరాజ్యం అమెరికాలో గత వందేళ్లలో ఎన్నడూ చూడని స్థాయికి పెళ్లిళ్లు తగ్గిపోయాయి. 1920లో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక ఏడాది కాలంలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య 12 మంది దాకా ఉంటే, ఇది క్రమేపీ తగ్గుతూ 2018 నాటికి కేవలం ఏడుకు చేరుకోవడం గమనార్హం. దక్షిణ కొరియాలో ఆరుకు, ఆ్రస్టేలియాలో 5.2కు, లండన్‌లో 4.6కు, ఇటలీలో మరింత తక్కువగా అంటే 3.2కు చేరుకుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వివాహాలు పెరుగుతున్నాయి. చైనా, రష్యా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇరవై ఏళ్ల క్రితంతో పోలిస్తే వివాహాలు ఎక్కువ అవుతున్నాయని అంతర్జాతీయ స్థాయి సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. వయసు మీరుతున్నా... ‘ఏ వయసుకు ఆ ముచ్చట’ అంటారు పెద్దోళ్లు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అస్సలు లేదు. దేశంలో యాభై ఏళ్ల క్రితం పదహారు, పదిహేడేళ్లకే పెళ్లిళ్లు జరిగిపోయి.. పిల్లల్ని కూడా కనేవారు. కానీ ఇప్పుడు? పాతికేళ్ల తరువాతే పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నారు. చదువుసంధ్యలు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడి.. నాలుగు రాళ్లు వెనకేసుకున్న తరువాత కానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టరాదని అనుకుంటున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. పెళ్లి చేసుకునే వయసు చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా ధనిక దేశాల్లో.. మహిళల విషయంలో లేటు మ్యారేజీలు ఎక్కువవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్వీడన్‌ను ఉదాహరణగా తీసుకుంటే 1990లలో సగటు పెళ్లీడు (మహిళలు) 28 ఏళ్లు కాగా.. 2017 నాటికి ఇది 34కు చేరింది. అయితే బంగ్లాదేశ్‌తో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో మాత్రం దశాబ్దాలుగా పెళ్లీడు అనేది చాలా తక్కువగా ఉండటం గమనార్హం. నైజర్‌లో 17 ఏళ్లకే ఆడపిల్లకు పెళ్లి చేసేస్తున్నారు. భారత్‌లో పెళ్లీడు 1992లో 19.20 ఏళ్లుగా ఉండేది. 2015 నాటికి ఇది 21.40కు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విడాకుల్లో హెచ్చు తగ్గులు ఒకప్పుడు విడాకులంటే నలుగురిలో చర్చనీయాంశం. ఇప్పుడు పక్కింటిలోనూ పట్టించుకునే పరిస్థితి లేదు. అంత సాధారణమైపోయింది. దీన్ని బట్టి ప్రపంచం మొత్తమ్మీద విడాకులు పెరిగిపోయాయన్న అంచనాకు వస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే విషయం అంత స్పష్టంగా ఏమీ లేదు. మొత్తంగా చూస్తే విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ వివరాల లోతులకు వెళ్లిన కొద్దీ పరిస్థితుల్లో చాలా తేడాలు కనిపిస్తాయి. అమెరికాలో 1950 ప్రాంతంలో ప్రతి వెయ్యిమంది జనాభాకు విడాకుల శాతం 2.6గా ఉంటే యునైటెడ్ కింగ్డమ్లో కేవలం 0.70గా ఉండింది. 1980 నాటికి అమెరికాలో ఈ సంఖ్య రెట్టింపు కాగా ఆ తరువాత కాలంలో మాత్రం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2018 నాటి లెక్కలు పరిశీలిస్తే విడాకుల సంఖ్య 2.90గా ఉన్నట్లు తెలుస్తోంది. కొరియా, నార్వే, యునైటెడ్ కింగ్డమ్లాంటి దేశాల్లోనూ విడాకులు తీసుకునే వారి సంఖ్య ఒక దశ వరకూ గణనీయంగా పెరిగి ఆ తరువాత తగ్గుతూ వస్తోంది. టర్కీ, ఐర్లాండ్, మెక్సికోలలో మాత్రం ఇప్పటికీ పెరుగుతూనే ఉండటం గమనార్హం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే విడాకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలామంది ఎక్కువ కాలం కలిసి ఉన్న తరువాతే విడిపోతుండటం. అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ విడాకులు ఏ దేశంలో ఎక్కువ.. ఏ దేశంలో తక్కువ అన్న విషయంలో పలు అధ్యయనాలు, సర్వేలు రకరకాల ఫలితాలు వెల్లడించినప్పటికీ.. భారత్ విషయంలో మాత్రం అన్ని అధ్యయనాలు ఏకగ్రీవంగా చెబుతున్న మాట.. ఇక్కడ విడాకులు శాతం ప్రపంచంలోనే అతి తక్కువ(1%) అని. ఈ అధ్యయనాల ప్రకారం తర్వాతి స్థానాల్లో వియత్నాం, ఇరాన్ వంటివి ఉన్నాయి. అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్న దేశాల్లో పోర్చుగల్, మాల్దీవులు, లక్సెంబర్గ్, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్ వంటివి ఉన్నాయి. కారణాలివే.. అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, సరైన కమ్యూనికేషన్ లేక పోవడం, వాగ్వాదాలు, ఘర్షణలు, ఊబకాయం, వాస్తవికత లోపించిన అంచనాలు, సాన్నిహిత్యం లేకపోవడం, అసమాన్యత, హింస, అలవాట్లు వంటివి విడాకులు తీసుకునేందుకు ఉన్న సార్వజనీన కారణాలు. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే అంతే.. ఒక్కసారి కమిట్ అయితే.. జీవితాంతం కలిసుండాల్సి వచ్చే దేశాలు రెండే రెండు. ఒకటి వాటికన్ సిటీ. రెండోది ఫిలిప్పీన్స్. ఇక్కడ చట్టపరంగా విడాకులు తీసుకునేందుకు అస్సలు అవకాశమే లేదు. కాకపోతే ఫిలిప్పీన్స్‌లో ముస్లింలు షరియా చట్టం కింద విడాకులు పొందే అవకాశముంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్కూ విడాకులను వర్తింపజేసిన తొలి దేశంగా నెదర్లాండ్స్ 2000లో రికార్డు సృష్టించింది. తరువాతి కాలంలో ఇప్పటివరకు సుమారు 30 దేశాల్లో ఇదే తరహా చట్టాలు చేశారు. పెళ్లికి.. పిల్లలకు సంబంధం లేదు! వైవాహిక వ్యవస్థలో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న అతిపెద్ద ట్రెండ్ పెళ్లికి, సంతానం కలిగి ఉండటానికి మధ్య సంబంధం లేకపోవడం. అంటే.. పిల్లల్ని కనాలనుకుంటే కనడం మినహా అందుకు పెళ్లి తప్పనిసరి అన్న భావన తొలగిపోతోందన్నమాట. మరీ ముఖ్యంగా ఈ ధోరణి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌పెంట్ (ఓఈసీడీ) దేశాల్లో గణనీయంగా పెరిగిపోతోందని తెలుస్తోంది. సుమారు 38 దేశాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో పెళ్లి కాకుండా... లేదా సహజీవనం ద్వారా పిల్లల్ని కంటున్న వాళ్లు లేదా పెంచుకుంటున్న వారి శాతం 1960లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువైంది. కోస్టారికాలో సుమారు 70 శాతం మంది పిల్లల జననానికి పెళ్లిళ్లతో సంబంధం లేదు. ఇది మెక్సికోలో 65 శాతంగా, డెన్మార్క్‌లో 52 శాతంగా ఉంది. నెదర్లాండ్స్ (48), స్లొవేకియా (38), జర్మనీ (35) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గణాంకాలు అందుబాటులో ఉన్న దేశాల్లో చిట్టచివరన ఉన్నది కొరియా (1.9 శాతం). అమెరికాలోని న్యూయార్క్, మిసిసిపీ రాష్ట్రాల్లో భార్య లేదా భర్త అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని నిరూపించగలిగితే ‘ఏలియనేషన్’ ఆఫ్ అఫెక్షన్ కింద నష్టపరిహారం కోరుతూ కేసులేయవచ్చు. అల్యూటియాన్ దీవుల్లో పురుషులకు భార్యంటే మొహం మొత్తితే.. వస్తు మార్పిడి మాదిరిగా ఆహారం లేదా దుస్తుల కోసం వదిలించుకోవచ్చు! కెనడాకు పశ్చిమంగా... జపాన్‌కు తూర్పు దిక్కున ఉంటాయీ ద్వీపాలు. 99 ఏళ్ల వయసులో విడాకులు! 99 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్న వ్యక్తిగా 2011లో ఓ ఇటాలియన్ రికార్డు సృష్టించాడు. అరవై ఏళ్ల వైవాహిక జీవితం తరువాత భార్య తన ప్రియుడికి నలభై ఏళ్ల క్రితం రాసిన ప్రేమలేఖలు ఈయన కంటపడ్డాయి. అంతే 96 ఏళ్ల భార్యతో తెగతెంపులు చేసేసుకున్నాడు. 1934లో జరిగిన వీరి పెళ్లి.. 2011లో పెటాకులైంది. -కంచర్ల యాదగిరిరెడ్డి -
డుండుండుం పిపిపి.. మే, జూన్ నెలల్లో 24 పెళ్లి ముహూర్తాలు.. తేదీలివే!
సాక్షి, అమరావతి: మండు వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే, జూన్ నెలల్లో దాదాపు 24 శుభముహూర్తాలు ఉన్నట్టు పండితులు ప్రకటించారు. గత శుభకృతు నామ సంవత్సరం(2022–23)లో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వచ్చిన శుభ ముహూర్తాలకు ఏపీ, తెలంగాణలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు నుంచి నవంబర్ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. మళ్లీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు పెళ్లిళ్లు జరిగాయి. డిసెంబర్ 16 నుంచి ఈ ఏడాది జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో వివాహాలు చేయలేదు. జనవరి 19 నుంచి మార్చి 9 వరకు మొత్తం 18 శుభ ముహూర్తాలు వచ్చాయి. మళ్లీ నెల రోజుల విరామం తర్వాత తాజాగా మే నెలలో 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 తేదీలతో పాటు జూన్‌లో 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు ప్రకటించారు. ఇప్పుడు కాకుంటే మరో 2 నెలలు బ్రేక్.. మే మాసం అంతా వరుసగా మంచి ముహూర్తాలున్నాయి. జూన్ నెలలో కూడా 18వ తేదీ వరకు అనువైన ముహూర్తాలు బాగానే ఉన్నాయి. 19వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలుకానుండటంతో మళ్లీ శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. ఆషాఢ మాసం జూలై 18 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసం, అధిక శ్రావణ మాసం ఆగస్టు 17 వరకు ఉంటుంది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో పెళ్లిళ్లకు బ్రేక్ పడుతుందని పండితులు చెబుతున్నారు. వివాహాలకే.. గృహ ప్రవేశాలకు అనుకూలించవు ప్రస్తుత వైశాఖం, జ్యేష్ఠ మాసాల్లో దాదాపు 25 మంచి ముహూర్తాలున్నాయి. వీటిలో చాలా ముహూర్తాలు పెళ్లిళ్లు, ఉపనయనాలకు బాగా అనుకూలిస్తాయి. మే 11 నుంచి 24వ తేదీ వరకు అగ్ని కార్తె ఉండటంతో ఆ సమయంలో వచ్చే ముహూర్తాలు గృహ ప్రవేశాలకు అనుకూలించవు. జూన్ నెలాఖరు వరకు ముహూర్తాలున్నప్పటికీ ఆషాఢం వస్తుంది. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు ముహూర్తాలు ఉండవు. అందుకే మే, జూన్ నెల మొదట్లోనే వివాహాలు జరిపించేందుకు చాలా మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – కొత్తపల్లి సూర్యప్రకాశరావు, పురోహితుడు, భీమవరం -
కీలక నిర్ణయం.. ఇకపై ఖరీదైన పెళ్లిళ్లు, వేడుకలు వద్దు!
జైపూర్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన వేడుక. ఇద్దరు వ్యక్తులు కలిసి ఏడడుగులు నడిచి జీవితాంతం ఒక్కటిగా ఉండాలని తెలిపే వేడుక వివాహం. అందుకే యువత వివాహం అనగానే, ఫోటో షూట్, సంగీత్, అంటూ బోలెడు ప్లాన్లు చేసుకుంటారు. దీని కోసం వాళ్లు ఎంతటి ఖర్చైన చేయడానికి వెనుకాడరు. ఇంకొందరైతే తమ స్థోమతకు మించి అప్పులు చేసి మరీ ఘనంగా జరుపుకుంటారు. వివాహం అనంతరం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వీటికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో భిల్వారా జిల్లాకు చెందిన జాట్ కమ్యూనిటీ పెళ్లి వేడుకల నిర్వహణపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ భిల్వారా ఆధ్వర్యంలో జాట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. దీని ప్రకారం.. రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ ప్రధాన కార్యదర్శి శోభరామ్ జాట్ మాట్లాడుతూ సమాజంలో ఎక్కువగా జరుగుతున్న పెళ్లిళ్లు, ఇతర ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారు. వివాహాలతో పాటు ఇతర వేడుకలలో.. మౌసర్లో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. వీటితో పాటు కార్యక్రమాలకు హాజరుకావాల్సిన సంఖ్యను కూడా పరిమితి చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై గరిష్టంగా 500 నుంచి 700 మంది పురుషులు హాజరుకావచ్చు. అంతే కాకుండా నగదు పరంగా కూడా కొన్ని పరిమితులు విధించుకున్నారు. వీటితో పాటు పెళ్లికి భారీ మొత్తంలో వెచ్చిస్తున్న ఖర్చుకు అడ్డుకట్ట వేస్తూ సమాజంలో సామూహిక వివాహాలను ప్రోత్సహించనున్నారు. అదే విధంగా.. ఇతర వేడుకల విషయంలో కూడా ఆయా కుటుంబాలు వారికి తాహాతులో ఖర్చు చేయాలని కమిటీ సూచించింది. -
Generation-Z: వీకెండ్ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు
పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టనష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది... ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్ జెడ్ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్ మ్యారేజెస్ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్‌లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి... వీకెండ్ మ్యారేజెస్ అంటే..? ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్‌లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు. వీకెండ్ కాపురాలకు కారణాలు ► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్‌స్టైల్ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు ► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్‌లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్‌లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్‌తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్ప్రైజ్లు, రొమాన్స్‌లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్ వారికి దొరుకుతుంది. భారత్‌లో కుదిరే పనేనా..? వీకెండ్ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్‌లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్‌లో కలవడమే బెటర్ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్ జామ్‌లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు. మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్మెంట్తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి. అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది. ‘‘భారత్‌లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’ – శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా బ్యాచ్.. కన్యాశుల్కం
ఇది సీరియస్ విషయమో... సరదా అంశమో చివరిలో మాట్లాడుకుందాం. ముందుగా సరదాగా మొదలుపెడదాం. నిజానికి చైనా బ్యాచ్లర్స్ గురించి మాట్లాడుకోవాలి.. ఇండియాలోని బ్యాచ్‌లర్ తన యాంగిల్లో చెబుతున్న ‘భోజరాజు కథ’ ముందుగా విందాం. ఇందులో కాస్త కడుపుమంట కనిపిస్తుంది. భోజరాజీయం కథ ఇదీ.. ఓ పేద బ్రాహ్మణుడు. చదువు సంధ్యాలేదు. ఇల్లూవాకిలీ లేవు. ఏమీ లేని వారికి పిల్లనెవరిస్తారు. అందుకే సత్రాల్లో కాలక్షేపం చేస్తూ, ఊరూరూ తిరుగుతూ కాశీ చేరాడు. అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పుడు మోదీ పీఎం అయ్యాక బాగా డెవలప్ చేసినట్టున్నారు కానీ, అప్పుడంత సీన్ లేనట్లుంది. భోజనానికి ఢోకాలేకుండా కొంతకాలం నడుస్తోంది. విభూది పూసుకుని శివావతారంలో దేశ సంచారం చేసే బృందమొకటి కనిపించింది. వారితోపాటు కలిసి తిరుగుతూ, వారు ప్రయాగ యాత్రకు వెళుతుంటే వారితో పాటు ప్రయాగకు చేరాడు. ఏమీ పాలుపోక, చేసేదేమీ లేక అక్కడ పుష్కరిణి నది వద్ద కూచున్నాడు. ఇంతలో అక్కడికి నలుగురు అమ్మాయిలు వచ్చారు. చాలా అందగత్తెలు. నలుగురు మాట్లాడుకుంటూ నదిలోకి దూకారు. ఇదంతా మనవాడు గమనిస్తున్నాడు. ఒకమ్మాయి.. నాకు నవ మన్మథాకారుడు, చక్రవర్తి భర్తగా కావాలి..అని చెప్పుకుంటూ దూకింది. మరొకామె.. నాకు కండల వీరుడు కావాలి.. అన్నది. ఇంకొకామె.. నాకు కవీశ్వరుడు భర్తగా రావాలి అని కోరుకున్నది. చివరి అమ్మాయి.. వచ్చే జన్మలో నాకు సంగీత లలిత కళా వల్లభుడు భర్తగా కావాలి అనుకుంటూ దూకేసింది. ‘ఈ జన్మలో ఇలాంటివి సాధ్యం కాదు..వచ్చే జన్మలోనైనా సాధ్యపడేలా చెయ్యి దేవుడా..’ అంటూ ప్రార్థిస్తూ, ఇలా అయితే వచ్చే జన్మలో తప్పక సిద్ధిస్తుంది అనుకుంటూ ఆనందంగా దూకేశారు. ఇదంతా వింటున్న మన హీరో బుర్ర పాదరసంలా పని చేసింది. వచ్చే జన్మలో ఆ నలుగురు నాకు భార్యలు కావాలి అంటూ తానూ దూకేశాడు. ఆ తర్వాత జన్మలో మనవాడు భోజరాజుగా జన్మించాడు. వారందరూ అన్ని లక్షణాలు, ఐశ్వర్యం, రాజ్యం ఉన్న భోజరాజుకు భార్యలయ్యారు ఇదీ కథ. కడుపు మంట ఇదీ.. ‘...ఇప్పుడు యూత్ అంతా భోజరాజులయితే కానీ పెళ్లి అయ్యేట్లు లేదు. కనీసం ఆ కాలంలో ఒక్కొక్క వరుడిలో ఒక్కో క్వాలిటీ అడిగారు. కానీ, ఈ తరం అమ్మాయిలు అన్ని లక్షణాలూ ఒక్కడిలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందగాళ్లు, ఎన్ఆర్ఐ సంబంధాలు, హై ఎడ్యుకేషన్లు, లక్షల్లో ప్యాకేజీలు, కార్లు, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు.. ఒక్కటేమిటి అన్నీ..’ ‘..ఇప్పుడు నాకు 33 సంవత్సరాలు వచ్చాయి.. ఎన్నో సంబంధాలు పోయాయి.. నెత్తి మీద అరెకరం మిగిలింది.. క్యాంపస్ సెలెక్షన్లు, సంపన్న సంబంధాలు పోను మా లాంటి థర్టీ ప్లస్ గాళ్లం ‘లెఫ్ట్ ఓవర్’లాగా మిగిలిపోయాం,. ఏ మ్యాట్రిమోనీకి పోయినా.. ఎంత ఏజీ, ఎంత ప్యాకేజీ, వెనుక ఎంత బ్యాగేజీ అని అడుగుతున్నారు. ఇక ఈ జీవితానికి ఇంతే..’ – సోషల్ మీడియాలో ఓ బ్యాచ్‌లర్ సోదరుడి బాధ. మరి చైనా కథేంటీ అంటారా... ఇండియాలోని పెళ్లికాని ప్రసాదులకే ఇన్ని బాధలుంటే మనకు మించిన జనాభా ఉన్న.. చైనాలో బ్యాచ్లర్స్ బాధ ఇంత కన్నా ఎక్కువ. అక్కడో వరుడు అచ్చంగా కోటి రూపాయలకు పైగా వధువుకు ‘కన్యాశుల్కం’ సమర్పించుకున్నాడు. కన్యాశుల్కం అంటే తెల్సుగా.. మన దగ్గర వరకట్నానికి రివర్స్. అక్కడ కన్యాశుల్కం బాగా పెరుగుతోంది. మార్కెట్లో లక్షలు పలుకుతోందట! కరోనా వైరస్లాగా చైనా నుంచి కన్యాశుల్కం మనదేశానికి పాకుతుందేమోనని మన యూత్, పెళ్లి కాని ప్రసాద్‌ల బ్యాచ్.. చైనా బ్యాచ్‌ను చూసి బెంబేలెత్తుతున్నారని సోషల్ మీడియా భోగట్టా. చైనా బ్యాచ్.. ‘కన్యాశుల్కం’ చైనాలో చాలా కాలంగా కన్యాశుల్కం ఆచారం ఉంది. కానీ అది నామ్కేవాస్తే లాగా ఉండేది. కమ్యూనిస్టు పాలనలో కూడా అది విజృంభిస్తూనే ఉంది. ఈ కన్యాశుల్కం 60–70వ దశకంలో మంచాలు, పరుపులు లాంటి చిన్న గిఫ్టుల నుంచి, 80వ దశకంలో టీవీలు, ఫ్రిజ్‌ల దాకా చేరింది, 1990లలో అక్కడ ఆర్థిక సంస్కరణల అమలు మొదలయ్యాక, కన్సూమరిజం పెరగడం, ఆర్థిక అంతరాలు పెరగడంతోపాటు లైంగిక వివక్ష పెరగడంతో కన్యాశుల్కం రాకెట్ వేగం అందుకుంది. కార్లు, రియల్ ఎస్టేట్ దాకా పోయింది. ఇప్పుడు పురుషులు వధువుకు, వధువు కుటుంబానికి కానుకల రూపంలో లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తోందట. కార్లు లాంటి వాహన రూపంలో, ఆస్తుల రూపంలో సమర్పించుకుంటున్నారు. దీన్నే ‘బ్రైడ్ ప్రైస్’ అంటున్నారు. ఈ సంప్రదాయం ఎక్కువగా చైనా గ్రామీణ ప్రాంతంలో కనిపించేది. ఇప్పుడు సిటీలకు కూడా బాగా పాకుతోంది. ఇటీవల ఓ వధువు కుటుంబం కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేయడం, అది మీడియాలో బాగా చర్చ కావడంతో అందరి దృష్టి చైనా బ్యాచ్లర్ల కష్టాలపై పడింది. చివరికి చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా దీనిపై దృష్టి పెట్టడం దీని సీరియస్‌నెస్‌కు అద్దం పడుతోంది. చైనా ‘వన్’ వే.. చైనా ఏది చేసినా కరోనా స్థాయిలోనే చేస్తుంది. జనాభా పెరిగిపోతోందన్న ఆందోళనతో దశాబ్దాల పాటు ఒకే బిడ్డను కనాలన్న ‘వన్ చైల్డ్’ పద్ధతిని చాలా సీరియస్‌గా ఇంప్లిమెంట్ చేసింది. ఇండియాలో లాగానే.. మగబిడ్డ కావాలనే సెంటిమెంట్ చైనా సమాజంలో కూడా ఉంది. దానితో వారు కనే ఒక్క బిడ్డను మగబిడ్డను కనడానికే ఆసక్తి చూపారు. ఇది తీవ్ర లింగ వివక్షకు దారితీసి లింగ నిష్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. మగబిడ్డ కావాలనే ఆకాంక్ష వల్ల అమ్మాయిల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2017లో చేసిన ఒక సర్వేలో 100 మంది పెళ్లికాని పురుషులకు 66 మంది పెళ్లి కానీ స్త్రీలే ఉన్నట్లు తేలింది. చైనాలో 1986 నుంచి ప్రతి మ్యారేజ్‌ను రిజిస్టర్ చేయాలన్న రూల్ తెచ్చారు. ఈ లెక్కల ప్రకారం 2021లో 76 లక్షల పెళ్లిళ్లు రిజిస్టర్ అయ్యాయి. పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనే నిబంధన వచ్చాక అతి తక్కువ పెళ్లిళ్లు అయిన ఏడాది ఇదే. యువత లేట్‌గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మ్యారేజ్ ఏజ్ పెరిగింది. ఒంటరిగా ఉండిపోతున్న అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. తద్వారా కన్యాశుల్కం పెరుగుతోంది. అక్కడ అన్నీ ఆర్థిక హంగులున్న భోజరాజులకు మాత్రమే పెళ్లిళ్లు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఇక్కడా వస్తుందేమోనని చైనా బ్యాచ్‌ను చూసి మన ఇండియా బ్యాచ్ బ్యాచ్లర్ల భయం. ఎంకరేజ్ ‘వ్యాక్సిన్’.. పైన చెప్పిన కారణాలు, వన్చైల్డ్ సిస్టమ్‌తో జనాభా తగ్గిపోవడంతో వన్చైల్డ్ పద్ధతికి చైనా స్వస్తి పలికింది. అయినా 2022లో చైనా జనాభా తగ్గింది. ప్రపంచానికి భిన్న పోకడ ఇది. ఇది తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందేమోనన్న కంగారు పడుతున్న చైనా సర్కారు ఇప్పుడు ఎక్కువ మందిని కనాలని ఎంకరేజ్ చేస్తోంది. మ్యారేజ్ చేసుకున్న కొత్త దంపతులకు ఇప్పటిదాకా మూడు రోజులు పెయిడ్ లీవ్‌లు ఉండేవి. ఇప్పుడు వాటిని 30 రోజులకు పెంచారు. ప్రపంచంలోనే రెండు అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టం అవుతోంది. పెళ్లి.. ఆర్థిక, సామాజిక సమస్యగా మారింది. పెళ్లి ‘మార్కెట్’ కావడంతో ..మార్కెట్లో నిలబడలేని ఎంతోమంది పెళ్లి కాకుండానే ఉండిపోతున్నారు. ప్యాకేజీల కోసం, విదేశాల్లో ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. చైనాలో పెరుగుతున్న కన్యాశుల్కం ఓ రకంగా అమ్మాయిలను మార్కెట్లో పెట్టడమే.. అంగడి సరుకుగా మార్చడమే! ఈ పరిస్థితి.. ఆడపిల్ల అమ్మ కడుపులో ఉండగానే సమాజం మూకుమ్మడిగా కత్తులు దూసినందుకు తగిలిన ఉసురు కాదా..?.. ఇదీ సీరియస్ అంశం! -సరికొండ చలపతి -
లింగ, మతప్రమేయం లేని... ఉమ్మడి చట్టాలు చేయొచ్చా?
న్యూఢిల్లీ: శాసన వ్యవస్థ పరిధిలోని అంశాలపై న్యాయ వ్యవస్థ జోక్యంపై సుప్రీంకోర్టు సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు, విడాకులు, మనోవర్తి, వారసత్వం వంటి అంశాల్లో లింగ, మతప్రమేయం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించేలా ఉమ్మడి చట్టాలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘వీటిపై శాసన వ్యవస్థకు కోర్టులు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చా? ఈ మేరకు కేంద్రానికి నిర్దేశాలు జారీ చేయొచ్చా?’’ అంటూ సందేహాలు లేవనెత్తింది. శాసన వ్యవస్థ పరిధిలోని ఈ అంశాలపై న్యాయ జోక్యం ఏ మేరకు ఉండొచ్చన్నదే ఇక్కడ కీలక ప్రశ్న అని అభిప్రాయపడింది. ఇలాంటి అంశాల్లో ఉమ్మడి చట్టాలకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. విచారణను ధర్మాసనం నాలు గు వారాల పాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించాలో, వద్దో అప్పుడు తేలుస్తామని పేర్కొంది. ‘అందరికీ ఒకే వివాహ వయసు’ పిటిషన్ కొట్టివేత స్త్రీ, పురుషులందరికీ చట్టబద్ధంగా ఒకే కనీస వివాహ వయసుండేలా చట్టం తేవాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం కొట్టేసింది. ‘ఇది పార్లమెంటు పరిధిలోని అంశం. దానిపై మేం చట్టం చేయలేం. రాజ్యాంగానికి మేం మాత్రమే ఏకైక పరిరక్షకులం కాదు. పార్లమెంటు కూడా ఆ భారం వహిస్తోంది’ అని అభిప్రాయపడింది. కనీస వివాహ వయసు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు. -
పద్దెనిమిదికి ముందే పెళ్లి!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోవిడ్... ప్రతి మనిషిని ఆరోగ్యపరంగా, ఆర్థికం గా కుంగదీసింది. ఉపాధినీ దెబ్బతీసింది. ఆ మహమ్మారి వ్యాప్తి తగ్గినా... దాని ప్రభావం మాత్రం సమాజంపై వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది. మనుషుల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తూనే ఉంది. కోవిడ్ చేసిన గాయం కారణంగా అభద్రతాభావానికి గురవుతున్న తల్లిదండ్రులు తమ కుమార్తెలకు వయసుతో నిమిత్తం లేకుండా వెంటనే పెళ్లిళ్లు చేయాలనే భావనలోకి వచ్చారని యూనిసెఫ్ నిర్వహించిన సర్వేలో తేలింది. అందువల్లే దేశవ్యాప్తంగా 2022లో జరిగిన పెళ్లిళ్లలో 25.3శాతం మంది అమ్మాయిలు 18 ఏళ్లు నిండనివారే ఉన్నారని వెల్లడించింది. ఇందుకు కొన్ని కారణాలను ఈ సర్వేలో గుర్తించినట్లు తెలిపింది. మొదటి స్థానంలో పశ్చిమబెంగాల్ పద్దెనిమిదేళ్ల వయసు నిండకముందే అమ్మాయిలకు వివాహాలు చేస్తున్న రాష్ట్రాల్లో పశి్చమ బెంగాల్ తొలి స్థానంలో నిలిచింది. అక్కడ 41.6 శాతం బాల్యవివాహాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో బిహార్ (40.8 శాతం), త్రిపుర (40.1శాతం), జార్ఖండ్ (32.2 శాతం), అస్సాం(31.8 శాతం), ఆంధ్రప్రదేశ్ (29.3 శాతం) ఉన్నాయి. జమ్మూ–కశీ్మర్లో అత్యంత తక్కువగా 4.5 శాతం, కేరళలో 6.3 శాతం చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేసినట్లు యూనిసెఫ్ గుర్తించింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో బాల్యవివాహాల పరిస్థితి మన రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 37.3 శాతం చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత స్థానాల్లో ఉమ్మడి కర్నూలు (36.9 శాతం), గుంటూరు (35.4 శాతం), విజయనగరం (33.7 శాతం), చిత్తూరు (28.1 శాతం), తూర్పుగోదావరి (26.0 శాతం), వైఎస్సార్ కడప (25.6 శాతం), శ్రీకాకుళం (25.4 శాతం), విశాఖపట్నం (25.4 శాతం), కృష్ణా (25.3 శాతం), నెల్లూరు (23.8 శాతం), పశి్చమగోదావరి (22.1 శాతం) చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు 2022లో వివాహాలు చేసినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. ప్రధాన కారణాలు ఇవీ... ► కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్లు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. పది, ఇంటర్ చదువుతున్నవారు ఆన్లైన్ తరగతుల కారణంగా చదువులో రాణించలేకపోయారు. ఫలితంగా డ్రాపవుట్స్ పెరిగాయి. ► చదువు మధ్యలో ఆపేసిన ఆడపిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. ► కరోనా రాకముందు వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి సొంత గ్రామాలకు వచ్చేశాయి. నిరుద్యోగిత పెరగడంవల్ల ఆరి్థకంగా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ► అందువల్ల అభద్రతాభావంతో పెళ్లీడు రాకపోయినా ఆడపిల్లలకు వివాహాలు చేస్తే బాధ్యత తీరిపోతుందని ఎక్కువ మంది తల్లిదండ్రులు భావిస్తున్నట్లు సర్వేలో గుర్తించినట్లు యూనిసెఫ్ ప్రకటించింది. -
‘వెడ్డింగ్’ ఈవెంట్ ట్రెండింగ్.. ఈవెంట్ మేనేజ్మెంట్పై స్పెషల్ ఇంట్రెస్ట్
కర్నూలు (టౌన్): పెళ్లంటే పందిళ్లు.. తాళాలు..తలంబ్రాలే కాదు..సరికొత్తగా ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా వీటికి జత కలిసింది. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డల పెళ్లి చేయాలంటే హైరానా పడేవారు. సమయానికి ఏవైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన చెందేవారు. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యవహారాన్ని సులువు చేసింది. పెళ్లి ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు అంతా వారే చూసుకుంటున్నారు. జీవన శైలిలో మార్పుతో.. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. బంధువులంతా తలా ఒక చేయి వేసి పెళ్లి తంతును నడిపించేవారు. వివాహ ప్రక్రియ పెళ్లి చూపులతో మొదలవుతుంది. నిశ్చితార్థం, మూహూర్తం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, బ్రహ్మముడి, హోమం, అరుంధతీ నక్షత్ర దర్శనం ఇలా వివాహ వేడుకలో కీలక ఘట్టాలు ఉంటాయి. కుటుంబసభ్యులు, బంధువులు కలిస్తే తప్ప ఈ తంతు సజావుగా సాగదు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేవు. మారిన జీవన శైలితో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. వివాహ వేడుకల్లో పనిచేసే బంధువులు కరువయ్యారు. దీంతో చాలా మంది ఈవెంట్ మేనేజ్మెంట్పై ఆధారపడ్డారు. ( ఫైల్ ఫోటో ) సినిమాటిక్ ఈవెంట్‌లా.. భారీ సెట్టింగ్‌లు.. ఎల్ఈడీ స్క్రీన్లు..అర్కెస్ట్రా..తదితర హంగులతో సినిమాటిక్ ఈవెంట్‌లా వివాహాలు జరు గుతున్నాయి. మేకప్ ఆర్టిస్టులు, క్యాటరింగ్ సర్వీసెస్, వెల్కమ్ గర్ల్స్... ఇలా సరికొత్తగా వేడుక సాగుతోంది. గతంలో ఇంటి పెద్దలు, తల్లిదండ్రులు వివాహ తంతును పర్యవేక్షణ చేసేవారు. నేడు యువతీయువకుల అభీష్టాల మేరకు పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. ఇందుకు ఖర్చుకు సైతం వెనుకాడటం లేదు. క్యాటరింగ్లో వినూత్న మార్పులు పెళ్లి వేడుకలో షడ్రుచులతో భోజనం ఏర్పాటు చేయడం అనవాయితీ. ఇప్పుడు క్యాటరింగ్లో మార్పులు వచ్చాయి. పనస పండు బిర్యానీ నుంచి రాయలసీమ రుచులు, కోనసీమ రుచులు, హైదరబాద్ బిర్యానీ వరకు ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. వెడ్డింగ్, కార్పొరేట్, సోషల్ ఈవెంట్ క్యాటరింగ్‌లకు డిమాండ్ ఉంటోంది. కర్నూలు నగరంలో 10 వరకు పెద్ద స్థాయి క్యాటరింగ్‌లు ఉన్నాయి. వంట మనుషులను హైదరాబాద్ నుంచి కర్నూలు రప్పిస్తున్నారు. అతిథులకు ప్రత్యేక వంటకాలు అందించేందుకు కొంత మంది ఖర్చుకు వెనుకాడడం లేదు. సొంతంగా పెళ్లి మంటపాలు ఒకరు వాడిన మంటపాలు, షామియానాలు, సైడ్‌వాల్స్ కాకుండా ఉన్నస్థాయి వర్గాల వారు సొంతంగా పెళ్లి మంటపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ఈవెంట్ మేనేజర్లు జర్మన్ హ్యాంగర్లు తెప్పిస్తున్నారు. బెస్ట్ ఫాక్ట్ వెడ్డింగ్ పేరుతో 3 వేల మంది నుంచి 10 వేల మందితో పెళ్లి తంతును ఘనంగా జరిపిస్తున్నారు. కర్నూలు నగరంలో 3 వేల మందితో ఎన్నో వివాహ కార్యక్రమాలు జరిగాయి. పెళ్లి మంటపాలను పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నిర్మిస్తారు. డెకరేషన్ కోసం బెంగళూరు నుంచి పూలను తెప్పిస్తున్నారు. కాక్టెయిల్ పారీ్టలు, లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ ఫ్లోర్ లైటింగ్.. ఇలా వివాహ తంతులో అధునికత కనిపిస్తోంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సంప్రదాయాలను కొనసాగిస్తూ ఘనంగా వివాహం చేసుకోవాలన్న ఆలోచన పెరిగింది. అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకునే క్రమంలో తల్లిదండ్రులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఈవెంట్ మేనేజ్మెంట్ మార్కెట్లోకి వచ్చింది. సినిమా ఈవెంట్స్ తరహాలో వేడుక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – సందీప్, ఈవెంట్ మేనేజర్, కర్నూలు కోరిన భోజనం అందిస్తున్నాం పెళ్లిళ్లలో క్యాటరింగ్ సంస్కృతి పెరిగింది. నిర్వాహకులు కోరిన విధంగా వంటకాలు తయారు చేస్తున్నాం. రైస్, పలావ్, 24 రకాల టిఫిన్స్, 53 రకాల స్వీట్. 25 రకాల నార్త్ ఇండియన్ ఐటమ్స్, నాన్‌వెజ్‌లో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, నాటుకోడి..ఇలా 30 రకాల వంటకాలు అందిస్తున్నాం. హైదరాబాద్ నుంచి వంటవారిని రప్పిస్తున్నాం. – ఆవుల లింగన్న, క్యాటరింగ్ నిర్వాహకుడు. -
ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్ ప్రభావితం చేస్తున్నాడా?
‘నేను పెళ్లి చేసుకునే అబ్బాయి ఫలానా హీరోలా ఉండాలి’ ‘నాకు భార్య కావాలంటే ఆ అమ్మాయికి అదృష్టం ఉండాలి’ ఇలాంటి... డైలాగ్‌లు టీన్స్ నుంచి ట్వంటీస్ వరకు చెప్పేవే. అమ్మానాన్నలు తెచ్చిన సంబంధాలు వాస్తవంలోకి తెచ్చేవి. అనేకానేక రాజీలతో బాసికానికి తలవంచి ఏడడుగులు పడేవి. అది ఒకప్పుడు... ఇప్పుడు కాలం మారింది. ట్రెండ్ మారింది. కొత్తకాలంలో కట్నం కాలగర్భంలోకి కలిసిపోనుందా? అయితే... ఇది మంచి పరిణామమే. అమ్మాయి విద్య ఉద్యోగాలతో సాధికారత సాధించిందా? అయితే... ఇది ఇంకా గొప్ప శుభపరిణామమే. భాగస్వామి ఎంపికలో యువత ప్రాధాన్యాలెలా ఉన్నాయి? ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్ ప్రభావితం చేస్తున్నాడా? అధ్యక్షుడిగా ట్రంప్ పోయినా ట్రంప్ భయం ఇంకా ఉందా? ‘పెళ్లిలో పెళ్లి కుదరడం’ ఒకప్పటి మాట. అంటే బంధువుల పెళ్లిలో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు బంధువులందరి దృష్టిలో పడతారు. ఏం చదువుకున్నారు? ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? వంటి వివరాలన్నీ కబుర్లలో భాగంగా బంధువులందరికీ చేరిపోయేవి. అబ్బాయికీ, అమ్మాయికీ బంధుత్వం కలిసే ఎవరో పెద్దవాళ్లు ఎవరో ఓ మాటగా అంటారు. మాటలు కలుపుకుంటారు. పెళ్లి కుదిరేది. శ్రావణమాసం పెళ్లిలో కలిసిన అమ్మాయి, అబ్బాయి విజయదశమి ముహూర్తాల్లో వధూవరులయ్యేవాళ్లు. మరి ఇప్పుడు... కాలం మారింది. ఎంతగా మారిందీ అంటే... బంధువులను కూడా ఫేస్బుక్లో ఫ్రెండ్స్‌గా పలకరించుకునే తరం ఇది. దగ్గరి బంధువుల అమ్మాయి, అబ్బాయిల వివరాలు కూడా మ్యారేజ్ బ్యూరోల ద్వారా తెలుస్తున్న పరిస్థితి. సమాజంలో వచ్చిన ఈ మార్పుతోపాటు... జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో వచ్చిన మార్పు కూడా పెద్దదే. నుదుట బాసికాలు, మెడలో పూలదండలు ధరించకపోతే పెళ్లిపీటల మీద ఉన్న వాళ్లు వధూవరులా లేక కన్యాదాతలా అనే సందేహం కూడా ఎదురవుతుంటుంది. ‘తొలి ప్రసవం కనీసం ముప్పై ఏళ్ల లోపు జరగడం శ్రేయస్కరం’ అని వైద్యరంగం చెబుతూనే ఉంది. కానీ ఉన్నత విద్యావంతులైన అమ్మాయిలు పెళ్లికి సిద్ధమయ్యేటప్పటికే ముప్పయ్ దాటుతున్నాయి. ఆలస్యానికి కారణాలు ఒకటి–రెండు కాదు, అనేకం. భాగస్వామిని ఎంచుకోవడం పట్ల సమాజం ఎలా ఉందో తెలియాలంటే మ్యారేజ్ బ్యూరోతో మాట్లాడడం ఓ సులువైన మార్గం. హైదరాబాద్‌లోని అవినాష్‌రెడ్డి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు కోటిరెడ్డి, జ్యోతి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు జొన్నలగడ్డ జ్యోతి, శ్రీకాకుళంలోని శ్రీసాయి నరసింహ సేవాసంఘం నిర్వహకులు కరణం నరసింగరావు, తిరుపతికి చెందిన సాయి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు పసుపులేటి శ్వేత అనేక ఆసక్తికరమైన విషయాలను సాక్షితో పంచుకున్నారు. ఇదీ నా స్టైల్ షీట్! ‘‘పెళ్లి కుదర్చడం అనేది ఓ యాభై ఏళ్ల కిందట ఉన్నంత సులభం కాదిప్పుడు. తెరిచిన పుస్తకంలా ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ల మధ్య వివాహం జరిగే రోజులు కావివి. ఖండాల అవతలి వ్యక్తులతోనూ పెళ్లిబంధం కలపాలి. ప్రేమ పెళ్లిళ్లను పక్కన పెడితే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే వాళ్లే మా దగ్గరకు వస్తారు. వాళ్లు తమ గురించి ఏ వివరాలిస్తారో ఆ వివరాలనే అవతలి వాళ్లకు అందివ్వగలుగుతాం. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. వంద పెళ్లిళ్లలో ఒక్క పెళ్లి విఫలమైనా మేము ఎక్కడో లోపం చేశామేమో అనిపిస్తుంది. నేను ఇరవై ఏళ్లుగా ఈ ఫీల్డులో ఉన్నాను. వేలాది మంది క్లయింట్లతో మాట్లాడాను. రెండువేలకు పైగా పెళ్లిళ్లు చేశాను. ఈ అనుభవంతో ఈ ప్రొఫెషన్ని సమగ్రంగా తీర్చిదిద్దుకోవడానికి నాకు నేనుగా కొన్ని నియమాలను రూపొందించుకున్నాను. ► అబ్బాయి, అమ్మాయి ఉద్యోగం, చదువు, ఆస్తిపాస్తుల గురించి ప్రశ్నావళిలో ఇచ్చిన వివరాలు వాస్తవమేనా అనే సందేహం కూడా కలుగుతుంటుంది. సమగ్రంగా విచారణ చేసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి. ఇలాంటి ఎంక్వయిరీ కూడా మ్యారేజ్ బ్యూరో చేసి పెట్టగలగాలి. అలాగే ఆధార్ నంబర్, శాలరీ సర్టిఫికేట్లు తీసుకునే నియమం బ్యూరోలకు ఉంటే అబద్ధాలతో పెళ్లి చేసుకోవచ్చనే దురాలోచనను మొగ్గలోనే అరికట్టవచ్చు. ► యువతీయువకులు భాగస్వామి ఎంపిక విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు. తమకు నచ్చిన అంశాలన్నీ ఒక వ్యక్తిలో రాశిపోసి ఉండడం సాధ్యం కాదని, మనం కోరుకున్న లక్షణాలతో ఓ వ్యక్తిని తయారు చేయలేమని, ఉన్న ఆప్షన్స్‌లో సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మనం చేయగలిగింది అని పెద్దవాళ్లు చెప్పట్లేదు. ఈ విషయంలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు కొంత త్వరగా నిర్ణయం తీసుకుంటున్నారు’’ అన్నారు కోటిరెడ్డి. ఇన్ని వడపోతలు పూర్తయి పెళ్లి జరిగిన తర్వాత కూడా ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన ఈ తరం తల్లిదండ్రులకు తప్పడం లేదు. అందుకే వైవాహిక బంధం బలపడే వరకు కొంత కనిపెట్టి ఉండాలి. గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే సరి చేయడం వరకే ఉండాలి పెద్దవాళ్ల జోక్యం. పిల్లల జీవితంలోకి దూరిపోయి వాళ్ల జీవితాలను తామే జీవించాలనుకోకూడదు. ఇప్పటి పేరెంట్స్ దాదాపు చదువుకున్న వాళ్లే. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా కోడలు వచ్చి తమను చూసుకోవాలనే ఆంక్షల్లేవు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ల కుటుంబం వాళ్లను దిద్దుకోమని నూతన దంపతులను వేరే ఇంట్లో ఉంచడానికే ప్రయత్నిస్తున్నారు. మరో ముఖ్యమైన సంగతి... తల్లిదండ్రులు వృత్తి వ్యాపారాల్లో రిటైరై ఉంటే, పిల్లల పెళ్లి బాధ్యత పూర్తయిన తరవాత తమకిష్టమైన లేదా సమాజహితమైన వ్యాపకాన్ని పెట్టుకోవాలి. – వాకా మంజులారెడ్డి ట్రంప్ ప్రభావం నేను పాతికేళ్లుగా వివాహవేదిక నడుపుతున్నాను. అప్పట్లో అమ్మాయి తల్లిదండ్రులైనా, అబ్బాయి తల్లిదండ్రులైనా అవతలి వారి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా గమనించేవారు. ఇప్పుడు డబ్బు, ఆస్తులు ప్రధానం అయ్యాయి. పాతికేళ్ల కిందట విదేశాల మోజు బాగా ఉండేది. పదవ తరగతి అమ్మాయికి కూడా యూఎస్ సంబంధాల కోసం ప్రయత్నించేవారు. ఈ ట్రెండ్ 1990– 2000 మధ్య బాగా ఉండేది. ఇప్పుడు అమ్మాయిలే చదువుకుని విదేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు చదువు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన అమ్మాయిలు, అలాగే అక్క, అన్న విదేశాల్లో ఉన్న అమ్మాయిలు మాత్రమే విదేశీ సంబంధాలు కోరుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇండియాలో ఉన్న అమ్మాయికి యూఎస్ అబ్బాయితో పెళ్లి చేసినవాళ్లు, అమ్మాయిని అమెరికా పంపించడానికి వీసా రాక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి ఉద్యోగాలున్నాయి కాబట్టి అమ్మాయి మా కళ్ల ముందే ఉంటుంది, ఇండియా సంబంధాలే చెప్పండి అంటున్నారు. అయితే అబ్బాయికి లక్ష రూపాయల జీతం ఉన్నా సరే ‘ఏం సరిపోతుంది, ఇంకా పెద్ద జీతం ఉన్నవాళ్లను చెప్పండి’ అంటున్నారు. పైగా ‘మా అమ్మాయి సర్దుకుపోలేదు, కాబట్టి ఉమ్మడి కుటుంబం వద్దు’ అనే నిబంధనలు ఎక్కువయ్యాయి. కట్నం అనేది పెద్ద విషయంగా చర్చకు రావడం లేదు. ఆడంబరాలు మాత్రం ఆకాశమే హద్దు అన్నంతగా పెరిగిపోయాయి. ఇక పెళ్లి వయసుదాటిపోతోందనే ఆందోళన అటు పేరెంట్స్‌లోనూ కనిపంచడం లేదు, పెళ్లి చేసుకోవాల్సిన యువతీయువకుల్లోనూ కనిపించడం లేదు. ముప్పై సంవత్సరాలు దాటుతున్నా కూడా వయసును పట్టించుకోవడం లేదు. – జొన్నలగడ్డ జ్యోతి మళ్లీ యూఎస్ క్రేజ్ పదేళ్లుగా ఈ వ్యాపకంలో ఉన్నాను. మొదట్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నాలుగైదు సంబంధాలు చూసి నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు నలభై– యాభై సంబంధాలు చూసినా కూడా నిర్ణయం తీసుకోవడం లేదు. వయసు మీరిపోతున్నా ఎవరికీ పట్టింపు ఉండడం లేదు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా భాగస్వామి కోసం బంగారాన్ని గీటుపెట్టినట్లు చూస్తున్నారు. అబ్బాయి క్యాప్ పెట్టుకున్న ఫొటో పంపిస్తే ‘బట్టతల కావచ్చు, క్యాప్ లేని ఫొటోలు పంపించండి’ అంటున్నారు అమ్మాయిలు. ఇక అబ్బాయిలు కూడా తాము యావరేజ్‌గా ఉన్నా సరే... అందమైన అమ్మాయి కావాలంటారు. అబ్బాయిలైనా కొంతవరకు రాజీపడుతున్నారు కానీ అమ్మాయిలు కచ్చితంగా ఉంటున్నారు. ఓ మంచి మార్పు ఏమిటంటే... కట్నం ప్రాధాన్యం లేని విషయమైపోయింది. అలాగే ట్రంప్ హయాంలో అమ్మాయి తల్లిదండ్రులు యూఎస్ సంబంధాలు వద్దనేవాళ్లు. ఇప్పుడు మళ్లీ యూఎస్ సంబంధాలకు క్రేజ్ పెరిగింది. – శ్వేత పసుపులేటి నిర్ణయం వధూవరులదే! అమ్మాయికి పెళ్లి చేయాలంటే... ఓ ఇరవై ఏళ్ల కిందట అబ్బాయి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా చూసేవారు. ఇప్పుడు చదువు, ఉద్యోగం మొదటి ప్రాధాన్యంలో ఉంటున్నాయి. ఉద్యోగంలో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యం, ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉంటోంది. వ్యాపారం అనగానే ‘రిస్క్ అవసరమా’ అంటున్నారు. వ్యవసాయం అయితే ఇక నాలుగో ప్రాధాన్యంలోకి వెళ్లిపోయింది. కరోనా తర్వాత విదేశాలంటే భయపడుతున్నారు. అంతవరకు విదేశాలతో సంబంధం లేని వాళ్లు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. వధువు అక్క లేదా అన్న యూఎస్, యూకేల్లో ఉన్న ఆ దేశంలో ఉన్న అబ్బాయికే మొగ్గు చూపుతున్నారు. ఇక డిమాండ్ల విషయానికి వస్తే... వరుని ఎంపిక విషయంలో అమ్మాయిలు చాలా కచ్చితంగా ఉంటున్నారు. ఎంతో కొంత రాజీ పడుతున్నది అబ్బాయిలే. చాదస్తం తగ్గింది ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లిని ఒకప్పుడు వధూవరుల తల్లిదండ్రులు కుదిర్చేవాళ్లు, ఇప్పుడు వధూవరులు స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారు (అరేంజ్డ్ మ్యారేజ్‌ల విషయంలో కూడా). ఇప్పుడు దాదాపుగా అందరూ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులే. వాళ్లు కొడుకు, కూతురు ఇద్దరినీ చదివిస్తున్నారు. ఇద్దరినీ ఉద్యోగాలకు పంపిస్తున్నారు. ఆస్తిని దాదాపుగా సమంగా ఇస్తున్నారు. దీంతో కట్నం ప్రస్తావన ప్రధానంగా కనిపించడం లేదు. తల్లిదండ్రులు కూడా పరిణతి చెందారు. ఒకప్పటిలాగ కోడలు తెల్లవారు జామున లేచి ఇంటి పనులు చక్కబెట్టాలని, తాము నిద్రలేచే సరికి కాఫీ కప్పుతో సిద్ధంగా ఉండాలనే చాదస్తాల్లేవు. ఉద్యోగానికి వెళ్లాల్సిన అమ్మాయి ఇంటి పనుల్లోనే అలసిపోవాలని కోరుకోవడం లేదు. ఇక పిల్లలిద్దరికీ పెళ్లి చేసిన వెంటనే వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయి పిల్లలతో కలిసి జీవించాలనుకోవడం లేదు. బాధ్యతలు పూర్తయిన తమ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. – కరణం నరసింగరావు లేటెస్ట్ ఫొటోలుండాలి! మ్యారేజ్ బ్యూరోలో మేము ఒక ప్రశ్నావళిని సమగ్రంగా రూపొందించుకున్నాం. అబ్బాయి లేదా అమ్మాయితో స్వయంగా మాట్లాడతాం. సాధ్యమైతే బ్యూరోలోనే లైవ్ ఫొటో షూట్ చేయడం మంచిది. పేరెంట్స్ ఇచ్చే ఫైల్ ఫొటోలు కొన్ని సందర్భాల్లో బాగా పాతవి ఉంటాయి. ఫొటోలు ఉన్నట్లుగా లైవ్‌లో లేనట్లయితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా డిజప్పాయింట్ అవుతారు. ఇక ఆ తర్వాత మిగిలిన ప్రత్యేకతలేవీ పరిగణనలోకి రావు. – కోటిరెడ్డి -
AP: సర్కారు వారి పెళ్లికానుక.. అర్హతలు ఇవే.. దరఖాస్తు చేయడం ఇలా..
రాజమహేంద్రవరం రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన యువతుల వివాహాలకు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా ద్వారా ఆర్థిక సహాయం అందజేసేందుకు చర్యలు చేపట్టింది. వైఎస్సార్ కల్యాణమస్తు పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన, ఇతర నిర్మాణ రంగాల్లో నమోదైన కార్మికులకు లబ్ధి చేకూరుస్తారు. షాదీతోఫా పథకం ద్వారా ముస్లిం మైనార్టీలకు మేలు కలుగుతుంది. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్ 1 తేదీ నుంచి గ్రామ సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఇప్పటి వరకూ జిల్లాలో 32 దరఖాస్తులు అందాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నారు. అన్ని స్థాయిల్లోనూ సమగ్ర పరిశీలన పూర్తయ్యాక అధికారిక ఆమోదం కోసం కలెక్టర్‌కు ఈ దరఖాస్తులు పంపుతారు. దరఖాస్తు చేయడం ఇలా.. వివాహం జరిగిన 60 రోజుల్లోగా ఆయా గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలి. తొలుత సచివాలయాల ద్వారా వివాహ సర్టిఫికెట్ పొందాలి. అనంతరం నిబంధనల మేరకు వివాహ ధ్రువపత్రాలను దరఖాస్తులో పొందుపర్చాలి. ముఖ్యంగా పెళ్లిపత్రిక, పెళ్లి సమయంలో తీయించిన ఫొటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతా జిరాక్స్ సమర్పించాలి. వధూవరుల చదువుకు సంబంధించి పదో తరగతి ఉత్తీర్ణత సరి్టఫికెట్ల జిరాక్సు కూడా దరఖాస్తుకు జత చేయాలి. భవన నిర్మాణ కార్మికులు సభ్యత్వ ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలి. ఈ పథకాలపై వైఎస్సార్ క్రాంతిపథం సిబ్బంది తమ పరిధిలోని సంఘాల సభ్యుల ద్వారా ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అర్హతలు ఇవే... ♦వివాహమయ్యేనాటికి వరుడికి 21, వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి ♦భర్త చనిపోయిన స్త్రీ రెండో పెళ్లి చేసుకున్నా అర్హురాలే ♦వధూవరులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ♦కుటుంబ ఆదాయం నెలకు పల్లెల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించకూడదు ♦భూమి పల్లం 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు లేదా రెండూ కలిపి 10 ఎకరాలు మించకూడదు ♦కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్‌దారు అయ్యి ఉండకూడదు ♦పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది ♦కారు ఉండరాదు. ఆటో, ట్రాక్టర్, ట్యాక్సీకి మినహాయింపు ఉంది ♦కుటుంబం నెలవారీ విద్యుత్ వాడకం 300 యూనిట్లు మించరాదు ♦మున్సిపల్ ప్రాంతంలో 1000 ఎస్ఎఫ్టీకి మించి నివాస స్థలం ఉండరాదు -
ఈ ఏడాది దంపతులుగా, తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన స్టార్స్
ఈ ఏడాది ఇటు సౌత్.. అటు నార్త్‌లో పెళ్లి కళ కనిపించింది. అన్నీ కూడా దాదాపు ప్రేమ వివాహాలే. పెద్దల అనుమతితో వైభవంగా స్టార్స్ పెళ్లి చేసుకున్నారు. ఇక గతంలో పెళ్లి చేసుకున్న కొందరు స్టార్స్ ఈ ఏడాది తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాదే పెళ్లి చేసుకుని, పేరెంట్స్ అయినవారూ ఉన్నారు. పెద్దల అక్షింతలతో పెళ్లి చేసుకున్న, పిల్లల కేరింతలతో మురిసిపోతున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. తన ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో జూన్ 9న ఏడడుగులు వేశారామె. విజయ్ సేతుపతి, నయన జంటగా విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీదాన్’ (‘నేను రౌడీ’) చిత్రం వీరి ప్రేమకు పునాది అయింది. ఈ చిత్రనిర్మాణంలో భాగస్వామ్యం అయిన విఘ్నేష్–నయన నిజ జీవితంలోనూ భాగస్వాములు కావడం విశేషం. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు వీరు. కాగా పెళ్లయిన నాలుగు నెలలకే విఘ్నేష్–నయన తల్లిదండ్రులు కావడం హాట్ టాపిక్ అయింది. కారణం సరోగసీ ద్వారా వీరు తల్లిదండ్రులు అయ్యారు. ఇక యువ హీరో నాగశౌర్య ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో నవంబర్ 20న మూడు ముళ్లు వేశారాయన. అనూషతో కొంత కాలంగా ఉన్న స్నేహం ప్రేమగా మారడం.. ఆ ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహం జరిగింది. అలాగే వైవిధ్యమైన పాత్రలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ఆది పినిశెట్టి పెళ్లి పీటలెక్కారు. తన ప్రేయసి, హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ఏడడుగులు వేశారు. మే 18న వీరి వివాహం జరిగింది. అదే విధంగా ‘దేశముదురు’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ హన్సిక కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన మిత్రుడు, ప్రియుడు అయిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను ఆమె వివాహమాడారు. జైపూర్‌లో డిసెంబర్ 4న వీరి పెళ్లి జరిగింది. అలాగే హీరోయిన్ పూర్ణ దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 25న వీరి వివాహం దుబాయ్‌లో జరిగింది. కాగా సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు, హీరో గౌతమ్ కార్తీక్, నటి మంజిమా మోహన్ కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ‘దేవరాట్టం’ సినిమాలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డ గౌతమ్, మంజిమా నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. ఇలా దక్షిణాదిన మూడు ముళ్ల బంధంతో ఒక్కటయిన జంటలు కొన్ని ఉన్నాయి. వచ్చే ఏడాది పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు రామ్‌చరణ్–ఉపాసన. కోడలు గర్భవతి అనే విషయాన్ని ఈ నెల 12న అధికారికంగా ప్రకటించారు చిరంజీవి. 2012 జూన్ 14న రామ్‌చరణ్, ఉపాసనల వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే తమిళ దర్శకుడు అట్లీ కూడా తన భార్య ప్రియా మోహన్ గర్భవతి అని ఇటీవల ప్రకటించారు. అగ్రనిర్మాత ‘దిల్’ రాజు రెండో వివాహం 2020లో డిసెంబరు 10న తేజస్వినీతో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాది జూన్ 29న తేజస్విని ఓ బాబుకు జన్మనిచ్చారు. తనయుడికి అన్వయ్ రెడ్డి అని నామకరణం చేశారు. ఈ ఏడాది నుంచి కాజల్ అగర్వాల్ మాతృత్వం తాలూకు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండేళ్ల క్రితం అంటే.. 2020 అక్టోబరు 30న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ ఏడడుగులు వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చారు. ఆ బాబుకి నీల్ కిచ్లు అని నామాకరణం చేశారు. మరోవైపు గత ఏడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ పాపకు జన్మనిచ్చారు. తమకు కుమార్తె పుట్టిన విషయాన్ని జూన్ 10న ప్రకటించారు. పాపకు అర్నా అని పేరు పెట్టుకున్నారు. మరోవైపు నమిత కూడా ఈ ఏడాదే పేరెంట్స్ క్లబ్లో చేరారు. వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరితో కలిసి 2017 నవంబరు 24న తిరుపతిలో ఏడడుగులు వేశారు నమిత. ఈ ఏడాది ఆగస్టులో మే 10న తాను గర్భవతిననే విషయాన్ని నమిత అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కవలలకు (ఇద్దరు మగశిశువులు) జన్మనిచ్చినట్లు ఆగస్టులో ప్రకటించారు. కృష్ణ ఆదిత్య, కిరణ్ రాజ్ అనేవి వీరేంద్ర చౌదరి, నమిత దంపతుల కుమారుల పేర్లు. ఇక దర్శక–నటుడు రాహుల్ రావీంద్రన్, ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి ఈ ఏడాది తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాది జూన్‌లో కవలలకు (మగశిశువు, ఆడశిశువు) జన్మనిచ్చారు చిన్మయి. శర్వస్, ద్రిప్త అనేవి వీరి పేర్లు. కాగా రాహుల్ రవీంద్రన్, చిన్మయిల వివాహం 2014 మేలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ౖ వెపు వెళితే ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ సరోగసీ ద్వారా మాల్టీ మారీ చోప్రా జోనస్ అనే పాపకు తల్లిదండ్రులైనట్లు జనవరిలో ప్రకటించారు. కాగా నిక్ జోనాస్, ప్రియాంకా చోప్రాల వివాహం 2018 డిసెంబరులో జరిగింది. మరోవైపు 2016 ఏప్రిల్ 30న నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లాడిన హీరోయిన్ బిపాసా ఈ ఏడాది నవంబరు 12న ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ పాప పేరు దేవి బసు సింగ్ గ్రోవర్. హిందీలో కూడా ఈ ఏడాది కొన్ని జంటలు షాదీ ముబారక్ (వివాహ శుభాకాంక్షలు) అందుకున్నాయి. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఏప్రిల్ 14న ఏడడుగులు వేశారు. ఈ ఇద్దరూ ‘బ్రహ్మాస్త్ర’లో జంటగా నటిస్తున్నప్పుడు ప్రేమలో పడి, నిజజీవితంలోనూ జంట అయ్యారు. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాదే తల్లిదండ్రులయ్యారు కూడా. నవంబర్ 6న ఆలియా ఒక పాపకు జన్మనిచ్చారు. పాపకు రహా అని పేరు పెట్టారు. మరో జంట అలీ ఫజల్–రిచా చద్దా దాదాపు పదేళ్లు ప్రేమించుకున్నారు. ‘ఫక్రి’ చిత్రం షూటింగ్లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. అక్టోబర్ 4న వీరి వివాహం జరిగింది. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే భార్యాభర్తలుగా తమ జీవితాన్ని ఆరంభించారు సూరజ్ నంబియార్–మౌనీ రాయ్. జనవరి 27న వీరి వివాహం జరిగింది. మరోవైపు ప్రేమికుల దినోత్సవానికి నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 19న పెళ్లి చేసుకున్నారు ఫర్హాన్ అక్తర్–షిబానీ దండేకర్. ఫర్హాన్ హోస్ట్ చేసిన ‘ఐ కేన్ డూ దట్’ షోలో షిబానీ పాల్గొన్నారు. ఆ షోలోనే ఈ ఇద్దరూ తొలిసారి కలిశారు. 2015లో ఏర్పడిన వీరి పరిచయం ఈ ఏడాది పెళ్లి వరకూ వచ్చింది. ఇంకోవైపు దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని ఏడడుగులు వేశారు విక్రాంత్ మస్సే–షీతల్ ఠాకూర్. ఈ ప్రేమికుల దినోత్సవానికి (ఫిబ్రవరి 14) మిస్టర్ అండ్ మిసెస్ అయ్యారు విక్రాంత్–షీతల్. ఇక దర్శకురాలు గునీత్–వ్యాపారవేత్త సన్నీల వివాహం ఈ నెల 12న జరిగింది. ఇలా ఈ ఏడాది హిందీ పరిశ్రమలో పెళ్లిళ్ల సందడి బాగానే కనిపించింది. -
వివాహ వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లినర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4 గంటలకు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రికి చేరుకుంటారు. ఓ కాలేజీ ఆవరణలో జరుగుతోన్న అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు విశాఖ నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి వెళ్లనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్నారు సీఎం వైఎస్ జగన్. ఇదీ చదవండి: AP: ఇకపై పింఛన్ రూ.2,750 -
ఈగనా మజాకా! ఏకంగా పది గ్రామాల్లో పెళ్లిళ్లు ఆగిపోయాయి..
ఇంతవరకు ఎన్నోరకాల వింత వింత సంఘటనలు గురించి విన్నాం. ఏగ్రామంలోనైనా కనీసం ఏడాదికి ఎంతకాదన్న సుమారుగా మూడు నుంచి పది వరకు పెళ్లి సంబరాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఆయా గ్రామాల్లో పెళ్లిళ్లే జరగడం లేదు. పైగా అక్కడి కోడళ్లు సైతం తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి కాపురానికి రానని తెగేసి చెబుతున్నారు. అసలు ఏంటి ఇది? ఎందుకిలా? అని ఆశ్యర్యపోకండి. అసలు విషయం వింటే ఆ! అని నోరెళ్లబెడతారు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లో హర్దోయ్‌లోని పది గ్రామాల్లో పెళ్లిళ్లు జరగడం లేదు. అక్కడ ఉన్న తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధంగా లేరట. కేవలం ఈగలు కారణంగా అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదంట. ఆయా గ్రామాల్లో చాలా బీభత్సంగా అక్కడ ఈగలు పెరిగిపోయాయట. వాటి ధాటికి ఆయా గ్రామాల్లో నివశిస్తున్న వారిని ఎవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. పైగా ఆ గ్రామాల్లోని కోడళ్లు సైతం కాపురానికి రామంటూ తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారట. అంతేగాదు ఈ ఊర్నీ వదిలేసి రావాలి లేదా మమ్మల్ని వదిలేయండి అని ఆ ఊరి కోడళ్లే తమ భర్తలతో తెగేసి చెబుతున్నారు. ఆయా గ్రామాల్లోని అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇప్పడూ పెళ్లి ఒక సమస్యగా మారింది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఈగలను వదిలించుకోవాలని గ్రామం వెలుపల కూర్చొని నిరసనలు చేస్తున్నారు కూడా. ఈ నిరసనలో మహిళలు పొయ్యిలతో సహ పాల్గొంటున్నారు. వాస్తవానికి ఆయా గ్రామాల్లో 2014 ముందు వరకు అంతా బాగానే ఉంది. అక్కడ ఒక పౌల్ట్రీ ఫారం ప్రారంభమైంది. అది ప్రారంభించిన కొద్దిరోజులకే ఈగల బెడద పెరిగిపోయింది. అది ఇప్పుడూ ఎంతలా ఉందంటే...గతంలో కంటే ఈగలు వందల రెట్లు ఉన్నాయి. ఈ మేరకు పౌల్ట్రీ ఫారమ్‌కు సమీపంలో ఉన్న కార్పెంటర్పూర్వా గ్రామం తోపాటు కుయాన్, పట్టి, దహి, సలేంపూర్, ఫతేపూర్, ఝల్పూర్వా, నయాగావ్, డియోరియా, ఎక్ఘరాలకు ఈగల భయం వ్యాపించింది. పాపం ఇక్కడి గ్రామస్తులు మాదిరిగానే పాలక వర్గం సైతం ఈ ఈగల విషయంలో నిస్సహాయంగా ఉంది. (చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు) -
కల్యాణం.. ప్రతి తంతూ కళాత్మకం
సాక్షి అమలాపురం: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఇదో మధుర ఘట్టం. కొత్త జీవితానికి నాంది పలికే శుభదినం. మరి ఆ ముచ్చట సాదాసీదాగా జరిగిపోతే ఎలా! వివాహంలో నయనానందకరంగా సాగే ప్రతి తంతూ జీవితాంతం సుమధుర జ్ఞాపకాలుగా మిగిలిపోవాలంటే కాస్త వెలుగు జిలుగులు అద్దాల్సిందే. పెళ్లంటే తాళిబొట్లు.. తలంబ్రాలు.. పూలదండలు.. ఆభరణాలు.. వేదమంత్రాలు.. సన్నాయి మేళాలు.. షడ్రుచుల భోజనాలే కాదు.. ఇప్పుడా సందడి సరికొత్త శోభను అద్దుకుంటోంది. ప్రతి తంతూ కళాత్మకంగా మారిపోతోంది. మనోఫలకంపై బలమైన ముద్ర వేస్తోంది. పెళ్లిలో జరిగే ప్రతి ఘట్టంలో వాడే వస్తువులు, వాటి తయారీ వెనుక ఉన్న శ్రామికుల పనితనం.. చేయి తిరిగి నైపుణ్యం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఫొటో, వీడియో షూట్ల ప్రాధాన్యం పెరిగిన తరువాత పెళ్లిలో వాడే ప్రతి వస్తువునూ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మూడు నెలల మూఢం కొద్ది రోజుల్లో ముగిసిపోతోంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభ కాబోతోంది. ఈ తరుణాన వివాహ వస్తువులు తయారు చేసేవారు బిజీగా మారిపోయారు. ఎన్నో డెకరేషన్లు ► వధూవరుల మంగళ స్నానాలకు చేస్తున్న డెకరేషన్లే చిన్న సైజు పెళ్లిని తలపిస్తున్నాయి. పసుపు నీళ్లు వేసేందుకు అందాల జల్లెడ.. సప్తవర్ణ శోభితమైన బిందెలు.. మహారాజుల వైభవాన్ని గుర్తుకు తెచ్చే కంచు పాత్రలు.. వాటిలో పన్నీరు కలిపిన నీళ్లు.. అందులో తేలియాడే రంగురంగుల పూలతో కొత్త వన్నెలు అద్దుతున్నారు. ► బాసికాలు.. పెళ్లి కుమారునికి అలంకరించే మహారాజా తలపాగాలు.. సంప్రదాయ టోపీలు.. కాళ్లకు తొడిగే పాముకోళ్లు.. రోళ్లు.. రోకళ్లకు రకరకాల రంగులతో ముస్తాబులు.. పెళ్లి కుమార్తెకు కొత్తందాన్ని తెచ్చే అలంకరించే పూలజడలు.. ఖరీదైన జాకెట్లు.. చేతులకు కళాత్మక మెహందీలు.. ముఖానికి ఫేషియల్స్.. పెళ్లి కుమార్తెను తీసుకు వెళ్లే బుట్ట.. గొడుగు.. ఇలా వివాహ వైభవంలో ఎన్నో నూతన ఆకర్షణలు బంధుమిత్రులను కట్టిపడేస్తున్నాయి. ► శాస్త్ర సమ్మతమా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే.. వివాహ సమయంలో వధూవరుల మధ్య ఏర్పాటు చేసే తెరను సైతం అందంగా తీర్చిదిద్దుతున్నారు. వాటి మీద సీతారాములు, అలమేలుమంగా సమేత వేంకటేశ్వర స్వామి వంటి దేవతలను లేసు దారాల అల్లికలతో తీర్చిదిద్దుతూ.. ఆ సమయానికి దైవానుగ్రహం ప్రసరిస్తుందనే భావన కలిగిస్తున్నారు. ► వివాహ సమయంలో వధూవరుల చేతుల్లో పెట్టే కొబ్బరి బొండాలకు ముత్యాలు, పగడాలు, కెంపులతో కొత్త ఆకర్షణలు తీసుకువస్తున్నారు. ► సంప్రదాయ కర్పూర దండలు కొత్త రూపాల్లో కనువిందు చేస్తున్నాయి. ► తలంబ్రాలకు వాడే కొబ్బరి చిప్పలను సైతం అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు. ► వధూవరులతో పాటు పెళ్లి తంతులో జరిగే ప్రతి కార్యక్రమానికీ వినియోగించే ప్రతి వస్తువునూ ఎంతో మంది అద్భుత ప్రతిభతో కళ్లు తిప్పుకోలేని రీతిలో ముస్తాబు చేస్తున్నారు. ఫొటో షూట్లు వచ్చాక ఆకర్షణకు ప్రాధాన్యం పెళ్లికూతుళ్ల ముస్తాబు నుంచి కార్ల డెకరేషన్ వరకూ ప్రతి దానికి అదనపు ఆకర్షణలు అద్దుతున్నారు. ఫొటోల కోసం ప్రతి వస్తువునూ అందంగా తీర్చిదిద్దుతున్నారు. వధూవరుల అలంకరణే చిన్న సైజు పెళ్లిని తలపిస్తుంది. – శ్రీపతి ప్రకాష్, కల్వకొలను వీధి, అమలాపురం -
రెండు నెలలు.. లక్ష వివాహాలు.. ఫంక్షన్ హాళ్లకు భారీగా డిమాండ్
సాక్షి, ముంబై: కరోనా తరువాత ఏకంగా రెండేళ్లకు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో డెకోరేటర్లు, ఫుడ్ క్యాటరింగ్, ఫంక్షన్ హాలు, వీడియో, ఫోటోగ్రాఫర్లకు చేతి నిండా పని దొరికినట్లయింది. అంతేగాకుండా వీరిపై ఆధారపడిన వేలాది కార్మికులు, కూలీలకు కూడా ఉపాధి దొరికింది. వచ్చే వారం నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. దీంతో కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ వల్ల వాయిదా వేసుకున్న అనేక పెళ్లిళ్లకు ఇప్పుడు మంచి ముహూర్తాలు లభించాయి. కొందరు పెళ్లిల్లు చేసుకున్నప్పటికీ అనేక ఆంక్షలకు, షరతులకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది. కానీ ఈసారి దీపావళి తర్వాత మంచి ముహూర్తాలు డిసెంబర్, జనవరిలో ఉన్నాయి. దాదాపు లక్ష నుంచి లక్షన్నర వరకు పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేశారు. దీంతో డెకొరేటర్లు, క్యాటరింగ్, హాలు, టూరిస్టు వాహనాలు, మెహందీ (గోరింటాకు) ఆర్టిస్టులను ముందుగానే బుకింగ్ చేసుకుని ఉంచారు. వీరితోపాటు మార్కెట్లో కొత్త దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడంవల్ల వ్యాపారులకు కూడా మంచి రోజులు వచ్చాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా బేరాలు లేక ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారులు ఇప్పుడు కొంత తేరుకుంటున్నారు. శుభకార్యాలపై మహమ్మారి ప్రభావం... కరోనా కాలంలో శుభ, అశుభ కార్యక్రమాలకు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. గత్యంతరం లేక అనేక మంది వాయిదా వేసుకున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే వధువు, వరుడి తరఫున 25 మంది చొప్పున బంధువులను అనుమతించారు. దీంతో సాదాసీదాగా పెళ్లి తంతు పూర్తి చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలవల్ల కేటరింగ్, డెకోరేటర్లు, వీడియో, ఫోటో గ్రాఫర్లు ఆర్థికంగా నష్టపోయారు. ఒక్కో పెళ్లిలో 500–700 మందికి ఫుడ్ సప్లయిచేసే క్యాటరింగ్ యజమానులు ఆంక్షలవల్ల కేవలం 50 మందికే సరఫరా చేయాల్సి వచ్చింది. చదవండి: (National Highways: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు) హాలులో కుర్చీలు, తివాచీలు, కళ్లు జిగేల్మనిపించే విద్యుత్ దీపాలకు, ఇతర అలంకరణ సామాగ్రికి డిమాండ్ లేకపోవడంతో డెకొరెటర్లు కూడా నష్టపోయారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో వీడియో, ఫోటో గ్రాఫర్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పెళ్లిలో బారాత్‌లు కూడా లేకపోవడంతో బ్యాండ్, ఇతర భాజాభజంత్రీలకు, మేళతాళాలకు, డప్పులు వాయించే వీరికి కూడా చేతినిండి పనిలేకుండా పోయింది. దీంతో గత రెండేళ్లుగా అరకొర ఆర్డర్లతో ఎలాగో నెట్టుకొస్తున్నారు. ప్రవేశ ద్వారం, హాలు, స్టేజ్‌ను అలంకరించే డెకొరేటర్లు లేకపోవడంతో పూలకు కూడా డిమాండ్ పడిపోయింది. ఇప్పుడు కరోనా నియంత్రణలోకి రావడంతో ధైర్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. డెకొరేటర్లు, ఫుడ్ కేటరింగ్, హాలు, కెమరా మెన్లకు, బ్యాండ్ మేళతాళాలు వాయించే వారికి భారీ డిమాండ్ ఏర్పడింది. పనిచేసే కూలీలు, కార్మికులను కూడా సమకూర్చుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. బారాత్‌లకు అవసరమైన టూరిస్టు వాహనాలను, బంధువులను తీసుకెళ్లేందుకు బస్సులు, టాటా సుమోలు, క్వాలీస్ తదితర వాహనాలను కూడా ముందుగానే బుకింగ్ చేసుకుని ఉంచుకున్నారు. ఇలా అన్ని రంగాల వారికి చేతినిండా ఉపాధి లభించడంతో రెండేళ్ల తరువాత ఆర్ధికంగా నిలదొక్కుకునే అవకాశం లభించింది. -
డిసెంబర్ 12 వరకు ఊరూరా పెళ్లి సందడి..
-
'లివ్-ఇన్ రిలేషన్, పెళ్లి కాదు.. మగాళ్ల మనస్తత్వంలోనే అసలు సమస్య..'
శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఆమెను 35 ముక్కలు చేసిన అత్యంత క్రూరమైన ఈ అనాగరిక చర్య సర్వత్రా చర్చనీయాంశమైంది. లివ్-ఇన్ రిలేషన్ల కారణంగానే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ గురువారం అన్నారు. చదువుకున్న అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, లివ్ ఇన్ రిలేషన్ల జోలికి వెళ్లకుండా నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలకు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నజ్రీన్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో ఈ విషయంపై స్పందిస్తూ ఓ సందేశం రాసుకొచ్చారు. 'లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేస్తే.. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి.. లివ్ ఇన్ రిలేషన్ల వల్లే నేరాలు జరుగుతున్నాయని మీరు చెబుతున్నారు. కానీ పెళ్లైన పురుషులు తమ భార్యలను చంపినప్పుడు.. పెళ్లిళ్ల వల్లే నేరాలు జరుగుతున్నాయి, అందుకే పెళ్లి చేసుకోవద్దు.. లివ్ ఇన్ రిలేషన్లే ఎంచుకోండి అని ఎందుకు చెప్పడం లేదు. పెళ్లిళ్లు, లివ్ ఇన్ రిలేషన్లు కాదు.. అసలు సమస్య మగాళ్ల మనస్తత్వంలోనే ఉంది.' అని నజ్రీన్ రాసుకొచ్చారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. When a man kills his girlfriend in a live-in relationship,u ask girls to get married coz live-in encourages crimes. But when men kill their wives,u don't ask girls to go for live-in relationships coz marriage encourages crimes!! Not marriage or live-in,problem is men's mentality. — taslima nasreen (@taslimanasreen) November 17, 2022 మరోవైపు కౌషల్ కిశోర్ వ్యాఖ్యలపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కౌషల్ కిశోర్‌ను పదవి నుంచి తప్పించాలని కోరారు. ఇలాంటి హేయమైన నేరాళ్లో మహిళలనే నిందించడం క్రూరం, నిర్దాక్షిణ్యంగా అభివర్ణించారు. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా -
ముహూర్తం ముందరున్నది
సాక్షి, అమరావతి: ‘‘మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది.. మా అమ్మాయి జాతకానికి మీ అబ్బాయి జాతకం బాగా కుదిరింది.. మనం ఇప్పుడే ఒక మాట అనుకుని పెళ్లి ఖాయపర్చుకుంటే మూఢం వెళ్లగానే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం’’ రాష్ట్రంలో ప్రస్తుతం పెళ్లీడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులు మధ్య సాగుతున్న సంభాషణ ఇది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వస్తున్న శుభ ముహూర్తాలకు తమ పిల్లల వివాహాలు జరిపించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. దీంతో వివాహాలు జరిపించేందుకు శుభలగ్నం కోసం ఎదురుచూస్తున్నారు. మూఢం ముగియడంతో నవంబర్ 28 నుంచి శుభ ముహూర్తాలు రానున్నాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు ఏడు బలమైన ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం (సంక్రాంతి నెల) కావడంతో వివాహాలు చేయరు. దీంతో వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మార్చి 9 వరకు 18 శుభముహుర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. ముందుంది ముహూర్తం అంటూ.. పెళ్లి ఏర్పాట్లలో వధూవరుల కుటుంబాలు బిజీ అవుతున్నాయి. మార్కెట్లకు పెళ్లి కళ.. ప్రస్తుత శుభకృత్ నామ తెలుగు సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే మార్చి వరకు దేశ వ్యాప్తంగా 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలోనే లక్షా 50 వేలకుపైగా వివాహాలు జరుగుతాయని భావిస్తున్నారు. ముహూర్తాలు దగ్గర పడుతుండటంతో మార్కెట్లకు కూడా పెళ్లి కళ వచ్చింది. ఇప్పటికే ఇళ్ల మరమ్మతుల కోసం సిమెంట్ పనులు, ఇళ్లకు రంగులు తదితర అలంకరణ పనులు ఊపందుకుంటున్నాయి. సరికొత్త శ్రేణి ఆభరణాలతో బంగారం షాపులు రెడీ అవుతున్నాయి. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా రెడీమేడ్ దుస్తుల షాపులు, పాదరక్షల షాపులు, పెళ్లి శుభలేఖల షాపులు సిద్ధమయ్యాయి. చాలా చోట్ల కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, బాంక్వెట్ హాళ్ల అడ్వాన్సు బుకింగ్‌లు అవుతున్నాయి. మే వరకూ శుభ ముహూర్తాలు.. నాలుగు నెలల తర్వాత మంచి బలమైన ముహూర్తాలు వస్తున్నందున పెళ్లి బాజాలు మోగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూఢం లో వివాహాలు జరిపించరు. మూఢం వెళ్లగానే మంచి ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేస్తారు. ప్రస్తుత శుభకృత్ నామ సంవత్సరం తర్వాత వచ్చే శోభకృత్ నామ సంవత్సరం 2023 మే నెల వరకు శుభలగ్నాలు ఉన్నాయి. 2023 ఉగాది అయ్యాక చైత్రం, వైశాఖం, జ్యేష్ట మాసాల్లో మంచి ముహూర్తాల్లో వివాహాలు జరిపిస్తారు. మొత్తంగా ఈ నెల నుంచి వచ్చే ఏడాది మే వరకు దాదాపు 42 ముహూర్తాలు ఉన్నాయి. – కొత్తపల్లి సూర్యప్రకాశరావు(లాలూ), పురోహితుడు, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా -
40 రోజుల్లో 32 లక్షల వివాహాలు.. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా!
పెళ్లి.. ఇది రెండక్షరాలే, కానీ ఇద్దరు వ్యక్తులు ఒక్కటై జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దీని విశిష్టత ఇప్పటికీ అలానే ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో మాత్రం గతంతో పోలిస్తే చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. గతంలో వివాహాలు వరుడు లేదా వధువు ఇళ్లలో జరిగేవి, లేదంటే వారి ప్రాంతానికే పరిమితంగా ఉండేవి. అయితే మారుతున్న ట్రెండ్, డబ్బు సంపాదన పెరగడంతో ప్రతి ఒక్కరూ వివాహాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరిగే లక్షలాది జంటల వివాహ వేడుకల సందడి దేశ వ్యాపార లావాదేవీలకు మరింత ఊపు ఇవ్వనున్నాయి. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు, వాటి ద్వారా సుమారు రూ.3.75లక్షల కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. సీఏఐటి.. దేశవ్యాప్తంగా 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లతో 35 నగరాల పరిధిలో కెయిట్ అనుబంధ రీసెర్చ్ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. ఈ సీజన్లో కేవలం ఢిల్లీలోనే 3.5 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల ఢిల్లీలోనే దాదాపు ₹75,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని (సీఏఐటి)CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపు 25 లక్షల వివాహాలు, ₹3 లక్షల కోట్లు ఖర్చు అయినట్టు అంచనా. మొత్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో, మార్కెట్లలో పెళ్లి కొనుగోళ్ల ద్వారా దాదాపు ₹3.75 లక్షల కోట్లు రానున్నట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ తదుపరి దశ జనవరి 14 నుంచి ప్రారంభమై జూలై వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. As per the latest survey conducted by the research wing of CAIT, about 32 lakh weddings will be solemnised between 4th Nov- 14th Dec 2022. Estimated business flow in this period is likely to be 3.75 lakh crore. About 75000 crore business expected in Delhi alone: @praveendel pic.twitter.com/dxJv4JPw0q — Confederation of All India Traders (CAIT) (@CAITIndia) November 7, 2022 చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
88వ పెళ్లికి సిద్ధమవుతున్న వృద్ధుడు...మరోసారి మాజీ భార్యతో
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లు నిలబడటం అత్యంత కష్టంగా ఉంది. అలాంటి స్థితుల్లో ఇక్కడొక వ్యక్తి ఒకటి రెండు కాదు ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఇండోనేషియాలోని వెస్ట్ జావాలోని మజలెంగ్కాకు చెందిన 61 ఏళ్ల ఖాన్ అనే వృద్ధుడు 88వ పెళ్లికి సద్ధమవుతున్నాడు. అది కూడా తన మాజీ భార్యనే వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన సుమారు 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఖాన్ ఇలా చాలా సార్లు పెళ్లిళ్లు చేసుకున్నందు వల్ల ఆయన్ని ప్లేబాయ్ కింగ్ అని పిలుస్తుంటారు. ఆయన ఒక సామాన్య రైతు. అతను 14 ఏళ్ల వయసులో తొలిసారిగా వివాహం చేసుకున్నాడు. ఐతే ఖాన్ మొదటి భార్య అతని కంటే రెండేళ్లు పెద్దదని, తన పేదరికం గురించి చెప్పకపోవడంతో కేవలం రెండేళ్లలోనే విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని చెబుతున్నాడు. ఈ సంఘటన తర్వాత తనకు చాలా కోపం వచ్చిందని అప్పుడే చాలా మంది మహిళలు తనతో ప్రేమలో పడేలా చేసుకునే తెలివతేటలు సంపాదించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తాను మహిళలకు ఇబ్బంది కలిగించేవి, చేయనని, వారి భావోద్వేగాలతో కూడా ఆడుకోననని అందువల్లే చాలా మంది తన ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోబుతున్న తన మాజీ భార్య తన నుంచి విడిపోయి చాలా కాలం అయ్యిందని అయినప్పటికీ తనను ఇంకా ప్రేమిస్తూనే ఉందని చెబుతున్నాడు. అలాగే తన కోసం తిరిగి వచ్చే తన మాజీ ప్రేయసులను తిరస్కరించలేనని చెప్పాడు. ఐతే 87 పెళ్లళ్లు చేసుకున్న ఖాన్ తనకు ఎంతమంది పిల్లలున్నారనే దాని గురించి మాత్రం వెల్లడించలేదు. (చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి) -
ఒకే రోజు 95 జంటలకు పెళ్లి.. ఎక్కడంటే!
అన్నానగర్(చెన్నై): తిరువందిపురంలో ఆదివారం ఒకే రోజు 95 పెళ్లిలు జరిగాయి. వివరాల్లోకి వెళితే.. కడలూరు సమీపంలోని తిరువందిపురంలో ప్రసిద్ధి చెందిన దేవనాథస్వామి ఆలయం ఉంది. గుడి ముందున్న కొండపై శుభ ఘడియలు ఉన్న రోజుల్లో రోజుకు 50 నుంచి 200 వరకు పెళ్లిళ్లు జరుగుతాయి. అలాగే తిరువందిపురం ప్రాంతంలోని ప్రైవేట్ మంటపాల్లో కూడా వివాహాలు జరుగుతాయి. ఆదివారం ముహుర్తాలు ఉండడంతో తిరువందిపురంలోని దేవనాథస్వామి ఆలయ కొండపై ఉన్న హాలులో తెల్లవారుజామున నుంచి వివాహ వేడుకలు జరిగాయి. కొండపైన 70 పెళ్లిళ్లు జరగ్గా ఆ గుడి చుట్టుపక్కల ప్రైవేట్ హాళ్లలో 25 పెళ్లిళ్లు మొత్తం 95 వివాహాలు జరిగాయి. అనంతరం భార్యాభర్తలు కుటుంబ సమేతంగా దేవనాథస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. శుభకార్యాలకు జనం అధిక సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు. దీంతో కడలూరు, బాలూరు రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చదవండి: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిళ్లు చోరీ చేస్తూ లాగించేస్తోంది! -
పవన్ మూడు పెళ్లిళ్ల కామెంట్స్ పై సీఎం జగన్ కౌంటర్
-
'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత
హవానా: స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల జాబితాలో మరో దేశం చేరింది. గే మ్యారేజెస్‌కు క్యూబా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మహిళల హక్కులకు పెద్దపీట వేస్తున్న ఈ కమ్యూనిస్టు దేశం 'సేమ్ జెండర్' మ్యారేజెస్‌ను అధికారికం చేసింది. ఈ చట్టం కోసం ఆదివారం పెద్దఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. 84లక్ష మంది పాల్గొన్న ఈ ఓటింగ్‌లో దాదాపు 40 లక్షల మంది(66.9శాతం) దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 1.95లక్షల మంది(33శాతం) మాత్రం వ్యతిరేకించారు. దీంతో ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చినందున గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు క్యూబా ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ విషయంపై క్యూబా అధ్యక్షుడు డయాజ్ క్యానెల్ స్పందిస్తూ.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. కొన్ని తరాల రుణం తీర్చుకున్నట్లయిందని పేర్కొన్నారు. ఎన్నో క్యూబా కుటుంబాలు ఈ చట్టం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో క్యూబాలో స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్దత లభిస్తుంది. వీరు పిల్లల్ని కూడా దత్తత తీసుకోవచ్చు. పురుషులు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయి. చదవండి: యువకుడి అసాధారణ బిజినెస్.. సినిమాలో హీరోలా.. -
50 మిలియన్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలోనే: యూఎస్ రిపోర్ట్
జెనీవా: ప్రపంచంలో 50 మిలియన్ల మంది ప్రజలు బలవంతపు పనిలో లేదా బలవంతపు వివాహంలో చిక్కుకున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇటీవలకాలంలో ఆ సంఖ్య మరింత గణనీయంగా పెరిగినట్లు యూఎన్ తెలిపింది. యూఎన్ 2030 నాటికి అన్నిరకాల ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే అనుహ్యంగా 2016 నుంచి 2020 మధ్యకాలంలో సుమారు 10 మిలియన్ల మంది బలవంతపు కార్మికులుగా లేదా బలవంతపు వివాహాల్లో చిక్కుకున్నారని యూఎన్ నివేదికలో పేర్కొంది. వాక్ ఫ్రీ ఫౌండేషన్‌తో పాటు యూఎన్ లేబర్ అండ్ మైగ్రేషన్ ఏజెన్సీల అధ్యయనం ప్రకారం గతేడాది చివరి నాటికి సుమారు 28 మిలియన్ల మంది ప్రజలు బలవంతపు పనిలోకి నెట్టివేయబడ్డారని, దాదాపు 22 మిలియన్ల మంది బలవంతంగా వివాహం చేసుకున్నారని తెలిపింది. దీనిని బట్టి ప్రపంచంలో ప్రతి 150 మందిలో దాదాపు ఒకరు ఆధునిక బానిసత్వంలో చిక్కుకున్నారని అధ్యయనం వెల్లడించింది. ఆధునిక బానిసత్వం మెరుగవకపోవడం దిగ్బ్రాంతికరం అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఓ) అధిపతి గైరైడర్ అని తెలిపారు. అదీగాక కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను మరింత దిగజార్చింది. దీంతో చాలామంది కార్మికుల రుణాలను పెంచిందని అధ్యయనం గుర్తించింది. అంతేగాక వాతావరణ మార్పు, సాయుధ పోరాటాల ప్రభావాల కారణంగా ఉపాధి, విద్యకు అంతరాయం తోపాటు తీవ్రమైన పేదరికం తలెత్తి అసురక్షిత వలసలకు దారితీసిందని తెలిపింది. దీన్ని దీర్ఘకాలిక సమస్యగా యూఎన్ నివేదిక అభివర్ణించింది. పిల్లల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు బలవంతపు శ్రమలోకి నెట్టబడటమే కాకుండా వారిలో సగానికి పైగా వాణిజ్యపరమైన లైంగిక దోపిడికి గురవుతున్నారని నివేదిక పేర్కొంది. అలాగే వలస కార్మకులు, వయోజన కార్మికులు బలవంతపు పనిలో ఉండే అవకాశం మూడురెట్లు ఉందని పేర్కొంది. ఈ నివేదిక అన్ని వలసలు సురక్షితంగా, క్రమబద్ధంగా ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) అధిపతి ఆంటోనియో విటోరినో ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: శిక్షణ విన్యాసాల్లో అపశ్రుతి.... హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి) -
పెళ్లిళ్లకు బ్రేక్.. అప్పటి దాకా ఆగాల్సిందే.. నో ఛాన్స్
ద్వారకా తిరుమల(ఏలూరు జిల్లా): చిన వేంకన్న క్షేత్రం ద్వారకా తిరుమలలో శ్రావణ మాస పెళ్లిసందడికి తెర పడింది. ఆదివారం ఉదయం 8.39 గంటలదే శ్రావణంలో చివరి ముహూర్తం. ఈ ముహూర్తంలో కొన్ని వివాహాలు జరిగినా.. శనివారం రాత్రి ముహూర్తం శ్రావణ మాసంలో అతి పెద్దది కావడంతో క్షేత్రంలో 300కు పైగా వివాహాలు జరిగాయి. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. చదవండి: కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా? రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఎటు చూసినా పెళ్లివారే కనిపించారు. కొండ పైన, దిగువన ఉన్న కల్యాణ మంటపాలు, తూర్పు రాజగోపుర ప్రాంతంలోని అనివేటి మంటపం, పాదుకా మంటపం వద్ద ఉన్న స్వామివారి కల్యాణ మంటపంలో, చివరకు ఆలయ ప్రధాన రాజగోపుర మెట్ల మార్గం, తూర్పు రాజగోపుర ప్రాంతంలో నేలపై సైతం వివాహాలు జోరుగా జరిగాయి. స్వామి సన్నిధిలో కాస్త జాగా దొరికితే చాలు.. ఏదోలా పెళ్లి చేసుకుని వెళ్లిపోదామని పెళ్లి బృందాల వారు ఆతృత పడ్డారు. పెళ్లివారి వాహనాలతో ఘాట్ రోడ్లన్నీ కిక్కిరిశాయి. క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎస్సై టి.సుదీర్ సిబ్బందితో కలసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. మొత్తంగా శ్రావణ మాసంలో శ్రీవారి క్షేత్రంలో సుమారు 2 వేల వివాహాలు జరిగాయి. దేవస్థానానికి కోట్లాది రూపాయల ఆదాయం లభించింది. స్వామి సన్నిధిన వివాహాలు చేసుకున్నవారే కాకుండా ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. సత్రం గదుల్లో చాలావరకూ పెళ్లిబృందాల వారే రిజర్వ్ చేసుకున్నారు. పెళ్లిళ్లకు మూడు నెలలు బ్రేక్.. శ్రీవారి క్షేతంల్రో వివాహాలు జరగాలంటే మార్గశిర మాసం వరకూ అంటే డిసెంబర్ రెండో తేదీ వరకూ ఆగాల్సిందే. ఆదివారంతో శ్రావణ మాసంలోని వివాహ ముహూర్తాలు ముగిశాయి. 28 నుంచి భాద్రపదం శూన్యమాసం. ఆ తరువాత సెప్టెంబర్ 18 నుంచి శుక్ర మౌఢ్యమి కావడంతో నవంబర్ 27 వరకూ వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లిళ్లు జరుపుకొనేందుకు అనేక మంది తొందరపడ్డారు. దీంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. డిసెంబర్ 2 నుంచి 19వ తేదీ వరకూ మళ్లీ పెళ్లి ముహూర్తాలున్నాయి. ఆ తరువాత పుష్యమాసం కావడంతో డిసెంబర్ 24 నుంచి జనవరి 21 వరకూ ముహూర్తాలు లేవు. తిరిగి జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న మాఘమాసంలో, తరువాత ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమవుతున్న ఫాల్గుణంలో వివాహాలు జరగనున్నాయని పండితులు తెలిపారు. కొత్త జంటలతో క్షేత్రం కళకళ కొత్త జంటలతో శ్రీవారి క్షేత్రం కళకళలాడింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా వివాహాలు జరిగాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి కొత్త జంటలు, వారి బంధువులతో కలసి ఆలయానికి తరలి వచ్చారు. ఆలయం వద్ద ఎటు చూసినా నూతన వధువరులే కనిపించారు. దీనికితోడు ఆదివారం సెలవు కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. -
Araku Valley: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాల నెలవైన అరకు లోయలో ‘గిరి గ్రామదర్శిని’ ఆదివాసీ జీవన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. పచ్చటి కొండలు, లోతైన లోయలు, జాలువారే జలపాతాల నడుమ అరకును సందర్శించే పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది. అన్నిటికి మించి గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో పర్యాటకులకు వివాహ వేడుక అవకాశాన్ని కల్పిస్తోంది. అరకులోని గిరిజన మ్యూజియానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెదలబుడు’ గ్రామంలో ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామాన్ని నిర్మించింది. ఒడిశా సరిహద్దున గల ఈ ప్రాంతంలో దాదాపు 92 శాతం జనాభా గిరిజనులే. గిరిజన ఆచారాల్లో ఒదిగిపోవచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ఆదివాసీల జీవనశైలి, వారి సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడానికి ‘గిరి గ్రామదర్శిని’ని తీర్చిదిద్దింది. ఈ గ్రామంలో పర్యాటకులకు సాధారణ స్థానిక ఆదివాసీ వాతావ రణాన్ని అందిస్తూ సుమారు 15కి పైగా సంప్రదాయ గిరిజన గుడిసెలను ఏర్పాటు చేసింది. గిరిజనుల జీవన విధానాన్ని అనుభవించాలనుకునేవారు ఈ కాటేజీలను బుక్ చేసుకుని ఒకట్రెండు రోజులు బస చేయవచ్చు. ఈ సమయంలో పర్యాటకులు స్థానిక గిరిజన సమూహాలతో మమేకమై గడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల మాదిరిగానే కట్టు, బొట్టు, ఆభరణాలు ధరించి వారి ఆచార వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. ఎద్దుల బండిపై సవారీ, రాగి అంబలి, విలు విద్య క్రీడా కేంద్రం, బొంగరం ఆట, కొమ్మ రాట్నం, థింసా ఆడుకునేందుకు ప్రత్యేక స్థలం, నాగలి పట్టి దుక్కి దున్నడం ఇలా ఒకటేమిటి అనేక అంశాలు గిరి గ్రామదర్శినిలో ఉన్నాయి. గిరిజనుల ఆట విడుపు అయిన కోడి పుంజులను పట్టుకోవడం కూడా పర్యాటకుల కార్యకలాపాల్లో భాగం చేశారు. (క్లిక్: జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్) అక్కడే పెళ్లి చేసుకోవచ్చు గిరి గ్రామదర్శినిలో పర్యాటకులను ఆదివాసీ వివాహ పద్ధతి ఎక్కువగా ఆకట్టుకుంటోంది. వినూత్న రీతిలో వివాహం చేసుకోవాలనుకునే యువతకు, ఇప్పటికే వివాహమైన జంటలకు గిరిజన వివాహ అనుభూతిని అందిస్తోంది. పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ ఈ కాన్సెప్ట్‌ను రూపొందించింది. ఇందులో వధూవరులతోపాటు, స్నేహితులు, బంధువులను కూడా గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ముస్తాబు చేస్తారు. గుడిసెను వెదురు, పూలు, ఆకులతో అలంకరిస్తారు. ఇక్కడి గిరిజన పూజారి గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహ తంతును నిర్వహించేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటారు. ఆచారమంతా గిరిజన సంగీతంతో మార్మోగుతుంది. పెళ్లి విందు కూడా స్థానిక జీవన శైలిలో ఉంటుంది. క్యాంప్ ఫైర్ చుట్టూ థింసా నృత్యం చేస్తూ స్థానిక గిరిజన మహిళలు అతిథులను అలరిస్తారు. గిరిజన వివాహాలు పూర్తిగా మహిళలతో నిర్వహిస్తుండటం కూడా ఇక్కడి విశేషం. ఈ తరహా వివాహాన్ని కోరుకునేవారు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) -
నిత్య పెళ్లి కొడుకు పాస్‌పోర్టు రద్దు చేయించాలి
నగరంపాలెం(గుంటూరు ఈస్ట్): నిత్య పెళ్లికొడుకు పాస్‌పోర్టుని వెంటనే రద్దు చేయించాలని బాధితులు, వారి కుటుంబ సభ్యులు కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక– స్పందన (గ్రీవెన్స్)లో జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ దృష్టికి తీసుకువచ్చారు. వరుస వివాహాలతో పలువురి మహిళలను మోసగించిన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు గ్రామానికి చెందిన కె.సతీష్‌బాబు అలియాస్ సత్యకుమార్‌ను గత గురువారం (జూలై 28) గుంటూరు దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సతీష్‌బాబుపై కోర్టులో కేసు జరుగుతుందని, అతనికి బెయిల్ మంజూరు చేస్తే విదేశానికి పారిపోయేందుకు అవకాశం ఉందని గుంటూరు నగరంలోని పాతగుంటూరు, శ్యామలానగర్‌కు చెందిన బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని, అలాగే పాస్‌పోర్ట్ రద్దు చేయించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అతని వద్ద ఉన్న మరో లాప్‌ట్యాప్‌ను సీజ్ చేయలేదని తెలిపారు. అందులో విమాన టికెట్ ఉందని, ఏమాత్రం అతనికి బెయిల్ మంజూరైన, వెంటనే ఇక్కడి నుంచి పారిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఓ పోలీస్ అధికారి తీరు విమర్శలకు తావిస్తోందని, బాధితుల పక్షాన తెలియజేసే అదనపు సమాచారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. బాధితుల ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించారు. పోలీస్ అధికారిని పిలిచి మాట్లాడారు. (క్లిక్: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..!) -
నిత్య పెళ్లికొడుకు సతీష్ తెలుగుతమ్ముడే!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నిత్య పెళ్లికొడుకుగా మారి ఇప్పటివరకు ఐదు పెళ్లిళ్లు చేసుకుని మరికొంతమందిని మోసం చేసిన కర్నాటి సతీష్ బాబు టీడీపీ నేతేనని వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికాలోని వర్జీనియాలో జరిగిన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సమావేశానికి సతీష్ హాజరవడమే కాకుండా కీలకంగా వ్యవహరించాడని చెబుతున్నారు. ఆ సమావేశంలో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పాల్గొన్నారు. టీడీపీలో తనకు ఉన్న పరిచయాలతో ఇక్కడ చక్రం తిప్పాడని బాధితులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందకూరుకు చెందిన కర్నాటి వీరభద్రరావు కుమారుడు కర్నాటి సతీష్ మోసం చేసి పలువురు మహిళలను పెళ్లి చేసుకున్నట్లు ఒక మహిళ దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని ఈ నెల 26న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పసరు మందు ఇచ్చి అబార్షన్.. ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో నాలుగో భార్యకు పసరు మందు ఇచ్చి అసహజ పద్ధతుల్లో సతీష్ బాబు అబార్షన్ చేయించాడు. ఐదో భార్యను కూడా అబ్బాయిని కనడం కోసమే చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. శనివారం సతీష్ చేతిలో మోసపోయిన నాలుగో భార్య, ఐదో భార్య గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ, దిశ ఇన్చార్జ్ సుప్రజను కలిసి ఫిర్యాదు చేశారు. సతీష్‌కు ఉన్న ఐదు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసి అందులో ఉన్న నీలిచిత్రాలను తొలగించాలని నాలుగో భార్య కోరారు. తనకు, తన తల్లికి ఆ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు విడాకులు ఇవ్వకుంటే తనతో పడకగదిలో ఉన్నప్పుడు రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఐదో భార్య కూడా సతీష్ విదేశాలకు పారిపోకుండా అతడి పాస్‌పోర్టును సీజ్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం కస్టడీ పిటీషన్ వేయనున్నట్లు ఏఎస్పీ సుప్రజ తెలిపారు. ఇంకా అతడి వల్ల మోసపోయిన మహిళలు ఉంటే నేరుగా అధికారులను కలిసి వివరాలు అందజేయాలన్నారు. -
పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, పట్నంబజార్: అమెరికాలోని వాషింగ్టన్లో పనిచేసే పల్నాడు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన కర్నాటి సతీష్‌బాబు అలియాస్ సత్యకుమార్ తనకు పెళ్లి కాలేదని చెబుతూ అనేక మంది మహిళలను మోసం చేశాడు. ఈ క్రమంలో అతనికి బెంగళూరుకు చెందిన ఓ మహిళ ద్వారా గుంటూరు రవీంద్రనగర్‌కు చెందిన మహిళ పరిచయమైంది. ఈమె సతీష్‌ను ఇద్దరి కుటుంబ పెద్దల సమ్మతితో ఈ ఏడాది జూన్ 16న పెళ్లి చేసుకున్నారు. తరువాత హైదరాబాద్ వెళ్లి కేపీహెచ్‌బీ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ఆమె సతీష్‌బాబు సెల్‌ఫోన్ పరిశీలించి, అందులో లావణ్య అనే మహిళతో పలుమార్లు చాటింగ్ చేసినట్టు గుర్తించి నిలదీసింది. చదవండి: ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి దీంతో లావణ్యను కూడా పెళ్లి చేసుకున్నానని అతను చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. అతని తల్లిదండ్రులను ప్రశ్నించగా అదే సమాధానం ఎదురైంది. దీంతో సతీష్‌బాబు పై అనుమానం వచ్చిన ఆమె అతడి గురించి ఆరా తీసింది. అప్పటికే అతనికి చాలా పెళ్లిళ్లయ్యాయని, 2019, 2021 సంవత్సరాల్లో సతీష్‌పై కేసులు కూడా నమోదయ్యాయని యూట్యూబ్‌లో ఉన్న వీడియోల ద్వారా తెలుసుకుంది. అప్పటినుంచి సతీష్ ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. ఇంటి కోసం రుణం తీసుకోవాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. తన విషయాలు బయటపెడితే పడకగదిలో అశ్లీలంగా తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతోపాటు ఆమె వద్ద రూ.పది లక్షల వరకు దఫదఫాలుగా తీసుకుని సొంతానికి వాడుకున్నాడు. ఈ బాధలను భరించలేని బాధితురాలు ఎట్టకేలకు దిశ పోలీసులను ఆశ్రయించింది. వివాహాలు వాస్తవమే! మహిళ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా అతడికి ఆరు వివాహాలైన మాట వాస్తమేనని గుర్తించినట్లు సమాచారం. 2021లో ఓ మహిళ ఫిర్యాదుతో సతీష్‌పై కేసు నమోదైనట్టు గుర్తించారు. అప్పట్లో నమోదు చేసిన చార్జిషీటుపై, అప్పటి దర్యాప్తు తీరుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లోనే లక్షలాది రూపాయలు చేతులు మారినందున విచారణ పక్కదారి పట్టిందని సమాచారం. అప్రమత్తమైన పోలీసులు ప్రస్తుతం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నిందితుడి సెల్‌ఫోన్ సీజ్ చేసి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సతీష్‌బాబు ఆరు వివాహాలే చేసుకున్నాడా? లేదా ఇంకా మరికొంతమందిని కూడా మోసం చేశాడా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఆయా పెళ్లిళ్లల్లో కీలకంగా వ్యవహరించిన కొందరిని విచారించినట్లు తెలుస్తోంది. సతీష్‌బాబుకు గ్రీన్‌కార్డు ఉండటంతో పాస్‌పోర్టు రద్దుకు సిఫార్సులు చేస్తున్నట్టు సమాచారం. -
వీడు మామూలోడు కాదు? 11 పెళ్లిళ్లు 11మంది భార్యలు..
-
బయటపడిన నిత్య పెళ్లికూతురి బాగోతం.. ముగ్గురి దగ్గర మూడు పేర్లతో..
సాక్షి, చిత్తూరు(చెన్నై): విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి ముగ్గురి భర్తల వద్ద మూడు పేర్లు చెప్పి వివాహం చేసుకున్న కిలాడీ లేడి విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. చెన్నై ఆవడి సమీపంలోని ముత్తు పుదుపేట రాజీవ్‌నగర్‌కు చెందిన హరి(44) ఎంసీఏ పూర్తి చెన్నైలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి 2008లో చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. మనస్పర్థల కారణంగా వీరు 2014లో విడాకులు తీసుకున్నారు. దీంతో హరి రెండవ వివాహం చేసుకునేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇంటి పని చేస్తున్న వ్యక్తి ద్వారా ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన శరణ్య అనే యువతిని చూశారు. ఆ సమయంలో ఆమె తనకు 35 ఏళ్లు అని, బంధువులు ఎవరూ లేదని చెప్పింది. దీంతో హరి, శరణ్యను గత ఏడాది వివాహం చేసుకున్నాడు. ఈ ఆస్తి వివరాలను చెప్పాలని హరితో శరణ్య తరచూ ఘర్షణ పడేది. ఆస్తులను తనపై పేరుపై రాసి పెట్టాలని కోరింది. చివరికి వరకట్న వేధింపులు గురి చేస్తున్నారని భర్త, అత్త ఇంద్రాణిపై తిరుపతి పోలీసులకు శరణ్య ఫిర్యాదు చేసింది. దీంతో హరి తల్లి ఇంద్రాణి ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా శరణ్య నిజమైన పేరు సుగణ అని ఈమెకు 50 ఏళ్లని తేలింది. ఈమెకు ఇది వరకే తిరుపతికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలున్నట్లు తెలిసింది. దీంతో ఆవడి పోలీసులు శరణ్యను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని వక్కనంపట్టి గ్రామానికి చెందిన సుబ్రమణి శనివారం ఆవడి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. అందులో తాను సేలం, ఈరోడ్డు, కాట్పాడి వంటి రైల్వేస్టేషన్‌లోని క్యాంటిన్లో పని చేస్తున్నానని 2010లో ఆరణికి చెందిన ఏజెంట్ ద్వారా శరణ్యకు తనకు వివాహం జరిగిందని పేర్కొన్నాడు. తన వద్ద ఆమె పేరును సంధ్య అని తెలిపిందన్నారు. గత పదేళ్లుగా శరణ్యతో తాను జీవించానని తమకు పిల్లలు లేదని 2021 జూలైలో మేట్టుపాళ్యంలో రైల్వే క్యాంటీన్లో పనికి వెళ్లిన సమయంలో శరణ్య తనను వదిలి వెళ్లి పోయిందని అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి! -
మనువుల ‘రేవు’: వరుడికి తాళికట్టిన వధువు..
వజ్రపుకొత్తూరు రూరల్(శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం గురువారం సామూహిక వివాహాలతో కళకళలాడింది. తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 47 జంటలు ఒకే ముహూర్తానికి ఒక్కటై దాంపత్య జీవితంలో అడుగు పెట్టాయి. వరుడు తలవంచితే.. వధువు మూడు ముళ్లు వేసింది. చదవండి: చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు -
భర్తపై ఇద్దరి భార్యల ఫిర్యాదు
మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఒకరికొకరికి తెలియకుండా రెండు వివాహాలు చేసుకున్న ఓ డాన్సర్‌పై ఇద్దరు భార్యలు శుక్రవారం మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్కాపురం శెట్టిబలిజ వీధికి చెందిన సుమంత్ అనే వ్యక్తి వృత్తిరీత్యా డాన్సర్. స్టేజ్ ప్రోగ్రామ్‌లలో పాల్గొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరిలోవకు చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం కావడం, అది ప్రేమగా మారడంతో కొంత కాలం కిందట పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా సుమంత్‌కు విజయవాడ ప్రాంతానికి చెందిన మరో యువతి పరిచయమైంది. ఆమెను పది రోజుల కిందట పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పటికే సుమంత్‌కు పెళ్లయిన సంగతి విజయవాడ యువతికి తెలియదు. అలాగే విజయవాడ యువతితో ఇటీవల పెళ్లి జరిగిందన్న విషయం ఆరిలోవ బాలికకు తెలియదు. చివరకు ఈ విషయాన్ని ఇతర స్నేహితుల ద్వారా గురువారం తెలుసుకున్న మైనర్ బాలిక, విజయవాడ అమ్మాయి లబోదిబోమన్నారు. తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం సాయింత్రం మల్కాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరి వద్ద వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. (చదవండి: పోలీసు ఇంటికే కన్నం) -
ముందులా కాదు.. ట్రెండ్ మారింది, ఆడపిల్ల విషయంలో అభిప్రాయం మారుతోంది
సాక్షి,రాజాం(శ్రీకాకుళం): ఆడపిల్ల విషయంలో అభిప్రాయం మారుతోంది. ఐదేళ్ల కిందటకు ఇప్పటికి స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఐదేళ్ల కిందటి వరకు అమ్మాయికి తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపేద్దామనే ఆత్రుత జిల్లా ప్రజల్లో కనిపించేది. అధికారులు ఎంతగా ప్రచారం చేసినా, అవగాహన కల్పించినా గ్రామాల్లో గుట్టుగా బాల్య వివాహాలు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ విధి విధానాలు, బాలల సంరక్షణ విభాగం పటిష్ట చర్యలు, గ్రామాల్లో ఆర్థిక పరిపుష్టి, బాలికల విద్యావకాశాలు మెరుగుపడడంతో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. బాలల సంరక్షణ విభాగం చొరవ జిల్లాలో బాలల సంరక్షణ విభాగం చురుగ్గా పనిచేస్తోంది. గత నాలుగేళ్లుగా ఈ విభాగం సేవలు, నిత్య పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి వేగంగా వెళ్లాయి. ప్రధానంగా భారతీయ వివాహ చట్టాన్ని ఆడపిల్లల తల్లిదండ్రులకు చేరవేయగలిగారు. మరో వైపు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, చైల్డ్లైన్లు ఎక్కడికక్కడే అవగాహన కార్యక్రమాలు చేయడం, ఎప్పటికప్పుడు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ద్వా రా చదువు మానేస్తున్న బాలికలను గుర్తించి వారి కి ఉన్నత విద్యను అందించే ఏర్పాట్లు చేయడం, బాలికల సంరక్షణ వసతిగృహాల్లో వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. గత పదేళ్లలో.. గత పదేళ్లుగా చూసుకుంటే బాల్య వివాహాలు 2011 కంటే ప్రస్తుతం భారీగా తగ్గుముఖం పట్టాయి. 2011–12లో ఏడాదికి సగటున బాల్య వివాహాల నమోదు 395గా ఉండేది. 2018–20 మధ్య కాలంలో ఏడాదికి 163 నుంచి 128కి తగ్గుముఖం పట్టాయి. 2021–22 ఏడాదిలో ఈ వివాహాలు 54కి నమోదు కాగా, ఈ ఏడాదిలో ఈ మొత్తం బాల్య వివాహాలను బాలల సంరక్షణ విభాగం అడ్డుకోగలిగింది. (చదవండి: Scolded Drinking Habit: తమ్ముడి నిర్వాకం...సొంత అక్కపైనే అఘాయిత్యం ) పెరిగిన విద్యావకాశాలు.. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు గ్రామాల్లో విద్యావకాశాలు బాగా పెరిగాయి. వైఎస్సార్ సీపీ వచ్చాక పాఠశాలలు, కాలేజీలు అభివృద్ధి చెందాయి. గతంలో పదో తరగతి వరకూ మాత్రమే ఆడపిల్లల చదువులు ఉండేవి. ఇప్పుడు ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లమో, బీ ఫార్మసీ వంటి కోర్సుల వైపు బాలికలు దృష్టి సారిస్తున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీ ఉద్యోగ వ్యవస్థలో ఒక విప్లవం తీసుకురాగా, ఆయా ఉద్యోగాలు పొందిన బాలికలు మిగిలినవారికి మార్గదర్శులుగా మారారు. చట్టం ఏం చెబుతోంది..? భారతీయ వివాహ చట్టం 1955 ప్రకారం ఆడపిల్లకు 18 ఏళ్లు దాటిన తర్వాత, అబ్బాయికి 21 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలి. పురుషులతో సమానంగా మహిళలకు కూడా వివాహ వయస్సు ఉండాలని 2006లో భారతీయ వివాహ చట్టాన్ని కేంద్ర క్యాబినెట్ మార్పుచేసింది. ఫలితంగా ఇప్పుడు అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లుగా ఉండాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా కాదని బాల్య వివాహాలు నిర్వహిస్తే రెండు కుటుంబాలపైన చట్టపరమైన చర్యలు తప్పవు. గత పదేళ్లలో జిల్లాలో 1120 బాల్య వివాహాల ఫిర్యాదులు నమోదు కాగా, ఇందులో 1112 పెళ్లిళ్లను అధికారులు నిలుపుదల చేసి, ఆయా కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మొండికేసి బలవంతంగా పెళ్లి జరిపిన 8 కుటుంబాలపై కఠిన చర్యలు చేపట్టారు. అవగాహన పెరిగింది బాల్య వివాహాలు చేయకూడదనే విషయం ప్రజలకు తెలిసింది. ప్రతి రోజు మేం చేస్తున్న కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ప్రజల్లోకి వెళ్లాయి. ప్రధానంగా బాల్య వివాహాలు చేయడం ద్వారా అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయే పరిస్థితి కూడా ఉంది. వీటిపై ప్రజల్లో అవగాహన రావడంతో బాల్య వివాహాలు తగ్గాయి. అంతేకాకుండా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, విద్యావకాశాలు మెరుగుపర్చడం వంటి వాటి ద్వారా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. – కేవీ రమణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి, శ్రీకాకుళం -
ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు
హైదరాబాద్: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండూ కష్టమైనవే. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆరే ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో భాగంగా 10 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.8,421 కోట్లు ఖర్చు చేశాం. ఇగ పెళ్లి చేసుకోవడానికి, ఆ తర్వాత పిల్లల బారసాల చేసుకోవడానికి ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే నిర్మిస్తోంది’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్లో రూ.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, వాణీదేవిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తొలుత ఎస్పీ రోడ్డులోని ప్యాట్నీ నాలాపై రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పాటిగడ్డలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను, ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రూ.45 కోట్లతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను అల్లంతోటబావి, బ్రాహ్మణవాడీలలో ప్రారంభించారు. పాటిగడ్డలో ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం నుంచి పని చేయించుకోవడం, ప్రజలకు ముందుండి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా సనత్‌నగర్ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. పాటిగడ్డలో ఆర్‌అండ్‌బీకి చెందిన 1,200 గజాల స్థలంలో ఇక్కడివారికి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించాలని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఇక్కడి పేదలు బర్త్ డేలు, వివాహాలు.. ఇలా చిన్నా పెద్దా శుభకార్యాలు చేసుకోవాలంటే వేల రూపాయల కిరాయిలు చెల్లిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక్కడ చక్కటి ఫంక్షన్ హాల్ నిర్మించాల్సిందిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ అడిగిన వెంటనే రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే దసరా నాటికి ప్రారంభించుకుందామని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా కేసీఆర్ నాయకత్వంలో రహదారులు, మంచినీటి వ్యవస్థలు బాగుపడుతున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్లు టి.మహేశ్వరి శ్రీహరి, కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు అరుణ, తరుణి, శేషుకుమారి, రూప, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్‌కుమార్ యాదవ్, రాజయ్య, శేఖర్ ముదిరాజ్, శ్రీనివాస్‌గౌడ్, అఖిల్ అహ్మద్ పాల్గొన్నారు. -
ఆ టీడీపీ నేత.. నిత్య పెళ్లి కొడుకు
పెద్దతిప్పసముద్రం: ఆయన తెలుగుదేశం పార్టీ నేత. పార్టీలో అత్యంత క్రియశీలకంగా వ్యవహరిస్తుంటాడు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. అయితే ఆయన నిత్య పెళ్లికొడుకన్న విషయం తాజాగా బయటపడింది. డబ్బున్న యువతులకు వల వేసి ప్రేమ పేరుతో వంచించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా వరుసగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఈ బాగోతాన్ని మూడో భార్య కనిపెట్టింది. రెండో భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం నవాబుకోటకు చెందిన దండుపల్లి వెంకటరమణ కుమారుడు మంజునాథ్. బెంగళూరులో కాంక్రీట్ మిల్లర్లు అద్దెకు ఇస్తుంటాడు. కొంత డబ్బు పోగేసుకుని గ్రామానికి చేరుకున్నాడు. అనంతరం మదనపల్లి సమీపంలోని అంగళ్లులో రజనీ అనే యువతిని సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుని కొన్నాళ్లు కాపురం చేశాక వదిలేశాడు. అనంతరం బెంగళూరు వెళ్లిపోయాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని మ్యారేజ్ బ్యూరో ద్వారా కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్కు చెందిన ఆశా అనే యువతిని ఆరేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఐదేళ్ల పునీతశ్రీ అనే పాప కూడా ఉంది. అనంతరం అదనపు కట్నం పేరిట వేధించి ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలతో పరారయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ధావణగెరేకు చెందిన ప్రియాంక అనే యువతిని వల్లో వేసుకున్నాడు. వంద గ్రాముల బంగారం, రూ.5 లక్షలు కట్నంగా తీసుకుని ఇరు కుటుంబీకుల సమక్షంలో మూడేళ్ల కిందట ధర్మస్థలంలో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి పంపగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. కట్నం కోసం వేధింపులు ఇదే అదనుగా భావించిన ఆ నిత్య పెళ్లి కొడుకు హుటాహుటిన బెంగళూరులో ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి సామాన్లతో సహా స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇల్లు ఎందుకు ఖాళీ చేశావని ఫోన్ ద్వారా భార్య ప్రియాంక ప్రశ్నించగా.. ఇక్కడే కాపురం చేద్దాం.. వచ్చేయ్ అని చెప్పడంతో ఆమె ఏడాది కిందట పాపతో సహా అత్తారింటికి చేరుకుంది. అయితే ఆరు నెలలుగా భర్తతో పాటు అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికే ఈ ప్రబుద్ధుడి వ్యవహారం ప్రియాంక తెలుసుకుంది. ఆమెకు రెండో భార్య ఆశా కూడా తోడైంది. దీంతో వారు పెద్దతిప్పసముద్రం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మధురామచంద్రుడికి ఫిర్యాదు చేశారు. అయితే వీరు స్థానికంగా నివాసం ఉంటున్నట్టు ఆధార్, రేషన్ కార్డు తదితర ఎలాంటి ఆధారాలూ లేనందున కర్ణాటక రాష్ట్రంలో ఫిర్యాదు చేయాలంటూ వారిని వెనక్కి పంపినట్టు ఎస్ఐ చెప్పారు. -
కొత్త ఏడాది.. రెండో రోజు నుంచే శుభకార్యాలకు సెలవు.. ఎందుకంటే
సాక్షి, నిజామాబాద్: మరో రెండు రోజుల్లో శుభకార్యాలకు సెలవులు రానున్నాయి. వివాహ, గృహప్రవేశ తదితర శుభకార్యాలకు అవసరమైన ముహూర్తాలు శుక్రవారంతో ముగియనున్నాయి. శని, ఆదివారాలు మార్గ బహుళ చతుర్దశి, అమావాస్యలు ఆ తర్వాత జనవరి 2 నుంచి శూన్యమాసం (పుష్యమాసం)ప్రారంభమవుతుంది. తిరిగి వివాహ, గృహ ప్రవేశాలు ఫిబ్రవరి 3నుంచి ఆరంభమవుతాయి. జనవరి నెలలో వివాహాది శుభముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు తిరిగి మార్చి 19 నుంచి 27 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 18 వరకు గురుమౌడ్యమి ఉంటుందని పంచాంగ కర్త కిషన్‌రావు జోషి తెలిపారు. అలాగే పుష్యమాసం శనిదేవుడికి ప్రీతికరం. దీంతో ఈ మాసంలో నవగ్రహ ఆరాధనలు, పిండివంటల్లో నువ్వులు అధికంగా వాడుతారు. ఫిబ్రవరి 5న వసంత పంచమి.. చదువులతల్లి సరస్వతీమాత జన్మతిథి వసంతపంచమి పర్వదినాన్ని ఫిబ్రవరి 5న జరుపుకోనున్నారు. నాటి నుంచి వివాహ గృహప్రవేశ, శంకుస్థాపనలు తదితర అనేక శుభముహూర్తాలు ఆరంభమవుతాయి. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినం జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చదవండి: Nizamabad: ఒక్కరాత్రే పదకొండు ఇళ్లలో చోరీ -
పెళ్లి వేడుకలపై కరోనా మహమ్మారి ప్రభావం
-
పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది
పురుషులతోపాటు మహిళలు దాదాపు అన్నిరంగాల్లో సమానంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా నిత్య పూజల నుంచి కైంకర్యాల దాకా అంతా మగ పూజారులు, పండితులు మాత్రమే చూసుకోవడం చూస్తున్నాం. కానీ అమెరికాలో పండితుల పీటమీద సుష్మా ద్వివేది కూర్చుని పెళ్లిళ్లు జరిపిస్తూ కొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. కుల, మత భేదం లేకుండా పెళ్లిళ్లు చేయడమే గాక, పూజలు, వ్రతాలు కూడా నిర్వహిస్తోంది. భారత సంతతికి చెందిన సుష్మ కెనడాలో పెరిగిన అమ్మాయి. 2013లో వివేక్ జిందాల్‌తో పెళ్లి జరిగింది. వీరి పెళ్లితోపాటు వివేక్ జిందాల్ తోబుట్టువు ఒకరి పెళ్లికూడా అదే సమయంలో ఏర్పాటు చేశారు. కానీ అది ఒక ట్రాన్స్‌జెండర్ పెళ్లి. దీంతో సుష్మా వాళ్ల పెళ్లి శాస్త్రోక్తంగా జరిగినప్పటికీ తోబుట్టువు పెళ్లి అలా జరగలేదు. అప్పుడు అంతా బాధపడ్డారు. ఆ పెళ్లి కూడా సంప్రదాయబద్ధంగా జరిగితే బావుండును అని సుష్మకు అనిపించింది. కానీ అలా జరగలేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటోన్న వారికి పరిష్కారం చూపాలని అప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించింది సుష్మ. తొలి బిడ్డ ప్రసవ సమయంలో... నెలలు నిండిన సుష్మ ఆసుపత్రిలో చేరింది. అక్కడ కాన్పు సవ్యంగా జరగడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో ఓ జంటకు పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎనస్థీషియా డాక్టర్ ద్వారా తెలిసింది. ఆ జంట పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడమే అందుకు కారణమని ఆమె చెప్పడంతో సుష్మ మరోసారి ఆలోచనలో పడింది. అరగంట ఆలోచించి ఆ జంటకు తానే పెళ్లిచే యిస్తానని చెప్పింది. ప్రసవం అయ్యి బెడ్‌మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న సుష్మ గదిలోకి ఆ జంట రాగా అక్కడ ఉన్న నర్సులు పాట పాడగా ఆ జంటకు పెళ్లి తంతుని ముగించింది సుష్మ. ఈ కార్యక్రమం మొత్తాన్ని వివేక్ ఐఫోన్లో వీడియో తీశారు. ఆ తరువాత ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా సుష్మ పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో ఉన్న పెళ్లిమంత్రాలను నేర్చుకుని పెళ్లిళ్లు చేయడం ప్రారంభించింది. బామ్మ దగ్గర నేర్చుకుని.. ప్రారంభంలో అంతా సుష్మను వ్యతిరేకించినప్పటికీ వాటన్నింటి దాటుకుని ముందుకు సాగుతూ అమెరికాలోనే తొలి మహిళా పురోహితురాలిగా నిలిచింది. ఇదే రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తరువాత హిందూ సంప్రదాయాల గురించి లోతుగా తెలిసిన బామ్మతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుంది. అంతేగాక బామ్మతో కలిసి... పూజలు, పెళ్లికి ఏయేమంత్రాలు చదువుతారు? వాటిని ఎలా ఉచ్చరించాలి? సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన క్రతువుల గురించి వివిధ గ్రంథాలను చదివి పెళ్లిమంత్రాలను ఆపోశన పట్టింది. అంతేగాక 88 ఏళ్ల బామ్మ ఇచ్చిన ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని అనేక పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటిదాకా దాదాపు యాభై పెళ్లిళ్లు చేసింది. అరగంట పెళ్లి.. ఎంతో చక్కగా పెళ్లిళ్లు చేస్తోన్నసుష్మా.. మరింతమందికి తన సేవలు అందించేందుకు 2016లో ‘పర్పుల్ పండిట్ ప్రాజెక్ట్’ పేరిట న్యూయార్క్‌లో సంస్థను ప్రారంభించింది. దీనిద్వారా పెళ్లితోపాటు అనేక మతపరమైన సేవలను అందిస్తోంది. దక్షిణాసియాలోని ‘గే’ కమ్యూనిటీ వాళ్లకు అరగంటలో పెళ్లి చేస్తుంది. సంప్రదాయ హిందూ పెళ్లిళ్లను మూడుగంటల్లో పూర్తి చేస్తోంది. అంతేగాక తన భర్త నిర్వహిస్తోన్న ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ ‘డెయిలీ హార్వెస్ట్’కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి ఒకపక్క సంసారాన్ని, మరోపక్క కంపెనీ బాధ్యతలనూ నిర్వర్తిస్తూనే పౌరోహిత్యం కూడా అంతే సజావుగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని కామెంట్లు వస్తున్నాయి. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుష్మ మరిన్ని పెళ్లిళ్లతో ముందుకు సాగాలని కోరుకుందాం. బాలింతగా ఆస్పత్రి బెడ్‌పైన ఉండి మరీ పెళ్లి జరిపిస్తున్న సుష్మ -
రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది
చెన్నై: ప్రస్తుతం సమాజంలో వివాహ వ్యవస్థకు విలువ లేకుండా పోతోంది. భారతదేశ కుటుంబ వ్యవస్థ గురించి ప్రపంచ దేశాలన్ని ప్రశంసిస్తుంటే దానికి విరుద్ధంగా ఇటీవల కాలంలో ఎక్కువగా జంటలు విడిపోయి కుటుంబ వ్యవస్థకు అర్థం లేకుండా చేయడం అత్యంత బాధాకరం. ఒక వేళ వాళ్లకు పిల్లలు లేకపోతే సరే కానీ ఉంటే వారి పరిస్థితి గురించి ఇక చెప్పవల్సిన అవసరం లేదు. కానీ చెన్నైలోని ఒక జంట విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకోవడం కోసం కన్న బిడ్డనే విక్రయించిన ఒక ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది. (చదవండి: హక్కుల భంగం.. ఇదా మీ తీరు?) వివరాల్లోకెళ్లితే చెన్నైలోని విరుధునగర్ జిల్లాకు చెందిన జెబమలార్(28) అనే ఆమెకు అదే జిల్లాకు చెందిన ఆర్ మణికందన్(38)తో 2019లో వివాహం జరిగింది. కొద్ది నెలలకు తమ వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో ఇద్దరు విడిపోయారు. పైగా వారికి తోమ్మిది నెలల బాబు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో జెబమలార్ తన బాబుని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు పునర్వివాహం చేయాలనకున్నారు, కానీ దీనికి ఆమె కొడుకు(9 నెలలు) అడ్డుగా ఉన్నాడని ఆ పసికందుని అమ్మేయాలని ఆమె, ఆమె తల్లిదండడ్రులు, సెల్వరాజ్, కురిబా, సోదరుడు ఆంటోని, మామా డానియెల్ భావించారు. దీంతో ఇద్దరూ బ్రోకర్లు కార్తికేయన్, జేసుదాసుని సంప్రదించారు. ఈ మేరకు ఆమె భర్త మణికందన్‌కి ఈ విషయాలు ఏమి తెలియదు. అయితే పిల్లలు లేని ఒక జంట సెల్వమణి, అతని భార్య శ్రీదేవి దంపతులకు ఆ బాబును రూ. 3 లక్షలకు అమ్మేశారు. ఈ మేరకు మణికందన్ తన బిడ్డ కోసం జెబమలార్ దగ్గరకు వెళ్తే బిడ్డ లేదు. దీంతో మణికందన్ అనుమానంతో పోలీసులను సంప్రదించాడు. ఈ క్రమంలో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఆ పిల్లడిని కొనుగోలు చేసిన దంపతులను, మీడియేటర్లను అరెస్ట్ చేశారు. మరోవైపు ఆ పసికందు తల్లి జెబమలార్ ఆమె సంబంధికులు పరారీలో ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని ఒక జంట తమ పెద్ద కూతురి(16) వైద్య చికిత్స నిమిత్తం తమ 12 ఏళ్ల చిన్న కూతురిని తమ పొరుగువారికి విక్రయించిన సంఘటన మరిచిపోకముందే ఈ ఘటన జరగడం బాధాకరం. (చదవండి: స్పైసీ మ్యాగీ మిర్చి గురూ) -
8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే!
చండీగఢ్: పెళ్లి కావాల్సిన యువకులు.. విడాకులతో ఒంటరిగా ఉన్నవారిని ఏరికోరి పట్టుకుంటుంది. వారిని పెళ్లి చేసుకుంటుంది. పట్టుమని పది రోజులు కూడా కాపురం చేయదు. ఏదో ఒక కారణంతో విడాకులు తీసుకుంటుంది. ఆ విడాకులకు భారీ ఎత్తున భరణం చెల్లించుకుని ఉడాయిస్తున్న ఓ ఘరానా మహిళ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇలా ఏకంగా 8 మందిని భర్తలుగా చేసుకుని మోసం చేసింది. ఇది ఇలా ఉండగా ఆ 8 మంది భర్తలకు మరో టెన్షన్ వచ్చి పడింది. ఆ మహిళకు ఎయిడ్స్ సోకింది. దీంతో తమకు కూడా సోకిందేమో ఆందోళనలో ఆ భర్తలు ఉన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హరియాణా రాష్ట్రం కైతల్ జిల్లాకు చెందిన మహిళ 2010లో ఓ వ్యక్తిని వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. అయితే నాలుగేళ్ల తర్వాత ఏమైందో ఏమో కానీ ఆమె భర్త అదృశ్యమయ్యాడు. భర్త వదిలేయడంతో ఇక ఏ దిక్కు లేక బతకడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మోసాలకు పాల్పడడం ప్రారంభించింది. హరియాణతోపాటు పక్కనే ఉన్న పంజాబ్‌లోనూ మోసాలు చేయడం మొదలుపెట్టింది. ఆమె లక్ష్యం భార్యలను కోల్పోయిన వారిని, బ్రహ్మచారులే. చదవండి: సినిమాను మించిన మర్డర్.. మూడు హత్యలతో వరంగల్ ఉలిక్కి తన తల్లితో కలిసి మాటల్లో దింపి అవివాహితులను.. భార్యలను వదిలేసిన వారిని పెళ్లి చేసుకోవడం అలవాటుగా చేసుకుంది. ఏ గుడిలోనూ.. లేదా మరోచోటను నిరాడంబరంగా పెళ్లి చేసుకుని వారితో కాపురం మొదలుపెడుతుంది. పెళ్లయిన పది రోజులకు ఆమె తన డ్రామా మొదలుపెడుతుంది. ఏదో ఒక వంకతో భర్తతో గొడవ పెట్టుకుంది. అనంతరం విడాకులు కోరుతుంది. కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తుంది. ఈ భయంతో ఆమెను చేసుకున్న వారు ఎంతో కొంత భరణంగా ముట్టజెప్పి వదిలించుకుంటారు. ఈ విధంగా రూ.లక్షల్లో దండుకుని ఆమె మకాం మారుస్తుంది. ఇలా ఏకంగా 8 మందిని ఆమె వివాహం చేసుకుంది. ఈమెపై గతంలో కొందరు ఫిర్యాదు చేశారు. 9వ పెళ్లి చేసుకోబోతుండగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఆ పెళ్లిని నిలిపివేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా హెచ్ఐవీ ఎయిడ్స్ సోకిందని నిర్ధారణ అయ్యింది. ఆమె ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన 8 మంది భర్తలు ఈ విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. తమకు ఎక్కడ సోకిందేమోనని ఆ మాజీ భర్తలు ఆందోళన చెందుతున్నారు. వారికి కూడా పోలీసులు పరీక్షలు చేయించనున్నారు. -
శ్రావణ మాసం: ఒకే రోజు 300 పెళ్లిళ్లు
అన్నవరం: శ్రావణ మాసం వచ్చింది. శతమానం భవతి అంటూ పెళ్లి ముహూర్తాలను మోసుకొచ్చింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూడు ముడుల బంధంతో.. ఏడడుగులు వేసి 300 జంటలు ఒక్కటయ్యాయి. దీంతో ఆలయ ప్రాంగణం వధూవరులు వారి బంధుమిత్రులతో కోలాహలంగా మారింది. గతేడాది కరోనా విజృంభణ తరువాత ఇంత భారీగా వివాహాలు జరగడం ఇదే తొలిసారి. దేవస్థానంలోని సత్యగిరిపై ఇటీవల ప్రారంభించిన శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపంలోని 12 వివాహ వేదికల్లో శుక్రవారం రాత్రి 10 గంటల ముహూర్తంలో తొలిసారి వివాహాలు జరగడంతో అక్కడ ప్రత్యేక సందడి నెలకొంది. వివాహాలు చేసుకున్న వారికి కల్యాణ మండపంతో పాటు అవసరమైన సామగ్రిని దాత మట్టే శ్రీనివాస్ ఉచితంగా సమకూర్చి నూతన వస్త్రాలను బహూకరించారు. -
వెరైటీ ఆచారం: వధువు వరుడుగా.. వరుడు వధువుగా..
ఆ వంశస్తుల ఇంట పెళ్లంటే సందడే కాదు.. తరతరాలుగా వస్తున్న విచిత్ర సంపద్రాయాల మేళవింపు.. అందుకే నల్లజర్ల మండలం పోతవరంలో గన్నమని వారింట పెళ్లంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. పెళ్లి కుమారుడు పట్టుచీర కట్టుకుని, నడుముకు వడ్డాణం, చేతికి అరవంకి పెట్టుకుంటే చుట్టూ చేరిన అమ్మలక్కలు అతనిని చూసి మురిసిపోతారు. ఇక ఆ ఇంట అమ్మాయి పెళ్లికూతురైతే టిప్‌టాప్‌గా ప్యాంటు, షర్టు వేసుకుని చలువ కళ్లద్దాలు పెట్టుకుని ఠీవిగా పోజులిస్తుంది. పెళ్లికి ఒకరోజు ముందు జరిగే ఈ తంతు కనువిందుగా సాగిపోతుంది. అమ్మవారి మొక్కు తీర్చుకునే క్రమంలో చేపట్టే ఈ వేషధారణను ఆ వంశస్తులు కాపాడుకుంటూ వస్తున్నారు. జిల్లాలో గన్నమని ఇంటి పేరున్న అమ్మాయి పెళ్లి జరిగితే అబ్బాయిగా అలంకరిస్తారు. ఆ ఇంటి పేరున్న అబ్బాయికి పెళ్లయితే అమ్మాయిగా ముస్తాబు చేస్తారు. పెళ్లికి ఒకరోజు ముందు ఇలా అలంకరించి కులదేవతకి బోనం సమర్పిస్తారు. నల్లజర్ల: పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తాళాలు, తలంబ్రాలే కాదు.. వింత ఆచారాల కలయిక. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఒక విలక్షణ ఆచారం కొనసాగింపుగా వస్తుంది. జిల్లాలోని గన్నమని ఇంటి పేరున్న వారు కాకతీయుల కాలం నుంచి విభిన్న ఆచారం పాటిస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని నేటి తరం కూడా ఆచరిస్తూ కనువిందు చేస్తోంది. గన్నమని వారింట వివాహం జరిగితే ఆ ఇంటి పేరున్న అమ్మాయిని అబ్బాయిగా అలంకరిస్తారు. అలాగే గన్నమని ఇంటిపేరున్న అబ్బాయికి పెళ్లి జరిగితే పెళ్ళికి ముందు రోజు అమ్మాయిగా ప్రత్యేక దుస్తుల్లో అలంకరిస్తారు. కులదేవత ఆలయానికి లేదా గ్రామ దేవత ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి మొక్కులు తీర్చుతారు. ఈ ఆచారాన్ని బోనంగా పిలుస్తారు. పెళ్ళికుమార్తెకు ప్యాంటు, షర్టు కట్టి వరుడి వేషం వేయిస్తారు. అబ్బాయికైతే పట్టుచీర, జాకెట్ కట్టి ఆభరణాలు అలంకరించి తెలుగింటి పెళ్లికూతురిగా ముస్తాబు చేస్తారు. అలా ముస్తాబు చేసిన వధువు లేదా వరుడ్ని బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామమంతా ఊరేగిస్తారు. గ్రామ దేవత ఆలయానికి తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు చేయిస్తారు. గొర్రెను బలిచ్చి అన్నంతో కుంభం సమర్పిస్తారు. ముడుపులు, మొక్కుబడి చెల్లించుకుంటారు. పోతవరంలో వరుడి వేషంలో పెళ్లికుమార్తె(ఫైల్)- పెళ్ళికుమార్తె వేషధారణలో ప్రభుప్రసాద్(ఫైల్) కాకతీయుల కాలం నుంచీ ఆచారంగా.. ఈ ఆచారం కాకతీయుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. రుద్రమదేవి వద్ద గన్నమని వంశస్తుల మూల పురుషుడు సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన హయాంలో సైన్యంలో ఉన్న మగవారు యుద్ధంలో ఎక్కువగా చనిపోవడంతో మహిళలు మగవారి వేషధారణలో సైన్యంలో విధులు నిర్వర్తించేవారు. ఈ విషయం బయటకు తెలియకుండా కాపాడమని కులదేవతను వేడుకునేవారు. పెళ్లి సమయంలో ఆడవారికి మగ వేషం, మగవారికి ఆడవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని ప్రార్థించేవారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. సంప్రదాయాన్ని కాపాడుకుంటున్న యువత ఈ విచిత్ర ఆచారాన్ని గన్నమని ఇంట నేటి యువత ఎంతో ఆసక్తి అనుసరిస్తున్నారు. తమ వంశాచారం పాటించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతున్నారు. వారి వంశంలో ఎవరి ఇంట పెళ్ళైనా ఇదే ఆచా రాన్ని పాటిస్తామంటున్నారు. మా ఆచారాన్ని మర్చిపోం ఎన్ని చదువులు చదివి ఏ దేశానికి వెళ్లి ఉద్యోగం చేస్తున్నా మా సంస్కృతీ సంప్రదాయాన్ని మరిచిపోం. అందుకే పెద్దలు చెప్పినట్లుగా విని పెళ్లిలో మా వంశాచారం పాటిస్తున్నాం. – భాను ప్రసాద్, అనంతపల్లి సంప్రదాయాన్ని గౌరవించాలి భారతీయ సంప్రదాయాలపై పాశ్చాత్య దేశాల్లోనూ చాలా గౌరవం ఉంది. మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి. పెళ్లిలో వేషధారణ గురించి పెద్దవాళ్ళు చెప్పారు. మేం కూడా ఆ ఆచారాన్ని అలా కొనసాగిస్తున్నాం. – డాక్టర్ మానస, పోతవరం అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఆచారం కొనసాగడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. గన్నమని ఇంటి ఆడపడుచు రోజూ పుట్టెడు బియ్యం తినేది. పురుషుడి వలే ప్రవర్తించేది. ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అపుడు గ్రామ దేవతకు మొక్కి తమ కుమార్తెకు వివాహం జరిగితే మగవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని తల్లిదండ్రులు వేడుకున్నారు. ఆమెకు పెళ్లి ముందురోజు పెళ్లికొడుకు వేషం వేసి ఆలయానికి ఊరేగింపుగా గుడికి వెళ్ళి మొక్కులు చెల్లించిన ట్లు పూర్వీకులు చెబుతారు. అప్పటి నుంచి అదే ఒరవడి కొనసాగుతుంది. – గన్నమని రాము, పోతవరం సంతానం నిలవడం కోసం.. గన్నమని వంశంలో పుట్టిన మగపిల్లలు అందరూ చనిపోయే వారు. పుట్టిన సంతానం నిలవడం కోసం గ్రామ దేవతకు మొక్కుకోవడంతో వారి కోరిక ఫలించింది. అప్పటి నుంచి మగపిల్లలకు ఆడవేషం, ఆడపిల్లలకు మగవేషం వేసి గ్రామదేవత గుడికి ఊరేగింపుగా వెళ్ళి మొక్కులు చెల్లిస్తున్నాం. ఆ సమయంలో పొట్టేలు బలి ఇస్తారు. – రామ దుర్గాప్రసాద్, అనంతపల్లి -
Aamir Khan Divorce: తెరపై కూతురు.... నిజజీవితంలో భార్య!
శుభాకాంక్షలు ఆమిర్... ఫాతిమా... ఈ బంధం అయినా సుదీర్ఘంగా సాగాలి! తెరపై కూతురు.... నిజజీవితంలో భార్య!! మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటారు కానీ.. ఏ మాత్రం పర్ఫెక్ట్ కాదు!! ‘సత్యమేవ జయతే’కి హోస్ట్ చేశాడు... కానీ ఫాతిమా కోసం కిరణ్‌ని వదిలేశాడు!! ఫస్ట్ రీనా.. సెకండ్ కిరణ్... ఫాతిమా నం. 3 !! ...గడచిన రెండు రోజులుగా సోషల్ మీడియా నిండా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలే. ‘మా పదిహేనేళ్ల వివాహ బంధాన్ని ముగిస్తున్నాం.. విడిపోతున్నాం’ అని ఆమిర్ ఖాన్, కిరణ్ రావు గత శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. చాలామంది ఊహల్లో ఉన్న పేరు ‘ఫాతిమా సనా షేక్’. కిరణ్, ఆమిర్; ఫాతిమా, ఆమిర్ ‘దంగల్’ (2016)లో ఆమిర్‌కి కూతురిగా నటించింది ఫాతిమా. ఆ తర్వాత ఆమిర్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ (2018) లోనూ నటించింది. ఈ సినిమాలు పూర్తయ్యాక కూడా ఆమిర్, ఫాతిమా టచ్‌లోనే ఉంటున్నారని బాలీవుడ్ కథనం. అవార్డు వేడుకలకు, పెద్దింటి ఫంక్షన్లకు ఇద్దరూ జోడీగా వెళ్లారనే వార్తలు కూడా ఉన్నాయి. ఆమిర్ ఇంటికి ఫాతిమా రాకపోకలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా ‘కుఛ్ కుఛ్ హో రహా హై?’ (ఏదో ఏదో జరుగుతోంది) అనే వార్తలు మొదలయ్యాయి. అప్పట్లో ఆ వార్తలను ఫాతిమా ఖండించింది కూడా. ‘‘ఇలాంటివి ఎదుర్కోవడం నాకస్సలు అలవాటు లేదు. నేను ఎప్పుడూ కలవని అపరిచితులు నా గురించి ఏదేదో రాస్తున్నారు. నిజమేంటో వాళ్లకు తెలియదు. అయితే ఆవి చదివినవాళ్లు మాత్రం నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా రాయాలంటే, నన్నే అడిగితే చెబుతాను కదా. నిజాలు తెలియకుండా ఏవేవో ఊహించుకోవడం బాధగా ఉంది. కానీ ఇప్పుడు ఈ వార్తలను విస్మరించడం నేర్చుకుంటున్నాను’’ అని ఫాతిమా పేర్కొన్నారు. అప్పుడు అలా స్పందించిన ఫాతిమా సనా ఇప్పుడు సోషల్ మీడియాలో ‘ఆమిర్‌కి రీల్ లైఫ్‌లో కూతురు... రియల్ లైఫ్‌లో భార్య’ అనే విమర్శలు వినిపిస్తున్నా మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. ‘మౌనంగా ఉందంటే అవుననే కదా’ అని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. భావప్రకటన స్వేచ్ఛ అయితే ఆమిర్–ఫాతిమా మధ్య ఏం ఉందో తెలియకుండా దారుణంగా విమర్శించడం సరి కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ విమర్శిస్తున్నవారిలో కొందరు మాత్రం ‘భావప్రకటన స్వేచ్ఛ’ను తెరపైకి తెచ్చారు. దానికి ఆమిర్–కిరణ్‌లను కారణంగా చెబుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఓ కార్యక్రమంలో ఆమిర్ మాట్లాడుతూ – ‘‘దేశంలో జరుగుతున్న అల్లర్లు సహించలేనివిగా ఉన్నాయి. అభద్రతా భావం నెలకొని ఉన్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం పిల్లలకు క్షేమం కాదు.దేశం వదిలి వెళ్లిపోదామా అని నా భార్య కిరణ్ భయం వ్యక్తం చేసింది’’ అనడం చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆమిర్–కిరణ్ విడాకుల వ్యవహారం నేపథ్యంలో.. దేశం పట్ల ఆమిర్‌కి ఏమాత్రం గౌరవం లేదని, అప్పుడు భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడాడని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘‘మాకు కూడా భావప్రకటన స్వేచ్ఛ ఉంది. మేం కూడా మా అభిప్రాయాలను చెబుతున్నాం. ఈ విషయంలో నువ్వు.. కిరణ్.. నీ ప్రియురాలు (ఫాతిమా) మమ్మల్ని ఏమీ చేయలేరు’’ అని ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ ఆమిర్‌కి తెలియనిది కాదు. కానీ మౌనం వహించారు. మరి.. విమర్శలకు గురవుతున్న ఆమిర్–ఫాతిమా నోరు విప్పితేనే చాలామంది నోళ్లు మూతబడే అవకాశం ఉంది. ఆ సంగతలా ఉంచి.. 56 ఏళ్ల ఆమిర్, 29 ఏళ్ల ఫాతిమా మధ్య నిజంగానే ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే వీరిది మూడు ముడుల బంధం గా మారుతుందా? అనేది కాలమే చెప్పాలి. విఫలమైన వివాహబంధాలు హిందీ పరిశ్రమలో విఫలమైన వివాహ బంధాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు... ► బాలీవుడ్ ప్రముఖ నటుడు ఓంపురి 1991లో సీమా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఎనిమిది నెలలకే వీరు విడాకులు తీసుకుని వేరయ్యారు. ఆ నెక్ట్స్ ‘అన్లైక్లీ హీరో: ద స్టోరీ ఆఫ్ ఓంపురి’ అంటూ తన బయోగ్రఫీ రాసిన జర్నలిస్టు నందితా పురిని 1993లో వివాహం చేసుకున్నారు ఓంపురి. అయితే పెళ్లి చేసుకున్న పదేళ్లకు ఓంపురి, నందిత విడాకులు తీసుకున్నారు. ► నటి పూజా భట్, మనీష్ మఖీజా 2003లో పెళ్లి చేసుకున్నారు. 11 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. ఓంపురి, నందిత; సైఫ్, అమృత ► అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 1998లో పెళ్లి చేసుకున్నారు. 2017 మే నెలలో విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం హీరో అర్జున్ కపూర్‌తో మలైకా ప్రేమలో ఉన్నారని టాక్. వీరిద్దరు త్వరలో వివాహం చేసుకోనున్నారట. ► కరిష్మా కపూర్, అజయ్ దేవగణ్ లవర్స్ అని గతంలో బాలీవుడ్ కోడై కూసింది. తర్వాత ఇద్దరి మనసుల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్‌తో 2002లో నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి జరగలేదు. 2003లో వ్యాపారవేత్త సంజయ్‌ని పెళ్లాడారు కరిష్మా. 2014లో ఇద్దరూ విడిపోవాలనుకున్నారు. 2016కి విడాకులు మంజూరయ్యాయి. ► నటుడు సైఫ్ అలీఖాన్ 1993లో నటి అమృతా సింగ్‌ను పెళ్లాడారు. 2004లో ఇద్దరూ విడిపోయారు. 2012లో హీరోయిన్ కరీనా కపూర్‌తో సైఫ్ ఏడడుగులు వేశారు. ఇంకా హిందీ పరిశ్రమలో ఏడడుగులు వేసి, ఆ తర్వాత విడిపోయిన వారిలో నటుడు యాక్టర్, డైరెక్టర్ ఫర్హాన్– హెయిర్ స్టైలిస్ట్ అధునా భబానీ, రణ్వీర్ షోరే–కొంకణా సేన్ శర్మ, అనురాగ్ కశ్యప్– కల్కీ కొచ్లిన్ తదితరులు ఉన్నారు. మలైకా, అర్బాజ్; హృతిక్, సుజానె; కరిష్మా, సంజయ్ హృతిక్ రోషన్‌కి 26 ఏళ్లకే పెళ్లయింది. 2000లో సుజానే ఖాన్ని పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2013లో విడివిడిగా ఉండటం ఆరంభించిన హృతిక్–సుజానేలకు 2014లో విడాకులు మంజూరయ్యాయి. పిల్లలిద్దరూ తల్లి, తండ్రి దగ్గర ఉంటుంటారు. భార్యాభర్తలుగా తాము విడిపోయినా పిల్లల బర్త్‌డేలు కలిసి చేస్తూ, కలిసి హాలిడే ట్రిప్‌లకు వెళుతూ తల్లితండ్రులుగా పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. -
పడవలో మూడు ముళ్లు, ఏడు అడుగులు
వెబ్‌డెస్క్ : వివాహ వ్యవస్థకు అత్యంత గౌరవం ఇచ్చే సమాజం మనది. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతీ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి వేడుకలు నిర్వహించడంపై ఎంతో దృష్టి పెడతారు. కేపీఎంజీ సంస్థ 2017లో రూపొందించిన నివేదిక ప్రకారం ఇండియాలో పెళ్లి వేడుకలపై ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పింది. పెళ్లిని ఘనంగా నిర్వహించడంలో అమెరికరా తర్వాత స్థానం ఇండియన్లదే. న్యూ బిజినెస్ అయితే కరోనా తర్వాత పెళ్లి వేడుకల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ రూల్స్, సోషల్ డిస్టెన్సింగ్‌తో స్వంతూరిలో ఘనంగా పెళ్లి నిర్వహించడం కష్టంగా మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఇంచుమించ ఇవే తిప్పలు ఎదురువుతున్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా క్రూయిజ్ వెడ్డింగ్‌కి డిమాండ్ పెరిగింది. రెండేళ్ల క్రితం అక్కడక్కడ మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. రాబోయే కార్తీక మాసంలో పెళ్లిళ్లలకు సంబంధించి ఇప్పటికే వెయిటింగ్ లిస్టు ఉందంటున్నారు క్రూయిజ్ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహకులు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. చదవండి : Tesla: భారత్‌లో రయ్..రయ్ : వైరల్ వీడియో -
వైరల్ వీడియో: 28మంది భార్యలముందు 37వ సారి పెళ్లి
-
28 మంది భార్యల ముందు 37వ సారి పెళ్లి
పూర్వం రాజులు పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకునే వారని విన్నాం.. పుస్తకాల్లో చదువుకున్నాం. రాజులు, రాజ్యాలు పోయినా పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు నేటికీ అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉన్నారు. సాటి మగాళ్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం దుబాయ్‌కి చెందిన ఓ పెద్దాయన తన 28 మంది భార్యల సమక్షంలో ఘనంగా 37వ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమంలో అతడి 135 మంది పిల్లలు, 126 మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన 45 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘జీవించి ఉన్న అత్యంత ధైర్య వంతుడు.. 28 మంది భార్యలు, 135 మంది పిల్లలు, 126 మంది మనవళ్లు, మనవరాళ్ల సమక్షంలో 37వ పెళ్లి’’ అనే శీర్షికను ఆయన జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ఒక్క భార్యతోనే వేగలేక చస్తుంటే నువ్వేంటి పెద్దాయన’’.. ‘‘నేనిప్పటి వరకు ఒక్క పెళ్లి చేసుకోవటానికే భయపడి చస్తున్నాను.. నువ్వు మాత్రం 37 పెళ్లిళ్లు చేసుకున్నావు’’... ‘‘ఇది చూస్తే సింగిల్స్ చచ్చిపోతారు’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
Corona Tragedy: ఫొటో, వీడియోగ్రాఫర్ల బతుకులు ఆగం
కరోనాతో అందరి బతుకులు ఆగమవుతున్నాయి. ఉపాధి కోల్పోయి పూటగడవని పరిస్థితుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఫొటోగ్రాఫర్ల జీవితాల్లో కరోనా వైరస్ చీకట్లు నింపింది. పెళ్లిళ్ల సీజన్లో వీడియోగ్రాఫర్లు ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకుని మిగతా సమయాల్లో ఎలాగోలా కాలం వెల్లదీస్తారు. అలాంటిది కరోనా అడ్డంకులు, ఆంక్షలతో పెళ్లిళ్లు, శుభకార్యాలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో పెళ్లిళ్ల గిరాకీ రాకపోవడం, మామూలు ఫొటోలు ఎవరూ దిగకపోవడం, లాక్‌డౌన్‌తో షాపులు తెరుచుకోకపోవడంతో అటు ఉపాధి కరువై ఇటు షాపుల అద్దె చెల్లించలేక, పూటగడవక అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యానగర్(కరీంనగర్): కరోనా ప్రభావం అన్ని వర్గాలవారిపై ప్రభావం చూపిస్తోంది. ఫొటోగ్రాఫర్ వృత్తిపై సైతం ఎక్కువగానే ఉంది. స్టూడియోలు ఏర్పాటు చేసుకున్న వారికంటే పెద్ద కెమెరాలు కొనుగోలు చేసి పెళ్లిళ్ల సీజన్లో పని చేసే ఫొటోగ్రాఫర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రభావానికి గతంలో వలె ఆర్భాటంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగడం లేదు. దీంతో ఫొటోగ్రాఫర్లకు పని తగ్గిపోయింది. ప్రస్తుతం పెద్ద ఫంక్షన్ల ఊసే లేకుండా పోయింది. తగ్గిన డిమాండ్.. అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు సైతం మమ అన్నట్లుగా చేస్తుండటం, పెళ్లిళ్లకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో పెళ్లివారు ఫొటోలు, వీడియోలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో గతంలో కంటే ఒక్కో పెళ్లి ఆర్డర్లో 50 శాతం రేట్లు తగ్గించినా గిరాకీలు రావడం లేదని వాపోతున్నారు. సీజన్ ఫొటోగ్రఫీ చేసేవారు కొందరు కిస్తీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫొటో స్టూడియో ఉన్నవారి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఇటు ఆర్డర్లు లేక, అటు కిరాయిలు కట్టలేక అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి పెళ్లిళ్ల సీజన్లో లాక్డౌన్ ఆంక్షలతో వేడుకలు సాదాసీదాగా జరుపుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ సెషన్స్ లేదు. ఇరుపక్షాల నుంచి ఒక్కరితోనే ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇదివరకు ఒక పెళ్లికి దాదాపు ఐదారుగురికి పని దొరికేది. ఇప్పుడు అన్ని ఒక్కడై ఫొటోలు, వీడియోలు తీసుకుంటుండడంతో మిగతావారికి పని లేకుండా పో యింది. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి. – ఆవుల నరేశ్, తారిక ఫొటో స్టూడియో, కరీంనగర్ ఫోన్లతో తీసుకుంటున్నారు కరోనా మహమ్మారితో ఎక్కువ మందిని పెళ్లిళ్లు, శుభాకార్యాలకు పిలవడం లేదు. 20, 30 మంది సమక్షంలో పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. కొంత మంది సెల్ఫోన్లలోనే ఫొటోలు తీసుకుంటున్నారు. రిసెప్షన్ వంటివి లేకుండా పోయాయి. అన్ని ఒక్కరోజు, ఒక్క దగ్గరే జరిపిస్తున్నారు. కొత్త టెక్నాలజీతో పని లేకుండా పోయిందని వీడియో, ఫొటోగ్రాఫర్లు బాధపడుతుంటే మరోపక్క కరోనా మా బతుకులను వీధిన పడేసింది. – నకిరేకొమ్ముల శ్రీనాథ్, వీడియోగ్రాఫర్, కరీంనగర్ బతుకులు రోడ్డునపడ్డాయి.. కరోనాతో గతేడాదిగా ఉపాధి కరువైంది. ఈ పెళ్లిళ్ల సీజన్‌పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఈ సీజన్లో కొన్ని పెళ్లిళ్లకు అడ్వాన్స్ తీసుకున్నాం. కరోనా సెకండ్‌వేవ్‌తో పెళ్లి ఊరేగింపులు లేవు, హంగామా లేదు. అంతా సాదాసీదాగా చేస్తున్నారు. దీంతో ఎవరికీ పని లేకకుండా పోయింది. మామూలు రోజుల్లో ఒక్క పెళ్లి ద్వారా 100 మందికి ఉపాధి దొరికేది. క్యాటరింగ్, డెకరేషన్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఇలా.. ప్రస్తుతం అందరి బతుకులు రోడ్డునపడ్డాయి. – గోగుల ప్రసాద్, ఈవెంట్ ఆర్గనైజర్, గోగుల ఈవెంట్స్ కరీంనగర్ పోషణ కష్టమవుతోంది కరోనాతో గిరాకీ లేక కుటుంబ పోషణ కష్టమవుతుంది. పెళ్లిళ్లు జరుగుతున్నా ఒక్కరికే అవకాశం ఇస్తున్నారు. తక్కువ మందితో కార్యాన్ని కానిస్తున్నారు. కరోనాకు ముందు ఒక పెళ్లికి దాదాపు ఫొటో, వీడియోకు లక్ష రూపాయల వరకు బడ్జెట్ కేటాయించే వారు. ఇప్పుడు కేవలం పెళ్లి ఫొటోలతోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో అందరికీ ఉపాధి లభించడం లేదు. – బద్దరి వంశీ, వీడియోగ్రాఫర్, కరీంనగర్ చదవండి: Telangana: లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు -
నా వివాహం.. సారీ కొద్దిమందికే ఆహ్వానం
సిరిసిల్ల కల్చరల్: జీవితంలో ఒకేసారి జరిగే వేడుక పెళ్లి. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరినీ అతిథులుగా ఆహ్వానించి జరుపుకునే సంబురం. అలాంటి అపురూప కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలనుకున్న తల్లిదండ్రుల ఆశలపై కరోనా నీళ్లు చల్లుతోంది. ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న వధూవరుల కల తీరడం లేదు. కేవలం కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. వైరస్ ప్రభావంతో శుభలేఖల రూపురేఖలతోపాటు పెళ్లి తంతులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో పెళ్లంటే అదొక వైభవం. ఈ వేడుకను సామాజిక హోదాకు చిహ్నంగా భావించేవారు. కానీ కరోనా కారణంగా రెండేళ్లుగా ఫంక్షన్‌హాళ్లకు బదులుగా ఇంటి ముందే ముత్యాల పందిరి వేస్తున్నారు. భారీ సంఖ్యలో బంధువులకు బదులు 30, 40 మందితో కానిచ్చేస్తున్నారు. పోలీసులైతే ఏకంగా 20 మందికే పరిమితం చేసుకోవాలని నిబంధన విధించారు. నిశ్చితార్థం రోజు వధూవరులు పరస్పరం ఇచ్చుపుచ్చుకునే కానుకల్లో మాస్క్‌లు, శానిటైజర్లు చేరిపోయాయి. పెళ్లికి రాలేమండి.. కోవిడ్ కారణంగా పెళ్లికి ఇంటికొక్కరిని కూడా ఆహ్వానించే పరిస్థితి లేదు. ఒకవేళ ఆహ్వానించేందుకు వెళ్లినా బంధువులు సరే అంటున్నారు కానీ కరోనాను తల్చుకొని జంకుతున్నారు. కొందరైతే శుభలేఖలు ఇచ్చే సమయంలోనే మేం రాలేమండీ.. రోజులు బాగుంటే చూద్దాం లెండి.. ఏమీ అనుకోవద్దు.. రాకపోయినా వచి్చనట్టే భావించండి.. అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. శుభలేఖల్లో మాస్కు ధరించి హాజరు కావాలని కొందరు ముద్రిస్తుండగా, మరికొందరు ఇంటి వద్దే ఉండి ఆశీస్సులు అందించాలని కోరుతున్నారు. ఈ నెల తొలివారం నుంచి ముహూర్తాలు.. మే తొలివారం నుంచే ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి వందల సంఖ్యలో వివాహాలు నిశ్చయమయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. పెళ్లికి గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. దీంతో ఫంక్షన్‌హాళ్లు బుక్ చేసుకోవాలనుకున్నవారు వెనక్కి తగ్గారు. ఇదివరకే బుక్ చేసుకున్నవారు అడ్వాన్స్‌లు వాపస్ ఇవ్వాలని ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులపై ఒత్తిడి చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో కుటుంబసభ్యులు, స్వల్ప సంఖ్యలో బంధువుల సమక్షంలో ఇంటిముందే పెళ్లి జరిపిస్తున్నారు. -
లాక్డౌన్ లగ్గం; అరే ప్రనీత్.. ఎవర్రా ఆ అమ్మాయి..!
సాక్షి, నిర్మల్: ‘అరే ప్రనీత్.. ఎవర్రా ఆ అమ్మాయి. పొద్దున బండిపైన ఎక్కించుకుని తీసుకెళ్తున్నవ్. కొత్త బట్టలున్నయ్. చేతులకు దారాలు కట్టుకున్నవ్. ఏందిరా సంగతి..!’ అసలు విషయం తెలియక వరుసకు మామ అడిగిన ప్రశ్నకు ఆ అల్లుడు తల దించుకున్నాడు. ‘ఏం లేదు మామా.. మొన్న నా పెళ్లయిందే. గీ కరోనా చేసుట్ల, లాక్డౌన్ పెట్టుట్ల ఎవళ్లకు చెప్పలేదే. మనకాడికెళ్లి పెద్దనాన్న, చిననాన్నలు, మేనమామలు, అత్తలు, పిల్లలు అంత కలిపి 25మందిమే పోయినం. మా అత్తగారింటి ముందటనే పెండ్లి చేసిండ్రు. పిల్లకాడికెళ్లి కూడా 30మందే ఉన్నరు. ఏమనుకోకు మామ. లాక్డౌన్ చేసుట్ల మస్తుమందికి చెప్పలేదే. కరోనా తగ్గినంక పెద్ద దావత్ ఇస్తనే..’ అని చెప్పాడు. దీంతో దగ్గరి బంధువైన తనకే చెప్పకుండా పెళ్లి జరగడంపై ఆ మామ అవాక్కయ్యాడు. ఈ మధ్య.. ఇలా.. చాలా పెళ్లిళ్లే జరుగుతున్నాయి. బంధుమిత్రుల మాట దేవుడెరుగు.. కనీసం పక్కింటోళ్లకు కూడా తెలియకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి పెళ్లిళ్లు చిన్నపాటి గొడవలకు, అలకలకూ దారితీస్తున్నాయి. పెళ్లి గురించి వాళ్లకు చెప్పి.. తమకు చెప్పరా.. అంటూ దగ్గరి బంధువులు గొడవ పడుతున్నారు. అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సందడి మధ్య జరగాల్సిన వివాహాలు చడీచప్పుడు లేకుండానే ముగిసిపోతున్నాయి. ‘ఇదేం కరోనారా నాయన.. మా పెళ్లిని ఇట్ల చేసింది..’ అంటూ చాలామంది వధూవరులు వాపోతున్నారు. ఎన్నో ఆశలతో.. ఎంతో వైభవంగా జరుగుతుందనుకున్న మూడుముళ్ల వేడుక కాస్త గుట్టుగా సాగడంతో నిట్టూరుస్తున్నారు. కరోనా కారణంగా.. జిల్లాకేంద్రంలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన కుమారుడి పెళ్లి కోసం అన్ని సిద్ధం చేసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు కల్యాణం అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు.. పెళ్లితో పాటు రిసెప్షన్ పార్టీ కూడా తామే ఇవ్వాలని, ఆ ప్రకారం ఫంక్షన్‌హాల్, గార్డెన్ రెండింటినీ మూణ్ణెళ్ల ముందే బుక్ చేశారు. పెళ్లి పత్రికలనూ హైదరాబాద్ నుంచి తెప్పించి ముద్రించారు. వధూవరులతో పాటు ఇంటిల్లిపాదికీ హైదరాబాద్‌లో షాపింగ్ చేశారు. విందులు, వంటకాల కోసం వంట సామగ్రి కూడా ముందే తెచ్చేసుకున్నారు. ఇక మరో పదిరోజుల్లో పెళ్లి ఉందనగా.. కరోనా తీవ్రత పెరుగుతూ పోయింది. తమ దగ్గరి బంధువులే కోవిడ్ బారిన పడ్డారు. చేసేది లేక.. వివాహాన్ని ఒక నెల వాయిదా వేసుకున్నారు. నెల గడిచిపోయింది. కానీ.. కరోనా తగ్గలేదు కదా.. పైనుంచి లాక్డౌన్ పడింది. దీంతో ఏంచేయాలో పాలుపోలేదు. మళ్లీ వాయిదా వేద్దామంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనన్న అనుమానం. దీంతో ఫంక్షన్‌హాల్, గార్డెన్, వంటలు, డెకరేషన్, బ్యాండ్, డీజే.. ఇలా అన్నీ క్యాన్సిల్ చేశారు. ఇంటి ముందే రోడ్డుపై చిన్న టెంటు వేసి దగ్గరి బంధుమిత్రులు అంతా కలిపి ఓ 50మందితో పెళ్లితంతు ముగించేశారు. ఇలా జిల్లాలో చాలా కల్యాణాలు ఇప్పుడు ఇలాగే మమ.. అన్నట్లుగా సాగుతున్నాయి. నిట్టూరుస్తూనే.. పెళ్లంటే.. జీవితంలో ఓ పెద్దఘట్టం. ప్రతీ మనిషి త న జీవిత భాగస్వామిని పొందే తరుణం. ఇలాంటి వేడుకను అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సాక్షిగా చేసుకోవాలనుకుంటారు. తల్లిదండ్రులూ తమ పిల్లల పెళ్లిళ్లను తమ స్థాయికి తగ్గట్లు చేయాలని ఆశి స్తారు. ఇక కొత్త జంట ఎన్నో ఆశలతో, కలలతో పెళ్లి కి సిద్ధమవుతుంది. కానీ.. కరోనా వీటన్నింటికి దెబ్బ కొట్టింది. అసలు ‘ఇప్పుడు పెళ్లి అవసరమా..’ అనే వరకూ తెచ్చింది. ‘సరే.. ఎలాగోలా చేసేద్దాం’ అనేలా తయారైంది. మెహందీ, సంగీత్, హల్దీ, పందిరి.. ఇలా ఎన్నో కార్యక్రమాలతో నాలుగైదు రోజుల పా టు సాగాల్సిన సంబురాలన్నీ రద్దయిపోయాయి. నే రుగా మూడుముళ్ల కార్యక్రమమే కానిచ్చేస్తున్నారు. ఎంతో ఆశలు పెట్టుకున్న తమ పెళ్లి ఇలా ముగిసిపోవడంతో చాలా జంటలు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ఆన్లైన్లోనే.. ‘అరె.. సునీల్‌గాడు పెళ్లి చేసుకున్నడురా.. ఇగో ఇటు చూడు స్టేటస్ పెట్టిండు..’ అని మిత్రులు కూడా అ వాక్కయ్యే పరిస్థితి. పెళ్లిపత్రికలను పంచడం కూడా చేయడం లేదు. ఆచారం ప్రకారం ఐదారు పత్రికలను ముద్రిస్తున్నారు. వాటినే ఫొటోలు తీసి, సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారు. ప్రస్తుత కరోనా, లాక్డౌన్ పరిస్థితుల్లో తమ ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నామని, ఇందుకు మన్నించి వివాహ వేడుకకు హాజరు కావాలంటూ.. ఏదో మాటవరుసకు చెప్పిన ట్లు మెసేజ్ పెట్టేస్తున్నారు. ఇక కొంతమంది వివాహా వేడుకను ఆన్లైన్ ద్వారా తమ బంధుమిత్రులకు చూపుతున్నారు. పెళ్లి ఫోటోలు, వీడియోలను సోష ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఆయా మాధ్యమాల్లోనే తమను ఆశీర్వదించండంటూ కొత్తజంటలు ఫొటోలు పెట్టడమూ కనిపిస్తోంది. పొట్ట కొడుతోంది... పెళ్లంటే.. రెండిళ్ల సంబురమే కాదు. ఎన్నో కుటుంబాలకూ ఉపాధినిచ్చే కార్యక్రమం. గత ఏడాది నుంచి శుభకార్యాల ద్వారా వచ్చే ఉపాధిపై కరోనా దెబ్బకొడుతోంది. ఫంక్షన్‌హాళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. ఫొటోగ్రాఫర్ల దాకా ఎంతోమంది పొట్టకొట్టింది. పెళ్లిళ్లలో, ఫంక్షన్‌హాల్‌లలో చిన్నపాటి పనులు చేసి పొట్టపోసుకునే నిరుపేదలనూ పస్తులు ఉంచుతోంది. పెళ్లిళ్లు చేసేవారికి ఖర్చులు తగ్గిస్తున్నా.. వేడుకలనే నమ్ముకున్నవారికి చేతులు ఆడకుండా చేస్తోంది. కరోనా మహమ్మారి కేవలం పెళ్లింట్లో కల్యాణ వైభవాన్నే కాదు.. ఆ వేడుకపై ఆధారపడ్డ ఫంక్షన్‌హాళ్లు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండు, డీజే, లైటింగ్, డెకరేషన్, వంటవాళ్లు, వేడుకలు పనిచేసే కూలీలు.. ఇలా ఎన్నో కుటుంబాల్లో కళ తప్పేలా చేస్తోంది. చదవండి: మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే కరోనా: పెళ్లిళ్లు చేసుకోవచ్చు.. కానీ! -
కరోనా: పెళ్లిళ్లు చేసుకోవచ్చు.. కానీ!
సాక్షి, శ్రీకాకుళం: కోవిడ్ నిబంధనల ప్రకారం వేడుకలు, వివాహాలు చేసుకోవాలంటే కేవలం 20 మందితో మాత్రమే జరుపుకోవాలని, అంతకంటే ఎక్కువ మంది ఉండడానికి వీల్లేదని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు, వైద్య అధికారులతో బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వేడుకలు జరిగే స్థలాలను తహసీల్దార్ తనిఖీ చేస్తారని తెలిపారు. కరోనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, హొటల్స్, రెస్టారెంట్లు తెరవాలని, 12 గంటల తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ఎక్కడా నలుగురు కంటే ఎక్కువ మంది ఉండకూదని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు మరికొన్ని రంగాలకు మినహాయింపులు ఉన్నాయని తెలిపారు. వ్యవసా య పనులు, పంటల సేకరణకు కూడా మినహాయింపు ఉందన్నారు. జనం ఈ కర్ఫ్యూకు సహకరిస్తే కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవ కాశం ఉందన్నారు. రెండు వారాల తర్వాత జిల్లాలో ఒక్క కేసు కూడా ఉండకుండా అధికారులు కృషి చేయాలని కోరారు. ఇష్టానుసారంగా తిరిగేవారిని అరెస్టు చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ డాక్టర్ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు ఉన్నారు. అత్యవసరమైతే.. ప్రభుత్వ అనుమతి సర్వీసులు, అత్యవసర సేవలకు కర్ఫ్యూ సమయంలో మినహాయింపు కోసం పోలీసు హెల్ప్ లైన్ నంబర్ 94944 66406ను వినియోగించుకోవాలని ఎస్పీ అమిత్ బర్దార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ డీఎస్పీ సీహెచ్జీవీ ప్రసాదరావును నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. అనంతపురం: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో బుధవారం నుంచి 18వ తేదీ వరకు కర్ఫ్యూ అమలు చేస్తునట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. వివాహ వేడుకలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని, వేడుకకు హాజరయ్యే వారి పేర్లను తహసీల్దారకు సమర్పించాలన్నారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాలను తహసీల్దార్లు తనిఖీ చేసి నిబంధనలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తారన్నారు. ఇక ఉదయం 6 నుంచి 12 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ అవుతుందన్నారు. అంతర్ రాష్ట్ర, జిల్లా లోపల, వెలుపల వాహనాలు తిరగరాదన్నారు. అత్యవసర వైద్యసేవలు లేదా ఇతరాత్ర అత్యవసరాలకు మినహాయింపు ఉంటుందన్నారు. రైలు రవాణా వ్యవస్థ ద్వారా వచ్చే ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్ వద్ద అటోలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయన్నారు. చదవండి: స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మాగుంట కరోనాను జయించిన 92 ఏళ్ల బామ్మ -
కరోనా ఎఫెక్ట్ : లైవ్‌లో పెళ్లి.. ఆన్లైన్లో దీవెనలు
సాక్షి, మద్దూరు(హుస్నాబాద్): కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బంధువులు, స్నేహితులందరి మధ్య వైభవోపేతంగా జరగాల్సిన పెళ్లిళ్లు ఇప్పుడు లైవ్ షోల ద్వారా జరుగుతుండటంతో బంధువులు కూడా ఆన్ లైన్ లోనే దీవెనలు అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బెక్కల్ గ్రామానికి చెందిన చౌదరి వెంకటమ్మ–కనకయ్య దంపతుల కూతురు ఆమనికి సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన జీలా నిర్మల – మల్లేశం దంపతుల కుమారుడు జీలా అనిల్ (మై విలేజ్ ఫేం)తో వివాహం నిర్ణయించారు. మండల పరిధిలోని బెక్కల్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం కేవలం 30 మంది అతిథుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. ఈ వివాహాన్ని ఆన్ లైన్ లో ద్వారా లైవ్ ఇవ్వగా... బంధుమిత్రులు ఆన్ లైన్ ద్వారానే కొత్తజంటను ఆశీర్వదించారు. కోవిడ్ నిబంధనల మేరకు మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ వివాహానికి హాజరయ్యారు. చదవండి: వైరల్‌గా మారిన 'మై విలేజ్ షో' అనిల్ లగ్నపత్రిక