ఇంతవరకు ఎన్నోరకాల వింత వింత సంఘటనలు గురించి విన్నాం. ఏగ్రామంలోనైనా కనీసం ఏడాదికి ఎంతకాదన్న సుమారుగా మూడు నుంచి పది వరకు పెళ్లి సంబరాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఆయా గ్రామాల్లో పెళ్లిళ్లే జరగడం లేదు. పైగా అక్కడి కోడళ్లు సైతం తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి కాపురానికి రానని తెగేసి చెబుతున్నారు. అసలు ఏంటి ఇది? ఎందుకిలా? అని ఆశ్యర్యపోకండి. అసలు విషయం వింటే ఆ! అని నోరెళ్లబెడతారు.
వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లో హర్దోయ్‌లోని పది గ్రామాల్లో పెళ్లిళ్లు జరగడం లేదు. అక్కడ ఉన్న తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధంగా లేరట. కేవలం ఈగలు కారణంగా అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదంట. ఆయా గ్రామాల్లో చాలా బీభత్సంగా అక్కడ ఈగలు పెరిగిపోయాయట. వాటి ధాటికి ఆయా గ్రామాల్లో నివశిస్తున్న వారిని ఎవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. పైగా ఆ గ్రామాల్లోని కోడళ్లు సైతం కాపురానికి రామంటూ తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారట. అంతేగాదు ఈ ఊర్నీ వదిలేసి రావాలి లేదా మమ్మల్ని వదిలేయండి అని ఆ ఊరి కోడళ్లే తమ భర్తలతో తెగేసి చెబుతున్నారు.
ఆయా గ్రామాల్లోని అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇప్పడూ పెళ్లి ఒక సమస్యగా మారింది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఈగలను వదిలించుకోవాలని గ్రామం వెలుపల కూర్చొని నిరసనలు చేస్తున్నారు కూడా. ఈ నిరసనలో మహిళలు పొయ్యిలతో సహ పాల్గొంటున్నారు. వాస్తవానికి ఆయా గ్రామాల్లో 2014 ముందు వరకు అంతా బాగానే ఉంది. అక్కడ ఒక పౌల్ట్రీ ఫారం ప్రారంభమైంది. అది ప్రారంభించిన కొద్దిరోజులకే ఈగల బెడద పెరిగిపోయింది.
అది ఇప్పుడూ ఎంతలా ఉందంటే...గతంలో కంటే ఈగలు వందల రెట్లు ఉన్నాయి. ఈ మేరకు పౌల్ట్రీ ఫారమ్‌కు సమీపంలో ఉన్న కార్పెంటర్‌పూర్వా గ్రామం తోపాటు కుయాన్, పట్టి, దహి, సలేంపూర్, ఫతేపూర్, ఝల్‌పూర్వా, నయాగావ్, డియోరియా, ఎక్‌ఘరాలకు ఈగల భయం వ్యాపించింది. పాపం ఇక్కడి గ్రామస్తులు మాదిరిగానే పాలక వర్గం సైతం ఈ ఈగల విషయంలో నిస్సహాయంగా ఉంది.
(చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు)
Comments
Please login to add a commentAdd a comment