Poultry Farm
-
తక్కువ కాలంలో లాభాలు తెచ్చిపెట్టే పౌల్ట్రీ ఫామ్
-
‘గుడ్లు’తేలేస్తుండ్రు... బెంబేలెత్తిస్తున్న కోడిగుడ్ల ధర
దౌల్తాబాద్: మధ్య తరగతి ప్రజల పౌష్టికాహారమైన కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు నిత్యావసర ధరలు మండిపోతుండగా మరో వైపు చికెన్, మటన్, చేపల ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు సామాన్యులకు అందుబాటులో ఉండే గుడ్డు ధర కూడా అమాంతంగా పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టికాహారం.. ఆరోగ్యంగా ఉండాలంటే బలవర్ధకమైన పౌష్టికాహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. సామాన్యులు ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేస్తారు. ఇమ్యూనిటినీ పెంచుకోవడం కోసం ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం విశేషం. మండలంలో కోడిగుడ్లు ఉత్పత్తి అంతంత మాత్రంగా నే ఉండడంతో ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఐదేళ్ల నుంచి పౌల్ట్రిఫాం రైతులు నష్టాలు చవిచూడడం.. కోడిపల్లల పెంపకాన్ని తగ్గించడంతో గుడ్ల ధరల పెరుగుతున్నాయని పలువురు పేర్కొంటునారు. గత ఏప్రిల్‌లో గడ్డు ధర రూ.4నుంచి రూ.4.50వరకు ఉండగా ప్రస్తుతం రిటైల్‌గా రూ.6.50 వరకు ఉంది. ఓల్‌సేల్ వ్యాపారులు మార్కెట్ ధర ప్రకారం గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ రిటైల్ వ్యాపారులు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. -
ఈగనా మజాకా! ఏకంగా పది గ్రామాల్లో పెళ్లిళ్లు ఆగిపోయాయి..
ఇంతవరకు ఎన్నోరకాల వింత వింత సంఘటనలు గురించి విన్నాం. ఏగ్రామంలోనైనా కనీసం ఏడాదికి ఎంతకాదన్న సుమారుగా మూడు నుంచి పది వరకు పెళ్లి సంబరాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఆయా గ్రామాల్లో పెళ్లిళ్లే జరగడం లేదు. పైగా అక్కడి కోడళ్లు సైతం తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి కాపురానికి రానని తెగేసి చెబుతున్నారు. అసలు ఏంటి ఇది? ఎందుకిలా? అని ఆశ్యర్యపోకండి. అసలు విషయం వింటే ఆ! అని నోరెళ్లబెడతారు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లో హర్దోయ్‌లోని పది గ్రామాల్లో పెళ్లిళ్లు జరగడం లేదు. అక్కడ ఉన్న తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధంగా లేరట. కేవలం ఈగలు కారణంగా అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదంట. ఆయా గ్రామాల్లో చాలా బీభత్సంగా అక్కడ ఈగలు పెరిగిపోయాయట. వాటి ధాటికి ఆయా గ్రామాల్లో నివశిస్తున్న వారిని ఎవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. పైగా ఆ గ్రామాల్లోని కోడళ్లు సైతం కాపురానికి రామంటూ తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారట. అంతేగాదు ఈ ఊర్నీ వదిలేసి రావాలి లేదా మమ్మల్ని వదిలేయండి అని ఆ ఊరి కోడళ్లే తమ భర్తలతో తెగేసి చెబుతున్నారు. ఆయా గ్రామాల్లోని అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇప్పడూ పెళ్లి ఒక సమస్యగా మారింది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఈగలను వదిలించుకోవాలని గ్రామం వెలుపల కూర్చొని నిరసనలు చేస్తున్నారు కూడా. ఈ నిరసనలో మహిళలు పొయ్యిలతో సహ పాల్గొంటున్నారు. వాస్తవానికి ఆయా గ్రామాల్లో 2014 ముందు వరకు అంతా బాగానే ఉంది. అక్కడ ఒక పౌల్ట్రీ ఫారం ప్రారంభమైంది. అది ప్రారంభించిన కొద్దిరోజులకే ఈగల బెడద పెరిగిపోయింది. అది ఇప్పుడూ ఎంతలా ఉందంటే...గతంలో కంటే ఈగలు వందల రెట్లు ఉన్నాయి. ఈ మేరకు పౌల్ట్రీ ఫారమ్‌కు సమీపంలో ఉన్న కార్పెంటర్పూర్వా గ్రామం తోపాటు కుయాన్, పట్టి, దహి, సలేంపూర్, ఫతేపూర్, ఝల్పూర్వా, నయాగావ్, డియోరియా, ఎక్ఘరాలకు ఈగల భయం వ్యాపించింది. పాపం ఇక్కడి గ్రామస్తులు మాదిరిగానే పాలక వర్గం సైతం ఈ ఈగల విషయంలో నిస్సహాయంగా ఉంది. (చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు) -
ఈ కోడి కొవ్వు తక్కువ.. రుచి ఎక్కువ
తల నుంచి కాలి గోటి వరకు కారుమబ్బును తలపించే నిఖార్సయిన నలుపు రంగు కోడి. మటన్‌కు పోటాపోటీగా గిరాకీ. నాటుకోడిని తలదన్నే రుచి. సాధారణ బాయిలర్ కోళ్లతో పోల్చితే పోషకాలలో మేటి. తెగుళ్లు దరిచేరని రోగనిరోధక శక్తి దీని సొంతం. తక్కువ ఖర్చుతో రైతుకు ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతున్న ఈ నల్ల కోడి పేరు ‘కడక్‌నాథ్’. సాక్షి, అమరావతి: నాటుకోడి మాంసానికి ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే. అయితే నాటుకోడిని తలదన్నేలా కడక్‌నాథ్ అనే ఈ ప్రత్యేక జాతి నాటు కోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ధారా, జాబియా, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ వంటి గిరిజన ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. రంగు, రుచితో పాటు ఈ కోళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ‘మెలనిన్’ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం వలనే ఈ కోడి నలుపు రంగును సంతరించుకుందని చెబుతారు. దీని మాంసం కూడా నల్లగానే ఉంటుంది. మార్కెట్లో కడక్‌నాథ్ కోడి మాంసం ధర కిలో అక్షరాల రూ.800లు పైమాటే. మాంసమే కాదు.. ఈ కోడి గుడ్డు కూడా కాస్ట్లీనే. ఒక్కొక్క గుడ్డు రూ.20 పైనే పలుకుతోంది. ఎన్నో ‘లాభాలు’ సాధారణ బాయిలర్ కోళ్లతో పోలిస్తే కడక్‌నాథ్ కోడి మాంసంలో ప్రొటీన్స్/ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. కొలెస్ట్రాల్ మాత్రం చాలా తక్కువ. మాంసంలోనే కాదు ఈ కోడి గుడ్డులో కూడా అత్యధిక శాతం ప్రొటీన్లు, లినోలెయిక్ యాసిడ్లు ఉన్నాయి. ఈ కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన తెగుళ్లు పెద్దగా వీటి దరి చేరవు. ఏ వాతావరణంలోనైనా ఇవి పెరుగుతాయి. ఆకుకూరలు, కూరగాయలు, రాగులు, సజ్జలు ఇలా ఏవైనా తిని జీర్ణించుకోగలుగుతాయి. ఇలా.. పోషకాలు అందిస్తూ వినియోగదారునికి, లాభాలు తెచ్చిపెడుతూ పౌల్ట్రీ రైతులకు కడక్‌నాథ్ కోళ్లు ప్రయోజనకరంగా ఉన్నాయి. రూ.2 కోట్లతో ప్రాజెక్టు మంచి రుచితో పాటు అత్యధికంగా పోషకాలను అందించే ఈ కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని మన రాష్ట్రంలో ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వైఎస్సార్ జిల్లా ఊటుకూరు వద్ద మూతపడిన కోళ్ల ఫారంను పునరుద్ధరించి కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పౌల్ట్రీ ఫారం నిర్వహణ కోసం కోసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వీఏఎస్, పారావెట్ పోస్టులను కూడా మంజూరు చేశారు. ఈ పౌల్ట్రీఫారం ద్వారా వేల సంఖ్యలో కడక్‌నాథ్ కోడి పిల్లలను ఉత్పత్తి చేసి నిరుపేదలకు పంపిణీ చేయడం ద్వారా వాటి పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు వ్యయమవుతుందని పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది. నెలకు 10 నుంచి 18 గుడ్లు సాధారణ కోళ్ల మాదిరిగానే కడక్‌నాథ్ కోడి రెండు నుంచి ఐదేళ్ల వరకు బతుకుతుంది. ఐదు నెలల వయసు నుంచి నెలకు 10 నుంచి 18 చొప్పున మూడేళ్ల వరకు గుడ్లు పెడుతుంది. పుంజు రెండు నుంచి రెండున్నర కేజీలు, పెట్ట ఒకటిన్నర కేజీ నుంచి రెండు కేజీల వరకు బరువు పెరుగుతుంది. ప్రస్తుతం లైవ్ కోడి ధర కిలో రూ.650లు ఉంటే, మాంసం రూ.800 పైగా పలుకుతోంది. ఇంట్లో తినేందుకు వాడే ఈ కోడి గుడ్డు ధర రూ.20కి పైగా పలుకుతుంటే.. పిల్లలు పొదిగే గుడ్డు ధర రూ.40 పైమాటే. తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం కడక్‌నాథ్ కోళ్ల పెంపకం ఎంతో లాభదాయకం. 2017లో 500 కోడి పిల్లలతో పౌల్ట్రీ ఫారం ప్రారంభించా. నేడు 1,500 కోళ్లతో నడుపుతున్నా. నిర్వహణ వ్యయం పెద్దగా ఉండదు. రైతు బజార్ల నుంచి తెచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, మూడు పూటలా నీళ్లు పెడతానంతే. వీటికి వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగాల బెడద ఉండదు. 4–5 నెలల తర్వాత కోడి.. మాంసానికి సిద్ధమవుతుంది. మా ఫారం నుంచి ఈ కోళ్లనే కాకుండా కోడి మాంసాన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నా. కోడి పిల్లలను అయితే ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నా. రూ.లక్షతో మొదలైన వ్యాపారం నేడు రూ.20 లక్షలకు చేరింది. – ఇంటి ప్రదీప్, ప్రదీప్ ఫామ్స్ యజమాని, నున్న, కృష్ణా జిల్లా. -
బర్డ్ ఫ్లూ కలకలం: 1,500 కోళ్లు మృతి
సాక్షి, డిచ్పల్లి (నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని దుర్గాభవాని పౌల్ట్రీ ఫామ్‌లో 24 గంటల్లోపే 1,500 కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. పౌల్ట్రీ ఫామ్ యజమాని తెలిపిన ప్రకారం.. రెండు షెడ్లలో సుమారు 8,000 కోళ్లు పెంచుతున్నారు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా సుమారు వేయి కోళ్లు మృతి చెందాయి. బుధవారం ఉదయాన్నే గమనించిన ఫామ్ సిబ్బంది యజమానికి విషయం తెలిపారు. చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. మధ్యాహ్నం వరకు షెడ్లలో మరో 500 పైగా కోళ్లు కూర్చున్న చోటే కూలబడి చనిపోయాయి. చదవండి: బర్డ్ ఫ్లూ: చికెన్ అమ్మకాలపై నిషేధం మండల పశువైద్యాధికారి డాక్టర్ గోపికృష్ణకు తెలుపడంతో ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ భరత్, ఏడీ (ల్యాబ్) కిరణ్ దేశ్‌పాండే సాయంత్రం పౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించారు. ఫామ్ యజమానితో మాట్లాడా రు. చివరి వ్యాక్సినేషన్ ఎప్పుడు చేశారు, దాణా ఎవరూ సరఫరా చేస్తారు లాం టి వివరాలు తెలుసుకున్నారు. బతికి ఉన్న కోళ్ల రక్త నమూనాలను, చనిపోయిన కోడిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. కాగా, ఒక్కరోజే సుమారు 1,500 కోళ్లు మృతి చెందడంతో యానంపల్లి తండవాసులతో పాటు మండలవాసులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు కేసులు నమోదు కాలేదు ఇక్కడ చనిపోయిన కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవు. ఆర్మూర్, వర్నిలోని పౌల్ట్రీ ఫామ్‌లు సందర్శించాం. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. పరీక్ష ఫలితాలు రాగానే కోళ్లు ఎలా చనిపోయాయనేది తెలుస్తుంది. జిల్లాలోని పౌల్ట్రీ ఫామ్ యజమానులు జాగ్రత్తలు పాటించాలి. –డాక్టర్ భరత్ -
సాఫ్ట్వేర్ ఇంజినీర్.. 'ఫాం'లోకి వచ్చాడు
చికెన్ తిందామంటే భయం.. మటన్ రుచి చూద్దామంటే సంకోచం చేపలు ట్రై చేద్దామంటే అనుమానం టైగర్ రొయ్యలు.. పీతలు సరేసరి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ ఉన్నవారు ఆలోచిస్తున్నారు.. అన్ని రకాల పెంపుడు జంతువులను స్టెరాయిడ్స్.. పలు రకాల రసాయనాలతో పెంచుతున్నారు... అందుకే ఇప్పడు అందరి చూపు ఆర్గానిక్ ఉత్పత్తలపై పడింది.. చివరకు నాటు కోళ్లు.. మేకలకే జై కొడుతున్నారు ఇలాంటి జీవులను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెంచి వాటి మాంసాన్నీ విక్రయిస్తున్నాడు.. సాక్షి, వేటపాలెం: ప్రతి ఒక్కరికీ వృత్తితో పాటు ప్రవృత్తీ ఉంటుంది. అలాగే వేటపాలెంకు చెందిన షేక్ గఫార్ బాషా ఉన్నత చదువులు చదివి.. పదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇతనికి జన్మభూమిపై మమకారం పోలేదు.. పైగా వ్యవయసాయం అంటే మక్కువ. అందుకే తన సంపాదనతో పొలం కొన్నాడు. అయితే ఆయన ప్లాన్ మారింది.. సాగు కాకుండా దానికి అనుబంధ పరిశ్రమలైన నాటుకోళ్లు, కౌజు పిట్టలు, మేకపోతుల కోసం పౌల్ట్రీ స్థాపించి సొంతూరిలోనే పలువురికి ఉపాధి కల్పిస్తూ లాభాలు అందుకుంటున్నాడు. మాంసాహారం అంతా విషమయం అవుతు న్న నేపథ్యంలో సహజంగా జీవులను పెంచుతూ ఆర్గానిక్ మాంసాన్ని అమ్ముతున్న అతన్ని అంతా అభినందిస్తున్నారు. చదవండి: (కోడిపిల్లలు ఫ్రీ.. పరుగులు తీసిన జనం) మేకపోతులు బాషా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంకామ్, ఎంబీఏ పూర్తి చేశాడు. కష్టపడి ఓ ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. కఠారివారిపాలెం గ్రామ శివారులో కొంత భూమి కోనుగోలు చేశాడు. అయితే ముందుగా తనకిష్టమైన వ్యవసాయం చేయాలనుకున్నాడు. దీనిపై పెద్దల సలహాలు తీసుకుని.. నేటి పరిస్థితుల మధ్య వ్యవసాయ చేయడం అంత మంచిది కాదని నిర్ధారించుకున్నాడు. అందుకే ముందుగా నాటు కోళ్ల పెంపకంపై దృష్టి సారించాడు. బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని సొంత భూమిలో రేకుల షెడ్లు నిర్మించాడు. నాటు కోళ్ల ఫాంను బాషా ఏర్పాటు చేసి మూడేళ్లయింది. అయితే నాటు కోళ్ల పెంపకంతో సరైన ఆదాయం రాకపోవడంతో వెంటనే కౌజు పిట్టలు, పొట్టేళ్లను కూడా పెంచడం ప్రారంభించాడు. ఇలా లాభాలు పట్టి తోటి యువకులకు ఆదర్శగా నిలబడ్డాడు. చదవండి: (ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు..) ఫాంలో ఉన్న కౌజు పిట్టలు అధునిక పద్ధతుల్లో మార్కెటింగ్ కేవలం జీవాలను అమ్మడమే కాకుండా.. తన ఫాం నుంచి నాటుకోళ్ల మాంసం, నాటు కోడి గుడ్లు, కౌజు పిట్టల మాంసం, పోటేళ్ల మాంసం విక్రయిస్తున్నాడు. సోషల్ మీడియాను బాగా వినియోగించుకుంటున్నాడు. యూట్యూబ్, వాట్సాప్ గ్రూపులు ద్వారా లోకల్ మార్కెట్ల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించుకుంటున్నాడు. నాటు కోడి (లైవ్) కేజీ రూ.250, నాటు కోడి గుడ్డు ఒకటి రూ.10, కౌజు పిట్ట ఒకటి రూ.50, మేకపోతు మాంసం కిలో రూ.550 చొప్పున విక్రయిస్తున్నాడు. చిన్నతనం కోరిక నెరవేర్చుకొన్నా నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలనే కోరిక ఉంది. అయితే చదువుకున్న తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ప్రతి వారం ఇక్కడకు వచ్చి ఫాం పరిస్థితులు చూసుకొనేవాడిని.. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఇంటి నుంచే ఉద్యోగం చేసే అవకాశం రావడంతో ఫాం పనులు బాగా చూసుకుంటున్నా. మూడేళ్లుగా ఈ పరిశ్రమ నిర్వహిస్తున్నప్పటికీ పశుసంర్థక శాఖ అధికారులు ఎటువంటి సహకారం అందిచడం లేదు. కోళ్లకు ఏవైనా తెగుళ్లు వస్తే గూగుల్లోనే వెతికి మందులు వాడుతున్నాం. కొంతమంది మెడికల్ షాపుల వారి సలహాలు కూడా తీసుకుంటున్నా. – షేక్ బాషా -
కోడిపిల్లలు ఫ్రీ.. పరుగులు తీసిన జనం
సాక్షి, కర్ణాటక : కోళ్లఫారం యజమానులు, కోళ్ల కంపెనీల మధ్య గొడవల్లో కోడిపిల్లలు అడవుల పాలయ్యాయి. చిక్క తాలూకా పరిధిలోని రంగస్థళ, కణితహళ్లి అటవీ ప్రాంతాలలో ఫారం కోడిపిల్లలను వేలాదిగా వదిలి వెళ్లగా పట్టుకోవడానికి ప్రజలు పరుగులు తీశారు. వివరాలు.. చిక్క పరిసరాల్లోని కోళ్ల ఫారాలకు బడా కంపెనీలు కోడి పిల్లలను అందజేస్తాయి. అవి పెద్దయ్యాక వచ్చి తీసుకెళ్తారు. ఇందుకుగాను ఫారం యజమానులకు కోడికి ఇంత అని డబ్బు చెల్లిస్తాయి. అయితే ఇటీవల కంపెనీ సిబ్బంది లేనిపోని కిరికిరి చేయడం షురూ చేశారు. సరైన తూకం లేవని పెద్దసంఖ్యలో కోళ్లను, కోడిగుడ్లను తీసుకోకుండా మొండికేస్తున్నారు. దీంతో పెంపకందారులు కంపెనీల మాట వినేది లేదంటూ వారు ఇచ్చిన పిల్లలను శుక్ర, శనివారాల్లో సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. ఇది తెలిసిన ప్రజలు బ్యాగులు, పెట్టెలు తీసుకెళ్లి కోడిపిల్లలను పట్టుకెళ్లారు. -
పౌల్ట్రీ పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్
-
రూ.30కే చికెన్.. రోడ్లన్నీ బ్లాక్
లక్నో : కోవిడ్–19 (కరోనా వైరస్) దేశ వ్యాప్తంగా పౌల్ట్రీ రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. గత పక్షం రోజులుగా ఈ ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ భారీ నష్టాన్ని చవిచూసింది. కోవిడ్–19 వైరస్ చికెన్, గుడ్ల ద్వారా వ్యాప్తి చెందుతుందన్న అబద్ధపు ప్రచారం నేపథ్యంలో దేశంలో చికెన్, గుడ్ల వినియోగం దాదాపు 40 శాతం మేర పడిపోయినట్లు పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి పుంజుకునేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పౌల్ట్రీ ఫామ్ అసోషియేషన్ సభ్యులు వినూత్న ప్రయోగం చేశారు. చికెన్, ఫిష్ కారణంగా కరోనా వైరస్ సోకదని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గోరఖ్‌పూర్‌లో ఆదివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం రూ. 30 రూపాయాలకే అపరిమిత చికెన్‌తో మీల్స్‌ను అందుబాటులో ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున చికెన్ ప్రియులు అక్కడికి చేరుకుని.. లాగించారు. (సీఎంతో సహా మేమంతా తింటున్నాం) దీనిపై పౌల్ట్రీ నిర్వహకులు మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ చాలా దెబ్బతిన్నంది. చికెన్, గుడ్లు, మటన్, ఫిష్ తినడం మూలంగా వైరస్ సోకుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చికెన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించాం. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ ఫెస్ట్ పెట్టాం. కొద్దిసేపటికే భారీగా జనం క్యూ కట్టారు. దాదాపు మూడు గంటల పాటూ.. వచ్చే రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. వెయ్యి కిలోలకు పైగా చికెన్ వండగా.. కొద్ది గంటల్లోనే మొత్తం ఖాళీ అయింద’ని చెప్పారు. కోవిడ్–19కు చికెన్‌కు సంబంధం లేదు... కోవిడ్–19 వైరస్‌కు చికెన్, గుడ్లతో ఎలాంటి సంబంధం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చైనాలో విభిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, సగం ఉడికిన (హాఫ్ బాయిల్డ్) ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం తదితర కారణాలతో కోవిడ్ వైరస్ ఆ దేశంలో విజృంభిస్తోందన్నారు. మన దేశంలో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకుపైగా చేరుకోవడం, ఆహార పదార్థాలను సుమారు 100 సెంటిగ్రేడ్ వరకు ఉడికించి తింటుండటంతో ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. కొందరు అదే పనిగా సోషల్ మీడియాలో చికెన్, గుడ్లతో ఈ వైరస్ సోకుతోందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇది ముమ్మాటికి తప్పుడు ప్రచారమేనని.. చికెన్, గుడ్ల వినియోగంతో వైరస్ వ్యాప్తి చెందదని సర్క్యులర్‌ను జారీ చేశాయని పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. -
బొబ్బిలి వాడి.. పందెం కోడి
ఆ కోళ్లు బొబ్బిలి పౌరుషానికి ప్రతిరూపం. బరిలో దిగితే గెలుపు ఖాయం. అందుకే వాటికి మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంది. పందెం రాయుళ్ల నుంచి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. సాలూరు మండలం నెలిపర్తి ఎన్ఆర్ఆర్ అగ్రికల్చర్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో పెంచుతున్న పందెం కోళ్లు పౌరుషానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. – సాలూరు రూరల్ నెలిపర్తి ఎన్ఆర్ఆర్ అగ్రికల్చర్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో పెంచుతున్న పందెం కోళ్ల పెంపకంలో యాజమాన్యం తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇచ్చే శిక్షణ ప్రత్యేకం. ప్రొటీన్లు సమకూరే ప్రత్యేక ఆహారాన్ని తయారు చేసి కోళ్లకు అందిస్తారు. కాలానికి అనుగుణంగా సమశీతోష్ణస్థితిని ఏర్పాటు చేస్తారు. పందాలకు అవసరమైన ప్రత్యేక శిక్షణను ఇస్తూ బోలెడన్ని మెలకువలు కూడా నేర్పిస్తారు. ప్రత్యేక గూళ్లలో పరుగు నేర్పిస్తారు. నాటు పడవుల్లో ఈత నేర్పుతారు. దీంతో అవి మరింత శక్తివంతంగా, ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. కోళ్లుకు ఈత నేర్పే నాడు పడవ ఎన్నో రంగులు.. జాతులు సాలూరు, బొబ్బిలి, మక్కువ, మెంటాడ పరిసర ప్రాంతాలతో పాటు ఒడిశా సరిహద్దు గ్రామాల్లోని రకరకాల రంగులు, జాతుల కోళ్లను కొనుగోలు చేసి వాటికి ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని అందిస్తున్నారు. ఎన్నోరకాల రంగులు, జాతుల కోళ్లకు ఇక్కడ శిక్షణ ఇచ్చి పందేనికి సిద్ధం చేస్తున్నారు. డేగ, కాకి పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ. రసంగి, అబ్రాసు, నెమలి బరుల జాతుల కోళ్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. కోళ్లకు రన్నింగ్ నేర్పే గూడు ఇతర జిల్లాల నుంచి డిమాండ్ కోళ్లను మార్కెట్లో అమ్మేటప్పుడు బొబ్బిలి పులితో పోల్చుతారు. జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఎక్కువగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందెం పోటీల కోసం అధిక సంఖ్యలో వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. ఒక్కొక్క కోడిని రూ.10 నుంచి రూ.15 వేల వరకు విక్రయిస్తుంటారు. శిక్షణ పొందిన కోళ్లు మార్కెట్లో మంచి గిరాకీ ఈ ప్రాంతంలో దొరికే కోళ్లనే కొని వాటికి బలమైన ఆహారం పెట్టి పందేనికి అనుగుణంగా తయారు చేస్తున్నాం. బొబ్బిలి పందెం కోళ్లుగా మార్కెట్లో విక్రయించడం వల్ల మంచి గిరాకీ ఉంది. పొరుగు జిల్లాల నుంచి అధికంగా వచ్చి కొనుగోలు చేసుకుంటారు. ప్రస్తుతం 5 వందల వరకు కోళ్ల పుంజులున్నాయి. – ఎన్.రామారావు, కోళ్ల పెంపకందారు, నెలిపర్తి -
సేంద్రియ గుడ్లు!
‘ఆహారం సరైనదైతే ఏ ఔషధమూ అవసరం లేదు.. ఆహారం సరైనది కాకపోతే ఏ ఔషధమూ పనిచేయదు’... ఈ సూత్రాన్ని మనుషులకే కాదు ఫారం కోళ్లక్కూడా విజయవంతంగా వర్తింపజే యవచ్చని రుజువు చేస్తున్నారు ఓ మహిళా రైతు. గత రెండేళ్లుగా రసాయనిక ఔషధాలు, వాక్సిన్లు మచ్చుకి కూడా వాడకుండా 15 వేల లేయర్ కోళ్లను ఆరోగ్యదాయకంగా పెంచుతున్నారు జయప్రదారెడ్డి. చిరుధాన్యాలతో తయారు చేసుకునే దాణాలో 15% మేరకు కూరగాయలు, ఆకులు అలములు కలిపి కోళ్లకు మేపుతున్నారు. ఇందుకోసం రెండున్నర ఎకరాల్లో ఔషధ మొక్కలు, చెట్లు, పందిరి కూరగాయలు పెంచుతున్నారు. అత్యంత నాణ్యమైన ‘సేంద్రియ గుడ్ల’ను ఉత్పత్తి చేస్తూ గణనీయమైన లాభాలు గడిస్తున్నారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన ఆ మహిళా రైతు జయప్రదా రెడ్డి అభినందనీయురాలు. సాధారణ పౌల్ట్రీ రైతుగా జీవనం ప్రారంభించి సొంత ఆలోచనతో సేంద్రియ రైతుగా ఎదిగారు. ఏదైనా రంగంలో కృషి చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన జయప్రదారెడ్డి(53)ని సేంద్రియ కోళ్ల రైతుగా మార్చింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రాణిపేట ఆమె స్వగ్రామం. నిజాం సర్కారులో కొత్వాల్‌గా పని చేసిన రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి వంశంలోని కుటుంబానికి కోడలిగా వచ్చిన జయప్రదారెడ్డి పెళ్లి తర్వాత హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో ఉండి డిగ్రీ పూర్తి చేశారు. భర్త జనార్దన్‌రెడ్డి గతంలో జైళ్లవిభాగంలో హైదరాబాద్‌లో పనిచేసి డీఎస్పీగా రిటైరయ్యారు. ఆ తర్వాత రాణిపేటకు మకాం మారింది. ఆ దశలో ఏడేళ్ల క్రితం భర్త ప్రోత్సాహంతో జయప్రదారెడ్డి రాణిపేటలోని తమ ఇంటి దగ్గర్లోని సొంత భూమిలో షెడ్లు నిర్మించి లేయర్ (గుడ్లు పెట్టే) కోళ్ల ఫారాన్ని ప్రారంభించారు. దాణా గోదాము నిర్మించారు. ఇందుకోసం రూ. 45 లక్షల బ్యాంకు రుణం తీసుకున్నారు. లేయర్కోళ్ల పెంపకంలో ఒక పంట కాలం వంద వారాలు. ఒకరోజు వయసున్న కోడి పిల్లలను హేచరీ నుంచి తెచ్చి ఫారంలో పెంచుతారు. అయితే, కోళ్ల ఫారం నిర్వహణలో అనుభవరాహిత్యం వల్ల మొదటి పంట కాలంలో ఎదిగిన కోళ్లను కొన్నారు. నిపుణుల సూచన మేరకు ఔషధాలు, వాక్సిన్లు వాడినప్పటికీ జబ్బు పడి కోళ్లు చనిపోయాయి. 60వ వారానికే ఆ బ్యాచ్ మొత్తాన్నీ తీసేయాల్సి వచ్చింది. రూ. లక్షల్లో నష్టం వచ్చింది. అయినా, అధైర్యపడకుండా, సొంత భూమి తనఖా పెట్టి వర్కింగ్ క్యాపిటల్‌గా రూ. 30 లక్షలు రుణం తీసుకొని రెండో బ్యాచ్ కోడిపిల్లల పెంపకం చేపట్టారు. మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జలు తదితరాలతో కూడిన దాణా ఇచ్చే వారు. 45 రోజులకోసారి వ్యాక్సిన్ వేయడంతోబాటు ఔషధాలూ వాడేవారు. తరచూ జబ్బులు వచ్చేవి. రెండో బ్యాచ్‌ను 82 వారాల్లో తీసేయాల్సి వచ్చింది. ఆరుబయట గరికను కొరుక్కు తినే నాటు కోళ్లు ఆరోగ్యంగా ఉండటం గమనించిన జయప్రదారెడ్డికి, తన ఫారం కోళ్లకు పెట్టే దాణాలో డ్రై ఫీడ్తోపాటు గరికను, మేకలు తినే రకరకాల ఆకులను కలిపి పెడితే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న ఆలోచన వచ్చింది. ప్రయోగాత్మకంగా గరికను దాణాలో కలపడం ప్రారంభించగా కొద్ది రోజుల్లోనే మంచి మార్పు వచ్చింది. ఆ మార్పు ఆమెను ఉత్సాహపరచింది. 15% మేరకు ఆకులు, కూరగాయలు మూడో బ్యాచ్ కోడి పిల్లల పెంపకం ప్రారంభించిన తొలిదశ నుంచే దాణాలో పూర్తిస్థాయి మార్పులు చేశారు. గరిక, ఆకులతోపాటు టమాటా, సొర వంటి కూరగాయలను సైతం ముక్కలుగా తరిగి ప్రయోగాత్మకంగా దాణాలో కలిపి కోళ్లకు మేపడం మొదలు పెట్టారు. ఆహారంలో చేసిన మార్పులు మంచి ఫలితాలిస్తున్నట్లు గమనించిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. వివిధ ధాన్యాలు(డ్రై ఫీడ్) 85%, ఆకులు–కూరగాయలు కలిపి 15% మేరకు దాణాలో కలపడం ప్రారంభించారు. డ్రై ఫీడ్‌లో సగం మేరకు ధాన్యాలు, సగం మేరకు నూనె తీసిన తెలగపిండి ఉండేలా చూస్తున్నారు. మొక్కజొన్న(45%), సజ్జలు, జొన్నలు, కొర్రలు (తలా ఒక 10%)తో పాటు తవుడు, నూకలు, గడ్డిగింజల(మిగతా 25%)తో పాటు ఇదే మోతాదులో తెలగపిండులు కలిపి మరపట్టించి దాణాగా వాడుతున్నారు. ఎకరం భూమిలో పెరుగుతున్న గరిక, కరివేపాకు, సొర ఆకు, కానుగ చిగుర్లు, బాదం ఆకులు, కొబ్బరి ఆకులు, మునగాకు, సపోటా ఆకులు, చింత ఆకులు, వేపాకులు, నేరేడాకులు, మామిడి ఆకులు వేస్తున్నారు. ఎండాకుల పొడిని కూడా వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి గుజ్జు కూడా అడపా దడపా వేస్తున్నారు. ధర తక్కువగా ఉన్నప్పుడు టమాటా, ఉల్లిపాయలు, సొరకాయలు వంటి కూరగాయలను రోజూ ఉదయం చాఫ్ కట్టర్‌తో ముక్కలు చేసి.. గ్రైండర్లో వేసి డ్రైఫీడ్తో కలగలిపి.. రోజుకు రెండు సార్లు కోళ్లకు మేపుతున్నారు. ఎకరంన్నర భూమిలో ప్రత్యేకంగా సొర పాదులు పెంచి.. ఆ కాయలను కోళ్లకు వినియోగిస్తున్నారు. మూడో బ్యాచ్ నుంచి హెర్బల్ ఎగ్స్ మూడో బ్యాచ్‌లో పూర్తి సేంద్రియంగా హెర్బల్ గుడ్ల ఉత్పత్తి చేపట్టడంతో అంతకుముందు చేసిన అప్పులన్నీ తిరిపోయాయని, 90వారాలు అనుకుంటే 98 వారాల వరకు 85% గుడ్ల ఉత్పత్తితో కొనసాగించానని, కల్ బర్డ్స్ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయని జయప్రదారెడ్డి ఎంతో సంతోషంగా చెప్పారు. ప్రస్తుతం నాలుగో బ్యాచ్ సగంలో ఉంది. గుడ్ల ఉత్పాదకత బాగుంది. ఎండాకాలం కాబట్టి రోజుకు 150 నిమ్మకాయల రసం దాణాలో కలుపుతున్నారు. గుడ్డు సాఫ్ట్‌గా, నీచు వాసన లేకుండా, రుచి నాటు గుడ్ల మాదిరిగా ఉంటున్నదని ఆమె తెలిపారు. కుంటుతున్న కోళ్లకు చింత గింజలు, చింతాకు, చింతపండు దాణాలో కలిపి 15 రోజులు ఇస్తే సమస్య తగ్గిందని జయప్రదారెడ్డి తెలిపారు. కోళ్లు రొప్పుతూ ఉంటే (దగ తీయటం) మొదట్లో వంట సోడా ఫీడ్‌లో కలిపి ఇచ్చేవాళ్లం. 3 ఏళ్ల నుంచి వాడటం లేదు. ప్రతి 45 రోజులకోసారి రోగనిరోధక శక్తి పెంచడానికి వాక్సిన్ ఇచ్చే వాళ్లం అది కూడా ఇవ్వడం లేదు. రోజుకు ఐదారు గంటల పాటు విద్యుత్ లైట్లు వేసేవాళ్లం. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. గతంలో రెండు, మూడు రోజులకోసారి ఏదో ఒక మందు వేయాల్సి వచ్చేది. దాణాలో మార్పులు చేసి ఆకులు, కూరగాయలు వాడుతున్న తర్వాత గత రెండేళ్లుగా ఎటువంటి రసాయనిక వ్యాక్సిన్లు గాని, యాంటిబయాటిక్స్ గాని, ఇతర రసాయనిక ఔషధాలు గానీ కోళ్లకు వాడాల్సిన అవసరమే రాలేదని జయప్రదారెడ్డి అన్నారు. ‘జయ హెర్బల్ ఎగ్స్’ బ్రాండ్ పేరుతో ఆమె గుడ్లను విక్రయిస్తున్నారు. హైదరాబాద్, కర్నూలులోని అనేక మాల్స్ వారు వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ గుడ్లు 20 రోజుల వరకు నిల్వ∙ఉంటున్నాయన్నారు. గతంలో షెడ్ నుంచి వంద మీటర్ల దూరం వరకు దుర్వాసన వచ్చేది. ఈగలు, దోమల బెడద బాగా ఉండేదని, కోళ్ల పెంట బాగా దుర్వాసన వచ్చేది. ఇప్పుడు వాసన బాగా తగ్గిపోయింది. జర్మనీ శాస్త్రవేత్తలు అభినందించడం సంతోషాన్నిచ్చిందన్నారు. రసాయన రహితంగా గుడ్లను ఉత్పత్తి చేస్తున్న ఆమె ఆదర్శప్రాయురాలు. కోడిలా జీవించాలి! కోళ్లను పెంచే రైతులు తామే కోడిలా జీవించాలి. 24 గంటలూ వాటికి ఏమేమి అవసరమో శ్రద్ధగా గమనిస్తూ ఏ లోటూ రాకుండా చూసుకోవాలి. పని వాళ్లు చేస్తారులే అని వదిలేసి ఊరుకుంటే జరగదు. ఇంట్రెస్టుగా చెయ్యటం ముఖ్యం. కూర చేసినా మనసుపెట్టి ఇంట్రెస్టుగా చెయ్యాలి. అలాగే కోళ్లను కూడా ఇష్టంగా చూసుకోవాలి. నేను ఉదయం 5.30 గంటలకే షెడ్ దగ్గరకు వెళ్లి ఫీడ్ మిక్సింగ్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నా. ఇష్టంగా పనులు చేసుకుంటూ ఉంటే కోళ్ల ఫారంలో పెట్టుబడి ఆరేళ్లలో తిరిగి వచ్చేస్తుంది. – జయప్రదారెడ్డి (86394 21276), రాణిపేట, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ ∙కోళ్ల కోసం సొరకాయలు కోస్తున్న జయప్రదారెడ్డి కొర్రలు, సొర ముక్కలు, ఎండాకులతో తయారవుతున్న దాణా అమ్మకానికి సిద్ధం దాణాలో కలిపేందుకు సొరకాయలను కట్ చేస్తూ... – బొలెమోని రమేష్, సాక్షి, వనపర్తి ఫొటోలు: ఎం.యాదిరెడ్డి -
కుటుంబం ఆత్మహత్యాయత్నం.. భర్త, పిల్లల మృతి
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని కె.కోటపాటు మండలం చంద్రయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు సహా దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందగా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. వివరాలు.. అనంతగిరి మండలానికి దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చంద్రయ్యపేటలోని ఓ కోళ్లఫారంలో గత 6 నెలలుగా పని చేస్తున్నారు. నిన్న రాత్రి (శనివారం) కోళ్లఫారం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనలో చిన్న, చింటూ, వీణలు అక్కడికక్కడే మృతి చెందగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భార్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడినుంచి విశాఖపట్నం తరలించారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. -
పౌల్ట్రీ ఫామ్‌లో విగత జీవులుగా నలుగురు యువకులు
-
పౌల్ట్రీఫాంపై పిడుగు.. 500 కోళ్లు మృతి
షాబాద్(చేవెళ్ల : పిడుగు పడి బాయిలర్ కోళ్లు మృ తిచెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల తో కూడిన వర్షంలో పిడుగుపడి బాయిలర్ కోళ్లు మృతిచెందిన ఘటన షాబాద్ మండల పరిధిలోని నరెడ్లగూడలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపి న వివరాల ప్రకారం... మండల పరిధిలోని నరెడ్లగూడ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల చంద్రలింగం పౌల్ట్రీఫామ్‌లో పిడుగుపాటుకు గురై సుమారు 500 వరకు కోళ్లు మృతి చెందాయి. తమను ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అప్పులు చేసి కోళ్ల పరిశ్రమను నడిపిస్తున్న తమకు పిడుగు రూపాన తీరని నష్టం ఏర్పడిందని వాపోతున్నారు. పిడుగుపాటుకు గురై ముగ్గురు మహిళలకు గాయాలు... పిడుగుపడి ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన షాబాద్ మండల పిరిధిలోని ఆస్పల్లిగూడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...ఆస్పల్లిగూడ గ్రామానికి చెందిన రైతు పొలంలో గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన కొందరు మహిళలు కూలీ పనులు చేస్తుండగా సాయంత్రం ఈదులు గాలులు, వర్షం కురవడంతో వారంతా పక్కనే ఉన్న చెట్టు కిందికి వెళ్లారు. అంతలోనే ఉరుములు రావడంతో చెట్టుపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన యాదమ్మ, మౌనిక, రాములమ్మలను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. -
కొండెక్కిన కోడి
నిజామాబాద్ అర్బన్: కోడి ధర కొండెక్కింది. చికెన్ ధర ఒక్కసారిగా రూ. 270కి చేరింది. వారం వ్యవధిలో రూ.50 పెరగడం గమనార్హం. నిజామాబాద్‌లో గత వారం స్కిన్లెస్ చికెన్ ధర రూ.220. అయితే, ఆదివారం ఒక్కసారిగా రూ.50 పెంచేసి రూ.270కి కిలో చొప్పున విక్రయించారు. ఎండలు మండిపోతున్న తరుణంలో కోళ్ల దిగుమతి తగ్గిపోయిందని, అందుకే ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. వడగాలుల తీవ్రతకు పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు చనిపోతున్నాయంటున్నారు. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. చికెన్ ధర పెరుగుతుండడంతో మాంస ప్రియులు ఆందోళన చెందుతున్నారు. -
కొండకెక్కిన కోడి
- చికెన్ కిలో రూ. 240 - స్కిన్‌సెల్ రూ.260 - సామాన్యులు కొనలేని పరిస్థితి - కోళ్ల పెంపకం తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): మార్కెట్లో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. కిలో రూ.240 పలుకుతోంది. మాంసాహారులు చికెన్ ధరలు విని బెంబేలెత్తిపోతున్నారు. రెండు నెలల క్రితం రూ. కిలో రూ.100 నుంచి రూ.120 పలికిన చికెన్ ధర ప్రస్తుతం రెట్టింపు అయింది. సామాన్యులు తినలేని పరిస్థితి ఏర్పడింది. స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.260 అమ్ముతుండటంతో వినియోగదారులు వెనకాడుతున్నారు. చాలా మంది ఆదివారమే కాకుండా వారంలో రెండు మూరు సార్లు చికెన్ వండుకోవడం పరిపాటి. అలాంటిది ధరలు పెరగడంతో చికెన్ దుకాణాల వైపు వెళ్లడం లేదు. ఓ వైపు రేట్లుపెరగడంతో చికెన్ అమ్మకాలు కూడా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ పట్టణాల్లో అత్యధికంగా కిలో రూ. 240 - రూ. 260 వరకు అమ్ముతున్నారు. పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఫారం కోళ్లు గుడ్లు పెట్టేవి సుమారు 5 లక్షలు ఉండగా, పెరటి కోళ్లు 14,00,000 వరకు ఉన్నాయి. జిల్లాలో కరువు కారణంగా నాటు కోళ్ల పెంపకం తగ్గిపోవడం వలన కోడి మాంసం ధరలు ఏటా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెరటి కోళ్ల పథకం కింద యూనిట్లు మంజూరు చేసినప్పటికీ అవగాహన కొరవడటంతో వాటి పెంపకంపై ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లింది. కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహం కరువు: కోళ్ల పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడమే కోడి మాంసం ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం కోళ్ల ఫారాల్లో ఉన్న కోళ్లు కూడా సీజనల్ వ్యాధులతో వేల సంఖ్యలో చనిపోతున్నాయి. ప్రతి ఆదివారం మార్కెట్లో వేల సంఖ్యలో కోళ్లను విక్రయిస్తుంటారు. దీంతో గుడ్లు పెట్టే కోళ్లు కూడా తగ్గిపోతున్నాయి. జిల్లా ఏటేటా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అటు మాసంగానీ, గుడ్లు, పాల ఉత్పత్తి లో రెండెంకెల వృద్ధి సాధించాలన్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. ఇవన్నీ కలిసి చికెన్ ధరల పెరుగుదలకు కారణమైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రోత్సాహం కరువవ్వడంతోనే నష్టాలు... – రాజారెడ్డి, శివ చికెన్ పౌల్ట్రీస్, డోన్ : ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడంతోనే చికెన్ వ్యాపారులు నష్టాల పాలవుతున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రావడంతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతోనే అమాంతంగా ధరలు పెరిగాయి. రూ.220 నుంచి రూ.240 వరకు ధర పెరగడం ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం ప్రోత్సహించి పౌల్ట్రీ పరిశ్రమలను మరిన్ని ఏర్పాటు చేస్తే ఇలాంటి కష్టాలు, నష్టాలు పునరావృతం కావు. -
లక్షన్నర కోళ్లను చంపేశారు
చికెన్ కొనుగోలును నిలిపివేసిన మైసూరు జూ అధికారులు కొన్ని జాగ్రత్తలతో బర్డ్‌ఫ్లూ దూరం : నిపుణులు బెంగళూరు : రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ నివారణా చర్యలు యుద్ధ ప్రతిపాదికన సాగుతున్నాయి. అందులో భాగంగా బర్డ్‌ఫ్లూ సోకిన పక్షులను నిపుణులు బృందం వైజ్ఞానికంగా సంహరిస్తోంది. రాష్ట్రంలోని బీదర్ జిల్లా హొమ్నాబాద్ తాలూకా మార్కెర గ్రామంలో బర్డ్‌ఫ్లూతో 20 వేల కోళ్లు చనిపోగా అక్కడే వివిధ కోళ్ల ఫారంలలో ఉన్న మరో 1.50 లక్షల కోళ్లను చంపడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశుసంవర్థకశాఖ అధికారులు 50 బృందాలను ఏర్పాటు చేసి బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లను మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చంపేశారు. ఇందు కోసం నాలుగు వేల సంచులను సిద్ధం చేసుకుని 200 గుంతలను తవ్వారు. ఒక్కొక్క సంచిలో నలభై నుంచి యాభై కోళ్లను వేసి అటుపై గుంతల్లో వేసి మట్టితో కప్పేశారు. ఈ పనిలో నిమగ్నమైన వారికి మాస్క్‌లు, ప్రత్యేక దుస్తులను అందజేశారు. కాగా, పక్షలను వైజ్ఞానికంగా చంపే కార్యక్రమం సోమవారమే జరగాల్సి ఉండగా వర్షం వ ల్ల ఈ పనిని మంగళవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా బర్డ్‌ఫ్లూ విషయమై ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్రంలోని వివిధ జూ సిబ్బంది అక్కడి జంతువులకు కోళ్లను ఆహారంగా వేయడాన్ని నిలిపివేశాయి. అంతేకాకుండా పక్షులు ఉన్న ఎన్‌క్లోజర్స్‌ను పూర్తిగా శుభ్రం చేసి వాటి శ్యాంపిల్స్‌ను కూడా పరీక్ష కోసం లాబొరేటరీలకు పంపించారు. ఈ విషయమై మైసూరు జూ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.వెంకటేషన్ మాట్లాడుతూ...‘మా జూలో బర్డ్‌ఫ్లూ సోకిన దాఖలాలు ఏవీ కనబడలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చికెన్ కొనుగోలును నిలిపివేశాం.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పక్షుల ద్వారా మనుషులకు కూడా బర్డ్‌ఫ్లూ (ఏవీఎన్ ఇన్ఫ్లూఎంజా-ఎచ్5ఎన్1) వ్యాధి సోకే అవకాశం ఉంది. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో ప్రజలకు ఎవరికీ కూడా బర్డ్‌ఫ్లూ సోసిన దాఖలాలు లేవు. కాగా, బర్డ్‌ఫ్లూ సోకిన వారికి ప్రస్తుతం ఓసల్టామీవీర్ (టామీఫ్లూ) మందును అందజేస్తున్నారు. దీంతో పాటు జనామీవీర్ను కూడా కొన్నిచోట్ల బర్డ్‌ఫ్లూ వ్యాధి చికిత్సలో అందజేయవచ్చు. పక్షుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఇవి.. అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడం పక్షుల్లో విసర్జక పదార్థాలు సాధారణం కంటే నీళ్లగా ఉండడం పక్షుల కాళ్లు, ముక్కు ఊదా రంగులోకి మారి పోవడం పక్షుల గుడ్డు పెంకులు పెలుసుగా మారిపోవడం పక్షులు ఆహారాన్ని తీసుకోవపోవడం కనురెప్పలు, తల, కాళ్ల గోళ్లు ఉబ్బిపోవడం ముక్కుల నుంచి నీరు కారడం మనుషుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఇవి... శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం స్వల్ప పరిమాణంలో శరీర ఉష్ణోగ్రత పెరగడం చాలా కొంతమందిలో శరీరంపై దద్దుర్లు కూడా వస్తాయి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... బర్డ్‌ఫ్లూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కోడి మాంసంతో పాటు గుడ్డును పూర్తిగా ఉండికించిన తర్వాతనే తినాలి హాఫ్ బాయిల్డ్, స్మోక్డ్ చికెన్లను తినకపోవడం మంచిది కోళ్లను ముట్టుకున్న తర్వాత చేతిని సోపుతో శుభ్రపరుచుకోవాలి కోళ్ల వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో తాకకూడదు -
రూ.20 లక్షల విలువైన కోళ్లు చోరీ
గ్రామ శివారులో ఉన్న కోళ్లఫాంలపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు ఫాంలో ఉన్న రూ. 20 లక్షల విలువైన కోళ్లను దోచుకెళ్లారు. రెండు ఫాంలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాళ్ల వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ వివాదాస్పద స్థలంలో ఉన్న రెండు కోళ్లఫాంలపై దాడి చేసిన దుండగులు అందులో ఉన్న రూ.20 లక్షల విలువైన కోళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో బాదితుడు పోలీసులను ఆశ్రయించాడు. -
బర్డ్ ఫ్లూ... బహుపరాక్
- ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలి - పశుసంవర్థక శాఖ సంయుక్త - సంచాలకులు వెంకయ్య నాయుడు పోచమ్మమైదాన్ : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడంతో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయూరుు. ఈ విషయమై అప్రమత్తమైన పశుసంవర్థక శాఖ ఇప్పటికే నివారణ చర్యలు చేపట్టింది. ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేం దుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, సూచనలు చేసింది. ఈ సందర్భంగా బర్డ్ ఫ్లూ లక్షణాలు-నివారణ కు తీసుకోవాల్సిన చర్యల గురించి పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు వెంకయ్య నాయుడు వివరించారు. జిల్లాలో 48.83 లక్షల కోళ్లు ఉన్నాయ ని, బర్డ్ ఫ్లూ వ్యాధి అన్ని జాతుల కోళ్లు, బాతులకు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మనుషులపైనా దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. అరుు తే జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు బయటపడలేదని, అరుునా కోళ్ల ఫారాల యజమానులు, పెంపకం రైతులు, చికెన్ షాప్ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు - ముక్కు, నోటి నుంచి ద్రవాలు కారుతూ సాధార ణ జలుబు లక్షణాలు కనబతారుు. - తల కొప్ప, వాటిల్స్, నీలం రంగుగా మారి కనపడుతుంది. - కాళ్ల మీద వాపు వచ్చి ఎర్రగా మారతాయి. - వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పచ్చగా విరేచనాలు, రక్తంలా ద్రవాలు నోటి నుంచి ముక్కు నుంచి కారతాయి. -కోళ్ల ఫారంలో, చికెన్ షాపులలో పనిచేసే వ్యక్తుల కు వ్యాధి సోకిన కోళ్ల పేడ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. మనుషులలో సాధారణ జలుబు లక్షణాలుండి జ్వరం వస్తుంది. కోళ్ల ఫారం యజమానులకు - రంగారెడ్డి ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలింది. అక్కడి నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవద్దు. -కోళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి. బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. -ఫారంలో పని చేసే వ్యక్తులు పరిసరాలు, వాహనాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -చికెన్ షాప్ యజమానులకు.. -వ్యాధి సోకిన కోళ్లను ఫారాల నుంచి కొనుగోలు చేయవద్దు. -చికెన్ షాప్ వ్యర్థాలను సక్రమంగా కాల్చివేయడం లేదా బొంద తీసి పాతి పెట్టాలి. -షాప్‌లో పని చేసే వ్యక్తులు, కోళ్లను తీసుకువచ్చే వాహనాలతోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -
గుడ్లు తేలేసిన పౌల్ట్రీ
పరిశ్రమదారులకు అందని పరిహారం నడిరోడ్డున వేలాది మంది కార్మికులు అప్పులు పుట్టక అల్లాడుతున్న రైతులు గణనీయంగా తగ్గిన గుడ్లు, కోళ్ల ఉత్పత్తి పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. హుద్‌హుద్ దెబ్బకు కనివినీ ఎరుగని రీతిలో నష్టపోయిన పౌల్ట్రీ రైతులునష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. పూర్తిస్థాయిలో పరిహారమందక..నేలమట్టమైన ఫారాలను నిలబెట్టుకునేందుకు అప్పులు పుట్టక అల్లాడిపోతున్నారు. వేలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయి వలస బాట పడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ ధాటికి జిల్లాలో మూడువందలకు పైగా కోళ్లఫారాలు నేలమట్టమయ్యాయి. 16.17లక్షల బ్రా యిలర్, 15.21లక్షల లేయర్ కోళ్లు చనిపోయినట్టు అధికారులే లెక్క తేల్చారు. వీటిలో ఏ ఒక్క ఫారానికి సరైన బీమా సౌకర్యం లేకపోవడంతో ఏఒక్కరూ జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేకపోతున్నారు. చనిపోయిన కోడికి రూ.500 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయగా, గుడ్డుపెట్టే కోడికి రూ.150లు, బ్రాయిలర్ కోడికి రూ.75ల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. లేయర్ కోళ్ల ఫారానికి గరిష్టంగా రూ.15లక్షలు, బ్రాయిలర్ కోళ్ల ఫారానికి రూ.7.5లక్షల చొప్పున సీలింగ్ విధించారు. ఈ విధంగా రూ.120కోట్లు మంజూరు చేశారు. ఈమొత్తంలో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే రైతుల అకౌంట్లకు జమయింది. మిగిలిన 50శాతం మంది బాధిత రైతులు పరిహారం కోసం కళ్లల్లో ఒత్తులేకుసుని ఎదురు చూస్తున్నారు. పరిహారంవిషయంలో చాలా మంది అర్హులైన రైతులకు అన్యాయమే జరిగింది. ఈ పరిహారం 25 శాతం నష్టాన్ని కూడా పూడ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ పరిహారం అందితే కాస్త కుదుటపడవచ్చునని రైతులు ఆశిస్తున్నారు. మళ్లీ నిలదొక్కుకునేందుకు అప్పుల కోసం ప్రైవేటు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. నేలమట్టమైన ఫారాల్లో కేవలం 50 శాతమే తిరిగి నిలదొక్కుకోగలిగాయి. అదీ కూడా తాత్కాలిక షెడ్లలో రూ.10ల వడ్డీకి అప్పులు చేసి మరీ పెట్టుబడులతో ఫారాలను నిలబెట్టుకోగలిగారు. మిగిలినవి తుఫాన్‌కు సాక్ష్యాలుగానే నేటికీ దర్శనమిస్తున్నాయి. తుఫాన్ దెబ్బకు జిల్లాలో గుడ్లు, కోళ్ల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. జిల్లాలో సాధారణంగా రోజుకు 60 లక్షల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం 35లక్షల నుంచి 40లక్షలకు మించడం లేదు. ఇక జిల్లాలో 20లక్షల వరకు బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి జరిగేది. తుఫాన్ తర్వాత అది 13లక్షల నుంచి 15లక్షలకు పడిపోయింది. ఈ పరిశ్రమ టర్నో వర్ కూడా సగానికి పైగా తగ్గిపోయిందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో జిల్లా అవసరాల కోసం ఉభయగోదావరి జిల్లాల నుంచి గుడ్లు,కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫారం పునర్నిర్మాణం కోసం ఉపయోగించే ముడిసరుకుపై 14 శాతం వ్యాట్‌ను రద్దు చేయాలని, ఉమ్మడి రాష్ర్టంలో జారీ చేసిన జీవో మేరకు పౌల్ట్రీ పరిశ్రమకు యూనిట్ రూ.3.88లకే విద్యుత్ సరఫరా చేయాలని, టర్మ్, వర్కింగ్ కాపిటల్ రుణాలపై వడ్డీరాయితీ ఇవ్వాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. రూపాయి పరిహారం ఇవ్వలేదు నా కోళ్ల ఫారం తుఫాన్ దెబ్బకు నేలమట్టమైంది. 13వేల కోళ్లు చనిపోయాయి. షెడ్లు పూర్తిగా ధ్వంసమైంది. రూ.15లక్షలు పెట్టుబడి పెట్టాను. ఇందులో రూ.10 లక్షలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చాను. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి నా ఫారాన్ని చూసిన పాపాన పోలేదు. దెబ్బతిన్న రైతుల జాబితాలో నా పేరు లేదు. ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. అప్పు ఏ విధంగా తీర్చా లో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఫారం మూసి వేశాను. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. - జాన్, పౌల్ట్రీ రైతు పెదపీనార్ల, నక్కపల్లి మండలం -
బండరాయితో మోది.. గొంతునులిమి..
కీసర: ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు ఆమె తలపై బండరాయితో మోది.. చీరతో ఉరివేసి చంపేశారు. హతురాలు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా వాసి. ఈ సంఘటన మంగళవారం మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని పాలకొల్లు గ్రామానికి చెందిన పోనగంటి లక్ష్మి,(33)ధన్‌బాబు ద ంపతులు. వీరు పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం శామీర్‌పేట్ మండలం పోతారం గ్రామానికి వలస వచ్చారు. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి పౌల్ట్రీఫాంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కూతురు(13) హైదరాబాద్‌లోని తన మేనమామ వద్ద ఉంటోంది. ఇదిలా ఉండగా సోమవారం పని నిమిత్తం ఫాంహౌస్ నుంచి వెళ్లిన లక్ష్మి ఎంతకూ తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం మండల పరిధిలోని రాంపల్లి-చర్లపల్లి రహదారి సమీపంలో ఉన్న శ్రీనగర్‌కాలనీ వెంచర్‌కు దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో ఓ మహిళ మృతదేహం పడి ఉండడంతో అటుగా వెళ్లిన పశువుల కాపరి గమనించి కీసర పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్థానిక సీఐ గురువారెడ్డి, అల్వాల్ ఏసీపీ ప్రకాశ్‌రావు తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతురాలి వద్ద ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా లక్ష్మి వివరాలు తెలిశాయి. దుండగులు మహిళ తలపై బండరాయితో మోది.. అనంతరం చీరకొంగుతో గొంతు నమిలి చంపేసిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసు జాగిలం ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న రాంపల్లి-చర్లపల్లి ప్రధాన రహదారి వరకు వెళ్లి తిరిగి వచ్చింది. పరిచయం ఉన్న వ్యక్తులే లక్ష్మిని తీసుకొచ్చి చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వేధిస్తున్నాడని.. చంపేసింది
* భర్తను గొడ్డలితో నరికి హతమార్చిన భార్య * శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ శివారులో ఘటన శంషాబాద్ రూరల్: మద్యానికి బానిసైన భర్త నిత్యం వేధిస్తుండడంతో భరించలేని భార్య ఆయనను గొడ్డలితో నరికి చంపేసింది. ఈ సంఘటన శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోమ మండలం మోత్కూరుకు చెందిన దీమ వెంకటయ్య(37) కుల్కచర్ల మండలం బండి ఎల్కచర్ల నివాసి అయిన తన అక్క కూతురు కమలమ్మ అలియాస్ చిన్నమ్మను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారులు నవీన్(9), శ్రీకాం త్(6) ఉన్నారు. వెంకటయ్య మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు. ఇదిలాఉండగా మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం కాసులబాద్ నివాసి సిద్ధులు కమలమ్మకు పెద్దమ్మ కొడుకు వరుస. ఇతను ఏడాది క్రితం శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడకు వలస వచ్చి గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్నాడు. సోదరి అయిన కమలమ్మ మోత్కూరులో గొడవపడుతుండడంతో ఆయన దంపతులను నెల రోజుల క్రితం తీసుకొచ్చి తాను పనిచేసే పౌల్ట్రీఫాంకు సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పనికి కుదిర్చాడు. అయినా వెంకటయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. గురువారం రాత్రి 9 గంటలకు మద్యం తాగి వచ్చిన వెంకటయ్య భార్యతో గొడవపడ్డాడు. దీంతో కమలమ్మ వెళ్లి సిద్ధులుకు విషయం చెప్పి ఆయనను తీసుకొచ్చింది. గొడ్డలితో మెడ నరికి.. వెంకటయ్య మరోమారు కమలమ్మ, సిద్దులుతోనూ గొడవపడ్డాడు. తమనెక్క డ చంపేస్తాడోనని కమలమ్మ భయపడి అక్కడే ఉన్న కారం పొడిని భర్త ముఖం పై చల్లింది. దీంతో వెంకటయ్య కింద పడిపోయాడు. వెంటనే కమలమ్మ గొడ్డలి తీసుకుని ఆయన మెడపై నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గొడ్డలిని గదిలోనే ఓ చోట దాచిపెట్టి, దానికి ఉన్న కట్టెను పొదల్లో పడేశారు. తర్వాత సిద్ధులు అక్కడి నుంచి వెళ్లి దుస్తులు మార్చుకున్నాడు. శుక్రవారం ఉదయం ఏమి తెలియనట్లుగా సిద్ధులు తన మామ చనిపోయాడంటూ స్థానికులకు చెప్పా డు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మొదట్లో తమకేమి తెలియదని బుకాయించిన కమలమ్మ, సిద్ధులు చివరకు నేరాన్ని అంగీకరించారు. హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఠాణాకు తరలించారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృ తదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయ్యో పాపం.. తండ్రి హత్యకు గురికావడం.. తల్లి జైలు కు వెళ్లాల్సి రావడంతో చిన్నారులు నవీ న్, శ్రీకాంత్‌లు అనాథలయ్యారు. -
నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు
పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలంలో నకిలీ మద్యం తయారీ ముఠాను గంగవరం పోలీసులు పట్టుకున్నారు. దండపల్లె సమీపంలో గల జోగిండ్లు వద్ద ఓ కోళ్లఫారమ్‌లో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు చేశారు. రూ.8 లక్షల విలువజేసే నకిలీ మద్యం, తయారీ వస్తువులు, ఖాళీ బాటిళ్లు, క్యాన్లు, డ్రమ్ములు, ఓ కారును సీజ్ చేశారు. ప్రధానమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఎలా పట్టుబడ్డారంటే.. పెద్దపంజాణి పోలీసులు ఆదివారం రాత్రి బట్టందొడ్డి వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో నాలుగు కేసుల మద్యం కంటపడింది. ఆరా తీయగా అది నకిలీ మద్యమని తేలింది. కారులోని ఓ వ్యక్తి పరారుకాగా బద్రీ అనే వ్యక్తి చిక్కాడు. మద్యంతో పాటు కారును సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు బద్రీ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన గంగవరం సీఐ రామకృష్ణ తన సిబ్బందితో కలసి గంగవరం మండలంలోని దండపల్లె సమీపంలో గల జోగిండ్లు కోళ్లఫారమ్‌లో తయారవుతున్న నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు. సోమవారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 68 కేసుల మద్యం, తయారీ పరికరాలు సీజ్.. ఈ కోళ్లఫారమ్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న 68 కేసుల (3264 క్వార్టర్ బాటిళ్ల) మద్యం పట్టుకున్నారు. ఆరుబస్తాల్లో నిల్వ ఉన్న ఖాళీ క్వార్టర్ బాటిల్ సీసాలు, కార్క్‌లు (బిరడాలు), మద్యం తయారీకి వినియోగించే డ్రమ్ము, 35 లీటర్ల ఖాళీ క్యాన్లు 8, లేబుళ్లు (హైవార్డ్స్, ఓల్డ్టావెర్న్)లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం త యారీకి ఉపయోగించే రెక్టిఫైడ్ స్పిరిట్, బ్రాందీ, విస్కీ ఎసెన్స్‌లు, ఎక్సైజ్ శాఖకు చెందిన నకిలీ హోలోగ్రాఫిక్ లేబుల్స్ దొరికాయి. వీటిని స్టేషన్‌కు తరలించారు. ఎలా తయారు చేస్తున్నారంటే.. గంగవరానికి చెందిన బద్రీ ఆరు నెలల క్రితం జోగిండ్లుకు చెందిన జయమ్మ కోళ్లఫారాన్ని లీజుకు తీసుకున్నాడు. అందులో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. బెంగళూరుకు చెందిన రమేష్‌కుమార్‌తో పాటు కోలార్ ప్రాంతానికి చెందిన ఓ బ్యాచ్ దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తయారు చేసినా మద్యాన్ని స్థానికంగానే కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. నెల క్రితం వచ్చిన కొత్త హోలోగ్రాఫిక్ లేబుల్స్తోనే.. గత నెల ఒకటో తేదీ ఎక్సైజ్ శాఖ కొత్త హోలోగ్రాఫిక్ లేబుల్స్‌తో మద్యం దుకాణాలకు సరుకును సప్లై చేసింది. ఆ హోలోగ్రాఫిక్ లేబుల్స్ ఇక్కడ దొరికిన నకిలీ మద్యంపై కనిపించాయి. నెల రోజుల వ్యవధిలోనే నకిలీ హోలోగ్రాఫిక్ లేబుల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేస్తున్నారు. గంగవరం, పలమనేరు పరిధిలోని మద్యం దుకాణాల్లో సైతం ఎన్ఫోర్స్మెంట్ సీఐ వాసుదేవచౌదరి తన సిబ్బందితో హోలోగ్రాఫిక్ లేబుల్క్ను తనిఖీ చేయడం గమనార్హం. స్థానిక ఎక్సైజ్ సీఐ నాగభూషణం సైతం కూపీ లాగే పనిలో ఉన్నారు. -
రేవ్‌పార్టీలో అర్ధనగ్నంగా నృత్యాలు...
శామీర్‌పేట్: ఒకప్పుడు నగరాలకు పరిమితమైన రేవ్‌పార్టీలు ఇప్పుడు శివారు ప్రాంతాలకు మారుతున్నాయి. పోలీసుల దాడులు తప్పించుకోవచ్చని యువతీయువకులు ఈ ‘అడ్డాల’ను ఎంచుకుంటున్నారు. శనివారం అర్ధరాత్రి మండల పరిధిలోని తుర్కపల్లిలో వినియోగంలో లేని ఓ పౌల్ట్రీఫాంలో పోలీసులు దాడులు చేసి 12 మంది యువతులు, 14 మంది యువకులను పట్టుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పౌల్ట్రీఫాంలో యువతులు అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తుండగా యువకులు వారిపై నోట్లు వెదజల్లుతున్నారు. యువతీయువకులు పూటుగా మద్యం తాగి ఒళ్లు మరిచిపోయి ఉన్నారు. అక్కడ వ్యభిచారం జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. పోలీసులు పౌల్ట్రీఫాంలోంచి నాలుగు కార్లు, సెల్ఫోన్లు, రూ. 2 లక్షలకు పైగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పచ్చని పల్లెసీమల్లో ఈ ‘పాడు పని’ ఏంటని గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. వినియోగంలో లేని పౌల్ట్రీఫాం అయితే ఎవరికీ అనుమానం రాదని, తమ గుట్టురట్టు కాదని రేవ్‌పార్టీ నిర్వాహకులు భావించారు. పౌల్ట్రీఫాంలో కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి దానిని లీజ్‌కు తీసుకొని ఈ ‘దందా’ను సాగిస్తున్నట్లు సమాచారం. పౌల్ట్రీఫాంలోని గదులను సుందరంగా తీర్చిదిద్దారు. రిసార్టులను తలదన్నేలా ఏర్పాట్లు ఉన్నాయి. నగరానికి శివారు ప్రాంతమైతే యువతీయువకుల రాకపోకలకు సులువుగా ఉంటుందని భావించి ఉండొచ్చు. రిసార్టులో ఉద్యోగాలు చేస్తున్న కొందరు గ్రూపులుగా ఏర్పడి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల దాడులు రిసార్టుల్లో పెరగడంతో అడ్డాలు మార్చుకుంటున్నారు. ‘పార్టీ’ ల నిర్వాహకులు దేశంలోని కోల్‌కతా, ముంబై తదితర ప్రాంతాల నుంచి డ్యాన్సర్లను రప్పిస్తున్నారు. దీంతో పాటు నగరంలో ఉండే కొందరు నిరుపేద యువతులకు గాలం వేస్తున్నారు. డబ్బున్న యువకులు, వ్యాపారులను ‘దావత్’లకు ఆహ్వానించి తమ దందాను మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందగా సాగిస్తున్నారు. ఇటీవల మండలంలోని లియోనియా రిసార్ట్స్‌లో పోలీసులు ఓ భవనంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 30 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లియోనియాలో పట్టుబడిన యువతుల్లో ముగ్గురు తుర్కపల్లి ఘటనలో కూడా దొరికిపోవడం గమనార్హం. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచి ‘చీకటి దందాల’ను అరికట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
వేపాడ, పార్వతీపురంలలో.. నగదు పట్టివేత
సోంపురం(వేపాడ) న్యూస్‌లైన్: వేపాడ మండలంలోని సోంపురం జంక్షన్లో వల్లంపూడి పోలీ సులు శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా రూ.2,97,550 పట్టుబడింది. ఎస్సై బాలాజీరావు, ప్లయింగ్ స్క్వాడ్ చంద్రశేఖర్, ఏఎస్సై దయానందరావు సంఘటనా స్థలానికి చేరుకుని పట్టుబడ్డ నగదుపై విచారణ చేశారు. ఇందుకు సంబంధించి పోలీస్ సిబ్బంది అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్.కోట మం డలం కుద్దువలస నుంచి ఎస్.కోట వైపు కారులో వెళ్తున్న పోతంపేట సర్పంచ్ కొరుపో లు ముత్యాలునాయుడు వద్ద ఎటువంటి అధారాలులేకుండా ఉన్న నగదు రూ.1,02,050 పట్టుబడ్డాయి. తాము కోళ్లఫారం పెట్టామని అందుకు సంబంధించిన సొమ్ముచెల్లించడానికి తీసుకెళ్తున్నట్లు ముత్యాలు నాయుడు చెప్పారు. కొట్యాడ నుంచి ఎల్.కోట వైపు వెళ్తున్న మల్లు శంకర్రావు వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో రూ.1,95,500 స్వాధీనం చేసుకున్నారు. ఎల్.కోట బ్యాం కులో వేయడానికి తీసుకెళ్తున్నట్లు శంకర్రా వు బ్యాంక్ పాసుపుస్తకం చూపిం చారు. అయినా ఆ సొమ్ముకు ఆధారాలు లేకపోవడంతో ఇద్దరి వద్ద పట్టుబడిన సొమ్మును సీజ్ చేశారు. కేసు నమోదుచేసి సొమ్మును వేపాడ తహశీల్దారు పి.అప్పలనాయుడుకు అప్పగించినట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. పార్వతీపురం చెక్‌పోస్టు వద్ద.. పార్వతీపురం టౌన్: పార్వతీపురంలోని నవిరి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద భారత్ ట్రేడర్స్‌కు సంబంధించిన రూ.1,87,850లు, గణేష్ గుప్త నుంచి 1,91,500లు, జట్టు ఆశ్రమం వద్ద ఒడిశాలోని కెరడ నుంచి పార్వతీపురం వస్తున్న జి.రవి వద్ద రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బి.వెంకటరావు, ఎలక్షన్ డీటీ జి.రామచంద్రరావు తెలిపారు.