![Birdflu Effect on Poultry Farm](/styles/webp/s3/article_images/2025/02/16/441.jpg.webp?itok=IwrDxX3o)
అంతుపట్టని వైరస్
చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని కోళ్ల ఫారంలో శనివారం తెల్లవారుజామున 800 కోళ్లు మృతి చెందాయి. నేలపట్లకు చెందిన పబ్బు మల్లేశ్ ఫారంను లక్కారం గ్రామానికి చెందిన శివ కొంతకాలంగా లీజుకు తీసుకుని నడుపుతున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది.
సమాచారం అందుకున్న మండల పశువైద్యాధికారి పృథ్వీరాజ్ ఫారం వద్దకు చేరుకుని మరణించిన కోళ్లను పరీక్షించారు. బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని, వైరస్ కారణంగా చనిపోయి ఉంటాయని తెలిపారు. పౌల్ట్రీ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మృతి చెందిన కోళ్లను భూమిలో పాతిపెట్టారు. కోళ్లు మృత్యువాత పడటంతో తీవ్రంగా నష్టపోయానని నిర్వాహకుడు శివ వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment