
ఫారాలు, కంపెనీల గొడవతో జనం ఖుషీ
సాక్షి, కర్ణాటక : కోళ్లఫారం యజమానులు, కోళ్ల కంపెనీల మధ్య గొడవల్లో కోడిపిల్లలు అడవుల పాలయ్యాయి. చిక్క తాలూకా పరిధిలోని రంగస్థళ, కణితహళ్లి అటవీ ప్రాంతాలలో ఫారం కోడిపిల్లలను వేలాదిగా వదిలి వెళ్లగా పట్టుకోవడానికి ప్రజలు పరుగులు తీశారు. వివరాలు.. చిక్క పరిసరాల్లోని కోళ్ల ఫారాలకు బడా కంపెనీలు కోడి పిల్లలను అందజేస్తాయి. అవి పెద్దయ్యాక వచ్చి తీసుకెళ్తారు.
ఇందుకుగాను ఫారం యజమానులకు కోడికి ఇంత అని డబ్బు చెల్లిస్తాయి. అయితే ఇటీవల కంపెనీ సిబ్బంది లేనిపోని కిరికిరి చేయడం షురూ చేశారు. సరైన తూకం లేవని పెద్దసంఖ్యలో కోళ్లను, కోడిగుడ్లను తీసుకోకుండా మొండికేస్తున్నారు. దీంతో పెంపకందారులు కంపెనీల మాట వినేది లేదంటూ వారు ఇచ్చిన పిల్లలను శుక్ర, శనివారాల్లో సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. ఇది తెలిసిన ప్రజలు బ్యాగులు, పెట్టెలు తీసుకెళ్లి కోడిపిల్లలను పట్టుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment