బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ కే సుధాకర్ మద్దతుదారులు ఆయన ఎన్నికల్లో గెలిచినందుకు విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసుల చేత బహిరంగంగా మద్యం పంపిణీ చేయించటం తాజాగా వివాదాస్పదం అయింది. దీంతో ఎంపీ సుధాకర్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.
‘‘బీజేపీ ఎంపీ విజయోత్సవ కార్యక్రమంలో బహిరంగంగా మద్యం పంపిణీ చేయటంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టత ఇవ్వాలి. అయితే ఈ వ్యవహారంలో స్థానిక నేతలు సమాధానం ఇవ్వటం కాదు.. జాతీయ అధ్యకక్షుడే స్పష్టత ఇవ్వాలి. ఇది బీజేపీ బీజేపీ కల్చర్’’ అని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ కింద ప్రభుత్వం ఈవ్యవహారంలో ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. చర్యలు తీసుకోవటం అనేది తర్వాత అంశం. ముందు బీజేపీ పార్టీ ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని అన్నారు.
చిక్కబళ్లాపూర్‌లో నిర్వహించిన బీజేపీ ఎంపీ సుధాకర్ విజయోత్సవ కార్యక్రమంలో పోలీసు మద్యం పంచిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ కార్యక్రమం గురించి సదరు ఎంపీ పోలీసులకు మందుగానే లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఆహారం, మద్యం పంచటంలో సాయం అందించాలని ఆయన ఆ లేఖలో పేర్కొనటం గమనార్హం. అయితే ఇలాంటి కార్యక్రమానికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు. అదీకాక పోలీసులే మద్యం పంచటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మద్యం పంపిణీ వ్యవహారం వివాదం రేపటంతో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సీఎన్ అశ్వనాథ్ నారాయణ్ స్పందించారు. ‘ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించకముందే మేము ఎవరీని నిందించలేము. ఇటువంటి వ్యవస్థ ఉన్నందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ కార్యక్రమంలో తప్పు జరిగిందని భావిస్తే.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సుధాకర్ గెలుపొందారు. సుమారు 1.6 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎస్ రక్షా రామయ్య ఓడించారు.
Comments
Please login to add a commentAdd a comment