dk shiva kumar
-
డీకే Vs సతీష్.. కన్నడ కాంగ్రెస్‌లో రసవత్తర రాజకీయం!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ పోస్టుపై ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో, అధికార పార్టీ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ సెటైర్లు వేస్తోంది.కన్నడ కాంగ్రెస్‌లో కలహాలు ఉధృతమయ్యేలా ఉన్నాయి. డిప్యూటీ సీఎంతో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ.. కేపీసీసీ అధ్యక్ష పోస్టు అంగడిలో దొరకదు. మీడియా ముందు మాట్లాడితే లభించదు. మనం పార్టీకి చేసిన సేవలు, శ్రమను గుర్తించి సరైన పదవి ఇస్తారని, కొంతమంది మీడియా ముందుకొచ్చి పదవిని కోరుతున్నారని అన్నారు.పార్టీలో అందరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్‌గాంధీ, సీఎం సిద్దరామయ్య సూచించారన్నారు. కాంగ్రెస్ పార్టీని తానొక్కడే కాదు, కార్యకర్తలు, ప్రజలు కలిసి గెలిపించారన్నారు. జై భీమ్ సమావేశాల నిర్వహణ పరిశీలనకు ఇన్చార్జి సుర్జేవాలా శుక్రవారం బెళగావికి వస్తారని, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆయనను అడగాలని నేతలకు సూచించారు. మరోవైపు మంత్రి సతీష్ జార్కిహొళికి కేపీసీసీ నుంచి నోటీసులు వెళ్లాయి.రేసులో ఉన్నాననలేదు: సతీశ్కేపీసీసీ నుంచి నోటీసులు ఇచ్చినప్పటికీ ఏమీ కాదు, దీనికి స్పష్టమైన సమాధానం అధ్యక్షుడి ముందు ఇస్తానని మంత్రి సతీష్ జార్కిహొళి చెప్పారు. డీకేపై తరచూ విమర్శలు చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటీస్ ఇచ్చే అధికారం ఆయనకు ఉందన్నారు. కేపీసీసీ రేసులో ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదన్నారు. తన మాటలతో ఎవరికీ ఇబ్బంది లేదని, నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. మీడియా ఉదయం హీరోను చేసి, సాయంత్రం విలన్‌ను చేస్తారని, ఇది సబబు కాదని వాపోయారు. మరోవైపు.. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలపై ప్రతిపక్ష బీజేపీ నేతలు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటివి కొత్తేమీ కాదని కామెంట్స్ చేస్తున్నారు. -
కర్ణాటకలో మళ్లీ తెరపైకి అధికార మార్పిడి అంశం
-
ఒంటరిగా ఢిల్లీకి ఎందుకో?
సాక్షి బెంగళూరు: అనేక పరిణామాల మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తినకు పయనమయ్యారు. చాలా రోజుల తర్వాత సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ టూర్‌కు వెళుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వక్ఫ్ చట్టం గొడవ, ముడా స్థలాల కేసులు, ఉప ఎన్నికలు ఇలా వరుస పరిణామాల తర్వాత సీఎం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలుస్తుండడం గుసగుసలకు కారణమైంది. మంత్రి పదవులకు ఒత్తిడి మంత్రివర్గ విస్తరణ చేయాలని ఎమ్మెల్యేలలో రోజురోజుకి డిమాండ్లు పెరుగుతున్నాయి. సీనియారిటీని చూసి మంత్రి పదవి ఇవ్వాలని డిమండ్ చేస్తున్నారు. డిసెంబర్లో కేబినెట్లో కొంతమందికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇస్తారనే వార్తలున్నాయి. బీజేపీ, జేడీఎస్ ఆపరేషన్ కమల చేస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మంత్రిమండలి విస్తరణ వల్ల అసమ్మతి పుట్టి పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడితే పుట్టి మునుగుతుందనే భయం కాంగ్రెస్‌లో ఉంది. యాత్ర వెనుక మంత్రివర్గ విస్తరణ అంశం తప్పకుండా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. సీఎం మార్పు ఉంటుందా? సిద్ధరామయ్య వెంట డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేకపోవడం గమనార్హం. ముడా గొడవ, వక్ఫ్ భూముల చట్టంతో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో సీఎం మార్పు గురించి మాట్లాడడానికే ఆయనను ఒంటరిగా పిలిచారా? అనేది కూడా తెరమీదకు వచ్చింది. అధిష్టానం పెద్దలకు నచ్చజెప్పడానికి సీఎం వెళ్తున్నారా అనే సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి. బుధ, గురువారం ఆయన పార్టీ పెద్దలను కలవనున్నారు. అలాగే నాబార్డు నిధులు, సహా పన్నుల కోతపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తానని సీఎం తెలిపారు. -
ఆచరణసాధ్యమైన హామీలే ఇవ్వాలి
బెంగళూరు/న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విచ్చల విడిగా ప్రకటిస్తున్న గ్యారంటీలతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింటోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. నోటితో నమలగలిగే దాని కంటే ఎక్కువ మింగేయకూడదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చే హామీలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి సరితూగేలా ఉండాలని స్పష్టంచేశారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలే ఇవ్వాలని తేల్చిచెప్పారు. కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం అమలు చేస్తున్న ‘శక్తి’ పథకాన్ని పునఃసమీక్షించాలని భావిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఖర్గే మాట్లాడుతూ... రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హామీలు ఇచ్చే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రణాళిక లేకుండా ముందుకెళ్తే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రాలు దివాలా తీసే ప్రమాదం ఉందని, భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్థిక బాధ్యత అనేది ఉండాలన్నారు. భవిష్యత్ తరాలు నష్టపోతాయి ‘‘కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చారు. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మహారాష్ట్రలోనూ ఐదు గ్యారంటీలు ఇచ్చారు. కర్ణాటకలో ఒక గ్యారంటీని రద్దు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు వార్తాపత్రికలు చదవడం లేదనిపిస్తోంది. కానీ, నేను చదువుతున్నా. అందుకే ఈ విషయం చెబుతున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది గ్యారంటీల పేరిట హామీలు ఇవ్వొద్దని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సలహా ఇస్తున్నా. దానికి బదులు రాష్ట్ర బడ్జెట్‌కు సరిపోయే హామీలే ఇవ్వండి. రాష్ట్రం దివాలా తీసే గ్యారంటీలు వద్దు. ఇష్టానుసారంగా గ్యారంటీలు ఇచ్చేస్తే రేపు రోడ్లు వేయడానికి కూడా డబ్బులు ఉండవు. ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి. ప్రభుత్వం మరో పదేళ్లు ఎన్నో ఇక్కట్లు, ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఖర్గే చేసిన ఘాటైన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. శక్తి పథకాన్ని కేవలం పునఃసమీక్ష చేస్తామని మాత్రమే డి.కె.శివకుమార్ చెప్పారని, రద్దు చేస్తామని అనలేదని వివరించారు. దీనిపై ఖర్గే బదులిస్తూ.. డి.కె.శికుమార్ మాట్లాడింది ఏదైనప్పటికీ బీజేపీ విమర్శలు చేయడానికి ఒక అవకాశం ఇచ్చారని తప్పుపట్టారు. వక్రీకరించారు: డి.కె.శక్తి పథకంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని డి.కె.శివకుమార్ చెప్పారు. పథకాన్ని రద్దు చేస్తా మని తాము ప్రకటించినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బస్సుల్లో ప్రయా ణానికి స్వచ్ఛందంగా చార్జీలు చెల్లించడానికి మహిళల్లో ఒక వర్గం సిద్ధంగా ఉందని మాత్రమే తాను అన్నానని ఉద్ఘాటించారు. చార్జీలు చెల్లించడానికి కొందరు మహిళలు ముందుకొచ్చినప్పటికీ తీసు కోవడానికి కండక్టర్లు భయపడుతున్నారని తాను చెప్పానని వివరించారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని ఉపసంహరించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. శక్తి పథకాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ధ్వజమెత్తారు. భావోద్వేగాలతో ఆడుకుంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే విపక్షాల పని అని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వ గ్యారంటీల మోడల్‌ను చూసి గర్వపడు తున్నామని డి.కె.శివకుమార్ చెప్పారు. -
భవనం కుప్పకూలి ఐదుగురు మృతి.. డిప్యూటీ సీఎం సీరియస్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు వణికించాయి. మంగళవారం కురుసిన కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తు భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు అయిదుగురు మృతి చెందారు.మరో ఏడుగురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 13 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో బీహార్‌కు చెందిన హర్మన్ (26), త్రిపాల్ (35), మహ్మద్ సాహిల్ (19), సత్యరాజు (25), శంకర్ ఉన్నారు.బెంగళూరు తూర్పు ప్రాంతంలోని హోరామావు అగరా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలిందదని, ప్రమాద సమయంలో భవనంలో దాదాపు 20 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాత్రి వరకు సహాయక చర్యలు ఆపేశారు. తిరిగి బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సహాయక చర్యల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తోపాటు డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు.A multi storey building collapsed with in seconds In Bengaluru. The building collapse killed one person with five people still missing. Fourteen workers have been rescued from the rubble at the construction site in Babusapalya. Building basement became weak due to continuous… pic.twitter.com/rM5dr5WVhf— V Chandramouli (@VChandramouli6) October 23, 2024భవనం కూలిన ప్రాంతాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సందర్శించారు. బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. అయితే భవన నిర్మాణం చట్టవిరుద్ధమని, దాని యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవనానికి అనుమతి ఇవ్వలేదని అధికారులు చెప్రనిరు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న యజమాని, కాంట్రాక్టర్, దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెంగళూరు వ్యాప్తంగా అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపేసేలా తాము అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్టర్, యజమాని, అధికారులు ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు.Rains and building collapse. This is in Anjanadri layout, near #HoramavuAgara 6 storey building under construction.. some workers are stuck inside sadly z pic.twitter.com/igamkHjA7L— HennurBlr (@HennurBlr) October 22, 2024 భవనం కూలిన ఘటనపై మాకు సమాచారం అందిన తర్వాత, అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ ఠాకూర్ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సమాచారం అందించామని, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు.. తమకు అందిన సమాచారం ప్రకారం ప్రమాద సమయంలో 21 మంది కూలీలు ఉన్నారని, రోజూ 26 మంది ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు. 60/40 ప్లాట్‌లో ఇంత పెద్ద భవనాన్ని నిర్మించడం నేరమని, మూడుసార్లు నోటీసులు జారీ చేశామని చెప్పారు. మరోవైపు రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దక్షిణ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యలు చేపట్టారు. బెంగళూరు నగరానికి నేడు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిటీలోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలని సూచించారు. -
సీఎం సిద్దరామయ్య అమాయకుడు: డీకే
బెంగళూరు: మైసూరు నగర అభివృద్ధి సంస్థ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణం వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు.కాగా ముడా భూముల కేటాయింపులో అవకతవకలపై సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చిన విసయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం పదవికి సిద్దూ రాజీనామా చేయాలని బీజేపీ పట్టుబడుతోంది. దీనిపై తాజాగా శివకుమార్ మాట్లాడుతూ.. సిద్దరామయ్య అమాయకుడని, ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అంతా సిఎం సిద్దరామయ్య వెంట ఉన్నారన్నారు. ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చట్టమే ముఖ్యమంత్రిని కాపాడుతుందని, ముఖ్యమంత్రి తప్పు చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఇది పూర్తిగా బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. మరోవైపు తాను ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అది హైకమాండ్ నిర్ణయమని తెలిపారు.ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసినట్లు డీకే వెల్లడించారు.. సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేయాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన అంశంలో జోక్యం చేసుకోని, ఆ ఆర్డర్‌ను వెనక్కి తీసుకునేలా గవర్నర్‌తో మాట్లాడాలని రాష్ట్రపతి ముర్మును కోరినట్లు తెలిపారు.కాగా గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు నిలిపివేయాలంటూ.. సీఎం సిద్దరామయ్య సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్ట్ 29వ తేదీ వరకు ఈ కేసులో సీఎం సిద్దరామయ్యను ఎటువంటి ప్రాసిక్యూషన్ చేయవద్దంటూ కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో సిఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఊరట లభించినట్లు అయింది. -
కర్ణాటక: రామనగర జిల్లా ఇక బెంగళూరు సౌత్
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ శుక్రవారం(జులై 26) కీలక నిర్ణయం తీసుకుంది. రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చారు. పేరు మార్పు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించినట్లు న్యాయ, శాసనసభా వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు.రామనగర జిల్లాలోని మాగడి, కనకాపుర, చెన్నపట్న,హరోహల్లి తాలూకాలు బ్రాండ్ బెంగళూరు వినయోగించుకోవడం కోసమే పేరు మార్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ పేరు మార్పు ఉంటుందని రామనగర జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత ఏడాదే వెల్లడించారు. జిల్లా పేరు మార్చాలని డీకే శివకుమార్ నేతృత్వంలో రామనగర జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఇప్పటికే వినతి పత్రం సమర్పించారు. -
కర్ణాటకలో మద్యం పంపిణీ వివాదం: ‘ఇది బీజేపీ కల్చర్’
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ కే సుధాకర్ మద్దతుదారులు ఆయన ఎన్నికల్లో గెలిచినందుకు విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసుల చేత బహిరంగంగా మద్యం పంపిణీ చేయించటం తాజాగా వివాదాస్పదం అయింది. దీంతో ఎంపీ సుధాకర్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.‘‘బీజేపీ ఎంపీ విజయోత్సవ కార్యక్రమంలో బహిరంగంగా మద్యం పంపిణీ చేయటంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టత ఇవ్వాలి. అయితే ఈ వ్యవహారంలో స్థానిక నేతలు సమాధానం ఇవ్వటం కాదు.. జాతీయ అధ్యకక్షుడే స్పష్టత ఇవ్వాలి. ఇది బీజేపీ బీజేపీ కల్చర్’’ అని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ కింద ప్రభుత్వం ఈవ్యవహారంలో ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. చర్యలు తీసుకోవటం అనేది తర్వాత అంశం. ముందు బీజేపీ పార్టీ ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని అన్నారు.చిక్కబళ్లాపూర్‌లో నిర్వహించిన బీజేపీ ఎంపీ సుధాకర్ విజయోత్సవ కార్యక్రమంలో పోలీసు మద్యం పంచిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ కార్యక్రమం గురించి సదరు ఎంపీ పోలీసులకు మందుగానే లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఆహారం, మద్యం పంచటంలో సాయం అందించాలని ఆయన ఆ లేఖలో పేర్కొనటం గమనార్హం. అయితే ఇలాంటి కార్యక్రమానికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు. అదీకాక పోలీసులే మద్యం పంచటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.మద్యం పంపిణీ వ్యవహారం వివాదం రేపటంతో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సీఎన్ అశ్వనాథ్ నారాయణ్ స్పందించారు. ‘ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించకముందే మేము ఎవరీని నిందించలేము. ఇటువంటి వ్యవస్థ ఉన్నందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ కార్యక్రమంలో తప్పు జరిగిందని భావిస్తే.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సుధాకర్ గెలుపొందారు. సుమారు 1.6 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎస్ రక్షా రామయ్య ఓడించారు. -
నోరు మూసుకుంటే మంచిది
శివాజీనగర: ముఖ్యమంత్రి మార్పు, డిప్యూటీ సీఎం స్థానాల గురించి పార్టీ నాయకులు ఎవరూ బహిరంగంగా మాట్లాడరాదు. నోటికి తాళాలు వేసుకోవాలి. లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ ఘాటుగా హెచ్చరించారు. పార్టీకి మంచి కోసం దీనిని పాటించాలి. మాట్లాడితే నోటీస్ ఇచ్చి, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అని డీకే హెచ్చరించారు. మరిన్ని డిప్యూటీ సీఎం పదవులు కావాలని కొందరు మంత్రులు, నాయకులు పదేపదే కోరడం వల్ల రభస సాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం బెంగళూరులోని సదాశివనగరలో నివాసంలో విలేకరులతో మాట్లాడిన డీకే పై మేరకు హెచ్చరించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ఎంత కష్టపడ్డామనేది అందరికి తెలుసు. చంద్రశేఖరనాథ స్వామి నాపై అభిమానంలో సీఎం పదవిని ఇవ్వాలని అన్నారు, ఎవరూ ఈ విధంగా మాట్లాడకూడదు. నేను సీఎం కావడానికి ఎవరి సిఫార్సు వద్దు. హైకమాండ్ తీర్మానం చేస్తుంది అని చెప్పారు. అందరు స్వామీజీలకు చేతులెత్తి మొక్కి విన్నవిస్తున్నా, మా రాజకీయాల్లోకి రావద్దు అని కోరారు. మీకు అంత అభిమానం ఉంటే మనస్సులోనే ఆశీర్వదించాలని అన్నారు.అసంతృప్తిలో సీఎం సిద్దుడీకేకి సీఎం పదవిని వదిలేయాలని స్వామీజీ చెప్పడంపై సీఎం సిద్దరామయ్య కినుకతో ఉన్నారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో శుక్రవారం సన్నిహిత మంత్రులు కే.జే.జార్జ్, పరమేశ్వర్‌తో కలసి లిఫ్ట్‌లో వెళ్తూ, స్వామీజీలకు ఎవరో చెప్పించి ఈ విధంగా మాట్లాడించారని సీఎం అన్న ఆడియో వైరల్ అయ్యింది. -
లోక్‌సభ ఫలితాలు కాంగ్రెస్‌కు వార్నింగ్ బెల్స్: డీకే శివకుమార్
బెంగళూరు: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. కర్ణాటకలో లోక్‌సభ ఫలితాలు కాంగ్రెస్‌కు వార్నింగ్ బెల్గా అభివర్ణించారు. కుమారకృపాలోని తన అధికారిక నివాసంలో శివకుమార్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకొని అవసరమైన దిద్దుబాట్లు చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. లోక్‌సభ ఫలితాలు కాంగ్రెస్‌కు ఓ వార్నింగ్ బెల్ లాంటివని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉనన నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాల నిర్వహణ చేస్తామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తిగా ఉన్నాడని విలేఖరులు ప్రశ్నించగా.. రాష్ట్రంలో 14, 15 సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నామని అయితే ఆ సంఖ్యను సాధించడంలో విఫలమయ్యామని తెలిపారు. ప్రజల తీర్పును తాము అంగీకరిస్తున్నామని అన్నారు. పార్టీ నేతలు చాలా వరకు వారి స్వంత గ్రామాలు,పట్టణాల నుంచి ఓట్లు రాబట్టుకోలేదని తెలిపారు.కొంతమంది మంత్రుల ఓటమికి ఎమ్మెల్యేలపై నిందలు వేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంలో ప్రయోజనం లేదు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకులు పార్టీ కార్యకర్తలతో మాట్లాడాలి. ఓటమికి గల కారణాలను విశ్లేషించాలి. దానిని అధిగమించాలన్నారు. ఎమ్మెల్యేలు అనవసరంగా బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగ చేసిన ప్రకటనను శివకుమార్ ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కూర్చుని సమస్యపై చర్చించుకోవాలని ఆయన సూచించారు.కాగా 28 లోక్‌సభ స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. బీజేపీ 17 చోట్ల విజయం సాధించింది. జేడీయూ రెండు స్థానాలను గెలుచుకుంది. అటు దేశ వ్యాప్తంగానూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారధ్యంలోని విపక్ష ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంలోనే ఆగిపోయింది. బీజేపీ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సొంతంగా సాధించలేకపోవడంతో ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. -
పరువు నష్టం కేసులో సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు బెయిల్
బెంగళూరు: ప్రజా ప్రతినిధుల కోర్టులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివుకుమార్‌లకు ఊరట లభించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశవ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి వీళ్లిద్దరికి ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. కాగా గత బీజేపీ ప్రభుత్వం అన్నీ పనుల్లో 40 శాతం కమీషన్ వసూలు చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్లలో ప్రకటనలు ఇచ్చింది. ‘40 శాతం కమీషన్ ప్రభుత్వం’ పేర్కొంటూ పూర్తి పేజీ ప్రకటన ప్రచురించింది. వివిధ పనుల కోసం గత సర్కార్ అవినీతి రేటు కార్డులు నిర్ణయించిందంటూ ఆరోపిస్తూ పోస్టర్లను కూడా ముద్రించింది.అయితే అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని బీజేపీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు సిద్దరామయ్య, శివకుమార్‌తోపాటు రాహుల్ గాంధీలపై బీజేపీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై నేడు విచారణ సందర్భంగాసిద్ధరామయ్య, శివకుమార్ 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. అనంతరం సిద్దరామయ్య,, శివకుమార్‌లకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. -
‘నన్ను టార్గెట్ చేస్తున్నారు’.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వం, తనపై కొందరు తాంత్రిక పూజలు జరుపుతున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ కాంగ్రెస్ ప్రభుత్వం, నాపై కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో, ఎప్పటి నుంచి ఆ పూజలు చేస్తున్నారలో నాకు తెలుస్తునే ఉంది. ఈ పూజలను కొందరు నాతో పాటు సీఎం సిద్ధరామయ్యపై కూడా చేయిస్తున్నారు. కేరళలోని రాజ రాజేశ్వరీ ఆలయంలో శత్రువులను తొలగించటం కోసం కొందరు ‘‘శత్రు భైరవీ యాగం’’ (అగ్నిబలి) పేరిట పూజలు చేస్తున్నారు. పంచబలి(ఐదు వస్తువులను బలి ఇవ్వటం) చేస్తున్నారు. దీని కోసం ఎర్రమేక, 21 బర్రెలు, మూడు నల్ల మేకలు, ఐదు పందులను బలి ఇచ్చారు. దీని ఫలితంగా అగ్ని బలి జరుగుతుంది. ఫలితంగా శత్రువులు తొలిగిపోతారని నమ్మకం ఉంది’’ అని డీకే శివ కుమార్ అన్నారు.ఈ పూజలు ఇంకా కొనసాగుతున్నాయని డీకే తెలిపారు. ఆ పూజలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుతోందని అన్నారు. అయితే ఈ పూజలు ఎవరూ జరిపిస్తున్నారన్న విషయాన్నిమాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, ఓ ప్రతిపక్ష నాయకుడి ఆదేశాల మేరకు ఈ తాంత్రిక పూజులు జరుగుతున్నాయని తెలిపారు.‘‘అలా చేయటం వారి నమ్మకం. దాన్ని వారికే వదిలేస్తున్నా. వారు ఏం చేయాలకుంటే అది చేసుకోవచ్చు. వాళ్ల పూజల నుంచి మమ్మల్ని రక్షించే శక్తి మా వెంటే ఉంది’’ అని డీకే శివకుమార్ అన్నారు. -
పొలిటికల్ ఎంట్రీపై డీకేశివకుమార్ కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు: రాజకీయ రంగ ప్రవేశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య స్పందించారు. లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో భాగంగా ఐశ్వర్య శుక్రవారం(ఏప్రిల్26) బెంగళూరులో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు ఐశ్వర్య. ‘నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదు. నేను విద్యాసంస్థలు నడుపుతున్నాను. దేశం గర్వపడేలా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు వారి వారి రంగాల్లో పనిచేయాలి.బెంగళూరు రూరల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన బాబాయి డీకే సురేష్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. కాగా, 2019 ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచింది డీకే సురేష్ ఒక్కరే కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 ఎంపీ సీట్లలో బీజేపీ ఏకంగా 25 సీట్లు గెలుచుకుంది. -
ఈసారి నాన్న.. సత్తా చాటేనా?
రాష్ట్రంలో హై ఓల్టేజ్ ఎంపీ సీట్లలో ఒకటిగా మండ్య ఎప్పుడూ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఇక్కడ పోటీ రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. సాదా సీదా నియోజకవర్గాలకు భిన్నంగా ఇక్కడ జరిగే ఎన్నికలు.. రాజకీయాలను వేడెక్కిస్తాయన్నది నిజం. పోటీదారులు, కులం, పార్టీ తదితర అంశాలు ఎన్నికలను కుతూహలంగా మారుస్తాయి. ఈసారి జేడీఎస్ మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి పెద్దగా రాజకీయ చరిత్ర లేని స్టార్ చంద్రు తలపడుతున్నారు. కర్ణాటక: మండ్య ఎంపీ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి వెంకట రమణ గౌడ అలియాస్ స్టార్ చంద్రు నామినేషన్లు ముగించి ప్రచారంలో ముందున్నారు. ఎవరు విజయం సాధిస్తారు అనేది ఉత్కంఠ నెలకొంది. గత పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ చేతిలో జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి దారుణంగా ఓడిపోయారు. దీంతో కొడుకు స్థానంలో తండ్రి రంగం మీదకు వచ్చారు. ఈసారి బీజేపీ బలం ఉండడంతో కుమారస్వామి ఉత్సాహంగా ఉన్నారు. మండ్యలో గెలిచి జేడీఎస్ జెండాను ఎగరేయాలి అన్నది ఏకై క అజెండాగా పెట్టుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎన్. చెలువరాయస్వామి, కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇద్దరూ స్థానికేతరులే కుమారస్వామి, స్టార్ చంద్రు ఇద్దరూ మండ్యలో స్థానికులు కాదు, బెంగళురు నగరానికి చెందిన వారు కావడం విశేషం. స్టార్ చంద్రు బెంగళూరులో వ్యాపారవేత్త. కాంగ్రెస్ నాయకులు ఆయనను ఏరికోరి దళపతి కుటుంబానికి వ్యతిరేకంగా నిలబెట్టారు. స్టార్ చంద్రు గెలుపుని మంత్రి చెలువరాయస్వామి భుజాలకెత్తుకున్నారు. జేడీఎస్‌లో అసమ్మతితో ఉన్న వారిని కాంగ్రెస్‌లోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి ప్రచారం ఎలా.. ప్రస్తుత ఎంపీ సుమలత అంబరీష్ ఇటీవలే బీజేపీలో చేరి కుమారకు మద్దతు పలికారు. కానీ అధికార కాంగ్రెస్ అంత తేలికగా తీసుకోవడం లేదు. ఈ నెల 17న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో మండ్యలో ప్రచార సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ అభ్యర్థి పూర్తిగా ఐదు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు, తాను గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు వస్తాయని ప్రజలకు చెబుతున్నారు. కుమారస్వామి నరేంద్రమోదీ పథకాలు, జిల్లా అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. జిల్లాలో మైనారిటీలు, దళితులు, కురుబ, ఒక్కళిగ సముదాయం ఓటర్లు అధికం. కాంగ్రెస్ మూడు వర్గాలను నమ్ముకుంటే, జేడీఎస్ ఒక వర్గాన్ని నమ్ముకుంది. కుమారకు పాత బలం గతంలో మండ్య జిల్లాలో ఎక్కువగా జేడీఎస్ ఎమ్మెల్యేలే ఉండేవారు. ఆ నాయకులు కుమారస్వామి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇతర సీనియర్లు చంద్రుకు మద్దతుగా ఉన్నారు. పోలింగ్‌కు ఇంకో 9 రోజులు ఉంది. జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది తేలాల్సి ఉంది. -
అందుకే వాళ్లు మా పార్టీ నుంచి వెళ్లిపోయారు..కేసీ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం : సీనియర్ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందిన వెంటనే కొందరు నేతలు పార్టీ నుంచి వైదొలిగి, ‘బీజేపీ, కేంద్ర ప్రభుత్వ కాళ్లపై పడ్డారు’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. కేరళ కాంగ్రెస్ ఆలప్పుళ లోక్‌సభ అభ్యర్ధి కేసీ వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీ వేణుగోపాల్ తరుపున ప్రచారం చేసేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం హాజరయ్యారు. ప్రచారంలో భాగంగా కేసీ వేణుగోపాల్ డీకే శివకుమార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్‌ను అన్యాయంగా బీజేపీ, దర్యాప్తు సంస్థలు పలురు నేతల్ని లేఖలతో బెదిరిస్తున్నాయని ఆరోపించారు. అయినప్పటికీ డీకే శివకుమార్‌లాంటి గట్స్ ఉన్న నేతలు బీజేపీ,ప్రభుత్వ ఏజెన్సీల ఒత్తిడిలకు తలొగ్గలేదని కొనియాడారు. కారణం లేకుండా కేంద్ర ఏజెన్సీలు డీకే శివకుమార్‌ను అన్యాయంగా జైలుకు పంపాయని, అయినప్పటికీ ధైర్యంగా పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. ఎంతోమంది నేతలు పార్టీని వీడే సమయంలో దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నోటీసులకు బయపడి బీజేపీకి సరెండర్ అవుతున్నారన్న ఆయన.. డీకే మాత్రం తన తల్లిలాంటి కాంగ్రెస్‌ను వదల్లేదని తెలిపారు. ధైర్యంగా ఎదుర్కొని కారణం లేకుండానే శివకుమార్ తీహార్ జైలుకు వెళ్లారు. ఆ సమయంలో కొందరు కాంగ్రెస్ పార్టీని వీడాలని ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. పార్టీని వదిలేస్తే జైలు జీవితం నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. ఆ చెప్పింది ఎవరో నాకు బాగా తెలుసు. కానీ శివకుమార్ కాంగ్రెస్ తనకు తల్లిలాంటిదని, పార్టీని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. -
Bengaluru Water Crisis: మా ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయింది: నీటి కొరతపై డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును నీటి సంక్షోభం వేధిస్తోంది. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కొరత నగర వాసులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కుళాయిలు, బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో నీటి ఎద్దడిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. నగరంలో రోజురోజుకీ నీటి కొరత తీవ్రతర అవుతుందని, దాదాపు 3000 పైగా బోరు బావులు ఎండిపోయాయని తెలిపారు.తన ఇంటి వద్ద ఉన్న బోరు బావి కూడా ఎండిపోయిందని తెలిపారు. నీటి సమస్యను తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి, ట్యాంకర్ల ద్వారా సరాఫరా చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తామని తెలిపారు. నగరంలో నీటి కొరతకను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోనీ బీజేపీ కూడా కారణమేనంటూ శివకుమార్ విమర్శించారు. చదవండి: అమేథీ నుంచే లోక్‌సభ ఎన్నికల బరిలోకి రాహుల్ గాంధీ? బెంగుళురుకు మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు తాము శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ఈ ప్రాజెక్టు అనుమతులు ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. కరవు పరిస్థితులతో తాగునీటి కొరత గ్రామాలనే కాకుండా, సిలికాన్ సిటీలో, అందులోనూ సీఎం అధికార నివాసం కృష్ణను కూడా పీడిస్తోంది. నగరంలో తాగునీటి సరఫరా అరకొరగా ఉంది. దీంతో సీఎం నివాసానికి జలమండలి కొళాయిల నుంచి నీరు రావడం లేదు. అధికారులు హడావుడిగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మార్చి మొదటి వారమే ఇలా ఉంటే ఏప్రిల్, మే మాసాల్లో నీటి ఎద్దడి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు భారీ ఊరట
న్యూఢిల్లీ: కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2018లో శివకుమార్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ఈ కేసులో ఆయనపై విచారణను నిలిపివేయాలని ఈడీని సుప్రీం ఆదేశించింది. డీకే నుంచి రికవరీ చేసిన నగదు మూలాన్ని కనుగొనడంలో దర్యాప్తు సంస్థ విఫలమయ్యిందని పేర్కొంటూ జస్టిస్ అనిరుధ్ బోస్, బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. 2017లో డీకేతోపాటు అతని సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ సోదాల్లో దాదాపు రూ. 300 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఈ కేసును ఈడీ తన ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు చేపట్టింది. 2018లో డీకేపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2019లో అతన్ని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అయితే ఆ తర్వాత నెల రోజులకే ఢిల్లీ హైకోర్టు శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ రాజకీయ కక్ష్యకు పాల్పడుతోందని, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని గతంలో శివకుమార్ పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ నేత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని కోరారు. అక్కడ ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. చదవండి: ఎలక్టోరల్ బాండ్లు: మోదీ సర్కారుపై ఖర్గే సంచలన ఆరోపణలు -
ఐదేళ్లూ కుర్చీ.. మడత పేచీ
బనశంకరి: అధికార హస్తం పార్టీలో తరచూ ఏదో ఒక వివాదం పుట్టుకొస్తోంది. డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని మాగడి కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ.బాలకృష్ణ డిమాండ్ చేయడం, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధిక సీట్లు గెలిస్తే సీఎం సిద్దరామయ్యే పూర్తికాలం సీఎంగా ఉంటారని ఆయన కుమారుడు యతీంద్ర ప్రకటించడంతో అధికార పార్టీలో వేడి రగుల్కొంది. ఇది ప్రతిపక్షాలకు కూడా విమర్శలకు అవకాశమిచ్చింది. సీఎం పదవిని తలా రెండున్నరేళ్లు పంచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్లు సర్కారు ఏర్పాటు సమయంలో జోరుగా ప్రచారం సాగింది. కానీ సీఎం, డీసీఎంల అనుచర ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు విరుద్ధమైన ప్రకటనలు చేయడం చర్చనీయాంశమవుతోంది. హైకమాండ్ పదే పదే చెప్పినా.. సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఎవరూ చర్చించరాదని, గ్యారంటీ పథకాల అమలు, లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా హైకమాండ్ పెద్దలు పదేపదే హెచ్చరికలు జారీచేస్తున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు నోటికి పనిచెబుతూనే ఉన్నారు. మంగళవారం యతీంద్ర చేసిన ప్రకటన మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది. ఆయన ప్రకటనపై మంత్రులు, సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు. యతీంద్రవి వ్యక్తిగత వ్యాఖ్యలని, దీనికి పార్టీకి సంబంధం లేదని చాలామంది తప్పించుకున్నారు. కానీ బీజేపీ నేతలు హస్తంలో లుకలుకలు తీవ్రమైనట్లు ఆరోపణలు గుప్పించారు. డీకేశిని చూస్తే జాలేస్తోంది: సింహా మైసూరు: సీఎం కుర్చీలో పూర్తికాలం పాటు కొనసాగాలని సీఎం సిద్ధరామయ్య పథకమేశారని, డిప్యూటీ సీఎం డీకేశిని చూస్తే పాపమనిపిస్తోందని ఎంపీ ప్రతాప సింహా ఎద్దేవా చేశారు. బుధవారం మైసూరులో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికసీట్లు గెలిస్తే మా నాన్న పూర్తి కాలం సీఎంగా ఉంటారని యతీంద్ర చేసిన వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తరువాత సీఎం కావాలని కలలు కంటున్న డీకే శివకుమార్‌ను ఇప్పుడు తలుచుకుంటే జాలి వేస్తోందని వ్యంగ్యమాడారు. డీకే సీఎం అవుతారని ఆయన వర్గీయులు ఓట్లు వేశారని, అయితే వారందరికీ మోసం జరిగిందని అన్నారు. సిద్ధరామయ్య అందరి మధ్య గొడవలు పెట్టి పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగాలని చూస్తున్నారని విమర్శించారు. కోలారులో రాముని ఫ్లెక్సీని దుండగులు చింపేయడంపై ఎంపీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ హయాంలో రామునికి గౌరవం దక్కదని ఆరోపించారు. యతీంద్ర పదవీ బాధ్యత లేని నేత, తమ నాయకునికి శక్తి ఇవ్వాలని ప్రజలను అడగడంలో తప్పుపట్టే పని లేదని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు. మా నాన్న ఐదేళ్లూ సీఎం ఉండాలనేలా యతీంద్ర మాట్లాడడాన్ని బుధవారం కుమారకృప వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా డీకే మాట్లాడారు. తమ ప్రభుత్వం కొనసాగుతుందని, సిద్దరామయ్య తమ ముఖ్యమంత్రి అన్నారు. సిద్దరామయ్య సీఎంగా, నేను కేపీసీసీ అధ్యక్షునిగా ఇద్దరూ కలిసి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. అందులో ఎలాంటి అనుమానం లేదని, ఆశపడటం, శక్తి ఇవ్వాలని ప్రజలను అడగడంలో తప్పులేదు, నేను కూడా మా ప్రజలను ఇలాగే అడుగుతానంటూ వివాదాన్ని సద్దుమణిగేలా మాట్లాడారు. -
డిఫెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ..!
ఎంతో చరిత్ర కల్గిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పొలిటికల్ డిఫెన్స్‌లో పడింది. ప్రస్తుతం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్ అయోమయంలో పడింది. ప్రధానంగా చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందాలపై వస్తున్న విమర్శలతో కాంగ్రెస్ పార్టీ రక్షణాత్మక ధోరణితో ముందుకెళ్తోంది. ఇటీవల బెంగళూరులో చంద్రబాబుతో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ మంతనాలు జరపడంతో కాంగ్రెస్ పార్టీ అందుకు వివరణలు ఇచ్చుకోవడమే ఇందుకు ఉదాహరణ. ‘మతతత్వ బీజేపీతో మాది రాజీలేని పోరాటం. టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. బీజేపీతో కలిసి నడుస్తోంది వైసీపీ. ఏపీలో ఈ నాలుగు పార్టీలకు వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి పార్టీలతో కలిసి పోరాడుతాం’ అని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ వివరణ ఇచ్చుకున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో చంద్రబాబు సహకారం అందించగా, కాంగ్రెస్‌ను గెలిపించేందుకు తెలంగాణ బరిలో టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు పోటీకి పెట్టలేదు. దీన్ని సాకుగా చూపుతూ చంద్రబాబు.. తెలంగాణలో తాను చేసిన సాయానికి బదులుగా ఏపీలో సాయం చేయాలని శివకుమార్‌ను కోరారు. చంద్రబాబు అభ్యర్థనల మేరకు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను తీసుకున్నారు డీకే శివకుమార్, తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో ప్రకటించిన షర్మిల.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఏపీలో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించేందుకు రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. సామాజిక వర్గాలు ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థులను తెలుగుదేశంకు అనుకూలంగా బరిలో దించేందుకు అధిష్టానం ఏర్పాట్లు చేస్తోంది. -
తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ?..కాంగ్రెస్ లో కాన్ఫిడెన్స్..
-
టీ కాంగ్రెస్ బిగ్‌ప్లాన్.. అంతా ఆయన చేతుల్లోనే!
సాక్షి, హైదరాబాద్: డీకే శివకుమార్.. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయాల్లో, అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా ఎక్కువగా వినిపించే పేరు. నెగ్గిన అభ్యర్థుల్ని జంప్ కాకుండా.. సంక్షోభ సమయాల్లో పార్టీ ఎమ్మెల్యేలను ఏకతాటిపై ఉంచడంలో ఈయన ఎక్స్పర్ట్. అందుకే పాలిటిక్స్‌లో ట్రబుల్ షూటర్ అనే పేరొచ్చింది ఆయనకి. క్లిష్టపరిస్థితుల్లో పార్టీని ఆదుకునే డీకేఎస్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కట్టబెట్టిన విజయం కాంగ్రెస్‌కు మరువలేనిది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. కాంగ్రెస్ అధిష్టానం ఆయన సేవల్ని మళ్లీ వినియోగించుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీకేఎస్‌ను నమ్ముకుంది. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి ప్రచారంలో పాల్గొన్నారాయన. కర్ణాటక సంక్షేమ రిఫరెన్స్‌తో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ఇప్పుడు.. రేపు ఫలితాల సమయంలో ఆయన ఇక్కడే మకాం వేసి చక్రం తిప్పబోతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు అటు ఇటుగా ఫలితాలు ఉంటే.. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బాధ్యత ఆయన చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణ ఫలితాలు వెలువడ్డాక.. ఆ నెగ్గిన వాళ్లను బెంగళూరుకు తరలిస్తారనే ప్రచారం ఒకటి తొలుత నడిచింది. అయితే ఆ ఊహాగానాల్ని స్వయంగా డీకేఎస్ కొట్టిపారేశారు. ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించబోమని.. ఆ అవసరం లేదని అన్నారాయన. అలాగే.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతుండగా.. అంతకు ఒక్కరోజు ముందే ఆయన హైదరాబాద్‌లో ల్యాండ్ కానున్నారు. కాంగ్రెస్ బిగ్‌ప్లాన్ ఫలితాల రోజున తెలంగాణ కాంగ్రెస్ బిగ్‌ప్లాన్ అమలు చేయబోతోంది. ఏఐసీసీ ప్రతీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడ్ని నియమించింది. సదరు అభ్యర్థి నెగ్గాక.. ఎమ్మెల్యే సర్టిఫికెట్తో ఆ పరిశీలకుడు నేరుగా హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌కు తీసుకొస్తారు. అక్కడ డీకేఎస్ సమక్షంలోనే వాళ్లు ఉండనున్నారు. ఒకవేళ సంపూర్ణ మెజారిటీ వచ్చినా కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని డీకేఎస్ భావిస్తున్నారట. ఎమ్మెల్యేలను ఎట్టిపరిస్థితుల్లో ప్రలోభాలకు గురి కాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడే ఆయన స్వయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. మేం ఎలాంటి క్యాంపు రాజకీయాలు పెట్టడం లేదు. కొంత మంది మా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మాకు సమాచారం ఉంది. కానీ, మా వాళ్లు పార్టీకి విధేయులు. లొంగరు..’’ డీకేఎస్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇదీ చదవండి: ఆగమెందుకు.. మళ్లీ మనమే -
తెలంగాణ ఫలితాలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు!
బెంగళూరు : తెలంగాణ,మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఈ విషయమై ఆయన మాట్లాడారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టులకు తరలించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని వారంతా పార్టీకి విధేయులని తెలిపారు. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ను తాను నమ్మనని, తాను సొంత పోస్ట్ పోల్ సర్వేలు చేయిస్తానని డీకే చెప్పారు. తన సొంత సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద వేవ్ ఉందన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పవర్లోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలకు టచ్‌లోకి వచ్చారని చెప్పారు. అయితే కాంగ్రెస్ నేతలను కేసీఆర్ లాక్కోవడం ఈసారి కుదరదని తేల్చిచెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి డీకే శివకుమార్ ముఖ్య కారణమన్న విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ హై కమాండ్ డీకేకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను కూడా పరోక్షంగా అప్పగించింది. దీంతో ఆయన ఇటీవలే ముగిసిన తెలంగాణ ఎన్నికలపై ఎక్కువే ఫోకస్ చేశారు. తెలంగాణకు వచ్చి చాలా చోట్ల ప్రచారం కూడా చేశారు. తెలంగాణలో గెలిచే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు బెంగళూరు తరలిస్తారన్న ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. ఇదీచదవండి..హాట్ వింటర్పై ఐఎండీ కీలక అప్డేట్ ! -
సీఎం కావాలనే తొందరేమీ లేదు..!
నేనే ఇంకో పదేళ్లు కర్ణాటక సీఎం- సిద్ధరామయ్య -
కర్ణాటక నుంచి వచ్చి మనకు సుద్దులు చెబుతున్నారు: సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి(డీకే శివకుమార్) వచ్చి మనకు సుద్దులుచెబుతున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మా దగ్గర 5 గంటల కరెంట్ ఇస్తున్నాం, వచ్చి చూడమని చెప్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందని పేర్కొన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారా? అని ప్రశ్నించారు. దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. దళితుల అభివృద్ధి గురించి గత ప్రభుత్వాలు ఏనాడైనా ఆలోచించాయా? అని ప్రశ్నించారు. నెహ్రూ ప్రధాని అయిన రోజే దళితుల అభివృద్ధికి కృషి చేస్తే బతుకులు మారేవని పేర్కొన్నారు. తెలంగాణలో కులవృత్తులకు జీవం పోశామని చెప్పారు. త్వరలో దేవాదుల ప్రాజెక్టు నుంచి నీరు అందిస్తామని, బునదిగాని కాల్వ వెడల్పు చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. ‘తుంగతుర్తిని చూస్తే తృప్తిగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యామాని లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. ఎన్నికలు రాగానే కొందరు ఓట్ల కోసం వస్తారు. ఎవరెన్ని చెప్పినా మీరు ఆలోచించి ఓటు వేయండి. గాదారి కిషోర్‌ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే తుంగతుర్తి యోజకవర్గానికి మొత్తానికి దళితబంధు ఇస్తాం. భయంకరమైన ఉద్యమంతో తెలంగాణ వచ్చింది. సంక్షేమ పథకాలు, పెన్షన్లు తమాషాకు ఇవ్వడం లేదు. పేదల కోసం ఆలోచించి రూ. వెయ్యితో పెన్షన్ ప్రారంభించుకున్నాం. చదవండి: సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే దశలవారీగా కళ్యాణలక్ష్మీ, పెన్షన్‌ను పెంచుకున్నాం. రైతు బంధును ఎమ్ఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. యూపీ, బిహార్ నుంచి వరినాట్లు వేయడానికి వస్తున్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ గోడలపై రాతలు కన్పించేవి. బస్మాపూర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు రాబోతున్నాయి. సుమారు రెండు లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయి తెలంగాణకు ముందు ఎవరైనా మాట్లాడితే నక్సలైట్ ముద్రేసి జైల్లో వేసేవారు. మనతో పొత్తు పట్టుకొని కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. 14 ఏళ్లు మనల్ని గోస పెట్టుకుంది. చెరుకు సధాకర్‌ను జైల్లో వేశారు. ప్రాణాలను బలి తీసుకొని తెలంగాణ ఇచ్చారు. ఆనాడు చెంచాగరి చేసినోళ్లు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తాం అంటున్నారు. అది ఎంత ప్రమాదమో ఆలోచన చేయాలి ధరణి రావడం వల్ల అవినీతి అంతం అయింది. ధరణి రద్దు అయితే అవినీతి రాజ్యం వస్తుంది. మళ్ళీ కొట్లాటలు వస్తాయి. రైతు బంధు కూడా రాదు. ధరణి రైతులకు గుండె కాయ లాంటిది. రైతు బంధు వృధా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
డీకే శివకుమార్‌కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కౌంటరిచ్చారు. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా? అంటూ ప్రశ్నలు సంధించారు. కాగా, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. ‘డీకే గారు.. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది మీ చేతకానితనానికి నిదర్శనం. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే.. ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా.. ? ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఎన్నికల ప్రచారంలో ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు.. చార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయింది. కనీసం ఐదుగంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతాంగమే కాదు.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్లతో వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మీ అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కింది. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన మీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు. రేషన్‌పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసిని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారింది. సబ్ స్టేషన్ల వద్ద మొసళ్లతో నిరసనలు.. కరెంట్ కోసం పురుగుల మందు తాగి రైతుల ఆత్మహత్య ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ ఘోర పరిపాలనా వైఫల్యాలకు సజీవ సాక్ష్యాలు. మహిళల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్న మీ గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టింది. ప్రతీ ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానన్న ప్రధాని హామీలాగే మీ హామీ కూడా గంగలో కలిసిపోయింది. కర్ణాటకలో అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు తెర తీసిన కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతోంది. కర్ణాటకలో సకల రంగాల్లో సంక్షోభానికి తెరతీసిన కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవడానికి మా ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డ’ అని కామెంట్స్ చేశారు. డీకే గారు... కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి... కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది… — KTR (@KTRBRS) October 29, 2023 -
డీకే శివకుమార్ వెంట 70 మంది ఎమ్మెల్యేలు..!
అధికార కాంగ్రెస్‌లో ఓ విధమైన వేడి అలముకొంది. ఒకవైపు ఎమ్మెల్యేలను కూడగట్టి సర్కారును పడదోయాలని ప్రతిపక్ష బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపణలు. మరోవైపు తమ నాయకుడు డీకే శివకుమారే, రెండున్నరేళ్ల కాలానికి ఆయనే సీఎం అని కొందరు ఎమ్మెల్యేలు గళమెత్తారు. ఈ రెండింటిని ఎలా ఎదుర్కోవాలా అని సీఎం సిద్దరామయ్య తన సన్నిహిత మంత్రులతో హోంమంత్రి ఇంట్లో మంతనాలు జరిపారు. కర్ణాటక: బెంగళూరులో హోం మంత్రి జీ.పరమేశ్వర్ ఇంటిలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కొందరు మంత్రులు విందు సమావేశం కావడం రాజకీయంగా కుతూహలానికి కారణమైంది. సీఎం సిద్దరామయ్య, జీ.పరమేశ్వర్, ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి, సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్.సీ.మహాదేవప్పలు విందు భేటీ జరిపారు. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేకపోవడం ఆయన వర్గాన్ని అసంతృప్తికి గురిచేస్తోంది. రాష్ట్ర సర్కారును పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు, అలాగే డీకే శివకుమార్ సీఎం కావాలని పలువురు ఎమ్మెల్యేల డిమాండ్లు ఇందులో చర్చకు వచ్చినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పోస్టులు తమకూ కావాలని సతీశ్ జార్కిహొళి, పరమేశ్వర్లు అప్పుడప్పుడు చెబుతున్నారు. సర్కారు ఏర్పడి ఇంకా ఆరు నెలలే అయ్యింది. ఇంతలోనే అస్థిరత ఏర్పడినట్లు వదంతులు చెలరేగుతున్నాయి. వాటితో పాటు కాంగ్రెస్‌లోని గందరగోళాలకు తెర దించేందుకు సీఎం, మంత్రులు చర్చించారని తెలిసింది. కాగా, సీఎం స్పందిస్తూ, ఈ విందులో ఎలాంటి రాజకీయ చర్చ జరుపలేదు. పరమేశ్వర్ భోజనానికి ఆహా్వనిస్తే, వెళ్లాం. దీనికి రాజకీయ రంగును పూయవద్దు అన్నారు. పరమేశ్వర్ కూడా ఇదే మాటలు చెప్పడం గమనార్హం. బీజేపీ కుట్రలు ఫలించవు: డీకేశి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ జరిపే ప్రయత్నాలు ఫలించవని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్‌కు వెళ్లేముందు ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ జరుపుతున్న కుట్ర తెలుసు. దీని వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అయినా కానీ సర్కారును కూల్చలేరు అన్నారు. మొదటి నుంచి బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతోందని మండ్య ఎమ్మెల్యే రవి గణిగ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. ప్రలోభాలను అసెంబ్లీలోనే బహిర్గతం చేస్తామన్నారు. కాగా, నేను సీఎం కావాలని ఎవరైనా ఎమ్మెల్యే ప్రకటిస్తే కేపీసీసీ చీఫ్‌గా వారికి క్రమశిక్షణా నోటీస్ జారీ చేయనున్నట్లు డీకే హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నాయకులకు పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడరాదని సూచించామన్నారు. మంత్రి పదవి,రూ. 50 కోట్ల ఆఫర్: గణిగ బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేల వద్ద మాట్లాడిన ప్రలోభాల సాక్ష్యాలను మరో రెండు రోజుల తరువాత మీడియా ముందు పెడతానని మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ తెలిపారు. మండ్యలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి, రూ. 50 కోట్ల ఆఫర్ ఇచ్చారు. సీఎం, డీసీఎంతో మాట్లాడిన రెండు రోజుల తరువాత మీడియా ముందు వస్తానన్నారు. ఒక ఎమ్మెల్సీ, యడియూరప్ప పీఏ సంతో‹Ù, బెళగావి మాజీ మంత్రి ఒకరు బెంగళూరులోని గోల్డ్ ఫించ్ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. డీకేశి వెంట 70 మంది ఎమ్మెల్యేలు: శివగంగ డీసీఎం డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌లో 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని దావణగెరె జిల్లా చన్నగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే శివగంగా బసవరాజ్ అన్నారు. ఈ ఐదేళ్లలో ఆయనను తప్పకుండా ముఖ్యమంత్రిని తప్పకుండా చేస్తామని ప్రకటించి హస్తంలో వేడిని పెంచారు. అధికార పంపకం, పార్టీ, ప్రభుత్వం గురించి ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని శనివారం ఉదయమే సీనియర్లు కఠినమైన హెచ్చరికలు చేశారు. వీటిని బేఖాతరు చేస్తూ శివగంగా విలేకరులతో ఘాటుగా మాట్లాడారు. డీ.కే.శివకుమార్ వంద శాతం సీఎం అవుతారు. పారీ్టలో 60– 70 మంది ఎమ్మెల్యేలు డీకేకి మద్దతుకు ఉన్నామని నేను మామూలుగానే చెప్పాను. ఆ మాటకొస్తే 135 మంది ఎమ్మెల్యేలు డీకేకి అండగా ఉన్నారు అని అన్నారు. అలాగని తాను మరొకరికి వ్యతిరేకం కాదన్నారు. -
‘కర్ణాటకలో రైతులకు ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నాం’
సాక్షి, తాండూర్: కర్ణాటకలో కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. అక్కడ రైతులకు ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు(శనివారం) తాండూర్‌లో పర్యటించారు. ఈ మేరకు ఇంగ్లిష్‌లో మాట్లాడిన డీకే శివకుమార్.. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ మాత్రమే రైతులకు ఇస్తున్నామన్నారు. ‘మీ ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. పదేళ్లయినా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. మేం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాము.. కానీ పదేళ్లయినా కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేసాం’ అని తెలిపారు. అయితే కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ మాత్రమే రైతులకు ఇస్తున్నామని డీకే చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
సిద్ధాంతాలు గాలికొదిలేసి పొత్తులా?
కర్ణాటక: సిద్ధాంతాలను గాలికొదిలేసి రాజకీయ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటే వారిని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకుల గతేమిటని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ పరోక్షంగా జేడీఎస్ నేత కుమారస్వామిపై ధ్వజమెత్తారు. సోమవారం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెన్నపట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎం.సీ.అశ్వత్థతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర సమస్యను పరిష్కరించకపోతే పార్టీని విసర్జించి రాజకీయ సన్యాసం తీసుకుంటానని పదే పదే చెబుతున్నారని, అధినాయకులు ఈ విధంగా వ్యాఖ్యానిస్తే పార్టీ నమ్ముకొన్న నాయకులు, కార్యకర్తల గతేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో విధానపరిషత్ సభ్యుడైన సీ.ఎం.ఇబ్రహీం రాజీనామా చేసి జేడీఎస్‌లో చేరిన సమయంలో ఆయనకు ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. జేడీఎస్, బీజేపీ పొత్తు విషయం ఇబ్రహీంకు సమాచారం లేదని దుయ్యబట్టారు. జేడీఎస్‌లో ఉన్నవారు వరుసగా కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, తాము ఎవరినీ పిలువాల్సిన అవసరం లేదన్నారు. బీదర్ నుంచి చామరానగర వరకు అన్ని జిల్లాల్లో వేలాది మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలపై నిలిచిందేగాని వ్యక్తిపై కాదన్నారు. తాను లేకపోయినా పార్టీ మిమ్మల్ని కాపాడుతుందని తెలిపారు. -
Karnataka: బీజేపీ నేతలకు డీకే గాలం!
సాక్షి, బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల నాటికి ఆపరేషన్ హస్తం చేపట్టి బీజేపీ, జేడీఎస్‌లలోని బలమైన నేతలను చేర్చుకుని ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ హస్తం తలుపు తట్టకపోవడంతో కేపీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకు అన్ని అవకాశాల్ని వాడుకుంటున్నారు. శనివారం రాత్రి బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు బీసీ పాటిల్, రాజుగౌడ, మరికొందరితో చర్చలు జరిపారు. ప్రముఖ నటుడు నటుడు కిచ్చ సుదీప్ ఒక హోటల్లో జరిపిన పుట్టిన రోజు విందు ఇందుకు వేదికైంది. ఈ వేడుకకు హాజరైన బీజేపీ నాయకులతో డీకే మాటలు కలిపినట్లు సమాచారం. నేను బీజేపీని వీడను: రాజుగౌడ ఆపరేషన్ హస్తం చేసేందుకు నాకు క్యాన్సర్ గడ్డ ఏమీ లేదు, నాకు బీజేపీలో సరైన స్థానం ఇవ్వలేదని అసంతృప్తి ఉంది, అయినా పార్టీనీ వీడను అని రాజుగౌడ చెప్పారు. నియోజకవర్గంలో మంచి పనులు చేపట్టినా కూడా ఎందుకు ఓటమి పాలయ్యారని డీకే అడిగారు. సుదీప్ పుట్టినరోజు కంటే శివకుమార్‌తో మేము మాట్లాడిందే పెద్ద వార్త అయ్యింది అని చమత్కరించారు. చదవండి: అదనపు కట్నం కోసం పోలీస్ అకృత్యాలు.. భార్యపై లాఠీచార్జీ -
కర్ణాటకలో ఆపరేషన్ లోటస్.. మాజీమంత్రి షాకింగ్ కామెంట్స్
బెంగళూరు: ఇటీవల కర్ణాటక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీపై కాంగ్రెస్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నో ప్లాన్స్ చేస్తూ ముందుకుసాగింది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో హస్తం పార్టీ గెలుపు ఖాయమైంది. ఇక, తాజాగా కర్ణాటక రాజకీయాలపై బీజేపీ మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన కామెంట్స్ చేశారు. అయితే, మాజీ మంత్రి ఈశ్వరప్ప ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్లాన్ సిద్ధమైనట్టు తెలిపారు. కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ త్వరలోనే ప్రారంభం కానుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండదని హాట్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో సగం మంది హస్తం గూటికి చేరతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని కానీ.. ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోరని స్పష్టం చేశారు. దమ్ముంటే నెలరోజుల్లోగా కనీసం ఒక్క ఎమ్మెల్యేను ఆకర్షించాలని ఆయన కాంగ్రెస్‌కు సవాల్ చేశారు. తమ సొంత ఎమ్మెల్యేలకే మీపై నమ్మకం లేదని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని చురకలంటించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ ఈశ్వరప్పకు టికెట్ ఇవ్వలేదు. అనంతరం, ప్రధాని మోదీ.. ఈశ్వర్పకు కాల్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే. Shivamogga, Karnataka | On the question of whether BJP can do 'Operation Lotus' at present, BJP leader KS Eshwarappa says, "Wait and watch, your (Congress) own MLAs don't have hope on you, Congress has no future in this country. Congress party is making big news in the state.… pic.twitter.com/WIa59VKRG7 — ANI (@ANI) September 3, 2023 ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే? -
డీకేతో రేవంత్ భేటీపై కవిత ఫైర్
అసెంబ్లీ ఎన్నికల మందు తెలంగాణ రాజకీయం వేడి పెరిగింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారంపై దృష్టి పెట్టింది. అధికార పార్టీ అసంతృప్తి నేతలకు గాలం వేయడంలో కాంగ్రెస్ బిజీ బిజీగా మారింది. ఇప్పటికే ఆ పార్టీ నేతలను ఒక్కొక్కరిగా హస్తంలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరికల నేపథ్యంలో ఆయన శుక్రవారం రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఈమేరకు డీకే శివకుమార్ ట్విటర్లో వీరిద్దరూ కలిసిన ఫోటోను షేర్ చేశారు. ‘టీటీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు కుమార్ కృపా గెస్ట్ హౌజ్‌లో నన్ను కలిశారు. తెలంగాణ రాజకీయ పరిణామాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించాం’ అంటూ పేర్కొన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇంకా ఏయే అంశాలపై చర్చ జరిగిందనేది ఉత్కంఠగా మారింది. ತೆಲಂಗಾಣ ಪ್ರದೇಶ ಕಾಂಗ್ರೆಸ್ ಸಮಿತಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ @Revanth_Anumula ಅವರು ಇಂದು ನನ್ನನ್ನು ಕುಮಾರ ಕೃಪಾ ಅತಿಥಿಗೃಹದಲ್ಲಿ ಭೇಟಿಯಾಗಿ, ಮುಂಬರಲಿರುವ ತೆಲಂಗಾಣ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಚರ್ಚಿಸಿದರು. pic.twitter.com/pTxV1gyA7o — DK Shivakumar (@DKShivakumar) September 1, 2023 తాజాగా డీకే, రేవంత్ భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత నిప్పులు చెరిగారు. రేవంత్, డీకే దిగిన ఫోటోను షేర్ చేస్తూ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం... ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం’ అంటూ ధ్వజమెత్తారు. చదవండి: ఖమ్మం రాజకీయాల్లో ఊహించని పరిణామం అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ... కానీ ఇప్పుడు వయా బెంగళూరు కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం... ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం... pic.twitter.com/dRJN89lamJ — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 2, 2023 కాగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్లు కొంతగాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీటికి ఆజ్యం పోసేలా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. కాంగ్రెస్‌లో చేరిక, పార్టీ విలీనంపై గతంలో పలు సార్లు డీకే శివకుమార్‌తోనూ ఆమె భేటీ అయ్యారు. వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనం అంశంలోనూ డీకే శివ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీకేను కలిసేందుకు రేవంత్ బెంగళూరుకు వెళ్లినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించినట్లు సమాచారం. అంతేగాకుండా.. బీఆర్ఎస్ తిరుగుబాటు నేత తుమ్మల నాగేశ్వర్ రావు చేరికపైనా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లో తుమ్ముల చేరిక,. షర్మిల పార్టీ విలీనం, వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధివిధానాలపై చర్చించినట్టు సమాచారం. -
బెంగళూరుకు రేవంత్!.. డీకే శివకుమార్‌ను కలిసేందుకేనా?
సాక్షి, హైదరాబాద్: టీపీ సీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బెంగళూరు వెళ్లారు. శుక్రవారం ఉదయమే ఆకస్మికంగా బయలుదేరిన ఆయన రెండురోజులు అక్కడ ఉంటారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ను కలిసేందుకే వెళ్లినట్టు తెలుస్తోంది. ఓవైపు వైఎస్సార్టీపీ విలీనం, మరోవైపు మాజీ మంత్రి తుమ్మలకు పార్టీలోకి ఆహ్వానం, ఆదివారం పీఈసీ సమావేశం, ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ పర్యటన నేపథ్యంలో రేవంత్ బెంగళూరు పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సంబంధిత వార్త: షర్మిల పార్టీ విలీనం? తాజా రాజకీయ పరిణామాలు, త్వరలోనే హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణలాంటి అంశాలపై డీకేతో చర్చించేందుకే వెళ్లారని తెలుస్తోంది. అయితే రేవంత్ ప్రైవేటు పనులపై వెళ్లారే తప్ప రాజకీయ అంశాలకు, బెంగళూరు పర్యటనకు సంబంధం లేదనే చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌కు వస్తారని గాంధీభవన్‌వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: మీసం మెలేసిన కొండా.. తొడగొట్టిన ఇనగాల -
బెంగుళూరు పర్యటన.. సీఎం రాకపోవడంపై స్పందించిన మోదీ
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నేడు నేరుగా బెంగుళూరు చేరుకొని భారత్ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయానికి కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందించారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్‌గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జాబిల్లిపై ల్యాండర్ తీసిన తొలి ఫోటోను ఇస్రో చైర్మన్ సోమనాథ్ మోదీకి బహుమతిగా అందించారు. అనంతరం ప్రధాని ఢిల్లీకి పయనమయ్యారు. తాజాగా ప్రధాని బెంగళూరు పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. అయితే బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎవరూ హాజరుకాలేదు. ప్రధాని మోదీ సీఎంను ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచి, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. The Prime Minister is scheduled to directly land in Bengaluru tomorrow at 6 am after his latest foreign jaunt to congratulate ISRO. He is apparently so irritated with the CM and Deputy CM of Karnataka for felicitating the scientists of ISRO before him, that he has purportedly… pic.twitter.com/6EvN68A4oT — Jairam Ramesh (@Jairam_Ramesh) August 25, 2023 దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం తనకంటే ముందు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంతో ప్రధాని చాలా చిరాకుగా ఉన్నారు. అందుకే ప్రోటోకాల్‌కు విరుద్ధంగా వాళ్లను విమానాశ్రయంలో ఆహ్వానించకుండా దూరం పెట్టారు. ఇది చిల్లర రాజకీయం తప్ప మరొకటి కాదు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రయాన్-1 ను విజయవంతంగా ప్రయోగించిన వేళ.. 2008 అక్టోబర్ 22న అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌ను నాడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ మోదీ సందర్శించారు. ఈ విషయం ఇప్పటి ప్రధాని మర్చిపోయారా?’’ అంటూ జైరామ్ రమేష్ ప్రశ్నించారు. చదవండి: చంద్రయాన్ 3 విజయోత్సవాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం.. అయితే కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించారు. బెంగళూరుకు తాను సరిగ్గా ఏ సమయానికి చేరుకుంటారో స్పష్టత లేని కారణంగా మంత్రులకు ఇబ్బంది కలిగించకూడదని భావించినట్లు తెలిపారు. బెంగుళూరు ఎయిర్నపోర్టుకు చేరుకున్న తర్వాత ప్రజలను ఉద్ధేశించి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘నేను శాస్త్రవేత్తలతో సమావేశమైన తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళతాను. బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటానన్నది నాకు తెలియదు. కాబట్టి వారు రావద్దని నేనే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, గవర్నర్‌కు చెప్పాను. నాకు స్వాగతం పలికేందుకు ముందుగా వచ్చి ఇబ్బంది పడొద్దని కోరాను. ప్రోటోకాల్ పాటించకుండా ఉండమని నేనే వారిని అడిగాను.’’ ప్రధాని పేర్కొన్నారు. #WATCH | Bengaluru: On PM Modi's visit, Karnataka Deputy CM DK Shivakumar says, "I fully agree with whatever the Prime Minister has said. We were supposed to go and receive him but since we had the information from the Prime Minister's Office officially, we wanted to respect… pic.twitter.com/jWYq5Ne6c0 — ANI (@ANI) August 26, 2023 ఈ వివాదంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రధానిని స్వీకరించేందుకు తానును, సీఎం సిద్ధరామయ్య సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తనకు అధికారిక సమాచారం వచ్చిందని, దానిని గౌరవించాలని పేర్కొన్నారు. -
డీకే శివకుమార్‌కు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అవినీతి కేసులో తమ దర్యాప్తును నిలుపుదల చేస్తూ గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా దానిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి పదో తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులో కలగజేసు కోబోమని బెంచ్ స్పష్టంచేసింది. గతంలో కర్ణాటక హైకోర్టు సీబీఐ దర్యాప్తుపై స్టేను పలుమార్లు పొడిగించడం తెల్సిందే. -
సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఊరట..
సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. అవినీతి కేసులో డీకే శివకుమార్ సీబీఐ దర్యాప్తుపై గతంలో కర్ణాటక హైకోర్టు స్టే ఇవ్వగా.. హైకోర్టు ఉత్తర్వులపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. సీబీఐకి అనుకూలంగా ఉత్తర్వులు ఉన్నప్పటికీ విచారణపై హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర స్టే ఇచ్చిందని సుప్రీంకు ఆయన తెలిపారు. డీకే శివకుమార్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సీబీఐ అప్పీల్ దాఖలు చేసిందని, అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ జారీ చేసిన తదుపరి మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేసేందుకు నిరాకరించిందని కోర్టుకు పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశం హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. అదే విధంగా తమ ముందున్న కేసును త్వరగా పరిష్కరించాలని హైకోర్టును కోరేందుకు సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించింది. అనంతరం సీబీఐ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం కాగా డీకే శివకుమార్ అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 10న స్టే ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఈ కేసులో ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని విచారణ సంస్థను ఆదేశించింది. శివకుమార్‌పై నమోదైన కేసులు 2020 నాటివని నొక్కి చెబుతూ.. గడిచిన రెండేళ్లుగా జరుగుతున్న దర్యాప్తు పురోగతిపై తుది రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. ఇక 2017లో డీకే శివకుమార్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఐటీ శాఖ అందించిన సమాచారం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అతనిపై విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తు ఆధారంగా డీకే శివకుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించాలని సీబీఐ కోరింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 25, 2019న అప్పటి యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. అక్టోబర్ 8, 2020న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిపై ఎఫైఆర్ నమోదైంది. అయితే దీనిని సవాలు చేస్తూ శివకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. చదవండి: వరదల్లో బురద రాజకీయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వివాదం -
దేశంలో అత్యంత ధనిక-పేద ఎమ్మెల్యేలు వీళ్లే..
బెంగళూరు: దేశంలోనే అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. టాప్ ప్లేస్‌లో నిలిచారు. రూ. 1,400 కోట్లకు పైగా ఆస్తులతో.. దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారాయన. 2023లో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆఫిఢవిట్లలోని వివరాల ప్రకారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్).. దేశంలో ధనిక, పేద ఎమ్మెల్యేల లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో రూ. 1,400 కోట్ల ఆస్తులతో డీకే శివకుమార్ అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. తరువాత రూ. 1,267 కోట్ల విలువైన ఆస్తులతో కర్ణాటకకే చెందిన గౌరిబిదనూర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి గౌడ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రియ కృష్ణ రూ. 1,156 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. ఇక తొలి 10 మంది ధనిక ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, ముగ్గురు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. తన ఆస్తుల గురించి శివకుమార్‌ను ప్రశ్నించగా.. తాను ధనికుడిని కాదని, అలాగని పేదవాడిని కూడా కాదని అన్నారు. ప్రస్తుతం తనకున్న ఆస్తులన్నీ సుదీర్ఘకాలం కష్టపడి సంపాదించుకున్నవని పేర్కొన్నారు. తన ఆస్తులన్నీ తన పేరు మీదే ఉన్నాయని, అందుకే తన పేరిట ఇన్ని ఆస్తులు ఉన్నట్లు వివరణ ఇచ్చారు. వ్యాఖ్యానించారు. కొందరు తమ ఆస్తులను వివిధ వ్యక్తుల పేరిట రాసుకుంటారని, తనకి అలా ఇష్టం ఉండదని చెప్పారు. అందుకే తన పేరిట ఇన్ని ఆస్తులు ఉన్నట్లు చెప్పారు. చదవండి: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమబెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా ఉన్నారు. తన పేరు మీద కేవలం రూ. 1,700 ఆస్తులే ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇతని తరువాత ఒడిశాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే మకరంద ముదులి రూ. 15,000 వేల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు దేశ వ్యాప్తంగా తొలి 20 మంది సంపన్న ఎమ్మెల్యేల్లో 12 మంది కర్ణాటకకు చెందిన వారే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. అంతేగాక రాష్ట్రంలో 14 శాతం మంది ఎమ్మెల్యేలు బిలియనీర్లు కాగా వారు రూ.100 కోట్లకు పైగా వ్యక్తిగత ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 59 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కోటీశ్వరులు ఉన్నారు. చదవండి: Manipur Violence.. మహిళపై అఘాయిత్య ఘటన.. ఆరోజు జరిగింది ఇదేనా! -
విపక్షాల భేటీకి సోనియా గాంధీ!..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 17, 18న జరిగే ప్రతిపక్షాల కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సైతం హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం చెప్పారు. ఈ భేటీలో పాల్గొనాలని సోనియాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారని తెలిపారు. దీనిపై సోనియా సానుకూలంగా స్పందించినట్లు,ఆమె రాబోతున్నట్లు తమకు సమాచారం అందిందని అన్నారు. అలాగే, రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా ఈ నెల 12న ఇక్కడి ఫ్రీడమ్ పార్క్ వద్ద మౌన దీక్ష చేపట్టనున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఒక్కటి కావాలని సూచించారు. దేశంలో మార్పు కోసం జరుగుతున్న మహా యుద్ధంలో పాల్గొనేందుకు ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తొలి సమావేశం జూన్ 23న బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: ఉత్తరాది అతలాకుతలం.. ప్రమాదస్థాయికి చేరుకున్న యమున -
డీకే శివకుమార్ సీఎం కావాలి
కర్ణాటక: డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడమే సమస్త ఒక్కలిగల ఆశయమని విశ్వ ఒక్కలిగ మహాసంస్థానమఠం చంద్రశేఖరనాథ స్వామీజీ తెలిపారు. మంగళవారం విధానసౌధ బ్యాంకెట్ హాల్లో కెంపేగౌడ అభివృద్ధి ప్రాధికార ఆధ్వర్యంలో కెంపేగౌడ జయంతి వేడుకలను చంద్రశేఖరనాథస్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని, ఆయనకు ఎమ్మెల్యేలు, నాయకులు అండగా నిలవాలని అన్నారు. స్ఫటికపురి మఠం పీఠాధ్యక్షుడు నంజావదూతమహాస్వామి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎల్కేజీ నుంచి పీజీ వరకు నాడప్రభు కెంపేగౌడ పాఠ్యాంశాన్ని తప్పనిసరిగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ప్రసంగిస్తూ కెంపేగౌడ గొప్పదనాన్ని కొనియాడారు. -
డీకేతో కోమటిరెడ్డి భేటీ.. రాజగోపాల్ చేరికపై చర్చ!
సాక్షి, కర్ణాటక: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. పార్టీలోకి చేరికలపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కర్ణాటకకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. అయితే, బెంగళూరులో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌లో చేరికలపై ప్రధానంగా చర్చించుకునే అవకాశాలున్నాయి. మరోవైపు, కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై కూడా అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో డీకే శివ కుమార్ పేరు హైలైట్ అవుతోంది. డీకే చుట్టే కాంగ్రెస్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు టైమొచ్చిందా?..ఆ విషయంలో సక్సెస్ అయ్యే ఛాన్స్! -
రంగంలోకి డీకే శివకుమార్.. ట్రబుల్ షూటర్‌తో రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరు వేదికగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు మొదలుపెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీ-కాంగ్రెస్‌లో చేరికలకు సంబంధించి డీకేతో రేవంత్ చర్చించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా అక్కడ పార్టీకి మరింత బలం చేకూరుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లోనూ డీకే అంతా తానై చక్రం తిప్పుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యతిరేకులను మళ్లీ పార్టీలోకి రప్పించే యత్నాలు బెంగళూరు కేంద్రంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. కాగా మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణులకు కొత్త జోష్ ఇస్తోంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. కర్ణాటక విజయ మంత్రాన్నే తెలంగాణలో పఠించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీనికి సంబంధించి వ్యూహాలకు పదును పెడుతోంది. మరోవైపు తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పలు పార్టీల నుంచి వచ్చిన వలస నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఎస్లో చేరిన హస్తం ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రియాంకగాంధీ సమక్షంలో పెద్ద సంఖ్యలో పార్టీలో చేరికలుంటాయని కాంగ్రెస్ చెబుతోంది. -
మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ
కర్ణాటక: ఎన్నికల సమయంలో ఐదు గ్యారంటీలలో ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు సాధారణ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి పథకం.. శక్తి యోజన ఆదివారం నుంచి అమలు కాబోతోంది. విధానసౌధ ముందు భాగంలో సీఎం సిద్దరామయ్య, ఉప సీఎం డీ.కే.శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జిల్లాల్లో మంత్రులు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో ఆధార్‌కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డైవింగ్ లైసెన్స్ తదితర ఏదో ఒక గుర్తింపు కార్డు చూపాలి. మూడు నెలల్లోగా ఆర్టీసీ.. శక్తి స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది. లగ్జరీ బస్సుల్లో నో అంబారీ, అంబారీ డ్రీం క్లాస్, ఐరావత, క్లబ్ క్లాస్, రాజహంస, ఏసీ, లగ్జరీ నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం లేదు. అలాగే ఇతర రాష్ట్రాల ప్రయాణానికి కూడా వీలు లేదు. కండక్టర్లు ప్రతి మహిళకు సున్నా ధర టికెట్ ఇవ్వాల్సిందే. టికెట్ ఇవ్వని పక్షంలో కండక్టర్‌పై చర్యలు ఉంటాయి. గ్యారంటీలపై గందరగోళం లేదు: సీఎం గృహలక్ష్మీ, గృహజ్యోతితో పాటు 5 గ్యారెంటీ పథకాల జారీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ పథకాలను జారీ చేస్తామన్నారు. శక్తి యోజన ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. నేటి నుంచి శక్తియోజన పథకం -
డిప్యూటీ సీఎం డీకేతో వైఎస్ షర్మిల భేటీ
సాక్షి, బెంగళూరు: కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. సోమవారం బెంగళూరు సదాశివనగరలోని డీకే నివాసంలో షర్మిల ఆయనతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలం నుంచి ఆ కుటుంబానికి డీకే శివకుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కన్నడనాట కాంగ్రెస్ ఘన విజయం నేపథ్యంలో షర్మిల ఆయనకు శుభాభినందనలు తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించుకున్నారు. ఇదొక మర్యాదపూర్వకమైన భేటీ అని డీకే శివకుమార్ కార్యాలయం తెలిపింది. -
సీఎం సిద్ధరామయ్యకు ఆర్థికం
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలకమైన ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకుని, ముఖ్యమైన నీటిపారుదల, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ విభాగాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కేటాయించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతోపాటు 8మంది మంత్రులు ఈ నెల 20న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. శనివారం కొత్తగా 24 మందిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. వీరిలో గతంలో హోం శాఖను నిర్వహించిన జి.పరమేశ్వరకు తిరిగి అదే శాఖను కట్టబెట్టారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖను ఎంబీ పాటిల్‌కు, కేజే జార్జికి విద్యుత్ శాఖను కేటాయిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్థిక శాఖతోపాటు కేబినెట్ వ్యవహారాలు, పరిపాలన సిబ్బంది వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్, ఐటీ తదితర ఇతరులకు ఇవ్వని శాఖలు సీఎం సిద్ధరామయ్య వద్దే ఉన్నాయి. శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి వనరులు, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ శాఖలను ఇచ్చారు. హెచ్‌కే పాటిల్‌కు న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు, లెజిస్లేషన్, పర్యాటక శాఖలు, కేహెచ్ మునియప్పకు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలను కేటాయించారు. రామలింగారెడ్డికి రవాణా, ముజ్రాయ్ శాఖలను ఇచ్చారు. హెచ్‌సీ మహదేవప్పకు సాంఘిక సంక్షేమం, సతీశ్ జర్కిహోళికి పబ్లిక్ వర్క్స్ శాఖలను అప్పగించారు. శివానంద పాటిల్‌కు టెక్స్టైల్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ బాధ్యతలు కేటాయించారు. దినేశ్ గుండూరావుకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, రెవెన్యూ శాఖను కృష్ణ బైరెగౌడకు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు. ఏకైక మహిళా మంత్రి లక్ష్మి ఆర్ హెబ్బాల్కర్కు మహిళ, శిశు అభివృద్ధి, సీనియర్ సిటిజన్ సాధికారిత శాఖ ఇచ్చారు. -
YS Sharmila: డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ
బెంగళూరు: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. సోమవారం ఉదయం బెంగళూరు వెళ్లిన ఆమె.. ఆయన నివాసంలోనే మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం దిశగా కాంగ్రెస్ పార్టీని నడిపించినందుకుగానూ శివకుమార్‌ను పుష్ఫ గుచ్చం ఇచ్చి వైఎస్ షర్మిల అభినందించినట్లు సమాచారం. అయితే ఈ భేటీ సారాంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌ను విలీనం చేయాలంటూ సోనియా గాంధీ నుంచి షర్మిలకు ప్రతిపాదన వచ్చిందన్న ఊహాగానాలు ఆ మధ్య వినిపించాయి. అయితే వాటిని ఆమె కొట్టిపారేశారు. కర్ణాటకలో తిరుగులేని విజయాన్ని అందించనప్పటికీ డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగడంతోనే సరిపెట్టుకున్నారాయన. ఇక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితం కావాలంటూ ప్రతిపక్షాలకు షర్మిల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె డీకే శివకుమార్‌తో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ కుంపటిపై హస్తినలో హీట్ -
కర్ణాటక సీఎంగా సిద్ధూ ప్రమాణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో వీరి చేత గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. వీరితోపాటు మరో 8 మంది.. డాక్టర్ జి.పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జారకిహోళి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దేవుని పేరిట, డీకే శివకుమార్ శ్రీ గంగాధర అనే ఆయన తాత గారి పేరిట ప్రమాణం చేశారు. పరమేశ్వర రాజ్యాంగంపై, సతీశ్ బుద్ధుడు, బసవణ్ణ అంబేడ్కర్ పేరిట, జమీర్ అహ్మద్ అల్లా, తన తల్లి పేరిట ప్రమాణం చేశారు. మిగిలిన వారు దేవుని పేరిట ప్రమాణం చేశారు. అనంతరం, సాయంత్రం నూతన సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రివర్గం మొట్టమొదటి సమావేశం జరిగింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వివిధ హామీల అమలుకు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటి అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఆర్థికం సహా ఎటువంటి ఇబ్బందులెదురైనా తప్పక అమలు చేస్తామని అనంతరం సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందన్నారు. నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని, కొత్త స్పీకర్ ఎంపిక ఈ సమావేశాల్లో ఉంటుందని చెప్పారు. ఇలా ఉండగా, సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సిద్ధరామయ్య, శివకుమార్‌లకు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవె గౌడ, మాజీ సీఎం బొమ్మై అభినందనలు తెలిపారు. జాతీయ నేతలు హాజరు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ హాజరు కాలేదు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్లతోపాటు తమిళనాడు, బిహార్, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, నితిశ్ కుమార్, హేమంత్ సోరెన్‌లు పాల్గొన్నారు. వీరితోపాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్ఎస్పీ అధ్యక్షుడు ఎన్కే ప్రేమచంద్రన్, సీపీఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, వీసీకే అధ్యక్షుడు డాక్టర్ తిరుమల వలన్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, నటుడు కమల్ హాసన్ కూడా ఉన్నారు. నేతలంతా చేతులు కలిపి సంఘీభావం ప్రదర్శించారు. -
కాంగ్రెస్, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా ‘సిద్ధూ’ ప్రమాణ స్వీకారం
సాక్షి, బెంగళూరు: కంఠీరవ స్టేడియం వేదికగా కర్ణాటక కేబినెట్ శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్యతో గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. వీరితోపాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార వేదిక నిలిచింది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు బీజేపీ వ్యతిరేక పక్షాలు హాజరయ్యాయి. దేశంలోని విపక్షాల నేతలందరూ కదిలొచ్చి తమ ఐక్యతను ప్రదర్శించారు.ఒక వేదికపై విపక్షాలన్నీ కలిసి రావడం 2014 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమానికి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విపక్షాల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో కర్ణాటక రోల్ మోడల్‌గా గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభతో 2024 సార్వత్రిక ఎన్నికలకు విపక్షాలతో కలిసి వస్తామని కాంగ్రెస్ సూచనప్రాయంగా బయటపెట్టింది. #WATCH | Opposition leaders display their show of unity at the swearing-in ceremony of the newly-elected Karnataka government, in Bengaluru. pic.twitter.com/H1pNMeoeEC — ANI (@ANI) May 20, 2023 హాజరైన ప్రముఖులు వీళ్లే.. ►తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ సీఎం నితీష్ హాజరు ►తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ఏచూరి సీతారం, డీ రాజా, శరద్ పవార్, ఫారుఖ్ అబ్ధుల్లా ► కమల్ హాసన్, శివరాజ్ కుమార్. చదవండి: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే తొలి కేబినెట్ బేటీ: రాహుల్ గాంధీ మరో రెండు గంటల్లో కర్ణాటక తొలి కేబినెట్ సమావేశం జరగనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తాం. ఎన్నికలకు ముందు మేం ఏం చెప్పామో అవే చేస్తాం. 5 వాగ్దానాలు చేశాం. ఈ కేబినేట్ భేటీలో ఈ 5 హామీలు చట్టంగా మారుతాయి’ అని తెలిపారు. #WATCH | We made 5 promises to you. I had said we don't make false promises. We do what we say. In 1-2 hours, the first cabinet meeting of the Karnataka govt will happen and in that meeting these 5 promises will become law: Congress leader Rahul Gandhi pic.twitter.com/hhsancnayq — ANI (@ANI) May 20, 2023 -
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే
Updates: ►కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చేత ప్రమాణ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొఫైల్ ►ఓబీసీ నేత, 40 ఏళ్ల రాజకీయ జీవితం ►తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే, ►2013 నుంచి 18 వరకు సీఎం, ►13సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్. ►జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిక ►కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొఫైల్ ► వక్కళిగ నేత, తల్లిదండ్రులు కెంపేగౌడ, గౌరమ్మ ►చదవు: మైసూరు యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ ►27 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు ►సాతనౌర్ నుంచి మూడుసార్లు ఎమ్మల్యెఏ ►2008లో కనకపుర నుంచి గెలుపు ►2008, 2013, 2018లో హ్యాట్రిక్ విక్టరీ ►2014 నుంచి 18 వరకు విద్యుత్‌శాఖ మంత్రి ►2017 రాజ్యసభ ఎన్నికల్లోనూ కీలక పాత్ర ►దేశంలోనే ధనిక రాజకీయనేత ►కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్షూటర్ ►కేపీసీసీ అధ్యక్షుడు కర్ణాటక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 8 మంది నేతలు వీళ్లే కేజీ జార్జ్ ప్రొఫైల్ ►సర్వగ్న నగర్ నియోజకవర్గం, క్రిస్టియన్ నేత, 5 సార్లు ఎమ్మెల్యే ►1985లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక ►హోం, పరిశ్రమలశాఖ మంత్రిగా సేవలు కేహెచ్ మునియప్ప ప్రొఫైల్ ► తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు, దేవనహళ్లి అసెంబ్లీ ► చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజస్ ► రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ శాఖల నిర్వహణ ► ఏడుసార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నిక ► కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం జీ పరమేశ్వర ప్రొఫైల్ ►జననం 1951 ఆగస్టు 6, కొరటగెరె నియోజకవర్గం ►దళిత నేత, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే ►హోంశాఖ, సమాచారం, పౌర సంబంధాలు ►ఉన్నత విద్యాశాఖ మంత్రిగా విధులు 2010-18 వరకు కేపీసీసీ అధ్యక్షుడు ►వీరప్పమొయిలీ, ఎస్ఎం కృష్ణ, సిద్ధరామయ్య, కుమారస్వామి కేబినెట్లో మంత్రిగా విధులు మాజీ డిప్యూటీ సీఎం, ఎంబీ పాటిల్ ప్రొఫైల్ ►లింగాయత్ నేత, బబలేశ్వర్ నియోజకవర్గం. ►అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ ► కర్ణాటక మాజీ హోం, జలవనరుల మంత్రి. సతీశ్ జర్కిహోళి ప్రొఫైల్ ►ఎస్టీ నేత(వాల్మికీ నాయక) ► గోకక్ నియోజకవర్గం. ►నాలుగుసార్లు ఎమ్మెల్యే, ►రెండుసార్లు ఎమ్మెల్సీ, ►కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రియాంక్ ఖర్గే ప్రొఫైల్ ►దళిత నేత, ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ►చిత్తాపూర్ నియోజకవర్గం. ►మూడుసార్లు ఎమ్మెల్యే. ►ఐటీ, సాంఘీక సంక్షేమశాఖ మాజీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ►చామరజ్పేట్ నియోజకవర్గం ►మైనార్టీ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యే, ►జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిక ► మాజీ హజ్, వక్ఫ్ శాఖ మంత్రి రామలింగారెడ్డి ►ఓబీసీ నేత ►బీటీఎమ్ లేఔట్ నియోజవకర్గం ►8సార్లు ఎమ్మెల్యే, ►మూడు సార్లు మంత్రిగా సేవలు. ►కర్ణాటక మాజీ హోంమంత్రి #WATCH | Karnataka swearing-in ceremony | Karnataka CM-designate Siddaramaiah and Deputy CM-designate DK Shivakumar display a show of unity with Congress leader Rahul Gandhi in Bengaluru. pic.twitter.com/KxdvpWims1 — ANI (@ANI) May 20, 2023 Karnataka swearing-in ceremony | Karnataka Deputy CM-designate DK Shivakumar welcomes Tamil Nadu CM MK Stalin and other DMK leaders at Sree Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/TS3uVNcydI — ANI (@ANI) May 20, 2023 ►బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నితీష్ కుమార్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, కమల్‌హాసన్, శవరాజ్ కుమార్ హాజరయ్యారు. Actor and Makkal Needhi Maiam chief Kamal Haasan attends the swearing-in ceremony of the newly-elected Karnataka Government at Sree Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/mrTmOo7vU4 — ANI (@ANI) May 20, 2023 ►అన్ని సామాజిక వర్గాలకు కేబినెట్లో చోటు కల్పించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్‌ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లు కేబినెట్ కూర్పు, పోర్టుఫోలియోలపై పార్టీ పెద్దలతో విస్తృత చర్చలు జరిపారు. డీకే శివకుమార్ ప్రత్యేకంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలను కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. #WATCH | Karnataka Deputy CM-designate DK Shivakumar arrives at Sree Kanteerava Stadium in Bengaluru where the swearing-in ceremony of the newly-elected Karnataka Government will begin shortly. pic.twitter.com/sQHEch9Rd8 — ANI (@ANI) May 20, 2023 శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌తోపాటు మంత్రులుగా కొందరు ప్రమాణం చేస్తారంటూ అధిష్టానం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సూర్జేవాలాలతో సిద్ధరామయ్య ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వీరి చర్చల్లో శివకుమార్ పాలుపంచుకున్నారు. నలుగురూ కలిసి జన్‌పథ్– 10లో ఉంటున్న రాహుల్ గాంధీని వెళ్లి కలిశారు. కేబినెట్లోకి 20 మంది? గంటన్నరకుపైగా వారి మధ్య చర్చలు నడిచాయి. ఆపై రాహుల్ గాంధీ, సూర్జేవాలా, వేణుగోపాల్‌లు పార్టీ చీఫ్ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్లోకి ఎందరిని తీసుకోవాలనే విషయమై తుది నిర్ణయానికి వచ్చారు. కేబినెట్లోకి తీసుకునే 20 మంది పేర్లను ఖారారు చేసినట్లు అనంతరం పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ వర్గాలు, ప్రాంతాలు, వర్గాలకు సముచిత స్థానం దక్కేలా కేబినెట్ కూర్పు ఉంటుందన్నాయి. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఆయనతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్‌ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల సీఎంల రాక ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. లక్ష మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారని అంచనా. విస్తృతంగా బందోబస్తు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిహార్ సీఎం నితీశ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తనకు బదులుగా పార్టీ ప్రతినిధిని పంపుతారని సమాచారం. కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను శుక్రవారం ఉదయం డీకే శివకుమార్ స్వయంగా పరిశీలించారు. ప్రజా ప్రతినిధులైన జేడీఎస్, బీజేపీ నేతలను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు శివకుమార్ చెప్పారు. శనివారమే జరిగే కేబినెట్ మొదటి భేటీలో కాంగ్రెస్ ప్రధాన హామీ అయిన 5 గ్యారంటీల అమలుపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. చదవండి: ఢిల్లీకి నేతల క్యూ.. రాష్ట్ర నేతలతో వేర్వేరుగా అమిత్‌షా, సునీల్ బన్సల్ భేటీ -
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: డీకే శివకుమార్
బనశంకరి: పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ తొలి ప్రాధాన్యమని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు గ్యారెంటీ హామీలను నెరవేరుస్తామన్నారు. శనివారం నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి పార్టీ నేతలందరూ విచ్చేస్తారని, దేశంలోని అనేకమంది నేతలకు ఆహ్వానించామని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, పార్టీపెద్దలతో భేటీ అయి విస్తృతంగా చర్చించారని, గ్యారెంటీ పథకాలు డీకే శివకుమార్, సిద్దరామయ్య హామీలు కాదని, ఇవి కాంగ్రెస్ పార్టీ పథకాలని అన్నారు. కాగా సుదీర్ఘ చర్చల అనంతరం సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో శనివారం వీరిద్దరు బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచ్చేయనున్నారు. -
డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. తెర వెనక సోనియా గాంధీ!
సుధీర్ఘ మంతనాల తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి వ్యవహారం కొలిక్కి వచ్చింది. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఒక్కరే ఉంటారని తెలిపారు. దీంతోపాటు పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి మధ్యాహ్నం 12.30కు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే సిద్ధరామయ్యనే సీఎంగా అవుతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానంతోపాటు ఎమ్మెల్యేలు సైతం సినీయారిటీకే మొగ్గుచూపారు. అయితే సీఎం పదవి తప్ప మరే స్థానం అవసరం లేదంటూ డీకే బెట్టు చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళాన్ని పరిష్కరించేందుకు పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. చదవండి: నేను పూర్తి సంతోషంగా లేను: డీకే శివకుమార్ సుధీర మంతనాలు సీఎంపై ఏకాభిప్రాయం కోసం గత మూడు రోజులుగా సిద్ధరామయ్య, డీకేశివకుమార్తో అధిష్టానం మంతనాలు జరిపినప్పటికీ పంచాయితీ ఎటూ తేలలేదు. సీఎం పీఠం నుంచి తగ్గేదేలే అంటూ డీకే తేగేసి కూర్చున్నారు. దీంతో డీకేను సముదాయించేందుకు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ విస్తృతంగా చర్చలు జరిపారు. సుదీర్ఘ బుజ్జగింపుల తర్వాత చివరకు డీకే.. అధిష్ఠానం ప్రతిపాదనలను అంగీకరించారు. డీకేను బుజ్జగించిన సోనియా అయితే డిప్యూటీ సీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సోనియా జోక్యంతో ఉప ముఖ్యమంత్రి పదవికి డీకే అయిష్టంగానే అంగీకరించినట్లు వర్గాలు పేర్కొన్నాయి. సీఎ పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా సోనియా డీకేతో మాట్లాడి బుజ్జగించినట్లు తెలిపాయి. రాష్ట్ర, పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సోదరుడు డీకే సురేష్ తెలిపారు. ‘మా అన్న ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు. ఈ నిర్ణయంతో మేం సంతోషంగా లేము. కేవలం కర్ణాటక, పార్టీ ప్రయోజనాలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాడు’ అని పేర్కొన్నారు. చదవండి: జల్లికట్టు వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు -
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం: కేసీ వేణుగోపాల్
Updates: ►కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు అందజేశారని పేర్కొన్నారు.. సీఎంపై ఏకాభిప్రాయం కోసం రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలిపారు. పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి(శనివారం) ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ►డిప్యూటీసీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రముఖపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సీఎ పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా ఆయన్ను సోనియా బుజ్జగించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయియి. ► ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో చర్చల అనంతరం వీరు రాహుల్‌గాంధీని కలవనున్నారు. ► కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యహహారం కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ప్రకటించడం లాంఛనమే! పార్టీ అధిష్టానంతో సుదీర్ఘ చర్చల అనంతరం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ► ‘నేను పూర్తి సంతోషంగా లేను. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, పార్టీ ప్రయోజననాల కోసం.. మా నాయకత్వం చెప్పిన ఫార్ములాకి అంగీకరిస్తున్నా’అని డీకేశీ పేర్కొన్నారు. న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ వీడినట్లే తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి కర్ణాటక సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇక రేసులో నిలిచిన డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ నేడు అధికారిక ప్రకటన వెలువరించనుంది. అర్దరాత్రి వరకు సాగిన చర్చలు బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత చెరొక రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటారని, తరువాత సిద్ధరామయ్యే పూర్తి కాలం సీఎంగా ఉంటారని ప్రచారాలు సాగాయి. అయితే ఏఐసీసీ కర్ణాటక ఇంచార్జి రణ్‌దీప్ సుర్జేవాలాతోపాటు డీకే శివకుమార్ వీటిని ఖండించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఢిల్లీలో గురువారం తెల్లవారు జామున వరకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర మంతనాలు జరిపింది. ముందు నుంచి ఢిల్లీలోనే ఉంటూ లాబియింగ్ చేసిన సిద్ధరామయ్య.. ఖర్గే, అనంతరం సోనియా గాంధీతో చర్చించారు. చదవండి: కర్ణాటక సీఎం పంచాయితీ...ఎందుకిలా..? ఢిల్లీకి వెళ్లడంతోనే ఈ చిక్కులు మెట్టుదిగిన డీకే! మరోవైపు డీకే శివకుమార్ కూడాఖర్గే, సోనియా, రాహుల్‌ను కలిశారు. అయితే అర్థరాత్రి జరిగిన చర్చలతో డీకే మెట్టు దిగినట్లు, రాజీ ఫార్ములాకు శివకుమార్ అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు నేడు రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గవర్నర్‌ను కలవనున్నారు. శనివారం ప్రమాణ స్వీకారం ఇక ఈనెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. పలు రాష్ట్రాల సీఎంలు సైతం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలను ఆహ్వానించడం ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ యోచిస్తోంది. చదవండి: ‘చేతి’కి అధికారం ఇచ్చాక? సీఎం సీటు షేరింగ్.. ఓ ఫ్లాప్ ఫార్ములా..! -
ఈ ఎన్నిక ఏం చెబుతోంది?
ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో ఉత్కంఠకు మాత్రం తెరపడలేదు. బీజేపీ సర్కార్‌ను మట్టి కరిపించిన కాంగ్రెస్ విజయగాథ ఇంకా పూర్తిగా ప్రచారం కాక ముందే, విజయ సారథులైన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, శాసనసభా పక్షా నేత సిద్దరామయ్యల మధ్య సీఎం సీటుకై సాగుతున్న పోటాపోటీ ప్రధాన వారై్త కూర్చుంది. సోమవారం కథ బెంగళూరు నుంచి ఢిల్లీకి మారింది. కాంగ్రెస్ అధిష్ఠానం కోర్టులోకి కొత్త సీఎం ఎంపిక బంతి వచ్చి పడింది. పోటీదారు లిద్దరినీ ఎలా బుజ్జగించి, ఎవరి పేరును సీఎంగా ప్రకటిస్తుందన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాజీ ఫార్ములా ఏమైనా, వ్యవహారం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ల నిత్యకుంపటి రాజస్థాన్‌లా కాకూడదన్నదే ప్రస్తుతం కాంగ్రెస్ అజెండాగా కనిపిస్తోంది. అధిక భాగం ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, సాక్షాత్తూ సిద్ద రామయ్య సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోమవారం దేశరాజధానికి విమానమెక్కారు. పుట్టినరోజు వేడుకలు, పూజా కార్యక్రమాల బిజీ మధ్య డీకే ఢిల్లీ పయనం ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కూ ఊగిసలాడింది. అధిష్ఠానం ఆదేశించినా ఆఖరి క్షణంలో అనారోగ్యమంటూ వెళ్ళక డీకే తన అసంతృప్తిని పైవాళ్ళకు చెప్పకనే చెప్పారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలున్న వేళ సిద్ద, డీకేలలో ఒకరిని కాదని మరొకరిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పెద్దలకు సైతం క్లిష్టమైన పనే. ఇద్దరూ సమర్థులే. ఇద్దరూ పార్టీ విజయానికి కష్టపడ్డవారే. ప్రజానేతగా, గతంలో ప్రజానుకూల సీఎంగా తెచ్చుకున్న పేరు, పాలనానుభవం సిద్దకు కలిసొచ్చే అంశాలు. మరోపక్క పార్టీని పలువురు వదిలే సినా, కేంద్ర దర్యాప్తు సంస్థలు వేటాడినా కాంగ్రెస్‌కే కట్టుబడి, అంగ, అర్థబలాలతో భారీ విజయం కట్టబెట్టిన కార్యదక్షత డీకే ప్రధాన ఆకర్షణ. ఎవరినీ దూరం చేసుకోలేకే కాంగ్రెస్ వంతులవారీ సీఎం సీటనే లోపాయకారీ ఫార్ములాతో శాంతపరచజూస్తోంది. కాకపోతే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో లాగా ఆ ఫార్ములా ఆచరణలో అమలుకాదేమో అన్నది రెండో వంతులో సీఎం కావాల్సినవారి భయం. ఎన్నికల వేళ కలసి ప్రత్యర్థి పార్టీపై పోరాడిన కర్ణాటక కాంగ్రెస్ దిగ్గజ నేతలు తీరా ఫలితాలు వెలువడిన మరుక్షణమే సీఎం సీటుకై పాత ప్రత్యర్థులుగా మారిపోవడం విచిత్రమే. బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి ఇప్పుడిప్పుడే సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీకి ఇది పెద్ద తలనొప్పే కాక ప్రజాక్షేత్రంలోనూ తలవంపులే. దీని నుంచి బయటపడడం ఇప్పుడు ఆ పార్టీ, ఆ పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. నిజానికి, 224 స్థానాలున్న కీలక దక్షిణాది రాష్ట్రంలో 42.9 శాతం ఓటు షేర్‌తో 135 సీట్లు గెలవడం మోదీ ప్రవేశానంతర రాజకీయ క్షేత్రంలో కాంగ్రెస్‌కు పెద్ద సాంత్వన. 2018 ఎన్నికలతో పోలిస్తే, 4.8 శాతం ఓటు షేర్, 55 సీట్లు అధికంగా ఆ పార్టీ దక్కించుకోవడం విశేషం. బీజేపీ మాత్రం అర శాతం లోపే ఓటు షేరు తగ్గినా, 38 సీట్లు చేజార్చుకొని 66 స్థానాల్లోనే గెలుపొందగలిగింది. బీజేపీ ప్రభుత్వ పాలనావైఫల్యానికి దర్పణంగా డజనుమంది మంత్రులు ఓటమిపాలై, ఇంటి దారి పట్టాల్సొచ్చింది. పాలనలో లోపంతో పాటు పేరుకున్న అవినీతి, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, లింగాయత్ వర్గాన్ని దూరం చేసుకోవడం – ఇలా బీజేపీ ఓటమికి అనేక కారణాలు. రాష్ట్రంలో 16–17 శాతం జనాభాతో, ఒకప్పుడు కమలానికి బలమైన ఓటుబ్యాంక్‌గా నిలిచిన వీరశైవ లింగాయత్‌లు ఈసారి హస్తం గుర్తుకు జై కొట్టారు. ఉత్తర కర్ణాటకలో వచ్చిన ఫలితాలు, బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పక్షాన గెలిచిన లింగాయత్ ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్యే అందుకు సాక్ష్యం. బీజేపీలో తమకు అవమానం జరిగిందంటూ తమ వైపు మొగ్గిన ఈ బలమైన లింగాయత్ వర్గాన్ని అలాగే నిలుపుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్‌దే. మరో బలమైన ఒక్కళిగ వర్గానికి చెందిన డీకేనూ దూరం చేసుకోలేదు. పైగా, లోక్‌సభ ఎన్నికల్లోనూ 28 సీట్ల కన్నడసీమలో ఇదే విజయ దరహాసం పునరావృతం కావాలంటే పార్టీని సమర్థంగా నడిపే కార్యశూరులే కావాలి. 75 లక్షల సంస్థాగత బలంతో, సిద్ద, డీకే లాంటి స్థానిక నేతలతోనే తాజా విజయం సాధ్యమైందని అధిష్ఠానానికీ తెలుసు. ఒక రకంగా కర్ణాటక ఫలితాలు గెలిచిన కాంగ్రెస్‌కూ, ఓడిన బీజేపీకీ రెంటికీ స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలు, సారథులు, ప్రజా సంక్షేమ వాగ్దానాలు, బడుగు బలహీన వర్గాల, దళిత, మైనారిటీల ఏకీకరణ రాజకీయంతో మోదీ, షా లాంటి బలమైన ప్రత్యర్థుల్ని సైతం ఢీకొట్టవచ్చని గ్రాండ్ ఓల్డ్ పార్టీ నేర్వాల్సిన పాఠం. అతి జాతీయవాదం, మను షుల్ని చీల్చే మతతత్వం, ‘ఒకే దేశం ఒకే భాష’తో ఆసేతు హిమాచలాన్ని చాపచుట్టేయాలనుకుంటే అది కుదరని పని అనేది కాషాయపార్టీకి కర్ణాటక చావుదెబ్బ చెబుతున్న గుణపాఠం. మోదీపై బీజేపీ అతిగా ఆధారపడితే లాభం లేదు. స్థానికంగా పార్టీ, నాయకత్వం బలంగా ఉంటేనే ఆ మోళీ పని చేస్తుందనడానికి యూపీ, అస్సామ్, మధ్యప్రదేశ్లే తార్కాణం. 2014 మే తర్వాత జరిగిన 57 అసెంబ్లీ ఎన్నికల్లో సగానికి పైగా వాటిలో మోదీ ఉన్నా ఆ పార్టీ ఓడిపోయిందనేది కఠిన వాస్తవం. అది తెలిసి నడుచుకోకుంటే బీజేపీకి కష్టం. ఇక, కర్ణాటక ఫలితాలతో లోక్‌సభపై ఆశలు పెంచుకుంటున్న ప్రతిపక్షాలు అతిగా లెక్కలేసి, సంబరపడితే సరిపోదు. జాతీయ స్థాయిలో నేటికీ తిరుగులేని మోదీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే, నిందలు, ఆరోపణల కన్నా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి. బలవంతుడైన ప్రత్యర్థిపై కలసికట్టుగా పోరాడాలి. సీఎం సీటు చేజారవచ్చనే నిస్పృహలో ‘ధైర్య సాహసాలు నిండిన ఒక్క వ్యక్తి వల్లే మెజారిటీ సాధ్య’మని గర్జిస్తున్న డీకేకి సైతం ఆ సంగతి తెలీదనుకోలేం. మరిన్ని సవాళ్ళు ముందున్న వేళ పార్టీకైనా, వ్యక్తులకైనా ఐకమత్యమే మహాబలం. -
Karnataka CM Post: డీకే విషయంలో కాంగ్రెస్ తటపటాయింపు!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పంచాయితీ ఎటు తేలడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి స్పష్టమైన మెజార్టీ అందుకున్న హస్తం పార్టీకి.. ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం కష్టతరంగా మారింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. అయితే ముఖ్యమంత్రి రేసులో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కేసుల గండం చుట్టుముడుతోంది. డీకే శివకుమార్‌పై నమోదైన సీబీఐ కేసులు.. కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి. డీకేను సీఎంగా నియమిస్తే సీబీఐ ఏమైనా ఇబ్బంది పెడుతుందా అన్న ఆలోచనలో పడింది హైకమాండ్. దీనికి తోడు కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్‌ను సీబీఐ బాస్‌గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. కాగా 2020-23 మధ్య ఆయనపై 13 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ శివకుమార్ పై 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2013-18లో మంత్రిగా డీకే అక్రమంగా ఆస్తులు సంపాదించారని సీబీఐ అభియోగం మోపింది. ఈనెల 30న డీకే అక్రమాస్తుల కేసు విచారణ కూడా ఉంది. అంతేగాక అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఓసారి అరెస్టై విడుదలయ్యారు శివకుమార్. చదవండి: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక ఏఐసీసీ ఇంచార్జి రణదీప్ సింగే సూర్జేవాలాతో డీకే సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు చర్చలు కొనసాగాయి. డీకే శివకుమార్‌ను బుజ్జగించేందుకు సుర్జేవాలా చేసిన ప్రయత్నం విఫలమైంది. ‘కాంగ్రెస్ కోసం నేను ఎంతో పనిచేశాను. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి.. లేదంటే అసుల కేబినెట్లో స్థానం కూడా వద్దు’ సూర్జేవాలాకు డీకే తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి సిద్ధరామయ్య కాగా ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. కాసేపట్లో మల్లికార్జున ఖర్గేతో ఏఐసీసీ బృందం సమావేశం కానుంది. కేబీనెట్ కూర్పుపై కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు చెరో రెండున్నరేళ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను మల్లికార్జున ఖర్గే తెచ్చినట్లు తెలుస్తోంది. దీనిని సిద్దరామయ్యా అంగీకరించినా డీకే శివకుమార్ మాత్రం నో చెప్పినట్టు సమాచారం. ఇక నూతన ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 18న జరుగనుంది. ఇదీ చదవండి: మల్లికార్జున ఖర్గేకు షాక్.. పంజాబ్ కోర్టు సమన్లు -
కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక సీఎం ఎవర్నరది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానానికి నిర్ణయాన్ని వదిలేశానని తెలిపారు. తాను చేయాల్సినదంతా చేశానని పేర్కొన్నారు. ఈరోజు(మే 15) తన పుట్టినరోజు అని, అనేక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందన్నారు. నేడు ఢిల్లీ పర్యటన విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఢిల్లీ వెళ్తానో లేదో తెలీదని చెప్పారు. సోనియా గాంధీ తనకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తుందో లేదో తెలియదని శివకుమార్ పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ విధేయుడనని తెలిపారు. తనపై బీజేపీ అక్రమ కేసులు పెట్టి ఇరికించినప్పుడు సోనియా నాతో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తన మీద నమ్మకంతో సోనియా గాంధీ పీసీసీ చీఫ్ చేశారని అన్నారు. జనం తనను నమ్మి 130 సీట్లు ఇచ్చారని, ఇంతకంటే బర్త్‌డే గిఫ్ట్ ఏముంటుంది? అని పేర్కొన్నారు. చదవండి: కర్ణాటక ఫలితం.. తెలంగాణలో ఇప్పుడెలా?.. బీజేపీ బేజార్, 'కారు'కు ఫియర్.. కాగా 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు ఏఐసీసీ పరిశీలకులు. బెంగుళూరు నుంచి ఢిల్లీ బయల్దేరారు. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకొని ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ అధ్యక్షుడికి సుశీల్ కుమార్ షిండే బృందం తెలియజేయనుంది. రాహుల్, సోనియా గాంధీలను సంప్రదించిన తర్వాత హై కమాండ్ నిర్ణయం తీసుకోనుంది. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు హై కమాండ్ సీఎం సీటు షేరింగ్ ఫార్ములా సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ 135 స్థానాలను గెలుచుకొని ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా సీఎం విషయంపై సస్పెన్స్నెలకొంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎవరూ సీఎం అవుతారనే విషయం కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. చదవండి: 16 ఓట్లతో గెలుపు తారుమారు.. కన్నీటి పర్యంతమైన సౌమ్యారెడ్డి -
కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారు..
బెంగళూరు: కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారైంది. మే 18న కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. అదే విధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా అన్ని భావసారూప్యత కలిగిన పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. కాగా కర్ణాటకలో హంగ్ తప్పదనుకున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఏకంగా 136 స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికల కంటే 55 స్థానాలు ఎక్కువగా విజయం సాధించింది. 43 శాతం ఓట్ షేర్ రాబట్టింది. 2018 ఎన్నికల్లో 104 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 65 సీట్లకే పరిమితమైంది. 14 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ఈ ఓటమితో దక్షిణాదిన ఏకైక రాష్టం కూడా బీజేపీ చేజారింది. ఇక జేడీఎస్ కేవలం 19 సీట్లతో కుదేలైంది. చదవండి: కర్ణాటక సీఎం రేసు.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు సీఎల్పీ భేటీ బెంగుళూరులో సీఎల్పీ సమావేశమైంది. షంగ్రిల్లా హోటల్‌కు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణకు పార్టీ హైకమాండ్ దూతలను పంపింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్‌లను కర్ణాటక సీఎల్పీ సమావేశ పరిశీలకులుగా నియమించింది. సీఎల్పీ నేతల ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్న షిండే బృందం.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంది. అధిష్టానమే సీఎంను ప్రకటించాలని తీర్మానంలో నిర్ణయించారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా బెంగళూరులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ఇంటి ముందు ‘కర్ణాటక తదుపరి సీఎం’ అంటూ ప్లెక్సీలు వెలిశాయి. ఇటు డీకే శివకుమార్ ఇంటి ముందు ‘కర్ణాటక కొత్త ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షాలు’ అంటూ ఆయన మద్దతుదారులు పోస్టర్లు అంటించారు. ఇరు నేతల మద్దతుదారుల తమ నేతను సీఎం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 137కు చేరింది. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. చదవండి: సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ -
కర్ణాటక సీఎం రేసు.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి స్పష్టమైన మెజార్టీ సాధించింది. రాష్ట్రంలోని 224 స్థానాల్లో ఏకంగా 136 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం చేసుకుంది. 1989 తర్వాత కాంగ్రెస్ 43 శాతం ఓట్ షేర్‌ను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు బీజీపీ 65 స్థానాలకే పరిమితం కాగా జీడీఎస్ 19, ఇతరులు 4 చోట్ల విజయం సాధించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పుంజుకోవడానికి ముఖ్యంగా భావిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీలో ఉత్సాహం నింపింది. అయితే కర్ణాటక సీఎం ఎవరనేదానిపై తాజాగా ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీనియర్ నేత సిద్ధరామయ్య ఆదివారం కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని.. ఇందులో రాజకీయాలు చర్చించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. చదవండి: సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ సీఎల్పీ సమావేశంలో నిర్ణయం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సహా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు (ఆదివారం) సాయంత్రం 5.30 నిమిషాలకు బెంగుళూరులో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎన్నికపై ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. అయితే మరో రెండు రోజులపాటు కర్ణాటక సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం పేరును పార్టీ హైకమాండ్ నిర్ణయించాలని సీఎల్పీ భేఈటీలో నేతలు తీర్మానించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో అధిష్టానం ఎమ్మెల్యే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనుంది. అయితే సీఎం పదవికి సిద్ధరామయ్య ముందంజలో ఉన్నారని, ఆయన్నే ముఖ్యమంత్రి చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా డీకే శివకుమార్‌కు డీప్యూటీ సీఎం పదవి లేదా మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీఎల్పీ నేతను ఎంపిక చేసేందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలకులుగా నియమించింది. సిద్ధరామయ్యకు అండగా నిలిచా ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తుమకూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాకు సిద్ధరామయ్యతో విభేదాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. కానీ మా మధ్య అలాంటివి ఏం లేవు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేశానని తెలిపారు. ఎన్నోసార్లు సిద్ధరామయ్యకు అండగా నిలిచానని, ఆయనకు సహకారం అందించానని చెప్పారు. మొదట్లో మంత్రిని చేయనప్పుడు ఓపిక పట్టలేదా అని అన్నారు. చదవండి: సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్.. -
లక్ష ఓట్ల మెజారిటీతో డీకే శివకుమార్ గెలుపు
దొడ్డబళ్లాపురం: కనకపురలో హిస్టరీ రిపీట్ అయ్యింది. ప్రజలు బీజేపీ దిమ్మతిరిగేలా ఫలితాలు ఇచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ లక్ష ఓట్ల మెజారిటీతో ఆర్ అశోక్‌పై విజయం సాధించారు. కనకపురలో డీకే శివకుమార్‌కు చెక్ పెట్టాలని భావించిన బీజేపీ ఆర్ అశోక్‌ను పోటీలో దించింది. అయితే ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. డీకే శివకుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించి తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. కనకపుర డీకే బ్రదర్స్‌కు కంచుకోట అని మరోసారి రుజువు చేసారు. -
కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ.. సిద్ధూ, డీకేల్లో సీఎం ఎవరో!
సాక్షి బెంగళూరు: విభేదాలు పక్కన పెట్టి ఒక్కతాటిపై నిలిచి కాంగ్రెస్‌ను గెలుపు బాటన నడిపిన మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరికొందరు సీనియర్లు కూడా రేసులో ఉండటంతో ఎంపిక అధిష్టానానికి సవాలుగా మారింది. సీఎం అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఆదివారం సాయంత్రం కీలకమైన కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే బెంగళూరు చేరారు. అధిష్టానం ఎవరికి ఓటేస్తుందన్నది ఆసక్తికరం. వెనుకబడిన వర్గానికి చెందిన సిద్ధరామయ్య సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే పార్టీని అధికారంలోకి తేవడంలో ట్రబుల్ షూటర్ శివకుమార్ కూడా తీవ్రంగా శ్రమించారు. పైగా 61 ఏళ్ల డీకేకు గాంధీ కుటుంబం ఆశీస్సులున్నాయి. అయితే పార్టీ నేతల్లో అత్యధికుల మద్దతు సిద్ధూ సొంతం. చదవండి: హంగ్ అడ్డుగోడ బద్ధలు వీరిద్దరి మధ్య వివాదాలకు తావు లేని రీతిలో అధికార పంపిణీ చేయాలని అధిష్టానం యోచనగా చెబుతున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన 75 ఏళ్ల సిద్ధూకు సీఎం, డీకేకు డిప్యూటీ, లేదా కీలక మంత్రి పదవి ఇచ్చి కొంతకాలానికి వారిని పరస్పరం మారుస్తారని భావిస్తున్నారు. దళిత నేత వైపు అధిష్టానం మొగ్గితే పరమేశ్వరకు చాన్సుంటుంది. బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయతులు ఈసారి కాంగ్రెస్ వైపు నిలిచినందున ఆ వర్గానికి చెందిన పాటిల్‌కు అవకాశమివ్వాలన్న డిమాండ్లూ విన్పిస్తున్నాయి. -
మోదీ గుజరాత్ బిడ్డయితే.. కన్నడ బిడ్డను నేను
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఘనవిజయంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి. సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత తనదేనని అన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. శనివారం సాయంత్రం కేపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కింది. కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. కర్ణాటక గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది. కన్నడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత నాది. తొలి కేబినెట్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కర్ణాటక మాదిరిగానే ఇతర స్టేట్స్‌లోనూ కాంగ్రెస్‌ను గెలిపిస్తాం అని అన్నారాయన. నేను గుజరాత్ బిడ్డనని మోదీ పదే పదే చెప్తుంటారు. మోదీ గుజరాత్ బిడ్డయితే నేను కన్నడ బిడ్డను.. రైతు బిడ్డను. మోదీ సహా కేంద్రమంత్రులంతా వచ్చి కర్ణాటకలో ప్రచారం చేసినా.. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని, అందుకు కృతజ్ఞతలని ఖర్గే పేర్కొన్నారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారెంటీ స్కీంపై మా కేబినెట్ తొలి సంతకం చేస్తుంది. దేశాన్ని బీజేపీ అప్పుల పాలు జేసింది. మోదీ పదిసార్లు రోడ్‌షోలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. కర్ణాటక గెలుపు దేశానికి ఓ సందేశం. 2024 కూడా ఇదే విజయాన్ని సాధిస్తాం. రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కర్ణాటక ప్రజలందరిదీ. కాంగ్రెస్‌ను గెలిపించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు. ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. రాహుల్ భారత్ జోడో యాత్ర కలిసొచ్చింది. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కర్ణాటకకు పట్టిన గ్రహణం వీడింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యదే విజయం కాదు. ఇది కర్ణాటక ప్రజల విజయం. రేపు(ఆదివారం) సాయంత్రం సీఎల్పీ సమావేశం ఉంటుంది అని తెలిపారు. Live : ಜಂಟಿ ಮಾಧ್ಯಮಗೋಷ್ಠಿ, ಕೆಪಿಸಿಸಿ ಕಚೇರಿ. https://t.co/vwUf4mQ9RK — Karnataka Congress (@INCKarnataka) May 13, 2023 -
ఎల్లుండే కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయోత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పుడు పెద్ద టాస్క్ వచ్చి పడింది. అదే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలి అని. సీఎం రేసులో సీనియర్ నేత సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇద్దరి పేర్లే మొదటి నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి వాళ్లు అధిష్టానం చూపు తమపైనే ఉందంటూ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో.. కర్ణాటకలో కొత్త సర్కార్ కొలువు దీరడానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ సాయంత్రం ప్రస్తుత సీఎం బొమ్మై తన రాజీనామాను గవర్నర్‌ను కలిసి సమర్పిస్తారు. ఎల్లుండి(మే 15వ) బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే యోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. అదేరోజు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా గతంలో డీకే శివకుమార్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ను పరిశీలిస్తే.. తన పుట్టినరోజునాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తనకు గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చారని డీకే ప్రకటించారు. దీంతో.. తన పుట్టినరోజు నాడే కొలువుదీరనున్న కొత్త సర్కార్‌లో డీకే శివకుమార్ స్థానం ఏమై ఉండొచ్చని?.. అధిష్టానం ఆయనకు ఏం గిఫ్ట్ ఇస్తుందనే చర్చ మొదలైంది కన్నడనాట. రేపు(ఆదివారం) సీల్పీ భేటీలో సీఎల్పీ నేతలను ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉండగా.. సీఎం ఎంపికపైనా సాయంత్రకల్లా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘‘మద్దతుదారులంతా నన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారా?(మీడియాను ఉద్దేశించి). నాకంటూ ప్రత్యేకించి మద్దతుదారులంటూ ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ అంతా నాకు అండగా ఉంది. ఈ విజయం అందరి సమిష్టి విజయం. సోనియా, రాహుల్ గాంధీలకు ఈ విజయం అంకితం’’: సీఎం అభ్యర్థి రేసుపై డీకే తాజా స్పందన ఇదీ చదవండి: 'జై బజరంగబలి' మా వెంటే ఉన్నాడు!: కాంగ్రెస్ -
కాంగ్రెస్ విక్టరీ.. డీకే ఎమోషనల్
-
కన్నీళ్లు పెట్టుకున్న డీకే శివకుమార్..!
-
అంచనాలకు మించి.. కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలు ఇవే..
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపథంలో దూసుకుపోతుంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో హస్తం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కారణమైన ఆరు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 6 ముఖ్య హామీలు 1. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 2. గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల రూ.2,000 3. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అన్న భాగ్య పథకం ద్వారా రూ.10 కేజీల చొప్పున బియ్యం 4. నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతి నెల రూ.3,000 నిరుద్యోగ భృతి 5. డిప్లోమా పూర్తి చేసి నిరుద్యోలుగా ఉన్న యువతకు యువ నిధి పథకం ద్వారా ప్రతి నెల రూ.1500. 18-25 ఏళ్ల మధ్య వయస్కులకే ఇది వర్తిస్తుంది. 6. శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మొత్తం 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 130 స్థానాల్లో ఆదిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ 67, జేడీఎఎస్ 21 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. చదవండి: కర్ణాటకలో మొదలైన రిసార్ట్ పాలిటిక్స్.. -
కర్ణాటకలో ఖతర్నాక్ ఫైట్.. సీఎం అభ్యర్థులపై సస్పెన్స్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(శనివారం) విడుదల కానున్నాయి. ఇక, కర్ణాటకలో పార్టీల గెలుపుపై ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర ఫలితాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి మ్యాజిక్ ఫిగర్(113) వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. దీంతో, హెచ్డీ కుమారస్వామి జేడీఎస్ పార్టీ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమారస్వామితో టచ్‌లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా డీకే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుంది. దాదాపు 150 స్థానాల్లో గెలుస్తాము. నేను నా అంచనాలకు మార్చుకోను. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి అవసరం లేదు. జేడీఎస్‌తో మేము ఎలాంటి చర్చ జరపలేదు. ఎన్నికల సందర్బంగా మా పార్టీకి చెందిన జాతీయ నేతలు, సిద్ధరామయ్య ఇతర నేతలు తీవ్రంగా కృషి చేశారు. మ్యాజిక్ ఫిగర్ దాటుతామన్న నమ్మకం నాకుంది. అయితే, కర్ణాటక సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే ప్రశ్నపై డీకే స్పందించారు. సీఎం ఎవరుతారనే అంశం కాంగ్రెస్ అధిష్టానం పరిధిలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయమే ఫైనల్ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేసులో సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఉన్నారు. ఇదిలా ఉండగా.. అటు బీజేపీలో కూడా సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచి సీఎం రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మతో పాటుగా మాజీ సీఎం యడియూరప్ప కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సీఎం బొమ్మై నివాసంలో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతోంది. ఇది కూడా చదవండి: మోదీ 'మన్ కీ బాత్' వినలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష -
కర్నాటకలో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలకు షాకిచ్చిన బీజేపీ
బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. రేపు(బుధవారం) అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. ఇక, ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జాతీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ప్రచారంలో అధికార బీజేపీపై కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ స్థానిక, జాతీయ పత్రికల్లో ‘అవినీతి రేటు కార్డు’ అంటూ ప్రకటనలు ఇచ్చింది. దీంతో, ఈ విషయాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. దీనికి సంబంధించిన ఆధారాలను చూపించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సిద్ద రామయ్య, డీకే శివ కుమార్‌కు బీజేపీ.. క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేసింది. అయితే, మే 5వ తేదీన పలు దినపత్రికల్లో బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు(40 శాతం కమీషన్ సర్కార్) చేస్తూ కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చింది. అలాగే, బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ప్రజల నుండి రూ. 1,50,000 కోట్లకు పైగా దోచుకుంది అని తెలిపారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ.. ముగ్గురు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ, ప్రకటనలను ఉపసంహరించుకోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా కాంగ్రెస్ నాయకులపై క్రిమినల్ పరువు నష్టం వేసింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ప్రకటనలపై బీజేపీ నేత ఓం పాఠక్.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రకటనలు తమ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఓటర్లను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఫైరయ్యారు. ఈ ప్రకటనలకు సంబంధించి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. BJP files defamation case against Rahul Gandhi, Shivakumar, Siddaramaiah over 'corruption rate card' ads. (@nabilajamal_ )#News #Karnataka #ITVideo pic.twitter.com/k4AF0xS2EQ — IndiaToday (@IndiaToday) May 9, 2023 ఇది కూడా చదవండి: మీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి -
మీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి
కర్ణాటక: రామనగర జిల్లా నుండి మీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి అంటూ డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం రామనగరలో ప్రచారం చేసిన డీకే శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చేయాలనేది తన కల అని, రామనగర ప్రజలు ఎన్నికల్లో గెలిపించిన కెంగల్ హనుమంతయ్య, దేవెగౌడ, రామకృష్ణహెగడె చివరకు కుమారస్వామి అందరూ ముఖ్యమంత్రులయ్యారన్నారు. అలాంటిది మీ ఇంటి బిడ్డ ముఖ్యమంత్రి కాకూడదా అన్నారు. నిఖిల్ కుమారస్వామి ఇంకా యువకుడని, అతడ్ని కావాలంటే వచ్చే రోజుల్లో ఎప్పుడయినా గెలిపించవచ్చన్నారు. -
హెలిప్యాడ్ వద్ద మంటలు.. మరోసారి డీకే శివకుమార్‌కు తప్పిన ప్రమాదం
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్ స్థలంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. హొన్నావర్‌లోని రామకొండతీర్థ కొండ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో శివకుమార్ సురక్షితంగా బయటపడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. కాగా మొన్నటికి మొన్న శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలింది. పైలట్లు అత్యంత చాకచక్యగా వ్యవహరించడంతో శివకుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. వారం రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ చీఫ్‌ను రెండు ప్రమాదాలు వెంటాడంతో పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: శరద్ పవార్ రాజీనామా: తదుపరి ఎన్సీపీ చీఫ్‌గా సూలేనా?.. అజిత్ పవర్? -
karnataka Assembly Elections: హై ఓల్టేజ్ సీట్లలో అమీతుమీ!
సాక్షి, కర్ణాటక ఎలక్షన్ డెస్క్: కర్ణాటక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాలపై అందరి దృష్టి నిలిచింది. సీఎం బసవరాజ బొమ్మై, సీఎల్పీ నేత సిద్దరామయ్య, కేపీసీసీ నేత డీకే శివకుమార్, యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర, కుమారస్వామి, ఆయన కొడుకు నిఖిల్‌గౌడ తదితరుల నియోజకవర్గాల్లో గాలి ఎలా ఉందనేది చర్చనీయాంశమైంది. ప్రముఖులు కావడం, నియోజకవర్గాల్లో అన్ని విధాలా పట్టు ఉన్న మూలంగా వీరి విజయానికి ఢోకా లేకపోవచ్చనేది మెజారిటీ మాట. కానీ సమయం అనుకూలించకపోతే ఎవరికై నా పరాజయం తప్పదని అనేకసార్లు ఎన్నికల ఫలితాలు చాటిచెప్పాయి. శిగ్గావ్లో సీఎం బొమ్మైకు పరీక్ష హావేరి జిల్లా శిగ్గావ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం బసవరాజ్ బొమ్మై పోటీలో ఉన్నారు. బొమ్మై గత మూడు పర్యాయాలు 2008లో 12వేలు, 2013లో 9,600, 2018 ఎన్నికల్లో 9,200 మెజారిటీతో గట్టెక్కడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ బరిలో ఉన్నారు. బొమ్మైకి లింగాయత్ వర్గాల ఓటర్ల బలముంటే, కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటర్లు అండగా ఉన్నారు. ఈసారి పోటీ గట్టిగానే ఉండొచ్చని తెలుస్తోంది. చెన్నపట్టణలో కుమారకు పోటీ రామనగర జిల్లా చెన్నపట్టణ నుంచి జేడీఎస్ తరఫున మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌కు పెట్టని కోటగా చెన్నపట్టణను చెబుతారు. ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న సీపీ యోగేశ్వర్ 1999, 2004, 2011, 2013 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. యోగేశ్వర్ ఒకసారి స్వతంత్ర, మరోసారి కాంగ్రెస్, ఇంకోసారి బీజేపీ, నాల్గోసారి ఎస్పీ నుంచి విజయం సాధించారు. 2018లో జేడీఎస్ తరఫున పోటీ చేసిన కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. మరోసారి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. వరుణలో సిద్దుకు తేలికేనా? మైసూరు జిల్లా వరుణలో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్దరామయ్యకు ఎదురు లేదు. 2008, 2013 భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2018లో తనయుడు యతీంద్రను పోటీ చేసి గెలిపించారు. అయితే పక్క నియోజకవర్గమైన చాముండేశ్వరిలో నిలబడిన సిద్ధరామయ్య ఓడిపోయారు. ఈసారి వరుణ నుంచే బరిలో ఉన్నారు. ఆయనకు మంత్రి వి.సోమణ్ణ పోటీ చేస్తున్నారు. కనకపురలో ఇద్దరు దిగ్గజాలు కనకపురలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఓడిపోయింది లేదు. ఇక్కడ కాంగ్రెస్ – జేడీఎస్ మధ్యనే పోటీ ఉంటోంది. బీజేపీది మూడో స్థానమే. గతంలో జేడీఎస్ నుంచి డీకేశిపై పోటీ చేసి ఓడిన నారాయణగౌడ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ నుంచి సీనియర్ మంత్రి ఆర్.అశోక్ డీకేను ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ ఒకే వర్గానికి చెందినవారు, సమ ఉజ్జీలు కావడంతో ఈసారి ఏం జరుగుతుందా అనేద ఉత్కంఠ నెలకొంది. రామనగరలో తనయుని కోసం.. రామనగర నుంచి మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తనయుడు నిఖిల్‌గౌడ జేడీఎస్ నుంచి బరిలో దిగారు. రామనగరలో 2004 నుంచి నాలుగుసార్లు హెచ్డీ కుమారస్వామి గెలుస్తూ వచ్చారు, గత ఎన్నికల్లో భార్య అనితకు అప్పజెప్పారు. ఉప ఎన్నికల్లో ఆమె కూడా గెలిచారు. ఈసారి తనయుడు పోటీలో ఉన్నాడు. దంపతులిద్దరూ కొడుకు కోసం ప్రచార వ్యూహాల్లో మునిగారు. విజయేంద్రకు ఢోకా లేదా! శివమొగ్గ జిల్లా శికారిపుర నుంచి మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర బీజేపీ టికెట్‌తో పోటీలో ఉన్నారు. శికారిపురలో 1983 నుంచి 2018 వరకు ఒకసారి తప్ప యడియూరప్ప గెలుపొందారు. శికారిపుర అంటే యడియూరప్పే అనే పేరు వచ్చింది. ఈసారి వారసున్ని బరిలోకి దింపారు. గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. -
పీసీసీ చీఫ్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి..
బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెచ్ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో హెలికాప్టర్ అద్దం పగిలింది. శివకుమార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బెంగళూరులోని జక్కూర్ ఎయిర్‌పోర్టు నుంచి కోలార్ జిల్లాలోని ముల్బాగల్ వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపరిపీల్చుకున్నాయి. ఘటన సమయంలో హెలికాప్టర్లో డీకే శివకుమార్‌ను ఓ కన్నడ టీవీ ఛానల్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తున్నారు. పైలటతో కలిపి మొత్తం ముగ్గురు హెలికాప్టర్లో ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతల ో జరగనున్న విషయం తెలిసిందే. 13 న కౌంటింగ్ ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 స్థానాలున్నాయి. మెజార్టీకి 123 సీట్లు అవసరం. ఈ సారి కచ్చితంగా 150 స్థానాలకుపై కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చదవండి: లిక్కర్ స్కాం కేసు: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్! -
Congress Manifesto: అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌పై నిషేధం!
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్నికల వేళ పార్టీ మేనిఫెస్టోలో ఆకర్షనీయంగా పలు పథకాలను, హామీలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్యారెంటీ కార్డు పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. మైనార్టీ వర్గాల మద్య ద్వేషాన్ని ప్రొత్సహించే వ్యక్తులు, సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, బజరంగ్దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలపై నిషేధం విధించడంతోపాటు చట్ట ప్రకారం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. 2006 నుండి సర్వీస్‌లో చేరిన పెన్షన్ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు OPS పొడిగింపును కాంగ్రెస్ పరిశీలిస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను ఒక సంవత్సరంలోగా భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. మేనిఫోస్టో వివరాలు ఇవే.. ► గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ►గృహలక్ష్మి కింద ప్రతి ఇంటికి గృహిణికి నెలకు రూ. వేలు. ► అన్న భాగ్య పథకం కింద ప్రతీ వ్యక్తికి 10కిలోల బియ్యం. ► శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ► యువనిధి నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు(రెండేళ్లపాటు) అందజేత. ► డిప్లొమా చేసిన వారికి రూ.1500. We believe that law and Constitution is sacrosanct and can not be violated by individuals and Organisations like Bajrang Dal, PFI or others promoting enmity or hatred, whether among majority or minority communities. We will take decisive action as per law including imposing a ban… pic.twitter.com/oCHfTmi5zs — ANI (@ANI) May 2, 2023 #KarnatakaElections2023 | Congress in its manifesto announces that its govt will provide 200 units of free electricity. Rs 2,000 every month to each and every woman head of the family. Rs 3,000 per month for two years to unemployed graduates and Rs 1,500 per month to… pic.twitter.com/yW2LLKQlHK — ANI (@ANI) May 2, 2023 ఇది కూడా చదవండి: Karnataka assembly elections 2023: 3 ఉచిత సిలిండర్లు -
ఆ హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి ఒరిగేదేంలేదు.. కేపీసీసీ చీఫ్ సెటైర్లు..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 12 రోజులే గడువున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కన్నడ హీరో కిచ్చ సుదీప్తో బీజేపీ జోరుగా ప్రచారం చేయించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అలాగే మరో సీనియర్ హీరో దర్శన్‌తో కూడా ప్రచారం చేయించేందుకు సిద్ధమైంది. ఇద్దరి హీరోల జనాకర్షణతో మరోసారి అధికారంలోకి వస్తామని భావిస్తోంది. అయితే ఈ ఇద్దరు హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ లేదని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సెటైర్లు వేశారు. వారు బీజేపీలో చేరలేదని, కేవలం ప్రచారం మాత్రమే చేస్తున్నారని గుర్తు చేశారు. వీరిద్దరి వల్ల కమలం పార్టీకి ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉంటుందని తాను భావించడం లేదన్నారు. కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని మరోసారి స్పష్టం చేశారు. కాగా.. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13 కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. తాము మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ చెబుతుండగా.. ఈసారి 150పైగా స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ బలంగా చెబుతోంది. #WATCH | BJP star campaigner, Actor Kichcha Sudeepa holds a roadshow in Hubli-Dharwad Central Assembly constituency, ahead of the upcoming Karnataka elections on 10th May#KarnatakaElections pic.twitter.com/NspKhG3ilo — ANI (@ANI) April 28, 2023 చదవండి: ప్రధాని విషసర్పం.. తాకితే అంతే -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి అమిత్‌షాకు షాక్..
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌తోపాటు ఆ పార్టీ నేతలు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్ బెంగుళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని ఆరోపించారు. మత విద్వేషాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అంతేగాక ప్రతిపక్షాలను కించపరిచేలా మాట్లాడారని విమర్శించారు. ‘ అమిత్ షా పూర్తిగా తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చడానికే ఉద్ధేశ్యపూర్వంగా ఇలాంటి ప్రకటనలు చేశారు. భారీ జనసమూహం, మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షకుల్లో మత కల్లోలాలు సృష్టించాలనే స్పష్టమైన లక్ష్యంతో ఇలా వ్యాఖ్యానించారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక అమిత్ షా మాట్లాడిన వీడియో క్లిప్‌ను కూడా జత చేశారు. చదవండి: టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు ఊరట మరోవైపు కేంద్రమంత్రి అమిత్‌షాపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేసింది. కేంద్రమంత్రి వ్యాఖ్యలు అర్థరహితమని డీకే శివకుమార్ మండిపడ్డారు. హోంమంత్రి అమిత్‌షా ఆ మాటలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరోవైపు అమిత్ షాపై ఈసీకి ఫిర్యాదుపై బీజేపీ స్పందించింది. కేంద్రమంత్రిపై ఈసీకి ఫిర్యాదు కాంగ్రెస్ రాజకీయ జిమ్మిక్కు అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై విమర్శించారు. కాంగ్రెస్ ఆరోపణల్లో పస లేదని అన్నారు. కాగా కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఈనెల 25న విజయపుర, ఇతర ప్రాంతాల్లో అమిత్ షా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే కచ్చితంగా రాష్ట్రంలో గొడవలు జరుగుతాయని అమిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత ఘర్షణలు, లేనిపోని అల్లర్లు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి: ష్.. కిచ్చా సుదీప్ ప్రచారానికి రెస్పాన్స్ ఇది! -
ప్రైవేటు ఛాపర్లో దిగిన శివకుమార్.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన ఈసీ..
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో, అభ్యర్థుల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలోకి దిగారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల నేతలు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా నేతలపై ఎన్నికల సంఘం అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రయాణించిన ఛాపర్లో ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఛాపర్‌లోని ప్రథమ చికిత్స కిట్‌ను, బ్యాగులను ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రచారం కోసం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలికి చేరుకున్న తర్వాత.. హెలిప్యాడ్‌లోనే శివకుమార్ ప్రయాణించిన ఛాపర్‌ను అధికారులు చెక్ చేశారు. ఈ సందర్బంగా ఛాపర్లో శివకుమార్ భార్య, పిల్లలు ఉన్నారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సోదాలు చేయడంలో తప్పులేదని, వాళ్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. మంజునాథ స్వామిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. అందుకే నా కుటుంబంతో ఇక్కడికి వచ్చాను. ఆయన నన్ను, రాష్ట్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పర్యటన తర్వాత ధర్మస్థలంలో ప్రచారం చేస్తాను అని కామెంట్స్ చేశారు. Flying squad of #ECI and officials conducted a check of the #helicopter used by State #Congress president #DKShivakumar after it reached the helipad at #Dharmasthala in Dakshina Kannada. The party's state chief was travelling in the chopper. #BreakingNews pic.twitter.com/lKizduypGt — Headline Karnataka (@hknewsonline) April 22, 2023 -
అసెంబ్లీ ఎన్నికల వేళ.. డీకే శివకుమార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివకుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు సీబీఐ విచారణను రద్దు చేయాలని కోరుతూ శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ నటరాజన్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. శివకుమార్ ఆస్తులు కర్ణాటక వెలుపల ఉన్నందున ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు దర్యాప్తు చేసేందుకు సెప్టెంబర్ 25, 2019న రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చిందని కోర్టు తెలిపింది. అయితే తనను ఏ దర్యాప్తు సంస్థ విచారించాలో ఎన్నుకునే లేదా తెలిసే హక్కు నిందితుడికి(శివకుమార్) లేదని, చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం విచారణకు అనుమతించేటప్పుడు కారణాలను చెప్పాల్సిన అవసరం లేదని సీబీఐ కోర్టులో వాదించింది. చదవండి: Karnataka Election: సమరానికి సై.. నేడు అమిత్ షా.. 29న మోదీ! సీబీఐ కేసు నమోదు కాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై 2017లో శివకుమార్‌కు చెందిన పలు ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాలు నిర్వహించింది. ఐటీ సోదాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తును ప్రారంభించింది. 2019లో డీఎస్ యడియూరప్ప ప్రభుత్వం శివకుమార్‌పై దర్యాప్తునకు అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో 2020 అక్టోబర్‌లో అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధమని, తనపై విచారణను రద్దు చేయాలని కోరుతూ శివకుమార్ 2022 జూలై 28న హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అవసరం అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనను ఇబ్బంది పెట్టేందుకు సీబీఐ ఉద్దేశపూర్వకంగానే మళ్లీ మళ్లీ నోటీసులు పంపుతుందని శివకుమార్ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నేతపై సీబీఐ విచారణకు హైకోర్టు పలుమార్లు స్టేలు విధించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసులో భారీ బినామీ లావాదేవీలు ఉండటం వల్ల అంతరాష్ట్ర విచారణ అవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు శివకుమార్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎదురుదెబ్బ మే 10న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న శివకుమార్‌కు హైకోర్టు తీర్పు ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. కాగా రాబోయే ఎన్నికల్లో రామనగర జిల్లాలోని కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, అతని, తన కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ. 1,414 కోట్లుగా ఉంది. -
Karnataka Assembly Election 2023: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే
కాంగ్రెస్‌లో నిజానికి చాలా రోజుల తర్వాత ఆ పార్టీ ఎన్నికల పోరుకు పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఓ వారం రోజుల ముందే కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. నిత్యం అంతర్గత పోరుతో తలమునకలై ఉండే కాంగ్రెస్ పార్టీకి ఇది శుభ పరిణామం. తొలి జాబితాను ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో ప్రకటించడం కచ్చితంగా ఖర్గే వ్యవహార శైలికి అద్దం పడుతుంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ఉన్న చిరకాల భేదాభిప్రాయాలు ఈ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారడం ఖాయమనుకున్నారు. ఎన్నికల వేళ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ఖర్గే, ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచే వీరిద్దరి సంఘర్షణపై ఓ కన్నేసి ఉంచారు. సరిగ్గా షెడ్యూల్ ప్రకటించే సమయానికి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి ఎటువంటి వివాదలు రాకుండా చూసుకున్నారు. ఈసారి కచ్చితంగా కర్ణాలకలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పూర్తి వ్యూహ రచనతో బరిలోకి దిగుతోంది. Sno Name Of Constituencies Selected Candidates 1 Chikkodi-Sadalga Ganesh Hukkeri 2 Kagawad Bharmgoud Alagowda Kage 3 Kudachi - SC Mahendra K.Thammannavar 4 Hukkeri AB Patil 5 Yemkanmardi - ST Satish Laxmanrao Jarkiholi 6 Belgaum Rural Laxmi Ravindra Hebbalkar 7 Khanapur Dr Anjali Nimbalkar 8 Bailhongal Mahantesh Shivanand Koujalagi 9 Ramdurg Ashok M. Pattan 10 Jamkhandi Anand Siddu Nyamagouda 11 Hungund Vijayanand S. Kashappanavar 12 Muddebihal Appaji Alias CS Nadagowda 13 Basavana Bagevadi Shivanada Patil 14 Babaleswar MB Patil 15 Indi Yashvanth Rayagoud V Patil 16 Jevargi Dr Ajay Dharam Singh 17 Shorapur - ST Rajavenkatappa Naik 18 Shahpur Sharanabasappa Gowda 19 Chitapur - SC Priyank Kharge 20 Sedam Dr Sharanaprakash Patil 21 Chincholi - SC Subash V. Rathod 22 Gulbarga Uttar Kaneez Fatima 23 Aland BR Patil 24 Humnabad Rajashekar B Patil 25 Bidar South Ashok Kheny 26 Bidar Rahim Khan 27 Bhalki Eshwar Khandre 28 Raichur Rural - ST Basanagouda Daddal 29 Maski - ST Basanagouda Thurvihal 30 Kushtagi Amaregouda Patil Bayyapur 31 Kanakagiri - SC Shivaraj Sangappa Thangadagi 32 Yelburga Basavaraj Rayareddi 33 Koppal K. Raghavendra 34 Gadag H.K. Patil 35 Ron G.S Patil 36 Hubli-Dharwad-East - SC Prasad Abbayya 37 Haliyal R.V.Deshapande 38 Karwar Satish Krishna Sail 39 Bhatkal Mankal Subba Vidya 40 Hangal Srinivas V. Mane 41 Haveri - SC Rudrappa Lamani 42 Byadgi Basavaraj N. Shivannanar 43 Hirekerur U.B. Banakar 44 Ranibennur Prakash K. Koliwad 45 Hadagalli - SC P.T. Parameshwara Naik 46 Hagaribommanahalli - SC L.B.P. Bheema Naik 47 Vijayanagara H.R. Gaviyappa 48 Kampli - ST J.N. Ganesh 49 Bellary - ST B. Nagendra 50 Sandur - ST E. Thukaram 51 Challakere - ST T. Raghumurthy 52 Hiriyur D. Sudhakar 53 Hosadurga Govindappa B.G. 54 Davanagere North S.S. Mallikarjun 55 Davanagere South Shamanur Shivashankrappa 56 Mayakonda - SC K.S. Basavaraju Bhadravati 57 Bhadravati Sangameshwara B.K. 58 Sorab S. Madhu Bangarappa 59 Sagar Gopalakrishnna Bulur 60 Byndoor K Gopal Pujari 61 Kundapura M. Dinesh Hegde 62 Kapu Vinaya Kumar Sorake 63 Sringeri T.D. Rajegowda 64 Chikanayakanhalli Kiran Kumar 65 Tiptur K Shadakshari 66 Turuvekere Kanthraj B.M 67 Kunigal Dr H.D. Ranganath 68 Koratagere - SC Dr G. Parameshwara 69 Sira T.B. Jaya Chandra 70 Pavagada - SC H.V. Venkatesh 71 Madhugiri K.N. Rajanna 72 Gauribidanur Shivashankar Reddy N.H 73 Bagepalli S.N. Subba Reddy 74 Chintamani Dr M.C. Sudhakar 75 Srinivaspur K.R. Ramesh Kumar 76 Kolar Gold Field - SC Roopakala M 77 Bangarapet - SC S.N. Narayanaswamy 78 Malur K.Y. Nanje Gowda 79 Byatarayanapura Krishna Byregowda 80 Rajarajeshwarinagar Kusuma H 81 Malleshwaram Anup lyengar 82 Hebbal Suresha B.S 83 Sarvagnanagar K.J. George 84 Shivajinagar Rizwan Arshad 85 Shanti Nagar N.A. Haris 86 Gandhi Nagar Dinesh Gundu Rao 87 Rajaji Nagar Puttanna 88 Govindraj Nagar Priyakrishnna 89 Vijay Nagar M. Krishnamppa 90 Chamrajpet B.Z. Zameer Ahmed Khan 91 Basavanagudi U.B. Venkatesh 92 BTM Layout Ramalinga Reddy 93 Jayanagar Sowmya R 94 Mahadevapura - SC Nagesh T 95 Anekal - SC B. Shivanna 96 Hosakote Sharath Kumar Bachegowda 97 Devanahalli - SC K.H. Muniyappa 98 Doddaballapur T. Venkataramaiah 99 Nelamangala - SC Srinivasaiah N 100 Magadi H.C. Balakrishna 101 Ramanagaram Iqbal Hussain HA 102 Kanakapura D.K. Shivakumar 103 Malavalli - SC P.M. Narendraswamy 104 Shrirangapattana A. B. Ramesh Bandisiddegowda 105 Nagamangala N. Chaluvarayaswamy 106 Holenarasipur Shreyas M. Patel 107 Sakleshpur - SC Murali Mohan 108 Belthangady Rakshith Shivaram 109 Moodabidri Mithun M. Rai 110 Mangalore U.T. Abdul Khader Ali Fareed 111 Bantval Ramanatha Rai B 112 Sullia - SC Krishnappa G 113 Virajpet A.S. Ponnanna 114 Piriyapatna K. Ventakesh 115 Krishnarajanagara D. Ravishankar 116 Hunsur H.P. Manjunath 117 Heggadadevankote - ST Anil Kumar C 118 Nanjanagud - SC Darshan Dhruvyanarayana 119 Narasimharaja Tanveer Salt 120 Varuna Siddaramaiah 121 T. Narasipur - SC H. C. Mahadevappa 122 Hanur R. Narendra 123 Chamarajanagar C. Puttaranga Shetty 124 Gundlupet H.M. Ganesh Parasad 125 Nippani Kakasaheb Patil 126 Gokak Mahantesh Kadadi 127 Kittur Babasaheb D. Patil 128 Saundatti Yellamma Vishwas Vasant Vaidya 129 Mudhol - SC Ramappa Balappa Timmapur 130 Bilgi J.T. Patil 131 Badami Bheemasen B. Chimmannakatti 132 Bagalkot Hullappa Y. Meti 133 Bijapur City Abdul Hameed Kajasaheb Mushrif 134 Nagthan - SC Vitthal Katakadhond 135 Afzalpur M.Y. Patil 136 Yadgir Channareddy Patil Tunnur 137 Gurmitkal Baburao Chinchansur 138 Gulbarga Dakshin Allamaprabhu Patil 139 Basavakalyan Vijay Dharam Singh 140 Gangawati Iqbal Ansari 141 Nargund B.R. Yavagal 142 Dharwad Vinay Kulkarni 143 Kalghatgi Santosh S. Lad 144 Sirsi Bhimanna Naik 145 Yellapur V.S. Patil 146 Kudligi - ST Dr Srinivas NT 147 Molakalmuru - ST N.Y. Gopalakrishna 148 Chitradurga K.C. Veerendra (Pappy) 149 Holalkere - SC Anjaneya H 150 Channagiri Basavaraju V. Shivaganga 151 Tirthahalli Kimmane Rathnakar 152 Udupi Prasadraj Kanchan 153 Kadur Anand K.S 154 Tumkur City Iqbal Ahmed 155 Gubbi S.R. Srinivas 156 Yelahanka Keshava Rajanna B 157 Yeshvanthapura S. Balraj Gowda 158 Mahalakshmi Layout Keshava Murthy 159 Padmanaba Nagar V. Raghunatha Naidu 160 Melukote Darshan Puttannaiah of Sarvodaya Karnataka Party 161 Mandya P. Ravikumar 162 Krishnarajpet B.L. Devraja 163 Belur B. Shivram 164 Madikeri Dr Mantar Gowda 165 Chamunderhwari Siddhegowda 166 Kollegal - SC A.R. Krishna Murthy 167 Raichur Mohammed Shalam 168 Sidlaghatta B V Rajeev Gowda 169 V Raman Nagar - SC S. Anand Kumar 170 Arkalgud H P Sridhar Gowda 171 Mangalore City North Inayath Ali 172 Hubli-Dharwad-Central Jagadish Shettar 173 Chikkamagaluru H D Thammaiah 174 Shiggaon Yasir Ahmed Khan Pathan 175 Lingsugur Durgappa S Hoolageri 176 Hubli-Dharwad-West Deepak Chinchore 177 Shravanabelagola M A Gopalaswamy 178 Athani Laxman Savadi 179 Raybag- SC Mahaveer Mohith 180 Arabhavi Arvind Dalwai 181 Belgaum Uttar Asif Sait 182 Belgaum Dakshin Prabhavathi Mastmardi 183 Terdal Sidappa Ramappa Konnur 184 Devar Hippargi Sharanappa T. Sunagar 185 Sindgi Ashok M. Managuli 186 Gulbarga Rural - SC Revu Naik Belamagi 187 Aurad - SC Dr Shinde Bhimsen Rao 188 Manvi - ST G Hampayya Nayak 189 Devadurga - ST Shreedevi R. Nayak 190 Sindhanur Hampan Gowda Badarli 191 Shirahatti - SC Sujatha N. Doddamani 192 Navalgund N.H. Konareddy 193 Kundgol Kusumavathi C. Shivalli 194 Kumta Nivedit Alva 195 Siruguppa - ST B.M. Nagraj 196 Bellary City Nara Bharath Reddy 197 Jagalur - ST B. Devendrappa 198 Harapanahalli N. Kotresh 199 Honnali D.G. Shanthana Gowda 200 Shimoga Rural - SC Dr Sreenivas Kariyanna 201 Shimoga H.C Yogesh 202 Shikaripura G.B. Malatesh 203 Karkal Uday Shetty 204 Mudigere - SC Nayana Jyothi Jhawar 205 Tarikere G.H. Srinivasa 206 Tumkur Rural G.H. Shanmukhappa Yadav 207 Chikkaballapur Pradeep Eshwar Ayyar 'PE' 208 Kolar Kothur G. Manjunath 209 Dasarahalli Dhanajaya Gangadharaiah 210 Chickpet R.V. Devaraju 211 Bommanahalli Umapathi Srinivas Gowda 212 Bangalore South R.K. Ramesh 213 Channapatna Gangadhar S. 214 Maddur K.M. Uday 215 Arsikere K.M. Shivalinge Gowda 216 Hassan Banavasi Rangaswamy 217 Mangalore City South John Richard Lobo 218 Puttur Ashok Kumar Rai 219 Krishnaraja M.K. Somashekara 220 Chamaraja K. Harish Gowda 221 Harihar Nandagavi Srivinas 222 Mulbagal - SC Dr. B.C Muddugangadhar 223 KR Pura D.K. Mohan 224 Pulakeshnigar - SC A. C. Srinivas Source: INC Twitter -
Karnataka Assembly Polls: డీకే శివకుమార్ ఆస్తులు అన్ని కోట్లా..?
బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.1,139 కోట్లు అని తెలిపారు. అలాగే తనకు రూ.263 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 2018తో పోల్చితే ఈసారి ఆస్తుల విలువ 67 శాతానికిపైగా పెరగడం గమనార్హం. ఇప్పటివరకు అఫిడవిట్ సమర్పించిన కాంగ్రెస్ నేతల్లో డీకే దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. తన వద్ద ఓ కారు, రెండు ఖరీదైన వాచ్‌లు, 2 కేజీల బంగారం, 12 కేజీల వెండి ఉన్నట్లు కన్నడ పీసీసీ చీఫ్ వెల్లడించారు. అలాగే తనపై 19 కేసులు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు. వీటిలో 13 కేసులు గత మూడేళ్లలోనే నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న షాజియా తర్రానుమ్ తన ఆస్తుల విలువ రూ.1,629 కోట్లు అని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈయన తర్వాత రెండో స్థానంలో బీజేపీ నేత ఎంటీబీ నాగరాజ్ ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ.1,607 కోట్లు అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 10న జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో విజయం మాదే అని కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ఉంది. మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. చదవండి: లింగాయత్ పవర్.. కన్నడనాట వారి ఓట్లే కీలకం.. ఒకప్పుడు కాంగ్రెస్ వైపు. -
కర్నాటక: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ సీనియర్ నేత.. ఎన్నికలపై ఎఫెక్ట్?
బెంగళూరు: కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ సీనియర్ నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను టార్గెట్ చేస్తూ వారికే టికెట్స్ ఇస్తున్నాయి. ఇక, బీజేపీ ఇప్పటికే పలువురు సీనియర్లను కాదని కొత్తగా 52 మందిని బరిలోకి దింపింది. 189 మందితో కూడిన తొలి జాబితాలో 52 కొత్త ముఖాలకు చోటు ఇవ్వడం, సిట్టింగ్లతో సహా ఆశావహులకు మొండిచేయి చూపించడంతో తట్టుకోలేకపోతున్నారు. దీంతో, బీజేపీ సీనియర్లు.. ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇదిలా ఉండగా, కర్నాటకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీ.. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా సమక్షంలో సవాదీ.. హస్తం పార్టీలో చేరారు. ఇక, కాంగ్రెస్‌లో చేరిక అనంతరం.. కాంగ్రెస్ అతడిని అథని అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపనున్నట్టు తెలిపింది. దీంతో, ఆయన బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్ సవాదీ అథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సవాదీ.. మాజీ ముఖ్యమంత్రి యాడియూరప్పకు వీరవిధేయుడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహల్లి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. లింగాయత్ నేతల్లో పవర్ఫుల్ లీడర్‌గా లక్ష్మణ్‌కు పేరుంది. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికల పర్వంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. Former BJP leader & former Karnataka Deputy CM Laxman Savadi has joined Congress today, says State Congress president DK Shivakumar, in Bengaluru Laxman Savadi on April 12 resigned as Legislative Council member & from the primary membership of the BJP after losing the Athani… pic.twitter.com/B9feGbSFb9 — ANI (@ANI) April 14, 2023 మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రఘు అచర్.. జేడీఎస్‌లో చేరారు. జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆధర్యంలో ఆయన జేడీఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, కర్నాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. Karnataka | Former MLC and Congress leader Raghu Achar joins JD(S), in the presence of party leader HD Kumaraswamy. pic.twitter.com/rTgVTslJMf — ANI (@ANI) April 14, 2023 -
కన్నడనాట ఎగిరేది కాంగ్రెస్ జెండానే.. సీట్లతో సహా లెక్క చెప్పిన డీకే..
బెంగళూరు: కర్ణాటకలో ఈసారి ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని జోస్యం చెప్పారు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి మెజార్టీకి మించే సీట్లు వస్తాయని, ఎన్ని స్థానాలు కైవసం చేసుకునేది కచ్చితంగా లెక్కగట్టి చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు. మెజార్టికీ 113 సీట్లు అవసరం. అయితే కాంగ్రెస్‌కు ఈసారి 141 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని, అంతకు ఒక్క సీటు కూడా తక్కువ రాదని డీకే బల్లగుద్ది చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో చావో రేవో తెల్చుకుంటారా? అని అడగ్గా.. కచ్చితంగా గెలిచితీరుతామన్నారు. ఓడిపోయే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. అలాగే కర్ణాటకలో హంగ్ వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అసలు ఆ పరిస్థితే రాదన్నారు. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని పేర్కొన్నారు. జేడీఎస్‌తో జట్టు కట్టాల్సిన అవసరం కూడా తమకు ఉండదని వ్యాఖ్యానించారు. ఏ పార్టీతోనూ కలిసేదిలేదంటూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు ఇప్పటివరకు 166 మంది అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. పార్టీలో అందరూ సమష్టిగా నిర్ణయం తీసుకునే వీరి ఎంపిక జరిగిందని డీకే తెలిపారు. తనకు, సీనియర్ నేత సిద్ధరామయ్య మధ్య పార్టీలో వర్గపోరు లేదని చెప్పారు. అలాగే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా మిమ్మల్ని భావించవచ్చా? అని ప్రశ్న అడగ్గా.. సీఎం ఎవరనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని డీకే అన్నారు. ఒకవేళ అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు కదా అని పేర్కొన్నారు. సీఎం కావాలని ప్రతి నాయకుడికి ఉంటుందని తన మనసులో మాట బయటపెట్టారు. కర్ణాటకకు ఒకే విడతలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటిస్తారు. ఇటీవల నిర్వహించి సీఓటర్ సర్వేలో కూడా ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని తేలింది. అయితే సీట్లు 123 వరకు రావచ్చని ఆ సర్వే పేర్కొంది. చదవండి: నాది కాంగ్రెస్ రక్తం.. కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ -
సిద్దరామయ్యపై యడ్డీ కుమారుడు పోటీ?
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు సిద్దరామయ్య మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్న వరుణ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బి.ఎస్. యడియూరప్ప కుమారుడు బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు బి.వై. విజయేంద్ర వరుణ నియోజకవర్గం నుంచి పోటీ పడే అవకాశాలను కొట్టి పారేయలేమని యడియూరప్ప చెప్పడంతో రాజకీయంగా ఈ స్థానంపై ఆసక్తి పెరిగింది. మైసూరు జిల్లాలో ముఖ్య నియోజకవర్గాల్లో ఒకటైన వరుణకి ప్రస్తుతం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వరుణ నుంచి సిద్ధరామయ్య పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. సిద్దరామయ్యపై మీ కుమారుడు విజయేంద్ర పోటీ పడతారా అని గురువారం యడియూరప్పని విలేకరులు ప్రశ్నించగా ‘‘దీనిపై చర్చలైతే సాగుతున్నాయి. వరుణలో నెగ్గడం సిద్దరామయ్యకు అంత సులభం కాదు. మేము మంచి అభ్యర్థినే నిలబెట్టి గట్టి పోటీ ఇస్తాం. చూద్దాం ఏమవుతుందో’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సిద్దరామయ్య స్పందిస్తూ తనపై ఎవరు పోటీకి దిగినా పట్టించుకోనని అన్నారు. యడియూరప్ప పోటీకి దిగినా స్వా గతిస్తామని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ పేర్కొనడం విశేషం. -
భారత్ జోడో యాత్రలో సోనియా, ప్రియాంక
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సాగే భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో కొనసాగుతున్న ఈ యాత్ర ఈనెల 30వ తేదీన ఉదయం 9 గంటలకు కేరళ సరిహద్దులోని గుండ్లుపేట్ వద్ద కర్ణాటకలో ప్రవేశించనుంది. రాష్ట్రంలో జరిగే యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా వేర్వేరుగా పాల్గొంటారని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ శుక్రవారం చెప్పారు. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టే బాధ్యతలను నాయకులకు అప్పగించామని తెలిపారు. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలాలతో కలిసి సమీక్షించామన్నారు. ఇలా ఉండగా, కేరళలోని చలకుడి వద్ద భారత్ జోడో యాత్ర శుక్రవారం విశ్రాంతి కోసం నిలిచిపోయిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చెప్పారు. యాత్రికుల కోసం కేటాయించిన కంటెయినర్లో రాహుల్‌గాంధీ విశ్రాంతి తీసుకున్నారని చెప్పారు. అక్కడే వైద్య శిబిరం నిర్వహించినట్లు వెల్లడించారు. రాహుల్ ఢిల్లీ వెళ్లారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. -
వైరల్: కార్యకర్త చెంప చెల్లుమనిపించిన డీకే శివకుమార్