
సాక్షి, హైదరాబాద్: టీపీ సీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బెంగళూరు వెళ్లారు. శుక్రవారం ఉదయమే ఆకస్మికంగా బయలుదేరిన ఆయన రెండురోజులు అక్కడ ఉంటారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ను కలిసేందుకే వెళ్లినట్టు తెలుస్తోంది. ఓవైపు వైఎస్సార్‌టీపీ విలీనం, మరోవైపు మాజీ మంత్రి తుమ్మలకు పార్టీలోకి ఆహ్వానం, ఆదివారం పీఈసీ సమావేశం, ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ పర్యటన నేపథ్యంలో రేవంత్ బెంగళూరు పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
సంబంధిత వార్త: షర్మిల పార్టీ విలీనం?
తాజా రాజకీయ పరిణామాలు, త్వరలోనే హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణలాంటి అంశాలపై డీకేతో చర్చించేందుకే వెళ్లారని తెలుస్తోంది. అయితే రేవంత్ ప్రైవేటు పనులపై వెళ్లారే తప్ప రాజకీయ అంశాలకు, బెంగళూరు పర్యటనకు సంబంధం లేదనే చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌కు వస్తారని గాంధీభవన్‌వర్గాల ద్వారా తెలిసింది.
చదవండి: మీసం మెలేసిన కొండా.. తొడగొట్టిన ఇనగాల