అసెంబ్లీ ఎన్నికల మందు తెలంగాణ రాజకీయం వేడి పెరిగింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ ప్రచారంపై దృష్టి పెట్టింది. అధికార పార్టీ అసంతృప్తి నేతలకు గాలం వేయడంలో కాంగ్రెస్ బిజీ బిజీగా మారింది. ఇప్పటికే ఆ పార్టీ నేతలను ఒక్కొక్కరిగా హస్తంలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో చేరికల నేపథ్యంలో ఆయన శుక్రవారం రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఈమేరకు డీకే శివకుమార్ ట్విటర్‌లో వీరిద్దరూ కలిసిన ఫోటోను షేర్ చేశారు. ‘టీటీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు కుమార్ కృపా గెస్ట్ హౌజ్‌లో నన్ను కలిశారు. తెలంగాణ రాజకీయ పరిణామాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించాం’ అంటూ పేర్కొన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇంకా ఏయే అంశాలపై చర్చ జరిగిందనేది ఉత్కంఠగా మారింది.
ತೆಲಂಗಾಣ ಪ್ರದೇಶ ಕಾಂಗ್ರೆಸ್ ಸಮಿತಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ @Revanth_Anumula ಅವರು ಇಂದು ನನ್ನನ್ನು ಕುಮಾರ ಕೃಪಾ ಅತಿಥಿಗೃಹದಲ್ಲಿ ಭೇಟಿಯಾಗಿ, ಮುಂಬರಲಿರುವ ತೆಲಂಗಾಣ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಚರ್ಚಿಸಿದರು. pic.twitter.com/pTxV1gyA7o
— DK Shivakumar (@DKShivakumar) September 1, 2023
తాజాగా డీకే, రేవంత్ భేటీపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత నిప్పులు చెరిగారు. రేవంత్, డీకే దిగిన ఫోటోను షేర్ చేస్తూ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం... ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం’ అంటూ ధ్వజమెత్తారు.
చదవండి: ఖమ్మం రాజకీయాల్లో ఊహించని పరిణామం
అప్పుడు ఢిల్లీ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 2, 2023
ఇప్పుడు ఢిల్లీ... కానీ ఇప్పుడు వయా బెంగళూరు
కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం...
ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం... pic.twitter.com/dRJN89lamJ
కాగా వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్లు కొంతగాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీటికి ఆజ్యం పోసేలా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. కాంగ్రెస్‌లో చేరిక, పార్టీ విలీనంపై గతంలో పలు సార్లు డీకే శివకుమార్‌తోనూ ఆమె భేటీ అయ్యారు.
వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనం అంశంలోనూ డీకే శివ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీకేను కలిసేందుకు రేవంత్ బెంగళూరుకు వెళ్లినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించినట్లు సమాచారం. అంతేగాకుండా.. బీఆర్‌ఎస్ తిరుగుబాటు నేత తుమ్మల నాగేశ్వర్ రావు చేరికపైనా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లో తుమ్ముల చేరిక,. షర్మిల పార్టీ విలీనం, వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధివిధానాలపై చర్చించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment