సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరు వేదికగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు మొదలుపెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీ-కాంగ్రెస్‌లో చేరికలకు సంబంధించి డీకేతో రేవంత్ చర్చించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా అక్కడ పార్టీకి మరింత బలం చేకూరుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లోనూ డీకే అంతా తానై చక్రం తిప్పుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యతిరేకులను మళ్లీ పార్టీలోకి రప్పించే యత్నాలు బెంగళూరు కేంద్రంగా సాగుతున్నట్టు తెలుస్తోంది.
కాగా మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణులకు కొత్త జోష్ ఇస్తోంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. కర్ణాటక విజయ మంత్రాన్నే తెలంగాణలో పఠించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీనికి సంబంధించి వ్యూహాలకు పదును పెడుతోంది.
మరోవైపు తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పలు పార్టీల నుంచి వచ్చిన వలస నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌లో చేరిన హస్తం ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రియాంకగాంధీ సమక్షంలో పెద్ద సంఖ్యలో పార్టీలో చేరికలుంటాయని కాంగ్రెస్ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment