రేవంత్‌.. మార్చి ఎనిమిది మీకు డెడ్‌లైన్‌: కవిత హెచ్చరిక | BRS MLC Kavitha Political Counter To Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. మార్చి ఎనిమిది మీకు డెడ్‌లైన్‌: కవిత హెచ్చరిక

Published Mon, Mar 3 2025 12:53 PM | Last Updated on Mon, Mar 3 2025 4:42 PM

BRS MLC Kavitha Political Counter To Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు బీఆర్‌ఎస్‌ ఎ‍మ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తుచేశారు.

మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి 10వేల పోస్టుల కార్డులు సేకరించారు. అనంతరం, పోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్‌కు పంపించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. హమీల అమలుపై మార్చి 8(మహిళా దినోత్సవం)న ప్రకటన చేయకపోతే 10వేల మంది మహిళలు పదివేల గ్రామాల్లోకి వెళ్తారు. లక్షలాది పోస్టు కార్డులు తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తాం.

మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. వరంగల్ ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలి. ఈ విషయంలో మేము కూడా కేంద్రానికి లేఖ రాస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు.. ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్‌కు పోలిక లేదు.

ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం పదుల సంఖ్యలో మహిళలకు తప్ప పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశం లేదు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అప్పుడు ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. 18ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

	తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 10వేల పోస్టు కార్డుల సేకరణ: MLC Kavitha

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement