
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు మరోపేరు కాంగ్రెస్ పార్టీ అని ఘాటు విమర్శలు చేశారు. విపక్ష సభ్యులను కొనుగులు ద్వారా అనేక సందర్భాల్లో ఆ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని మండిపడ్డారు. కాగా రాజస్తాన్‌లో గవర్నర్ వ్యవహర తీరుకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ‘సేవ్ డెమోక్రసి’ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం బెంగళూరు కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. దీనిపై కుమారస్వామి తీవ్ర స్థాయిలో స్పందించారు. (టిప్పు సుల్తాన్ చాప్టర్ తొలగింపు)
ఒకప్పుడు ప్రభుత్వాలను కూల్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించడం హాస్యాస్పంగా ఉందని కుమారస్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలకు పదవుల ద్వారా వలవేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎమ్ కృష్ణ నాయకత్వంలో ఆ పార్టీ చేసిన అరాచకాలు ప్రతిపక్షాలను కోలుకోలేని విధంగా దెబ్బతీశామని విమర్శించారు. కుమారస్వామి వ్యాఖ్యలపై స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను రాజ్యసభకు నామినేట్ చేయడంలో కాంగ్రెస్ చేసిన సాయం గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment