కర్ణాటక: ఎన్నికల సమయంలో ఐదు గ్యారంటీలలో ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు సాధారణ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి పథకం.. శక్తి యోజన ఆదివారం నుంచి అమలు కాబోతోంది. విధానసౌధ ముందు భాగంలో సీఎం సిద్దరామయ్య, ఉప సీఎం డీ.కే.శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జిల్లాల్లో మంత్రులు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో ఆధార్‌కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డైవింగ్ లైసెన్స్ తదితర ఏదో ఒక గుర్తింపు కార్డు చూపాలి. మూడు నెలల్లోగా ఆర్టీసీ.. శక్తి స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది.
లగ్జరీ బస్సుల్లో నో
అంబారీ, అంబారీ డ్రీం క్లాస్, ఐరావత, క్లబ్ క్లాస్, రాజహంస, ఏసీ, లగ్జరీ నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం లేదు. అలాగే ఇతర రాష్ట్రాల ప్రయాణానికి కూడా వీలు లేదు. కండక్టర్‌లు ప్రతి మహిళకు సున్నా ధర టికెట్ ఇవ్వాల్సిందే. టికెట్ ఇవ్వని పక్షంలో కండక్టర్‌పై చర్యలు ఉంటాయి.
గ్యారంటీలపై గందరగోళం లేదు: సీఎం
గృహలక్ష్మీ, గృహజ్యోతితో పాటు 5 గ్యారెంటీ పథకాల జారీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ పథకాలను జారీ చేస్తామన్నారు. శక్తి యోజన ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు.
నేటి నుంచి శక్తియోజన పథకం
Comments
Please login to add a commentAdd a comment