
రాయచూరు రూరల్: ఆర్టీసీ బస్సుల్లో నారీ శక్తి ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సులో సీటు కోసం ఓ మహిళ వినూత్నంగా తన శక్తియుక్తులను ప్రదర్శించిన ఘటన జిల్లాలో జరిగింది. సోమవారం లింగసూగూరు బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలు బస్సు రాగానే సీట్ల కోసం పోటాపోటీగా ఎగబడ్డారు.
బాగల్‌కోటె నుంచి రాయచూకు వెళ్లే బస్సులో మహిళ బ్యాగ్ వేసినా సీటు దొరకదనే ఆందోళనతో మెదడుకు పని పెట్టారు. ఓ యువకున్ని వంగబెట్టి మరో మహిళ సాయంతో అతని వీపు పైకెక్కి కిటికీలో నుంచి బస్సులోకి దూరి సీటును దక్కించుకుంది. ఈ వీడియోలు, ఫోటోలు అందరినీ అబ్బురపరిచాయి.
Comments
Please login to add a commentAdd a comment