
కర్ణాటక: రోడ్డుపై వెళుతున్న ఆర్టీసీ బస్‌కు వెనుక చక్రం ఊడిపోయిన ఘటన గదగ తాలూకా హొంబళ గ్రామంలో జరిగింది. గదగ నుంచి నరగుందకు బయలుదేరిన బస్ జోరుగా వెళ్తుండగా వెనుక వైపున ఒక చక్రం విడిపోయింది.
దీనిని గమనించకుండా డ్రైవర్ కొంతదూరం అలాగే వెళ్లిపోయాడు. ఆ సమయంలో బస్‌లో 50 మంది వరకూ ఉన్నారు. బస్ వెనుక కారులో వస్తున్నవారు టైర్ సంగతిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.