
మైసూరు: ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళలు కొట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించడంతో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మైసూరులోని చాముండి కొండకు వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళల గుంపు సీట్ల కోసం కొట్టుకున్నారు. ఇటీవల కొంత మంది మహిళలు చాముండి కొండకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కారు.
అప్పటికే బస్సు రద్దీగా ఉంది. బస్సులో వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నారని, వారికి సీట్లు ఇవ్వాలని కొందరు మహిళలు కూర్చున్న వారికి విజ్ఞప్తి చేశారు. వారు అంగీకరించకపోవడంతో తిట్టుకుంటూ మహిళలు ఒకరినొకరు జుట్లు పట్టి కొట్టుకున్నారు. కొందరు సెల్‌ఫోన్లలో రికార్డు చేసి ఫైటింగ్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
The fight is not for money, power or family.....it's for BUS SEAT in Karnataka.pic.twitter.com/AH4egdM3g6
— Dr Aishwarya S 🇮🇳 (@Aish17aer) June 20, 2023