
బుర్కా ధరించి కూర్చున్న నింగయ్య
కర్ణాటక: మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ వసతిని తానెందుకు పొందకూడదని అనుకున్నాడో వ్యక్తి. మహిళ మాదిరిగా బుర్కా ధరించి బస్టాండులో కూర్చుని దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. విజయపుర జిల్లా సింధగి తాలూకా గోళగెరి గ్రామ నివాసి వీరభద్ర నింగయ్య మఠపతి అనే వ్యక్తి ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. కుందగోళ తాలూకా సంశి బస్టాండ్‌లో బుర్కా ధరించి బస్సు కోసం వేచి చూడసాగాడు.
అతన్ని చూసి గ్రామస్తులు అనుమానంతో విచారించగా బస్సు చార్జీలకు డబ్బులు లేకపోవడంతో ఒక బుర్కాను చోరీ చేసి ధరించానని తెలిపాడు. ఇది తెలిసి కుందగోళ పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి సబ్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment