free bus
-
50 కోట్లకు చేరిన ఉచిత బస్సు ప్రయాణ మహిళల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య 50 కోట్లకు చేరింది. గృహిణులు సహా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు తదితర రంగాల్లో పని చేసే చిరుద్యోగినులు, ఐటీ కారిడార్లలో పని చేసే హౌస్‌కీపింగ్ సిబ్బంది వంటి వివిధ కేటగిరీలకు చెందిన మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకుంటున్నారు. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆరీ్టసీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీని రెట్టింపు చేశారు. ఉచిత ప్రయాణ సదుపాయం వల్ల మహిళా ప్రయాణికులకు ఇప్పటివరకు రూ.1,152 కోట్లు ఆదా అయింది. అదే సమయంలో ‘జీరో’ టికెట్ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో ఆరీ్టసీకి ఆదాయం పెరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ‘మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో 45 శాతం మహిళలు, 55 శాతం పురుషులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు. ఈ పథకం అమల్లోకి వచి్చనప్పటి నుంచి 70 శాతానికి పైగా మహిళలు, 30 శాతం పురుషులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఆక్యుపెన్సీ అదరహో.. ప్రస్తుతం గ్రేటర్‌లోని 25 డిపోల పరిధిలో సుమారు 2,500 బస్సులు ప్రతి రోజు 7.67 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. రోజుకు 21.50 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 14.70 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. 6.80 లక్షల మంది మాత్రమే మగవారు ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 65 నుంచి 70 శాతం వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా 105 శాతానికి పెరిగింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలే ఎక్కువగా ప్రయాణం చేస్తుండగా మగవారు మెట్రోడీలక్స్, ఏసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. మెట్రో పాస్‌లపై రాకపోకలు సాగించిన విద్యారి్థనులు సైతం ఉచిత పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో 1.30 లక్షల బస్సు పాస్‌ల సంఖ్య 60 వేలకు తగ్గినట్లు అధికారులు చెప్పారు. అలాగే మహిళలు, ఎన్జీఓల పాస్‌లు కూడా సుమారు లక్ష వరకు తగ్గాయి. మెట్రోపై ప్రభావం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో గ్రేటర్లో ఆటోలు, సెవెన్ సీటర్ ఆటోలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. నిర్మాణ రంగానికి చెందిన కూలీలు, చిరుద్యోగులు, శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించేవారు ఆటోలను ఎక్కువగా వినియోగించేవారు. ప్రస్తుతం ఆ ప్రయాణికులంతా ఆర్టీసీ వైపు మళ్లారు. అలాగే మెట్రో ల్లోనూ ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రతిరోజూ 4.8 లక్షల మంది వరకు మెట్రోల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్పి ప్రవేశపెట్టిన తర్వాత కనీసం 10 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించినట్లు మెట్రో అధికారుల అంచనా. మొత్తంగా ఇతర రవాణా సదుపాయాల నుంచి సుమారు 6 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల వైపు మళ్లారు. చిరుద్యోగులకు భరోసా... వస్త్ర దుకాణాలు షాపింగ్‌మాళ్లు, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు, ఐటీ సంస్థలు తదితర ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు ఆర్థికంగా ఈ పథకం భరోసా ఇచ్చింది. ప్రతినెలా సుమారు రూ.3500 వరకు చార్జీల రూపంలో చెల్లించే మహిళలు ఇప్పుడు ఆ డబ్బులను ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ‘ఇంటి కిరాయిలు, కూరగాయల ధరలు, నిత్యావసరవ వస్తువుల ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారం తగ్గడం కొద్దిగా ఊరటే కదా’ అని అశోక్‌నగర్‌కు చెందిన సునీత అనే ప్రయాణికురాలు అభిప్రాయపడ్డారు. -
ఉచిత బస్.. కేటాయింపులు తుస్
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలను తుంగలో తొక్కే చంద్రబాబు తన ట్రాక్ రికార్డ్‌ను మరోసారి కొనసాగిస్తున్నారనే విషయాన్ని టీడీపీ కూటమి సోమవారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ తొలి బడ్జెట్ తేటతెల్లం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ గురించి కనీసం ప్రస్తావించకపోవడం ద్వారా మరోసారి ప్రజలను సర్కారు వంచించింది. ఆ హామీని ఈ ఏడాదికి అటకెక్కించేసినట్టేనని తేల్చిచెప్పింది.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ఆ హామీపై మౌనవ్రతం పాటిస్తున్నారు. వచ్చే మార్చిలోగా అమలు చేస్తారేమో అనుకుంటే.. ప్రస్తుత బడ్జెట్లో ఆ పథకానికి నిధులు కేటాయించలేదు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల అనంతరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉచిత ప్రయాణం పథకం ప్రస్తావనే లేకుండా చేశారు.మహిళలకు ఈ ఏడాది రూ.3,500 కోట్ల నష్టంఉచిత బస్ ప్రయాణం పథకంపై ప్రభుత్వం దాటవేత వైఖరితో రాష్ట్రంలోని మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వారిలో మహిళలు 50 శాతం అంటే 20 లక్షల మంది ఉంటారని అంచనా. కేవలం మహిళల నుంచే టికెట్ల ద్వారా నెలకు రూ.350 కోట్ల రాబడి వస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం ప్రతినెలా ఆర్టీసీకి రూ.350 కోట్లు చొప్పున ఏడాదికి రూ.4,200 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో మహిళలు బస్ ప్రయాణం రూపంలో ప్రతి నెలా రూ.350 కోట్లు నష్టపోతున్నారు. ఆ ప్రకారం ఇప్పటికే రాష్ట్ర మహిళలు రూ.1,750 కోట్లు నష్టపోయారు. ఏడాది మార్చి వరకు ప్రవేశపెట్టిన ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకం ప్రస్తావనే లేదు. అంటే కనీసం మరో 5 నెలలు మరో రూ.1,750 కోట్లు మహిళలు నష్టపోవడం ఖాయమని తేలిపోయింది. వెరసి 2024–24 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర మహిళలు రూ.3,500 కోట్లను రాష్ట్ర మహిళలు నష్టపోయినట్టే. -
ఫ్రీ బస్సుకు మంగళం ? డీకే శివకుమార్ సంచలన కామెంట్స్
-
మహిళల ఉచిత బస్సు పథకం రద్దుపై కర్ణాటక సీఎం క్లారిటీ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే 'శక్తి' పథకాన్ని పునఃసమీక్షించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే.. ఈ పథకంపై చర్చ జరగవచ్చని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యలుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే గురువారం స్వయంగా సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ‘‘ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదు. డీప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ కొంతమంది మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మాత్రమే వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన సమయంలో నేను లేను’అని అన్నారు.ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో.. ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్న మహిళలు తమ ప్రయాణానికి డబ్బు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేస్తూ తనను సంప్రదించారని శివకుమార్ పేర్కొన్నారు. ‘‘ చూద్దాం, మేం దీనిపై కూర్చుని చర్చిస్తాం. మరికొంతమంది మహిళలు.. కొంత చార్జీని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. రవాణా మంత్రి రామలింగారెడ్డి, నేను ఈ అంశంపై పరిశీలన చేస్తాం’అని అన్నారు. కొందరు మహిళలు టికెట్ డబ్బులు చెల్లిస్తామని ట్వీట్లు, మెయిళ్లు పెడుతున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. ఇక.. ఐదు గ్యారంటీల్లో భాగంగా గతేడాది నుంచి కర్ణాటకలో ‘శక్తి’ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. -
ఫ్రీ బస్సు స్కీమ్.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఖమ్మం: తెలంగాణలో ఉచిత బస్సు పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఉచితంగా ప్రయాణించడం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్నారు. ఖమ్మంలో ఆదివారం(అక్టోబర్ 27) జరిగిన ఓ కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ‘మహిళలను వ్యాపారవేత్తలుగా చేయడం ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నాం.కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలను మహిళల కోసమే ప్రారంభించింది. మహిళల కోసం రూ.500కు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆర్థికంగా బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలకు దీపావళి శుభాకాంక్షలు’అని భట్టి తెలిపారు.ఇదీ చదవండి: రేవంత్ పాపం.. ఆయనకు శాపం: కేటీఆర్ -
ఫ్రీ బస్సులో సీట్ల కోసం పెద్ద లొల్లి
-
ఫ్రీ బస్సు.. సీటు కోసం అక్క స్టంట్లు
-
మహిళలపై వ్యాఖ్యలు.. విచారం వ్యక్తం చేసిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫ్రీ బస్సు స్కీమ్‌కు సంబంధించి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం (ఆగస్టు16) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘గురువారం పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’అని కేటీఆర్ ట్వీట్లో క్లారిటీ ఇచ్చారు. కాగా, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఫ్రీ బస్సు స్కీమ్‌పై మాట్లాడారు.నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.— KTR (@KTRBRS) August 16, 2024బస్సుల్లో ఎల్లిపాయల పొట్టు తీసుకోవడం కాకపోతే కుట్లు, అల్లికలు కూడా పెట్టుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టి బబ్రేక్డ్యాన్సులు కూడా వేసుకోండి’ అని కేటీఆర్ అనడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. -
మహాలక్ష్మికే సరి!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని బలోపేతం చేస్తామని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్న మాటలకు, బడ్జెట్లో చూపిన లెక్కలకు పొంతన కుదరటం లేదు. గురువారం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్టీసీకి రూ.4,084.43 కోట్లను ప్రకటించారు. ఈ మొత్తాన్ని మహాలక్ష్మి పథకానికి కేటాయిస్తున్నట్టుగానే చూపారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణ పథకానికి ఊతం ఇవ్వటానికే బడ్జెట్ కేటాయింపులు పరిమితమైనట్టు కనిపిస్తోంది. కేటాయింపుల్లో నేరుగా మహాలక్ష్మి పథకానికి కేటాయింపులుగా రూ.3,082.53 కోట్లను చూపారు. ఇక ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.631.04 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.370.86 కోట్లు చూపారు. వీటిని కూడా మహాలక్ష్మికి కేటాయింపులుగానే పేర్కొన్నారు. దీంతో బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఆ పథకానికే ఖర్చు చేస్తారన్నట్టుగా ఉంది.బకాయిలకు ఏం చేస్తారు?ఆర్టీసీ ప్రస్తుతం భవిష్యనిధి సంస్థకు, ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి దాదాపు రూ.1,800 కోట్ల వరకు బకాయి పడింది. ఆ బకాయిలు చెల్లించటం లేదన్న ఆగ్రహంతో ఇటీవల భవిష్యనిధి సంస్థ ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ హైకోర్టును ఆశ్రయించి ఫ్రీజ్‌పై స్టే పొందింది. ఆ స్టే గడువు తీరితే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం పొంచి ఉంది. బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపైన విషయం తెలిసిందే. దీంతో బస్సులు సరిపోక కొత్తవి కొనాల్సి వస్తోంది.అవసరమైనన్ని కొత్త బస్సులు సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ వీటన్నింటికి చాలినన్ని నిధులు మాత్రం బడ్జెట్లో ప్రతిపాదించకపోవడంతో కార్మిక నేతలు పెదవి విరుస్తున్నారు. రాయితీ పాస్‌లకు సంబంధించి రూ.950 కోట్లు, ఇతరత్రా అవసరాలకు కావాల్సిన వాటితో కలుపుకొని రూ.1,782 కోట్లపై స్పష్టత లేకపోవటం ఆందోళకరమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1,500 కోట్లు ప్రతిపాదించింది. ఆ మొత్తానికి సంబంధించి రూ.వేయి కోట్ల వరకు బకాయిలు ఉండిపోయినట్టు సమాచారం. వాటిని ఎలా సర్దుబాటు చేస్తారని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.రోడ్లు బాగుపడేదెలా?కొన్నేళ్లుగా రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ గాడి తప్పింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరసల రోడ్ల నిర్మాణ ప్రణాళికలో భాగంగా కొన్ని చోట్ల పనులు జరగటంతో కొత్త రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ప్రతి ఏడెనిమిదేళ్లకోసారి చేపట్టాల్సిన రెన్యువల్స్‌ను గాలికొదిలేశారు. ఈ తరుణంలో తాజా బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తారన్న అంచనా ఏర్పడింది. కానీ దానిని తలకిందులు చేస్తూ రోడ్లకు అత్తెసరు నిధులే కేటాయించారు.రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రోడ్ల నిర్వహణకు రూ.888 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.606 కోట్లు కేటాయించారు. ఇవి రోడ్లను బాగు చే యటం, అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి ఎలా సరిపోతాయో ప్రభుత్వానికే తెలియాలని అంటున్నారు. ఇక రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.1,525 కోట్లు కేటాయించారు. ఇవి భూసేకరణ పద్దు కిందకే ఖర్చు కానున్నాయి. -
ఇంకా అధ్యయన దశలోనే ‘ఉచిత బస్సు’
సాక్షి, అమరావతి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం, విధివిధానాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఈ అంశం ఇంకా పరిశీలన దశలోనే ఉందని.. విధివిధానాల రూపకల్పన కోసం అధ్యయనం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విరూపాక్షి, చంద్రశేఖర్, సుధలు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం బుధవారం శాసనసభలో ఈ మేరకు జవాబిచ్చింది. అలాగే పౌరసరఫరాల శాఖకు సంబంధించిన పలు ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ జవాబిచ్చారు. ‘ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీపై విధివిధానాలను రూపొందిస్తున్నాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ప్రధానమంత్రి ఉజ్వల్ పథకం కింద ఉచితంగా ఒక సిలిండర్‌తో ఎల్పీజీ కనెక్షన్ ఇస్తున్నారు. ఈ ప్రయోజనాన్ని 2016–2024 మధ్య 9,65,361 మంది వినియోగించుకున్నారు. ఇక 2023–24 రబీ ధాన్యం సేకరణకు రూ.1,674 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా.. 50 వేల మంది రైతులకు ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. మరో 10 రోజుల్లో రూ.674 కోట్లు చెల్లిస్తాం. పౌరసరఫరాల కార్పొరేషన్ రూ.39,550 కోట్ల అప్పుల్లో ఉంది. అందులో రూ.10 వేల కోట్ల అప్పును వచ్చే మార్చి 31లోగా తీర్చడానికి చర్యలు చేపట్టాం’ అని నాదెండ్ల చెప్పారు. కాగా.. విశాఖపట్నంలో పరిశ్రమలు, కార్గో రవాణా ద్వారా వెలువడే వాయు కాలుష్య ఉద్గారాలను నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ బోర్డు చర్యలు తీసుకుంటోందని ఓ ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ జవాబిచ్చారు. మత్స్యకారులకు ఉరితాడులా జీవో 217రాష్ట్ర మత్స్యకారులకు ఉరితాడులా తయారైన జీవో 217ను వచ్చే కేబినెట్లో రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. 2014–19 మధ్య అమలు చేసిన మత్స్యకారులకు చేప పిల్లలు, వలలు, ఐస్ బాక్స్‌లు, బైక్‌లు, నాలుగు చక్రాల వాహనాల పంపిణీ పథకాలను మళ్లీ పునరుద్ధరిస్తామన్నారు. 2019–24 మధ్య రోడ్లకు అత్యవసర మరమ్మతుల కోసం రూ.1,100 కోట్లు, రోడ్ల పునరుద్ధరణకు రూ.950 కోట్లు ఖర్చు చేశారని మంత్రి జనార్ధన్‌రెడ్డి తెలిపారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు రూ.3,014 కోట్లతో 1,244 కిలోమీటర్ల మేర రోడ్ల బలోపేతం చేసినట్లు చెప్పారు. 2014–19 మధ్య అమలు చేసిన ఇసుక విధానమేగత ప్రభుత్వం జేపీ వెంచర్స్ సంస్థ ద్వారా ఇసుక విక్రయాలు చేసి పెద్ద దోపిడీకి పాల్పడిందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఈ వ్యవహారం మీద విచారణ జరుగుతోందన్నారు. ప్రజలు ఇసుక కోసం ఇబ్బందులు పడకూడదని 2014–19 మధ్య అమలు చేసిన విధానాన్నే మళ్లీ అమల్లోకి తెచ్చామన్నారు. -
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. త్వరలో ‘కేఎస్ఆర్టీసీ’ ఛార్జీల పెంపు!
బెంగళూరు: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను 15నుంచి20 శాతం వరకు పెంచేందుకు కర్ణాటక ఆర్టీసీ(కేఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని కేఎస్ఆర్టీసీ చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ ఆదివారం(జులై 14)చెప్పారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపామన్నారు.ఛార్జీలు పెంచాలా వద్దా అనే విషయంలో సీఎం సిద్ధరామయ్య తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. డీజిల్,నిర్వహణ వ్యయం పెరగడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు. 2019 నుంచి బస్సుల్లో టికెట్ ఛార్జీలను పెంచలేదన్నారు. గడిచిన మూడు నెలల్లో సంస్థకు రూ.295 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘శక్తి’ పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తోంది.ఛార్జీల పెంపుతో కేవలం పురుష ప్రయాణికులపైనే భారం వేస్తామనే వాదన సరికాదన్నారు. మహిళల ఛార్జీలను కూడా ప్రభుత్వం చెల్లిస్తున్నందున పెరిగిన మేరకు డబ్బులను కూడా ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
ఆర్టీసీ ఫ్రీ బస్ స్కీమ్: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నాయని, వాటి వడ్డీల్లో ఏ మాత్రం తగ్గినా ప్రతి ఏటా వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.ఢిల్లీలో శుక్రవారం(జూన్28) నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్‌లో రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదు. కేసీఆర్ చేసిన తప్పులు, మేం చెయ్యం. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని పీసీసీ చీఫ్ ఎవరనేది హై కమాండ్ డిసైడ్ చేయనుంది. పీసీసీ చీఫ్‌గా రెండు ఎన్నికలు పూర్తి చేశా. జులై7తో నేను పీసీసీ పదవి చేపట్టి మూడేళ్లు పూర్తి కానుంది.పీసీసీ, క్యాబినెట్ విస్తరణ నిర్ణయాలు ఒకేసారి ఫైనల్ అవుతాయి. కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఉంటాయి. కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఉండవు. తెలంగాణలో కరెంట్ కోతలు లేవు. రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తాం. కావల్సినంత కరెంటు కొంటున్నాం. మహిళల ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ గట్టున పడింది’అని రేవంత్‌రెడ్డి అన్నారు. -
మెట్రోపై ‘మహాలక్ష్మి’ఎఫెక్ట్!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లపైన ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్ పడింది. ప్రతిరోజు కిక్కిరిసి పరుగులు తీసే మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత మధ్యతరగతి మహిళలు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు కొంతమేరకు సిటీ బస్సుల్లోకి మారారు. దీంతో గతేడాది 5.10 లక్షలు దాటిన మెట్రో ప్రయాణికులు ప్రస్తుతం 4.8 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య నమోదవుతున్నట్లు ఎల్అండ్టీ అధికావర్గాలు పేర్కొన్నాయి. ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా మహాలక్ష్మి పథకం కారణంగా ఈ ఏడాది మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నాయి. నగరంలోని మూడు ప్రధాన కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రతి రోజు 1034 ట్రిప్పులు తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో అందుబాటులో ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో మాత్రం ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండడంతో ఈ రూట్లో ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తరువాత మహిళా ప్రయాణికులు తగ్గారు. ఈ ఏడాదిలో ఆరున్నర లక్షలు దాటవచ్చునని అధికారులు అంచనా వేయగా, అందుకు భిన్నంగా మహాలక్ష్మి కారణంగా సుమారు 5 నుంచి 10 శాతం ప్రయాణికులు తగ్గడం గమనార్హం. గతేడాది రికార్డు స్థాయిలో రద్దీ... గత సంవత్సరం జూలై మొదటి వారంలో రికార్డుస్థాయిలో 5.10 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రహదారులపైన వాహనాల రద్దీ, కాలుష్యం తదితర కారణాల దృష్ట్యా నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేనివిధంగా పూర్తి ఏసీ సదుపాయంతో ప్రయాణాన్ని అందజేయడంతో కూడా ఇందుకు మరో కారణం. నగరవాసులే కాకుండా పర్యాటకులు, వివిధ పనులపైన హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు సైత మెట్రోల్లోనే ఎక్కువగా పయనిస్తున్నారు. గతేడాది లెక్కల ప్రకారం మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్‌లో ప్రతిరోజు 2.60 లక్షల మంది పయనించగా, నాగోల్–రాయదుర్గం కారిడార్‌లో 2.25 లక్షల మంది రాకపోకలు సాగించారు. జూబ్లీస్ బస్‌స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు రోజుకు 25,000 మంది ప్రయాణం చేశారు. కానీ మహాలక్ష్మి పథకం కారణంగా ఈ మూడు కారిడార్లలో కలిపి 30 వేల మందికి పైగా మహిళలు సిటీబస్సుల్లోకి మారినట్లు అంచనా. ప్రత్యేకంగా ఈ రెండు నెలల్లోనే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అని ఎల్అండ్టీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పాటు మరికొన్ని అంశాలు కూడా కారణం కావచ్చునన్నారు. మరోవైపు మెట్రోస్టేషన్లలో రాయదుర్గం, ఎల్బీనగర్, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్ల నుంచి అత్యధిక మంది రాకపోకలు సాగిస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ కూడా... నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు 1.40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని సంస్థలు ఇంకా ‘వర్క్‌ప్రమ్ హోమ్’ను కొనసాగిస్తున్నాయి. దీంతో చాలా మంది ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ కారణంగా మెట్రోల్లో ప్రయాణం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సుమారు మెట్రో ప్రయాణికుల సంఖ్య 6.7 లక్షలకు చేరుకోవచ్చునని అంచనాలు వేయగా వివిధ కారణాల వల్ల అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. -
"మగవారికి మాత్రమే.." బస్సుకు బ్రేకులు
-
Ayodhya: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక జనవరి 22న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అయోధ్యను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎయిర్ లైన్ సంస్థలు కూడా విమాన సర్వీసులను పెంచాయి. అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm) ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రామ జన్మభూమిని దర్శించేవారికి పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 1000 మందికి అయోధ్యకు ఉచితంగా బస్సు టిక్కెట్ లభిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 19న ప్రారంభమైంది. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే.. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం పేటీఎం ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకునే మొదటి 1,000 మంది వినియోగదారులకు మాత్రమే ఉచిత బస్సు టిక్కెట్లు లభిస్తాయి. ఆఫర్‌ను పొందడానికి 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. -
ఎక్కడంటే అక్కడ ఆపాలంటూ!
రాయచూర్ వెళ్లే నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఇమ్లీబన్‌లో బయలుదేరింది.. బస్సు కిక్కిరిసిపోయి ఉంది.. బహదూర్‌పుర రాగానే తాము దిగుతామని, బస్సు ఆపాలంటూ ముగ్గురు మహిళలు డ్రైవర్ వద్దకు వచ్చి నిలబడ్డారు. అలా మరికొంత దూరం వెళ్లాక, మరో ఇద్దరు మహిళలు బస్సు ఆపాలంటూ అడిగారు. వాస్తవానికి ఆ బస్సు ఎక్కడా ఆగకుండా రాయచూరుకు వెళ్లాల్సి ఉండగా, ఇలా మహిళల వాదనలు, డిమాండ్లతో పదిహేను చోట్ల ఆపాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక, ఆర్టీసీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. తాము ఎక్కడ ఆపమంటే బస్సును అక్కడ ఆపాలంటూ ఒత్తిడి చేసు్తన్నారు. ఆ బస్సులకు స్టాప్ లేని చోట్ల, సాధారణ పాయింట్ల వద్ద ఆపాలంటూ డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగుతున్నారు. ఫలితంగా ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆర్డినరీ బస్సుల్లాగా చాలా చోట్ల ఆగుతూ వెళ్లాల్సి వస్తోంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో, ఓ మహిళ నుంచి టికెట్ రుసుము వసూలు చేశారంటూ ఆ మహిళ తాలూకు వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సదరు మహిళ తరపున పురుష వ్యక్తి టికెట్ తీసుకోవటంతో, మహిళ కూడా ఉందన్న విషయం తెలియక కండక్టర్ జీరో టికెట్‌కు బదులు సాధారణ టికెట్ ఇచ్చాడు. ఫిర్యాదు నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి ఆ కండక్టర్‌పై చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఇప్పుడు కొందరు మహిళలు తాము కోరిన చోట బస్సు ఆపకుంటే ఫిర్యాదు చేస్తామని డ్రైవర్, కండక్టర్లను బెదిరిస్తున్నారు. దీంతో బస్సులను వారు ఆపుతున్నారు. మరోవైపు ఇతర ప్రయాణికుల అభ్యంతరం ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపేస్తుండటంతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురై కండక్టర్లు, డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో భరించలేక సిబ్బంది శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన నిర్వహించిన గూగుల్‌మీట్‌లో ఈమేరకు మొర పెట్టుకున్నారు. దీనికి సజ్జనార్ స్పందించారు. ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దు: సజ్జనార్ ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులను నిర్ధారిత స్టాపుల్లో మాత్రమే ఆపాల ని, తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లోనే వెళ్లాలని సజ్జనార్ సూచించారు. స్టాపు లేనిచోట ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దని స్పష్టం చేశారు. -
మహాలక్ష్మీ పథకం.. మహిళలకు ఉచిత ప్రయాణం (ఫొటోలు)
-
తెలంగాణ మహిళలకే ఉచిత బస్సు సౌకర్యం..త్వరలో స్మార్ట్ కార్డులు జారీ
-
మహిళామణులకు ఉచిత ప్రయాణం షురూ..
సాక్షి, మహబూబ్‌నగర్: 'రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల హామీలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమలుకానుంది. వయస్సుతో సంబంధం లేకుండా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా రాష్ట్ర పరిధిలో ఎక్కడికై నా ప్రయాణం చేయవచ్చు.' రీజియన్ పరిధిలో.. మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ 10 డిపోల్లోని 845 బస్సుల్లో ప్రతిరోజు 2.50 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. వీరిలో దాదాపు 75–80 వేల మంది మహిళలు రాకపోకలు సాగిస్తారు. రీజియన్‌లో పల్లె వెలుగు 467, ఎక్స్‌ప్రెస్ 263 బస్సులు ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి బాలికలు, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయంలో మహిళలు స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించాలి. అయితే ఆర్టీసీ బస్సుల్లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం లభించడంతో మధ్య తరగతి ప్రజలకు కొంత ప్రయాణ ఆర్థికభారం తగ్గనుంది. ఆర్థికభారం తగ్గుతుంది.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దీంతో మధ్య తరగతి ప్రజలకు కొంతమేర ఆర్థికభారం తగ్గుతుంది. – త్రివేణి, మహబూబ్‌నగర్ హామీని నిలబెట్టుకున్నాం..! కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే కచ్చితంగా అమలు చేసి తీరుతుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రధానమైనది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమవుతుండడం సంతోషంగా ఉంది. – బెక్కరి అనిత, కాంగ్రెస్ జిల్లా నాయకురాలు, మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహబూబ్‌నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఏఎస్పీ రాములు, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వి.శ్రీదేవి ప్రారంభించనున్నారు. -
ఉచిత ప్రయాణం..! మహిళల ఇష్టారాజ్యం..!!
యశవంతపుర: ఇద్దరు మహిళలు డ్రైవర్, కండక్టర్‌తో గొడవ పడడంతో డ్రైవర్ బస్‌ను నేరుగా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కబ్బూర పట్టణంలో జరిగింది. శనివారం సాయంత్రం చిక్కోడి నుంచి గోకాక్‌కు ఆర్టీసీ బస్ బయలుదేరింది. బస్‌ను ఆరోగ్య కేంద్రం వద్ద నిలపాలని కొందరు మహిళలు డిమాండ్ చేశారు. అక్కడ స్టాప్ లేదని డ్రైవర్ చెప్పాడు. ఎందుకు నిలపవంటూ ఇద్దరు మహిళలు డ్రైవర్, కండక్టర్‌తో గలాటాకు దిగారు. దీంతో డ్రైవర్ కబ్బూరు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు సర్దిచెప్పి పంపించారు. కాగా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి వచ్చాక గొడవలు పెరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి -
ఉచిత ప్రయాణం.. నింగయ్య.. ఇదేమిటయ్యా
కర్ణాటక: మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ వసతిని తానెందుకు పొందకూడదని అనుకున్నాడో వ్యక్తి. మహిళ మాదిరిగా బుర్కా ధరించి బస్టాండులో కూర్చుని దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. విజయపుర జిల్లా సింధగి తాలూకా గోళగెరి గ్రామ నివాసి వీరభద్ర నింగయ్య మఠపతి అనే వ్యక్తి ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. కుందగోళ తాలూకా సంశి బస్టాండ్‌లో బుర్కా ధరించి బస్సు కోసం వేచి చూడసాగాడు. అతన్ని చూసి గ్రామస్తులు అనుమానంతో విచారించగా బస్సు చార్జీలకు డబ్బులు లేకపోవడంతో ఒక బుర్కాను చోరీ చేసి ధరించానని తెలిపాడు. ఇది తెలిసి కుందగోళ పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి సబ్ జైలుకు తరలించారు. -
ఉచిత ప్రయాణం.. టికెట్ తీసుకోనని మొండికేసిన వృద్ధుడు
కర్ణాటక: రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం తెస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ పథకంతో బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి దొడ్డ తాలూకాలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా కొట్టిగేమాచేనహళ్లి గ్రామం నుండి దొడ్డబళ్లాపురంకు వస్తున్న బస్సులో ఎక్కిన వృద్ధుడు నానా హంగామా చేసాడు. వృద్ధులకు కూడా ఉచితం ప్రకటించిందని తాను టికెట్ తీసుకోనని మొండికేసాడు. కండక్టర్, తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా మాట వినలేదు. ఎట్టకేలకు వృద్ధుడు టికెట్ తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. -
ఉచిత ప్రయాణం... సీట్ల కోసం కొట్టుకున్న మహిళలు
మైసూరు: ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళలు కొట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించడంతో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మైసూరులోని చాముండి కొండకు వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళల గుంపు సీట్ల కోసం కొట్టుకున్నారు. ఇటీవల కొంత మంది మహిళలు చాముండి కొండకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కారు. అప్పటికే బస్సు రద్దీగా ఉంది. బస్సులో వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నారని, వారికి సీట్లు ఇవ్వాలని కొందరు మహిళలు కూర్చున్న వారికి విజ్ఞప్తి చేశారు. వారు అంగీకరించకపోవడంతో తిట్టుకుంటూ మహిళలు ఒకరినొకరు జుట్లు పట్టి కొట్టుకున్నారు. కొందరు సెల్ఫోన్లలో రికార్డు చేసి ఫైటింగ్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేశారు. The fight is not for money, power or family.....it's for BUS SEAT in Karnataka.pic.twitter.com/AH4egdM3g6 — Dr Aishwarya S 🇮🇳 (@Aish17aer) June 20, 2023 -
బస్సుల్లో మగవాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు!
బనశంకరి: ఆషాఢ అమావాస్య నేపథ్యంలో రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలకు రద్దీ పెరిగింది. వేలాదిగా భక్తజనం అటు ఇటు ప్రయాణాలు చేస్తున్నారు. ఇక మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావడంతో వారి రద్దీ విపరీతంగా ఉంటోంది. పురుషులకు కూడా సీట్లు దొరకడం లేదు. ఆదివారం మైసూరు చాముండేశ్వరి, ధర్మస్థల, కుక్కే సుబ్రమణ్య, శృంగేరి– హొరనాడు, హాసన్ నిమిషాంబ, సిగందూరు, నందిబెట్ట తదితర పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు పెద్దసంఖ్యలో మహిళలు ప్రయాణించారు. సెలవురోజు కావడంతో మహిళలు తమ భర్త, పిల్లలను సైతం తమ వెంట తీసుకెళ్లారు. బెంగళూరు మెజస్టిక్ కేఎస్ఆర్టీసీ బస్టాండు, మైసూరు రోడ్డు శాటిలైట్ బస్టాండు కిటకిటలాడాయి. మైసూరు, మహదేశ్వర బెట్టకు అధికసంఖ్యలో మహిళలు తరలివెళ్లారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల బస్టాండ్లలో ఇదే రద్దీ కనిపించింది. ఆర్టీసీ సిబ్బందికి సైతం పనిభారం పెరిగింది. -
గైట్కి ఉచిత బస్సు సదుపాయం
రాజానగరం : గైట్ కళాశాలలో శుక్రవారం జరగనున్న ఏపీ పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తమ కళాశాల ద్వారా ఉచిత బస్సు సదుపాయం కల్పించామని గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ బస్‌కాంప్లెక్స్ నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్ చూపించి, బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. గైట్ కేంద్రంలో వెయ్యి మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.